Followers

ఆశీలు పేరుతో నిలువు దోపిడీ..


ఆశీలు పేరుతో నిలువు దోపిడీ..

 

లీలాకృష్ణ జోక్యంతో అడ్డుకట్టు..

 

మండపేట, పెన్ పవర్ : 

 

మండపేట పట్టణంలో ఆశీల పేరుతో ఆశీలు వసూలు చేసే దళారీలు వర్తకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మండపేట పట్టణంలో రోజు వారీ తోపుడు బండ్లు, సంచార  వర్తకులు వివిధ ప్రాంతాల నుండి మండపేట పట్టణానికి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. పురపాలక సంఘం ఆశీల పాట దారుడు వీరి వద్ద నుండి కేవలం పది రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. అయితే లాక్‌డౌన్‌ ను అదునుగా చూసుకొని 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. మామిడి కాయల సీజన్ కావడంతో మామిడికాయల వ్యాపారుల నుండి వినియోగదారులు పచ్చడి కోసం మామిడి కాయలు కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న మహిళల వద్దకు వెళ్లి మామిడి కాయలను పచ్చడి బద్దలుగా తరిగించు కోవడం జరుగుతుంది. దళారీల ముసుగులో ఉన్న ఆశీలదారులు మామిడికాయల వర్తకులను, పచ్చడి బద్దలు కోసే మహిళల వద్ద నుండి కూడా చెరొక 30 రూపాయలు వసూలు చేయడంతో మామిడి కాయల వ్యాపారాలు గగ్గోలు పెడుతూ ఈ విషయాన్ని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వేగుళ్ల లీలా కృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై గురువారం ఉదయం వేగుళ్ల లీలా కృష్ణ మార్కెట్ కు చేరుకుని వర్తకులను అడిగి ఆశీల దోపిడి విధానాన్ని తెలుసుకున్నారు.  వెంటనే ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్  దృష్టికి తీసుకురాగా ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్  ప్రభాకర్ ను విచారణకు ఆదేశించారు. ఆర్ ఐ ప్రభాకర్ చౌదరి మామిడికాయల వర్తకులతో మాట్లాడుతూ పది రూపాయలకు మించి వసూలు చేయరాదన్నారు. రసీదు లేకుండా అధిక వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయమన్నారు. ఆపై వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆశీలకు  తగిన రసీదులు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట  జన సేన నాయకులు శెట్టి రవికుమార్, గోళ్ళ శ్రీనివాస్ ,  కోనాల చంద్ర బోస్, బొమ్మన సతీష్ కుమార్ తదితరులున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...