Followers

ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతో ప్రభుత్వ ఆదేశాలను కూడా బేఖాతర్ చేసిన  మద్యం దుకాణ సిబ్బంది!


ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతో ప్రభుత్వ ఆదేశాలను కూడా బేఖాతర్ చేసిన  మద్యం దుకాణ సిబ్బంది!



 పెదబయలు, పెన్ పవర్:


 


మండల కేంద్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చాటుమాటుగా అమ్మకాలు అధికారుల కనుసన్నల్లో నిర్భయంగా జరుగుతున్నాయని విమర్శలు వెల్లెవేత్తడంతో అధికారులు స్పందించారు. మంగళవారం పెదబయలు ప్రభుత్వం మద్యం దుకణాన్ని పాడేరు సర్కిల్ ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ 
జి, రమణ రావు ప్రభుత్వ మద్యం దుకాణం నుు  పరిశీలించగా నిబంధనల ప్రకారం దుకాణానికి అమర్చి ఉన్న సెటర్ (తలుపు)మొదటి రోజే  మూడుచోట్ల  తాళాలు వేయవలసి ఉండగా... అలాగే ఆ తాళాలు వేసి దానిపై  లక్క మార్క్ ముద్ర శీలు వేయ చేయవలసి ఉండగా  నామమాత్రంగా మధ్యలో ఒక తాళం కప్ప మాత్రమే వేసి ఉంది దానిపై తెల్లటి గుడ్డ చుట్టి వదిలివేశారు, దీనిని బట్టి చూస్తే రాత్రిపూట యధావిధిగా బయటకు అధిక రేట్లకు అమ్మి  జేబులు నింపుకుంటున్నారని దీని వెనకాల అధికారుల అండదండలు ఉంటాయని పలువురు  విమర్శలు చేస్తున్నారు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల సిబ్బంది ఇష్టారాజ్యం ఏలుతున్నారని  దీనిని బట్టి అర్థమవుతుంది మంగళవారము టీవీ ఛానళ్లలో ప్రచారము కావటంతో పాడేరు సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ శాఖ 


జి రమణ రావు హుటాహుటిన వచ్చి  మొదటిసారి వేసిన  తాళం పై  తెల్లటి గుడ్డ చుట్టి ఎరుపు రంగు లక్క అంటించి ముద్రవేసి వెనుతిరిగారు ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా మందు కోసం వచ్చిన వారే ఈ అఘాత్యాలు చేసి  శీలు  పీకి పడేసి ఉంటారని సమాధానమిచ్చారు.


మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, దయచేసి బయటకు తిరగకండి,


విజయనగరం,  పెన్ పవర్


 మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, దయచేసి బయటకు తిరగకండి, మీ కుటుంబాలను కాపాడుకోండి, లాక్ డౌన్ పాటిస్తూ అధికారులకు సహకరించండి అంటూ విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు, పాదచారులకు అభ్యర్థించారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలో పరిస్థితి, తన వాహనం పై వెళుతూ నగరమంతా కలియతిరిగారు. బాలాజీ జంక్షన్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహనదారులను ఆపి ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా దయచేసి లాక్ డౌన్ సమయంలో బయట తిరగవద్దు అని వాహనదారులను అభ్యర్థించారు. వారికి అవగాహన కల్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా మరింత జాగ్రత్త అవసరం అని వారికి నచ్చచెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, ఇంటికే పరిమితం కావాలని, నిత్యావసర సరుకులు అందుబాటులోనే ఉన్నాయి అని ఎవరు కలత చెంద వద్దని ఎమ్మెల్యే కోలగట్ల వారితో అన్నారు. అనంతరం ప్రధాన రహదారులపై నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న క్లోరిన్ పిచికారి పనులను ఎమ్మెల్యే కోలగట్ల పర్యవేక్షించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ వద్ద ఉన్న ట్యాంకర్ల తో పాటు, ఎమ్మెల్యే కోలగట్ల వ్యక్తిగతంగా మరో ట్యాంకర్ ను కూడా తెప్పించి నగరంలో ఆయా డివిజన్లలో పిచికారి పనులకు ఉపయోగించే విధంగా చూడాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. అదే సమయంలో మూడు లాంతర్ల వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి గుడి వద్ద ఏ ఆధారం లేని నిరుపేదలకు ఆహార పొట్లాలను ఎమ్మెల్యే కోలగట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దినసరి కూలీ చేసుకున్న వారు కానీ, రేషన్ కార్డు లేని వారు కానీ కలత చెంద వద్దని అన్నారు. అన్నార్తులకు ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు ఆయా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పైడితల్లి అమ్మవారి గుడి వద్ద పగలు, రాత్రి సమయాలలో ఏ ఆధారం లేని నిరుపేదలకు ఆహారం అందించడం జరుగుతుందన్నారు. అలాగే కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కూడా నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఎక్కడైనా పేదవారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు, ఆకలి బాధతో ఉన్న వారు ఆయా ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సంప్రదించాలని, లేదా స్థానిక శాసన సభ్యునిగా తాను అందుబాటులో ఉంటానని, నాయకుల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లాక్ డౌన్ పిలుపును విజయవంతం చేస్తూ, ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉంటూ, కరోనా వైరస్ ను తరిమి కొట్టాలన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల వెంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ వి వి రాజేష్, సత్త రావు శంకర్రావు తదితరులు ఉన్నారు.


"శ్రీ సిటీ సేవలు"  అభినందనీయం.


"శ్రీ సిటీ సేవలు"
 అభినందనీయం.
పెన్ పవర్, చిత్తూరు/ సత్యవేడు


శ్రీసిటీ ప్రముఖ పారిశ్రామికవాడలో మెండాలిజ్ చాక్ల్ టు పరిశ్రమ వారు, పోలీస్ వారు, వారి సిబంది, లాక్ డౌన్ సందర్బంగా వారు చేసుతున్నా సేవలు మరుపురానివని శ్రీసిటీ పరిశ్రమల అధికారి వారిని అభినందించారు. కరోనా -19, మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, ప్రభుత్వం ఆదేశాలుమేరకు వారు ప్రాణాలనులెక్క చేయకుండా, సమయానికి తిండి, తిప్పలు లేకుండా ప్రతినిత్యం సేవసేస్తున్నవారికీ, మనం సహకరించక పోతే ఈ జీవితంనకు, అర్ధం, పరమార్ధం ఉండదని, పరిశ్రమల అధికారులు, ప్రతినిధులు ఈ సందర్బంగా శానిటైజేర్, మాస్కులు, బోర్నవిటా, హేల్తిడ్రింక్స్ పౌడర్లు. సుమారు 4లక్షలు రూపాయలు విలువ చేసే 400 కిట్లను శ్రీసిటీ, తడ, సూళూరుపేట,సత్యవేడు, వరదయ్యపాలెం మండలంలోని పోలీస్ అదికారులకు మరియూ వారి సిబందికి అందజేశారు.ఈ సందర్బంగా పరిశ్రమ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ యావత్ ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ఉంటే పోలీసులు మాత్రం తమ ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా, ప్రజలసంక్షేమమ్ కోసంఅహరిని శలు కటపడుతున్న, వారిఆరోగ్యం కోసంఈ కిట్లును అందించారు. లాక్ డౌన్ఉన్నoత వరకు పోలీస్ వారికీ, మరియు శ్రీసిటీ సెక్యూరిటీ సిబందికి రోజుకు సుమారు 30లీటర్లు మజిగను అందజేస్తామనారు. ఈ సందర్బంగా శ్రీసిటీ డీస్పీ విమలాకుమారి, సిఐ జగదీశ్ నాయక్, వారిసేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మెండలీజ్ చాక్లెట్ పరిశ్రమ ఉద్యోగులు భాస్కర్ రావు, కేవీ సత్యనారాయణ, శ్రీ శర్మ, సుధాకర్, సంతోష్, సతీష్ తథి దరులు పాల్గొన్నారు.


తబ్లిగి జమాత్ వారు ఢిల్లీ వెళ్లి  వచ్చిన వారు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా వారి సంఖ్య

తబ్లిగి జమాత్ వారు ఢిల్లీ వెళ్లి  వచ్చిన వారు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా వారి సంఖ్య


వారిని త్వరగా తమ ఉళ్ళల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి  చెక్   చేయంచుకుని చికిత్స తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది...సమాజ హితం కోరి  వారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కొరింది.



శ్రీకాకుళం జిల్లా    0


విజయనగరం జిల్లా      3


విశాఖపట్నం రూరల్.   1


విశాఖపట్నం సిటీ.     41


తూర్పు గోదావరి జిల్లా     6


పశ్చిమ గోదావరి జిల్లా   16


రాజమండ్రి.             21


కృష్ణ జిల్లా.              16


విజయవాడ సిటీ.      27


గుంటూరు అర్బన్.    45


గుంటూరు రూరల్.    43


ప్రకాశం జిల్లా.           67


నెల్లూరు జిల్లా.          68


కర్నూల్ జిల్లా.           189


కడప జిల్లా.               59


అనంతపూర్ జిల్లా.     73


చిత్తూరు జిల్లా.           20


తిరుపతి.                  16


                Total.      711


కరోనా (కోవిడ్-19) నేపథ్యంలో ప్రజలకు, మీడియాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనలు

 


కరోనా (కోవిడ్-19) నేపథ్యంలో ప్రజలకు, మీడియాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనలు


అమరావతి, పెన్ పవర్


• ఇది మానవాళి మునుపెన్నడూ ఎరుగని విపత్తు కాలం,కంటికి కనపడని శత్రువు (కోవిడ్-19) తో మనం యుద్దం చేస్తున్న సమయమిది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు అనే తేడా లేకుండా ప్రతీ చోటా కోవిడ్-19 ప్రభలతుంది.


• ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రభుత్వాలు, ప్రజలు కరోనా పై అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. 


• ఈ ప్రయత్నంలో సాంప్రదాయ సమాచార, వార్తా సంస్థలతో పాటూ ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, షేర్ చాట్, టిక్ టాక్ వంటి అనేక సామజిక మాధ్యమాలు, వెబ్ సైట్లు, మొబైల్ యాప్స్ వంటి ఇతర డిజిటల్ మాధ్యమాలను మనం ఉపయోగిస్తున్నాం. 


• కొంతమంది తమ అవగాహనా లోపం వల్ల, లేదా ఆకతాయితనం వల్ల అనేక రకాల తప్పుడు సమాచారాన్ని, వదంతుల్ని వ్యాపింప చేస్తున్నారు. ఈ తప్పుడు సమాచారం, వదంతులు కూడా మరొక మహమ్మారిగా తయారై సాధారణ ప్రజలకి, ప్రభుత్వ యంత్రాంగానికి మరో సవాలుగా పరిణమిస్తున్నాయి. 


• అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బాధ్యతారహితమైన ఈ విచ్చలవిడి తప్పుడు సమాచార, వదంతుల వ్యాప్తిని ఇన్ఫోడెమిక్ (Infodemic)గా అభివర్ణించింది.     


ఆంధ్రప్రదేశ్ పౌరులకు, మీడియాకుసమాచార పౌరసంబంధాల శాఖ విభాగం కింది సూచనలు చేస్తున్నది...


• డిజిటల్ మాధ్యమాలలో మీకు వచ్చిన సమాచారాన్ని ఇతరులతో పంచుకునే ముందు బాధ్యతతో,కొంచెం జాగ్రత్త తో వ్యవహరించండి.  సమాచార ప్రామాణికతను రూఢీ చేసుకోకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ సమాచారాన్ని ఇతరులకు చేరవేయవద్దు. 


