ప్రతీ నీటిబొట్టు చాలా విలువైంది..
ఇంటింటికి తాగునీరే లక్ష్యం..
విస్సాకోడేరు లాకువద్ద అడ్డుకట్ట..
తాగునీటి పై ప్రతీ రోజూ పర్యవేక్షణ ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్
భీమవరం, పెన్ పవర్
ప్రతీ నీటి బొట్టు చాలా విలువైందని, భీమవరంలో ప్రతీ ఇంటికి తాగునీరందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎంఎ ఏ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. వేండ్ర వెళ్లే దారిలోని జి ఎన్వికెనాల్ కు విస్సాకోడేరు లాకు వద్ద అడ్డుకట్ట వేసే పనులకు ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్యా లాకు వద్ద అడ్డుకట్ట వేసి ఇంజన్లు ద్వారా నీటిని చెరువుల్లోకి తోడతామన్నారు. ఈ కార్యక్రమం మున్సిపాల్టీలో ఇప్పటి వరకూ ఎవరూ చేపట్టలేదని, ఇదొక చరిత్రని, దీనివల్ల పట్టణంలో వేసవి రోజుల్లో తాగునీటి ఇబ్బందులు ఉండవని, ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమంది అధికారులకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. రిజర్వాయర్లలో నీటి లెవిల్స్, ట్యాంకర్ల ద్వారా నీరు ఎక్కడికి వెళ్తుంది, జిపిఎస్ సిస్టం, సిసి కెమెరాల మోనటరింగ్ లాంటి పనులను డిఇ నారాయణరావు పర్యవేక్షిస్తారని, తాగునీరు పట్టణంలో ఏ విధంగా సరఫరా అవుతుంది, ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయనే దానిపై డిపై రాజారావు, ఎఇలు పర్యవేక్షిస్తారని అన్నారు. తాను ప్రతీ రోజూ తాగునీటి పంపిణీ పై పర్యవేక్షణ చేస్తామన్నారు. గతేడాది పట్టణంలోని ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బందులు పడ్డారని, ఆనాటి సమయంలో ట్యాంకర్లను బయటకు విక్రయించుకోవడం లాంటి అనేక అక్రమాలు జరిగాయని, నేడు వాటన్నింటిని అదుపులోకి తీసుకొచ్చి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. బుధవారం మార్కెట్ నందు ఉన్న పంప్ హౌస్ కు మూడు 30 హెచ్ పి మోటార్లను , మూడు 25 హెచ్ పి మోటర్లను రూ 5 లక్షల మున్సిపల్ నిధులతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వీటివల్ల తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదన్నారు. అయితే అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, సినిమా ధియోటర్లు, హెటల్స్ యజమానులు కుళాయి నుండి మోటార్లు ద్వారా నేరుగా నీటిని తోడుకుంటే చర్యలు తీసుకుంటామని, కుళాయిలనుండి సంపులకు నీటిని పట్టుకుని సంపుల్లోని నీటిని మోటార్ల ద్వారా తోడుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కుళాయి కనెక్షన్ లు వెంటనే రద్దు చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతీ ఇంటికి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని అన్నారు. పట్టణంలో ఎవరికి సంపులున్నాయి, ఎవరికి లేవు అనే దానిపై వలంటీర్ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని తెచ్చుకున్నామని అన్నారు. ప్రస్తుతానికైతే మంచినీటి చెరువులను పూర్తిగా నింపడం జరిగిందన్నారు. రిజర్వాయర్ల నుండి ఇటీవల ఒక వ్యక్తి అక్రమంగా ట్యాంకర్ ద్వారా నీటిని తరలించిన విషయంలో అతడిపై కేసు నమోదు చేయడంతో పాటు ట్యాంకర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు. తాగునీటి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని, పట్టణంలో ఏ ఇంటిలోనూ దాహర్తి సమస్య లేకుండా కృషి చేస్తున్నానని ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ కమీషనర్ కె రమేష్ కుమార్, ఎం ఇ ప్రసాద్, డిఇలు నారాయణరావు, రాజారావు, ఏఇలు, ఏఎంసి ఛైర్మన్ తిరుమాని ఏడుకొండలు పాల్గొన్నారు. అనంతరం మంచినీటి చెరువులను, నీటి నిల్వలను పరిశీలించారు.
No comments:
Post a Comment