అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు
శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు
పట్టించుకోని పలు విభాగాల పోలీసులు
పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు
యువకుల నుంచి బడా వ్యాపారులవరకు బెట్టింగ్
గ్రామీణ ప్రాంతాలకు పాకిన బెట్టింగులు
పీసీపల్లి పెన్ పవర్ ఏప్రిల్ 1
ఐపీఎల్ సీజన్ కొందరి జీవితాల్లో వెలుగు నింపుతుండగా మెజార్టీ వారి జీవితాలు బుగ్గిపాలు చేస్తోంది. బెట్టింగ్ కు పాల్పడుతూ లక్షలరూపాయలు నష్టపోతున్నారు.. తమతమ ఆర్థిక స్థోమతను బట్టి బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ వంటి నగరాల్లో పరిమితమైన బెట్టింగ్ నేడు గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కాగానే బెట్టింగ్ జోరు కొనసాగుతోంది. ప్రతిరోజూ బెట్టింగ్లు జరుగుతున్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మరుతున్నాయి. పోలీసులు నిఘా పెట్టినా అడ్డాలను మార్చుతూ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది.. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే - పరిమితంగా ఉండే బెట్టింగ్ వ్యవహారం నేడు గ్రామీణ ప్రాంతాల్లో యువకులు కూడా బెట్టింగ్లకు పాల్పడుతున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు..
వేసవిలో వస్తున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై ప్రతిరోజు లక్షల్లో బెట్టింగులు నడుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్ అభమానులు. యువత బెట్టింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతుంటారు. ఇందుకోసం ఒక గ్రూపుగా ఏర్పడి లక్షల్లో బెట్టింగ్ లు చేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేక గదుల్లో టీవీలతో సెటప్ చేసుకుని, బెట్టింగ్లు నిర్వహిస్తుంటారు. తమ మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ మ్యాచ్లను లైవ్లో చూస్తూ అప్పటికప్పుడు తమ స్నేహితులతో కలిసి బెట్టింగ్ లలో లక్షలు పెడుతుంటారు. బెట్టింగ్ ల దందాను అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పెద్దగా నిఘా పెట్టడం లేదు.. బెట్టింగ్ ముఠాలు ప్రతిరోజు పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తూ.సొమ్ము చేసుకుంటున్నాయి. దీంతో కొంతమంది బెట్టింగ్ లలో నష్టపోతున్నారు. యూత్ నుంచి మొదలు బడా వ్యక్తుల వరకు అందరూ బెట్టింగ్ లో పాల్గొంటూ, లక్షలు పొగొట్టుకుంటున్నారు. చాలా మంది ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. పోలీసులకు ఏమాత్రం దొరకకుండా, గుట్టుచప్పుడు కాకుండా అంతా కోడ్ పద్దతిలో బెట్టింగ్ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. పోలీసులు ఈసారి ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ లపై సరైన నిఘా పెట్టకపోవడంతో, మరింత యథచ్చేగా బెట్టింగ్ దందాను సాగిస్తున్నారు.
అంతా కోడ్ బాష లోనే
బెట్టింగ్ లో పాల్గొనే వారికి నిర్వహకులు అంతా కోడ్ భాషలోనే లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఏమాత్రం పోలీసులకు అనుమానం రాకుండా, తెలిసిన వారిని మాత్రమే బెట్టింగ్ లోకి తీసుకుంటారు. కొత్తవారిని ఏమాత్రం తీసుకోరు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు
గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దందాలు పందెంలో గెలిచినా ఓడినా సరే డబ్బు కూడా ఆన్లైన్లోనే బదిలీ అవుతోంది. ముఖ్యంగా ఆన్లైన్ సర్వీస్లు అయిన గూగుల్పే, పేటీఎం, ఫోన్ పే యాప్ల నుంచి నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ వ్యవహారం జరుగుతుండడంతో ఎక్కడ ఏ చిన్న అనుమానం రాకుండా గుట్టుగా వ్యవహారం కొనసాగుతోంది.
బెట్టింగ్లో దొరికితే చిక్కులే.
బెట్టింగ్ మాయలో పడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేస్తారు. పోలీసులరికార్డుల్లో పేరు, చిరునామా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. బెట్టింగ్ఆడుతూ లేదా నిర్వహిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవు. యువత సన్మార్గంలో నడవాలి. ఈజీ మనీకి అలవాటు పడి చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు. ప్రభుత్వం ఉద్యోగాలకునోటిఫికేషన్ ఫికేషన్ వేస్తోంది ఉంది. ఉద్యోగా ఉద్యోగాలు సాధించేలా చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా ఉద్యోగాలు సంపాదించాలి. ఇలాంటి వ్యవహారాల్లో తల దూర్చకూడదు.
రోజురోజుకు విస్తరిస్తున్న బెట్టింగ్
ఐపీఎల్ పేరిట బెట్టింగ్ దందా చాపకింద నీరులా వ్యాపి స్తోంది. బెట్టింగ్ కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. మరీ ముఖ్యంగా యువత బెట్టింగ్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నది. కొందరు ఈజీ మనీకి అలవాటు పడి సర్వం కోల్పోతున్నారు. క్రికెట్ ప్రేమికుల వ్యసనాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి తమను తామే కాపాడుకోలేనంత ఉచ్చులోకి వెళ్లిపోతున్నారు.. అప్పులు ఇచ్చిన వ్యక్తులు వేధిస్తున్న క్రమంలో డిప్రెషనకు లోనవుతున్నారు. అప్పుల బాధ భరించలేక ఆస్తులు అమ్ముకున్న వారు కొందరుంటే ఆత్మహత్యలకు పాల్పడి జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్న వారు పోలేదు. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ లో సాగిపోతున్న ఈ నయా జూదానికి పోలీసులు సైతం ముక్కుతాడు వేయలేకపోతున్నారు.రికార్డు స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి.. పోలీసులు నిఘా పెట్టినా అడ్డాలను మార్చుతూ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది.. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితంగాఉండే బెట్టింగ్ వ్యవహారం నేడు గ్రామీణ ప్రాంతాల్లో యువకులు కూడా బెట్టింగ్లకు పాల్పడుతున్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు.. ముఖ్యంగా యువత బెట్టింగ్ జాడ్యాలకు తమ నిండు నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా బెట్టింగ్లకు పాల్పడటం అప్పులు కావడం వాటిని తీర్చేందుకు నానాతంటాలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
No comments:
Post a Comment