కరోనా కట్టడికి మే 8 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
మందమర్రి ఎస్.ఐ లింగంపల్లి భూమేష్
పెన్ పవర్, మందమర్రిరాష్ట్రంలో సెకండ్ వేవ్ లో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నందున, ప్రజలను ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ మే 8 వరకు పొడగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పట్టణ ఎస్.ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. అన్నారు. ప్రజలు తమ పనులను రాత్రి 9 గంటల లోపు ముగించుకొని ఎవ్వరి ఇండ్లలో వారు ఉండాలని మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని కిరణా దుకాణాలు,వైన్స్ షాపులు,హోటళ్లు వ్యాపార సముదాయాలను (అత్యవసర సేవలు మినహా) ప్రతి రోజు రాత్రి 8 గంటల లోపే మూసి వెయ్యాలని ఆయన తెలిపారు.అతి వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మరిని కట్టడి చెయ్యడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై కరోనా బారిన పడకుండా మనల్ని మన కుటుంబ సభ్యులను కాపాడుకోవాలన్నారు.పై నిబంధనలు దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంగిస్తే మరింత కఠిన ఆంక్షలను విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment