Followers

Showing posts with label HEALTH AND EDUCATION. Show all posts
Showing posts with label HEALTH AND EDUCATION. Show all posts

మాస్క్ ధరించని వారిపై కొరడా

 మాస్క్ ధరించని వారిపై కొరడా

చట్ట ప్రకారం 46 కేసులు నమోదు

పెన్ పవర్, మల్కాజిగిరి

నేరేడ్మట్ పోలీస్ స్టేషన్ సిఐ నర్సింహ్మ స్వామి ఆద్వర్యంలో రచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశల మేరకు మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా రోడ్డు పై తిరుగుతున్న వారిపై కేసు నమోదు చేసి రూ1000 జరిమానా విధించారు. నేరేడ్మట్, వినాయక్ నగర్ ప్రాంతల్లో 46 కేసులు నమోదు చేశామని సిఐ తెలిపారు. ఈ సందర్బంగా సిఐ నర్సింహ్మ స్వామి మాట్లాడుతూ కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ, మాస్కులు, బౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని నేరెడ్ మెట్ సిఐ నరసింహ స్వామి అన్నారు. కరోనా నిబంధనలు నిర్లక్ష్యం వ్యహిస్తే వారిపై నేరేడ్మెట్ పోలీసులు కొరడా చూపిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశల మేరకు ప్రతిరోజు ప్రధాన చౌరస్తాలో, వినాయక్ నగర్ లో మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వ్యహిస్తు నిబంధనలను పాటించని వారికి అవగాహన కల్పిస్తూ పెట్టి కేసు నమోదు చేస్తున్నామని సిఐ నరసింహ స్వామి తెలిపారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న 46 కేసులు నమోదు చేశామని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కోవిడ్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బెల్లంపల్లి స్వచ్ఛంద లాక్ డౌన్ ప్రారంభం

 బెల్లంపల్లి స్వచ్ఛంద లాక్ డౌన్ ప్రారంభం

బెల్లంపల్లి, పెన్ పవర్

బెల్లంపల్లి లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో  బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు చైర్పర్సన్ శ్రీత. శ్రీధర్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ కరోనా కట్టడి కోసం వ్యాపార యజమానులతో మాట్లాడి అన్ని రకాల వ్యాపార సంస్థలు  స్వచ్ఛందం గా  లాక్ డౌన్ లో పాల్గొనాలని అన్నారు ఇందులో భాగంగా మంగళవారం 3. గంటల నుంచి  మొదటిరోజు బజార్ ఏరియా లోని దుకాణ యజమానులు తమ దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు ...

పండుగలు పెళ్ళిళ్ళు వాయిదా వేయాల్సిందే

 పండుగలు పెళ్ళిళ్ళు వాయిదా వేయాల్సిందే…

 నిబంధనలు ఉల్లంఘిస్తే కోవిడ్ చట్ట ప్రకారం చర్యలు.

నెల్లికుదురు తహసిల్దార్. అనంతుల రమేష్ కుమార్

నెల్లికుదురు,పెన్ పవర్

 కరోణ సెకండ్  వేవ్ వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా మండలంలోని ప్రజలు ఎవరు కూడా  మాస్కులు లేకుండా బయట సంచరించ కూడదని,  ఒకవేళ అత్యవసర పని ఉన్నట్లయితే మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ బయటకి రావాలని మహబూబాద్ జిల్లా నెల్లి కుదురు మండలం తాసిల్దార్ అనంతుల రమేష్ కుమార్ ప్రజలను హెచ్చరించారు మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ గ్రామాలలో ఫంక్షన్లు,  పెళ్లిళ్లు,  ఎలాంటి పండుగలైన జరుపుకునేవారు వాయిదా వేసుకోవాలని,  పెళ్లిళ్లు తప్పనిసరి చేయాలి అనుకునేవారు అధికారుల అనుమతి పొంది కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహించు కోవాలని లేనిపక్షంలో కోవిడ్ చట్ట ప్రకారము ఎంతటివారి పైన గాని చర్యలు  తీసుకోబడుతుంది అని తెలియజేశారు.

ఆందోళన వద్దు

 ఆందోళన వద్దు...

సెంటర్ల సంఖ్య పెంచుతాం - ఎమ్మెల్యే మైనంపల్లి

పెన్ పవర్, మల్కాజిగిరి

వ్యాక్సినేషన్, కరోనా టెస్ట్ ల గురించి నగర ప్రజలు ఆందోళన చెందవద్దు, ఇప్పటికే ఉన్న సెంటర్లకు అదనంగా నేరేడ్మట్ డివిజన్ లో రెండు, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ లో రెండు, గౌతం నగర్ డివిజన్లో మూడు, మల్కాజిగిరి డివిజన్ లో మూడు, వినాయక్ నగర్ డివిజన్ లో ఒకటి వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించాం. వ్యాక్సినేషన్ సెంటర్లే కాకుండా టెస్టింగ్ సెంటర్ల సంఖ్యను పెంచుతాం అన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.

మాస్క్ ధరించకుంటే జరిమానా

 మాస్క్ ధరించకుంటే జరిమానా, లేదంటే జైలుకే

పెద్దగూడూరు, పెన్ పవర్ 

కొత్తగూడ ఎస్సై సురేష్  కొవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో రెండు రోజులుగా మహబూబబాద్ జిల్లా కొత్తగూడ లో మాస్కులు ధరించకుండా కరోనా నిబంధనలు అతిక్రమించిన వారికి ఫైన్ లు పోలీసులు వసూలు చేస్తున్నారు. మాస్కులు ధరించని వాహనదారుపైన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒక్కొక్కరికి 1000/- జరిమానాను కొత్తగూడ ఎస్సై సురేష్ విధిస్తున్నారు. ఇప్పటికే పదూల సంఖ్యలో ఈ చలాన్ల రూపంలో జరిమానాలను పంపించారు. ఇక పై బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా కనబడినట్లయితే వారి పై కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. వ్యాపారస్తులు కూడా మాస్క్ ఉంటేనే కస్టమర్లను షాపుల్లోకి అనుమతించాలని, దీన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. కోవిడ్ ని అరికట్టడంలో ప్రజలందరూ సహకరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించని వారిపైన క్రిమినల్ కేసులు కూడా తప్పవని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ ధరించకుంటే ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి, కోర్టులో హాజరుపరుచుతామని తెలిపారు. పదుల సంఖ్యలో ఈ-చలానాలు పంపామన్నారు. ఇక జరిమానా సొమ్ము చెల్లించని వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతామంటున్నారు పోలీసులు. మాస్క్ అనేది మీ రక్షణ కోసమేనని ధరించాలనీ, దయచేసి పోలీసులు ఫెనాల్టీ లు విధిస్తారని మాత్రం ధరాంచకండి అని ఎస్సై సురేష్ విజ్ఞప్తి చేశాడు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనాను తరిమికొట్టాలి

 వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనాను తరిమికొట్టాలి...

 డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్

బేల,  పెన్ పవర్ 

ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు.బేలా మండలం లోని మాంగ్రూడ్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరన్ని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ పరిశీలించారు. గ్రామంలోని 73 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్యులు  తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య శాఖ అధికారి క్రాంతికుమార్, ఎంపీడీవో రవీందర్ భగత్, ఎస్ఐ సాయన్న, ఎంపీటీసీ ఠాక్రె మంగేష్, కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ వార్డ్ లో పనిచేస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్, బిస్కెట్లు పంపిణీ.

 కోవిడ్ వార్డ్ లో పనిచేస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్, బిస్కెట్లు పంపిణీ...

అదిలాబాద్, పెన్ పవర్

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్  జన్మదినాన్ని పురస్కరించుకొని రిమ్స్ ఆసుపత్రి లో మంగళవారం  కోవిడ్ వార్డుల్లో పని చేస్తున్న సిబ్బందికి వాటర్ బాటిల్స్, బిస్కట్స్, జ్యూస్ బాటిల్స్ ని సాజిద్ ఖాన్ గారు కాంగ్రెస్ జిల్లా నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ప్రాణాలకు ప్రాణంగా పెట్టుకుని కోవిడ్ రోగులకు వైద్య సేవలు మందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో నాయకులు మల్లేష్ యాదవ్, రాహుల్, రాజు యాదవ్, రసూల్ ఖాన్ ,ఎం ఏ షకీల్, నాహిద్, మోసిన్ పటేల్, జాబీర్తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ టీకా సెకండ్ డోసు తీసుకున్న జడ్పీటీసీ చారులత రాథోడ్

 కోవిడ్ టీకా సెకండ్ డోసు తీసుకున్న జడ్పీటీసీ చారులత రాథోడ్...

