Followers

మార్కాపురంలోకరోనా తొలి మరణం


మార్కాపురంలోకరోనా తొలి మరణం



 పెరిగిన   కరోనా పాజిటివ్ కేసులు


మార్కాపురం,



 అప్రమత్తమైన  పోలీస్ శుక్రవారం రాత్రిచనిపోయిన  సఖిల్ విష్ణు అను అతను  మహారాష్ట్రకు చెందిన వారు  గత 45 సంవత్సరాల నుంచి మార్కాపురం  పట్టణంలో బంగారం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు సదరు సఖీల్ విష్ణు గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా మార్కాపురం పట్టణం లోని కృష్ణా రెడ్డి హాస్పిటల్ నందు చికిత్స చేయించుకో గా జ్వరం తగ్గింది మళ్లీ గత రెండు రోజుల నుండి ఆయాసం దగ్గుతో బాధపడుతుండగా ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిటల్ తీసుకెళ్లగా వాళ్ళు రిమ్స్ కి వెళ్ళమని సూచించడంతో రిమ్స్ లో అడ్మిట్ చేసినారు రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందినాడు చికిత్స సమయంలో కరోనా టెస్ట్ చేసి ఉన్నారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్ళమని సూచించడంతో అంబులెన్స్లో తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో మృతునికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని మార్కాపురం పట్టణంలో ని కి రానియవద్దని ఒంగోలు రిమ్స్ నుండి డాక్టర్లు పోలీస్ ఆఫీసర్లకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి డాక్టర్లకు చెప్పడంతో వారిని ఊరు బయట ఉన్న బోడపాడు రోడ్లో ఆపి వేసినారు ఆ తర్వాత సదరు విష్ణు యొక్క దహన సంస్కరణ గుండ్లకమ్మ వాగు పక్కన ఉండే స్థలంలో జెసిబి ద్వారా 04.00 గంటలకి గుంత తీసి పూడ్చి వేయడం జరిగింది   పట్టణంలో   శుక్ర శనివారాల్లో   30 కేసులు రావడం  ఒకరు మరణించడంతో  కలకలం రేగింది.    దీంతో     పట్టణంలో  లాక్ డౌన్ నిబంధనల    న   పటిష్టంగా  అమలు పరిచేందుకు  పోలీసులు   సమాయత్తం అయ్యారు.  పట్టణం చుట్టూ    రాకపోకలు ఆంక్షలు విధించి పట్టణంలో కూడా ప్రజలు తిరగకుండా పటిష్టమైన  చేపట్టారు.   కరోనాతో  వ్యక్తి   మృతి  చెందిన విషయం  తీసుకున్న పోలీసులు    ఉదయం ఏడు గంటలకే    దుకాణాలు  మూసివేయించారు.  రహదారుల వెంట   వివిధ  ప్రాంతాలలో    పోలీసులు  పికెటింగ్లు   ఏర్పాటు చేసి  కరుణా నియంత్రణపై  ప్రత్యేక దృష్టి సారించారు.


సదరు మృతుని యొక్క కుటుంబం షేక్ మహబూబ్ బాషా కరోనా పాజిటివ్ పర్సన్ యొక్క జూలరీ షాప్ పైన ఇంటిలో రెంటుకు ఉంటారు.వారికి ఇద్దరు కుమారులు  బంగారం పని చేస్తూ ఉంటారు.వర్క్ షాప్ కూడా ఆంధ్ర జూలరీ షాప్ కి ఎదురుగా ఉంటుంది ...విరు ఆంధ్ర జూలరీషాప్ కు సంబంధించిన బంగారం పనులు కూడా చేస్తూ ఉంటారు .అందువలన మృతుని యొక్క కుమారులకు కరోనా సోకి వారి ద్వారా తండ్రికి వచ్చి ఉండొచ్చని అనుకుంటున్నారు మృతుని కుమారులకు కరోనా పాజిటివ్ టెస్ట్ చేయలేదు. వారు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ నందు కరోనా టెస్ట్ కోసం ఉన్నారు. వారి ఇంటిలో వారు 9 మంది ఉంటారు. వీరికి ట్రావెల్ హిస్టరీ కూడా లేదు 


రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్...


రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్...


(టంగుటూరు, జరుగుమల్లి) .... జరుగుమల్లి మండలం లోని నందనవనం గ్రామం నుండి  శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న కందుకూరు మండలానికి చెందిన రామనాథపురం గ్రామానికి ఇసుక తరలిస్తున్న శ్రీహరి మరియు హరిబాబు లను అరెస్టు చేసి 8 టన్నుల ఇసుకను జరుగుమల్లి పోలీస్ స్టేషన్ కి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.


వెన్నురులో  రెడ్ జోన్ అంక్షలు


ప్రకాశం కొండపి మండలం. వెన్నురులో  రెడ్ జోన్ అంక్షలు....ఎస్ఐ ప్రసాద్......


 


ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నురు పంచాయతీ లో కరోనా కేసు నమోదు అయినా నేపధ్యంలో రెడ్ జోన్ అంక్షలను ఉన్నతాధికారులు అదేశాలు మేరకు అమలు చేస్తున్నట్లు కొండేపి ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులు తో పాటు పక్కన ఉన్న వాళ్లకి. గ్రామస్తులుకు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం అన్నారు. కరోనా బాధితుడు ఎప్పుడు విజయవాడ నుంచి వచ్చాడు. ఎవరిని కలిశారు. ఎక్కడ తిరిగాడు వివరాలు సేకరిస్తున్నాం.గ్రామంలో.పంచాయతీ.వైధ్య అధికారులు సహకరంతో బ్లీచింగ్. పిచికారీ చేశాం అన్నారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకుంటాము అన్నారు.


అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తాo


అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తాo


కొత్త రేషన్ కార్డు దారులకు కూడా....m r o 


కామేశ్వరరావు..(టంగుటూరు జరుగుమల్లి) జూన్ 27... జరుగుమల్లి మండలం లోని20 పంచాయితీల పరిధిలోని అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు. రెండో విడత క్రింద 231 మంది ఇళ్ల స్థలాల కొరకు అర్జీలు మాకు అందాయని దానిలో భాగంగా పది గ్రామాల్లో భూ సేకరణ ప్రారంభించామని త్వరితగతిన పూర్తిచేసి  అర్హులందరికీ స్థలాలు కేటాయిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ మండలంలో దాదాపుగా కొత్త రేషన్ కార్డు కొరకు 181 మంది అర్జీలు పెట్టుకోవటం జరిగిందని వారికి పది రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డు అందజేయడం జరుగుతుంది అని అలాగే ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నట్లయితే రేషన్ కార్డు కు అర్జీ పెట్టుకోవాలి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శ్రీనాథ్ ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.


