ప్రకాశం జిల్లాలో పెన్ పవర్ లో ప్రచురితమైన పిసి పల్లి మండలంలో ఇసుక మాఫియా వార్తకు స్పందించిన జిల్లా కలెక్టర్ .... తనిఖీ నిమిత్తం పిసి పల్లి కి జాయింట్ కలెక్టర్ వస్తున్నట్లు సమాచారం......కనిగిరి నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారిన ఇసుక మాఫియా వార్త
ప్రకాశం జిల్లాలో పెన్ పవర్ లో ప్రచురితమైన పిసి పల్లి మండలంలో ఇసుక మాఫియా వార్తకు స్పందించిన జిల్లా కలెక్టర్ .... తనిఖీ నిమిత్తం పిసి పల్లి కి జాయింట్ కలెక్టర్ వస్తున్నట్లు సమాచారం......కనిగిరి నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారిన ఇసుక మాఫియా వార్త
కంటోన్మెంట్ జోన్లలో ఎవరు ప్రవేశించిన కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
కంటోన్మెంట్ జోన్లలో కి ఎవరు ప్రవేశించిన కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అట్టాడ బాపూజీ అన్నారు. శనివారం సాయంత్రం కరోనా పాజిటివ్ కేసులు నమోదైన బైలపూడి దిబ్బిడి గ్రామాలను ఆయన సందర్శించారు. కంటోన్మెంట్ జోన్లుగా ఆ గ్రామాలను గుర్తించడంతో రెండు గ్రామాల్లో రహదారుల దిగ్బంధం చేశారు. క్షుణ్నంగా పరిశీలించిన ఆయన రెండు గ్రామాల్లో ప్రజలు బయటకు రాకుండా చూడాలని ఇతర గ్రామాల నుంచి ఎవరు కంటోన్మెంట్ జోన్ లో అడుగు పెట్టకూడదని ఆయన హెచ్చరించారు. నిషేధాజ్ఞలు ఎవరు ఉల్లంఘించిన కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బైల పూడి లో రెండు కేజీలు దిబిరి లో ఒక కేసు నమోదు కావడంతో ఆ గ్రామాలను బారికేడ్లు కంచెలు వేసి దిగ్బంధం చేశామన్నారు. ఈ పరిధిలో మైకుల ద్వారా కరోనా వైరస్ పై అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన బైల పూడి దిబిడి గ్రామాల్లో వెంటనే చర్యలు చేపట్టిన చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కారణం ఈశ్వరరావు సేవలను ఎస్పీ కొనియాడారు. జిల్లాలో కరోనా లాక్ డౌన్ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన 85 మంది పై కేసు నమోదు చేశామని. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 1193 మందిపై కేసులు పెట్టామని 17 వాహనాలు సీజ్ చేసి తొంభై తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 1247 కేసులు రిజిస్టర్ అయ్యాయని మూడు లక్షల 88 వేల 825 రూపాయలు అపరాధ రుసుము విధించామని తెలిపారు.లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. అత్యవసర ప్రయాణాలు చేయాలనుకుంటే పోలీసు శాఖ ద్వారా ప్రత్యేక పాస్ పొందాలని కోరారు. వాసుల కోసం చేసుకోవాలని ఎస్పీ బాపూజీ సూచించారు.
మద్యం దుకాణాల్లో స్టాక్ బేలన్స్ పెట్టాలి
మార్కుల విభజన వివరాలు వెబ్ సైట్ లో పొందుపర్చడమైనది
జిల్లా విద్యాశాఖాధికారి జి. నాగమణి
విజయనగరం, పెన్ పవర్
జూలై 2020లో జరగనున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి సబ్జెక్టు వారీ మార్కుల విభజన వివరములు www.bseap.org వెబ్ సైట్ పొందుపర్చడమైనదని జిల్లా విద్యాశాఖాధికారి జి. నాగమణి తెలిపారు. అన్నియాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్దులకు తెలియజేయాలని తెలిపారు.
-- మాజీమంత్రి దాడి వీరభద్రరావు
అనకాపల్లి, పెన్ పవర్
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస పోతున్న కార్మికుల అవస్థలను చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది అని మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై అష్టకష్టాలు పడుతూ వెళ్తున్న కూలీలకు ఆహారాన్ని అందించే చర్యలు మంత్రులు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ సౌకర్యం కల్పించడంతో పాటు వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిపై నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ ఆహార శిబిరాలు ఏర్పాటుచేసి కూలీలకు ఆకలి బాధలు తీర్చాలని అన్నారు. రోజుల తరబడి ఆహారం తినకుండా ఆకలి బాధతో నడిచి వెళ్తున్న వారి బాధలు వర్ణనాతీతం అన్నారు. అంతకు ముందు ఆర్డీవో సీతారామారావును కలిసి మాట్లాడారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఒరిస్సాకు చెందిన ఇటుక బట్టి కూలీలు వేలల్లో ఉన్నారని వారిని గుర్తించి వారి స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీశెట్టి కృష్ణ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి , పెన్ పవర్
లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సామాన్య, పేద వారిని ఆదుకోవడంలో ప్రతి ఒకరు చొరవ చూపాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాద్ బాబు పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో శనివారం పేదలకు అరటి పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ప్రజలను ఆదుకునేందుకు సహకరించాలని కోరారు. కే. శ్రీనివాసరావు, ఎన్. అప్పారావు, సుబ్రహ్మణ్యం, నారాయణరావు, చరణ్, భవాని తదితరులు పాల్గొన్నారు.
మోడీ ప్యాకేజీ ఓ బూటకం
అనకాపల్లి , పెన్ పవర్
ప్రధాని మెాడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక పేకేజీ వట్టి బుాటకమని అనకాపల్లి అసెంబ్లీ నియెాజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఐ.ఆర్.గంగాధర్ విమర్శించారు.శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకి కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం 82వ వార్డు లో నిర్వహించారు. ఈ సందర్బంగా గంగాధర్ మాట్లాడుతుా దేశంలోకి కరోన మహమ్మారి ప్రవేశించి సుమారు రెండు నెలల అవుతుందన్నారు. ఈ కాలంలో ముాడు దఫాలు లాక్ డౌన్ ప్రకటించారని, దేశప్రజలు ఐక్యంగా ఏకతాటిపై నిలబడి కరోన మహమ్మారిని దేశం నుండి తరిమివేయాలని చెప్పి నమ్మించారని అన్నారు.దేశ ప్రజలు మెాడి పిలుపుకి కట్టుబడి నేటి వరకు ఉన్నారని అన్నారు. వైద్యులకు సరైన సదుపాయాలు కల్పించలేదని అన్నారు. దేశంలో పేదరికం , నిరుద్యోగం పెరుగుపోయిందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వలస కుాలీల,దినసరి కుాలీల కష్టాలను ఏ మాత్రం లెక్క చేయటంలేదని విమర్శించారు.అంకెల గారఢీతో ప్రజలను నమ్మించాలని బిజెపి ప్రభుత్వం చుాస్తుందని అన్నారు.అబద్దాలు చెప్పి ఎంతో కాలం ప్రజలను మెాసం చేయలేరని అన్నారు.దేశంలో ఉన్న పేదల కుటుంబాలకు పది వేల రుాపాయలు చొప్పున చెల్లించాలని,విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని ,పేదల ఇంటి అద్దెలను కేంద్ర ప్రభుత్వమే చెల్లించావని గంగాధర్ డిమాండ్ చేసారు.పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 390 కుటుంబాలకు 3900 కోడిగుడ్లు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో తుట్టా రమణ,దాసరి సంతోష్,రామకృష్ణ,శేషు,రుాపేష్,మైఖేల్,కనక తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వేడుకలు
అనకాపల్లి , పెన్ పవర్
పట్టణంలో చేపల బజార్ జంక్షన్లో వేంచేసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వెదురుపర్తి సుందరయ్య (బాబి) ఆద్వర్యం లో వేడుకలు ఘనముగా జరిగాయి. పొన్నాడ విస్సు, మాతుర్తి గంగారాం, అంజి బాబు, పొన్నాడ పెదబాబు, వానపల్లి కోటి, పెదపాటి శ్రీను, కృష్ణ ,రవి, సతీష్, నాగు తదితరులు పాల్గొన్నారు.
పాలిమర్స్ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలి
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
విశాఖ నగరంలోని వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ వెదజల్లిన విషవాయువు వల్ల స్థానిక ప్రజలు 12 మంది మృతి చెందగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని వెంకటాపురం పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు దీర్ఘకాలికంగా అందించాలని ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం భారతీయ జనతా పార్టీ సైనికులు కోన మంగయ్య నాయుడు విజయ శంకర ఫణీంద్ర మాధవి చార్లెస్ కంభంపాటి సత్యనారాయణ పూరి జాల సుబ్రహ్మణ్యం తదితరులు జివిఎంసి కమిషనర్ డాక్టర్ కె సృజనకు వినతి పత్రం అందజేశారు దీనిపై కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని బిజెపి నాయకులు తెలిపారు
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
నగరంలో ఏడాది ఆస్తి పన్ను ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం మినహాయింపు ఇస్తామని జివిఎంసి కమిషనర్ సృజన అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపద్యంలో ఆస్తిపన్ను దారులకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖ జీవీఎంసీ పరిధిలో 2020_ 21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను దారులకు ఏడాది మొత్తం పన్ను ఒకేసారి చెల్లించిన వారికి ఐదు శాతం తగ్గింపు కల్పిస్తామని ఆమె అన్నారు. నగరంలో పారిశుధ్యం త్రాగునీరు పై ప్రత్యేక చేపడుతున్నామని ఆమె తెలిపారు. పాలిమర్స్ విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నామని సర్వే పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన పరిహారం బాధితులకు అందజేస్తామని సృజన ఒక ప్రకటనలో తెలియజేశారు.
మన్యంలో మారని డోలీల మోత.
రోడ్లు మృగ్యం.. ఆదివాసీలకు ప్రాణసంకటం.
ప్రభుత్వాలు మారుతున్న ఇక్కడ మారని దురాచారం.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
మన్యంలో డోలీలు మోత ఆచారం లా మారిపోయింది. ఎక్కడ ఎవరికి అనారోగ్యం చేసిన ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వైద్యం కోసం తరలించాలి అంటే డోలిలో మోయాల్సిందే.కొండల కోనల మధ్య మైళ్ల దూరం మోసుకొని ని ఆస్పత్రులకు చేరవేస్తున్నారు. సకాలంలో వైద్యం అందితే ప్రాణాలు నిలిచినట్టే లేకుంటే గాలిలో కలిసి పోవడమే. స్వాతంత్రం వచ్చి 73 వసంతాలు కావస్తున్నా శివారు గిరి పల్లెల్లో డోలీల దురాచారం ఇంకా మారలేదు. రోడ్లు లేకపోవడంతో ఆ గ్రామాల్లో ప్రజలకు జ్వరం జబ్బు వచ్చిన గర్భిణీ పురిటి నొప్పులు తలెత్తిన ఉచిత వైద్యం అందుకోవాలంటే రోగిని డోలి లో ఆసుపత్రికి తీసుకు రావాలి. వైద్యులు అందుబాటులో ఉంటే సకాలంలో వైద్యం ఉంటుంది లేకుంటే లేదు. ప్రభుత్వాలు మారుతున్నా యి గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎన్నికల్లో ప్రకటనలు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల కేటాయించిన నిధులు ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రతి మండలంలో వందల సంఖ్యలో శివారు గ్రామాల ప్రజలు రోడ్డు మార్గం లేక కొండలు పొదలు నడుచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆ గ్రామాల వైపు చూస్తే హృదయ విదారక సంఘటనలు కంట పడతాయి. హుకుం పేట మండలం తీగ వలస పంచాయితీ పనస బంధ గ్రామంలో శుక్రవారం రాత్రి చీదరి చిలకమ్మ ఆదివాసి మహిళ గర్భిణీ నొప్పులు మొదలై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వైద్య సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో పాలుపోని గ్రామస్తులు ప్రసవ వేదన అనుభవిస్తున్న చిలకమ్మ ను డో లీపై కొండలపై నుంచి నాలుగు కిలోమీటర్లు మూసుకొని రోడ్డు వద్దకు చేర్చారు అక్కడ నుంచి హుకుం పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తరలించారు. జి.మాడుగుల మండలం లువ్వాసింగ్ పంచాయతీ వంచేబు బిడ్డ పుట్ గన్నె గుంట 11 గిరిజన గ్రామాలు రోడ్డు సౌకర్యం లేక కొండల పైనుంచి నడుచుకొని రావాల్సిందే. ఆనారోగ్యానికి గురైతే డోలీలపై మోసుకు రావాల్సిందే. ఏళ్ల తరబడి అక్కడి గిరిజనుల్లో రోడ్లు నిర్మించాలని నాయకులను అధికారులను కోరుతున్నారు అయినా ఆ గ్రామాలకు మోక్షం కలగలేదు. ప్రతి ఏడాది పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు ఇతర నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది శివారు గ్రామాలకు అంచెలంచెలుగా రోడ్ల నిర్మాణం చేపడితే డోలీ మోత దురాచారం సమసి పోతుందని ప్రజా సంఘాలు మోర పడుతున్నాయి. నింగికి రాకెట్లను పంపుతున్న కాలంలో కూడా గిరిజనులుగా పుట్టిన పాపానికి ఇంకా డోలీల నే ఉపయోగిస్తున్నారు అంటే అభివృద్ధి స్పష్టమవుతోంది.
రైతు భరోసా పథకం కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజన్న దొర
మెంటాడ, పెన్ పవర్:
డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కరపత్రాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర శుక్రవారం శనివారము తమ నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మెంటాడ మండలం మండల వ్యవసాయ అధికారి మల్లికార్జున రావు మాట్లాడుతూ మెంటాడ మండలంలో వ్యవసాయ శాఖ ద్వారా చేపడుతున్న విత్తన సరఫరా, రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు మంజూరైన నిధులు, ఖరీఫ్ పంటలకు సంబంధించి ప్రణాళికలను తయారుచేసి జిల్లా అధికారులకు నివేదికను పంపించినట్లు ఏ.వో. మల్లికార్జున రావు ఎమ్మెల్యే రాజన్నదొర కు వివరించారు. ఖరీఫ్ కు అవసరమైన వరి విత్తనాలు, ఎరువులు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే రాజన్న దొర వ్యవసాయ అధికారి మల్లికార్జున రావు కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెంటాడ ఎంపీడీవో భానుమూర్తి, సాలూరు వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.
మన్యంలో మసకబారుతున్న ప్రేమ(లు)
ఆకర్షణను ప్రేమగా భావిస్తున్న యువత.
మోజు తీరాక ఎడమొహం పెడమొహం.
పోలీసులను ఆశ్రయిస్తున్న యువతులు.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
మన్యంలో ప్రేమ(లు) మసకబారుతున్నయి. ఆకర్షణకు లోనైన యువతీ యువకులు చెలిమి చేస్తున్నారు ప్రేమ అనే మైకం లో మోజు తీరాక ముఖం చాటేస్తున్నా సంఘటనలు లేకపోలేదు. అవగాహన లోపంతో మోసపోయి తేరుకున్న యువతులు పోలీస్ స్టేషన్ లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మౌనపోరాటానికి సై. అంటున్నారు. కొయ్యూరు నాతవరం జీకే వీధి హుకుం పేట మండలాల్లో యువతీ యువకుల ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి రోడ్డున పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కొయ్యూరు మండలం సింగందొర వాడు గ్రామానికి చెందిన కొర్రూ లోవ లక్ష్మి నాతవరం మండలం ఎర్ర కంపాడు మూల పర్తి వరప్రసాద్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. లక్ష్మీ పెళ్లి పేరు ఎత్తడం తో ప్రసాద్ మొహం చాటేశాడు. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితురాలు కొయ్యూరు పోలీసులను ఆశ్రయించింది. ఎస్ ఐ దాసరి నాగేంద్ర తన శైలిలో పెద్దల సమక్షంలో లోవలక్ష్మి ప్రసాదల పెళ్లి జరిపించారు. గూడెంకొత్తవీధి మండలం దామునా పల్లి పంచాయితీ గొడుగు మామిడి గ్రామంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న భీమరాజు హుకుంపేట మండలం గుచ్చరి గ్రామానికి చెందిన యువతిని ప్రేమ లో పడేశాడు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు మోజు తీరాక మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరిన పట్టించుకోలేదు. ఇటీవల వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకొని మోసపోయానని భావించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడు పై కేసు నమోదు చేయడంతో అధికారులు రాజును సస్పెండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు గిరి ప్రాంతంలో అక్కడక్కడ వెలుగు చూస్తున్నయి. స్వచ్ఛమైన మనసు కలిగిన యువత ఆకర్షణ మోజులో పడి ప్రేమకు గ్రహణం పట్టిస్తున్నారని సంఘటనలు నిర్ధారిస్తున్నాయి.అవగాహన లేక యువకులు కేసుల్లో ఇరుక్కుంటున్ననారు.
