అర్హులైన అందరికీ వ్యాక్సిన్.
సంతబొమ్మాళి, పెన్ పవర్.
కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు దాటిన అర్హులందరికీ కరోనా మొదటి మరియు రెండో డోస్ వ్యాక్సిన్ వేస్తున్నామని సంతబొమ్మాళి మండలం నౌపడ ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ కోదండ రావు తెలియజేశారు. గురువారం 176 మందికి మరియు శుక్రవారం 69 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. గురువారం మొదటి డోస్ వేయించుకోవడానికి వచ్చిన వై ఎస్ ఆర్ సి పి జెడ్పిటిసి అభ్యర్థి పాల వసంత రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం రెండో విడత కరోనా వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన విలేఖర్ల బృందానికి వేశారు. ఈ సందర్భంగా వైద్యులు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 1800 వ్యాక్సిన్ కేంద్రానికి రాగా వచ్చిన వ్యాక్సిన్ పూర్తిగా వెయడం జరిగిందని ఆయన తెలిపారు. ఫీవర్ సర్వే విస్తృతస్థాయిలో డోర్ టు డోర్ చేయిస్తున్నామని ఇప్పటి వరకు జరిగిన కరోనా టెస్టుల్లో 51 మంది హాంఐసోలేషన్ లో ఉండగా 36 మంది పూర్తిగా కోలుకున్నారని తెలుపుతూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయపడకుండా ముందుకు వస్తున్నారని వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ పూర్తిచేసి వ్యాక్సినేషన్ వేస్తున్నామని ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్ కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపిన వరకు టీకా వేస్తున్నామని, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్లు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి శానిటేషన్ వినియోగిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఇంటి వద్ద ఉండి భద్రతా చర్యలు చేపట్టినట్లు అయితే కరోనాను పూర్తిగా జయించొచ్చు అని, బలమైన ఆహారం తీసుకొని, అవసరం ఉన్నంత వరకు విశ్రాంతి తీసుకుంటూ, పలు ఆరోగ్య సూత్రాలను పాటించటం వలన కరోనా దరిచేరదని ప్రజలు భయపడవద్దని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment