జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్ష
అభివృద్ధిలో పచ్చదనానికి ప్రాధాన్యతరోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్
విజయనగరం, పెన్ పవర్
అభివృద్ధి కార్యక్రమాల్లో పచ్చదనానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, భూ సేకరణ, ఇతర అంశాలపై శుక్రవారం తన చాంబర్లో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నం-రాయపూర్ జాతీయ రహదారి, విజయనగరం బైపాస్ రోడ్డు, సాలూరు బైపాస్, మానాపురం ఆర్వోబి, పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని 12 రోడ్ల నిర్మాణం, వాటి ప్రస్తుత స్థితి పై ఆరాతీశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రహదారుల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారి నిర్మాణంలో మొక్కలు వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించారు. విజయనగరం బైపాస్ రోడ్డులో మొక్కలు నాటే పనులను వెంటనే ప్రారంభించలన్నారు. ఈ నెలాఖరు నాటికి డివైడర్ లో మట్టిని నింపి, ఇరువైపులా మొక్కలను నాటేందుకు గోతులు సిద్ధం చేయాలన్నారు. జూన్1 నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ ఎక్కువై, కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. దీనిని అరికట్టాలంటే మొక్కలను నాటడమే ఏకైక మార్గమన్నారు. అందువల్ల ఒకవైపు రహదారిని పూర్తి చేస్తూనే, మరోవైపు మొక్కలు నాటడం మొదలు పెట్టాలని సూచించారు. రోడ్డు పూర్తి అయ్యేటప్పటికి, మొక్కలుకుడా బాగా పెరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్డీసి హెచ్వి జయరాం, ట్రాన్స్ కో ఎస్ఈ వై.విష్ణు, ఆర్అండ్బి ఎస్ఈ విజయశ్రీ, పిఆర్ ఎస్సీ గుప్త,. ఉద్యానశాఖ డిడి శ్రీనివాస్, నేషనల్ హైవేస్ ఏఇ ఈ సురేష్ కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment