Followers

మే 4వతేదీన ఏ.పి.కి కేంద్రబృందం


అమరావతి, పెన్ పవర్


మే 4వతేదీన ఏ.పి.కి కేంద్రబృందం


రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన కేంద్ర బృందం


కరోనా ప్రభావం,తాజాపరిస్తితి,లాక్ డౌన్ అమలు తీరు,కరోనాపరీక్షలు జరిగే విధానం, కరోన రోగులకు అందే వైద్యం పై సమీక్ష చేయనున్న కేంద్ర బృందం, రెడ్ జోన్,గ్రీన్ జోన్ ,అరేంజి జోన్లలో తీసుకుంటున్న చర్యలపై సమీక్షచేయనున్న కేంద్రబృందం


గ్రీన్ జోన్ లోకి కాకినాడ


గ్రీన్ జోన్ లోకి కాకినాడ


  కాకినాడ, పెన్ పవర్: 


కాకినాడ  గ్రీన్ జోన్ లోకి వచ్చింది. కరోనా ఫ్రీ సిటీగా కాకినాడను డిక్లేర్ చేశారు. కాకినాడ బ్యాంక్ పేటలోని ఇరువురు పాజిటివ్ రోగులు వైరస్ నుండి కోలుకొని  డిశ్చార్జి అయ్యారు. 28 రోజులుగా బ్యాంక్ పేటలో అదనంగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో రెడ్ జోన్  ఎత్తివేశారు. దీంతో కాకినాడ సిటీని గ్రీన్ జోన్ ప్రకటించారు. ఇక కాకినాడను గ్రీన్ జోన్ గా ప్రకటించడంపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ జోన్ లోకి రావడానికి  సహకరించిన ప్రజలకు, దాతలకు, కరోనా సేవల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రీన్ జోన్ వచ్చినప్పటికీ ప్రజలంతా మరికొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రీన్ జోన్ లోకి నగరం రావడంతో నిబంధనలలో కొంత మేరకు సడలింపు ఉంటాయని అంటున్నారు.


2018 ఐఏఎస్ బ్యాచ్ అధికారులకు అసిస్టెంట్ కలెక్టర్ లుగా పోస్టింగ్


అమరావతి, పెన్ పవర్


ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 2018 ఐఏఎస్ బ్యాచ్ అధికారులకు అసిస్టెంట్ కలెక్టర్ లుగా పోస్టింగ్


పశ్చిమగోదావరి - సీహెచ్.బాజ్ పాయి.
అనంతపురం - జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్.
నెల్లూరు - భావ్నా
శ్రీకాకుళం - మల్లారపు నవీన్
ప్రకాశం - వి.అభిషేక్
తూర్పుగోదావరి - అపరాజిత సింగ్
చిత్తూరు - విష్ణు చరణ్
కర్నూలు - నిధి మీనా
విజయనగరం - కట్టా సింహాచలం.
కడప - వికాస్ మర్మాట్


ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడు చేసుకోండి


ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడు చేసుకోండి


కమీషనర్  నూకేశ్వర రావు


సాలూరు, పెన్ పవర్


కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆరోగ్య సేతు యాప్ గురించి అందరు తెలుసు కోవాలని సాలూరు పట్టణ మున్సిపల్ కమీషనర్ గురువారం చిన్నబజార్ జంక్షన్లో  కిరాణ షాపుల యాజమానులుకు అవగాహన  కల్పించారు.ఈ సందర్బంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతు ఈ ఆరోగ్య సేతు యాప్ వలన ఎంతో ఉపయెాగం ఉందని,యాప్ గూగుల్  ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.హెల్ప లైన్ నంబర్ లతో పాటు ,ఆరోగ్య శాఖ పెట్టే పోస్టులు,వైద్య సలహలు ఇతర వివరాలు తెలుసుకోచ్చని తెలిపారు.కరోనా సోకిన వ్యక్తి దగ్గర గా వెళ్తే వెంటనే ఈ యాప్ మనల్ని వెంటనే అప్రమత్తం చేస్తుందని,ఇప్పుడు ఉన్న ప్రస్తుత కరోనా కేసులను పసిగడుతుందని చెప్పారు.తదనాంతరం కిరాణ షాపు యజమానులుకు,ప్రజలకు తమ సెల్ ఫోన్ లో ఆరోగ్యసేతు యాప్ ఎలా డౌవున్ లోడు చెయ్యలో దాని పనితీరును  దగ్గర ఉండి సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమీషనర్ నూకేశ్వరరావు,సిబ్బంది పాల్గోన్నారు.


భవన నిర్మాణ రంగ పనులకు అనుమతులు ఇవ్వాలి


భవన నిర్మాణ రంగ పనులకు అనుమతులు ఇవ్వాలి


సాలూరు, పెన్ పవర్


సాలూరు పట్టణ ఎ.పి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కమిటీ సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షుడు యన్.వై. నాయుడు ఆధ్వర్యంలో  పట్టణ యస్.ఐ. యస్.శ్రీనువాసరావు కు కరోనా వలన నెల రోజులుగా నిర్మాణ రంగ పనులు నిలిచిపోయి కార్మికుల ఇబ్బందులు తెలుపుతున్న వినతిపత్రాన్ని గురువారం  అందించారు.ఈ సందర్భంగా ఎన్.వై. నాయుడు విలేకర్ల తో  మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి భవన నిర్మాణ రంగ పనులు పూర్తిగా నిలిచిపోయాయని,ప్రస్తుతం కార్మికులకు ఉపాధి పనులు లేకపోవడం వలన అవస్థ లు పడుతున్నారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం నిర్మాణ రంగ కార్మికులు పస్తులు ఉండవలసిన పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. ఏప్రెల్ 29 వ తేదీనా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగ పనులు చేయడానికి అనుమతిస్తు ఆదేశాలు జారీ చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, డి.జి.పి. ప్రకటించి యున్నారని తెలిపారు.సాలూరు పట్టణ కార్మికులు కూడా సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు.ఈ కార్యక్రమంలో  భవన  నిర్మాణ రంగ కార్మిక అధ్యక్షుడు రౌతు చిన్నయ్య ,కార్యదర్శి యర్రా జగన్నాధం , కోశాధికారి నెయ్యల మెాహన్ తదితరలు పాల్గొన్నారు .


నగర ఎస్సీ యువమోర్చా  ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ  


నగర ఎస్సీ యువమోర్చా  ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ                            


పూర్ణా మార్కెట్, పెన్ పవర్:      


                     


విశాఖ నగర ఎస్సీ మోర్చ అధ్యక్షులు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో 30వ వార్డులో పేదలకు ఆహార పెకెట్ల పంపిణీ చేశారు.   దేశ ప్రధాని  నరేంద్ర మోడీ,  ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యదర్శి కాశీ విశ్వనాథ్ రాజు  అలాగే విశాఖ నగర అధ్యక్షులు  రవీంద్ర రెడ్డి  ఆర్ధిక సహాయంతో  చొక్కకుల రాంబాబు గురువారం 30వ వార్డు లో నివసిస్తున్న పేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు లో ఉన్న బీజేపీ నేతలు ,కార్యకర్తలు పాల్గొన్నారు.


1500 కుటుంబాలకు కూరగాయల పంపిణీ..






1500 కుటుంబాలకు కూరగాయల పంపిణీ..
 

 

గోకవరం, పెన్ పవర్

 

తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం,  గుమ్మల్లదొడ్డిలో స్థానిక వైకాపా నాయకుల ఆధ్వర్యంలో గురువారం ప్రతీ ఇంటికీ కూరగాయలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో స్థానికులు అవస్థలు పడకుండా, స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు సూచనల మేరకు గ్రామంలో ఉన్న సుమారు 1500కుటుంబాలకు వాలంటీర్లు సహాయంతో కూరగాయలు అందజేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..


 




 

 


 



 



నాటు సారా పట్టివేత


నాటు సారా పట్టివేత

 

 

పెన్ పవర్, పశ్చిమగోదావరి బ్యూరో

 

 

పెదవేగి మండలం ముండూరు దగ్గరలో పొలాల మధ్యలో రహస్యంగా తయారు చేస్తున్న నాటుసారా 30 లీటర్ల బెల్లపుఊట, 5 లీటర్ల నాటుసారా పట్టివేత   కొప్పులవారిగూడెంకు చెందిన మాడు. శ్రీహరిని అదుపులోకి తీసుకోవడమైనది. ఈ రైడ్ లో ట్రైనీ ips ఆఫీసర్ Asp కృష్ణకాంత్ , ఏలూరు రూరల్ ci అనసూరి. శ్రీనివాసరావు, పెదవేగి si  నాగరాజు మరియు పెదవేగి పీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మహాజ్ఞాని భగీరథమహర్షి జయంతి శుభాకాంక్షలు..


మహాజ్ఞాని భగీరథమహర్షి జయంతి శుభాకాంక్షలు..

 

డి పి వో శ్రీనివాస్ విశ్వనాథ్..