అక్రమ సంబంధం తో కన్న కొడుకుని చంపేందుకు యత్నం 


 


అక్రమ సంబంధం తో కన్న కొడుకుని చంపేందుకు యత్నం 


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో తన ముక్కు పచ్చలారని మూడు సంవత్సరాల కుమారుడిని  ప్రియుడు అల్లవల్లి తో కలిసి హతమార్చింది కు ప్రయత్నించిన తల్లి లక్ష్మీ బాయి   నోరు మూసి ఊపిరాడకుండా చంపే యత్నం పసిబాలుడు కేకలు వేయడంతో ఈ సంఘటన స్థలానికి వచ్చిన స్థానికులు తప్పిన ప్రాణాపాయం  బాలుడికి స్వల్ప గాయాలు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి బాలుడు తల్లిని ఆమె ప్రియుని అదుపులోకి తీసుకున్న పోలీసులు గత కొద్ది కాలం క్రితం భర్త నుండి విడిపోయిన ఒంటరిగా ఉంటున్న బాలుడి తల్లి...


వాలంటీర్ పై దాడి


వాలంటీర్ పై దాడి.                


పెన్ పవర్, వలేటివారిపాలెం


 


మండల పరిధిలోని సింగమనేని పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి గ్రామ వాలంటీర్ శివరాం పై ఇరువురు దాడిచేసి  గాయపడినట్లు శివరాం తెలిపారు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన యలమంద, రమేష్ లు రేషన్ కార్డు విషయమై,  అలాగే రేషన్ బియ్యం  విషయంలో వాదోపవాదాలు జరిగాయి. శివరాం పై భౌతిక దాడికి దిగినట్లు బాధితుడు శివరాం తెలిపారు. దీంతో గాయాలపాలైన శివరాం కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు శివరాం తెలిపారు. కందుకూరు ఏరియా వైద్యశాలకు చికిత్సకోసం వెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు సూచించగా అంబులెన్స్లో శివరాం వెళ్లారు.  కడుపు నొప్పి ఎక్కువగా ఉండటంతో పరీక్షలు చేసిన వైద్యులు మూడు రోజులు ఇక్కడే ఉండాలని ఇచ్చినట్లు శివరాం తెలిపారు. తనపై దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షించాలని శివరాం కోరారు


ప్రతి కుటుంబానికి పదివేల నష్టపరిహారం ఇవ్వాలి


ప్రతి కుటుంబానికి పదివేల నష్టపరిహారం ఇవ్వాలి.

 

ఏలేశ్వరం, 

 

రాష్ట్రంలో, దేశంలో కరోన మహమ్మారి విలయతాండవంతో లాక్‌డౌన్‌ వలన   తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ 10 వేల రూపాయలు ఇవ్వాలని ఏఐసీసీటియు కార్మికులు డిమాండ్ చేశారు. స్థానిక వినోద్ మిశ్రా నగర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకుడు కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర వైఫల్యాల వల్లే కరోనాలో భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానంకు చేరుకుందన్నారు. కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విదేశాల నుండి వచ్చిన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించి పరీక్షలు నిర్వహించకుండా విచ్చలవిడిగా వదిలేయడం వలన నేడు దేశంలో ఈ పరిస్థితులు దాపురించాయి అన్నారు. రాష్ట్రంలో కార్మికులు, పేద రైతులు, రైతు కూలీలు ఆకలితో అలమటిస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం దనబాబు, గుమ్మడి పాదాలఅమ్మ, పిల్ల కాంతం, కందుల వరలక్ష్మి తదితరులు ఉన్నారు.
 

 


అక్రమ వ్యాపారాలపై దృష్టి సారించండి






అక్రమ వ్యాపారాలపై దృష్టి సారించండి

చింతపల్లి  జూన్ 24  పెన్ పవర్

గ్రామాలలో అక్రమ వ్యాపారాలు, రవాణాపై నియంత్రించాలసిన బాధ్యత గ్రామ వాలంటీర్లు, సచివాలయ మహిళా పోలీసులతో  పాటు ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక ఎక్సైజ్ సి.ఐ సింహాద్రి అన్నారు. బుధవారం మండలంలోని లోతు గెడ్డ పంచాయతీ కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ శ్రీమతి కె ఉషశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అక్రమ గంజాయి రవాణా, నాటు సారా తయారీ, విక్రయాలు, గొలుసు మద్యం వ్యాపారాల నియంత్రణపై ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని నియంత్రించాలన్నారు.నాటు సారా సేవించడం వలన బంగారం లాంటి కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. గంజాయి విక్రయం, రవాణా వంటి వాటి వల్ల భవిష్యత్ నాశనం అవుతుం     దన్నారు .ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గిరిజనుల  ఆహారపు అలవాట్ల పై అవగాహన పెంపొందించాలన్నారు. కాచి, వడపోసిన మంచినీటిని సేవించాలని, వేడివేడి ఆహార పదార్థాల తీసుకునేలా గిరిజనులకు అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. ఇళ్ల వద్ద పశువులను ఉంచరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు. గ్రామాలలో అభివృద్ధి, సమస్యలపై దృష్టి సారించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




 

 


 



 



చల్లని వాతావరణం- -కరోనాకు అనుకూలం


చల్లని వాతావరణం- -కరోనాకు అనుకూలం

చింతపల్లి ,  పెన్ పవర్

అధిక ఉష్ణోగ్రత ఉంటే కరోనా వైరస్ వ్యాధి వృద్ధి చెందదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. విశాఖ ఏజెన్సీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకు వాతావరణం అనుకూలిస్తుంది. మంగళవారం విపరీతమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిన మన్యం వాసులకు బుధవారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం పొందారు. అయితే మధ్యాహ్నం 1గంట నుంచి విపరీతమైన కుండపోత వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. దీంతో మన్యం వాసులు కరోనా వ్యాప్తి చెందుతుందని  భీతిల్లుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం తో శరీరంలో వేడిని కలిగించే ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊట గెడ్డలన్నీ వర్షపు నీటితో కలుషితమయ్యాయి.


కొత్త రేషన్ కార్డు లు పంపిణీ రెండు రోజుల్లో పూర్తి.

కొత్త రేషన్ కార్డు లు పంపిణీ రెండు రోజుల్లో పూర్తి.

          జె.సి. ఎం. వేణుగోపాలరెడ్డి.