• వాట్సాప్ వంటి వేదికలలో బృంద సభ్యులు ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాపింపచేస్తే ఆ బృందపు అడ్మిన్స్ దానికి బాధ్యులవుతారు. చట్టపరంగా విచారణను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.  


• డిజిటల్ మాధ్యమాలను ఇప్పుడిప్పుడే వాడుతున్న వారు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం లేని వారి విషయంలో మనం మరింత దృష్టి పెట్టాలి. వారికి ఆ మాధ్యమాలకున్న బలం, బలహీనతలు, పరిధులు,  పరిమితులు, అనుకూల, ప్రతికూలతల గురించి వివరంగా చెప్పాలి. వాటి దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన కలిగించాలి.


• కరోనా మహమ్మారి విషయంలో అనేక రకాల తప్పుడు సమాచారం వ్యాపిస్తున్నది. ఇటువంటి సందర్భాల్లో వ్యక్తిగత వివరాల గోప్యత అత్యంత ముఖ్యమైన అంశం. వ్యాధి బారిన పడిన వ్యక్తుల గురించి ఎవరు సమాచారం పంపినా దాన్ని మీరు ఇతరులకు పంపకండి. మొదటగా ఆ సమాచారం ప్రామాణికమైనది కాకపోవచ్చు, ఒక వేళ అది ప్రామాణికమైనదైనా అది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించవచ్చు.


• ఇది అనైతికమే కాదు శిక్షార్హమైన నేరం,విపత్తుల విషయంలో వదంతులను, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే వారికి విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని 54వ సెక్షన్ ప్రకారం ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష ఇంకా జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంకా ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం కూడా తప్పుడు సమాచార ప్రచారం శిక్షార్హమౌతుంది.  


• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం, 1897 లోని సెక్షన్ 2,3 మరియు 4 క్రింద సంక్రమించిన అధికారాలను అనుసరించి జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్, 2020 ద్వారా కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి, అదుపులో ఉంచటానికి మరియు నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి జీవో ఆర్టీ నెం. 189,హెమ్ మరియు ఎఫ్ డబ్లూ (బీ2) ని విడుదల చేసింది. ఈ నిబంధనలలోని 9వ సెక్షన్ ప్రకారం కరోనా వైరస్ కు సంబంధించినా, ఎటువంటి సమాచారాన్నైనా సంబంధిత అధికారులతో ధృవీకరించుకోకుండా వార్తా పత్రికలు, టీవీ చానెళ్లు, సామాజికమాధ్యమాలలో వ్యాప్తి చేయకూడదు. దీనికి విరుద్ధంగా వదంతులు, తప్పుడు సమాచారాన్ని ఎవరైనా వ్యాప్తి చేస్తే సంబంధిత చట్టాల కింద శిక్షార్హులవుతారు.


• ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రామాణిక సమాచారం అందరికీ అవసరం. కరోనా సమరంలో అది చాలా కీలకం. డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించే వారు ఏ సమాచారం, వార్త ప్రామాణికతపై సందేహం వచ్చినా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే సమాచారం, ప్రధాన స్రవంతి వార్తా మాధ్యమాలు ప్రచురించే, ప్రసారంచేసే సమాచారంతో పోల్చి సరిచూసుకోవాలి.       
సమాచార మాధ్యమాలకు సమాచార పౌర సంబంధాల శాఖ సూచనలు:


1. కరోనా మహమ్మారిని రూపుమాపడంలో సమాచార మాధ్యమాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రవ్యాప్త లాక్ డౌన్ కి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసే మహత్తర బాధ్యతను అవి నిర్వర్తిస్తున్నాయి. మీకు, మీ సిబ్బందికి ధన్యవాదాలు.


2. సామాజిక మాధ్యమాల వ్యాప్తిలో ఉన్న సంచలనాత్మక, భయాందోళనలకు గురిచేసే, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కొన్ని ప్రధాన స్రవంతి వార్తా పత్రికల ఆన్లైన్ ఎడిషన్లు, వెబ్ మ్యాగజైన్లు, ఆన్లైన్ న్యూస్ సైట్లు యధాతథంగా, అధికారిక వార్తలతో సరిపోల్చకుండా ప్రచురిస్తున్నాయి. అదేవిధంగాఎలక్ట్రానిక్ మాధ్యమాలు తమ యూట్యూబ్ ఛానెళ్లలో ఇటువంటి వార్తలను ప్రసారం చేస్తున్నాయి. 


3. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు చాలా వార్తలను తప్పుదోవ పట్టించే థంబ్నెయిల్స్ (thumbnails)తో పోస్ట్ చేస్తున్నాయి. సంబంధిత శీర్షికకు, క్రింద ఇచ్చేసమాచారానికి సంబంధం లేని ఈ థంబ్ నెయిల్స్ వీక్షకుడిని తప్పుదోవ పట్టించడమే కాకుండా, సమాచారాన్నీ కలుషితం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అవహేళన చేసే విధంగా, వారిపై చులకన భావం కలిగించేదిగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేవిధంగా ఈ వీడియోలు ఉండడం విచారకరం. ఇది అనైతికమే కాదు ఆ డిజిటల్ మాధ్యమాల నిబంధనలకు విరుద్ధం. 


4. పదే పదే ఇటువంటి తప్పుదోవ పట్టించే వార్తలు, వీడియోలని ప్రచురించే, ప్రసారం చేసే వేదికలపై సమాచార పౌరసంబంధాల శాఖ సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థల దృష్టికి తీసుకెళ్లి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఇటువంటి వార్తలు, వీడియోలను పోస్టు చేస్తున్న ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ల కు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిపివేసే  అవకాశం ఉంటుంది. తరచుగా తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే చానెళ్లను ఆ సామాజిక మాధ్యమ సంస్థలు పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంది.


5. పైగా ఇటువంటి వార్తలు, వీడియోలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం, 1897 లోని సెక్షన్ 2,3 మరియు 4 క్రింద సంక్రమించిన అధికారాలను అనుసరించి జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్, 2020,  విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని 54వ సెక్షన్, ఐపీసీ సెక్షన్ 505 కింద ఉల్లంఘనలుగా పరిగణించబడతాయి. పై చట్టాలే కాకుండా ఇతర నిబంధనలను అనుసరించి ఆ సంస్థలు/ సంస్థల యజమానులు శిక్షార్హులవుతారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలకు డిజిటల్ మీడియా వేదికలు అత్యంత ప్రయోజనకారి అవుతాయి. అనేక వార్తా సంస్థలు, సమాచార మాధ్యమాలు డిజిటల్ మాధ్యమాలను అత్యంత ప్రభావవంతంగా సమాజహితం కోసం వాడుతున్న వారందరికీ ధన్యవాదాలు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి, అంతిమంగా విజయం సాధించడానికి సామాన్య ప్రజలు, సమాచార, వార్తా సాధనాలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన సమయమిది. ఇది సమిష్టిగా చేయాల్సిన ప్రయత్నం, ఇది ఖచ్చితంగా గెలవాల్సిన యుద్ధం అని


తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి,
కమిషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ,
ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి  తెలిపారు.


 


 కాలినడకన వెళ్లే ప్రయాణికులకు ఆహార పొట్లాలు పంపిణీ





 

 

ఏలేశ్వరం, పెన్ పవర్ 

 

పట్టణంలోని  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మాచారి నాగ మృత్యుంజయ శర్మ బృందం ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ ఆహార పొట్లాలను నేషనల్ హైవే ఎర్రవరం నుండి విశాఖ జిల్లా పాయకరావుపేట వరకు వెళ్లి నడిచి వెళుతున్న ప్రయాణికులకు సుమారు రెండు వందల మందికి భోజనం ప్యాకెట్లను శర్మ బృందం అందజేశారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ సందర్భంగా కరోనా వైరస్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ తో వాహనాలను నిలుపుదల చేయడంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రయాణికులు తమ తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు  కాలినడకన వెళ్తున్నారని మార్గంమధ్యలో వారికి కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకడం లేదని వారి దాహార్తిని ఆకలిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మువ్వ శ్రీరామచంద్రమూర్తి, నూకల సుబ్రమణ్యం, ఎస్ రవికుమార్, పి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


 

 



 

పేదలకు సాయం


 


అనకాపల్లి, పెన్ పవర్ 

 

 

 గౌరీ హోల్ సేల్ కాయగూరల వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హాస్పిటల్, రైల్వే స్టేషన్ దగ్గర అన్న క్యాంటీన్లలో  అన్న సమారాధన నిర్వహించారు . ఎమ్మెల్యే గుడివాడ అమర్ చేతుల మీదుగా పేదలకు అన్నదానం చేశారు.  జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్  శ్రీరామూర్తి, సంఘం అధ్యక్షా  కార్యదర్శులు సూరి శెట్టి జగదీష్ ,  భద్రం తదితరులు పాల్గొన్నారు .

ప్రజలు గుంపులు గుంపులుగా  ఉండకూడదు


అరిలోవ, పెన్ పవర్ 


 


13 వ వార్డు లో గల రేషన్ షాప్ పనితీరుపై టోకెన్ పద్ధతిన రోజుకు వంద మందికి సరుకులను ఇచేందుకు ఏర్పాటు చేయాలని, ఎటువంటి అల్లర్లకు జరగకుండా, ప్రజలు గుంపులు గుంపులుగా  ఉండకూడదని, కరోనా మహమ్మరి నుండి ప్రజలు కు స్వీయ రక్షణ తీసుకోవాలని, రేషన్ షాపుల వద్ద, కిరాణా షాపులవద్ద గాని ఇక్కడ కూడా జనం గ్రూపులగా ఉండకూడదన్నారు, వార్డు వాలంటరీలకు, వైసిపి వార్డ్ అధ్యక్షుడు, కెల్ల సత్యనారాయణకు, సిబ్బందికి ఏసీబీ ఏసిపి, కె రంగ రాజు. తెలిపారు.


చోడవరం రైతు బజార్ ని సందర్శించిన పర్యాటక మంత్రి : అవంతి

..చోడవరం పెన్ పవర్ : 


సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ గారు మరియు చోడవరం శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ  చోడవరం కాలేజీ గ్రౌండ్ కి ఇటీవలే మార్చబడిన రైతు బజార్ను సంబంధిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి  అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా ప్రభావం అధికంగా ఉందని జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలని, చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి, లాక్ డౌన్ పూర్తయ్యేవరకు ఎవరు బయటకు రావద్దని అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట తిరగవద్దు అని అన్నారు.

వీళ్లు మారరు చెప్పినా వినరు..


 


 


కొత్తకోట పెన్ పవర్...


   రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో 13వ  వార్డు లో గల రేషన్ షాప్ నెంబర్ 11 లో ప్రజలు ఇలా దర్శనమిచ్చారు. ఒకపక్క ప్రభుత్వాలు పోలీస్ సిబ్బంది డాక్టర్లు పంచాయతీ సిబ్బంది వాలంటీర్లు నెత్తీనోరు కొట్టుకొని చెప్తున్న ప్రజలకు మాత్రం చీమకుట్టినట్టు లేకుండా మహిళలు వినిపించుకోవడం లేదు.పోలీసులు వాలెంటర్ల్లు ఈ వైరస్ గురించి ప్రతి నిమిషం ప్రతి సెకను ప్రచారం చేస్తున్న మాత్రం ప్రజలు పట్టించుకోలేదు. నిత్యావసర సరుకులు 15 రోజులు పంపిణీ అవుతున్న అని చెప్పిన ప్రజలు వినిపించుకోలేదు ఎలాగైతే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది ఇక నైనా సరే ప్రజలు సంయమనం పాటించి జాగ్రత్త వహించవలసినదిగా పోలీసు వారు హెచ్చరిస్తున్నారు.

