Followers

విశాఖలో కరోనా మహమ్మారి దోబూచులు


 


విశాఖలో కరోనా మహమ్మారి దోబూచులు

 

వృద్ధుడు మృతితో వైద్యుల హైరానా

 

   స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)

 

 నగరంలోని దక్షిణ నియోజకవర్గం, వన్ టౌన్ ఏరియా, ఏవిఎన్ కాలేజ్ దగ్గరలో,చంగల్రావుపేటలో తొలి కరోనా వ్యాధి వలన  మరణం సంభవించింది. 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో గురువారం కేజీహెచ్లో కిడ్నీ సమస్య తో చేరాడు. అతనిని తాత్కాలిక ఐసోలేషన్ వార్డులో ఉంచారు. రాత్రికి రాత్రి కరోనా పరీక్షలు జరిపించారు. రిపోర్టు కోసం ఎదురు చూస్తూ ఉండగానే శుక్రవారం తెల్లవారి మృతిచెందాడు. అనారోగ్యంతోనే చనిపోయాడు గనుక మృతుని బంధువులు మృతదేహాన్ని చెంగల్ రావు పేట లోని తన ఇంటికి తీసుకు వెళ్లి పోయారు. ఇంటికి తీసుకు పోయిన తర్వాత కరోనా రిపోర్ట్ వచ్చింది. దీంట్లో పాజిటివ్ ఉండడంతో కేజీహెచ్ సిబ్బంది పరుగులు తీశారు. అయితే కెసీట్లు పొందుపరిచిన టెలిఫోన్ నెంబర్ మాత్రం పని చేయడం లేదు.వెంటనే జివిఎంసి చీఫ్ మెడికల్ అధికారికి పోలీసులకు సమాచారం అందించారు. విశాఖలో తొలి కరోనా మరణం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వృద్ధుల చికిత్స పొందిన కేజీహెచ్ తాత్కాలిక ఐసోలేషన్ వార్డులో పనిచేస్తున్న వైద్యులందరికీ కరుణ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేసినట్టు పర్యవేక్షణాధికారి డాక్టర్ అర్జున్ సూపర్డెంట్ మాట్లాడుతూ తెలియజేశారు. ఈ వార్డులో వైద్యులతో సహా సుమారు 40 మంది సిబ్బంది ఉన్నారు. వైద్యులు, నర్సులు, వార్డు బాయ్ లు,శానిటరీ సిబ్బందికి, కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేశారు.అలాగే దిబ్బ పాలెం కి చెందిన తల్లి కొడుకులకు కూడా శుక్రవారం కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.
 

 


దేశవ్యాప్తంగా మే 17వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు.


దేశవ్యాప్తంగా మే 17వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

 

గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో ఆంక్షల సడలింపు

 

     స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)

 

 కరోనా వైరస్ పరిపూర్ణంగా నిర్మూలన జరగాలని కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించి గ్రీన్ ఆరంజ్ జోన్స్ లో ఆంక్షలు సడలించారు  విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌.  స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలి, అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు, అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి. గ్రీన్‌ జోన్లు, ఆరేంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు,రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు వారంకు ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలన కేసులు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు గ్రీన్‌, ఆరేంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం  గ్రీన్‌ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి  ఆరేంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి, ఆరేంజ్‌ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి .ఆరేంజ్‌ జోన్లు: టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి, ఆరేంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు.

పాత్రికేయులకు నిత్యావసర సరుకులను అందించిన  పైలా   


పాత్రికేయులకు నిత్యావసర సరుకులను అందించిన  పైలా   

 

            వి.మాడుగుల, పెన్ పవర్:

 

లాక్ డౌన్ కష్టాల నుంచి అదిగమించేందుకు వివిధ వర్గాలకు సాయపడుతున్న పైలా ప్రసాదరావు సేవలు అభినందనీయమని మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి ఆలయ చైర్మెన్, తెలుగుదేశం నాయకులు పుప్పాల అప్పలరాజు అన్నారు. మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పైలా ప్రసాదరావు ఆర్ధిక సహకారంతో శుక్రవారం మాడుగుల ప్రాంత పాత్రికేయులకు నిత్యావసర సరుకులను పుప్పాల చేతుల మీద పంపిణీ చేసారు.  5 కిలోల వంటనూనె, 2 కిలోల కందిపప్పు, 2  కిలోల చక్కెర, 2  కిలోల ఉప్మా రవ్వ, 2  కిలోల గోధుమ పిండితో కూడిన నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా పైలా అందిస్తున్న సేవలను స్థానిక నేతలు అభినందించారు. పైలా సేవలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామ, మండల స్థాయి నేతలు నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో  సీనియర్ టీడీపి నాయకులు పాలకుర్తి శ్రీనివాసరావు, ఆళ్ళ శివ, ఆళ్ళ సంతోష్, బోడా అప్పారావు, దాలి బాబు, చిటికిరెడ్డి జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు 10వేలు ఆర్ధిక సహాయం అందించాలి.





