ఆడబిడ్డల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ప్రధాన ధ్యేయం
దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా..
రాష్ట్రంలో సిఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అమలు
రెండున్నర ఏళ్లలో 4000 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
రామగుండం, పెన్ పవర్
తెలంగాణ ఆడబిడ్డల వివాహాలు పేదింటి తల్లిదండ్రులకు భారం కావద్దని దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేసి నిరుపేద కుటుంబాల్లో అనందం నింపుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతు వేధికలో 77 కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సమాఖ్య పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు పుడితే అమ్ముకుని పరిస్థితులుండేవని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సిఎం కేసీఆర్ ఆడ పిల్లల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టడంతో ఈ రోజులల్లో ఆడపిల్ల పుడితే మహలక్ష్మీ పుట్టిందనే సంతోషించే పరిస్థితులున్నాయని అన్నారు. ఆడపిల్లల పెళ్లీల కోసం రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలను అమలు చేసి 1లక్ష 116 రూపాయలు పెళ్లి కానుకగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సకల వర్గాల సంక్షేమం కోసం సీఎం నిత్యం శ్రమిస్తున్నారని రైతులను రాజులుగా మార్చలన్నా సంకల్పంతో ఉచిత కరెంట్, రైతు భీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్న సిఎం కేసీఆర్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తే ప్రజలు సహించవద్దని, తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రామగుండం నియోజవర్గంలోని ప్రజల సేవ కోసం పని చేస్తున్నామని తము ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు నియోజవర్గంలో 4000వేల కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కులను లబ్దిదారులకు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం తహాసీల్ధార్ బండి ప్రకాష్ తో పాటు ఎంపిపి దుర్గం విజయ, జడ్పీటిసి ఆముల నారాయణ, వైస్ ఎంపిపి మట్ట లక్ష్మి-మహేందర్ రెడ్డి, సర్పంచ్ లు బండారి ప్రవీణ్ కుమార్, ఎదులపూరం నీరజ-వెంటటేష్, కొల్లురి సత్య-సతీష్, గంగాధరి దేవమ్మ-రామయ్య, కుర్ర వెంకటమ్మ-నూకరాజు, ఎంపిటిసి కొలిపాక శరణ్య-మధుకర్ రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు దివాకర్, మండల కో-ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, తెరాస పార్టీ మండల అధ్యక్షులు తిరుపతినాయక్, కోల సంతోష్, తదితరులు పాల్గొన్నారు.