 

      విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రకియ  రెండు రోజులలో పూర్తిచేయనున్నట్లు జిల్లా జాయింటు కలెక్టరు  ఎం. వేణుగోపాలరెడ్డి తెలిపారు.  వారం పౌర సరఫరాల శాఖ, కమీషనరు కోన శశిధర్  జాయింటు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. రైస్ కార్డులు పంపిణీ, బయోమెట్రిక్ ఎక్నలెడ్జెమెంటు, సచివాలయాలలో 5 సేవలు, ఇంటింటికి  నిత్యావసర సరుకులు పంపిణీపై నిర్వహించిన సమీక్షలో జాయింటు కలెక్టరు మాట్లాడుతూ జిల్లాకు 11,74,568 కార్డులు వచ్చాయని, ఇంకను 1,94,243 కార్డులు పంపిణీ చేయవలసి ఉందని, 2రోజులలో పంపిణీ పూర్తిచేస్తామని తెలిపారు.  సచివాలయాలద్వారా అందిస్తున్న 5 సేవలకు సంబంధించి ఇప్పటి వరకు 17,567 ధరఖాస్తులురాగా సుమారు 10వేల ధరఖాస్తులను పరిష్కరించడమైనదని తెలిపారు. ఇంటింటికి సరుకులు పంపిణీచేయుటకు ట్రాక్టరు వెళ్లలేని వీధుల,ఇళ్లు జిల్లాలో 20 శాతం వరకు ఉన్నాయని, పూర్తి నివేదిక అందజేస్త్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సరఫరాల అదికార్లు శివప్రసాద్, నిర్మలాబాయి, సహాయ సరఫరాల అదికార్లు పాల్గొన్నారు. 

గిరిజన మహిళా ఉద్యోగిని వేదిస్తున్న డాక్టర్.


 





గిరిజన మహిళా ఉద్యోగిని వేదిస్తున్న డాక్టర్.

 

 గిరిజన ఉద్యోగ సంఘం ఆరోపణ.

 

 కోటపాడు డాక్టర్ పై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు.

 

   విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 

జిల్లాలో ని  కె.కోటపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గిరిజన మహిళా ఉద్యోగి జి ధనలక్ష్మిని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరిత  వేధింపులకు  గురిచేస్తున్నారని ఆల్ ఇండియా షెడ్యూల్ ట్రైబల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.సత్యనారాయణ ఆరోపించారు . బుదవారం ఆయన మాట్లాడుతూ గిరిజన ఉద్యోగుల పై వివక్షత చూపించి వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు . గిరిజన మహిళా ఉద్యోగి జి ధనలక్ష్మి చేతులపై ఎలర్జీ కారణంగా ఆమెకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఓ పి ఇంజక్షన్ రూమ్ జనరల్ డ్యూటీ ఆర్డర్ తెచ్చుకోవడం పై మెడికల్ ఆఫీసర్ కక్ష కట్టి వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు . నిబంధనలకు విరుద్ధంగా తమ కులస్తులు ఎఫ్ ఎం ఓ లకు ఇంజక్షన్ రూమ్ లో డ్యూటీ వేయడం కోసమే గిరిజన మహిళా ఉద్యోగిని వేధిస్తున్నారని అన్నారు . ఇటువంటి వేధింపులకు పాల్పడుతున్న మెడికల్ ఆఫీసర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.అన్న జనరల్ సెక్రెటరీ కె. శోభన్ కుమార్ , జాయింట్ సెక్రెటరీ డి .సత్యనారాయణ , వర్కింగ్ ఉమెన్స్ సెక్రటరీ డాక్టర్ గీత తదితరులు పాల్గొన్నారు .


 

 



 

కొత్తబుచ్చి రాజుపాలెం కాలనీ వాసులకు కు పైపులైను ఏర్పాటు


 


కొత్తబుచ్చి రాజుపాలెం కాలనీ వాసులకు కు పైపులైను ఏర్పాటు


టంగుటూరు, పెన్ పవర్


... మండల కేంద్రమైన టంగుటూరు బుచ్చి రాజుపాలెం లో మంచినీటి కొరత ఏర్పడటంతో అక్కడ కాలనీవాసులు సొసైటీ చైర్మన్ రావూరి అయ్యవారి అయ్యా ను ఆ కాలనీవాసులు నీటి సమస్య పై కోరగా బుధవారం సందర్శించారు. అనంతరం ఆ కాలనీ వాసులతో చర్చించి త్వరలో పైపులైను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకొని ఈ కాలానికి మంచినీటి సమస్య తీర్చే విధంగా అధికారులతో మాట్లాడి దాహార్తి తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుట్ట వెంకట్రావు రంగస్వామి స్టేట్ రవీంద్ర అనిల్ పంచాయతీ కార్యదర్శి జగదీష్ మహిళలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.


తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో నిత్యావసరాలు పంపిణీ






తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో నిత్యావసరాలు పంపిణీ

 

తాళ్ళపూడి,పెన్ పవర్:

 

తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో దాతలు ప్రతీ రోజు సాయం చేస్తున్నారు. ఈ విషయం వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకొని బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న  స్వర్గీయ రామిశెట్టి మధనగోపాలస్వామి గారి అబ్బాయి రామిశెట్టి అరవాలరాజు 100గ్రాముల టీ పొడి, కేజి పంచదార, అలాగే సిద్దంశెట్టి బాలాజీ వంకాయలు, బంగాళాదుంపలు, నిమ్మకాయలు, అల్లం, అరలీటర్ పెరుగు మాజీ సర్పంచ్ నామన పరమేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎల్లా కుమారస్వామి పాలు, మారిశెట్టి సూర్యచంద్రం గ్రుడ్లు, సిద్దంశెట్టి కృష్ణ, బండారు నాగేశ్వరరావు బిస్కెట్లు, కామిశెట్టి దుర్గారావు పెరుగు, మాంటిస్సోరి స్కూల్ అధిపతి పాలు, మాట్ల బ్రదర్స్ పాలు, కరిబండి విద్యాసంస్థలు ఆటా పిండి, ఎర్రనూక పంపిణీ చేశారు. ఈ దాతలకు కంటోన్మెంట్ జోన్లో ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


 

 


 



 

ఏపీయూడబ్ల్యూజే అనుబంధ పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు


 


ఏపీయూడబ్ల్యూజే అనుబంధ పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు.



 ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా లోకేష్ ఏకగ్రీవంగా ఎన్నిక.



పరవాడ, పెన్ పవర్


 


ఏపీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థ అయిన పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశం బుధవారం ఉదయం మరిడిమాంబ ఫంక్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు రవి (వార్త), ఆధ్వర్యంలో జరిగింది. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా సిహెచ్ లోకేష్  ను (సూర్య) గౌరవ సభ్యులు  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పల్లి శ్రీనివాసురావు(విశాలాంధ్ర), కార్యదర్శిగా పూసరపు విశ్వనాధం(విజన్), సహాయ కార్యదర్శిగా కుండ్రపు సోము నాయుడు (ఆంధ్ర పత్రిక), కోశాధికారిగా సి.హెచ్ అనిల్ కుమార్ ( పెన్ పవర్), కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ శ్యామ్ ప్రసాద్ (యంగిస్తాన్), కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ గోపి (పబ్లిక్), కే జగదీష్ ( వార్త), కరణం అప్పారావు (చైతన్యవారధి) తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా పైలా సన్యాసిరావు (మనం) కొనసాగుతారు. అనంతరం నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన సిహెచ్ లోకేష్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యుల ప్రయోజనాలు కాపాడుతానని, ప్రెస్ క్లబ్ లో ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.


నాటు సారాయి పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉక్కుపాదం


నాటు సారాయి పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉక్కుపాదం.సి.ఐ. జి.వెంకట లక్ష్మి.