ఉట్నూర్,  పెన్ పవర్

కోవిడ్ వ్యాక్సిన్ టీకాను ప్రతిఒక్కరూ వేసుకోవాలని ఉట్నూర్ జడ్పిటిసి చారులత రాథోడ్ సూచించారు. మంగళవారం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారి భర్త రాథోడ్ శైలెందర్ తో కలిసి కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ ని వేసుకున్నారు.వారితో పాటు పంచాయతీ రాజ్ ఎస్.ఈ. జాదవ్ వెంకట్ రావ్ దంపతులు ఉపాధ్యాయుడు చౌహాన్ రమేష్ దంపతులు టీకాను వేసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి చారులత రాథోడ్ మాట్లాడుతు కరోనా కట్టడికి టీకాయే మార్గమని, కోవిడ్ వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరు 45 ఏళ్ళు పైబడిన వారు టీకాను వేసుకోవాలని సూచించారు. ఉట్నూర్ మండల ప్రజలందరు టీకా కోసం నేటి నుండి ఆన్లైన్ లో selfregistration.cowin.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకొని ఆసుపత్రికి వెళ్ళి టీకా వేసుకోవాలన్నారు.

ప్రజల సంక్షేమం కోసం బంద్

 ప్రజల సంక్షేమం  కోసం బంద్

నార్నూర్, పెన్ పవర్ 

గాదిగుడా మండలంలోని స్థానిక గ్రామాల్లో 4/5 /2021 నుండి 20/5/21తేదీ వరకు మద్యాహ్నం రెండు గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని స్ధానిక సర్పంచ్ మెస్రం జైవనత్ రావు, వార్డు మెంబర్ల సమక్షంలో తీర్మానం చేశారు. మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో  సర్పంచ్ మాట్లాడుతూ రెండవ దశ  లో కరోన ఉద్రిక్తత విజృంభించడంతో  ఇటూ జ్వరాలు అటు కరోనా మహమ్మారి ప్రజలను వంకించడం తో గాడిగూడా గ్రామపంచాయతీ పరిధిలో నిసమావేశం అయి రేపటి నుంచి అన్ని దుకాణాలు  మద్యాహ్నం రెండు గంటలకు మూసివేయాలని అలాగే ప్రతిఒక్కరు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ఎవరైనా ఈ తీర్మానాన్ని ఉలంగిస్తే కఠినచర్యలు తప్పవని రు.1000 జరిమానా విధించాలలసి ఉంటుందని హెచ్చరించారు. మార్కెట్ మార్నింగ్ 6 గం. నుండి మద్యాహ్నం 2 గం వరకు తేరియా వలసిందిగా మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ కొంచెడ సుంగు అన్నారు. ఈ తీర్మానమును స్థానిక పోలీస్ స్టేషన్  ఎస్ ఐ ముజాహియోదిన సమర్పించిన తమ వంతు సహకరించాలని తీర్మానని సమర్పించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ కోటంబె డిగంబర్, రెవత, జైతు, నందకిశోర్, బాలాజీ, శాలుబాయి, దేవుబయి ,రుక్మబాయి  ఉన్నారు.

గాడిగూడా లో రక్త పరీక్ష శిభిరం

 గాడిగూడా లో రక్త పరీక్ష శిభిరం...

 నార్నూర్, పెన్ పవర్ 

గాడిగూడా మండల పి హెచ్ సి ఆధ్వర్యంలో కోవిడ్19 మహమ్మారి విపరీతంగా  పెరగడం తో మరో వైపు ఏజెన్సీ ప్రాంతంలో  జ్వరాలు ఏకువగా పెరిగి ఉనందున ప్రభుత్వ ఆసుపత్రి లో మంగళవారం  రక్త పరీక్ష శిభిరం నిర్వహించారు.రక్త పరీక్ష కు ప్రజలు ముందుకు రావాలని  హెచ్ ఇ ఓ పవర్ రవీందర్ అన్నారు.వారి వెంట ఏ ఎన్ ఎం ఊర్మిళ, హెచ్ ఏ సురేష్,సి హెచ్ డబ్ల్యూ కుంతబాయి, ఉన్నారు.