సంక్షేమంలో మేటి...అభివృద్దిలో ఘనాపాఠి
సమతూకంతో ప్రగతిని పరుగులు పెట్టించిన కలెక్టర్
జిల్లాకు వరించిన జాతీయ పురస్కారాలు
లక్షలాది మొక్కలు నాటి హరిత జవహరుడుగా ప్రసిద్ది
ప్రజల మన్ననల నడుమ రెండేళ్ల పాలన పూర్తి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విజయనగరం,
ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించి, పచ్చదనాన్ని పెంపొందించి, అభివృద్దికి బాటలు వేసి, సంక్షేమ ఫలాలను ప్రజలచెంతకు చేర్చి, ఎన్నో జాతీయ పురస్కారాలను సంపాదించి, జిల్లా ఖ్యాతిని విశ్వవీధిలో ఎగురవేశారు మన కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్, ఐ.ఏ.ఎస్. జలమే జీవనాధారం అని గుర్తించి, జిల్లా వ్యాప్తంగా వందలాది చెరువులను పునరుద్దరించిన ద్రష్ట ఆయన. నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజా శ్రేయస్సే పరమావధిగా, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆయన చేసిన కృషి అసమానం, అనితర సాధ్యం. అందుకే ఆయనను అందరూ గౌరవంగా హరిత జవహర్లాల్ అని పిలుస్తున్నారు. ఈనెల 17తో విజయవంతంగా తన రెండేళ్ల పాలనను పూర్తిచేసుకొని, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సాధించిన మన జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం......
జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ జీవితమే ఒక స్ఫూర్తి. అట్టడుగు స్థానం నుంచి జిల్లా కలెక్టర్‌గా అత్యున్నత స్థాయికి ఎదగడానికి ఆయన చేసిన కృషి, తపన ఎందరికో మార్గదర్శకం. తనను ఆదర్శంగా తీసుకొని కొందరైనా ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఆకాంక్షతో, కలెక్టర్‌తో కాసేపు అన్న వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.సంక్షేమ వసతిగృహాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులను ప్రతీ ఆదివారం తన బంగ్లాకు రప్పించుకొని, ఎదుగుదలకు చదువే మార్గమంటూ వారిలో ప్రేరణ కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వృద్దాశ్రమాలు, అనాధాశ్రమాలకు వెళ్లి, వారితో మమేకమై, వారిని అప్యాయంగా పలకరించి కష్టసుఖాలు తెలుసుకొనేవారు. ఇలా సెలవు రోజుల్లో కూడా ఆయన సమయాన్ని ప్రజలకోసమే వెచ్చించారు. ప్రమాదానికి గురై, రోడ్డుపై బోల్తాపడ్డ ఒక ఆటోను చూసి తక్షణమే తనవాహనంలోనుంచి క్రిందికి దిగి స్వయంగా జనంతో కలిసి ఆటోను పైకిలేపి, గాయపడ్డవారికి సపర్యలు చేసి తనలోని మానవతను చాటుకున్నారు. జిల్లాకు అత్యున్నత అధికారి అయినప్పటికీ, ఒక సామాన్య వ్యక్తిలా ఆర్టిసి కాంప్లెక్స్ నుంచి కుమారుడితో కలిసి ఆటోలో తన బంగ్లాకు చేరుకున్న సంఘటన హరి జవహర్లాల్ నిరాడంబరతకు నిదర్శనం. సృజనాత్మకతకు మారుపేరు మన జిల్లా కలెక్టర్. ఆయన పాలనలో కలికితురాయిగా నిలిచింది స్పందన భోజన పథకం. పేదల కష్టాలు విని చలించిపోయిన జిల్లా కలెక్టర్, కలెక్టరేట్‌కు వచ్చేవారి నుంచి అర్జీలను స్వీకరించడమే కాకుండా, వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలన్న ఆశయంతో రూపుదాల్చింది ఈ ఆదర్శనీయ పథకం. కేవలం దాతల విరాళాలతోనే నేటికీ విజయవంతంగా నడుస్తున్న ఈ పథకం క్రింద, స్పందన కార్యక్రమంలో వినతులు ఇవ్వడానికి వచ్చిన వారందరికీ రూ.10కే కడుపు నిండా భోజనం పెడుతున్నారు. దివ్యాంగులు, గర్భిణిలకు పూర్తిగా ఉచితంగానే భోజనాన్ని పెడుతుండటం విశేషం. ఇప్పటి వరకు సుమారు 15 వేల మందికి సంతృప్తిగా రుచికరమైన భోజనాన్ని అందించారు. దీనికోసం తన బంగ్లాలో ప్రకృతి సేద్యం ద్వారా కూరగాయలను పండించి, ఉచితంగా ఈ పథకానికి సరఫరా చేస్తుండటం కలెక్టర్ ఔదార్యానికి, చిత్తిశుద్దికి నిదర్శనం. గతమెంతో ఘనకీర్తిగల విజయనగరానికి, నాటి ఘనతను నేటి తరానికి నిరంతరం గుర్తు చేసి, వారిలో స్ఫూర్తిని నింపడానికి పట్టణంలో పలు చోట్ల సైన్బోర్డులను ఏర్పాటు చేయించారు కలెక్టర్. మన విజయనగరం, విద్యలనగరం, హరిత విజయనగరం, క్రీడల నగరం-విజయనగరం, సాంస్కృతిక విజయనగరం తదితర బోర్డులను ఏర్పాటు చేశారు. పట్టణాన్ని చెత్తరహిత నగరంగా మార్చి స్వచ్ఛ విజయనగరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేశారు. స్వయంగా తాను ఒక డాక్టర్ కావడంతో, జిల్లా ప్రజల అవసరాలను గుర్తించి, జిల్లా కేంద్రానికి ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేయించుకున్నారు.మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు అంటే జిల్లా కలెక్టర్‌కు అపారమైన మక్కువ. వాటిని పునరుద్దరించడానికి ఈ రెండేళ్లూ ఆయన పడిన తపన అంతా ఇంతా కాదు. ఘన చరిత్ర గల మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలను దాని ప్రాభవం దెబ్బతినకుండా పునర్నిర్మించి, చరిత్రలో తన పేరును కూడా లిఖించుకున్నారాయన. ఘనంగా వందేళ్ల ఉత్సవాన్ని నిర్వహించి నాటి కళావైభవాన్ని కళ్లముందుకు తెచ్చారు. అలాగే మహాకవి గురజాడ స్వగృహాన్ని పునరుద్దించింది కూడా ఈ రెండేళ్ల కాలంలోనే. విజయనగరం ఉత్సవాలను, పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాన్ని విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కీర్తిని ప్రపంచ దేశాల్లో చాటిన ఘనత హరి జవహర్లాల్కే దక్కింది. 2018లో జరిగిన పేరిస్ పీస్ ఫోరమ్‌లో ఆయన దేశం తరపున ప్రాతినిధ్యం వహించి, ప్రకృతి సేద్యంపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది. ప్రకృతి సేద్యంలో పాఠాలు నేర్చుకోవాడినికి విదేశాలనుంచి జిల్లాకు రప్పించడం ద్వారా జిల్లా ఖ్యాతిని, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేశారు. రాష్ట్ర గవర్నర్‌ను జిల్లాకు తీసుకువచ్చి, ప్రభుత్వ పథకాలను చూపించి, ఆయన చేత సెభాష్ అనిపించుకున్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీసుకొని వచ్చి, ఆయన చేతులమీదుగా జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు చేసిన ఏర్పాట్లు, రాష్ట్ర ఉన్నతాధికారులనుంచి ప్రశంసలను అందుకున్నాయి. సాలూరు, గుమ్మలక్ష్మీపురం వద్ద గిరిజన గర్భిణీలకోసం ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచారు.
కలెక్టర్ హరి జవహర్లాల్ హయాంలో విజయనగరం జిల్లా దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును సాధించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పలు పథకాలు, కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు జరిపి పురస్కారాలను సాధించారు. పోషణ్ అభియాన్ పథకం అమల్లో జిల్లాకు జాతీయ అవార్డు దక్కింది. ఎక్స్టెండెడ్ గ్రామ స్వరాజ్ అభియాన్, కృషి కల్యాణ్ అభియాన్ కార్యక్రమాలు అత్యద్భుతంగా అమలైన నీతి అయోగ్ జిల్లాల్లో మనం కూడా ఒకటిగా నిలిచి, కేంద్ర ప్రభుత్వ ప్రశంసలను అందుకున్నాం. అలాగే ఇటీవలే ఒకేసారి మూడు స్కోచ్ అవార్డులు కూడా జిల్లాకు వరించాయి. గ్రామీణ ఉపాధిహామీ పథకం అమల్లో కూడా జిల్లా అవార్డుల పోటీకి నామినేట్ అయ్యింది. రక్తదానానికి ప్రజల్ని చైతన్య పరచడంలోఆయన ఎప్పుడూ ముందుంటారు. సేవ్ బ్లూ అంటూ నీటి వనరులను పరిరక్షించడం, స్ప్రెడ్ గ్రీన్ అంటూ పచ్చదనాన్ని పెంపొందించడం, డొనేట్ రెడ్ అంటూ రక్తదానానికి ప్రోత్సహించడం జిల్లా కలెక్టర్ ముఖ్య నినాదాలు. దాని ఫలితంగానే రక్తదానంలో జిల్లాకు తొలిసారిగా రెడ్‌క్రాస్ అవార్డు వరించింది. నవరత్నాలు వంటి రాష్ట్రప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూనే, జిల్లా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా రూపొందించి అమలు చేయడానికి జిల్లా కలక్టర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో తొలినుంచి జిల్లా మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన జిల్లాల్లో విజయనగరం జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవడం విశేషం. ఓటర్లను చైతన్యపరిచేందుకు జిల్లా కలెక్టర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ద కారణంగా ఈ అరుదైన ఘనతను సాధించాము. డాక్టర్ వైఎస్ఆర్ కంటివెలుగు, కాపు నేస్తం పథకాల అమల్లో రాష్ట్రంలోనే ప్రధమ స్థానాన్ని సాధించాం. పిఎం మాతృత్వ వందన, వనం మనం, వైఎస్ఆర్ వాహనమిత్ర తదితర కార్యక్రమాల అమల్లో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచాము. పదోతరగతి ఫలితాల్లో జిల్లా 7వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకింది. ఈ ఏడాది పదవ తరగతి ఫలితాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేకశ్రద్ద