Followers

ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం.

ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం.

నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్.

 ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైకిళ్ళు

 ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయలు  నష్టం.

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

ఒకే పార్టీ నాయకుల మధ్య తలెత్తిన వర్గపోరు ప్రభుత్వ లక్ష్యాన్ని సైతం నీరుగార్చింది. పేద వికలాంగులకు ఉపయోగపడే మూడు చక్రాల సైకిలు అందించాలని ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి వీల్చైర్ లను సమకూరిస్తే ఆదిపత్య పోరుతో  అవి కాస్త పంపిణీకి నోచుకోలేదు. పది నెలలుగా ఎండలో ఎండి వానలో తడవడం వల్ల మూడు చక్రాల సైకిళ్ళు తుప్పు పట్టి పోయాయి. వాటిని వికలాంగులకు అందించిన వాటిని స్క్రాప్ కింద  కిలోల లెక్కన అమ్ముకోవాల్సిందే.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్ళు ను  2020 ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా  మండల పరిషత్ కార్యాలయాలకు చేరాయి. అధికారులు వాటిని స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ జరగాల్సి ఉంది. కానీ జిల్లాలో పాయకరావుపేట  నియోజకవర్గం  ఎస్ రాయవరం మండలం లో వికలాంగులు సైకిళ్ళు   పంపిణీ జరగలేదు. ప్రభుత్వం ఉచితంగా మూడు చక్రాల సైకిలు  ఇస్తుందని  వికలాంగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పది నెలలు అవుతున్న వీల్చైర్ ల పంపిణీ కి  నోచుకోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే  అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీల మధ్య తలెత్తినా వర్గ వివాదం  సంక్షేమ పథకాలను మూలకు చేరుతున్నాయి. మండలంలో గుర్తించిన వికలాంగులకు అవసరమైన  80  వికలాంగు సైకిళ్లను ఆగస్టులో పరికరాలు తెచ్చి బిగించారు. నేతల మధ్య పోరు మూడు చక్రాల సైకిల్ పంపిణీకి గ్రహణం పట్టింది.

వాటిని పంపిణీ చేయడానికి  స్థానిక ఎంపిడిఓ  చొరవ చూపకపోవడంతో  మూడు చక్రాల సైకిలు మూలకు చేరాయి. వాటిని మండల కేంద్రంలో రెల్లి వీధి ఆర్ బి కె   వద్ద పడేశారు. ఆగస్టు తర్వాత కురిసిన వర్షాలు  ఆతర్వాత ఎండలకు వికలాంగులు సైకిల్ లు పూర్తిగా పాడైపోయాయి. వాటిని చూస్తే  కాలం చెల్లిన మూడు చక్రాల సైకిలు  అనుకోక తప్పదు. తుప్పు పట్టి పోయి సీట్లు  కూలిపోయి గుట్టలుగా పడి ఉన్న స్క్రాప్ ల  దర్శనమిస్తుంది. వికలాంగుల కోసం  ప్రభుత్వం లక్షలు వెచ్చిస్తే  ఇరువురు నేతల వర్గ పోరు తో  అవి కాస్త బూడిదలో పోసిన పన్నీరు అయింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలు పేదలకు చేరుతున్నాయి అని ఆశిస్తున్నారు. కానీ అక్కడ అక్కడ పార్టీ నాయకుల్లో  తలెత్తిన అవాంతరాల కారణంగా  పధకాలు పేదలకు చేరడం లేదన్న నగ్నసత్యం  పెరుమాళ్ళకెరుక. మూడు చక్రాల సైకిల్ నష్టాన్ని ఎవరు పూడుస్తారు. ఈ నాయకులా? లేక సంబంధిత అధికారులా?..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...