Followers

శత కోటి వైరస్ లకు అనంత కోటి ఉపాయాలు


మోతుగూడెం, పెన్ పవర్:


వైరస్ అనగానే మనం మాస్కుల కోసం మెడికల్ షాప్ కు పరుగులు పెడతాం. కానీ ప్రకృతి ఒడిలో జీవనం సాగించే అడవి బిడ్డలకు అవేవీ అందుబాటులో ఉండవు. మరి కరోనా వంటి వైరస్ల బారిన పడకుండా ఉండాలనే ఆ అడవి బిడ్డల పరిస్థితేందని ఆలోచిస్తే.. శతకోటి వైరస్లకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు.. ఆ ప్రకృతి వారికి దిక్కయింది. సహజసిద్ధమైన మాస్కులకు మార్గం చూపింది,ఏజెన్సీ ప్రాంతంలో  మన అంధ్ర ప్రాంతంతోపాటు సరిహద్దులోని ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అడవి బిడ్డలు మాస్కులు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు. ఆకులు సేకరించి ఫేస్ మాస్కులుగా తయారుచేసి ధరించారు,నేలకోట, వెములరాయి మరియు ఒరిస్సా రాష్ట్రంలోని అదర్ పోల్లురు  అటవీ ప్రాంతాల్లో  ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి,పట్టణ ప్రాంతాల్లో కొందరు మాస్కులు లభించడం లేదని నిర్లక్ష్యంగా తిరుగుతుంటే.. ఈ అడవి బిడ్డలు మనసుతో ఆలోచించి మార్గాన్ని వెతుక్కున్నారు. 


ముఖ్యమంత్రి సహాయనిధికి 5 లక్షలు వితరణ : ఎన్టీపీసి సిజిఎం సుదర్శన్ బాబు


ముఖ్యమంత్రి కరోనా వైరస్ నివారణ సహాయనిధికి 5 లక్షలు వితరణ చేసిన ఎన్టీపీసి సిజిఎం సుదర్శన్ బాబు


           పరవాడ, పెన్ పవర్

 

పరవాడ:మండలంలో కల సింహాద్రి థర్మల్ విద్యుత్ కేద్రం(ఎన్టీపీసి)సిజిఎం వి సుదర్శన్ బాబు ముఖ్యమంత్రి కరోనా వైరస్ నివారణ సహాయ నిధికి వ్యక్తి గతంగా 5 లక్షల రూపాయల ను వితరణగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో రాష్టం లో కరోనా వైరస్ ని సమూలంగా నివారించడానికి ప్రజలంతా వ్యక్తి గత బాధ్యతగా కృషిచేయాలి అని పిలుపునిచ్చారు.ప్రజలు ఇప్పటికి కూడా కరోనా వల్ల కలిగే నష్టం గురించి ఆలోచించి కుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవరింస్తున్నారు అని ఆవేద వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు ప్రజలను కట్టడి చేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకు విధంగా ప్రజలు వ్యవహరించి కూడదు అని హితవు చెప్పారు.ప్రభుత్వాలు,డాక్టర్లు,పోలీసులు ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు అని వారికి ప్రజలు 20 రోజులపాటు ఇంటి బయటకు అడుగుపెట్టకుండా సంహరించి కరోనా వైరస్ సంపూర్ణ నివారణకు సహకరించాలి అని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువులు నెలరోజులు సరిపడా నిల్వ చేసుకుని స్వీయ నిర్బంధం లోకి అందరూ వెళితే మరలా అందరూ సంతోషంగా ఎవరి పనులకు వాళ్లు వెళ్లే రోజు దగ్గరలో నే ఉంటుంది అని అన్నారు.అలా చేయకుండా ప్రజలు ఎవరికి తోచినట్లు వాళ్లు వ్యవహరించి బయట తిరిగితే ఇంకో అరునేలల తరువాత కూడా ఇంతకన్నా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది అని హెచ్చరించ్చారు.బయట తిరిగే వారు వారి ఆరోగ్యం తో వారి కుటుంబ సభ్యుల మరియు చుట్టు ప్రక్కల ఉన్న వారి ఆరోగ్యం వారి ప్రాణాలతో చలగాటం ఆడిన వారు అవుతారు అని హెచ్చరించారు.ప్రజలంతా కరోనా వైరస్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహ పెంచుకోవాలి అని కోరారు.దయచేసి ఎవ్వరూ ఇంటిని వదిలి బయటికి రావద్దు అని మనవి చేశారు.5లక్షల రూపాయల చెక్కును ఎన్టీపీసి సీఎస్ఆర్ డిఫ్యూటి మేనేజర్ ప్రకాశ రావు తో జిల్లా కలెక్టర్ కార్యాలయం కు పంపించారు