పెట్టారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో ప్రతీనెలా తొలి మూడు స్థానాల్లో నిలుస్తున్నాం. ఇంకా నవరత్నాల అమల్లో గానీ, వైఎస్ఆర్ నవశకంలోగానీ విజయనగరం జిల్లాను తొలి రెండు మూడు స్థానాల్లో నిలపడం కలెక్టర్ గొప్పదనంగా పేర్కొనవచ్చు. జిల్లా పచ్చదనంతో కళకళలాడేలా, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఘనత కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్దే. ఆయన స్వయంగా తన చేతులతోనే వేలాది మొక్కలు నాటారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలు నుంచి 7 గంటలు వరకూ హరిత యజ్ఞాన్ని కొనసాగించారు. ఆయన స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా సుమారు కోటి 40 లక్షల మొక్కలు వేళ్లూనుకొని చిగురించాయి. కేవలం విజయనగరం పట్టణంలోనే సుమారు రెండు లక్షల మొక్కలను నాటారంటే, ఈ కార్యక్రమం ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే వనం-మనం కార్యక్రమంలో కూడా మన జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న వాతావరణ మార్పులు, అహ్లాదరకమైన పరిశరాలు హరిత యజ్ఞం ఫలితమేనని చెప్పవచ్చు దార్శనికతకు మారుపేరుగా నిలిచే హరి జవహర్ లాల్, జలంతోనే జగత్ ముడిపడి ఉందని భావించారు. అందుకే మనవూరు - మనచెరువు పేరుతో చెరువుల శుద్దికి శ్రీకారం చుట్టారు. దుర్ఘంధంతో కంపుకొట్టి, ముళ్లపొదలు పెరుకుపోయి, చెత్తచెదారాలతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన చెరువుల సముద్దరణకు ఆయన నడుం బిగించారు. చిటికేస్తే పలికే అధికార యంత్రాంగం తన చెప్పుచేతల్లో ఉన్నప్పటికీ, తన అధికారాన్ని, దర్పాన్ని ప్రక్కనబెట్టి, చెరువుల శుధ్దికి ఆయనే స్వయంగా ముందుకు నడిచి స్వచ్చ సేవను ప్రారంభించారు. స్వయంగా కాలువల్లో, చెరువుల్లో దిగి చెత్తా చెదారాలను వెలికి తీశారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్న వందలాది స్వచ్ఛంద సంస్థలు, వేలాదిమంది యువత చెరువు శుద్ది కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజా భాగస్వామ్యంతో వందల చెరువులు ఇప్పడు కొత్తరూపును సంతరించుకున్నాయి. అహ్లాదంగా మారి పార్కులను తలపిస్తున్నాయి.విజయనగరం పట్టణ నడిబొడ్డున ఉన్న అయ్యకోనేరే దీనికి పెద్ద ఉదాహరణగా పేర్కొనవచ్చు. జిల్లా కలెక్టర్‌గానే కాకుండా, విజయనగరం కార్పొరేషేన్ స్పెషల్ ఆఫీసర్ గా ఆయన జిల్లా కేంద్రం రూపురేఖలను మార్చేందుకు సాయశక్తులా కృషి చేశారు. జిల్లాకు తలమానికమైన కలెక్టరేట్ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. భవనాలకు కొత్త సొబగులు అద్దారు. పట్టణంలో రోడ్ల విస్తరణను చేపట్టి, విశాలంగా మార్చారు. నగరానికి సైన్‌బోర్డులతో కొత్తగా తోరణాలు కట్టారు. పెద్దచెరువు చుట్టు అభివృద్దికి శ్రీకారం చుట్టారు. మరెన్నో పార్కులను అభివృద్ది చేశారు. కరోనా మహమ్మారికి ప్రపంచమంతా గజగజలాడుతున్న సమయంలో, ఈ అంటువ్యాధి ప్రభలకుండా జిల్లాను దాదాపు 45 రోజులపాటు సంరక్షించారు. చివర్లో వలస కూలీలను జిల్లాకు అనుమతించకపోయి ఉన్నట్లయితే, నేటికీ విజయనగరం జిల్లా గ్రీన్ జోన్లోనే ఉండేదని చెప్పడంలో సందేహం లేదు. తాను స్వయంగా జిల్లాకు సర్వోన్నతాధికారి అయినప్పటికీ ఏమాత్రం బేషజాలు లేకుండా అటు అధికారులతో గానీ, ఇటు సామాన్య ప్రజలతో గానీ కలిసిపోవడం అలవాటు. హాస్టల్ విద్యార్దులు, పేద విద్యార్దుల సంక్షేమంపై ఆయన ఎంతోశ్రద్ద వహించారు. సంక్షేమ వసతి గృహాల్లో మెనూను తనిఖీ చేసేందుకు స్వయంగా విద్యార్దులతో కలిసి నేలపై కలిసి కూర్చొని సహపంక్తి భోజనం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రతిఒక్కరినీ పేరుపెట్టి అప్యాయంగా పిలవడం ఆయన నైజం. సమష్టి తత్వాన్ని అలవాటు చేసి, జిల్లా యంత్రాంగాన్ని ఒక కుటుంబంలా ముందుకు నడిపించారు. ఇటు అధికార యంత్రాంగానికి, అటు ప్రజా ప్రతినిధులకు మధ్య చక్కని సమన్వయాన్ని ఏర్పరిచడమే కాకుండా, ప్రజా ప్రతినిధుల సలహాలను, సూచనలను అనుగుణంగా పాలనారథాన్ని ముందుకు నడిపించారు. అందుకే ఆయన విజయవంతమైన కలెక్టర్‌గానే కాకుండా, ఒక ఆదర్శనీయమైన వ్యక్తిగా కూడా ఇటు ప్రజా ప్రతినిధుల మన్ననలను పొందడమే కాకుండా, సామాన్య జనం అభిమానాన్ని కూడా చూరగొన్నారు.