 

కాకినాడ స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్

 

మంగళవారం తెల్లవారుజామున స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  డిప్యూటీ కమిషనర్ మరియు అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు  కాకినాడ రూరల్ మండలం  వకలపూడి గ్రామంలో పరిధిలో గల షిప్పింగ్ అర్బర్ వద్ద ఒక ఫైబర్ బోట్ లో నాటు సారాయి ని విక్రయిస్తున్న పలేపు వీరబాబు వయసు 24 సం. అను వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 150 లీటర్ల నాటు సారాయి ని,ఒక ఫైబర్ బోట్ ను స్వాధీనం చేసుకున్నట్లు సి.ఐ జి. వెంకట లక్ష్మీ (సెబ్) తెలిపారు. సందర్బంగా ఆమె సదరు ఘటనపై విచారణ చేయగా  సదరు వ్యక్తి కి యానాం లో గిరియం పేటకు చెందిన పెసంగి రాముడు,అతని కుమారుడు పెసంగి సుందరరావు తనకు తరచుగా నాటు సారాయి ని సప్లయి చేస్తారని నేను దానిని విడి,విడి గా చేపల వేట చేసుకునే వారికి అమ్ముతాడని చెప్పారు. సి.ఐ.మాట్లాడుతూ ఇలాంటి కల్తీ,అక్రమ సారాయి ని సేవించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలతో పాటు నిత్యం సముద్రం పై వేటకు వెళ్లే వారు అనేక ప్రమాదాలలో చిక్కుకుంటారని, తద్వారా మీకు కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం చేసిన వారవుతారని,ఎంతో కష్టమైన వేట సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎవరు కూడ అక్రమ మద్యం,సారాయి ని సేవించడం మంచిది కాదని, జాలర్ల కు హితవు పలికారు...అక్రమ మద్యం,నాటు సారాయి ని రవాణా,అమ్మకం,పై నిరంతరం నిఘా ఉంచుతామని,అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులలో సి.ఐ జి. వెంకట లక్ష్మి తో పాటు యస్.ఐ. కె. తమ్మరావు, సిబ్బంది టి.వెంకటేశ్వరవు, కృష్ణమోహన్,దొర తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌


 


వైఎస్సార్‌ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌


 



అమరావతి, బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ’వైఎస్సార్‌ కాపు నేస్తం’  పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగాను. ఈ 13 నెలలో కాలంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది.  ఎక్కడా వివక్షకు తావులేదు : ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశాము. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగింది. మనకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం. అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేశాము. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు. ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే.. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4,770 కోట్లు ఇవ్వడం జరిగింది. బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లింపు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాలో వేస్తున్నాం.
ఆందోళన వద్దు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి : ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం.  అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి.  వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం. గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి. గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? చూడండి. ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది. దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో మీకు ఇంకా మంచి చేయాలని భావిస్తున్నాను' అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.


 ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వి ఆర్ పి పై చేయి చేసుకున్న ఎస్ ఐ.


 ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వి ఆర్ పి పై చేయి చేసుకున్న ఎస్ ఐ.



ఎస్ ఐపై  చర్య తీసుకోవాలని  బైఠాయించిన ఆందోళనకారులు.



ఏ కోడూరు పోలీస్ స్టేషన్  వద్ద ఉద్రిక్తత.


విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్) 


 


పోలీస్  స్టేషన్లో  ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వి ఆర్ పి పై  ఎస్ ఐ     చేయి చేసుకున్నాడని   పలువురు  స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దౌర్జన్యంగా కొట్టిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని  నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే. జిల్లాలోని  కే కోటపాడు మండలం  ఏ కోడూరు  పోలీస్  స్టేషన్  వద్ద మంగళవారం తలెత్తిన సంఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎన్ఆర్ఈజీఎస్ లో  వి ఆర్ పి గా పనిచేస్తున్న  పాటూరి సింహాచలం నాయుడు స్థలం విషయంలో వేరే వ్యక్తి దౌర్జన్యం చేశాడని ఏ కోడూరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. ఫిర్యాదు చేసి వస్తున్న సమయంలో ఎస్ ఐ నిలదీసి ఫిర్యాదు చేస్తావా అంటూ దుర్భాషలాడి తనను చితకబాదాడు  అని  ఆరోపించారు. ఈ పరిస్థితి చూసి  నా భార్య వరలక్ష్మి అడ్డుకునే ప్రయత్నం చేయగా  ఆమెను కూడా దౌర్జన్యంగా నెట్టేశారని  తమపై  దుర్భాషలాడారని  వారు పేర్కొన్నారు. బంధువులు స్థానికులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి  నిరసన తెలియజేశారు. టీడీపీ నాయకులకు  అనుకూలంగా పనిచేస్తున్న ఎస్ఐపై  చర్యలు తీసుకోవాలని  ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆందోళనకారులు అన్నారు. చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరణం ఈశ్వరరావు  సంఘటనా స్థలానికి చేరుకునిచ ఆందోళనకారులకు  నచ్చజెప్పడంతో  ఆందోళన విరమించారు.


జులై 3 న సహాయ నిరాకరణ&శాసన ఉల్లంఘన

జులై 3 న సహాయ నిరాకరణ&శాసన ఉల్లంఘన


   గోడ పత్రికను విడుదల చేసిన సిఐటియు గనిశెట్టి

 

             పరవాడ పెన్ పవర్

 

పరవాడ మండలం:కేంద్ర ప్రభుత్వం కార్మికుల,ఉద్యోగుల హక్కుల యెక్క సేసనాలను ఉల్లంఘన చేస్తున్న కారణంగా జులై 3 వ తారీకున అన్ని ఉద్యోగ సంఘాల తో కలిసి సిఐటియు వారి ఆధ్వర్యంలో శహయ నిరాకరణ కార్యక్రమంలో పాల్గొనాలి గోడ పత్రికను సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ విడుదల చేసారు.అనంతరం గనిశెట్టి మాట్లాడుతూ జులై 3 నిర్వహిస్తున్న సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘన కార్యక్రమంలో ఉద్యోగులు,కార్మికులు పెద్ద ఎత్తున అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు.కరోనా స్వీయ నిర్బంధం వలన ఎందరో కార్మికులు ఉపాధి కోల్పోయారు అని వారిని వెంటనే ఆదుకోవాలి అని అన్నారు.పరిశ్రమల్లో,సవస్థల్లో ని కార్మికులను తొలగించి రాదు అని అన్నారు.కార్మికులకు లాక్ డవున్ కాలంలో పూర్తి వేతనాలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు.కరోనా వైరస్ సోకకుండా భవన నిర్మాణ కార్మికులకు,వాలంటీర్లకు,ఉద్యోగులకు రక్షణ కల్పించాలి అని వారికి బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ,ప్రభుత్వ సవస్థలను ప్రవేటికరణ చేయాలి అని బీజేపీ ప్రభుత్వo చేస్తున్న చర్యలను ఉద్యోగులు వ్యతిరేకించండి అని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గేదల అప్పారావు,కె అప్పారావు,బి లచ్చిబాబు,జి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ముంగిటకే పరిపాలన