 

పోలవరం, పెన్ పవర్

 

భగీరథుడు మహా జ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు, సహనానికి ప్రతిరూపం ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారని, ఎవరైనా కఠోర శ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు.. భగీరథుని చరిత్ర గురించి ఆయనకు తెలిసిన కొన్ని విషయాలు ఇలా వివరించారు .  భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడు. అసలు భగీరథుడు గంగను ఆకాశం నుండి ఎందుకు తీసుకురావలసి వచ్చిందో, దాని వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

 సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు అసమంజుడు జన్మించాడు. చిన్న భార్యకి అరవైవేలమంది కొడుకులు పుట్టారు. అసమంజుని కొడుకు అంశుమంతుడు.  సగరుడు 99 అశ్వమేధ యాగాలు పూర్తయి, నూరవ యాగం నిర్వహిస్తున్నాడు. నూరు యాగాలు పూర్తిచేసినవారు దేవలోకానికి రాజయ్యే అర్హత పొందుతారు. అందుకే ఎవరు నూరు యాగాలు పూర్తి చేయబోతున్నారు అని తెలిసినా ఇంద్రుడికి తన పదవి ఎక్కడ పోతుందో అని భయం. అందుకే సగరుని నూరవ యాగం సక్రమంగా పూర్తి కాకుండా చేయాలనుకున్నాడు. యాగాశ్వాన్ని పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర కట్టేశాడు.  సగరుని కొడుకులు యాగాశ్వాన్ని వెతుక్కుంటూ బయల్దేరారు. చివరికి పాతాళంలో దొరికింది. కపిల మహర్షే దాన్ని తనవద్ద కట్టేసుకున్నాడని అపోహపడ్డారు. ఆ మహామునితో అసభ్యంగా మాట్లాడారు. ఆ అరుపులకు కపిలమహర్షి తపస్సుకు భంగం కలిగింది. ఆయన కోపంగా కళ్ళు తెరిచేసరికి ఆ కళ్ళలోంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. అవి సగరపుత్రులను భస్మం చేశాయి. యాగాశ్వం కోసం వెళ్ళిన కొడుకులు ఎంతకూ తిరిగిరాకపోవడంతో మనుమడు అంశుమంతుని పంపాడు. అంశుమంతుడు పాతాళంలో చితాభస్మపు గుట్టను చూసి బాధపడ్డాడు. వారి ఆత్మలను ఊర్ధ్వ లోకాలకు పంపాలని ఉదకం చిలకరించబోతోంటే అశరీరవాణి ''అంశుమంతా, మామూలు జలంతో వారి ఆత్మలు ఊర్ధ్వ లోకాలు చేరవు. పవిత్ర గంగాజలంతో మాత్రమే సద్గతి పొందుతారు'' అంటూ పలికింది.  అంశుమంతుడు నిట్టూర్చి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.  సగరుని తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. తర్వాత దిలీపుడు రాజ్యాన్ని పాలించాడు. దిలీపుడు మరణించడంతో అతని కొడుకు భగీరథుడు చిన్న వయసులోనే రాజయ్యాడు. అప్పటివరకూ భస్మం అయిన రాజకుమారులకు సద్గతి కలగలేదు.చిన్నవాడైన భగీరథుడు తల్లి చెప్పగా విషయం తెలుసుకున్నాడు. పవిత్ర ఆకాశగంగను భువికి తెస్తానని తల్లితో చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుని తలచుకుంటూ కఠోర తపస్సు చేశాడు.బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథా, నీ కఠోర దీక్ష అమోఘం. నీ కోరిక నెరవేరుతుంది. అయితే ఆకాశం నుండి మహోధ్రుతంగా కిందికి దూకుతుంది గనుక అది తిన్నగా భూమ్మీద పడితే కష్టం.. పరమేశ్వరుని ప్రసన్నం చేసుకో, అప్పుడే ఆకాశగంగను నియంత్రించడం సాధ్యమౌతుంది..'' అన్నాడు.భగీరథుడు మరోసారి శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై భువి నుండి దివికి ఉరుకుతున్న సురగంగకు తన జటాజూటాన్ని ఆధారంగా చేశాడు. దాంతో ఆకాశగంగ శివగంగగా మారి, అక్కణ్ణించి భువికి దూకింది. భగీరథుని వెంట పరుగులు తీసి ''భాగీరథి'' అయింది. జహ్నుముని ఆశ్రమంలో చిందులు వేసింది.అది చూసిన జహ్నుముని గంగను అమాంతం తాగేశాడు. అది చూసి కలవరపడిన భగీరథుడు 'గంగను వదలమని'' ప్రాధేయపడగా జహ్నుముని చెవిలోంచి వదిలాడు. అందుకే గంగను ''జాహ్నవి'' అంటారు. అక్కణ్ణించి మళ్ళీ భగీరథుని వెంట పరుగులు తీసి పాతాళం చేరి ''పాతాళగంగ'' అయింది.

 

 

 

ఆవిధంగా భగీరథుని మహా దీక్షతో గంగానది, పాతాళం చేరి సగరపుత్రుల చితాభస్మంమీద ప్రవహించి వారికి సద్గతులు కలిగించింది అని ఆకాశగంగను దివి నుంంచి భూవికీ తెచ్చిన భగీరథ మహర్షి చరిత్ర గురించి వివరించారు.

ప్రతీ నీటిబొట్టు చాలా విలువైంది.

 



 


ప్రతీ నీటిబొట్టు చాలా విలువైంది..


ఇంటింటికి తాగునీరే లక్ష్యం..


విస్సాకోడేరు లాకువద్ద అడ్డుకట్ట..


తాగునీటి పై ప్రతీ రోజూ పర్యవేక్షణ ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్


భీమవరం, పెన్ పవర్


ప్రతీ నీటి బొట్టు చాలా విలువైందని, భీమవరంలో ప్రతీ ఇంటికి తాగునీరందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎంఎ ఏ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. వేండ్ర వెళ్లే దారిలోని జి ఎన్వికెనాల్ కు విస్సాకోడేరు లాకు వద్ద అడ్డుకట్ట వేసే పనులకు ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్యా లాకు వద్ద అడ్డుకట్ట వేసి ఇంజన్లు ద్వారా నీటిని చెరువుల్లోకి తోడతామన్నారు. ఈ కార్యక్రమం మున్సిపాల్టీలో ఇప్పటి వరకూ ఎవరూ చేపట్టలేదని, ఇదొక చరిత్రని, దీనివల్ల పట్టణంలో వేసవి రోజుల్లో తాగునీటి ఇబ్బందులు ఉండవని, ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమంది అధికారులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. రిజర్వాయర్లలో నీటి లెవిల్స్, ట్యాంకర్ల ద్వారా నీరు ఎక్కడికి వెళ్తుంది, జిపిఎస్ సిస్టం, సిసి కెమెరాల మోనటరింగ్ లాంటి పనులను డిఇ నారాయణరావు పర్యవేక్షిస్తారని, తాగునీరు పట్టణంలో ఏ విధంగా సరఫరా అవుతుంది, ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయనే దానిపై డిపై రాజారావు, ఎఇలు పర్యవేక్షిస్తారని అన్నారు. తాను ప్రతీ రోజూ తాగునీటి పంపిణీ పై పర్యవేక్షణ చేస్తామన్నారు. గతేడాది పట్టణంలోని ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బందులు పడ్డారని, ఆనాటి సమయంలో ట్యాంకర్లను బయటకు విక్రయించుకోవడం లాంటి అనేక అక్రమాలు జరిగాయని, నేడు వాటన్నింటిని అదుపులోకి తీసుకొచ్చి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. బుధవారం మార్కెట్ నందు ఉన్న పంప్ హౌస్ కు మూడు 30 హెచ్ పి మోటార్లను , మూడు 25 హెచ్ పి మోటర్లను రూ 5 లక్షల మున్సిపల్ నిధులతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వీటివల్ల తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదన్నారు. అయితే అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, సినిమా ధియోటర్లు, హెటల్స్ యజమానులు కుళాయి నుండి మోటార్లు ద్వారా నేరుగా నీటిని తోడుకుంటే చర్యలు తీసుకుంటామని, కుళాయిలనుండి సంపులకు నీటిని పట్టుకుని సంపుల్లోని నీటిని మోటార్ల ద్వారా తోడుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కుళాయి కనెక్షన్ లు వెంటనే రద్దు చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతీ ఇంటికి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని అన్నారు. పట్టణంలో ఎవరికి సంపులున్నాయి, ఎవరికి లేవు అనే దానిపై వలంటీర్ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని తెచ్చుకున్నామని అన్నారు. ప్రస్తుతానికైతే మంచినీటి చెరువులను పూర్తిగా నింపడం జరిగిందన్నారు. రిజర్వాయర్ల నుండి ఇటీవల ఒక వ్యక్తి అక్రమంగా ట్యాంకర్ ద్వారా నీటిని తరలించిన విషయంలో అతడిపై కేసు నమోదు చేయడంతో పాటు ట్యాంకర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు. తాగునీటి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని, పట్టణంలో ఏ ఇంటిలోనూ దాహర్తి సమస్య లేకుండా కృషి చేస్తున్నానని ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ కమీషనర్ కె రమేష్ కుమార్, ఎం ఇ ప్రసాద్, డిఇలు నారాయణరావు, రాజారావు, ఏఇలు, ఏఎంసి ఛైర్మన్ తిరుమాని ఏడుకొండలు పాల్గొన్నారు. అనంతరం మంచినీటి చెరువులను, నీటి నిల్వలను పరిశీలించారు.


తాగునీటి చెరువును 15 లక్షలతో అబివృద్ది చేసిన మంత్రి చెరుకువాడ


ఆచంట లో తాగునీటి చెరువును 15 లక్షలతో అబివృద్ది చేసిన మంత్రి చెరుకువాడ. శ్రీరంగనాథ రాజు





 

 


ఆచంట, పెన్ పవర్ 


 

 

ఆచంట మండలం ఆచంట వేమవరం లో సుమారు రూ 15 లక్షల రూపాయలతో అబివృద్ది చేసిన తాగునీటి చెరువు మరియు  మంచి నీటి సరఫరా ను గురువారం  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ .శ్రీరంగనాధరాజు ప్రారంభించారు.ఆచంట వేమవరం గ్రామంలో చాలాకాలంగా  ప్రధాన తాగునీటి చెరువు అబివృద్ధికి నోచు కోకుండా గత ప్రభుత్వం లో నిర్లక్షానికి గురైoది. గ్రామస్తుల కోరికపై మంత్రి తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చెరువు అబివృద్ధికి అధికారులను ఆదేశించడం, పనులు పూర్తికావటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు  మాట్లాడుతూ తాగునీటి కి ఇబ్బంది లేకుండా అన్ని తాగునీటి చెరువులను నీటితో నింపామని అన్నారు. అధికారులతో సమీక్షించి ముందస్తు చర్యలు తీసుకోవటం తో పాటు శివారు గ్రామాలకు అవసరం అయితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి గ్రామంలో జరుగుతున్న శానిటేషన్, పారిశుధ్యపనులను, వైద్య ఆరోగ్య సర్వేను  పరిశీలించారు. లాక్ డౌన్ అమలు జరుగుతున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం, స్వీయనియంత్రణ పాటించాలన్నారు. కారోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకై అధికారుల ఆదేశాలను పాటించాలన్నారు.

అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దన్నారు.అనంతరం  చౌకదర దుకాణాల వద్ద దూరం పాటించండి... మూడవ విడత ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ జరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ వారికి కేటాయించిన టైం స్లాట్ ఆధారంగా సరుకులు తీసుసు కోవాలన్నారు. బయోమెట్రిక్ తప్పనిసరి అయినందున శానిటైజర్ లు అందుబాటులో ఉంచామన్నారు. రేషన్ సరుకులను మే 10వతేదీ వరకు పంపిణీ చేస్తునందున ఎటువంటి ఆందోళనకు గురికావదన్నారు. రేషన్ షాపుల వద్ద తాగునీరు, షామియానా వంటి ఏర్పాట్లు చేశామని మంత్రి రంగనాథ రాజు వివరించారు. కార్యక్రమంలో పోలిశెట్టి లీలా సుబ్బారావు , గ్రామ ప్రెసిడెంట్,బండారు నాగేశ్వరావు,గ్రామ సెక్రటరీ,వేగుళ్ల బులిసత్తియ్య సొసైటీ ప్రెసిడెంట్ ,పుచ్చకాయల సూరిబాబు, గెద్దాడ మంగారావు ,కొడమంచిలి రాజు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.


 

 



 

అన్నదాత స్వచ్ఛంద సేవా భోజనం ప్యాకెట్లు  పంపిణీ  .





అన్నదాత స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా భోజనం ప్యాకెట్లు  పంపిణీ  ....

 

గోకవరం, పెన్ పవర్

 

 .......వెంకట నగరంలో35 వ రోజు చేరుకున్న భోజన ప్యాకెట్లు పంపిణీ.

        

 

బిజెపి సీనియర్ నాయకులు కరాసు. శివప్రసాద్( అన్నదాత)  గోకవరం మండలం వెంకట నగరం గ్రామంలో లో లాక్ డౌన్ కారణంగా ఆహారానికి ఇబ్బంది పడే  నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు గురువారం భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి మండల నాయకురాలు కరాసు. శ్రీ సాయి లత , ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ , రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదేశానుసారం జరిగింది . వాసంశెట్టి.వెంకట సత్య రామారావు, కె. మహేష్, పీతా సత్యనారాయణ, కోన సూరిబాబు, శ్రీనివాస్, మరియు వెంకటనగరం ప్రజలు కోన .వెంకటరామారావు , కోన రామ తులసి, చింతల బాబురావు, కోన్ అప్పలరాజు, దేవరశెట్టి  వాళ్ళమ్మ , కోన వెంకటరమణ, అడబాల రాజులు , దేవన రత్నం, కోన శేషారావు , బిజెపి నాయకులు పురం శెట్టి సత్య రమేష్ , పి. యుగంధర్ పాల్గొన్నారు.


 

 



 

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూరగాయల పంపిణీ







మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూరగాయల పంపిణీ

 

పెనుగొండ, పెన్ పవర్

 

పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆయన మాట్లాడుతూ లాక్ డోన్ సమయంలో

మధ్యతరగతి కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వాళ్ళకి ఎంతోకొంత సహాయపడే బాగుండేదని నా ఉద్దేశం అందుచేత మనమంతా కలిసి సహకరించాలి అలాగే పోలీసులు డాక్టర్లు పారిశుద్ధ కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు మనం వాళ్లకి ఎంత చేసినా తక్కువే పోలీసువారికి సహకరిద్దాం సురక్షితంగా ఇంట్లోనే ఉందాం చేతులు శుభ్రంగా కడుక్కోండి చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంచుకోండి మాస్కులు ధరించండి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సూచించారు. పెనుగొండ మండలంలోని సిద్ధాంతం వడలి,ములపర్రు  గ్రామాలలో పర్యటించి కరోనా వైరస్  వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పలు సూచనలు చేశారు.మాస్కులు ధరించడం,భౌతిక  దూరం పాటించుట, అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని, ప్రజలందరూ లాక్ డౌన్  నిబంధనలు పాటించి కరోనా వైరస్ ను పూర్తిస్థాయిలో నివారించడానికి సహకరించాలన్నారు.అనంతరం ములపర్రు గ్రామం మద్దిగుంట చెరువులో మూడు వందల కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చిన్ని రాజేంద్రప్రసాద్ రాము తదితరులు పాల్గొన్నారు


 




 

 


 



 



వైయస్ఆర్ భీమా అయిదు లక్షల చెక్కు  అందజేత

వైయస్ఆర్ భీమా అయిదు లక్షల చెక్కు  అందజేత

 

కొడమంచిలి పెన్ పవర్

 

కొడమంచిలి గ్రామానికి చెందిన  సాల శ్రీను ఆరునెలల క్రితం  రోడ్  ప్రమాదంలో చనిపోయారు, అయన కుటుంబానికి ప్రభుత్వ పరంగా వైయస్ఆర్ భీమా  పధకంలో భాగంగా మంజూరైన  చెక్కును అయన భార్య  సాల దుర్గ కు వైయస్ఆర్ పార్టీ సీనియర్ నేత సుంకర సీతారామ్ అందించారు,  ఈ సందర్భంగా సుంకర సీతారామ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నా వారిని ఆదుకొనే ఏకైక నాయకుడు యువ ముఖ్యమంత్రి జగన్  అని కొనియాడారు... సహజ మరణం తో పాటు ప్రమాదవసాత్తు మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాడానికి వైయస్ఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు.,  ఐకెపి ఏపిఎం జ్యోతి  రాణి ,భీమా మిత్ర డ్వాక్రా సిబ్బంది . వైయస్ఆర్ పార్టీ నేతలు ములగాడ వరప్రసాద్ ,పి వనమరాజు తదితరులు పాల్గున్నారు....

పరవాడ వైసిపి కార్యాలయంలో ఎంపీ సత్యవతి పుట్టినరోజు వేడుకలు

పరవాడ వైసిపి కార్యాలయంలో ఎంపీ సత్యవతి పుట్టినరోజు వేడుకలు


             పరవాడ పెన్ పవర్

పరవాడ మండలం:అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్.బిసెట్టి.వెంకట సత్యవతి పుట్టినరోజు వేడుకలును పరవాడ వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర  సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరోనా లాక్ డవున్ కారణంగా స్థానిక వైసిపి నాయకులు ఎంపీ సత్యవతి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియ చేయలేని పరిస్థితుల్లో స్థానిక పార్టీ కార్యాలయం లోనే పుట్టినరోజు వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వైసిపి పార్టీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,బండారు రామారావు,దళాయి నదియా,పయిల జూనియర్ అప్పలనాయుడు,పయిల నరేష్,వెంకట లక్ష్మి,ఇల్లపు ప్రవీణ్,పయిల పైడంనాయుడు,సిహెచ్.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కూరగాయల మద్దతు ధరకై దేవరాపల్లిలో రైతుల నిరసన.





కూరగాయల మద్దతు ధరకై దేవరాపల్లిలో రైతుల నిరసన.

 

     స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్).

 

కూరగాయలకు మద్దతు ధర కల్పించాలని దేవరాపల్లి లో రైతులు నిరసన చేపట్టారు. రోజు వారి  హోల్ సేల్ కూరగాయల మార్కెట్ కు రెండు రోజులుగా కూరలు తేకుంటా వ్యాపారులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.       ముందుగా రైతులు సమాలొచనతో కాయగూరలు మార్కెట్ కు  తీసుకు రాకూడదని నిర్ణయం చేసుకు న్నారు.గు రువారం  మార్కెట్ కు ఎవరు కూరగాయలు తీసుకు రాకపోవడంతో మార్కెట్  వెల వెల బోయింది. మార్కెట్ కి  పాడేరు హుకంపేట విశాఖపట్నం నుండి వచ్చిన కోంతమంది వ్యపారులు విస్తుపోయారు. తిరిగి పోలేక  రైతులుకు  పోన్లు చేసి కాయగూరలు తెప్పించు కోనే ప్రయత్నం చేశారు.రైతులు స్పందించక పోవడంతో  ,వ్యాపారులు తిరిగి వెళ్ళిపోయారు , రైతులు కోసం ,అధికారులు పంపిన రెండు బస్సులు ఖాళీగా పోయాయి.ఆరుగాలాలు కష్టించి పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు.బజారు కి తెచ్చిన కూరగాయల కి  కనీసం కూలి డబ్బులు అయిన రావడం లేదు. మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. విశాఖ రైతు బజారులో రైతులు నేరుగా అమ్ము కోనే విధంగా కార్డులు ఇవ్వాలని ,కోల్డ్ స్టోరేజ్ నీర్మీంచాలని సిపి ఎం నాయకుడు వెంకన్న డిమాండ్ చేశారు.


 

 



 

గిరిజన గ్రామంలో నీటి కష్టాలు తీరాయి 


10000 లీటర్ల  సామర్ధ్యం  కలిగిన  నీటి ట్యాంకు  నిర్మాణం 


గిరిజన గ్రామంలో నీటి కష్టాలు తీరాయి 


 


 


           విజయనగరం,


విజయనగరం  జిల్లాలో  అనేక గిరిజన  గ్రామాలు  ఉన్నాయి. వీటి లో కొన్ని  తరతరాలు  గా నీటికోసం  ఇబ్బందులు  పడుతుండేవి. నీటి చలమలే  వీరి కి ఆధారం. వేసవి  కాలం  లో ఇవి ఎండి  పోతే  నీటికి కట  కటే. దీని  తో పాటు ఈ నీటి  ని తాగుతుండడం వల్ల  అనేక మంది తరచూ  జబ్బుల పలు అవుతుండే వారు. ఇలాంటి కుగ్రామమే విజయం నగరం  జిల్లా  పాచిపెంట  మండలం లో గుమ్మడి  గూడా  పంచాయతీ  పరిధిలో  లో ఉన్న ఆడారి  వలస  గ్రామం.ముప్పై  కుటుంబాలు నివాసముండే  మారుమూల  ఉన్న ఈ  గిరిజన గ్రామం జనాభా  96.ఇంతక మునుపు గ్రామానికి  దూరం  గా ఉన్న నేల  బావే  వీరి మంచి నీటికి ఆధారం. ఆ బావి మంచి  నీటి గడ్డ కి అతి సమీపం లో ఉండడం వలన వర్షాకాలం లో బురద  నీరు, కలుషిత నీరు అందు లో  చేరి  త్రాగేందుకు  ఇబ్బంది గా ఉండేది.  అదే విధంగా  వేసవి  కాలం లో భూగర్భ  జలాలు  తగ్గీ  మంచిది నీటి కొరత  ఏర్పడుతుండేది. గ్రామ  ప్రజలు  తమ మంచి  నీటి కష్టాలు  ఎప్పుడు  తీరుతాయా  అని ఎదురు  చూపులు చూసేవారు. 


 


          అయితే వీరి నీటి కష్టాలను  గుర్తించిన  గ్రామీణ  నీటి సరఫరా  విభాగం అధికారులు  కేంద్ర  మరియు  గ్రామ పంచాయతీ భాగస్వామ్యం తో  రూపొందించి  బడిన  స్వజల పధకం లో ప్రతిపాదనలు  పంపి ఆమోదింప  చేసుకొన్నారు. ఆమోదం  వచ్చిన పిమ్మటనే త్వరగా  పనులు  ప్రారంభించి  బోరు బావి  ని సోర్స్  గా గుర్తించి  దాని పనులు పూర్తి చేసారు. గ్రామం లో 10000 లీటర్ల  సామర్ధ్యం  కలిగిన  నీటి ట్యాంకు  నిర్మాణం  చేపట్టారు. ఇప్పుడు గ్రామం లో ఏడు మంచిది నీటి కొళాయి  ల ద్వారా   నిరంతరం  నీటి సరఫరా  జరగుతోంది. దీంతో తమ నీటి కష్టాలు తీరాయని  గ్రామస్థులు  ఆనందం  వ్యక్తం చేస్తూన్నారు. వేసవి సందర్బంగా  మంచి నీటి  పర్యవేక్షణ లో భాగంగా గా ఈ గ్రామాన్ని జిల్లా  పర్యవేక్షక  ఇంజనీరు  శ్రీ పప్పు రవి గారు ఇతర  అధికారులు  సందర్శించినప్పుడు  గ్రామస్థులు  తమ నీటి కష్టాలు  ఏ  విధంగా  తీరింది  వివరించి  తమ కష్టాలను తీర్చిన  ప్రభుత్వానికి, జిల్లా కలెక్టరు  వారికి, గ్రామీణ  నీటి సరఫరా  అధికారులకు  తమ  కృతజ్ఞతలు  తెలియజేసుకొన్నారు.


 


పారిశుద్ధ్య, సచివాలయ సిబ్బందికి సిరిపురపు చేయూత.







పారిశుద్ధ్య, సచివాలయ సిబ్బందికి సిరిపురపు చేయూత.

 

            పరవాడ పెన్ పవర్

 

పరవాడ మండలం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిపురపు అప్పలనాయుడు సొంత నిధులు వెచ్చించి పరవాడ గ్రామ సచివాలయ సిబ్బందికి,పారిశుధ్య కార్మికులకు గురువారం ఉదయం గ్రామ సచివాలయ ఆవరణలో  ఉచితంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా లాక్ డౌన్ వలన సామాన్య ప్రజలతో పాటు, ప్రజలకు సేవలు అందించే ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో సిరిపురపు తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఇప్పటికే పరవాడ గ్రామంలో 2000 కుటుంబాలకు సుమారు పది లక్షలు సొంత నిధులు ఖర్చు చేసి ఐదు కేజీలు నాణ్యమైన బియ్యం,అరకేజీ పంచదార, కేజీ కందిపప్పు, కేజీ గోధుమపిండి ,అరకేజీ ఎర్ర గోధుమనూక తదితర సరుకులను పంపిణీ చేశారు. అంతేకాకుండా వేసవికాలంలో నీటి ఎద్దడి తో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు ప్రతి నెల రెండు లక్షలు నిధులు ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సిరిపురపు చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పయిల శ్రీనివాసురావు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,పి.ఎమ్.సి చైర్మన్ పయిల హరీష్, బండారు రామారావు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి పయిల నరేష్, చీపురుపల్లి శ్రీను,పయిల పైడం నాయుడు,ఇల్లపు ప్రవీణ్ గంగాధర్, గండి గోవింద్,సిరిపురపు అయ్యబాబు, బొడ్డు అచ్చం నాయుడు,వర్రి నుకేంద్ర, లాలం రవీంద్ర,రొంగలి అప్పారావు, పంచాయితీ కార్యదర్సులు అచ్యుతారావు,భాస్కర్  తదితరులు పాల్గున్నారు.


 








 


 






 

 




 




 


 



 



కర్నూలు  మున్సిపల్ కమిషనర్ గా పాడేరు పీఓ బదిలీ.


కర్నూలు  మున్సిపల్ కమిషనర్ గా పాడేరు పీఓ బదిలీ.

   స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్) 


 


పాడేరు  సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ  ప్రాజెక్ట్ డైరెక్టర్ డి కే బాలాజీ  కర్నూలు జిల్లా మునిసిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అతని స్థానంలో  పాడేరు  సబ్ కలెక్టర్  సలిజమల వెంకటేశ్వర రావు  ఇన్చార్జిగా  బాధ్యతలు  చేపట్టారు. కర్నూలు  మున్సిపల్ కమిషనర్ గా  డీకే  బాలాజీ ని  నియమిస్తూ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహన్నీ  గురువారం   ఉత్తర్వులు  జారీ చేశారు. అలాగే  పాడేరు  ఐ టి డి ఎ  ప్రాజెక్ట్  బాధ్యతలు  స్థానిక  సబ్ కలెక్టర్  వెంకటేశ్వర్ల కు  అప్పగించారు. రంపచోడవరం  ఐటీడీఏ పీవో  నిశాంత్ కుమార్  పాడేరు పిఓగా బదిలీపై వస్తారని  జోరుగా ప్రచారం జరిగింది. కాని  అతన్ని  జె సిగా  బదిలీ చేస్తారని  తెలుస్తోంది. పి ఓ  డీకే బాలాజీ  బదిలీ  కావడంతో  గిరిజన సంఘాలు  ఉద్యోగులు  విచారం వ్యక్తం చేస్తున్నారు.


 


 దివ్యాంగ బాలుడు సేవలు అభినందనీయం

 దివ్యాంగ బాలుడు ది పేష్ సేవలు అభినందనీయం


విశాఖపట్నం , 


జివిఎంసి పరిధిలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లా డౌన్ వల్ల ఇబ్బందిపడుతున్న ప్రజలకు సేవలందిస్తున్న పోలీసులకు 200 మాస్కులు, 100 శానిటైజర్లు , 50 గెవుజులు, 100 ఎనర్జీ డ్రింక్స్ లను దివ్యాంగ బాలుడు మూల ది పేష్ అందించాడు. పెన్ స్కూలులో 7వ తరగతి చదువుతున్న ది పేష్ టివిలలో పోలీసులు అందిస్తున్న సేవలు చూసి స్పందించాడు. తన తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో మాస్కులు, గెజులు, శానిటైజర్లు కొనుగోలుచేసి గురువారం కంచరపాలెం పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులకు, సిబ్బందికి దిపేష్ స్వయంగా అందించారు. ది పేష్ చేసిన వితరణకు పోలీసుశాఖ వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


కరోనా విధుల్ని నిర్వహిస్తున్న జివిఎంసి సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ వితరణ

 


కరోనా విధుల్ని నిర్వహిస్తున్న జివిఎంసి సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ రసాయనాన్ని వితరణ చేసిన పిఆర్‌టియు (అర్బన్), విశాఖపట్నం


విశాఖపట్నం,


జివిఎంసి పరిధిలో కరోనా నివారణ గూర్చి కేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులకు వైరస్ నుంచి రక్షించుకొనే నిమిత్తం వినియోగించుకోవడానికి 100 బాటిళ్ళ శానిటైజర్ రసాయనాన్ని 100 మాస్కులను పిఆర్‌టియు అర్బన్, విశాఖపట్నం యాజమాన్యం వారు జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుకు ఆయన ఛాంబర్‌లో జివిఎంసి డిప్యూటీ ఎడ్యూకేషనల్ ఆఫీసర్ శ్రీనివాసరావు సమక్షంలో సంఘ ప్రెసిడెంట్ పి.హరిక్రిష్ణ, సెక్రటరీ కె.నాగేశ్వరరావు, స్టేట్ కౌన్సిలర్ ఎల్.క్రిష్ణారావు చేతులు మీదుగా ఉచితంగా అందించారు. పిఆర్‌టియు (అర్బన్), విశాఖపట్నం సంఘ సభ్యులు చేసిన వితరణకు జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన ప్రత్యేక అభినందనలు తెలిపారు.