మా స్వగ్రామాలకు చేర్చండి అంటూ. నేతలకు  వలస  కూలీలు  మొర


తమను స్వగ్రామాలకు చేర్చండి అంటూ. నేతలకు          వలస  కూలీలు  మొర



     చెన్నైలో   చిక్కుకొన్న  రెండు వందల మంది  కూలీలు



స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్)


పొట్ట  చేతపట్టుకొని  వలస  వచ్చాం  కరోనా మహమ్మారి  వ్యాపించడంతో  పనులు నిలిచిపోయాయి   రవాణా స్తంభించిపోయింది  ఏమి చేయాలో  పాలుపోవడం లేదని  వలస కూలీలు చెన్నైలో  ఆందోళన  చెందుతున్నారు. ఏదోలా  తమని  స్వగ్రామాలకు  చేర్చాలని   ప్రజా ప్రతినిధులను  కోరుతున్నారు. జిల్లాలోని  గ్రామీణ ప్రాంతాలకు చెందిన  కూలీలు  చెన్నై  భవన నిర్మాణ పనులకు  వలసలు  పోవడం  సర్వ సాధారణం. ఇందులో భాగంగా చోడవరం చీడికాడ  మాడుగుల  రావికమతం  మండలాలకు  చెందిన  కూలీలు  కుటుంబాలతో సహా  చెన్నైలోని ఆయినపాకం  వేస్ట్ మొగపెర్  ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వివిధ నిర్మాణాల్లో  పనులు చేస్తూ  జీవిస్తున్నరు.ఇంతలో  కరోనా వైరస్ మహమ్మారి  వ్యాపించడంతో  భయాందోళనలు  చోటు చేసు కున్నాయి. కేంద్రం లాక్ డౌన్  ప్రకటించడంతో   నిర్మాణ పనులు నిలిచిపోయాయి.  మరోపక్క  కరోనా వైరస్  కారణంగా  కర్ఫ్యూ  అమలు చేస్తున్నారు. పనులు లేక  ఉండలేక  తీవ్ర  ఇబ్బందులకు  గురవుతున్నామని  తమను  ఆదుకోవాలని  వలస కూలీలు   ఆయా గ్రామాల  ప్రజా ప్రతినిధులను  అభ్యర్థిస్తున్నారు. సుమారు 200 కుటుంబాలు  చెన్నైలో చిక్కుకుపోయారు. స్వగ్రామాలకు చేరు కొందామంటే  రవాణా సౌకర్యం  బందు అయింది.  కూలి పనులు దొరక్క  కర్ఫ్యూ లో    రోడ్లపైకి రాలేక పస్తులు  ఉంటున్నామని   వలస కూలీలు  వాపోతున్నారు. తమ పరిస్థితి  అర్థం చేసుకుని  ఏదోలా  తమని  స్వగ్రామాలకు  చేర్చి   పుణ్యం  కొట్టుకోవాలని  స్థానిక  నేతలకు  మొర పెట్టుకుంటున్నారు. ఆయా నియోజకవర్గ  ఎమ్మెల్యేల  సహకారంతో  తమను  ఇళ్లకు చేర్చాలని  వలస కూలీలు   గ్రామాలకు   ఫోను సందేశం  పంపారు.