ప్రజల ముంగిటకే పరిపాలన


-- జగన్ లక్ష్యమన ఎమ్మెల్యే అమర్

 

అనకాపల్లి, పెన్ పవర్

 

ప్రజల ముంగిటకే పరిపాలన తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి  సంకల్పమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.  ఎన్ని అడ్డంకులు ఉన్న పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ ముందుకు సాగుతున్నారనారు. ఇదే లక్ష్యంతో సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో సచివాలయం 3, 4 లో నూతనంగా మంజూరు అయిన పెన్షన్లను  శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్  చేతుల మీదగా మంగళవారం లబ్దిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది అన్నారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. సుమారు 500 కోట్లతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ఆసుపత్రిని కూడా మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అనకాపల్లి కేంద్రంగా త్వరలో కొత్త జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామ రాజు, జోనల్ కమిషనర్ శ్రీరామ్ మూర్తి, కొణతాల  మురళీకృష్ణ ,యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవం ప్రారంభం

 


 

 

 

శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవం ప్రారంభం

 

అనకాపల్లి, పెన్ పవర్

 

 శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవం మంగళవారం లాంంచనగా ప్రారంభమైంది.  దేవాదాయ సహాయ కమిషనర్ చేతుల మీద భక్తులు లేకుండా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరిశాంతి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విపత్కర పరిస్థితుల వల్ల ఈ ఏడాది జగన్నాథ స్వామి ఉత్సవం మామూలుుగా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ తొమ్మిది రోజులు జగన్నాథ స్వామి గుడిలో ఉన్న కల్యాణ మండపాన్ని స్వామివారి ఇంద్ర జమున హాలు కింద మార్చి పూజలు జరిపిస్తామని ఈ సందర్భంగా తెలియచేశారు.  చైర్మన్ దాడి ఈశ్వరరావు మాట్లాడుతూ జగన్నాథుని కృప వల్ల ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వచ్చే సంవత్సరం పండగ ఉత్సవం భారీ ఎత్తున చేసే విధంగా శక్తి సామర్ధ్యాలు ఆయుర్ ఆరోగ్యాలు మనకు ఆ జగన్నాథ స్వామి కల్పించాలని కోరారుు.   ఈ ఉత్సవంలో ఆలయ చైర్మన్ దాడి ఈశ్వరరావు ,  ఇ.ఓ గ్రంథి రమాబాయ్, ధర్మకర్తలు కాండ్రేగుల  సాంబశివరావు ,సీతారామ్ శ్రీను, డొంక నారాయణ తదితరులు పాల్గొన్నారు.


ప్రజారోగ్య విభాగపు పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలి

ప్రజారోగ్య విభాగపు పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలి జి.వి.ఎం.సి. అధనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు


 


విశాఖపట్నం, 


 


ప్రజారోగా విభాగంలోని క్షేత్రస్థాయి అధికారులు ముఖ్యంగా, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, మేస్త్రీలు వారి పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని జి.వి.ఎం.సి. అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు కోరారు. జి.వి.ఎం.సి. కమీషనర్ ఆదేశాల మేరకు, ఆయన ప్రధాన కార్యాలయపు సమావేశ మందిరంలో సి.ఎం.ఓ.హెచ్.తో కలసి సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్య శాఖకు సంబందించి వివిధ అంశములపై కూలంకుశంగా చర్చించారు. ట్రేడ్ లైసెన్స్ ఆదాయాన్ని మరింత పెంచాలని, క్రొత్తగా ఏర్పడుచున్న చిల్లర, టోకు వ్యాపారాలను గుర్తించి, వెంటనే ట్రేడ్ లైసెన్స్ ఫీజు మధించాలన్నారు. వ్యాపారాలలో మార్పులు చేస్తే (under assessed) వాటిని సరి దిద్ది లైసెన్స్ ఫీజు పెంచాలన్నారు. ఇప్పటి వరకు బకాయి పడ్డ వ్యాపారస్తుల వద్ద నుండి బకాయిలు రాబట్టాలన్నారు. జి.వి.ఎం.సి. యు.సి.డి. విభాగంలోగల సుమారు 13000 వీధి విక్రయ దారుల జాబితాలను, జి.ఎస్.టి. చెల్లిస్తున్న వ్యాపార సంస్థల వివరాలను జోనల్ వారీగా సేకరించి ట్రేడ్ లైసెన్స్ ఫీజు మధించాలన్నారు. ప్రజారోగ్య విభాగంద్వారా ప్రజలకు అందించే సేవలుగాని, ప్రజా ఫిర్యాదులు గాని, వార్డు సచివాలయాలు ద్వారా స్వీకరించాలన్నారు. ఏ అధికారి కూడా వ్యక్తిగతంగా స్వీకరించ కూడదన్నారు. వాటిని పెండింగులో ఉంచకుండా త్వరిత గతిని పరిష్కరించాలన్నారు. విద్యుత్ శాఖ వారు కొట్టి పడేస్తున్న మొక్కల కొమ్మలను, ఆ శాఖ అధికార్లతో సమన్వయము చేసుకొని ఎత్తిపారవేయాలన్నారు. కాలువల్లో పూడికలను ఇంజినీరింగ్ శాఖ వారు తీయిస్తే, ఆ కాంట్రాక్టరు ద్వారా, శానిటరీ విభాగంవారు తీయిస్తే సిబ్బంది ద్వారా అదే రోజు ఎత్తి పారవేయాలన్నారు. బిల్డింగ్ మెటీరియల్ రోడ్ల ప్రక్కన కనబడితే, ప్రణాళిక విభాగానికి తెలియపర్చాలన్నారు. వర్షా కాలంలో వచ్చే, సీజన్ వ్యాధులు, స్వైన్ ఫ్ల్యూ, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటివి ప్రబల కుండా, తగు జాగ్రత్తలు పాటించాలని, వార్డుల్లో చెత్తను ప్రతీ రోజు ఎత్తివేసి, కాలువలు శుభ్రం చేస్తే, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ప్రతీ ఇంటి దగ్గర చెత్తను వేరుచేసి, పారిశుద్య సిబ్బంది స్వీకరిస్తే, రోడ్లపై చెత్త కనపడదు. గావున , క్రమ తప్పకుండా, ఈ విధానాన్ని అందరూ ఆచరించాలన్నారు. ప్రజలకు కూడా అవగాహన కల్పించాలన్నారు. వార్డు ప్రత్యేకాధికారులతో కలసి, వీధుల్లో పర్యటించి ప్రజలకు అంటూ వ్యాధులపై, కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించాలన్నరు


ఇళ్ల పట్టాలు పంపిణీ నూరుశాతం జరగాలి.


ఇళ్ల పట్టాలు పంపిణీ నూరుశాతం జరగాలి.

