Followers

కీ.శే రాపేటి సన్యాసినాయుడు జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం

 కీ.శే రాపేటి సన్యాసినాయుడు జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం

ఆరిలోవ, పెన్ పవర్

13వ వార్డు దుర్గ నగర్ లో కీర్తిశేషులు రా పెట్టి సన్యాసినాయుడు జ్ఞాపకార్థం నాయుడు పోలీస్ రీమిక్స్ నందు ఉచిత మెడికల్ క్యాంపు  వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత ప్రారంభించారు. డాక్టర్ వి సరోజ. అండార్డిస్ట్ స్పెషలిస్ట్.ఎన్నారై హాస్పిటల్ నుండి వచ్చిన బృందం పర్యవేక్షణలో సంతానం లేని దంపతులకు  కౌన్సెలింగ్ నిర్వహించారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని వారి సమస్యలను డాక్టర్లు లకు తెలియజేశారు. కౌన్సిలింగ్ ద్వారా గుర్తించిన వారికి వైద్య అందిస్తామని డాక్టర్ సరోజ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీఅధ్యక్షులు కెల్లా సత్యనారాయణ. శిరీష. వానపల్లి ఈశ్వర్ రావు. బెతా దుర్గారావు. తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ 113వ జయంతి వేడుకలు

 ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ 113వ జయంతి వేడుకలు

గోకవరం, పెన్ పవర్

మండల కేంద్రమైన గోకవరం లో స్థానిక బాబు జగ్జీవన్ రావ్ కమ్యూనిటీ భవనంలో.డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్  113 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్ గోకవరం మండల అధ్యక్షులు గర భారపు శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ. డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్  అలుపెరుగని పోరాట యోధుడు. అవనిపై ధీరుడు.  దేశ స్వతంత్రం కోసం. సామాజిక సమానత్వం కోసం. అనగారిన వర్గాల వారి హక్కుల కోసం.  అలుపెరగని సమరం సాగించిన విప్లవ యోధుడు. భారత స్వతంత్ర సమరంలో పాలుపంచుకుని.జైలు జీవితాన్ని కూడా అనుభవించి . నవభారత నిర్మాణానికి విశేష కృషి చేసి...మన దేశ అగ్రగణ్య నాయకుల్లో  ఒకరిగా నిలిచిన నాయకులు డా " బాబు జగజ్జీవన్ రావ్  దేశభక్తే శ్వాసగా. దళిత జన ధోరణే లక్ష్యంగా. స్ఫూర్తినిచ్చిన నాయకులు డా" బాబు జగజ్జీవన్ రావ్  ఆయన్ని సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డా" జగజ్జీవన్ రావ్ దైవంగా కొలిచే దళిత నాయకులు శ్రీ వరసాల ప్రసాద్ గోకవరం మండల జడ్పిటిసి వైసిపి అభ్యర్థిని శ్రీ దాసరి శ్రీ రంగ రమేష్   మరియు 1 వార్డు ఎంపీటీసీ వైసిపిఅభ్యర్థిని తోలేటి రమ్య శ్రీ ప్రసాద్ , డా జగజ్జీవన్ రావ్  కు పూలమాల వేసి ఆయనను  ఆదర్శంగా తీసుకొని.  ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. బివి చంద్రం, బి ఆనంద్, టి రాంప్రసాద్, బి రాము. జి భజినీ, బి నాగరాజు. టి. చందర్రావు, సి హెచ్ సూరిబాబు, పి శ్యామల్రావు, కె. శ్రీను, బి బాపిరాజు, పి దొరబాబు, సి హెచ్.శ్రీను, బి కిరణ్, జి రాంబాబు,వి.శ్రీను పి విక్రం, బి మధు, ఐ.కిరణ్.  వైశ్రీన  ఎమ్.చిన్న బాబు. తదితర నాయకులు పాల్గొన్నారు.

