Followers

జర్నలిస్టుల సంక్షేమం గురించి పట్టించుకోండి


జర్నలిస్టుల సంక్షేమం గురించి పట్టించుకోండి

 

 

 జగ్గంపేట, పెన్ పవర్ 

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం పట్టించుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి ప్రసాద్ అన్నారు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ది లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించి ఇప్పుడిప్పుడే సడలింపు లతో రోడ్ ఎక్కుతున్నారు అయినప్పటికీ కరోనా వ్యాప్తి ఆగలేదు రికార్డులు బద్దలు కొట్టి మరి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి ప్రపంచం నలుమూలల ఏమి జరుగుతుందో ప్రజలు టీవీ పేపర్లో ద్వారా తెలుసుకుంటారు టీవీల దగ్గర కూర్చుని మరీ తెలుసుకుంటారు పత్రికలు చదువుకుంటూ పరిస్థితులను విశ్లేషించుకుంటూన్నారు కరోనా కోసం కష్టపడి పని చేసేటటువంటి అధికారులకు ప్రభుత్వం నుండి వేతనాలు అందుతున్నాయి తగిన గుర్తింపు ప్రజల నుండి ప్రశంసలు వస్తున్నాయి వారి అందరితో పాటు ఈ కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ లో నిలబడి సమాచార సేకరణసేచి దేశప్రజలకు అందించే దేశవ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కు తీవ్ర నష్టం వాటిల్లింది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ప్రకటించిన లెక్కల ప్రకారం ఇప్పటికే 4వేల 500 కోట్లు మేరకు ప్రకటన రూపంలో దినపత్రికలు ఆదాయం కోల్పోయిన ఈ కరోనా సంక్షోభం నుండి దేశం పూర్తిస్థాయిలో బయటపడే టప్పటికి  పదిహేను వేల కోట్ల మేరకు నష్టాలు ఉంటాయి ఈ లెక్కన 15వేల పత్రికల నష్టం చూస్తే దాదా పు 40 వేల కోట్ల పై మాటే దేశవ్యాప్తంగా మీడియాలో ప్రత్యక్షంగా మూడు లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఉన్నాయి పెద్ద పత్రికలు ఇప్పుడే వేల సంఖ్యలో సబ్ ఎడిటర్లు రిపోర్టర్లు డిజైనర్లు అడ్వటైజ్మెంట్ డిపార్ట్మెంట్ సిబ్బందిని తొలగిస్తున్నాయి మరికొంత మంది సిబ్బంది తో నడుస్తున్న పత్రికలు వేలాదిగా ఉన్నాయి చిన్న పత్రికల విషయానికొస్తే 10 నుండి 20 మంది సిబ్బందితో నడుస్తున్న పత్రికలు వేలాదిగా ఉన్నాయి ఇవన్నీ దాదాపుగా కరోనా వాగ్దానం మొదలైనప్పటి నుండి ప్రింటింగ్ నిలిపివేసి కేవలం పి.డి.ఎఫ్ కాపీ ని వాట్సాప్ గ్రూపు లో  పెట్టడానికి పరిమితమయ్యాయి పలు చిన్న పత్రికలు డిజైనర్లు సిబ్బందికి జీతాలు లేక పి.డి.ఎఫ్ కాపీ కూడా నిలిపివేస్తున్నారు యాజమాన్యాల ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులు సంక్షేమానికి వారు చర్యలు తీసుకోవడం లేదని గగ్గోలు పెట్టలేని పరిస్థీతిలో జర్నలిస్టు ఉన్నారు ఇటువంటి తరుణంలో ప్రభుత్వాలు ఏమైనా కనికరిస్తాయా అని జర్నలిస్టులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు ఈ కష్టకాలంలో జర్నలిస్టులకు నెలకు 10,వేలు ఆర్థిక సహాయం అందించాలి హర్యానా ప్రభుత్వం పది లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటిస్తే తమిళనాడు ప్రభుత్వం మూడు వేల చొప్పున ఆర్థిక సహాయం చేసింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల సమస్యల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు జర్నలిస్టులకు ఎక్కడ ఏమి ఒరిగిందేమీ లేదు అక్కడ అక్కడ ఒక బియ్యం మూట కూరగాయలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసి జర్నలిస్టులను అవమానిస్తున్నారు ప్రభుత్వ గౌరవప్రదంగా ఆదుకునేది లేదు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకం గడువు ముగిసి నెలరోజులు పైబడింది కరోనా కష్టకాలంలో జర్నలిస్టులు ప్రీమియం చెల్లించాలి జర్నలిస్టులను కర్వేపాకు మాదిరిగా తీసిపారేస్తున్నాయి  ప్రభుత్వాలు తెల్లారిలేస్తే ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు ప్రసారం కావాలి ఆ ప్రచారం చేసే జర్నలిస్టులకు మాత్రం భద్రత ఉండదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు 10 వేలు ఆర్థిక సహాయం అందించాలని పులి ప్రసాద్ అన్నారు .

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...