ప్రమాదాలు జరగకుండా మెష్ ఏర్పాటు

 ప్రమాదాలు జరగకుండా మెష్ ఏర్పాటు

నాలాలో ఉన్న చెత్త తొలగింపు

పెన్ పవర్, మల్కాజిగిరి

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు గౌతంనగర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ నాలా క్లీనింగ్ పనులను, మెష్ ఏర్పాట్ల  పనులను కార్పొరేటర్  సునీత రాముయదవ్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ సునీత రాము యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరేడ్మట్ దీన్ దయళ్ నగర్ లో ఎడాది క్రితం నాలాలో పడి చిన్నారి చనిపోయిన ఘటన జరిగిందని, ఇందుకు ఒపెన్ నాలా వద్ద సరియైన మెష్ రక్షణ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని గుర్తుచేశారు. రాబోయే వర్షకాలం ను దృష్టిలో ఉంచుకుని ప్రజలకోసం నాలాలా పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాముయదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిజాంపేట్ కార్పొరేషన్ లో త్రాగునీటి సమస్యలు తీర్చండి

 నిజాంపేట్ కార్పొరేషన్ లో త్రాగునీటి సమస్యలు తీర్చండి.. 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో త్రాగు నీటి వసతి కోసం కోటి లీటర్ల సామర్థ్యం గల నాలుగు వాటర్ ట్యాంకర్లు ప్రారంభోత్సవానికి నోచుకోక ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం బిజెపి నాయకులు ప్రారంభం లోనే ట్యాంకర్లను సందర్శించి త్రాగు నీటి సమస్యలు పరిష్కరించాలని పర్యటన.. కార్పొరేషన్లో తాగునీరు రోజువారీగా అధికారికంగా అనుమతి ప్రకారం 1.5 కోట్ల లీటర్లు వస్తుంది. కానీ మూడు కోట్ల లీటర్ల త్రాగునీరు నీరు సాధిస్తేనే కానీ కార్పొరేషన్ త్రాగునీటి సమస్య పరిష్కారం కాదు. ఇప్పటి కూడా 6 బలహీనవర్గాల కాలనీలకు పూర్తిస్థాయిలో మంచినీటి సౌకర్యం కల్పించలేని  పరిస్థితి . పైగా ఈ సంవత్సరన్నర కాలంలోనే దాదాపు 1500 అపార్ట్మెంట్ల నిర్మాణం జరిగింది . కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చించి మరో   కోటి లీటర్ల సామర్థ్యం గల మూడు మంచినీటి ట్యాంకులను నిర్మించి, సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభించక పోవడానికి కారణం ఏమిటో మున్సిపల్ , వాటర్ వర్క్స్ అధికారులు సమాధానం చెప్పాలని,నిజాంపేట్ కు 2 కోట్ల లీటర్ల త్రాగునీరు అధికారికంగా  ఉత్తర్వులు లేకపోవడమేనని, తక్షణమే మున్సిపల్,  వాటర్ వర్క్స్ అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని, నూతనంగా నిర్మించిన కోటి లీటర్ల సామర్థ్యం గల వివిధ మంచినీటి ట్యాంకులను తక్షణమే ప్రారంభించాలని ,6ఎంజిడి లీటర్ల త్రాగునీరు అధికారికంగా మంజూరు చేయించి, త్రాగునీరు ప్రజలందరికీ సప్లై చేయాలనీ, శనివారం.. ప్రారంభం నోచుకోని వాటర్ ట్యాంక్ ను సందర్శించడమే గాక, ఈ సమస్యపై కలెక్టర్ మరియు వాటర్ వర్క్స్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడమేగాక సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ముదిరాజ్, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నరేంద్ర చౌదరి, వైస్ ప్రెసిడెంట్ శివ కోటేశ్వరరావు, బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై రివ్యూ మీటింగ్

 కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై రివ్యూ మీటింగ్

మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

మంథని, పెన్ పవర్

మంథని నియోజకవర్గంలోని 4 మండలాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ పైన ఆస్పత్రిలో సౌకర్యాల పైన పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి మరియు మండల వైద్యాధికారు లతో మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రివ్యూ  నిర్వహించిన  మాజీ మంత్రి ప్రస్తుత మంథని నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం లోని మంథని మండలము రామగిరి మండలం ముత్తారం మండలం కమాన్ పూర్ మండలంలో అక్కడి వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని వాటి వివరాలు తెలుసుకొని వచ్చే వారం రోజుల్లో అన్ని మండలాల్లో 100% 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని డాక్టర్లను కోరారు. వ్యాక్సిన్ ఇప్పటి వరకు 45 సంవత్సరాలు నిండిన వారిలో మంథని మండలంలో 80% మందికి మరియు రామగిరి మండలంలో 50% మందికి కమాన్ పూర్ మండలంలో 50% మందికి ముత్తారం మండలంలో 40% శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ జరిగిందని వచ్చే 6 రోజుల్లో పూర్తి చేస్తామని డాక్టర్లు ఎమ్మెల్యే కి తెలిపారు. ప్రభుత్వం 18 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం జరిగితే చాలా వరకు వ్యాక్సిన్ అవసరముంటుందని చాలా కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ వ్యాక్సిన్ అందరికీ వేసే విధంగా కృషి చేయాలని డాక్టర్లను కోరారు. మంథని నియోజకవర్గంలోని మంథని మండలంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని మరియు జె.ఎన్.టి.యు కళాశాలలో కూడా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ కేంద్రంలో ఆక్సిజన్ సప్లయి అందుబాటులో ఉంచాలని కలెక్టర్ నీ కూడా కోరుతానని తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ మరియు కరోనా టెస్ట్ లు ఒకే ప్రదేశంలో జరపకుండా ఒకే ప్రదేశంలో జరిపితే కరోనా ప్రబలే అవకాశం ఉందా  భౌతిక దూరం పాటిస్తూ వేరువేరుగా జరపాలని  అవసరమైతే వ్యాక్సిన్ కేంద్రాలను పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని డాక్టర్లను కోరారు. ఎమ్మెల్యే జిల్లా వైద్యాధికారి కి అన్ని మండలంలోని ఆసుపత్రికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారికి కావలసిన టెస్ట్ కిట్లు వ్యాక్సిన్లు, మందులు, మాస్కులు, గ్లౌజులు తదితర అన్ని ప్రభుత్వం నుండి అందుబాటులో ఉండే  విధంగా అందించాలని కోరారు. మంథని మాతా శిశు ఆసుపత్రిలోని ఖాలిలను భర్తీ చేయాలని ఇక్కడ పనిచేసే వారికి ఇచ్చిన డిప్యూటేషన్ లను రద్దుచేసి వారిని ఆస్పత్రిలో సేవలు అందించే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, మరియు మంథని మండల వైద్యాధికారి శంకర దేవి, వైద్యులు అగంతం నరేష్, కమాన్ పూర్ వైద్యులు అశోక్ కుమార్, ముత్తారం వైద్యులు వంశీ కృష్ణ, రామగిరి వైద్యులు నాగ శిరోమణి మరియు ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరణ.

 ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరణ.

తొర్రూరు, పెన్ పవర్

కరోనా వ్యాధి పట్ల భయపడాల్సిన పని లేదని,అదే సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని, ప్రముఖ సామాజికవేత్త,డాక్టర్ గడ్డం రాజు పిలుపునిచ్చారు. శనివారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రములోని అమ్మ హాస్పిటల్ ఆవరణలో "ఆరోగ్యమిత్ర" స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా అవగాహన పై జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ...కరొనా సెకండ్  వేవ్ జాగ్రత్తల్లో మూడు విషయాలను జాగ్రత్తగా పాటించాలని, అందులో తప్పనిసరి అయితే తప్ప బయటికి రాకుండా ఉండటం,  నిరంతరం మాస్కూలు  ధరించడం,సామాజిక దూరాన్ని పాటించడం, ప్రతి రెండు గంటలకు ఒకసారి సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కో వడం పాటించినట్లయితే కరొనా రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు అని తెలిపారు.అనంతరం ఆరోగ్య మిత్ర సంస్థ ఆధ్వర్యంలో కరోనా జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించి, స్థానికులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో   అక్షర సేద్యం వ్యవస్థాపకులు కస్తూరి పులెందర్,డాక్టర్ పంతంగి నాగ కార్తీక్,బుదారపు శ్రీనివాస్,హాస్పిటల్ సిబ్బంది,ఆశా వర్కర్లు,  తదితరులు పాల్గొన్నారు.