క్వారంటైన్ లో ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉండాలి


క్వారంటైన్ లో ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉండాలి


ఆరోగ్యసేతు యాప్ ప్రతి ఒక్కరితో డౌన్లోడ్ చేయించాలి   


జిల్లా రెవెన్యూ  అధికారి  జె. వెంకటరావు


        విజయనగరం, 


 


క్వారంటైన్ లో వున్నవారితో స్నేహపూర్వకంగా వుండాలని, స్వంత బంధువుల్లా భావించి వారితో మాట్లాడుతూ వుండాలని జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు క్వారంటైన్ కేంద్రాల నిర్వహణపై  క్వారంటైన్ ప్రత్యేకాధికారులకు ఆదేశించారు.   గురువారం కలక్టరేట్ ఆడిటోరియం లో ప్రత్యేకాదికారులతో సమావేశం నిర్వహించారు.  క్వారంటైన్ లో ఉంటున్న వారికి మెనూ ప్రకారం మంచి ఆహారాన్ని అందించాలని, సౌకర్యవంతమైన  వసతులను కల్పించాలని, స్వంత ఇంటిని మరిపించేలా ఉండాలని అన్నారు.   అక్కడి  గదులు, పరిసరాలు, టాయలెట్లు పరిశుభ్రంగా వుండేలా చూడాలని అన్నారు.  క్వారంటైన్ లో వుంటున్న వారికి ప్రతిరోజు పౌష్టికాహారాన్ని అందివ్వడంతో పాటు వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలన్నారు.  మానసిక సమస్యలు వుండే వారికి మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ చేయించాలన్నారు.  ఆరోగ్య సమస్యలతో మందులు వాడుతున్న వారికి మందులను కూడా తెప్పించి ఇవ్వాలన్నారు.  ప్రతి ఒక్కరికీ ట్రానాట్ పరీక్షలు నిర్వహించాలని, 14 రోజుల నిర్భందం తప్పనిసరి అని అన్నారు.  12వ రోజున అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి 13వ రోజున వైద్యుని సలహాలు తీసుకొని, కరోనా నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే డిస్ చార్ట్ చేయాలని సూచించారు.  డిస్ చార్ట్ చేసేటప్పుడు క్వారంటైన్ నిబంధనలు పాటించేలా వారి వద్ద నుండి పూచీకత్తులు తీసుకోవాలన్నారు.  వారిని ఇళ్లకు పంపేటప్పుడు సమస్య తలెత్తకుండా ముందుగానే స్ధానిక పోలీసు అధికారికి సమాచారం ఇవ్వాలన్నారు.  క్వారంటైన్ లో రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు.  క్వారంటైన్ లో కూడా సామాజిక దూరం పాటించాలన్నారు.  క్వారంటైన్ లో ఉన్న ప్రతి ఒక్కరితో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేయించాలని,  క్వారంటైన్ నుండి బయటకు వెళ్లిన తర్వాత కూడా దానివలస ప్రయోజనాలున్నాయని తెలిపారు.  ఈ యాప్ ద్వారా పాజిటివ్ కేసుల వివరాలు కూడా తెలుసుకోవచ్చన్నారు. 


కరోనా వైరస్ నిర్మూలనకు అందరూ సహకరించాలి



కరోనా వైరస్ నిర్మూలనకు అందరూ సహకరించాలి

 

విఎం ఆర్ డి చైర్మన్ ద్రోణంరాజు శ్రీ నివాస్

 

స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)

 

కరోనా వైరస్ నిర్మూలనకు అందరూ సహకరించాలని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీ నివాస్ అన్నారు.

గురువారం దక్షిణ నియోజకవర్గం( 31 వార్డు) పాత జైల్ రోడ్డు మార్గం విశాఖ మహిళా డిగ్రీ  కాలేజ్ లోని రైతు బజార్ కాయగూరలు మార్కెట్‌లో హ్యండ్ వాస్ యంత్రం ఏర్పాటు చేశారు. మార్కెట్ కి  వచ్చే వారు  కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు "ప్రగతి భారత్ ఫౌండేషన్" (విశాఖపట్నం) వారి ఆర్థిక సహాయం తో ఏర్పాటుచేసిన "డి ఏ ఎస్ ఇన్ఫెక్షన్ టూనెల్ స్ప్రే హ్యాండ్ వాష్ మిషన్"....పరికరాన్నివి ఎం అర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్  సీఎంఆర్  వాణిజ్య సంస్థల అధినేత మావూరి వెంకటరమణ  ప్రారంభించారు, ఈ సందర్భంగా శ్రీనివాస్ మార్కెట్ లో వ్యాపారస్తుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా  మార్కెట్ కు వస్తున్న ప్రజలను వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ ఈరోజు ఏర్పాటు చేసిన హ్యాండ్ వాష్ మార్గము ద్వారా చేతులు శుభ్రపరుచుకుని లోపలికి వెళ్లి వచ్చేటప్పుడు కూడా శుభ్ర పరచుకోవాలి అని వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం పాటించాలని సూచనలు ఇచ్చారు  జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది వారికి పోలీసు శాఖ వారికి సహకరించాలని మరియు కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం, విధించిన ఆంక్షలను తప్పకుండా పాటించాలని కరోనా వ్యాధి నిర్మూలన మన చేతుల్లోనే ఉందని అన్నారు,  ఈ యొక్కకార్యక్రమంలో జీవీఎంసీ జోన్ -3.జెడ్ సి  కటేశ్వరరావు ,శానిటేషన్ అధికారి డేవిడ్ రాజు, వార్డు వై ఎస్ ఆర్ సి పి కార్పొరేటర్ అభ్యర్థి బత్తిన నాగరాజు, రామూ మాస్టర్, వడ్ల రామారావు, పల్లా శ్రీనివాస్, పెంటకోట నాగరాజు, మకర గోపి, గంట్ల శ్రీను,తదితరులు పాల్గొన్నారు,

జిల్లా అధికార యంత్రాంగానికి పేక్ ఈ మెయిల్


విశాఖపట్నం, పెన్ పవర్


జిల్లా అధికార యంత్రాంగానికి పేక్ ఈ మెయిల్ తలనొప్పిగా మారింది.  జిల్లా కలెక్టర్ అంటూ vadarevuchand@gmail.com పేరుతో  కొందరు ఆగంతకులు ఫేక్ మెయిల్ క్రియేట్ చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోన్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి రాగా స్పందించిన ఆయన vadarevuchand@gmail.com పేరుతో వచ్చే మెయిల్స్‌ని నమ్మవద్దని, అది ఫేక్ మెయిల్ అని ప్రకటించారు.  ఈ ఫేక్ ఈ మెయిల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


 వైద్యుల  గైర్హాజరుపై  జిల్లా అధికారికి ఫిర్యాదు


 వైద్యుల  గైర్హాజరుపై  జిల్లా అధికారికి ఫిర్యాదు



కొయ్యూరు...పెన్ పవర్



మండలంలోని యూ చీడీ పాలెం   ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  వైద్యులు  సిబ్బంది అందుబాటులో ఉండటం  లేదని  స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రా మానికి చెందిన  జి అప్పారావు డి.రమేష్ ఎం.గోపాల్ రావులు   వైద్యాధికారులు  ల్యాబ్ టెక్నీషియన్  పై  జిల్లా మలేరియా  నిర్మూలన అధికారి  మణికి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికీ సకాలంలో అందుబాటులో ఉండరని అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులకు వైద్యం అందడం లేదని వారు వాపోయారు. మారుమూల గిరిజన  గ్రామాల నుంచి  వైద్యం కోసం వచ్చినవారు  వైద్యులు లేక  అత్యవసర పరిస్థితుల్లో  తూ.గో.జిల్లా  వై రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని వారు పేర్కొన్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు  చర్యలు తీసుకొని  వైద్యులు స్థానికంగా  అందుబాటులో ఉండేలా చూడాలని వారు అధికారిని  కోరారు.


నిరాటంకంగా సాగుతున్న రౌతు కరోనా సేవ


నిరాటంకంగా సాగుతున్న రౌతు కరోనా సేవ


             పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:కరోనా వైరస్ లాక్ డవున్ మండలంలో ప్రజలకు సేవా దృత్పధం వున్న రాజకీయ నాయకులను పరిచయం చేస్తోంది ఆ కోవకి చెందిన వ్యక్తుల్లో రౌతు శ్రీనివాస్ ఒకరు.కరోనా నివారణా చర్యల్లో భాగంగా నెలరోజు పైనుoచి స్వియనిర్బంధం లో వున్న ప్రజలకు నిత్యవసర సరుకుల ఇబ్బంది గమనించి వారికి గత 25 రోజులుగా రోజుకు ఒక్కొక్క ప్రాతంలో నిత్యవసర సరుకులను సహాయం స్వచ్ఛంద సేవా సంవస్థ అధ్యక్షుడు 79 వ వార్డ్ టిడిపి అభ్యర్థి అయిన రౌతు శ్రీనివాస్ పంపిణీ చేస్తూనే ఉన్నారు.మంగళవారం 79 వార్డ్ కుమ్మరి విధి,గాళ్లవాని పాలెం,శనివాడ గ్రామాల్లోని ప్రజలకు సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కరణం సత్యారావు,దంతులూరి సబ్భారాజు,ఎం ఏ నాయుడు,మామిడి నాయుడు,బొబ్బరి సూర్య,గంట కోరు అప్పారావు,పల్లెల నాగేశ్వరరావు,కోలాయి నాగార్జున,స్థానిక నాయకులు,గాళ్లవాని పాలెం యూత్,శనివాడ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

 

 

గిరి పల్లెల్లో మ్రోగుతున్న మరణ మృదంగం.


 




గిరి పల్లెల్లో మ్రోగుతున్న మరణ మృదంగం.


రహదారులకు నోచుకోని  గిరి పల్లెలు.