పట్టుబడిన అంతర్ రాష్ట్ర గజ దొంగలు

పట్టుబడిన అంతర్ రాష్ట్ర గజ దొంగలు

 



పెన్ పవర్, జమ్మలమడుగు

 

 స్థానిక జమ్మలమడుగు డిఎస్పీ ఆఫిసు లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు..ఈ సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నం 12.30నిముషాల సమయంలో ప్రొద్దుటూరు మరియు తాడిపత్రి జాతీయ రహదారిలో జమ్మలమడుగు బై పాస్ రోడ్డు వద్ద ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో 7 మంది యువకులు మూడు మోటార్ సైకిళ్ల మీద రావడంతో అనుమానం తో  వారిని పట్టుకుని విచారించిగా వారిపై కడప, కర్నూలు జిల్లాలో ఉన్న ప్రధాన పోలీసు స్టేషన్ లు అయిన జమ్మలమడుగు అర్భన్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు, ముద్దనూర్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, కలమల్ల పోలీస్ స్టేషన్లో 1  కేసు, ప్రొద్దుటూరు 1 మరియు 3 టౌన్ పరిధిలో ఒక్కోక్క కేసు, మైదుకూరు, బి మఠం లో 2 కేసులు, ఖాజిపేట లో 1 కేసు,రాజుపాలెం లో 2 కేసులు, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ లో 1 కేసు ,చాగలమర్రి లో 3 ఇలా  సుమారు 24 కేసులలో వీళ్ళు చోరీలు చేసినందుకు కేసులు నమోదయ్యాయి అని ఒప్పుకున్నారు అని చెప్పారు, వీరు ప్రధానంగా ఒంటరిగా ఉన్న ఇల్లు, మహిళల పై దాడి చేసి ఛోరిలు చేసేవారు అని ,వీరి వద్ద నుండి 173 గ్రాముల బంగారు ఆభరణాలు(విలువ సుమారు 7,10,000) నగదు 48,500 రూపాయలు ,మూడు మోటార్ సైకిల్ వాహనాలను,8 సెల్ ఫోన్ లను పంచనామా ద్వారా స్వాధీనం చేసుకుని సాయంత్రం 4.30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పారు, ఈ ముఠా ను పట్టుకోవడం లో కీలకపాత్ర పోషించిన జమ్మలమడుగు సిఐ మధుసూదన రావు గారు, ఎస్సైలు రంగారావు, రవి కుమార్ మరియు ట్రైనింగ్ డిఎస్పీ శ్రీపాద రావు సిబ్బంది గురుశేఖర్ ,రామాంజనేయులు, మధుసూదన్ రెడ్డి,ఈ అరెస్ట్, విచారణ అంతా జమ్మలమడుగు డిఎస్పీ నాగరాజు గారి ఆధ్వర్యంలో జరిగింది,పట్టుకున్న ముద్దాయిలను రిమాండ్ రిపోర్టు తో కోర్టు కు పంపడమైంది.ఈ ముఠా ను పట్టుకున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి రివార్డులు అందజేస్తామని డిఎస్పీ గారు తెలిపారు..



ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన


ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన  "పేరుతో రూ.1.70 లక్షల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ – బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు


గుంటూరు, పెన్ పవర్


ప్రపంచ దేశాల ఆర్ధిక పరిస్థితులు కరోనా దెబ్బకి తలకిందులైన స్థితిలో భారత్ పై ఆ ప్రభావం తగ్గించడానికి, ప్రధాని శ్రీ నరేంద్రమోడీ, కేంద్రం ప్రభుత్వం అతిపెద్ద ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిందని, కరోనా కల్లోలంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు కేంద్రం ఆపన్న హస్తం అందించిందని, "గరీబ్ కల్యాణ్ "పేరుతో రూ.1.70 లక్షల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిందని బీజెపీ  జిల్లా కార్యదర్శి వై.విసుబ్బారావు తెలియజేశారు.


కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సందర్భముగా  


పేదలు రోజువారీ కూలీల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని వై.విసుబ్బారావు తెలిపారు . లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందనీ, పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్ర్రి నిర్మలా సీతరామన్  ప్రకటించారని తెలిపారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్యం సిబ్బందికి రూ.50 లక్షల మేర హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నట్టు పేర్కొన్నారు. 3 నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్‌ ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన్‌ ద్వారా మరో 5 కేజీల బియ్యం లేదా గోధుమలు ఇప్పటికే ఇస్తున్న 5 కేజీలకు అదనం వీటితో పాటు కేజీ పప్పు సరఫరా చేస్తారని, పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ. పీఎం కిసాన్‌ కింద ఇప్పటికే రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్న కేంద్రం ఇప్పుడు మొదటి విడతగా రూ.2 వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నదని, ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం రూ.202 కు పెంచారని, వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రెండు విడతలుగా రూ.వెయ్యి జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు అందజేస్తారని, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు, డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారని, ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుందని, 90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తిస్తుందని, తమ పీఎఫ్‌ డబ్బు నుంచి 75శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం కేంద్రం ప్రభుత్వం కల్పించినదని, భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.31వేల కోట్లు కేటాయించారని, రాష్ట్రాలకు కేటాయించిన మినరల్‌ ఫండ్‌ను కరోనా వైద్య పరీక్షల కోసం వాడుకోవచ్చునని బీజెపీ  జిల్లా కార్యదర్శి వై.విసుబ్బారావు తెలియజేశారు.


పేదలకు, యాచకులకు ఆహారాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నా అభిమానులు....


పేదలకు, యాచకులకు ఆహారాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నా అభిమానులు....


గిద్దలూరు, పెన్ పవర్


 లాక్ డౌన్ దృష్ట్యా గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని పేదలు, యాచకులు ఆహారం దొరక్క రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్న వారికి  ఎమ్మెల్యే అన్నా అభిమానులు ఆహారాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా కార్యాలయ ఇంఛార్జి షైక్. మస్తాన్ వలి, అన్నా అభిమానులు పరుచూరి.నాగేశ్వరరావు దమ్మాల.జనార్దన్, షేక్.గఫుర్, కావేటి.ఈశ్వర్ నాయుడు, ఏ.శ్రీకాంత్ రెడ్డి, సి.హెచ్.శ్రీకాంత్ రెడ్డి, ముద్దర్ల.చిన్న, గుడిసె.మబు పలువురు పాల్గొన్నారు...


పేదల ఆకలి తీర్చడం అభినందనీయం:  ఎస్.ఐ రవీంద్రారెడ్డి


పేదల ఆకలి తీర్చడం అభినందనీయం:  ఎస్.ఐ రవీంద్రారెడ్డి


బేస్తవారిపేట , పెన్ పవర్
                       ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చడం అభినందనీయమని, అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని బేస్తవారిపేట SI ఎస్.వి. రవీంద్రారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలోని స్థానిక గ్రామ సచివాలయం ఎదుట బేస్తవారిపేట-2 ఎంపీటీసీ గుంటి స్వప్న, ఆమె తమ్ముడు వినోద్ ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లు మరియు వాటర్ ప్యాకెట్లు వాటర్ ప్లాంట్ శ్రీను అందించగా గుంటి చిరంజీవి, వినోద్ శుక్రవారం బేస్తవారిపేట పారిశుద్ధ్య కార్మికులకు పులిహోర ప్యాకెట్లు మరియు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బేస్తవారిపేట SI రవీంద్రారెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆకలి తీర్చడం అభినందనీయం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో పట్టణంలో టీ దుకాణం మొదలుకొని పెద్ద పెద్ద హోటళ్ల వరకు అన్నింటిని మూసేయడం జరిగింది. దీంతో తినేందుకు తిండి లేక అనాధలు, యాచకులు, వృద్దులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలితో ఉన్న వారికి భోజనం అందించడం చాలా గొప్ప విషయం, మంచి కార్యక్రమం అని దాతలను కొనియాడారు. ఈ సందర్బంగా గుంటి చిరంజీవి మాట్లాడుతూ.. కొరోనా వైరస్ కట్టడి చేసేందుకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది పేదలు, యాచకులు తినేందుకు తిండి లేక బాధపడుతున్నారని వారిని దృష్టిలో పెట్టుకొని భోజనం అందిస్తున్నామన్నారు. ఈనెల 22వ తేదీ కర్ఫ్యూ రోజు నుండి బేస్తవారిపేట, కంభం పట్టణాల్లో ఇలా భోజనం అందిస్తున్నామని, అలాగే లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు పేదలకు, యచకులకు భోజనం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటి.చిరంజీవి, వినోద్, ముప్పూరి శ్రీను, కంచి.సురేష్, వాటర్ ప్లాంట్ శ్రీను మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...