 

 విడియో కాన్పు రెన్స్ లో  సి.ఎం.జగన్ 

 

విశాఖ పట్నం_బ్యూరో చీఫ్ (పెన్ పవర్)

 

అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి ఇళ్ల పట్టా ఇవ్వాలని, ఇళ్ల పట్టాల పంపిణీ నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్లతో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇసుక, ఉపాధి హామీ పథకం పనులు, గ్రామ సచివాలయాలు భవనాలు, రైతు భరోసా కేంద్రాలు భవనాలు, నాడు - నేడు పథకంలో  అంగన్వాడీ భవనాల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన, వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లు,  వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ల కు భవనాల నిర్మాణం, జగనన్న పచ్చతోతత్రణం, ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు, రైతు భరోసా కేంద్రాలలో సర్వీస్ డెలివరీ, ఈ - క్రాప్, ఆరోగ్యశ్రీ కార్డులు, కోవిడ్-19, ఇరిగేషన్ ప్రాజెక్టులపై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జూలై 8న రాష్ట్రంలో 29 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ సత్వరమే పూర్తిచేయాలని కోరారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో సంబంధిత లబ్ధిదారుల జాబితాను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాబోయే ఆగస్టు 9వ తేదీన అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. విశాఖపట్నం నుంచి జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పంపిణీకి జిల్లాలో మొత్తం 2, 98, 429 మంది అర్హులైన లబ్ధిదారుల ను గుర్తించామని అన్నారు. ఇందులో మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 1,75,000 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. భూములకు సంబంధించి దాఖలైన కోర్టు కేసులు   సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు.  గ్రామీణ ప్రాంతంలో 1,20,000 మంది లబ్ధిదారులు ఉన్నారని అన్నారు.

భూమిని పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని  ఏర్పాట్లు జూలై 5వ తేదీలోగా పూర్తి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, జీవీఎంసీ కమిషనర్ జి. సృజన, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు డా. సునీల్ ఇస్క గారికి జన్మదిన శుభాకాంక్షలు

ఎస్సీ మోర్ఛా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి నివాళులు, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు డా. సునీల్ ఇస్క గారికి జన్మదిన శుభాకాంక్షలు


 

 

 పూర్ణ మార్కెట్, పెన్ పవర్.

 

 

బి. జె.పి. రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు డా. సునీల్ ఇస్క గారికి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను  ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని విశాఖ జిల్లా ఎస్సీ మొర్చ అధ్యక్షులు చొక్కాకుల రాంబాబు ఆకాంక్షించారు, అలాగే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 67వ వర్ధంతి కారణంగా బలిధాన్ ధివస్ కార్యక్రమాన్ని చేపట్టి నివాళులు అర్పించారు.శ్యామా ప్రసాద్ ముఖర్జీగొప్ప జాతీయవాది, మానవతావాది ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారని అన్నారు.ఈ కార్యక్రమానికి ఓ.ఆల్బర్ట్, ఈశ్వర్,జగదీష్ బి జే పి కార్యకర్తలు పాల్గొన్నారు.

రెవెన్యూ కార్యాలయానికి రావద్దు

రెవెన్యూ కార్యాలయానికి రావద్దు

చింతపల్లి జూన్ 23 పెన్ పవర్

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా  మండల వాసులు రెవెన్యూ పనులపై తమ కార్యాలయానికి రావద్దని తహసిల్దార్ వి.వి.వి గోపాలకృష్ణ మంగళవారం గోడ పత్రిక ద్వారా తెలిపారు. గ్రామ సచివాలయ సంస్థ, గ్రామ పంచాయతీ స్థాయిలో పని చేయుచున్నందున మండల వాసులు రెవెన్యూ కార్యాలయపు పనులు గ్రామ సచివాలయం ద్వారా చేయించుకో వాలన్నారు. ఈ విషయమై మండల వాసులు ప్రభుత్వానికి సహకరించాలని స్థానిక తాసిల్దార్ గోడపత్రిక ద్వారా కోరారు.


 

 

 అర్హులైన లబ్దిదారులకు ఎంపిక చేయాలి:దళిత నాయకులు


 అర్హులైన లబ్దిదారులకు ఎంపిక చేయాలి:దళిత నాయకులు


   పాయకరావుపేట,పెన్ పవర్


 

 అర్హులైన బడుగు,బలహీన వర్గాల లబ్దిదారులను  ప్రత్యేక అదికారులచే సర్వేచేయించి ఇళ్ళ స్థలాలను ఇప్పించాలని రాష్టృమాలమహానాడు అద్యక్షులు ధారా సురేష్ డిమాండ్ చేసారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద మంగళవారం ఆయన   ఇళ్ళ స్థల్లాల్లో  అనర్హులై స్థానికులతో వెళ్ళి ఎమ్మార్వో అంభేడ్కర్ కి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళితులు,బడుగుబలహీన వర్గాల్లో ఇంకా పేదరికంలో బ్రతుకుతూ అర్హులైన  నిజమైన లబ్దిదారులు వున్నారని అన్నారు.కొంత మంది అదికారులు,రాజకీయ నాయకులు,దళారుల అండదండలు వున్నవారికి మాత్రమే ఇళ్ళ స్థలాకు ఎంపికచేయడం జరిగుతుంది అని ఆవేదనను వ్యక్తంచేసారు.ఇప్పటికైనా నిరుపేదలను గుర్తించి ఇళ్ళస్థలాలను ఇప్పించి న్యాయంచేయాలని కోరారు.ఈకార్యక్రమంలో షేక్  గౌషిమా,పెంటా కుమారి,అన్నామని,ఇంజరపు దనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

 4లక్షల ఖైనీ గుట్కా ల ధ్వంసం.




 4లక్షల ఖైనీ గుట్కా ల ధ్వంసం.


      విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్) 

 

నిషేధిత  ఖైదీ గుట్కా ప్యాకెట్లను  మంగళవారం  మారికవలస డంపింగ్ యార్డ్ లో ధ్వంసం చేశారు. నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఖైదీ గుట్కాలను అధికారులు సీజ్ చేశారు. వాటిని  ధ్వంసం చేయాలని జాయింట్ కలెక్టర్  మెజిస్ట్రేట్ ఆదేశించడంతో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్  నందాజీ  ఆధ్వర్యంలో 37 కిలోల ఖైదీ గుట్కాలను డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ  తగులబెట్టారు. నిషేధిత ఖైనీ గుట్కా లను  దాడులు చేసి పట్టుకున్నామని ఫుడ్ కంట్రోలర్ నందాజీ తెలిపారు.

 

 



 

నేడు పరవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక


నేడు పరవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక

నేడు పరవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక

 

            పరవాడ పెన్ పవర్

 

పరవాడ మండలం: ఏపీయూడబ్ల్యూజే అనుబంధంగా ఉన్న పరవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక సమావేశాన్ని బుధవారం ఉదయం 9 గంటలకు మరిడిమాంబ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు రవి మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధంగా ఉన్న పరవాడ ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం ఉన్నవారు, నూతనంగా సభ్యత్వం పొందాలనుకునేవారు , ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన సభ్యులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొనవచ్చని తెలిపారు.