తాణాo గ్రామంలో గ్రామస్థులకు శేనిటైజర్లు పంచిన గ్రామ యువత


  పరవాడ పెన్ పవర్

 

 

పరవాడ:మండలంలోని తాణాo గ్రామంలో యువత కరోనా వైరస్ నివారణ కోసం ఎంతో బాధ్యతా యుతంగా కృషి చేస్తున్నారు.గ్రామంలో ని కన్నూరి యువసేన,పొజిటివ్ పీపుల్ యూత్,పరదేసి మాంభ ఫ్రెండ్స్ యూత్,అంబేత్కకర్ ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో సోమవారం నాడు ప్రతి ఇంటికి శేనిటైజర్నల ని ఉచితంగా పంపిణీ చేస్తూ కరోనా వైరస్ గురించి తీసుకో వలిసిన జాగ్రత్తలు చెపుతూ ప్రజలను ఛైతన్య వంతులను చేశారు. ప్రతిగ్రామంలో ఉన్న యువత బాధ్యతగా వ్యవహరిస్తే కరోనా ని ప్రాలదొoరే రోజు ఎంతో దూరంలో లేదు.

  విశాఖ క్వారంటైన్ లో 166 మంది.


స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం( పెన్ పవర్)


 


జిల్లాలో వివిధ క్వారం టైన్ లో ఆదివారం   166 మంది  చేరారని  జిల్లా కలెక్టర్  వినయ్ చంద్  ప్రకటించారు. సోమవారం  ఆయన విడుదల చేసిన ప్రకటనలో  జిల్లాలో  పలుచోట్ల  అనుమానితులను   క్వారం టైన్ లకు  చేరుతున్నారు  భీమిలిలో 60 గాజువాక లో 73  యలమంచిలి లో  18  నర్సీపట్నంలో 15  మంది కరోనా  వైఎస్  అనుమానితులను క్వారం టైన్ లొ  ఉంచామని  పరీక్షల  నమూనాలు  వచ్చిన తర్వాత  నెగిటివ్  వారిని  ఇళ్లకు  పంపిస్తామని  వినయ్ చంద్  తెలిపారు. జిల్లాలో 6కరొనా   కేసులు  పాజిటివ్  రాగా  మొదటి  వైరస్ కేసు  నెగిటివ్ కు  చేరుకోవడంతో  ఆ వ్యక్తిని  డిస్చార్జ్  చేశామని  అన్నారు. ప్రజలు  సామాజిక  దూరం పాటించాలని  కోరారు. రైతు బజార్లు  కిరాణా షాపులు  వద్దకు  గుంపులు గుంపులుగా పోవద్దని  చంద్ కోరారు


ఉచిత బియ్యం క్యూలో  వడదెబ్బ తగిలి వృద్ధురాలు మృతి.


 


 






         పెన్ పవర్ ..చోడవరం. 

 

ప్రభుత్వం   పంపిణీ చేస్తున్న  ఉచిత బియ్యం   కోసం  క్యూలో నిలబడి  ఒక వృద్ధురాలు  ప్రాణాలు కోల్పోయిన  సంఘటన . చోడవరం  పట్టణంలో  చోటు చేసుకుంది.  సోమవారం పట్టణాల్లోని  ద్వారకా నగర్ లొ ఉంటున్న   షేక్‌ మేరబీ (65)  రేషన్  షాపు2కు   ఉచిత బియ్యం కోసం  వెళ్ళింది కరోనా లాక్ డౌన్   కారణంగా  ప్రభుత్వం విధించిన  నిబంధనల ప్రకారం  సామాజిక దూరం  పాటించాలని  చెప్పడంతో  ఆమె  క్యూలైన్లో  నిల్చుంది. ఎండ ప్రభావానికి  వడ దెబ్బ తగలడంతో  నిలుచున్న చోటే పడిపోయింది. పరిస్థితి గమనించిన స్థానికులు ఇంటికి తరలించే లోపే మేర్బి  ప్రాణాలు కోల్పోయింది.కరోనా  వైరస్‌ కు   గురి కాకుండా  ప్రజలు  సామాజిక దూరం  పాటించాలని  చేసిన సూచన  వృద్ధురాలి ప్రాణం పైకి వచ్చింది. రేషన్ డిపోల పరిధిలో  ఖాళీ ప్రదేశాల్లో లేకపోవడంతో  రోడ్లపైకి  క్యూలైన్లు  కడుతున్నారు. ఎండ తీవ్రత  తట్టుకోలేక  వృద్ధులు  తల్లడిల్లుతున్నారు.




కరోనా వైరస్ మహమ్మారిని సమిష్టిగా తరిమికొట్టండి.


 


కరోనా వైరస్ మహమ్మారిని సమిష్టిగా తరిమికొట్టండి.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి.

         పెన్ పవర్... వి.మాడుగుల. 
కరోనా వైరస్  మహమ్మారిని  అందరు  సమిష్టిగా  ఎదుర్కోవాలని  రాష్ట్ర  పర్యాటక శాఖ మంత్రి  ముత్తం శెట్టి  శ్రీనివాస రావు  అన్నారు. సోమవారం  మాడుగుల  మండల పరిషత్  సమావేశ మందిరంలో  వైద్య ఆరోగ్య శాఖ   ఎంపీడీవో  రెవెన్యూ  పోలీస్  శాఖ ల  అధికారులతో కరోనా పై  సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కరోనా వైరస్  నిర్మూలనకు  అధికారులు  వైద్య సిబ్బంది  ప్రజలు  సహకరించాలన్నారు. సామాజిక భద్రత  తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం  తక్కువ మంది కూలీలతో  వ్యక్తిగత దూరం పాటించి  అయితే అమలు జరిగేలా  ఎంపీడీవోలు  కృషిచేయాలని  ఆయన అన్నారు.  ఇతర ప్రాంతాల నుంచి  వచ్చిన వారి  ద్వారా  కరోనా వైరస్  పాజిటివ్ కేసులు  నమోదు అయ్యాయి తప్ప  స్థానికంగా ఉండే వారి ద్వారా కాదని  మంత్రి అన్నారు.  గ్రామాల్లో పారిశుద్ధ్యం తాగునీరు పై అధికారులు  శ్రద్ధ చూపాలని  ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో  అవసరమైన కిట్లను  సిబ్బందిని  ఏర్పాటుకు  కృషి చేస్తానని  మంత్రి   హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న  అనకాపల్లి  పార్లమెంట్ మెంబర్ భీ శెట్టి వెంకట సత్యవతి  మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం కరోనా పై  చిత్తశుద్ధితో పని చేస్తుందని  అన్నారు. అధికారులు ప్రజలు సహకారంతో  వైరస్‌ ను  దూరం చేయవచ్చని  ఆమె అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు ఐదు లక్షల  మాస్క్ లు  5000 పి పి సి కిట్లు  అవసరమని  వాటిని త్వరలో సరఫరా చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రభుత్వ విప్పుబూడి  ముత్యాల నాయుడు మాట్లాడుతూ  నియోజకవర్గంలో కరోనా పై  అధికారులు  అప్రమత్తంగా ఉన్నారని  ఎప్పటికప్పుడు   వివరాలు  ఇస్తూ  ప్రజలకు  అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు వలస కూలీల ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని  వైద్య అధికారులకు  సూచించారు . ఈ కార్యక్రమంలో అనకాపల్లి డి ఎస్ పి  శ్రావణి   నర్సీపట్నం డి ఎల్ పి ఓ  శిరీష రాణి  ఎంపీడీవో పోలినాయుడు  తహసిల్దార్  రామ్ శేషు  వైద్యాధికారులు  పాల్గొన్నారు.


జిల్లా ఎస్పీ భాపూజి పర్యవేక్షణలో చోడవరం నియోజకవర్గం




చోడవరం పెన్ పవర్ 

 

కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు చోడవరం నియోజకవర్గంలో చోడవరం టౌన్ మరియు వడ్డాది, రావికమతం, కొత్తకోట రోలుగుంట మొదలగు ప్రాంతాలలో విశాఖపట్నం జిల్లా ఎస్.పి భాపూజి  సోమవారం  పర్యవేక్షించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి స్టేషన్ లో ఉన్న స్థానిక ఎస్సై మరియు పరిధి లో ఉన్నటువంటి సీ.ఐ లను కలిసి కరోనా గురించి వారికి మరింత అవగాహన కల్పించడం జరిగింది. 144 సెక్షన్ అమలులో ఉన్నందున రోడ్లపై షాపులు ఏమైనా తెరిచి ఉన్నాయా, జనసంచారం ఏమైనా ఉందా అనే విషయంపై పర్యవేక్షించారు. ఈ సమయంలో  పోలీసు వ్యవస్థ చాలా గొప్పగా పని చేస్తుందని ఆయన కొనియాడారు.

 

 



 

సీఎం రిలీఫ్ ఫండ్ కి  గొల్లవిల్లి 50వేలు చెక్కు





  పెన్ పవర్... వి.మాడుగుల.

 

మండలంలోని  ఎం కోడూరుకి  చెందిన  వైసీపీ నాయకుడు  గొల్లవిల్లి  సంజీవ్ రావు  మాజీ జెడ్పిటిసి  ప్రభావతి  50వేలు  చెక్కును  సోమవారం  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  అవంతి శ్రీనివాస్ కు  అందజేశారు. కరొనా వైరస్ ప్రభావం  తో  రాష్ట్రం   అతలాకుతలం అయిపోతుంది  తన వంతు  సహాయం  అందించాలని  భార్యాభర్తలు  చెక్కును  ప్రభుత్వ విప్   ముత్యాల నాయుడు  అనకాపల్లి పార్లమెంట్ మెంబర్  సత్యవతి  ఆధ్వర్యంలో  గొల్ల వెళ్లి  మంత్రి శ్రీనివాస్ కు  అందజేశారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ  సీఎం సహాయనిధికి  తనవంతుగా  సహాయం అందించిన  గొల్లవిల్లిని  మంత్రి  అవంతి   అభినందించారు.