గిరిపుత్రుల దరిచేరని  ఉచిత   వైద్యం.


అత్యవసర పరిస్థితుల్లో డోలీయే  శరణ్యం.


  గిరిజనాభివృద్ధికి  పెద్ద పేట  పాలకుల ఊతపదం.


     స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం ( పెన్ పవర్)


ప్రకృతి అందాలకు నిలయమైన విశాఖ మన్యంలో  గిరి పల్లెలు  సమస్యల  సుడిలో  నలిగిపోతున్నాయి. కానీ స అవసరాలకు  నోచుకోని  ఈ పల్లెల్లో  గిరిపుత్రులు  దుర్భర జీవితాలను  వెళ్లదీస్తున్నారు.  రహదారులులేక అత్యవసర పరిస్థితుల్లో  ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం  పల్లెల్లో  ఎక్కడో ఒకచోట  మరణ మృదంగం  మోగుతూనే ఉంది. గిరిజన అభివృద్ధి  ఎక్కడ  వేసిన  గొంగలి  అక్కడే  అన్న  చందంగా   ఉందన డానికి  అక్కడ  పరిస్థితులే  నిదర్శనం. పాడేరు మండలం  మినుములూరు పంచాయితీ గాలి పాడు గ్రామానికి చెందిన చిట్టమ్మ నిండు గర్భిణీ ప్రసవ వేదనతో అవస్థలు పడుతూ ఉండగా   అంబులెన్స్ వచ్చే   గత్యంతరం లేక  మైళ్ల దూరం డోలీపై  మినుములూరు  పీహెచ్సీకి తరలించారు. వైద్యులు  డెలివరీ చేసినప్పటికీ పరిస్థితి విషమించి బిడ్డ చనిపోయింది. నెలలు నిండక డోలీలొ  తీసుకు రావడం వల్ల ఆలస్యమై  బిడ్డ మృత్యువాత పడింది. హుకుంపేట మండలం గతుంగ్  పంచాయితీ కరకవలస గ్రామంలో గెమ్మేలి కళ  ఇంట్లో పాము కాటుకు గురైంది. గ్రామానికి రహదారి సౌకర్యం లేక 5 కిలోమీటర్లు డోలీపై  మోసుకొని  అడ్డదారిలో  వచ్చి  అక్కడ నుండి  మరో పది కిలోమీటర్లు  ఆటోలో  పాడేరు ఏరియా ఆసుపత్రిలో  చేర్చారు. సకాలంలో‌  వైద్య సేవలు అందక  మహిళ మృతి చెందింది. ఇలా  రోజు  ఎవరో ఒకరు  ప్రమాదవశాత్తు  చనిపోతూనే ఉన్నారు.  ఈ మరణ మృదంగం గానికి   ప్రధాన కారణం  రహదారి సౌకర్యం.. విశాఖ ఏజెన్సీలో   11మండలాల పరిధిలో   వేల సంఖ్యలో శివారు గ్రామాలు ఇదే దుస్థితి లో ఉన్నాయి. గిరిజనాభివృద్ధికి  పెద్దపీట వేస్తున్నామని  ఎన్నికల ముందు  పాలకుల  పాట ఊతపధంలా  మారిపోయింది. పూర్వం  రహదారులు లేక డోలీలపై  ప్రయాణాలు  చేసేవారిని  పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ 2020 నాటికి డోలీలు  ఉపయోగిస్తున్నారు అంటే  ఆశ్చర్యం కలగకమానదు. ఉన్న ఊరు కన్న తల్లి అని  గిరిపుత్రులు  పల్లెలను  విడవడం లేదు. ప్రభుత్వాలు  ఆ వైపు  కన్నెతైన  చూడటం లేదు.

 

 



 

కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా


కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా


             పరవాడ పెన్ పవర్

 

కార్మికుల వేతనాలు చెల్లించాలి అని కార్మికుల పని గంటలు 8 గం నుంచి 12 గం లకు పెంచాలి అనే కేంద్ర బిజెపి ప్రతిపాదన విరమించు కోవాలి అని భవన నిర్మాణ కార్మికులకు 10 వేలు ఇవ్వాలి అని సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకుడి ఇంటిదగ్గర బహుతిక దూరం పాటిస్తూ కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు దర్నాలో కూర్చున్నారు.ఈ కార్యక్రమంలో గనిశెట్టి మాట్లాడుతూ కరోనా లాక్ డవున్ కాలంలో వేతనంతో కూడిన సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని అని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం పని గంటలను 8 గం నుంచి 12 గం వరకు పెంచాలి అనే ప్రతిపాదనను విరమించుకోవాలి అని అన్నారు.లాక్ డవున్ కారణంగా పనులు లేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు భవన నిర్మాణ సంక్షేమ నిధినుంచి ఒక్కొక్క కుటుంబానికి 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం వెంటనే ఇవ్వాలి అని కోరారు.ఆశా వర్కర్లకి,పారిస్యుద్య కార్మికులకు,అంగన్వాడీ, మద్యాన భోజన వర్కర్లకు 4,5 నెలలుగా బకాయి ఉన్న వేతనాలు ఈ కష్టకాలంలో వెంటనే చెల్లించాలి అని గనిశెట్టి డిమాండ్ చేశారు.కార్మిక చట్టాలను ప్రభుత్వం పరిరక్షించాలి అని కోరారు.ఈ ధర్నాలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు పి.చిరంజీవి,జి.రమణ,పి.అప్పలనాయుడు,జి.అప్పారావు,పి.వీరునాయుడు,పి.కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

ఉచిత బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు.




ఉచిత బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు.


  పాడేరు ఎమ్మెల్యే  కొట్టగుల్లి భాగ్యలక్ష్మి.

     స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)


కరోనా  కష్టకాలంలో  ప్రజలకు  ప్రభుత్వం  అందిస్తున్న  ఉచిత బియ్యం  పక్కదారి పడితే  కఠిన చర్యలు  తప్పవని  పాడేరు  ఎమ్మెల్యే  కోట్ట గుళ్ళు  భాగ్యలక్ష్మి  హెచ్చరించారు. బుధవారం  జి.మాడుగుల  జి సి సి  గొడౌను   ఆమె తనిఖీ చేశారు. అనంతరం  మాట్లాడుతూ కరోనా వైరస్  నియంత్రణలో భాగంగా  ప్రభుత్వం లాక్ డౌన్  విధించడం జరిగింది. ప్రజలు  ఇబ్బందులు ఎదుర్కోకుండా  ప్రభుత్వం   నెలకు మూడు సార్లు  ఉచిత బియ్యం   ఇస్తున్నారని  తెలిపారు. పేద ప్రజలకు  అందాల్సిన బియ్యం  ఎవరు  దోచుకోవాలని  చూసిన  పక్కదారి  పట్టించిన   వారిపై చర్యలు తీసుకుంటామని  అన్నారు. ఈ గొడౌన్ నుంచి   పెద్ద మొత్తంలో బియ్యం  దారి మళ్లించినట్లు  ఫిర్యాదులు అందాయని  ఈ మేరకు  కలెక్టర్  జి సి సి  ఎండి  జెసి లకు  ఫిర్యాదులు  చేయనున్నట్లు  ఆమె తెలిపారు. ఉచిత బియ్యం  గిరిజనులకు  సక్రమంగా అందించాలని  ఎక్కడైనా అవినీతి జరిగినట్లు  రుజువైతే  చర్యలు తీసుకుంటామని  అన్నారు.  నియోజకవర్గం పరిధిలో  ఉచిత బియ్యం పంపిణీ లో   అధికారులు   నిబంధనలు పాటించాలని  భాగ్యలక్ష్మి  కోరారు.

 

 



 

కరోనా నివారణకు ఎన్టీపీసీ చేస్తున్న సేవలు ప్రశంసనీయం





కరోనా నివారణకు ఎన్టీపీసీ చేస్తున్న సేవలు ప్రశంసనీయం

 

 ప్ర‌త్యేక పారిశుద్ధ్య విధానాల‌ను అమ‌లు చేస్తున్న ఎన్టీపీసీ సింహాద్రి

 

           పరవాడ పెన్ పవర్

 