నాచారం డివిజన్ లో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

 నాచారం డివిజన్ లో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి  

అధికారులు తీరు ఫై మండిపాటు స్పందించక పోతే ధర్నా 

కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ 

తార్నాక , పెన్ పవర్ 

కరోనా కేసులు పెరిగుతుండటంతో నాచారం డివిజన్ లో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. చాల రోజులుగా నాచారం డివిజన్ లో కోవిద్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలనీ అధికారులను కోరామని తెలిపారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి లు ఆదేశాలు జారీ చేసిన డిఎంఎచ్ఓ కాలయాపన చేయడంపై కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ మండిపడ్డారు.  నాచారం ప్రజలు కోవిద్ పరీక్షలకు వెళ్ళాలి అంటే మల్లాపూర్ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళలిసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాచారం లో కోవిద్ పరీక్షా కేంద్రం తో పాటు, వాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నాచారం లో రైతు బజార్ బస్తి దవాఖాన తో పాటు కోవిద్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనీ అధికారులను కోరారు. అధికారులు స్పందించకపోతే  ఆందోళన చేస్తామని , డిఎంఎచ్ఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.

నేటి నుండీ కొత్తగూడ లో స్వచ్ఛంద లాక్​డౌన్

 నేటి నుండీ కొత్తగూడ లో స్వచ్ఛంద లాక్​డౌన్

పెద్దగూడూరు, పెన్ పవర్ 

మహబూబబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నేటి (ఆదివారం) నుంచి పరిమిత స్వచ్ఛంద లాక్​డౌన్ ను విధిస్తున్నట్లు గ్రామపంచాయతీ పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ రణధీర్  తెలిపాడు. స్థానికుల సౌకర్యార్థం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు తెరిచి ఉంటాయని సూచించారు. మండల కేంద్రంలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రం రూపం దాల్చుతున్న దృష్ట్యా... నేటి నుంచి  పరిమిత స్వచ్ఛంద లాక్​డౌన్​ విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం స్వచ్ఛంద లాక్​డౌన్​కు ముందుకొచ్చినట్లు, అందరు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనీ, లేనిచో రూ.5000/- జరిమాన విధించబడుతుందని సర్పంచ్ తెలిపాడు. కొత్తగూడ మండల కేంద్రానికీ పరిసర ప్రాంతాల్లో నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారని... ఇటువంటి సమయంలో కరోనా కేసులు ఎక్కువయ్యే అవకాశముందని తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా తమ వంతు చర్యగా పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని... మాస్కులు ధరించి... తమ కుటుంబాలని కాపాడుకోవాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరి జాగ్రత్తలో వారు ఉంటూ కేసులు పెరగకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని వ్యాపారస్థులు విజ్ఞప్తి చేశారు. స్థానికుల సౌకర్యార్థం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు తెరిచి ఉంటాయని సూచించారు.

కరోనా కట్టడి పై ప్రతిజ్ఞ - కమిషనర్ అభిషేక్త్ కిషోర్

 కరోనా కట్టడి పై ప్రతిజ్ఞ - కమిషనర్ అభిషేక్త్ కిషోర్

రాజమహేంద్రవరం,పెన్ పవర్

కరోనా కట్టడి చేయాలంటే సమిష్టి బాధ్యత గా వ్యవహరించాలని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మునిసిపల్ కమీషనర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు.  సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో కరోనా వ్యాప్తి ని కట్టడి చేసేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నామని కమీషనర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు..శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో కరోనా కట్టడి కమిటీతో సమావేశం అయ్యారు. కరోనా కట్టడి లో మరింత అప్రమత్తం గా ఉండేందుకు తీసుకోవలసిన చర్యల పై సమీక్షించారు..


సభ్యులు అందరిచే కరోనా కట్టడి పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశం లో అడిషనల్ కమిషనర్ ఎన్.వి.వి సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు, సిటీ ప్లానర్ వరప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

హెల్ప్ లైన్ సెంటర్ ను సందర్శించిన ఆదిలాబాద్ డి ఎం హెచ్ ఓ

 హెల్ప్ లైన్ సెంటర్ ను సందర్శించిన  ఆదిలాబాద్ డి ఎం హెచ్ ఓ...