  స్వర్గీయ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘననివాళులు




  స్వర్గీయ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘననివాళులు

 


       పాయకరావుపేట,పెన్ పవర్ 

 

భారతీయ జనసంఘ్ వ్వవస్థాపకులు జాతీయనాయకులు స్వర్గీయ శ్యాంప్రసాద్ ముఖర్జీ 68వ వర్దంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా గ్రందాలయ మాజీ చైర్మెను,బిజేపి సీనియర్ నాయకులు తోట నగేష్ ఆద్వర్యంలో స్థానిక ఆయన స్వగృహంనందు మంగళవారం  బిజేపి నాయకులు,కార్యకర్తలతో కలిసి ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఇప్పటి భారతీయ జనతా పార్టీ కి మూలపురుషుడు శ్యాంప్రసాద్ ముఖర్జీనని అన్నారు.ఏక్ దేశ్ మే ధో విదాన్,ధో ప్రధాన్ ,ధో నిషాన్ నహీ ఛలేంగే ,ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు,ఇద్దరు ప్రధానులు,రెండు జాతీయపథాకాలు వుండటాన్ని సహించలేమని ముఖర్జీ నినాదించేవారని,హిందూ, ముస్లీంలకువేరుగా గాక దేశమంతటకి ఒకే చట్టం వుండాలని పోరాడిన గొప్పదేశభక్తిగల నాయకుడని అన్నారు.ఈ కార్యక్రమంలో  నాయకులు రవిరాజు,కార్యకర్తలు పాల్గొన్నారు.


 

 



 

79,85 వార్డుల్లో ని జివిఎంసి త్రాగునీటి సిబ్బందికి శానిటైజర్లు,మాస్కులు అందించిన కింతాడా


79,85 వార్డుల్లో ని జివిఎంసి త్రాగునీటి సిబ్బందికి శానిటైజర్లు,మాస్కులు అందించిన కింతాడా


             పరవాడ పెన్ పవర్

పరవాడ మండలం:అగనంపూడి జివిఎంసి పరిధిలో 79,85 వ వార్డుల్లో పనిచేస్తున్న త్రాగునీటి సిబ్బందికి మరియు పంపు ఆపరేటర్ల కు 79 వ వార్డ్ జనసేన అభ్యర్థి కింతాడ ఈశ్వరరావు(అడ్వకేట్)ఆధ్వర్యంలో శానిటైజర్లు,మాస్కులు అందించడం జరిగింది.అనంతరం కింతాడ మాట్లాడుతూ ప్రతిరోజు తమ విధులు నిర్వహిస్తున్న త్రాగునీరు సరఫరా చేస్తున్న సిబ్బంది కరోనా భారిన పడకుండా తమని తాము రక్షించు కోవడానికి వారికి శానిటైజర్లు,మాస్కులు అందించినట్లు చెప్పారు.వీరందరూ జాగ్రత్తగా ఉంటే ప్రజలందరూ ఆరోగ్యంగా వుంటారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో దుల్ల రామునాయుడు,బుద్దిరెడ్డి అప్పారావు,బిసి సంఘం అధ్యక్షుడు తోకాడ రాము,కర్రి వరప్రసాథ్,గుర్రాల చిన్న రాజు,నక్క దేముడు,జన సైనికులు పాల్గొన్నారు.

అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట


అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట

చింతపల్లి  జూన్ 23  పెన్ పవర్

తాను బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు మండలంలో పట్టుబడిన వివిధ అక్రమ కేసుల వివరాలు ఇలా ఉన్నాయని స్థానిక ఎక్సైజ్ సీఐ సింహాద్రి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ తాను 2019 డిసెంబర్ నెలలో చింతపల్లి ఎక్సైజ్ సీఐ గా       పదోన్నతి పై వచ్చానన్నారు. నాటి నుండి నేటి వరకు 116 కేసులు నమోదయ్యా యన్నారు. 93 మందిని వివిధ అక్రమ రవాణా కేసుల్లో అరెస్టు చేశామన్నారు.వివిధ వాహనాలు 12 సీజ్ చేశామన్నారు. గంజాయి, నాటుసారా, పులిసిన బెల్లం ఊట,మద్యం,  పట్టుబడిన వాహనాల వివరాలను ఆయన తెలిపారు. గడచిన ఆరు నెలల కాలవ్యవధిలో 3,862 కిలోల ఎండు గంజాయి, 41 కిలోల గంజాయి ద్రావణం స్వాధీనం చేసుకున్నామన్నారు. 781 లీటర్ల నాటుసారా, 11,900 లీటర్ల పులిసిన బెల్లం ఊట,180 మిల్లీ  కలిగిన (12 లీటర్ల,600 మిల్లీ) 70 మద్యం క్వార్టర్  సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.అలాగే  ఆటో, ట్రాక్టర్, లారీ,వ్యాన్ ఒక్కొక్కటి చొప్పున బోలోరోపికప్ వ్యాన్లు 2, ద్విచక్ర వాహనాలు 2, కార్లు 4  స్వాధీనం చేసుకున్నమన్నారు. అక్రమ వ్యాపారాలు, రవాణాను అడ్డుకునేందుకు తమ శక్తి వంచన లేకుండా పని చేస్తున్నామన్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడేవారు  ఎంతటివారైనా శిక్షార్హులే అని తెలిపారు. గ్రామాలలో నాటు సారా,గొలుసు మద్యం దుకాణాల వ్యాపారాలు విరమించుకోవాలని ఆయన హెచ్చరించారు.


 

 

శ్యామ్ ప్రసాద్ సేవలు ఎనలేనివి


 


శ్యామ్ ప్రసాద్ సేవలు ఎనలేనివి

 

అనకాపల్లి , పెన్ పవర్

 

దేశానికి డాక్టర్ శ్యాంప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. శ్యాంప్రసాద్   వర్థంతి కార్యక్రమం మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగింది.  ఈ సందర్భంగా మాట్లాడుతూ   శ్యాంప్రసాద్ ముఖర్జీ  దేశానికి చేసిన సేవలను కొనియాడారు‌ 370  ఆర్టికల్ రద్దు చేయమని ఆయన  ఆనాడే పోరాటం  చేశారు అన్నారు. ఆయన కలల కన్నా కలని  ప్రధానిగా మోదీ  ఆర్టికల్ 370 ను రద్దు చేశారనారు.  ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రెటరీ ద్వారపురెడ్డి పరమేశ్వర రావు, దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు ఏ. కొండబాబు మాస్టారు ,మాజీ ఎంపిటిసి చదరం నాగేశ్వరరావు, అనకాపల్లి భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి  కర్రి రామకృష్ణ  , భారతీయ జనతా యువమోర్చ జిల్లా గల్లా రాజు, దూలం బూసిరాజు  తదితరులు పాల్గొన్నారు.

