మార్కాపురంలోకరోనా తొలి మరణం
పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
మార్కాపురం,
అప్రమత్తమైన పోలీస్ శుక్రవారం రాత్రిచనిపోయిన సఖిల్ విష్ణు అను అతను మహారాష్ట్రకు చెందిన వారు గత 45 సంవత్సరాల నుంచి మార్కాపురం పట్టణంలో బంగారం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు సదరు సఖీల్ విష్ణు గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా మార్కాపురం పట్టణం లోని కృష్ణా రెడ్డి హాస్పిటల్ నందు చికిత్స చేయించుకో గా జ్వరం తగ్గింది మళ్లీ గత రెండు రోజుల నుండి ఆయాసం దగ్గుతో బాధపడుతుండగా ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిటల్ తీసుకెళ్లగా వాళ్ళు రిమ్స్ కి వెళ్ళమని సూచించడంతో రిమ్స్ లో అడ్మిట్ చేసినారు రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందినాడు చికిత్స సమయంలో కరోనా టెస్ట్ చేసి ఉన్నారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్ళమని సూచించడంతో అంబులెన్స్లో తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో మృతునికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని మార్కాపురం పట్టణంలో ని కి రానియవద్దని ఒంగోలు రిమ్స్ నుండి డాక్టర్లు పోలీస్ ఆఫీసర్లకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి డాక్టర్లకు చెప్పడంతో వారిని ఊరు బయట ఉన్న బోడపాడు రోడ్లో ఆపి వేసినారు ఆ తర్వాత సదరు విష్ణు యొక్క దహన సంస్కరణ గుండ్లకమ్మ వాగు పక్కన ఉండే స్థలంలో జెసిబి ద్వారా 04.00 గంటలకి గుంత తీసి పూడ్చి వేయడం జరిగింది పట్టణంలో శుక్ర శనివారాల్లో 30 కేసులు రావడం ఒకరు మరణించడంతో కలకలం రేగింది. దీంతో పట్టణంలో లాక్ డౌన్ నిబంధనల న పటిష్టంగా అమలు పరిచేందుకు పోలీసులు సమాయత్తం అయ్యారు. పట్టణం చుట్టూ రాకపోకలు ఆంక్షలు విధించి పట్టణంలో కూడా ప్రజలు తిరగకుండా పటిష్టమైన చేపట్టారు. కరోనాతో వ్యక్తి మృతి చెందిన విషయం తీసుకున్న పోలీసులు ఉదయం ఏడు గంటలకే దుకాణాలు మూసివేయించారు. రహదారుల వెంట వివిధ ప్రాంతాలలో పోలీసులు పికెటింగ్లు ఏర్పాటు చేసి కరుణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.
సదరు మృతుని యొక్క కుటుంబం షేక్ మహబూబ్ బాషా కరోనా పాజిటివ్ పర్సన్ యొక్క జూలరీ షాప్ పైన ఇంటిలో రెంటుకు ఉంటారు.వారికి ఇద్దరు కుమారులు బంగారం పని చేస్తూ ఉంటారు.వర్క్ షాప్ కూడా ఆంధ్ర జూలరీ షాప్ కి ఎదురుగా ఉంటుంది ...విరు ఆంధ్ర జూలరీషాప్ కు సంబంధించిన బంగారం పనులు కూడా చేస్తూ ఉంటారు .అందువలన మృతుని యొక్క కుమారులకు కరోనా సోకి వారి ద్వారా తండ్రికి వచ్చి ఉండొచ్చని అనుకుంటున్నారు మృతుని కుమారులకు కరోనా పాజిటివ్ టెస్ట్ చేయలేదు. వారు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ నందు కరోనా టెస్ట్ కోసం ఉన్నారు. వారి ఇంటిలో వారు 9 మంది ఉంటారు. వీరికి ట్రావెల్ హిస్టరీ కూడా లేదు
No comments:
Post a Comment