76 వార్డు లో కొనసాగుతున్న కాయగూరలపంపిణీ
గాజువాక :కరోనా మహమ్మారి ప్రజలెవ్వరికి సోకకుండా అహర్నిశలు కష్టపడి శానిటరీ సిబ్బంది అందిస్తున్నా సేవలకు నియోజక వర్గ ప్రజలందరి తరుపునుండి పేరుపేరున ప్రతి ఒక్క శానిటరీ సిబ్బందికి హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు . గురువారం జీవీఎంసి 76 వ వార్డు వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో పెదగంట్యాడ డంపింగ్ యార్డులో విధులు నిర్వహిస్తున్న సుమారు 150 మంది శానిటరీ సిబ్బందికి అలాగె వార్డులో విధులు నిర్వహిస్తున్న శానిటరీ సిబ్బందికి కాయగూర్ల పంపిణి చేపట్టారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసీపి జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు తిప్పల వంశిరెడ్డి పాల్గొని కార్మికులకు కాయగూరలు పంపిణి చేశారు . ఈ సంధర్భంగా వంశీరెడ్డి మట్లాడుతూ ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ కరోనా రక్కసినీ నియంత్రించాలంటే ప్రతి ఒక్కరూ స్వీయనిర్బంధం పఠించాలని చెప్పేరు . అత్యవసర సమయంలో బయటకి వస్తే తప్పనిసరిగ మాస్క్ లు ధరించి భౌతిక దురాన్ని పఠించాలని కోరారు . ఇటువంటి క్లిష్టపరిస్థులలో వార్డు ప్రజలకు అండగ నిలిచి సహాయసహకరాలందిస్తున్న దొడ్డి రమణను అభినందించారు . దొడ్డి రమణ మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల వార్డులో ప్రజలెవ్వరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సుమారు నెల రోజులనుండి వార్డులో ఉన్న అన్ని కోలనీలలో గడపగడపకు వెల్లి నిత్యవసర సరుకులు , బియ్యం , కూరగాయలు అందిస్తున్నామని చెప్పేరు . ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఎస్ ఎస్టి అధ్యక్షుడు మార్టిపూడి పరదేశి , నక్క వెంకటరమణ,పిట్టా రెడ్డి నాగార్జన్,రాజు,తాటికొండ అచ్చత్,కాకినాడ పెంటరావు,ములకలపల్లి వెంకటేష్,నాని,బాలాజీ, అండిభోయిన సన్నీ,ఎస్.ఆనంద్,బాబురావు,సంతోష ,సానిటర్ సుపర్వేజర్ నరిసింగరావు తదితరులు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు
ముాలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా రాష్ట్రంలో విద్యత్ చార్జీల మోత ప్రజలపై పెను భారం మెాపిందని అనకాపల్లి అసెంబ్లీ నియెాజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఐ.ఆర్.గంగాధర్ విమర్శించారు.గురువారం గాంధీనగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు నెలలుగ స్వీయ నిర్బంధంలో ప్రజలు ఉంటు జీవనోపాధి లేక అల్లాడుతున్నారని అన్నారు.ఈ పరిస్థితిలో రెండు నెలల రీడింగ్ సేకరించటం ద్వారా అధిక మెుత్తంలో విద్యుత్ చార్జీలు వసుాలు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని గంగాధర్ అన్నారు.విద్యుత్ చార్జీల పెంపు పై పునరాలోచన చేయాలని కోరారు. లాక్ డౌన్ విధించిన నాటి నుండి ఇంటికే పరిమితమైన రోజువారీ కుాలీలకు,చిరు వ్యాపారులకు కుటుంబానికి 10 వేల రుాపాయలు చొప్పున కరువు భృతి చెల్లించాలని గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.పేదల అద్దె ఇంటి బకాయలను కుాడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని కోరారు.ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ కన్వీనర్ తుట్టా రమణ,జిల్లా యుాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
మైనార్టీ మహిళలకు ఆర్ధిక సహయం అందించిన దామా సుబ్బారావు
ఫకీర్ తఖ్యాకి చెందిన ముస్లీం మైనార్టీ మహిళలకు పవిత్రమైన రంజాన్ పండగ సందర్భంగా బియ్యం, కూరగాయలతో పాటు ఆర్ధికంగా సహయం చేసారు 86వ వార్డు వైసీపీ అభ్యర్ధీ దామా సుబ్బారావు , కార్యక్రమంలో రాజ్ కుమార్ ఆచార్య, బాబు, చెగొండి శ్రీను, నిర్మలమ్మ, మాటూరి శ్రీనివాస్ , నజీర్ , బార్ సాయి, భూపతిరాజు శ్రీనివాస్ రాజు, గుండాసు రాజు, అల్లాఉద్ధీన్ , మండవ మోహన్ , చిట్టి దేముడు, జీవన్ , హరీష్ వర్మ, అనీష్ తదితరులు పాల్గున్నారు
అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసరాలు, బట్టలు, చీరలు,దుప్పట్లు పంపిణీ:
శాసన మండలి ప్రతిపక్షనేత, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కాకినాడ లోని ఆయన స్వగృహం లో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. తుని నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ యనమల కృష్ణుడు , జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మండల మాజీ ఎంపిపి అడబాల బాబ్జి , జిల్లా ఆత్మకమిటి డైరెక్టర్ పిల్లా వీరవెంకట్రాజు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
