జాతీయ జండా కు ,శత సంవత్సరాల వేడుకలు
మహారాణి పేట, పెన్ పవర్
జాతీయ జండా రూపశిల్పి,స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య కు ఘన నివాళులు.పింగళి కి భారతరత్న ఇవ్వాలి.శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చర్ అండ్ యూత్ అకాడమీ,రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ,ప్రకృతి చికిత్సాలయం మహారాణి పేట ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ పాల్గొని ముందుగా స్వాతంత్ర సమరయోధుడు,నిష్కళంక దేశభక్తుడు పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా త్రివర్ణ పతకమును గగన తలమునకు ఎగురవేశారు.వారు మాట్లాడుతూ పింగళి వెంకయ్య ఆగస్టు 2 ,1876 లో కృష్ణా జిల్లాలో సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించారని అన్నారు.గాంధీజీ పిలుపును అందుకొని బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకముగా,భరతమాత దాస్య శృంఖలాల విముక్తికై జాతీయ స్వాతంత్ర ఉద్యమములో పాల్గొని తన వంతు పోరాటం సాగించారు.1916 లో జాతీయ పతాకము అనే ఆంగ్ల పుస్తకమును రచించారు.త్రివర్ణ పతకమును 1921 లో రూపొందించారు.ఈ పతాకంలో ఎరుపు రంగు హిందూ మతానికి ,తెలుపు రంగు ఇతర మతాలకు,ఆకుపచ్చరంగు ఇస్లాం మతమునకు ప్రతీకలుగా రూపొందించారు. మహాత్ముని సూచన తో జెండాలో రాట్నం చిహ్నం పొందుపరిచారు.1947 లో స్వాతంత్రం అనంతరం కాషాయం ,తెలుపు ,ఆకుపచ్చ రంగుల తోటి మరియు మధ్యలో అశోక చక్రమును పొందుపరిచారు .జూలై 4 ,1963 వ సంవత్సరంలో తన 86వ ఏట పరమపదించారు.విదేశాల నుంచి వచ్చి పేదలకు సేవలు అందిస్తూ, మురికి వాడలలో మత ప్రచారం చేస్తున్న వారికి కూడా భారతరత్న ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.కానీ 135 కోట్ల మంది ప్రజలు నిత్యము వందనము చేయు జాతీయ జండా రూపకర్తకు నేటి వరకు భారత ప్రభుత్వము భారతరత్న ప్రకటించకపోవడం విచారించ వలసిన విషయం. ఆంధ్రులైన పీవీ నరసింహారావు కు ,పింగళి వెంకయ్యకు ఆంధ్రుల ఆత్మ గౌరవం పెంపొందించిన ఎన్టీ.రామారావుకు,అల్లూరికి ,భోగి రాజు పట్టాభి సీతారామయ్య కు ఇంకా ఎందరో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలు సైతం త్యాగము చేసిన మహనీయులకు కేంద్ర ప్రభుత్వము భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వెంకయ్య కుటుంబానికి 75 లక్షలు ఆర్థిక సహాయము అందజేశారు .ఇన్ని సంవత్సరాలుగా ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు ,పోయారు కానీ వెంకయ్య కుటుంబాన్ని ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ,డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి ,పల్లా చలపతి రావు ,ఎస్ మహేష్ ,గేదెల శ్రీహరి,డాక్టర్ బుచ్చిబాబు ఎల్,డాక్టర్ వై లక్ష్మణరావు,ఎస్ చాతుర్య , దుటి,రమణ,రాము,శారద,కొండమ్మ ,ఎమ్.ఏస్. నాయుడు,రమణి,రామదాస్ అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అందరికీ పండ్లు ,స్వీట్స్ పంచారు.
No comments:
Post a Comment