 

 



 

ఏప్రెల్ 1న వై.ఎస్.ఆర్. పింఛనుకానుక


 


 


ఏప్రెల్ 1న వై.ఎస్.ఆర్. పింఛనుకానుక


 పింఛనుల పంపిణీపై సూచనలు పాటించాలి


కరోనా వైరస్ కారణంగా తగు జాగ్రత్తలు


3,26,414 పించను దారులకు, రూ.77.16 కోట్లు పంపిణి


                               డిఆర్డిఎ ప్రాజక్టు డైరక్టరు కె. సుబ్బారావు


 


    విజయనగరం, పెన్ పవర్ 


 


 ఏప్రిల్ 1వ తేదీన వాలంటీర్లు పింఛనుదార్ల ఇంటివద్దకే వెళ్ళి పింఛనులు పంపిణీ చేయాలని డిఆర్డిఎ ప్రాజక్టు డైరక్టరు కె. సుబ్బారావు తెలిపారు.  ప్రస్తుతం ఉన్న కరోన వైరస్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు లాక్ డౌన్ ప్రకటించడం వలన పింఛనుధారులు ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా ఉండుటకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏప్రిల్ 1వ తేదీన పింఛనుదారుల ఇంటికి వెళ్ళి పింఛను పంపిణీ చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు.  ఏప్రిల్ 1వ తేదీన పింఛనుల పంపిణీ చేయుటకు ముందే వాలంటీర్లు అందరూ తప్పకుండా నూతన మొబైల్ యాప్ (1.2) ను తమ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.  పింఛను పంపిణీ చేయుటకు వాలంటీర్లు వాళ్ళ మొబైల్ లలో లాగిన్ అయ్యి పింఛను పంపిణీ ప్రారంబించాలి. వాలంటీర్ల లాగిన్లో కనబడని పింఛనుదార్లకు పింఛను ఇచ్చుటకు యాప్ లో “సెర్చ్ ఆప్షన్” ఇవ్వడం జరిగిందని,  పింఛనుదారుడి యొక్క ఐ.డి. ద్వారా సెర్చ్ చేసి వివరములు సరిచూసుకొని పింఛను పంపిణీ చేయవచ్చన్నారు.   


 


కొవిడ్-19 లాక్ డౌను దృష్ట్యా పింఛనుదారులకు రాష్ట్ర పరిధిలో పింఛను “పోర్టబిలిటీ” ద్వారా పింఛను పంపిణీ చేయవచ్చునన్నారు.     కరోనా వైరస్ ధృష్ట్యా, ఏప్రిల్ నెల పింఛను పంపిణీ ప్రక్రియలో పింఛనుదారుల వేని ముద్రలు తీసుకొనే ప్రక్రియ రద్దుచేయబడినదన్నారు అంతేకాక పింఛను ఇచ్చేటప్పుడు అక్విటెన్స్ పై సంతకములు గానీ, వేనిముద్రలు గానీ తీసుకోనవసరం లేదని,  ఇది ఇంతకుముందు ఇచ్చిన సూచనలలో మార్పుగా గమనించాలన్నారు.   పింఛనుదారులకు పింఛను మొత్తం ఇచ్చిన తదుపరి, పింఛనుదారుడు నగదు తీసుకున్న తరువాత పించన్ దారుడు  కనబడేలా స్పష్టముగా ఫోటో తీయాలన్నారు.  తదుపరి ఫోటోను జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేయబడుతుందన్నారు.  ఇంటింటికీ వెళ్ళి పింఛను పంపిణీ చేసిన సమయంలో సామాజిక దూరం (తగినంత దూరం) పాఠించాలని,  పింఛనుదారులు ఇంటినుండి బయటకు రానక్కరలేదన్నారు.  


 


పింఛనుల పంపిణీ  ఎంపిడిఓ/మున్సిపల్ కమిషనర్లు లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, పింఛనుల పంపిణీ త్వరితగతిన జరిగేటట్లు చూడాలన్నారు.  జిల్లాకలెక్టర్ వారు, పంపిణి సమయంలో పంపిణి దారులుకు పోలీస్ వారు ఎటువంటి ఆటంకం కలిగించకుండా వారియొక్క గుర్తింపు కార్డులను పరిగణలోనికి తీసుకొని సహకరించాలని తెలిజేసారన్నారు.    పంపిణి చేయు సమయములో కరోనా వైరస్ ధృష్ట్యా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ తరచుగా చేతులు సుభ్రపరచుకొని, సామజిక దూరాన్ని పాటిస్తూ పంపిణి చేయాలని ఆదేశించారన్నారు.  జిల్లాకలెక్టర్ వారు టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబందిత మండల మరియు గ్రామస్తాయి అధికారులు వరకు వివరించారన్నారు.  ఏప్రిల్ 1వ తారీకున మొత్తం 3,26,414 పించను దారులకు, రూ.77.16 కోట్లు పంపిణి చేయబడుతుందని పిడి తెలిపారు.


అన్నార్తులకు చేయూత


అన్నార్తులకు చేయూత

 

 అనకాపల్లి, పెన్ పవర్ 

 

కరోనా  నేపథ్యంలో లాక్ డౌన్  విధించడంతో ఇబ్బందులు పడుతున్న అన్నార్తులకు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొణతాల అప్పలరాజు ఆధ్వర్యంలో చేయూతను అందించారు . లాక్ డౌన్  సమయంలో పేదలకు తనవంతు సాయం చేస్తానని ప్రకటించారు.  నేషనల్ కౌన్సిల్ మెంబర్   తుంబు,  వేగి కాంతారావు, కర్రి ఉమా,  కొణతాల ప్రకాష్ తదితరులు  పాల్గొనారు. 

వలస కూలీలు  స్వీయ నిర్బంధం తప్పదు.



పెన్ పవర్.. వి మాడుగుల.



గ్రామాల్లోకి  వస్తున్న  వలస కూలీలు స్వీయ నిర్భంధం తప్పదని  మాడుగుల ఎస్ ఐ పి రామారావు  అన్నారు. ఆదివారం సాయంత్రం వమ్మలి గ్రామాన్నిసందర్శించారు   చెన్నై నుంచి17 మంది  వలస కూలీలు  శనివారం ఉదయం  గ్రామానికి వచ్చిన విషయం  తెలుసుకున్న  ఆయన  వారితో మాట్లాడారు  కరోనా వైరస్  అతలాకుతలం చేస్తున్న  తమిళ్ నాడు  ప్రాంతం నుంచి  గ్రామానికి  చేరుకున్నారు  14 రోజులు  స్వీయ  నిర్బంధంలో  ఇళ్ల కే పరిమితం కావాలని  సూచించారు. కరోనా వైరస్  14రోజుల గాని   దాని ప్రభావం  బయటపడని  ఈ విషయం  ప్రతి ఒక్కరూ  గుర్తుంచుకొని  ఇల్లు విడిచి  బయటకు రావద్దని  హితవు పలికారు. తోటి ప్రజలకు  సమస్యలు తలెత్తకుండా  వలస కూలీలు  సహకరించాలని  ఆయన అన్నారు. 17 మంది  చెన్నై నుండి వచ్చిన వలస కూలీలు  రోకలి తిరుగుతున్నట్లు  వాలెంటర్ల్లు మాటలు కూడా  తడ చెవిన పెట్టినట్లు  వదంతులు రావడంతో  అధికారులు అప్రమత్తమయ్యారు . ఆదివారం అయినప్పటికీ  ఎస్సై  వలస కూలీల తో  మాట్లాడి  ఇంటికే పరిమితం కావాలని  హెచ్చరించారు.


జివిఎంసికి 40000 మాస్కులు వితరణ చేసిన కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్


విశాఖపట్నం, పెన్ పవర్ 


పది లక్షలు విలువచేసే 40000 రక్షణ మాస్కులను కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖ యూనిట్ హెడ్ మరియు వైస్ ప్రెసిడెంట్ కుమరేషన్, మానవవనరుల హెడ్ రంగ కుమార్తో కలసి జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుకు, జివిఎంసి ప్రధాన వైద్యాధికారి డా.కె.ఎస్.ఎల్.ఎన్.జి శాస్త్రి సమక్షంలో అందజేశారు. కరోనా వైరస్ నియంత్రణలో పాలుపంచుకొని సహాయ సహకారాలు అందిస్తున్న కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యానికి, అధికారులకు జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన అభినందనలు తెలిపారు.


రొయ్యల రైతులు ఆందోళన చెందవద్దు

 


మధ్యవర్తులు మాటలు నమ్మవద్దు


రొయ్యలును గిట్టుబాటు ధరలకు విక్రయించాలి


                                          మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత


 


          విజయనగరం, పెన్ పవర్ 


 కోవిడ్ – 19 (కరోనా) ప్రభావం వలన ఆక్వా రంగం నష్ట పోకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపడుతుందని మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత తెలిపారు.  అందులో భాగంగా మత్స్య శాఖ అధికారులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ,  సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతిదారులు సంఘం, ఆంధ్ర ప్రదేశ్ వారు సంయుక్తంగా రొయ్యలకు ఈ క్రింది విధముగా నిర్దిష్ట ధరలును నిర్ణయించారు.



















































క్రమ సంఖ్య



రొయ్యల సంఖ్య


(కౌంట్ ఒక కేజీకి)



ధర(రూపాయలలో)



1



30



430



2



40



310



3



50



260



4



60



240



5



70



220



6



80



200



7



90



190



8



100



180



           


ధరలు ఏప్రెల్ 14వ వరకు అమలులో ఉండునని,  ఈ ధరలు కాకుండా వేరే ధరలుకు అమ్మినా,  కొనుగోలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.  ధరలును సంబంధిత గ్రామ సచివాలయాలనందు ప్రదర్శించడమైనదని,  రొయ్యల రైతులు ఆందోళన చెందకుండా, మధ్యవర్తులు మాటలు నమ్మకుండా  రొయ్యలును గిట్టుబాటు ధరలకు అమ్మకం చేపట్టవలసినదిగా కోరారు.


 


కరోనా సహాయ నిధికి పలువురి విరాళాలు


 


రూ.40  వేలు విరాళంగా ఇచ్చిన బి.సి.సంక్షేమ అధికారులు


విజయనగరం, పెన్ పవర్ 


జిల్లాలో కరోనా సహాయనిధికి పలువురు ఉద్యోగులు విరాళాలు అందజేశారు. జిల్లా బి.సి.సంక్షేమ శాఖలో హాస్టల్ సంక్షేమ అధికారులుగా ఎస్.కోట లో పనిచేస్తున్న ప్రకాష్ కుమార్ రూ.30 వేలు, చీపురుపల్లి లో పనిచేస్తున్న అనురాధ రూ.10 వేలు అందజేశారు. ఈ మేరకు చెక్కులను జిల్లా బి.సి.సంక్షేమ అధికారి డి.కీర్తి నేతృత్వంలో సోమవారం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ కు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.


 


రాచపల్లి ఒమ్మంగి లో కరోనా కలకలం.


 

15 మందికి కరోనా లక్షణాల అనుమానం.

అన్నవరం క్వారంటైన్ కు తరలింపు.

 

ఏలేశ్వరం, పెన్ పవర్

 

 ప్రత్తిపాడు మండలం గ్రామంలో కరోనా మహమ్మారి జడలు విప్పుతున్న జాడలు కనిపిస్తున్నాయి. ఒకేసారి గ్రామంలో లో 15 మంది కి జ్వరాలు, గొంతు నొప్పి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయం స్థానికులు అధికారులకు తెలియ పరచడంతో అప్రమత్తమైన అధికారులు ఏలేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రోగులను అన్నవరం కొండ పై గల క్వారంటీన్ కు తరలించారు. దీంతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏలేశ్వరం కి చెందిన సుజన స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కే రాజేంద్ర కు అందిన సమాచారం మేరకు   ఈ  గ్రామానికి ఈనెల 22వ తేదీన  మసీదుకు ఢిల్లీకి చెందిన ముస్లిం పెద్ద వచ్చి మసీదులో సమావేశం నిర్వహించగా, ఈ సమావేశానికి 150 కుటుంబాలకు చెందిన సుమారు 30 మంది గ్రామస్తులు హాజరైనట్లు తెలిసింది. దీంతో అధికారులకు తెలియపరచడం తో ఏలేశ్వరం మండలం తాసిల్దార్ ఎం రజిని కుమారి ఆదేశాల మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ హెచ్ అమరసింహుడు డిపో నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి ఒమ్మంగి గ్రామానికి సోమవారం సాయంత్రం పంపించారు. ఒమ్మంగి నుండి బాధితులను అన్నవరం క్వారంటైన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలో 5వేల ప‌డ‌క‌ల‌తో క్వారంటైన్ సెంట‌ర్లు



ప్ర‌తీ మండ‌లంలో ఒక కేంద్రం ఏర్పాటు
జాయింట్ క‌లెక్ట‌ర్-2 ఆర్‌.కూర్మ‌నాధ్‌
వ‌ల‌స కూలీలు, అనాధ‌ల‌కోసం స‌హాయ‌ కేంద్రాలు
జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంక‌ట‌రావు
తాశీల్దార్లు, ఎంపిడిఓల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌


 


విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్ 


 జిల్లాలో మొత్తం ఐదువేల ప‌డ‌క‌ల‌తో క్వారంటైన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు  జాయింట్ క‌లెక్ట‌ర్‌-2 ఆర్‌.కూర్మ‌నాధ్ చెప్పారు. దీనిలో భాగంగా క‌నీసం వంద ప‌డ‌క‌ల‌తో ప్ర‌తీ మండ‌లంలో ఒక  క్వారంటైన్ కేంద్రాన్నిఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.



    తాశీల్దార్లు, ఎంపిడిఓల‌తో సోమ‌వారం సాయంత్రం క‌లెక్ట‌రేట్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ కాన్ఫ‌రెన్స్‌లో జెసి 2 మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం నాటికి అన్ని మండ‌లాల్లో క్వారంటైన్ కేంద్రాల‌ను కావాల్సిన వ‌స‌తుల‌తో ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. దీనికోసం హాస్ట‌ల్ భ‌వ‌నాలు, హొట‌ళ్లు, క‌ల్యాణ మండ‌పాలు ఇలా అందుబాటులో ఉన్న వాటిని గుర్తించాల‌ని సూచించారు. ప్ర‌తీ కేంద్రానికి ఒక నోడ‌ల్ ఆఫీస‌ర్‌ను, అత‌ని ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసేందుకు ఒక బృందాన్ని నియ‌మించాల‌ని సూచించారు. ఈ కేంద్రాల్లో వ‌స‌తుల‌కు ఎటువంటి లోటు లేకుండా, ప‌డ‌క‌లు, బాత్‌రూములు, త్రాగునీరు త‌దిత‌ర అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు.


                       జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ వ‌ల‌స కూలీలు, విదేశాలు, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చి చిక్కుకుపోయిన‌వారు, అనాధల కోసం రిలీఫ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. ఇప్ప‌టికే కొన్నిచోట్ల అలాంటి వారిని గుర్తించ‌డం జ‌రిగింద‌ని, వారికి త‌క్ష‌ణ‌మే భోజ‌న స‌దుపాయాన్ని క‌ల్పించాల‌న్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా భోజ‌నం చేయ‌డానికి ఆస‌క్తి క‌న‌ప‌ర్చ‌క‌పోతే, వారికి నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అంద‌జేయాల‌ని సూచించారు. వీటికోసం వ‌స‌తి గృహాల‌ను, కెజిబివి పాఠ‌శాల‌ల‌ను తీసుకోవాల‌న్నారు. ప్ర‌తీ కేంద్రం వ‌ద్దా బోర్డును ఏర్పాటు చేయాల‌ని, ఆయా కేంద్రాల ప‌రిధిలో ఉన్న‌వారి పేర్ల‌తో రిజిష్ట‌ర్ త‌యారు చేయాల‌ని సూచించారు. అలాగే వీరికి ఆయా హాస్ట‌ళ్ల‌లో ఇప్ప‌టికే స్టాక్ ఉన్న బియ్యం, ప‌ప్పులు త‌దిత‌ర స‌రుకుల‌ను వినియోగించాల‌ని, అవికూడా చాల‌క‌పోతే ప్ర‌క్క హాస్ట‌ల్‌లోని స‌రుకుల‌ను కూడా తీసుకోవాల‌ని చెప్పారు. తీసుకున్న స‌రుకుల‌కు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఆయా హాస్ట‌ళ్ల‌కు న‌గ‌దు చెల్లించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అలాగే భోజ‌నం నాణ్య‌త‌లో ఎక్క‌డా తేడా రాకుండా చూడాల‌ని, ఈ కేంద్రాల‌కు ఆయా వ‌స‌తిగృహాల సంక్షేమాధికారులే ఇన్ఛార్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని డిఆర్ఓ  స్ప‌ష్టం చేశారు.


       లీఫ్ సెంట‌ర్స్ జిల్లా నోడ‌ల్ ఆఫీస‌ర్‌, జిల్లా అట‌వీశాఖాధికారి ల‌క్ష్మ‌ణ్‌, డిపిఓ మ‌రియు సాంఘిక సంక్షేమ‌శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ కె.సునీల్‌రాజ్‌కుమార్‌, జిల్లా బిసి సంక్షేమాధికారి కీర్తి, జిల్లా ప‌రిష‌త్ సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు త‌మ శాఖ‌ల ప‌రంగా మాట్లాడి, తాశీల్దార్ల‌కు, ఎంపిడిఓల‌కు, వ‌స‌తిగృహ సంక్షేమాధికారుల‌కు వివిధ సూచ‌న‌లిచ్చారు.


ఇల్లు వదలకండి...." అతక బెడతారు"







 

-ప్రజలకు మండల అధికారులు హెచ్చరిక

-ఏప్రిల్ 15 వరుకు ఇంట్లో లేక పోతే మళ్ళీ మాస్క్

-పోలీసుల ఆధ్వర్యంలో కిరాణా షాపు వద్ద వినియోగ దారులకు కుర్చీలు ఏర్పాటు

-చౌక దుకాణాలను పర్యవేక్షణ చేసిన తహశీల్ధార్, ఎస్ ఐ లు

-కొండరెడ్డి గ్రామాలకు బియ్యం నిత్యావసర వస్తువులు పడవ ద్వారా రవాణా

-విధులు కట్టుదిట్టంగా నిర్వర్తిస్తున్న పోలీసులు

 

వి.అర్.పురం, పెన్ పవర్

 

మండలంలో ఉదయం 11 గంటల వరకు స్థానిక ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఎస్ ఐ లు వెంకటేష్, చంటి, తహశీల్ధార్ పర్మిషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు నిర్ణయించిన సమయానికి  కాకుండా మిగతా సమయంలో విధులకు భిన్నంగా ప్రవర్తిస్తున్న వారిపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  ఏప్రిల్ 15 వరుకు ఇంట్లో లేక పోతే మళ్ళీ మాస్క్ వేసుకొని ఇంట్లోనే వుండే పరిస్థితి వుంటదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో  మండల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కిరాణా షాపుల వద్ద కూడా నిలుచొని ఉన్న వినియోగ దారులకు ఎస్ ఐ వెంకటేష్  ఆధ్వర్యంలో కుర్చీలు ఏర్పాటు చేయించారు. అదే విధంగా రేషన్ షాపుల వద్ద డీలర్లకు ,వాలంటీర్ల ఎస్ ఐ చంటి సూచనలు చేస్తూ వినియోగ దారులకు వాలంటీర్ల ద్వారా   బియ్యం పంపిణీ చేయించారు. మండల నలుమూలలో జరుగుతున్న విషయాలపై స్థానిక తహశీల్ధార్ శ్రీధర్ అధికారులను , మెడికల్, వాలంటీర్, వి.అర్.ఓ, వి.అర్.ఏ లను సమన్వయ పరుస్తూ ప్రభుత్వం ద్వారా అందవలసిన బియ్యం, నిత్యావసర వస్తువులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొండల్లో ఉన్న కొందరెడ్లకు సైతం గోదావరి నది ఉండటంతో పఫేవల ద్వారా వారికి బియ్యం అందే విధంగా చూశామని తెలిపారు. మండలంలో కొత్తవారు వచ్చినా, జ్వరాలతో, ఇతర కారణాలతో బాధపడుతున్న అనారోగ్యంతో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రులలో మెడికల్ అధికారులు సుందర ప్రసాద్, నాగార్జున  పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది ఎలా ఉండగా స్థానిక తహశీల్ధార్ శ్రీధర్, ఎస్ ఐ వెంకటేష్,మెడికల్ అధికారి సోములగూడెం, సున్నంవారిగూడెం గ్రామాలలో పర్యవేక్షణ చేశారు. ఆ ప్రాంతంలో క్వారెంటైన్ వార్డు ఏర్పాటు చేయడానికి ఆశ్రమ పాఠశాలలో ఎలా ఉంటదని పరిశీలించారు.


 

 




 

 


 



 



గవర్నర్ తో సమావేశమైన సీఎం


అమరావతి, పెన్ పవర్


ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశం


రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసకుంటున్న చర్యలను, లాక్‌డౌన్‌ పరిస్థితులను సీఎం జగన్‌  గవర్నర్‌కు వివరించారు.


కరోనా వ్యాధి , ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గవర్నర్‌ కార్యాలయంలోకి వెళ్లే ముందు శానిటైజర్‌తో తన చేతులను శుభ్రం చేసుకున్న సీఎం జగన్ ఈ సమావేశంలో సామాజిక దూరం పాటించిన గవర్నర్, సీఎం జగన్


ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, వైద్య శాలలు ఎప్పుడైనా స్వాధీనం


అమరావతి, పెన్ పవర్


జిల్లాల కలెక్టర్లకు అధికారాలు


 రాష్ట్రంలోని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, ప్రైవేట్ వైద్యశాలలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక సదుపాయాలు, సిబ్బంది సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. 


కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఐసోలేషన్ కోసం చర్యలు చేపట్టాని ప్రభుత్వం సూచించింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర సిబ్బంది...అందుబాటులో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరాల మేరకు ఆసుపత్రులను ఇప్ప టికే గుర్తించిన ప్రభుత్వం... కరోనా కేసులు పెరిగితే ప్రైవేటు వైద్యశాలలు, మెడికల్ కళాశాలలు, అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.


ఎంవీపీలో నిరుపేదలకు ఆహారం, పండ్లు పంపీణీ:


ఎంవీపీలో నిరుపేదలకు ఆహారం, పండ్లు పంపీణీ: బిజెపి నాయకురాలు డి. అరుణ కుమారి

 

ఎంవీపీ కాలనీ, పెన్ పవర్ 

.

 

కరోనా మహమ్మారి  ప్రపంచం మీద విరుచుకుపడుతోంది,  లాక్ డౌన్ పేరిట అందరూ ఇళ్లకే పరిమితమైన  పరిస్థితి నెలకొంది. కూలాడితే కుండాడని పరిస్థితిలో ఉన్నవాళ్ల పరిస్థితి మరీ దయనీయం, ఏపూట కాపూట సంపాదనతో కడుపునింపుకునే వాళ్లవి మరీ దుర్భర పరిస్థితి, చేసేందుకు పనిలేక చేతిలో చిల్లిగవ్వ లేక బాధ పడేవారికి ఆపన్న హస్తం అందించేందుకు నేను సైతం అంటూ ముందుకొచ్చారు విశాఖపట్నం బీజేపీ నాయకులు ద్వారపూడి అరుణ కుమారి, ఎం.వీ.పీ కాలనీ ఫుడ్ పాత్  రోడ్ల ప్రక్కన నివసిస్తున్న అనాధాలకు ఆహరం పండ్లు మజ్జిగ   పంచిపెట్టి తన ఉదారతను చాటుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమెను పలకరించిన '' పెన్ పవర్ " కు  అరుణ కుమారి చెప్పిన సమాధానం  ఆమె మాటల్లోనే...  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాటివారికి సాయపడటంలో ఉన్న ఆనందం మనల్ని మనుషులుగా మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహమే లేదు. మన ఆస్థుల్ని పంచిపెట్టాల్సిన పనిలేదు, మనకున్నదాంట్లో  వేరొకరి ఆకలి తీర్చగలిగితే అంతకు మించిన ఆనందంగా 

వర్ణనాతీతం అన్నారు  ఆమె.

ఈ కార్యక్రమంలోఅరుణ కుమారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

జిల్లాకు వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకున్న వారికి భోజన వసతి సౌకర్యాలు


 


ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికీ 14 రోజుల గృహనిర్బంధం తప్పనిసరి


రేషన్ కోసం ప్రజలు గుంపులుగా రాకుండా చర్యలు చేపట్టాలి


కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సేవలు


వ్యాధి లక్షణాలు వున్నవారు దాచిపెట్టొద్దు - వైద్యులను సంప్రదించి వారి సలహాలు పొందాలి


కరోనా సహాయక చర్యలపై టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఆదేశాలు


విజయనగరం, పెన్ పవర్ 


జిల్లాకు ఉపాధి, విద్య, ఇతర అవసరాల నిమిత్తం వచ్చి లాక్ డౌన్ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జిల్లాలో చిక్కుకొని బయటకు వెళ్లలేని పరిస్తితులు ఏర్పడిన నేపథ్యంలో అటువంటి వారందరికీ ప్రభుత్వం ద్వారానే వారికి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వివిధ మండలాలు, పట్టణాల్లో వున్న ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారికి ఆయా ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టళ్లలో వారికి సోమవారం నుండే భోజన వసతి సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికారులు, మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్ లతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.ఏం.హరిజవహర్ లాల్ ఈ మేరకు ఆయా మండలాలు, పట్టణాల్లో వున్న బి.సి., సాంఘిక, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్ లను ఆదేశించారు. భోజన, వసతి సౌకర్యాలు అవసరమన వారిని గుర్తించే ప్రక్రియ ఆదివారం సాయంత్రం నాటికి పూర్తి చేసి సోమవారం నుండే వారికి అన్నీ సౌకర్యాలతో నాణ్యమైన భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలు, కార్మికులు, విద్యార్దులు వంటి వారందరికీ వచ్చే 15 రోజులపాటు స్థానికంగానే వుండేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, అటువంటి వారు జిల్లాలో ఏ ప్రాంతంలో వున్నా ఆయా మండలాల తహశీల్దార్ లు, లేదా మున్సిపల్ కమిషనర్ లను తక్షణం సంప్రదించాలని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లో ఇప్పటికే అందుబాటులో వున్న సరుకులను వినియోగ్గించుకోవాలని అవసరమైతే ప్రకృతి విపత్తుల నిధుల నుండి అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. కూలీలు వసతి కలిగి వుంది భోజన సౌకర్యాల కోసం బియ్యం పప్పు వంటి సరకులు కావాలని కోరినా సమకూర్చాలని సూచించారు. దీనితో పాటు పట్టణాల్లో వుండే అనాధలు, నిరాశ్రయులకు కూడా భోజన వసతి సౌకర్యాలు సమకూర్చాలని కలెక్టర్ తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లను  ఆదేశించారు.


        జిల్లాకు లాక్ డౌన్ విధించిన తర్వాత ఇతర రాష్ట్రాల నుండి వచ్చి గ్రామాలు, పట్టణాల్లో వుంటున్న వారికి కూడా 14 రోజుల గృహ నిర్బంధం తప్పనిసరి చేయాలని వారి వల్ల కూడా ఆయా ప్రాంతాల్లోని వారికి ఈ వ్యాధి సోకే అవకాశం వున్నందున జాగ్రత్తలు అవసరమని చెప్పారు. వారం రోజుల క్రితం విదేశాల నుండి జిల్లాకు వచ్చిన వారిని వైద్య సిబ్బంది నిత్యం గమనించాలని వారిలో ఏమైనా వ్యాధి లక్షణాలు వుంటే తక్షణమే వైద్యాధికారుల వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాలన్నారు. జిల్లాకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు తమలో కరోనా వ్యాధి లక్షణాలైన జలుబు, జ్వరం, పొడి దగ్గు వంటి లక్షణాలు వుంటే వాటిని దాచి పెట్టకుండా వైద్యుల సలహాలు పొందాలని కలెక్టర్ సూచించారు. తద్వారా వారికి, వారి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతం వారికి కూడా ఈ వ్యాధి సోకకుండా మేలుచేసిన వారవుతారని పేర్కొన్నారు.


        జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్ పంపిణీకి జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో రేషన్ డీలర్లు తమ డిపోల వద్ద రేషన్ కార్డు దారులు సామాజిక దూరం పాటించేలా మంచి ఏర్పాట్లు చేశారని, అయితే రేషన్ కోసం ప్రజలు గుంపులుగా వస్తున్నట్లు తెలుస్తోందని దీనిని నివారించాల్సి వుందన్నారు. రేషన్ డిపోల వద్ద తగినంత నీడ వుండేలా ఏర్పాట్లు చేయాలని అవసరమైతే టార్పాలిన్లు వంటివి వేసి ఎండలో నిల్చోకుండా చూడాలని కోరారు. ఒక్కో వాలంటీర్ పరిధిలోని కార్డు దారులకు ఒక్కో రోజున అందించేలా షెడ్యూల్ రూపొందించి ఆరోజున మాత్రమే వారు రేషన్ కోసం వచ్చేలా ముందుగానే వాలంటీర్ల ద్వారా ఆయా కార్డుదారులకు తెలియజేయాలని చెప్పారు. జిల్లాలో ఏప్రిల్ 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందనే విషయాన్ని కార్డుదారులకు తెలియజేసి వారంతా వారికి కేటాయించిన తేదీ, సమయాల్లో వచ్చేలా చూడాలన్నారు.


        పట్టణాల్లో చాలా ఇళ్ళలో పని వారు వుంటారని వారి ద్వారా కుటుంబంలోని సభ్యులకు కరోనా వ్యాధి సంక్రమించకూడా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వారు ఒకటి కంటే ఇళ్ళలో పనికి వెళ్ళే అవకాశం వున్నందున వారు వచ్చినపుడు చేతులు సబ్బుతో కడిగించడం, మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వీలైతే ఈ వ్యాధి ప్రభావం తగ్గే వరకు ఇళ్ళలో  పనికి రాకుండా చూడాలని, తామే ఆ పనులు చేసుకోవాలని  తెలిపారు.


ఆదివారం రోజున ప్రజలు చేపలు, మాంసం దుకాణాల వద్దకు గుంపులుగా చేరి సామాజిక దూరం పాటించడం లేదని పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ లు, మండలాల్లో తహశీల్దార్ లు దీనిపై జాగ్రత్త వహించి అవసరమైతే గ్రామాలు, పట్టణాల్లో జనసమ్మర్ధం లేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్నీ మార్కెట్ ల వద్ద, కూరగాయలు విక్రయించే ప్రాంతాల్లో మైకుల ద్వారా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.


జిల్లా ప్రజానీకానికి కరోనా వ్యాధి సంక్రమించే విధానం, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటామన్నారు. జిల్లాలో వైద్య సిబ్బంది, కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొనే ఇతర శాఖల సిబ్బందికి అవసరమైన గ్లౌసులు, మాస్క్ లను సరఫరా చేసేందుకు డి.ఆర్.డి.ఏ., మెప్మా ప్రాజెక్ట్ డైరక్టర్ లు, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ లతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విశాఖలోని కొన్ని పరిశ్రమల ద్వారా వీటిని తయారు చేస్తున్నారని అక్కడ నుండి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.


మండుటెండలో గ్రామ వాలంటరీ మహిళలు


పెన్ పవర్ కూనవరం.


కోవిడ్ 19 వైరస్ ప్రబలకుండా ఉండడానికి ఈనెల 29 నుండి ఏప్రిల్ 15వ తారీఖు వరకు చౌక దుకాణాల వద్దకు రాకుండా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఇంటింటికి ఉచితంగా గ్రామ వాలంటరీ, వీఆర్ఏ లాచే మండలంలోని 16 పంచాయతీలకు ఆటోల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా చౌకదుకాణాల నుండి  నిత్యవసర వస్తువులను ఆదివారం నాడు పంపిణీ చేశారు. ఏప్రిల్ 15వ తారీఖు వరకు అందుబాటులో చౌక దుకాణాలుఉంటాయి కనుక ఎవరూ కూడా ఇంటి వద్ద నుండి వెళ్లకుండా ఉండాలని, వారి వారి ఇళ్ల వద్దకు గ్రామ వాలంటరీ లచే పంపిణీ చేయడం జరుగుతుందని తొందరపడి బయటకు రావద్దని  మండల తాసిల్దార్ ఏవీఎల్ నారాయణ అన్నారు. తెలియక కొంతమంది రేషన్ దుకాణాల వద్దకు వచ్చిన తిరిగి వారి ఇళ్లకు పంపించడం జరిగిందని తెలిపారు. రేషన్ షాపుల వద్ద స్టాక్  ఉన్నందున ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదని సూచించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు తాముగా స్వీయ నిర్బంధం పాటించాలని, వైరస్ ను తరిమికొట్టే బాధ్యతలో  ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇదంతా ఇలా ఉంటే మండుటెండలో గ్రామ వాలంటరీ మహిళలు రేషన్ దుకాణాల వద్ద వారే తూకం వేయించుకొని ట్రాక్టర్, ఆటో లోకి వారే  లోడ్ చేసుకోవడం కొసమెరుపు.