ఆదిలాబాద్ ,  పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరెందర్ రాథోడ్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్ని మతాల పెద్దల ఆధ్వర్యంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు లో మాట్లాడారు ఈ సంధర్భంగా డి.యం.హెచ్.ఓ. మాట్లాడుతూ మొదట సాజిద్ ఖాన్ గారికి కృతజ్ఞతలని తను చెప్పిన వెంటనే అన్ని మతాల పెద్దలతో ఇంత చక్కటి అవగాహన కార్యక్రమం చేపట్టాడం అభినందనీయమన్నారు.మన ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా వ్యాధి తీవ్రస్థాయిలో ఉందని.ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటించక పోవడం,నిర్లక్ష్యపు ధోరణి  ఈ కరోనా మహమ్మారి తీవ్రతరం కావడానికి ముఖ్యకారణాలు అని అన్నారు.మాస్కులు అన్ని సమయాల్లో ధరించాలని, సామాజిక దూరం పాటించి,ఏ వస్తువు ముట్టినా సబ్బుతో చేతులు కడుక్కోవాలని ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని పేర్కొన్నారు.  ఈ మూడు నియమాలు పాటించాలని కోరారు. 45 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరూ ఎలాంటి సందేహాలు లేకుండా భయపడకుండా వాక్సిన్ తీసుకోవాలని,ఒకవేలా మళ్ళీ పాజిటివ్ వచ్చినా చిన్న చిన్న లక్షణాలతో,మరణం లేకుండా బయట పడవచ్చని తెలిపారు.అనంతరం వివిధ మతాల మత పెద్దలు  పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆయా మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

కరోనా కట్టడికి మే 8 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

 కరోనా కట్టడికి మే 8 వరకు  రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

మందమర్రి ఎస్.ఐ లింగంపల్లి భూమేష్

పెన్ పవర్,  మందమర్రి 

రాష్ట్రంలో సెకండ్ వేవ్ లో   రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నందున, ప్రజలను ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ మే 8 వరకు పొడగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పట్టణ ఎస్.ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. అన్నారు. ప్రజలు తమ పనులను రాత్రి 9 గంటల లోపు ముగించుకొని ఎవ్వరి ఇండ్లలో వారు ఉండాలని మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని కిరణా దుకాణాలు,వైన్స్ షాపులు,హోటళ్లు వ్యాపార సముదాయాలను (అత్యవసర సేవలు మినహా) ప్రతి రోజు రాత్రి 8 గంటల లోపే  మూసి వెయ్యాలని ఆయన తెలిపారు.అతి వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మరిని కట్టడి చెయ్యడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై కరోనా బారిన పడకుండా మనల్ని మన కుటుంబ సభ్యులను కాపాడుకోవాలన్నారు.పై నిబంధనలు దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంగిస్తే మరింత కఠిన ఆంక్షలను విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలి

 దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలి 

ఓయూలో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం ప్రారంభించాలి

ఏ ఐ ఎస్ ఫ్  డిమాండ్ 

తార్నాక,  పెన్ పవర్

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ గా ఇవ్వాలని ఏ ఐ ఎస్ ఫ్ జాతీయ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యం లో  ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఐ ఎస్ ఫ్ కౌన్సిల్ ఆర్ట్స్ కళాశాల ముందు ఆందోళన నిర్వహించింది దేశంలోని ప్రజలందరికీ ఫ్రీ గా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన *రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ ఆర్. ఎన్ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షు లు పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ  ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వంకి డిమాండ్ చేశారు.  గతంలో  దేశంలో సంభవించిన అనేక వ్యాధులకు ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్,టీకాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. మోడీకి దేశ ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు. ప్రజలందరికీ ఫ్రీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేదాకా పోరాడుతామని ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఐ ఎస్ ఫ్ కార్యదర్శి క్రాంతి రాజ్ మాట్లాడుతూ ఓయూ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు కరోనా మహమ్మారి కి బలి కావడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ల,ఉద్యోగుల ఆరోగ్యం పరిరక్షణకు యూనివర్సిటీ అధికారులు  ఓయూ లోనే కరోనా వ్యాక్సిన్ పంపిణి సెంటర్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఓయూ హెల్త్ సెంటర్ నీ మౌలిక సదుపాయాలు కల్పించి కరోనా ఐసొలేషన్   కేంద్రంగా  మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లో ఏ ఐ ఎస్ ఫ్ ఓయూ నేతలు రహమాన్, రాజు, పవన్, లింగస్వమి, నిఖిల్, అన్వర్, హరీష్, చిన్న, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...