Followers

తిరుగుడుమెట్ట కంటోన్మెంట్ జోన్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు


తిరుగుడుమెట్ట కంటోన్మెంట్ జోన్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు



తాళ్ళపూడి, జూలై 10, పెన్ పవర్:



తాళ్ళపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో హైదరాబాద్ నుండి స్వగృహానికి వచ్చిన వ్యక్తికి కరోన పోసిటివ్ రావడంతో ఆ ఏరియాలో కంటోన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ జోన్లో డాక్టర్ సుష్మా చౌదరి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నప్పుడు వారికి వైద్య పరీక్షలు జరుపుతామని,వారికి కావల్సిన మందులు ఇస్తామని, వైద్యం చేస్తామని తెలిపారు.  ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న ఈ మెడికల్ క్యాంపులో మందులు ఇచ్చి వైద్యం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


శాకంబరీ దేవి గా దర్శనం ఇచ్చిన గద్దె లో అమ్మవారు.


శాకంబరీ దేవి గా దర్శనం ఇచ్చిన గద్దె లో అమ్మవారు.



గోకవరం పెన్ పవర్.


గోకవరం మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ వీరభద్రుని గద్దె వద్ద ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు అమ్మవారు శాకంబరీ దేవి గా దర్శనమిచ్చారు. ఆషాడమాసంలో ప్రతి సంవత్సరం అమ్మవారిని పండిన కూరగాయలు మరియు పళ్ళ రకాలతో పళ్ళతో అమ్మవారిని అలంకరించడం వలన పంటలు బాగా పండి ప్రజల సుఖ సంతోషాలతో ఉంటారనే  భక్తుల ప్రగాఢ నమ్మకం అని అర్చకులు కుమార్ శర్మ అన్నారు. ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యులు గ్రామస్తులు ఇచ్చిన కూరగాయలతో అమ్మవారిని అలంకరించ గా తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. అదేవిధంగా రాజమండ్రి దేవి చౌక్ అలంకారం లో ఉన్నటువంటి స్థానిక దేవిచౌక్ కూడా అర్చకులు జగన్నాథశర్మ మరియు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని రకరకాల కాయగూరలు తోనే డ్రై ఫ్రూట్స్ మరియు పలు రకాల తో అలంకరించ గా కనకదుర్గ అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు అందించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో భక్తులు మాస్కులు ధరించి ఒకరికొకరు దూరంగా అమ్మవారిని దర్శించుకోవడం విశేషం.


ఘనంగాలూయిస్ జాకస్ మండర్ డాగురే 169 వర్ధంతి. 


ఘనంగాలూయిస్ జాకస్ మండర్ డాగురే 169 వర్ధంతి. 


గోకవరం పెన్ పవర్


మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో శుక్రవారం  ఫోటోగ్రపీ పితామహుడు లూయిస్ జాకస్ మండర్ డాగురే  169 వ వర్థంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గోకవరం ఫోటో&వీడియో గ్రాఫర్స్ యూనియన్ వారు  ఆయన ఫోటోకి పూలమాల వేసి ఘనంగానివా ళి అర్పించారు.  అనంతరం గోకవరం మండల గౌరవధ్యక్షలు గంధం బుజ్జి మాట్లాడుతూ  మా ఫోటోగ్రాఫర్స్ అంత బ్రతుకుతున్నాము అంటే డాగురే గారు కారణం అని ఆయన మా ఆరాధ్యదైవం  ఆయనను మరువలేము అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవధ్యక్షురలు బాలు ,బుజ్జి ,గౌరవ సలహాదారులు తోలేటి ప్రసాద్ ,ప్రెసిడెంట్ కొండలరావు, సెక్రెటరీ సతీష్ ,జాయింట్ సెక్రటరీ శాంతిబాబు,స్టూడియో రాజ్,రాంబాబు,సతీష్ మరియు మండల ఫోటోగ్రాఫర్స్ అందరు పాల్గొన్నారు.


లూయిస్ డాగురే కి ఘన నివాళి 


లూయిస్ డాగురే కి ఘన నివాళి 



        పరవాడ పెన్ పవర్



పరవాడ మండలం: ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల  ఆరాధ్యుడు ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ స్వర్గీయ లూయిస్ డాగురేకి పరవాడ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల ప్రతినిధులు స్థానిక పైడిమాంబ ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించారు. ముందుగా లూయిస్ డాగురే చిత్రపటానికి సంఘం నూతన అధ్యక్షులు సిహెచ్. గోపి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లూయిస్ మరణించి 169 సంవత్సరాలు అవుతున్నా నేటికీ ప్రపంచ ఫోటోగ్రాఫర్ల గుండెల్లో సజీవంగా జీవించి ఉన్నారన్నారు. ఫోటోగ్రాఫర్లకు గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అంటే అది లూయిస్ గొప్పతనం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరవాడ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల ప్రతినిధులు గోపి, పి భాష ,శ్రీను ,వెంకీ ,మని, ఇతర సభ్యులు తదితరులు, పాల్గొన్నారు


ఎమ్మెల్యే అదీప్ రాజును కలిసిన ఏపీయూడబ్ల్యూజే పరవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు


ఎమ్మెల్యే అదీప్ రాజును కలిసిన ఏపీయూడబ్ల్యూజే పరవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు



          పరవాడ పెన్ పవర్



పరవాడ మండలం: పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజును ఏపీయూడబ్ల్యూజే పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం ఉదయం పెందుర్తి మండలం రాంపురం లో ఉన్న ఆయన స్వగృహంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రెస్ క్లబ్ సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని  ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఎమ్మెల్యేను కోరారు. విలేకరుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తానని ప్రెస్ క్లబ్ సభ్యులకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు రవి,  ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పైల సన్యాసిరావు, అధ్యక్ష,కార్యదర్శులు చిరికి లోకేష్, విశ్వనాధం, ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసురావు, సహాయ కార్యదర్శి కుండ్రపు సోమునాయుడు, కోశాధికారి సిహెచ్. అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు శ్యామ్, సిహెచ్ గోపి, బొండా గోపీనాథ్, ,జగదీష్, కరణం అప్పారావు( నర్సింగ్),ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బొండా నాని, కార్యదర్శి శివాజీ, ప్రెస్ క్లబ్ సభ్యులు చందు, రమేష్, నాగరాజు, రవి, గొల్లవిల్లి సురేష్, కోరుకొండ శ్రీను, తదితరులు ఎమ్మెల్యే ను కలిసిన వారిలో ఉన్నారు.