నలందా కిషోర్ ని అరెస్టు చేసిన సిఐడి


నలందా కిషోర్ ని అరెస్టు చేసిన సిఐడి.

      విశాఖపట్నం_ బ్యూరో చీఫ్(పెన్ పవర్)


 


టిడిపి సానుభూతి పరుడు నలందా కిషోర్ మంగళవారం తెల్లవారుజామున సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో ఉంటున్న నలంద కిషోర్ ఇంటికి తెల్లవారుజామున సిఐడి పోలీసులు చేరుకొని అరెస్టు చేసి తరలించగా వెళ్లారు. రాష్ట్ర  పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మరియు విజయసాయిరెడ్డి లపై వీడియో హల్చల్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ వీడియోను  నలందా కిషోర్ ఫార్వర్డ్ చేసినట్లు  అతనికి సీఐడీ నోటీసు ఇచ్చారు.  ఇందులో భాగంగా  కిషోర్  సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది.


కృష్ణ నగర్ లోని 31,32 వార్డులలో శానిటేషన్





కృష్ణ నగర్ లోని 31,32 వార్డులలో శానిటేషన్ చేయించిన బి. జె పి సభ్యులు.

 

 పూర్ణ మార్కెట్, పెన్ పవర్

 

 కృష్ణ నగర్ లోని 31 మరియు 32 వ వార్డుల పరిధులలో కరోనా కేసులు రావడం తో  మంగళవారం ఆ ప్రాంతం లో శానిటేషన్ చేయించారు ,ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దామోదర్ యాదవ్, వార్డు  అధ్యక్షులు మాడేం విశ్వేశ్వర రావు,  ప్రధాన కార్యదర్శి నడుపూరు కళ్యాణ్, వార్డు నాయకులు అజయ్, విస్సు, సురేష్, సన్నీ  మరియు  జనసేన కార్యకర్తలు సునీల్  మొదలగువారు పాల్గొన్నారు.


 

 



 

విశాఖ మన్యంలో పడగ విప్పిన కరోనా మహమ్మారి.

 



 


     విశాఖ మన్యంలో పడగ విప్పిన కరోనా మహమ్మారి.



     రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు.



     ఉలిక్కిపడిన  ఏజెన్సీ.ఆందోళన చెందుతున్న గిరిజనం.



     అంగళ్ళు వారపు సంతలు బహిష్కరిస్తున్న  గిరిజన  సంఘాలు.

        
            విశాఖపట్నం_బ్యూరోఛీప్(పెన్ పవర్)



విశాఖ మన్యంలో కరోనా మహమ్మారి పడగవిప్పంది. రెండు చోట్ల పాజిటివ్ కేసులు నమోదు కావడంతో  ఏజెన్సీ ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో కరోనా  వైరస్ సోకడంతో అధికార యంత్రాంగం  గిరిజనులు  ఆందోళన చెందుతున్నారు. ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు పంచాయితీ  జఫ్ఫా ర్ కి  చెందిన యువకుడికి కరోనా పాజిటివ్  నిర్ధారణ కావడంతో  విశాఖ కి తరలించారు. గ్రామంలో బంధువు  దహన సంస్కార ణలకు  తిరుపతి నుంచి వచ్చిన యువకుడిని క్వారంటైన్ లో పరీక్షలు చేయగా  వైరస్ బయటపడింది. 4 రోజుల క్రితం  చింతపల్లిలో  మహిళ హోంగార్డుకు  కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్రదేశాల నుంచి పలువురిని క్వారంటైన్ కి తరలించారు. ఈ పరిస్థితులు దృశ్య  కరోనా వైరస్ మన్యంలో నివురుగప్పిన నిప్పులా  మారింది. ఎక్కడ ఎంతమందికి  కరోనా వైరస్  సోకింది  అన్న అనుమానాలు వ్యక్త మవు తున్నాయి.  మార్చి 21 నుంచి మొదలైన  కరోనా లాక్  డౌన్  మే నెల వరకు ఏజెన్సీలో కట్టుదిట్టంగా అమలు జరిగింది. గ్రామాలకు గ్రామాలు  దిగ్బంధం చేశారు. స్థానికులు మినహ  ఇతరులను గ్రామాల్లోకి అనుమతించలేదు. ఇతర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చిన  ససేమిరా పొమ్మన్నారు. ఫైనాన్స్ వ్యాపారులను సైతం  దరిచేరనివ్వలేదు. ఈ వారపు సంతలు దుకాణాలు బహిష్కరించారు. సామాజిక దూరం తూచా పాటిస్తూ వచ్చారు.  లాక్ డౌన్  సడలింపు లతో   దుకాణాలు  అంగళ్ళు  తెరుచుకున్నాయి. దీంతో  స్థానికేతరుల రాకపోకలు కూడా మొదలయ్యాయి. మైదాన ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విలయ తాండవం ఆడుతున్న దృశ్య గిరిజన ప్రాంతాల్లో వారపు సంతలు  మరికొంత కాలం నిషేధించాలని గిరిజన సంఘాలు  గొంతెత్తి కూస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంతో  కరోనా చిచ్చు రాకుండా పటిష్టమైన  జాగ్రత్తలు పాటిస్తున్న తరుణంలో కరోనా  వైరస్  చింతపల్లి  ముంచంగిపుట్టు మండలాల్లో  వెలుగు చూసింది. ఇతర ప్రాంతాల నుంచి  వచ్చి పోతున్న  వారి వల్ల కరోనా   విజృంభించే   అవకాశం లేకపోలేదని  గిరిజన నేతలు  భావిస్తున్నారు.  వర్షాకాలం కావడంతో  గిరిజన గ్రామాలు  అస్తవ్యస్తంగా  ఉంటాయని  కరోనా వైరస్ ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని  అధికారులు  హైరానా పడుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం తాగునీరు  వ్యక్తిగత శుభ్రత పాటించాలని  అవగాహన చర్యలు మొదలయ్యాయి. ఎప్పటికైనా  కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని  గిరిజనులు  భావిస్తున్నారు. దుకాణాలు ఉదయం 7 నుంచి ఒంటి గంట వరకు  మాత్రమే తెరవాలని  వ్యాపారులతో తీర్మానించారు. ఎవరైనా దుకాణాలు తెరిస్తే మూడు వేలు జరిమానా  మాస్కు ధరించకపోతే  500 ఫైన్  విధించాలని  తీర్మానించారు. జీకే వీధి  అరకు  జి.మాడుగుల  పెదబయలు వారపు సంతలు  ఇప్పట్లో తెరవకూడదు అని  గిరిజన సంఘాలు కోరుతున్నారు. ముంచంగిపుట్టు మండలం  దుకాణాలు మూసివేశారు. తరచూ కుంభవృష్టి వర్షాలు  పారిశుద్ధ్యం  దృశ్య  అధికారులు  అలర్ట్ ప్రకటించారు.


 

 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...