దళిత అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి

 దళిత అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి - పన్నాల

తార్నాక ,  పెన్ పవర్  

డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ 113 వ జయంతి సందర్బంగా మల్లాపూర్ అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి అతిధులు గా  స్థానిక  కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి , హోసింగ్ బోర్డు కార్పొరేటర్ ప్రభుదాస్ లు పాల్గొని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ వారు అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని తెలిపారు.దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేసారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరుంధతి సంక్షేమ సంఘం ప్రతినిధులు మల్లేష్ , ప్రకాష్ , శ్రీను , రాజు , యేసు , ఈశ్వర్ , రవి , నర్సింహా , వెంకటేష్ , స్థానిక నాయకులు కటార్ల భాస్కర్ , సురణం రాజేశ్వర్ , నరేందర్ , విజయ్ పాల్గొన్నారు

జీడిమెట్లలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

 జీడిమెట్లలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. 


జీడిమెట్ల, పెన్ పవర్ 

దేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతి వేడుకలను జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం, హరిజన బస్తీలో మాదిగ చైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కె.పి.విశాల్ గౌడ్ విచ్చేసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు.. మహనీయుల ఆశయ సాదనకు తామంతా నిలవాలని,ఆయన అడుగు జాడలో నడవాలని విశాల్ తెలియ చేశారు..ఈ కార్యక్రమంలో యం.సి.డబ్ల్యూ.ఏ అధ్యక్షులు గుడ్డి బలరాం, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి శ్రీనివాస్, సాయిలు, పులి బలరాం, నవీన్ కుమార్, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

చింతూరు, పెన్ పవర్

చింతూరులోని అంబేద్కర్ సెంటర్ నందు బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతిని అనుసూచిత్ జాతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ చదలవాడ కృపాకుమార్ మరియు చింతూరు మండల బీజేపీ  అధ్యక్షులు డి. వి. ఎస్ రమణా రెడ్డి ముందుగా జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల,పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అలాగే ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఇప్పటి తరం ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పూస శ్రీను, కన్నయ్య, సీతయ్య, రాంబాబు, గాంధీ, రాములుతదితరులు పాల్గొన్నారు.

ఎంపీటీసి, జడ్పీటీసీ ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలు సిద్దం

 ఎంపీటీసి, జడ్పీటీసీ ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలు  సిద్దం 

 పెన్ పవర్, ఆత్రేయపురం

ఈ నెల  8వ తేదీ జరిగే ఎంపీటీసి, జడ్పీటీసీ ఎన్నికలలో ఆత్రేయపురం మండలం లో ఉన్న 52,881 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని  మండల ఎన్నికల అధికారి కె.బుల్లిరాజు తెలిపారు. 

ఎంపీటీసి, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల పరిశీలనను సహాయ ఎన్నికల అధికారులు తాహశిల్దార్ ఎం రామకృష్ణ, ఎంపీడీఒ నాతి బుజ్జి పర్యవేక్షించారు.ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్స్ లు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రి అంతా సిద్దం చేసుకుని, సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసి, అధికార యంత్రాంగం సిద్ధం గా ఉన్నట్లు వారు తెలిపారు

ప్రగతి నగర్ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

 ప్రగతి నగర్ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. 

కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

మాన్యశ్రీ స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ప్రగతి నగర్ బిజెపి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.. మహనీయున్ని స్మరించుకోవడం మన బాధ్యత అని బాజాపా శ్రేణులు అన్నారు., స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లడమే గాక,  కేంద్రలో వివిధ శాఖలకు మంత్రిగా, నూతన వ్యవసాయ చట్టాలతో ఆహారం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ,బంగ్లాదేశ్ తో యుద్ధం భారతదేశాన్ని విజయం సాధించడంతో మంత్రిగా తన చతురతను చూపించిన నాయకుడు, దళితులు విద్య ద్వారా ఉన్నత స్థాయికి  చేరుకునే విధంగా ప్రయత్నించాలని, ఆర్థిక స్వావలంబన సాధించిన నాడు నిజమైన దళిత ప్రజలకి న్యాయం జరుగుతుందని, ఆ దిశగా ప్రయత్నించిన మహా నాయకులు నవజీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  నిజాం పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్, రాష్ట్ర మైనార్టీ మోర్చా మహిళా ప్రముఖ మల్లేశ్వరి, బీజేవైఎం  జిల్లా మహిళా ఇన్చార్జ్ శాంభవి, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ ,శివ కోటేశ్వరరావు చౌదరి, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...