పరవాడ మండలం:క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను, సామాజిక దూర నియ‌మాన్ని పాటిస్తూనే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా జాతీయ బొగ్గు విద్యుత్ ఉత్ప‌త్తి కార్పొరేష‌న్ ( ఎన్టీపీసీ) ప‌ని చేస్తూ..దేశానికి అవ‌స‌ర‌మైన క‌రెంటును నిరంత‌రం ఉత్ప‌త్తి చేస్తూ వుంది.  విద్యుత్ ఉత్ప‌త్తిలో ఎన్టీపీసీ ఉద్యోగులు క‌న‌బ‌రుస్తున్న స్ఫూర్తిని చూసి క‌రోనా మ‌హ‌మ్మారి ఏమీ చేయ‌లేక‌పోతోంది. ఎందుకంటే ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో కూడా ఎన్టీపీసీ నిరంత‌రం విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేసి దేశానికి అందించ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం.ఎన్టీపీసీ కింద వున్న ప్ర‌తి విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రం ప్ర‌స్తుత స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ ఉత్త‌మ స్థాయిలో ప‌ని చేస్తుoడటమే దీనికి నిదర్శనం. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు వెన్నుద‌న్నుగా నిలిచే ప‌లు రంగాలు స‌జావుగా న‌డ‌వాలంటే వాటికి విద్యుత్ చాలా ముఖ్యం. బొగ్గు విద్యుత్‌ ఉత్ప‌త్తి కేంద్రాలు నిరంత‌రం ప‌ని చేయ‌డానికి వీలుగా వాటికి ఎప్ప‌టికప్పుడు ఎన్టీపీసీ నుంచి త‌గిన బొగ్గు నిల్వ‌ల స‌ర‌ఫ‌రాలు వెళ్ళుతున్నాయి. 24 గంట‌లూ విద్యుత్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌డానికిగాను ఎన్టీ పీసి ఉద్యోగులు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు. లాక్ డౌన్ కు సంబంధించిన అన్ని నిబంధ‌న‌ల్ని ఎన్టీపీసీ అమ‌లు చేస్తోంది. విద్యుత్ ఉత్ప‌త్తితోపాటు సామాజిక సేవ‌లో కూడా ఎన్టీపీసీ ముందుంది. ప్లాంట్ల ప‌రిధిలోని వ‌ల‌స కార్మికుల‌కు, పేద ప్రజ‌ల‌కు అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను, ఆరోగ్య వైద్య సేవ‌లను ఎన్టీపీసీ అందిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారికి సంబంధించిన అన్ని అంశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ దేశంలో ఎక్క‌డా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌కుండా చూసుకోవ‌డానికి ఎన్టీపీసీ యాజ‌మాన్యం త‌న వంతు పాత్ర పోషిస్తోంది. ఎన్టీపీసీ కింద ప‌ని చేస్తున్న విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల్లో ముఖ్య‌మైంది ఎన్టీపీసీ సింహాద్రి 2 వేల మెగావాట్ల సామ‌ర్థ్యంగ‌ల‌ది.నిరంతరం అంత‌రాయం క‌ల‌గ‌కుండా విద్యుత్ ను స‌ర‌ఫరా చేస్తూనే ఉద్యోగుల, కార్మికుల సంక్షేమంకోసం కృషి చేస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా యుద్ద ప్రాతిప‌దిక‌న అనేక స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతూ, అటు రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి, ఇటు జిల్లా అధికారుల‌కు ఎన్టీపీసీ సింహాద్రి అధిస్తున్న స‌హ‌కారం ప్రశంసనీయం . వ‌ల‌స కార్మికుల‌కు నిత్యావ‌స‌ర వస్తువుల‌ను అందించ‌డ‌మే కాకుండా విశాఖ జిల్లా యంత్రాంగానికి రూ.30 ల‌క్ష‌ల విరాళాన్ని ఎన్టీపీసీ సింహాద్రి అందించింది.  పి.పి.ఇలు, కిట్లు, శానిటైజ‌ర్లు, మాస్కుల స‌ర‌ఫ‌రా చేయ‌డానికిగాను ఈ విరాళాన్ని అందించింది. దీనికితోడు సిజిఎం శ్రీ వి. సుద‌ర్శ‌న్ బాబు రూ.5 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త విరాళాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు అందించారు.  ఎన్టీపీసీ సింహాద్రి నిర్వ‌హ‌ణ‌లో అన్ని లాక్ డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లు చేస్తూనే ఉద్యోగులు, కార్మికులు, ఇత‌ర సిబ్బంది భ‌ద్ర‌త‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తూ వ‌స్తోంది. ప్లాంటులోకి వ‌చ్చేవారికి, టౌన్ షిప్‌లోకి వ‌చ్చేవారికి ఎప్ప‌టిక‌ప్పుడు థెర్మ‌ల్ స్క్రీనింగ్ చేస్తూనే వున్నారు. అంతేకాదు ఎలాంటి స‌మావేశాలున్నా స‌రే వాటిని వీడియా కాన్ఫ‌రెన్స్ సౌక‌ర్యం ద్వారా నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది.ఎన్టీపీసి ఉద్య‌గులు వారి కుటుంబ స‌భ్యుల‌కు సంబంధించి దేశంలోను, విదేశాల్లోను ప్ర‌యాణం చేసిన‌వారంద‌రి వివ‌రాల‌ను ఎన్టీపీసీ ఆసుప‌త్రులు సేక‌రించి వారికి తగు జాగ్రత్తలు క్వారన్ టైన్ లో ఉండాలి అని సూచించారు.అలాగే క‌ర‌ప‌త్రాలు, పోస్ట‌ర్లు, వీడియోల‌ద్వారా ఉద్యోగులకు వారి కుటుంబ స‌భ్యుల‌కు ‌క‌రోనా మ‌హమ్మారి వైర‌స్ పై త‌గిన చైత‌న్యం క‌లిగించ‌డం జ‌రిగింది. పారిశుద్ధ్యం, సామాజిక దూరంపై త‌గిన అవ‌గాహ‌న క‌ల్పించారు. స‌మావేశాల‌ను, క్ల‌బ్బుల‌ను, జిమ్ముల‌ను పూర్తిగా మూసేయ‌డం జ‌రిగింది.  క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా ఎన్టీపీసీ సింహాద్రి ఆధ్వ‌ర్యంలో 24 ప‌డ‌క‌ల ఐసోలేషేన్ వార్డును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆరోగ్య‌ప‌ర‌మైన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి త‌లెత్తినా దాన్ని ఎదుర్కోవ‌డానికి వీలుగా ఎన్టీపీసీ ఆసుప‌త్రిలో త‌గిన వైద్య ఆరోగ్య సామ‌గ్రిని స‌మ‌కూర్చుకోవ‌డం జ‌రిగింది. దీనికితోడుగా కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుయడం జ‌రిగింది. ఇది 24 గంట‌లూ ప‌ని చేస్తూ లాక్ డౌన్ కు సంబంధించిన అన్ని మార్గ‌ద‌ర్శ‌కాల అమ‌లును ప‌ర్య‌వేక్షిస్తోంది. ఇక ప్లాంట్ లోను, చుట్టుప‌క్క‌ల ప్ర‌దేశాల్లోను, టౌన్ షిప్పులోను, చుట్టుప‌క్క‌ల గ్రామాల్లోను సామాజిక భాద్యతతో యంత్రాల‌ద్వారా క్రిమిసంహార‌క‌ మందుల‌ను విస్తృతంగా పిచికారీ చేయించారు. ఇక వైర‌స్ ను నిరోదించ‌డంలో భాగంగా మ‌రో ముఖ్య‌మైన ప‌నిని ఎన్టీపీసీ సింహాద్రి చేప‌ట్టింది. మ‌నిషి శ‌రీర‌మంతా శానిటైజ్ చేసే ప్ర‌త్యేక ఛాంబ‌ర్ల‌ను ఏర్పాటు చేసింది ఈ ఛాంబ‌ర్ల‌ను వీటిలో ఉప‌యోగించే ర‌సాయ‌న మందుల‌ను ఎన్టీపీసీ సింహాద్రిలోనే త‌యారు చేసుకోవ‌డం జ‌రిగింది.ఈ విధంగా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి ఎన్ని విధానాలుంటే అన్న‌టినీ ఎన్టీపీసీ సింహాద్రిలో ఆచ‌రించ‌డం జ‌రుగుతోంది. ఎన్టీపీసీ సింహాద్రికి చెందిన దీపికా మ‌హిళ‌ల క్ల‌బ్ కూడా సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొని మాస్కుల‌ను, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను పంపిణీ చేసింది.   విద్యుత్ ఉత్ప‌త్తిలో గ‌తంలో ప‌లు రికార్డులు సాధించిన ఎన్టీపీసీ సింహాద్రి ఈ క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో కూడా చిత్తశుద్ధితో ప‌ని చేస్తూ ప్ర‌జ‌ల సేవ‌కు అంకిత‌మైనది.కరోనా లాక్ డవున్ కారణంగా నెలారోజుల నుండి వేసవి ఏoడలలో ఎవరి ఇంటిలో వారు ఉండటం వలన విద్యుత్ వినియోగం అధికమైనా కానీ 24 నాలుగు గంటలు విద్యుత్ కి అంతరాయం కలకుండా ఉత్పత్తి చేస్తు అందిస్తున్న ఎన్టీపీసీ కృషి ఎంతో ప్రశంసనీయం.అంతే కాకుండా సామాజిక భాద్యతలో ఎన్టీపీసీ విరాళాల విష‌యానికి వ‌స్తే ప్ర‌ధాన మంత్రి కరోనా నివారణ సహాయ నిధికి రూ.250 కోట్లు ఇవ్వ‌డం జ‌రిగింది. ఎన్టీపీసీ ఉద్యోగులు త‌మ ఒక రోజు జీతాన్ని అంటే రూ 7.5 కోట్ల‌ను ప్ర‌ధాని మంత్రి కరోనా నివారణ సహాయ నిధికి  కు అందించారు. 


 

 



 

మ్యుత్యాలమ్మపాలెం లో అధీప్ రాజు చేయూత


మ్యుత్యాలమ్మపాలెం లో అధీప్ రాజు చేయూత


           పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:కరోనా సహాయక చర్యల్లో భాగంగా పెదుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధీప్ రాజు,అన్నంరెడ్డి సత్య గార్ల ఆర్ధిక సహాయం తో ఏర్పాటు చేసిన నిత్యవసర సరుకులను అధీప్ రాజు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అన్నంరెడ్డి అజయ్ రాజ్,పయిల శ్రీనివాసరావు,సిరిపురపు అప్పలనాయుడు, పయిల సన్యాసి రాజు,బొంది అచ్చిబాబు,స్పీడ్ మెసేన్,అరిజిల్లి రవి,తిక్కాడ సత్యనారాయణ, మసేను పాల్గొన్నారు.