కార్మికులకు 10వేలు ఆర్ధిక సహాయం అందించాలి.

 

8 గంటల‌ పనిదినాన్ని అమలు చేయాలి

 

సిపిఎం సీనియర్‌ నాయకులు అజశర్మ 

 

     స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్) 

 

 

కరోనా నిర్మూలనలో భాగంగా లాక్‌డౌన్‌ నేపధ్యంలో అసంఘటితరంగ కార్మికుల‌కు 10వేలు ఆర్ధిక సహాయం అందించాల‌ని, 8 గంటల‌ పనిదినాన్ని అమలు చేయాల‌ని సిపిఎం సీనియర్‌ నాయకులు ఎ.అజశర్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ను డిమాండ్‌ చేసారు.శుుక్రవారం  మేడే సందర్భంగా మద్దిపాలెం సిపిఎం కార్యాయం వద్ద జెండావిష్కరణ చేసిన ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా  పెట్టుబడిదారీ సమాజం శ్రామికవర్గాన్ని దోపిడీ చేసి తమలాభాల‌ సంపాదించుకోవాల‌ని చూస్తున్నాయన్నారు. నేడు ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా మహమ్మారి అగ్ర‌దేశాల‌ను సైతం వదటం లేదన్నారు. ఈ వైరస్‌ కారణంగా శ్రామికవర్గం ఆర్ధికంగా చితికిపోయిందన్నారు. కార్మికవర్గాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పెట్టుబడిదారుల లాభాల‌కోసం 8 గంటల‌ పనిదినాన్ని 12 గంటల‌కు మార్చడాన్ని తప్పుపట్టారు. మరోవైపు అసంఘటితరంగంలో పనిచేసే కార్మికుల‌కు ఆదాయాల్లేక‌ పస్తులుంటే వారికి ఆర్ధిక సహాయం చేయకుండా పెట్టుబడిదారుల‌కు 62వేల‌ కోట్లు రుణమాఫీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సోషలిస్టు దేశాల‌న్నీ కరోనా కష్టకాలంలో ఆదుకుంటున్నా‌య‌న్నా‌రు. రాబోయేకాలంలో ఉపాధి , కార్మిక హక్కుల‌ రక్షణకోసం పోరాటాలు ఉధృతం చేయాల్సి వస్తుందన్నారు. మద్దిపాలెం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి.గంగారావు, ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, పి.మణి, అప్పారావు, చల‌పతి, రమణారావు, కుమారి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


 

 



 

దేశ సంపదను సృష్టించేది శ్రామిక వర్గమే


దేశ సంపదను సృష్టించేది శ్రామిక వర్గమే : సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి.

 

     స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)

 

శ్రామిక వర్గం దేశ సంపదలో ప్రధాన భూమిక పోసిస్తుంటే దేశ సంపద సృష్టికర్తలు కార్పొరేట్ రంగమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించడం విడ్డురంగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి విమర్శించారు. మేడే సందర్భంగా శుక్రవారం ఉదయం సీపీఐ కార్యాలయంలో జెండా అవిష్కరణ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంపద శ్రామిక వర్గం నుంచే సమకూరుతోందని ఇలాంటి శ్రామిక వర్గ కార్మికుల అభ్యున్నతికి కృషి చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ వర్గానికి ఊడిగం చేస్తోందని   ఆందోళన వ్యక్తం చేశారు.     రెక్కాడితే గాని డొక్కాడని కార్మిక వర్గం నేడు పస్థులు ఉంటున్నారు. అసంఘటిత కార్మికులకు జీతాలు చెల్లుంచేందుకు ముందుకు రావడం లేదు. మరో పక్క ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు జీతాలు చెలించాలని చెబుతోంది అయిన కార్పొరేట్ రంగం ఆ వైపుగా చర్యలు తీసుకోవడం లేదు వలస కూలీల పరిస్థితి దననియంగా ఉంది. దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన కార్పొరేట్ దిగ్గజాల రుణాలు సుమారు 68 వేల కోట్ల రూపాయల  మాఫీ  చేయడం దారుణమన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల రుణాలు మాపీ చేయమంటే దేశఆర్టిక వ్యవస్థ తలకిందులు అవుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు తిండి పెడుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నేపధ్యంలో అసంఘటిత రంగంలో ఉన్న ప్రతీ కార్మిక కుటుంబాలకు 10 వేల రూపాయలు చొప్పున్న ఇవ్వాలని సీపీఐ తరుపున డిమాండ్ చేశారు. 8 గంటల పనిదినం సాధించుకోవడానికి అనేక పోరాటాలు చేసి సాధించుకున్న విధానానికి స్వస్తి పలికి నేడు 12 గంటల పనివిధానం ప్రవేశ పెట్టాలని చూడడం దుర్మార్గం అన్నారు. కార్పొరేట్ రంగాలకు ఊడిగం చేసే విధానాలకు స్వస్థి పలికి కార్మిక వర్గాలకు చేయుతనందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కాసులరెడ్డి,అప్పన్న, ఎర్రయరెడ్డి, రాజు, అన్వేషి, విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరా భీమ్ సంజయ్ నగర్ ప్రాంతంలో  ద్రోణంరాజు శ్రీనివాస్ పర్యటన      