మండపేట రామచంద్రపురం నియోజకవర్గం ఇతరమండలాలనుండి వలస కూలీలు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామంలో బట్టీ పని చేయడానికి అనేక కుటుంబాలు వలస వెళ్లాయి అయితే లాక్ డౌన్ తో గత నలభై రోజులుగా అక్కడ చిక్కుకుపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యంతో మండపేట ఏడిద రోడ్ లో ఉన్న విజయ ఫంక్షన్ హాల్ 157 మంది బాధితులు వచ్చారు భారతీయజనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు వేమా ఆదేశాలతో అమలాపురం పార్లమెంటు క్వారంటైన్ విజిటర్స్ టీమ్ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్ కోనసత్యనారాయణ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వీరందరికీ బుధవారం రక్త పరీక్షలు తీసుకున్నారని అలాగే తమకు ఇక్కడ వసతి సదుపాయాలు బాగానే ఉన్నాయని బాధితులు తెలిపారు మీరందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించాలని ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాతానని వారికి హామీ ఇచ్చారు. అలాగే రాయవరం మండలం రాయవరం గ్రామంలో హై స్కూల్ వద్ద 72 మందిని త్రిపురాంతకం గ్రామంనుండి రామచంద్రపురం , కే గంగవరం అనపర్తి కపిలేశ్వరపురం రాయవరం బిక్కవోలు తాళ్ళరేవు మండలాల కుటుంబాలు ఈ రెండు చోట్ల ఉన్నారని వీర్ని యోగ క్షేమాలు తెలుసుకున్నారు ఆయన వెంట మండపేట అద్యక్షులు మద్దుల సుబ్బారావు, రాయవరం మండల అధ్యక్షులు చింతా అమ్మిరెడ్డి నాగిరెడ్డి త్రిమూర్తులు పాల్గొన్నారు
క్వారంటైన్ కేంద్రాల్లో నాణ్యమైన భోజన సదుపాయాలు
- చేతులు కడిగే అలవాటును ప్రోత్సహించాలి
కేంద్రాల నిర్వహణపై అప్రమత్తంగా వుండాలి
-ఒక కేంద్రంలో వుండే వారందరికీ ఒకేసారి పరీక్షలు జరపాలి
జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్
విజయనగరం,
: జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వారికి నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. ప్రతి కేంద్రం లోను పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యెక శ్రద్ధ చూపాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ మాస్క్ లు అందజేయడం తో పాటు ప్రతి ఒక్కరు కేంద్రాల్లో వుండే సమయంలో భౌతికదూరం పాటిస్తూ సంచరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ, వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేసారు. ఈ కేంద్రాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారిని పలు తరగతులుగా వర్గీకరించి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు పరీక్షలు చేపట్టాలన్నారు. గ్రీన్ జోన్ నుండి వచ్చే వారిని ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి వీరికి క్వారంటైన్ కేంద్రంలో చేరిన వెంటనే పరీక్షలు జరిపి నెగటివ్ గా నిర్ధారణ జరిగాక హోం క్వారంటైన్ కు పంపించవచ్చని పేర్కొన్నారు. ఆరంజ్, రెడ్ జోన్ ల నుండి వచ్చే వారిని కొద్ది రోజులపాటు కేంద్రంలో ఉంచిన తర్వాత వారికి పరీక్షలు జరిపి ఇంటికి పంపించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిని కుడా ఆయా రాష్ట్రంలో కరోనా కేసుల ఆధారంగా కేంద్రంలో కొన్ని రోజుల పాటు ఉంచిన తర్వాత పరీక్షలు జరిపించాలని సూచించారు. ఎక్కువ రోజులుగా కేంద్రాల్లో ఉంటున్న వారికి తొలుత పరీక్షలు జరిపి వారిని పంపించాలని చెప్పారు. ఒక కేంద్రంలో వుండే వలస కులీలందరికీ ఒకేసారి పరీక్షలు జరపాలని చెప్పారు. ఆయా మండలాల వైద్యాధికారులు, ప్రొగ్రమ్ అధికారులు ఆయా కేంద్రాల్లో తహసీల్దార్లతో చర్చించి టెస్ట్ లు జరపాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు నోడల్ అధికారులుగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామరాజు, ఎస్.సి.కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ జి.జగన్నాధంలను నియమించామన్నారు.
త్వరలో జిల్లా కేంద్రాలకు రైట్ రైట్..
భౌతిక దూరంతో సిద్దం అవుతున్న బస్సులు.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవన్)
త్వరలో జిల్లా కేంద్రాలకు బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాట్లు చేస్తుంది.కోవిడ్_19 ఆంక్షలు నిబంధనలు పాటిస్తూ ప్రజా రవాణాకు బస్సులు నడపాలని నిర్ణయించుకుంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రవాణా స్తంభించిపోయింది. ఒకవైపు కరోనా మహమ్మారి విలయ తాండవం ఆడుతుంది. ప్రజలను కట్టడి చేస్తూ అంచలంచలుగా రవాణా వ్యవస్థను నడపాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశలో జిల్లా కేంద్రాలకు పరిమితి స్టాఫ్ లతో ఆల్ట్రా డీలక్స్ శమీ లగ్జరీ సర్వీసులను నడపనున్నారు ఆర్టీసీ బస్సులో కరోనా నిబంధనలు అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మునుపటి వలె బస్సు రాగానే గొఱ్ఱెల మందల ఎక్కి పోవటానికి వీలులేదు. కౌంటర్ లో టికెట్లు తీసుకుని ఎవరి సీట్లో వారు కూర్చోవడానికి వీలు కల్పిస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో మూడు వరుసల సింగిల్ సీట్లను ఏర్పాట్లు జరుగుతున్నాయి . ఆల్ట్రా డీలక్స్ లో మూడు సీట్లలో మధ్య సీట్లను నిర్వహిస్తున్నారు ఇద్దరు సీట్లలో ఒక సీటు కె అవకాశం ఇస్తున్నారు. కూర్చునే సీట్లకు నంబర్లు వేస్తున్నారు మినహాయించిన వాటికి ఇంటూ మార్క్ వేస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే జిల్లా కేంద్రాలకు ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...