పారిస్యుద్య  కార్మికులకు అధీప్ రాజు చేయూత


పారిస్యుద్య  కార్మికులకు అధీప్ రాజు చేయూత


             పరవాడ పెన్ పవర్

 

పరవాడ మండలం లో  కరోనా లాక్ డవున్ కారణంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లంకెలపాలెం జివిఎంసి పరిధిలో 85 వవార్డు లోని గంగిరెడ్ల కాలనీ వాసులకు,పారిస్యుద్య కార్మికులకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధీప్ రాజు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి ప్రసాద్,అప్పికొండ మహాలక్ష్మి నాయుడు,శానాపతి గంగ రాజు,కర్రి నర్సింగరావు,దాసరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య ప్రణాళికాధికారిగా శ్రీనివాసరావు


ముఖ్య ప్రణాళికాధికారిగా శ్రీనివాసరావు

 

 స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)

 

 జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి గా వి.శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. బుధవారం ఆయన విధులలో చేరి బాధ్యతలు చేపట్టారు.  ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెవెన్యూ విపత్తు నివారణ కార్యాలయం, విజయవాడలో ఉప సంచాలకులుగా పనిచేస్తూ పదోన్నతి పొంది సంయుక్త సంచాలకులుగా ముఖ్య ప్రణాళి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.  అనంతరం  కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

మానవత్వం చాటుకున్న గ్రామ వాలంటీర్స్


మానవత్వం చాటుకున్న గ్రామ వాలంటీర్స్

 

సీతానగరం, పెన్ పవర్

 

 

 కష్టానికి తోడుగా ఉండే కన్నీటిని మేము తుడుస్తామంటూ ముందుకు వచ్చిన గ్రామ వాలంటీర్స్ నాగంపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లాక్ లాక్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురికి ఐదు కేజీల చొప్పున రైసును ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పత్రికా విలేఖర్లకు భూక్య. సుధారాణి తెలియజేస్తూ ఇటువంటి విపత్తు పరిస్థితుల్లో మంచి మనసున్న దాతల తో పాటు వృద్ధులకు వికలాంగులకు మా వంతు సహకారం అందించడంలో మాకు ఎంతో ఆత్మ సంతృప్తి కలిగిందన్నారు. ఇటువంటి అత్యవసర సేవలలో ప్రజలకు సేవలందించడానికి అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ దోసపాటి శ్యాంసుందర్ సుధాకర్, వడితే వీరబాబు, మానేపల్లి సంజీవ్ కుమార్, చెల్లి వినోద్ కుమార్, వాడితే అరుణ, అల్లంపల్లి రంజిత, మనెల్లి మార్తా, వడితే కరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు దిగజారుడు విమర్శలు మానాలి. 


చంద్రబాబు దిగజారుడు విమర్శలు మానాలి. 

 

 

పెన్ పవర్,  పశ్చిమ గోదావరి బ్యూరో

 

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ నివాసంలో విలేకర్ల సమావేశంలో ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు.

రాష్ట్రాన్ని ఎలా రక్షించాలో ముఖ్యమంత్రి జగన్ చూస్తుంటే ఖాళీగా ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు పానీపాట లేకుండా విమర్శలు చేస్తున్నారు.

ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తుంటే చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు నీతీ నిజాయితీ లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది.

అతని మాటలు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

దేశంలో ఉన్న రాష్ట్రాల అన్నింటి కంటే మన రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉంది.

ఇంటింటా వాలింటీర్లతో సర్వే చేయించి  పాజిటివ్ కేసులు వెలికి తీస్తుంటే ప్రతిపక్షలు కేసులు పెరిగిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు.

83వేలకు పైగా టెస్టులు చేస్తే 73వేలు నెగిటివ్ వచ్చాయి.

పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం. 

ఇవన్నీ హైదరాబాద్ పారిపోయిన చంద్రబాబుకు ఎం తెలుసు.

రెండు పత్రికలు చెప్పిన మాటలు విని చంద్రబాబు అతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

గోదావరి పుష్కరాల్లో సినిమా షూటింగ్ చేసినట్లు చేస్తే అక్కడ 29మందికి పైగా చనిపోవడం నీ అసమర్డత కాదా.

హుద్ హుద్ తుపాను సమయంలో ఇన్ఫుట్ సబ్సిడీ 20వేలు ప్రకటించి నువ్వు పదవి దిగిపోయినా రైతులకు అవి ఇవ్వనేలేదు.

ఎంత సేపు బురదజల్లే ప్రయత్నాలే తప్ప ప్రభుత్వానికి సలహాలిద్దమనే ఆలోచన ఏమైన ఉందా.

రైతులు పండించే ఏ పంట అయినా ఈరోజూ పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తుంది. 

ర్యాపిడ్ కిట్లలో అవినీతి జరిగిందని దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారు. 

రాష్ర్టం ఆ కిట్లు 739కి కొంటె అదే కిట్లను 799కి కొన్నది నీకు దమ్ముంటే కేంద్రాన్ని విమర్శించు.

ఇంత దిగజారిన ప్రతిపక్షం ఎక్కడా లేదు.

స్థానికంగా ఉన్న ఓ నాయకుడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

ఎం మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో  అతనికే తెలియదు.

గురువింద తన కింద ఉన్న నలుపు తనకు తెలియదన్నట్లు కరోనా వ్యాప్తి సమయంలో గోవాలో మీ బీజేపీ ఎలక్షన్లు పెట్టలేదా.

నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి హోదా అక్కర్లేదని చెప్పి ప్రజలకు ద్రోహం చేసిందెవరో తెలుసు.

ఎప్పుడో నెల క్రితం వైసీపీ ఎమ్మెల్యే పొరపాటున చేసిన దాన్ని గురించి ఇప్పుడు చెబుతన్నావు.

అదే ఎమ్మెల్యే ప్రతీ ఇంటింటికీ వెళ్లి ప్రజల బాబాగులు చూస్తూ వారికి అవసరమైనవి అందిస్తున్నారు.

ఇంత సమర్ధవంతంగా పనిచేస్తుంటే ఖాళీగా పనీపాట లేకుండా ఇటువంటి విమర్శలు చేయడం సిగ్గుచేటుఅని అన్నారు. ఈ సమావేశంలో కర్రిబాస్కరరావు, జి. సాంబయ్య, తదితరులు వున్నారు.

రెడ్ జోన్ పరిధి లో ఉన్న ప్రాంతాలను మంత్రి ఆకస్మిక తనిఖీలు


రెడ్ జోన్ పరిధి లో ఉన్న ప్రాంతాలను మంత్రి ఆకస్మిక తనిఖీలు

 

 

పెనుగొండ పెన్ పవర్

 

 

 

రాష్ట్ర  గృహ నిర్మాణ శాఖ మం త్రి  చెరుకువాడ.శ్రీరంగ నాథ రాజు

 

కరోనా వైరస్ తీవ్రముగా ఉన్న తరుణం లో జిల్లా లో కరోనా వైరస్ సోకిన అనుమానితుల కు  3 వేలు మంది కి వైద్య ప రీక్షలు చేయగా 14 వందల మందికి  టెస్టు లు పెనుగొండ లో నిర్వహించడం జరిగిందని రాష్ట్ర  గృహ నిర్మాణ శాఖ మం త్రి  చెరుకువాడ.శ్రీరంగ నాథ రాజు అన్నారు.  బుధవారం  పెనుగొండ, ములపర్రు గ్రామా ల్లో రెడ్ జోన్ పరిధి లో ఉన్న ప్రాంతాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.  ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ  పెను గొండ మండలము లో త్వరిత గతిన టెస్ట్ లు ఎక్కువ టెస్ట్ లుచేయడము వల్ల  మొత్తం 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రావడం జరిగిందన్నా రు. రెడ్ జోన్, హై రిస్క్ జోన్ పరిధి లో ఉన్న ప్రజలు ఏటు వంటి ఇబ్బందులు పడకూడద ని కూరలు, నిత్యావసర సరుకు లు మీ ఇంటికే  ప్రభుత్వ సిబ్బం ది తో పంపడం జరుగు తొంద న్నా రు.  రెడ్ జోన్,హై రిస్క్ జో న్ లో ఉన్న ప్రజలు అవసరమ యితెనే తప్ప బయటకు రా కుండా అప్రమత్తము గా ఉండా లన్నారు. లాక్ డౌన్ ఉన్న కార ణ ముగా పేద ప్రజలకు రెండు విడతలుగా రేషన్ సరుకులు ఉచితముగా పంపిణీ చేయడం జరిగిందని, మూ డో విడత రేష న్ సరుకులు ఈ రోజు నుండి ప్రారంభిన్చడము జరిగిందన్నా రు.  గ్రామాల్లో పరిసరాలు పరి శుభ్రంగా ఉంచాలని అధికారు లను ఆదేశించారు. ఎవరైనా దగ్గు, రొంప, జ్వరము తో బాధ పడితే వెంటనే వైద్యు లనీగాని, అధికారులకు తెలి యజేయాల న్నారు. రెడ్ జోన్, హై రిస్క్ జో న్ పరిధిలో ఉన్న పోలీసు అధి కారులు పటిష్ఠ ము గా బందో బస్తు నిర్వహిచాలన్నారు. గ్రా మాల్లో నీ ప్రజలకు ఏటువంటి త్రాగునీటి ఇబ్బందులు రాకుం డాచూ సుకోవాలని అధికారుల ను మంత్రి ఆదేశించారు. మార్గ మధ్యలో మంత్రి ధాన్యం ఆర బోసిన రైతులతో మాట్లాదుతూ ఈ లాక్ డౌన్ వల్ల రైతులకు ఎ టువంటి ఇబ్బందులు రాకుడ దని ముఖ్యమంత్రి వై.ఎస్. జగ న్ మోహన్ రెడ్డి ఆదేశించార న్నారు.  జిల్లా లో ధా న్యం కొ నుగోలు కేంద్రాల ద్వారా ఇ ప్పటి వరకు 76 వేల 605 టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేయగా రైతుల కు 140 కోట్ల రూపాయలు 5 వేల 556 రైతు లకు సొమ్ము బ్యాంక్ అకౌంట్ల లో జమచేయ బడిందన్నారు. 11 వేల 443 మంద రై తుల కి లక్షా 59 వేల రూపాయ లు ధా న్యం కొనుగోలు చేయగా 289 కోట్ల రూపాయలు ఇంకా రైతు ల బ్యాంక్ ఖాతా లకు జ మచే యాల్సి ఉందన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...