ఎదురుకాల్పుల్లో  నలుగురు మావోయిస్టులు హతం


ఎదురుకాల్పుల్లో 
నలుగురు మావోయిస్టులు హతం



ఒడిస్సా ఎన్ కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన ఆంధ్రా పోలీసులు
గాయపడ్డా మావోల కోసం జల్లెడ పడుతున్న పోలీసులు
ప్రతీకార చర్యకు మావోయిస్టుల ఎదురు చూపు.
నివురు కప్పి న నిప్పుల మన్యం
ఏజెన్సీలో ముమ్మరంగా తనిఖీ లు.


చింతపల్లి /విశాఖపట్నం_బ్యూరో (  పెన్ పవర్)



మన్యం నివురు కప్పిన నిప్పుల మారింది. ఏక్షణంలో ఎటువైపు నుంచి తూటా సౌండ్ వినిపిస్తుందో? పోలీస్ మావోయిస్టు ల మద్య ఏ మారణ హోమానికి తెర తీస్తుందో నన్న భయంతో గిరిజనులు హడలి పోతున్నారు. ఏఓబి లో గత వారం రోజులుగా ఉద్రిక్తత నెలకొంది. ఒడిస్సాలోని కంధమాల్ జిల్లా,తమిడి బంధ పోలీస్ స్టేషన్ పరిధి సిర్లా అటవీ ప్రాంతంలో గత వారంలో ఒడిసా పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందిన నేపథ్యంలో ఆంధ్రా పోలీసులు అప్రమత్తమయ్యారు. గత కొంతకాలంగా ఏఓబి సరిహద్దు ప్రాంతాలతో పాటు ఒడిస్సా అటవీ ప్రాంతాలలో మావోల కదలికలు ఉదృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో  ఇటు ఆంధ్రాలో అటు ఒడిస్సాలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒడిస్సా లో జరిగిన  ఎదురుకాల్పుల్లో మావోలు మృతి చెందడమే కాకుండా మరికొంత మంది మావోలు తీవ్ర గాయాలతో తప్పించుకున్నట్టు ఒడిస్సా పోలీసులు  భావిస్తున్నారు. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బతగిలిన నేపథ్యంలో వారు సురక్షిత ప్రాంతమైన  ఏఓబి సరిహద్దు ప్రాంతాలకు తరలి వచ్చే అవకాశం ఉందంటూ పోలీసు నిఘా వర్గాల హెచ్చరికలతో ఏపీ పోలీసులు అప్రమత్త మయ్యారు. దీంతో ఏవోబీ సరిహద్దుల్లో భారీగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఏవోబి పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తమయ్యాయి.  గాలింపు చర్యలు ఉదృతం చేశారు. దీంతో ఏవోబీలో ఉద్రిక్త  వాతావరణం నెలకొంది. ఏవోబీలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని మన్యం వాసులు భీతిల్లుతున్నారు. పోలీసుల చర్యలతో మావోయిస్టులకు ఎటువంటి నష్టం వాటిల్లినా దాని ప్రభావం ఏఓబి సరిహద్దు గిరిజన గ్రామాలపై పడుతుంది. దీంతో   ఏఓబీ లోని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏవోబీ అటవీ ప్రాంతాన్ని పోలీస్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అపరిచితులను, అనుమానితులను ప్రశ్నించి విడిచి పెడుతున్నారు.


లష్కరే ఉగ్రవాది అరెస్ట్.. గ్రేనేడ్లు, బుల్లెట్లు స్వాధీనం..


లష్కరే ఉగ్రవాది అరెస్ట్.. గ్రేనేడ్లు, బుల్లెట్లు స్వాధీనం..


జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. నిత్యం కశ్మీర్‌ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు ఉగ్రవాదులతో పాటు.. సానుభూతిపరులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా బందిపొరా జిల్లాలోని హాజిన్‌ పట్టణం హక్బారా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్‌, 45 బెటాలియన్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన రఫీఖ్ అహ్మద్‌ అనే ఓ ఉగ్రవాది భద్రతా బలగాలపై గ్రేనేడ్‌ విసరబోయాడు. ఇది గమనించిన జవాన్లు.. వెంటనే అప్రమత్తమై.. అతడిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఆ ఉగ్రవాదిని తనిఖీ చేయగా.. అతడి వద్ద రెండు లైవ్ హ్యాండ్‌ గ్రేనేడ్లు, 19 రౌండ్ల బుల్లెట్లు (ఏకే-47కు చెందినవి) గుర్తించారు. ఇతడు ఇటీవలే లష్కరే సంస్థలో చేరినట్లు విచారణలో తేలింది. అయితే అతడికి గ్రేనేడ్లు ఇచ్చి.. సైన్యంపై విసరమని ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్‌ టెర్రరిస్టులు టార్గెట్‌ ఇచ్చారని తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న హజీన్‌ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పట్టుబడ్డ ఉగ్రవాదిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గ్రేనేడ్లు, బుల్లెట్లను సీజ్ చేశారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...