ఇందిరా భీమ్ సంజయ్ నగర్ ప్రాంతంలో  ద్రోణంరాజు శ్రీనివాస్ పర్యటన            


 


పూర్ణా మార్కెట్, పెన్ పవర్ :                                                              


 జీవీఎంసీ దక్షిణ నియోజకవర్గం పూర్వం 15 ప్రస్తుతం 27 వార్డులో ద్రోణంరాజు శ్రీనివాస్ పర్యటన....
 


 


  డైమండ్ పార్క్ రోడ్డు శంకర మఠం ఆనుకొని ఉన్న ఇందిరా భీమ్ సంజయ్ నగర్ ప్రాంతాన్ని వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ శుక్రవారం ఉదయం కరోనా వ్యాధి విస్తరిస్తున్న దృశ్య సందర్శించి ఈ ప్రాంతంలో నివసిస్తున్నప్రజలను రజకులను ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాంతంలో ఉన్న రేషన్ డిపో నెంబర్ 30 నెంబరులో ఇస్తున్న సరుకుల నాణ్యత వివరాలను, తూనికలను స్వయంగా ఆయన  పర్యవేక్షించారు  ఈ సందర్భంగా వార్డు లో నివసిస్తున్న ప్రజలకు" కరోనా వ్యాధి...లక్షణాల నివారణ చర్యలను వివరించారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రతి ఒక్కరూ పాటించాలని వార్డులో పనిచేస్తున్న పారిశుద్ధ్య పనివారికి పోలీస్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు,
ఈ కార్యక్రమంలో వార్డు వైయస్సార్సీపి కార్పొరేటర్ అభ్యర్థి సర్వేశ్వర్ రెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు,


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్! కాకినాడ మడ అడవులపై ఉన్నత స్థాయి కమిటీని నియమించిన NGT 


కాకినాడ మడ అడవులపై ఉన్నత స్థాయి కమిటీని నియమించిన NGT 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్!


 


న్యూస్ డెస్క్, పెన్ పవర్


అంథ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో పేదలందరికీ ఇళ్ళు అనే పథకంలో భాగంగా కాకినాడకు చెందిన విలువైన భూములు కల పట్టణంలో 50 వార్డులకు చెందిన 24,388 మంది లబ్ధిదారులను ఎంపికచేసి, వారికి నగరంలో పూర్తి స్థాయిలో భూమి లభించక పోయే సరికి, కాకినాడ పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన భూములు 1978/79 నుంచి అభివృద్ధి చేయలేదు అనే ఉద్దేశంతో, సర్వే నంబరు.376 పార్టు, 375/1, 1985/పార్టు మరియు 2004/పార్టులో ఉన్న 100 ఎకరాల పైన "మడ అడవులు" ఉన్న భూమిని కలెక్టరు గారు ప్రజా ప్రయోజనాల నిమిత్తం తీసుకోని పేదలకు ఇళ్ళు పథకం అమలు కింద జత చేసి, మడ అడవులను నరికివేసి, అక్కడ నేలను పూర్తిగా మట్టి పోసి చదును చేయటం, అందునా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ నిభంథనలు దేశమంతా అమలులో ఉన్న సమయంలోనే చేయటంతో, స్థానికంగా ఉన్న దుమ్మల పేట, పర్లో పేట గ్రామాలకు చెందిన పల్లేకారులు రోడ్డు పైకి వచ్చి అథికారుల ప్రవర్తనను నిరసించటం జరిగింది లాక్ డౌన్ నిబందనలను కూడా ఉల్లంఘన చేసి మరీ ప్రభుత్వం జీవవైవధ్యాన్ని ధ్వంసం చేస్తున్న విషయాన్ని ప్రముఖ పర్యావరణ పరిరక్షణవేత్త శ్రీ బోలిశెట్టి సత్యనారాయణ గారి దృష్టికి స్థానిక పల్లేకారులు తీసుకురావటంతో అయన సదరు "మడ అడవులు" CRZ ప్రకారం రక్షిత కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిథిలో ఉన్న భూములుగా గుర్తించి, దీని పైన ప్రథాన మంత్రి, కేంద్ర అటవీశాఖ మంత్రి, రాష్ట్ర   ముఖ్యమంత్రి, రాష్ట్ర పర్యావరణ సంస్థల దృష్టిలో పెట్టినప్పటికి, మడ అడవుల నరికివేత కోనసాగుతూ ఉండటంతో, సి.అర్.జెడ్. నిబంధనలు, 2011 మరియు 2019; పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986; అటవీ పరిరక్షణ చట్టం, 1980;  వన్య ప్రాణుల పరిరక్షణ చట్టం, 1972 జాతీయ జీవ వైవిధ్య చట్టం,2002 మరియు రాజ్యాంగ అథికరణాలు.48-A, 51-A(g) ఉల్లంఘనలు కింద జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసు నెంబరు.65/2020ని ది.16-04-2020న దాఖలు చేయటం జరిగింది. దీని పైన కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖలను, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టరు లను ప్రతివాదులగా చేర్చటం జరిగింది. 


దీని పైన జాతీయ హరిత ట్రిబ్యునల్ లో నేడు అనగా ది.30-04-2020న వాదనలు జరిగినవి. 


దీని పైన రాష్ట్ర హైకోర్టులో కూడా ఇదే అంశం పైన కేసు దాఖలు చేయటం జరిగింది మరియు యథాతథ స్థితిని కోనసాగించాలని ది.27-04-2020న ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది, హైకోర్టు ఉత్తర్వులు నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ అత్యవసరంగా ఈ కేసును వినాల్సిన అవసరం లేదంటూ వాదించగా, పిటిషనరు తరపు న్యాయవాది సదరు వాదనను తిప్పికోడుతూ, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ, ఇంకా అక్కడ పనులు జరుగుతున్నాయి అనే వాదన చేయటంతో, జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పందించి దిగువ తెలిపిన విథంగా ఉత్తర్వులు మథ్యంతరంగా జారీ చేయటం జరిగింది. అవి


1) ఐదుగురు సభ్యులతో కూడిన పరిశీలన బృందాన్ని నియమించటం జరిగింది. దీనిని చెన్నైకి చెందిన కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖకు చెందిన ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అథికారి నేతృత్వం వహిస్తారు. దీనిలో రాష్ట్ర కోస్తా తీర ప్రాంతం అథారిటీ సీనియర్ అథికారి, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాథికారి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు మరియు కాకినాడ జిల్లా అటవీ అథికారి సభ్యులుగా ఉంటారు. 


2) సదరు పైన తెలిపిన కమిటీ  నేటి నుంచి అరు నెలల వెనుక వరకు కేంద్ర అటవీ శాఖ అథ్వర్యంలో ఉన్న కాకినాడ మడ అడవుల సాటిలైట్ చిత్రాల అథారంగా సదరు ప్రాంతాన్ని పరిశీలన చేయాలి. దీనికి చెన్నై ప్రాంతీయ కార్యాలయం సహకారం అందించాలి.


3) సదరు కమిటీ కాకినాడ మడ అడవులు నరికివేత ఏ స్థాయిలో జరిగింది, ఏంత మేరకు జరిగింది, ఏంత మేరకు మడ అడవులకు నష్టం జరిగింది, మరలా మడ అడవి పునరుద్ధరణకు ఏంత ఖర్చు అవుతుంది, మడ అడవులను నరకటం వలన పర్యావరణానికి ఏంత మేరకు నష్టం జరిగింది అనే వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలన, పరిశోధన చేసి మూడు నెలలో సదరు కమిటీ తన పూర్తి స్థాయి రిపోర్టును జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలు చేయాలి మరియు దాని కాపీలను పిటిషనరు, ప్రతివాదుల న్యాయవాదులకు కూడా అందచేయాలి.


4) ఒకవేళ సదరు మడ అడవులు ప్రాంతంలో ఏదైనా నిర్మాణాలు జరిగిన పక్షంలో, అవి జాతీయ హరిత ట్రిబ్యునల్ తుది తీర్పుకు మాత్రమే లోబడి ఉంటాయి. 


5) ఒకవేళ పై తెలిపిన కమిటీ నివేదికలో మడ అడవుల నరికివేత జరిగినట్లుగా తెలిసినచో, దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత ఉన్నతాథికారులు భాథ్యులు అవుతారని, పర్యావరణానికి జరిగిన నష్టానికి పూర్తి స్థాయిలో వారే భాథ్యులు అవుతారని, సదరు నష్టపరిహారం పూర్తిగా వారి నుంచే స్వాధీనం చేసుకుంటామని కూడా తెలియ చేసింది. 


6) తదుపరి విచారణను ది.18-08-2020కి వాయిదా వేయటం జరిగింది


లాక్ డౌన్ సమయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడంపై సుప్రీం కోర్టు ప్రముఖ లాయర్ శ్రీ సంజయ్ ఉపాధ్యాయ అన్నారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...