వలస జనానికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు


 


 


విశాఖపట్నం, పెన్ పవర్ 


 లాక్ డౌన్ వలన జివిఎంసి పరిధిలో నిలిచిపోయిన ఇతర రాష్ట్రాల, ఇతర జిల్లాల నుండి వచ్చిన వలస జనానికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు విశాఖపట్నం, మార్చి 29 :- కరోనా వైరస్ వ్యాధి నియంత్రణలో భాగంగా ఏప్రిల్ 14 వతేది వరకు ప్రభుత్వమ లా డౌన్ ప్రకటించినందున, ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వచ్చిన వలసదారులు, రోడ్డు మార్గంలో చిక్కుకుపోయిన వాహన కార్మికులు మరియు బిచ్చగాళ్ళ గూర్చి తాత్కాలిక ఆశ్రయ శాలలు ఏర్పాటు చేయవలసినదిగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, జివిఎంసి కమిషనర్ వారు ఆదేశానుసారం, నగర పోలీసు వారి సహకారంతో కార్పోరేషను పరిధిలో 5 ప్రాంతాలలో తాత్కాలిక షెల్టరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో జివిఎంసి తరుపున నివాసానికి అనువుగా అవసరమైన బెడ్స్, దుప్పట్లు, మంచినీటి సదుపాయాలు, మరుగుదొడ్లు, స్నానగదులు ఏర్పాట్లు, విద్యుత్ సదుపాయం, ఆహారం మొదలగు సదుపాయాలు కేంద్రాలలో ఉన్న ఆశ్రయదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించవలసినదిగా జివిఎంసిలోని ఆయా విభాగాల ఇంజనీరింగు, ప్రజారోగ్యశాఖ, యుసిడి విభాగపు ఉన్నతాధికారులకు, కమిషనరు ఆదేశాలు జారీచేశారు. 5 కేంద్రాలలో కూడా 24 గంటలు నిరంతరంగా పర్యవేక్షించేందుకు, రెండు షిప్టులలో ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు ఒక షిప్టు, సాయంత్రం 6.00 గంటల నుండి ఉదయం 6.00 వరకు రెండవ షిప్టులో పనిచేసేటట్లుగా ప్రత్యేక అధికారులను సిబ్బందిని నియమించారు. ఆశీలుమెట్ట వేమన మందిరం షెల్టరుకు ప్రత్యేక అధికారులుగా ఎ.వి.రమణారావు డిఎంసి, 9912349438 (షిఫు-ఎ), శ్రీమతి పి.వి.లక్ష్మి టి.ఇ, 7901610057 (షిప్టు-బి) సుబ్బలక్ష్మీ కళ్యాణ మండపం, న్యూకాలనీ, కె. పైడితల్లి ఎపిడి 8179288053 (షిప్టు -ఎ) పి.రమ్యకృష్ణ టి.ఇ 7729878881(షిఫ్టు-బి), వివేకానంద కళ్యాణ మండపం, నక్కవానిపాలెం జి.కుమారస్వామి డిఎమ్ సి 9848055179 (షిప్టు-ఎ), ఆర్.రమేష్, డిఎమ్ సి 9666683949(షిఫ్టు-బి), సాంఘిక సంక్షేమ హాస్టల్, ఎం.వి. కాలనీకి పుణ్యవతి, సోషల్ వర్కర్ 7729995961(షిఫ్ట -ఎ), కె.పద్మావతి సోషల్ వర్కర్ 7729995963(షిపు-బి) యూత్ ట్రయినింగ్ కేంద్రం, వేపగుంటకు బి.ప్రసాదరావు ఎపిడి 9848308835(షిప్టు-ఎ) వై.సంతోష్ కుమార్, సోషల్ వర్కర్ 7729995938 (షిప్టు-బి) లను ప్రత్యేకాధికారులుగా నియమించారు. షెల్టర్ల నోడల్ అధికారిగా పి.డి., యుసిడి వై.శ్రీనివాసరావును అత్యవసర పనులు నిమిత్తం కమిషనరు నియమించారు. లా డౌన్లో చిక్కుకున్న వలసదారులు, వాహనాల కార్మికులు మొదలగువారు ఆయా కేంద్రాలను ఉ పయోగించుకోవలసినదిగా గ్రూపు సముహాలుగా బయట తిరగకుండా లాక్ డౌన్ విధానంలో జీవనం గడపాలని, దీనివలన కరోనా వైరస్ వ్యాప్తి జరుగుకుండా ఉండేందుకు దోహదపడతారని, కమిషనరు వారు కోరారు. నగర పరిధిలో ఆశక్తి కలిగిన వ్యాపార సంస్థలుగాని, కాంట్రాక్టర్లుగాని, స్వచ్ఛంద సంస్థలుగాని, ధార్మిక సంస్థలువారు గాని ఈ కేంద్రాలలో ఫలహారం, భోజనసదుపాయలు ఏర్పాటు చేయదలచుకున్నచో జివిఎంసి యుసిడి ప్రాజెక్టు డైరక్టరు శ్రీనివాసరావును సంప్రదించవలసినదిగా ఆయన పత్రికా ప్రకటనలో కోరారు.


తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ 


తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

తెలుగుదేశం పార్టీ  పేదల పార్టీ అని  ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ లు పేర్కొన్నారు. పార్టీ 37 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.  పరమేశ్వరి పార్క్ జంక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహంకు  పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం  జోహార్  ఎన్టీఆర్ అనే నినాదాలతో పుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మాభిమానాని ఢిల్లీలో చాటి చెప్పిన ఘనుడు ఎన్టీఆర్  అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిందన్నారు. కార్యక్రమంలో సీనియర్ తెదేపా నాయకులు  కొణతాల వెంకట్రావు ,మళ్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి


ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి

 

మండల అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్

 

రావులపాలెం,పెన్ పవర్

 

ప్రతి ఒక్కరూ వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిశరాలను పరిశుభ్రంగా ఉంచాలని మండల అభివృద్ధి అధికారి జి.రాజేంద్రప్రసాద్ కోరారు. ఆధివారం మండలంలోని రావులపాలెం, ఊబలంక , పొడగట్లపల్లి, ఈతకోట, దేవరపల్లి,వెదిరేశ్వరం గ్రామాలలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి  ఆయా గ్రామాల కార్యదర్శులకు, పారిశుధ్య కార్మికులకు తగు సూచనలు చేసారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామాల్ని పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేయలని కోరారు. ఈసందర్భంగా ఎంపిడిఓ రాజేంద్రప్రసాద్, ఈఓపిఆర్డీ గంగుల కృష్ణలు  మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేస్తూ అందర్నీ వణికిస్తున్న మహ్మమారి కరోనా వైరస్ ను అరికట్టేందుకు  లాక్ డౌన్ పాటించాలని కోరారు. వైరస్ విజృంభిస్తున్న కారణంగా మనమంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ  ఎవరికి వారు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. మహమ్మారి నియంత్రణ కోసం బాధ్యతగా వ్యవహరించాలని,రోడ్లపై తిరగటం నిషేధించడం జరిగినందున  ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించి తీరాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం లో మండలంలోని  గ్రామ వాలంటరీలకు ,వైధ్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ, సచివాలయం  సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిమ్మకాయల సాయిరామ్, మహ్మద్ అన్వర్, కె.వి.వి సత్యనారాయణ, యల్. వి. దుర్గాప్రసాద్, ఎమ్. సాయి పట్టాభిరామయ్య, నిమ్మకాయల బ్రహ్మజీ, పి.ఫణి,బి.వి.ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు

బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ





ప్రజలు గుమిగూడకుండా ఎస్సై బుజ్జిబాబు పర్యవేక్షణ

 

రావులపాలెం, పెన్ పవర్

 

మండలంలోని గ్రామాల్లోని చౌక ధరల దుకాణాల్లో కారోనా నేపధ్యంలో ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఆదివారం నిత్యావసర సరుకులైన  బియ్యం,కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. వినియోగదారులు    వరుసక్రమంలో వెల్లి రేషన్ సరుకులు తీసుకున్నారు. గ్రామ సచివాలయాల సిబ్బంది, రేషన్ షాప్ డీలర్లు, వాలంటీర్లు అందరూ కలిసి పంపిణీ చేపట్టారు. ఏరియాల వారీగా  గ్రామస్థాయి, మండలస్థాయి నాయకులు ఈ పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సరుకులను పంపిణీ చేశారు. మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పంపిణీపై వివరాలు సేకరిస్తూ సలహాలు సూచనలు చేశారు.ఎస్సై పి.బుజ్జి బాబు రేషన్ షాపుల వద్ద జరుగుతున్న పంపిణీ తీరు పరిశీలించారు. జనం గుముకూడకుండా మనిషికి మనిషికి మధ్య ఒకొక్క మీటర్ దూరం ఉండేలా  మార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు.  కరోనా వైరస్ నేపద్యంలో ఈపాస్ మిషన్ లో కార్డుదారులకు బదులుగా ఇంచార్జ్  లుగా నియమించిన గ్రామ సచివాలయ సిబ్బంది వేలిముద్రలు వేసి రేషన్ అందించారు. వినియోగదారులు కూడా లైన్లో నిలబడి రేషన్ అందుకున్నారు.

 

 



 

ఇంటింటికి బియ్యం పంపిణీకి  సర్వం సిద్ధం


 


-అన్ని గ్రామాలకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధం చేసిన తహశీల్ధార్


-వాలంటీర్లను అప్రమత్తం చేసిన అధికారులు


-నేటి నుండి బియ్యం పంపినే


వి.ఆర్.పురం, పెన్ పవర్ 


 

మండలంలో ఉచిత బియ్యం పంపిణీకి మండల తహశీల్ధార్ శ్రీధర్ రంగం సిద్ధం చేశారు. మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న చౌక దుకాణాలను ఆయన సందర్షించి సేల్స్ మెన్ లకు సూచనలు చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు చే ఈ బియ్యం పంపిణీ చెయ్యడానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. చౌక దుకాణాల నుండి నేరుగా వాహనాల ద్వారా ప్రతి ఇంటికి బియ్యం పంపిణీ చేయిస్తున్నట్లు తహశీల్ధార్ శ్రీధర్ తెలిపారు. కొల్లురు, గొందూరు గ్రామాలకు పడవల ద్వారా పంపించి బియ్యం పంపిణీ  చేయనున్నట్లు తెలిపారు. జీడిగుప్ప, ఇతర గ్రామాల్లో  అక్కడి వాలంటీర్ల సూచనలు చేశామని అన్నారు. దూరం నుండి వచ్చిన వారి వివరాలను సేకరించి  ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు.అనంతరం స్థానిక ఎస్ ఐ వెంకటేష్  ఆదివారం ఐదు బండ్లు సీజ్ చేసినట్లు తెలిపారు.

హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక యేర్పాట్లు

విజయనగరం, పెన్ పవర్ 


 


 జిల్లా ఎయిడ్స్ నివారణనియంత్రణ సంస్థ జిల్లాలో  ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (APSACS) ఆదేశముల మేరకు హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులకు జిల్లాలో covid-19 నియంత్రణలో బాగంగా లోక్ డౌన్ (Lock Down) ఉన్న సందర్బముగా ప్రత్యేక యేర్పాట్లు చేయదమైనది.  హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులకు నెలకు మాత్రమే ఇచ్చే మందులను మూడు నెలలకు గాను ఒక్కసారే ఇవ్వటం జరుగుతుంది.  జిల్లాలో హెచ్.ఐ.వి  భాదితులు ఏ ప్రాంతంలో ఉన్నా,  వారి దగ్గరలో ఉన్న కమ్యూనిటి హెల్త్ సెంటర్ (CHC) (చీపురుపల్లిభోగాపురంబొబ్బిలిసాలూరుబాడంగిగజపతినగరంయెస్.కోటకురుపాం) మరియు జిల్లా కేంద్ర ఆసుపత్రి (DH), విజయనగరంఏరియా ఆసుపత్రి (AH), పార్వతిపురం కు వెళ్ళి మూడు నెలల మందులను పొందవచ్చు.  యెవ్వరు ప్రత్యేకముగా వారు నమోదు చేసుకున్నా కేంద్రానికి మాత్రమే వెల్లనవసరము లేదు వారికి పైన తెలిపిన యే కేంద్రము దగ్గరగా ఉంటే ఆ కేంద్రము నందు ART మందులు పొందవచ్చు.   ఈ సమాచారమును ప్రజలకు చేరేందుకు తగు సహకారము అందించవలసినదిగా అభ్యర్ధన.  మరింత సమాచారం కోసం సంప్రందించ వలసిన ఫోన్ నంబర్లు 08922-273403 (ART  సెంటర్ విజయనగరం), 08963-220295 (ART సెంటర్ పార్వతిపురం).



ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోని భీమవరం పట్టణ వాసులు


భీమవరం, పెన్ పవర్ 

 

ఆదివారం కావడంతో ఉవ్వెత్తున రోడ్ల పైకి ఎగసి పడ్డారు భీమవరం పట్టణ వాసులు ... ఓ పక్క ప్రపంచమంతటా కరోనా వైరస్ కు ప్రజలు బయపడుతుంటే ,మరో ప్రక్క  ప్రభుత్వాలు ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణ ప్రజలు . ఉదయం 6 గంటలనుండి దిరుసుమర్రు రోడ్డు చాపల మార్కెట్ వద్ద మార్కెట్ చేసుకునేవారు కనీస వసతులు కూడా పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు . అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు. ఇదిలా కోనసాగితే  కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ప్రమాదం పొంచిఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ,భీమవారం నగర వాసులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని బట్టి పట్టణ వాసులు బయటకు వెలెలా కట్టడి  చేయవలసిందిగా ప్రజలు ఆధికారులని కోరుతున్నారు..

పెన్ పవర్ కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం


 

ఆచంట, పెన్ పవర్

 

పెన్ పవర్ దిన పత్రికలో ఆచంట నియోజక వర్గ అక్వా రైతులు పై శనివారం  ప్రత్యేక కథనం ప్రచురితం కావడం తో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదివారం అక్వా రైతులపై ప్రత్యేక చర్యలు చేపట్టింది.. ఆదివారం నుండి ప్రతీ రొయ్యల, చేపల రైతుల వద్ద నుండి చేతికి అందిన రోయిహల,చేపల పంటను దళారులు ఎగుమతులు లేవని, తక్కువ ధరకు గాని కొనుగోలు చేస్తే స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారుల కు ఫిర్యాదు చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని  హెచ్చరించారు. ఈ నేపద్యంలో అక్వా రైతులు కు తమ పంటను అమ్ముకోవడానికి ఎటువంటి అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా వెంటనే దగ్గర్లో ఉన్న అధికారులకు సమాచారాన్ని అందించాలి అని తెలిపారు.

తిన్నింటివాసాలు లెక్కించిన రాయవరం ఎక్సైజ్ సిఐ రెడ్డి త్రినాథ్


 


 


 రూ.2 లక్షల అక్రమ మద్యాన్ని పట్టుకున్న స్థానికులు


అన్నం పెట్టే ప్రభుత్వానికి కన్నం లక్షల్లో సొమ్ము చేసుకున్న వైనం


సిఐ ఆదేశాలతో తరలిస్తున్నామన్న షాపు సూపర్వైజర్


ధర్నాకు దిగిన వైసీపీ నేతలు


గతంలోనే సిఐ వ్యవహారంపై పెనపవర్ లో కథనం


ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక సమర్పణ


సిఐని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు సూచించిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి


(పెన్ పవర్, అనపర్తి)


తిన్నింటి వాసాలు లెక్కించే వారిని చాలా అరుదుగా మనం చూస్తుంటాం. అలాంటి సంఘటన జిల్లాలోని అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలోని మారుతీనగర్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. అక్రమంగా సుమారు లక్ష రూపాయల మద్యాన్ని, రాయవరం ఎక్సైజ్ సిఐ ఆదేశాలతో  తరలిస్తున్న కార్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఒక్క సారిగా సిఐ రెడ్డి త్రినాథ్ భాగోతం వెలుగుచూసింది. మద్యం అక్ర్రమంగా తప్పిస్తున్న కార్లలో సుమారు రూ.2 లక్ష మేర సరుకు ఉన్నట్లు తెలుస్తుంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవవద్దని గట్టి సూచనలు చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇలంటి అక్రమ అధికారులతో... నిజాయతీగా పని చేసే అధికారులు సైతం ప్రజల నుంచి, ప్రభుత్వం నుంచి మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చిన యజమానికి కన్నం వేయాలంటే సవా లక్ష ఆలోచిస్తారు. కాని మన సిఐ మాత్రం తనకు అన్నం పెట్టి, ఉద్యోగం చూపిన ప్రభుత్వానికే కన్నం వేసేందుకు నడుం బిగించారు. తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయల మద్యాన్ని తన స్నేహితుల ద్వారా బయటకు తరలించి లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్థులు తెలిపారు. ఈ భాగోతం గత వారం రోజులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే గ్రామస్థులు పక్కా సమాచారంతో పట్టుకుని అటు ఉన్నతాధికారులకు, ఇటు స్థానిక శాసనసభ్యులు కు సమాచారం చేరవేశారు. దీంతో ఉన్నతాధికారులు వచ్చే లోపుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియా కూడా ఒక్క సారిగా అక్కడకు చేరుకోవడంతో తప్పించుకోవాలనుకున్న సిఐ పీకల్లోతు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. పట్టుపడ్డ షాపు సూపర్ వైజర్ లు కూడా తమకే పాపం తెలియదని, సిఐ ఆదేశించడంతోనే తాము ఈ సరుకు అంతా బయటకు తరలిస్తున్నామని మీడియా ముందు వివరించారు. గతంలో పెన పవర్ దిన పత్రికలో సైతం సిఐ వ్యవహారాలపై పలు కథనాలు ప్రచురించాము. ఆ సమయంలో ఏకంగా మీడియాపైనే ఆయన తప్పుడు నివేదికలు ఉన్నతాధికారులకు అందజేశారు. గ్రామంలోని వైసీపీ నాయకులు రోడ్డుపైకి చేరి ధర్నాకు దిగారు. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఉన్నతాధికారులకు ఆయన అక్కడ నుంచే ఫోన్ చేసి వెంటనే రాయవరం సిఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. వాస్తవానికి గత వారం రోజులుగా ఆయన పరిధిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను ఉన్నతాధికారులు ఒక సారి పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. లాక్ డౌన్ నేపథ్యంలో లక్షలకు లక్షలు అక్రమంగా సిఐ సంపాదించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సిఐ పై చర్యలు తీసుకోవడంతో పాటు షాపులు మూసివేసిన రోజు నుంచి నేటి వరకు ఆయన పరిధిలోని షాపుల్లోని సరుకును ఒక సారి తనిఖీ చేస్తే మరిన్ని వాస్తవాలు తెలియవచ్చు.


విపత్కర  పరిస్థితుల్లో  రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది




  • విపత్కర  పరిస్థితుల్లో  రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది

  • ఏప్రిల్ 1 న ఇంటి వద్దకే పించన్లు

  • లాక్ డౌన్ నేపథ్యం లో పేదలకు వెయ్యి రూపాయల ఆర్ధిక  సాయం


                  రేషన్ సరుకులను పంపిణి కార్యక్రమం లో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి


విజయనగరం, పెన్ పవర్ 


కారోనా వ్యాప్తి చెందకుండా  ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున ప్రజలంతా ఇంటివద్దనే ఉండి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి విజ్ఞప్తి చేసారు.   ప్రజల అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా  బాసటగా ఉంటుందని అన్నారు.   ఆదివారం విజయనగరం లో  22 వ వార్డ్ అవనాపువారి వీధి లోనున్న షాప్ నెంబర్ 8 లో  పౌర సరఫరాల ద్వార ఉచిత బియ్యం, కందిపప్పు  పంపిణి చేసారు.  అనంతరం  ఆమె మాట్లాడుతూ  కారోనా  ను నియంత్రించడానికి అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఐసోలేషణ్  వార్డులను,  వైద్యులను ఏర్పాటు చేయడం, పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేయడం జరుగుతోందన్నారు.   లాక్ డౌన్ ప్రకటించినందున నిత్యావసర సరకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.   పౌర సరఫరాల ద్వారా 1 కోటి 47 లక్షల కుటుంబాలకు లబ్ది చేకుర్చేలా   3 విడతలలో 3 నెలల రేషన్ సరుకులను అందజేయనున్నట్లు  తెలిపారు,  ఈ నెల 29 న, ఏప్రిల్ 15, 29 తేదీలలో  ఈ సరుకుల పంపిణి ఉంటుందని అన్నారు.  ఏప్రిల్ 1 న  జిల్లాలో 58  లక్షల మందికి వాలంటీర్ ల ద్వార  ఇంటి వద్దకే పించన్ అందజేయనున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ దృష్ట్యా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏప్రిల్ 4 న  వెయ్యి రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.  కారోనా నియంత్రణ లో మన రాష్ట్రం దేశం లోనే ముందుందని, సచివాలయాల సిబ్బంది,  వాలంటీర్ లు  చిత్త శుద్ధి తో పని చేస్తున్నారని, అదే విధంగా మీడియా కూడా బాధ్యత యుతంగా పని చేస్తున్నారని అందరి సహకారం తోనే కరోనాను ఎదుర్కోగలమని అన్నారు.


హోల్ సేల్ దుకాణాలను తెరిపించాలి:   కూరగాయల వర్తకుల వినతి


       కూరగాయలు సరఫరాచేసే  టోకు వర్తకులు మూసివేసిన తమ దుకాణాలను తెరిపించాలని,  రైతులను  పోలీస్ లు అడ్డుకుంటున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో కాయగూరల సమస్య ను ఎదుర్కోవలసి ఉంటుందని ఉప ముఖ్య మంత్రి  పుష్ప శ్రీ వాణి, శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి ద్వార వినతి పత్రాన్ని అందజేసారు.  ఆ వినతిని వెంటనే సంయుక్త  కలెక్టర్ జి.సి.కిషోర్ కుమార్ కు అందజేస్తూ ఈ విషయాన్ని  పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.    ఈ కార్యక్రమం లో రెవిన్యూ దివిజినల్ అధికారి కే.హేమలత, తహసిల్దార్ సత్యనారాయణ మూర్తి, జిల్లా పౌర సరఫరా అధికారి పాపా రావు తదితరులుపాల్గొన్నారు.


నూతన ఓరవడితో యువత ముందడుగు




 


నూతన ఓరవడితో యువత ముందడుగు 


పుట్టినరోజు వేడుకల్లో పలు సేవాకార్యక్రమాలు


144 సెక్షన్,కర్ఫ్యూలో విధులు నిర్వహిస్తూన్న సిబ్బందికి సహాకారం


పెన్ పవర్,శివ సేన పార్టీల అధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు


స్వయంఉపాది, సేవ లక్ష్యంగా అదర్శభావాలు


గాజువాక (పెన్ పవర్)


 


కరోనా మహామ్మారికి ప్రపంచం జనజీవనాన్ని అతలాకుతలం చేయడం విచారకరం. ప్రపంచ దేశాలు ఏకత్రాటిపై నడుస్తున్న వైనం అభినందనీయం. 196 దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో శాస్త్రవేతలను, వైద్యనిపుణులను కలవరపాటుకి గురిచేస్తూంది. వ్యాదికి తగిన వ్యాక్సిన్లు కై వైద్యనిపుణులు కఠోరంగా శ్రమిస్తున్నారు.వైరస్ నిర్మూలనకై ఐక్యరాజ్యసమితి పలు ప్రణాళికలు రూపొందించింది. ప్రపంచ దేశాలకు పలు సూచనలు , సలహాలను విశదీకరించడం జరిగింది. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం , లా డౌనను విధిగా పాటించాలని కోరింది. ఉద్యోగులు, కార్మికులు,స్వయం ఉపాది కలిగిన వారు ,దేశ పౌరులు, విద్యార్థులు విధిగా గృహాలకే పరిమితం కావాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్చంద యావత్ దేశం మొత్తం ఎప్రిల్ 14 వరకు లాక్ డౌన్ పాటిస్తూ దేశఔన్యత్యాని చాటిచెబుతున్న భారతీయులు, ప్రపంచ దేశాలకు అదర్శప్రాయం నిలిచింది. నిత్యావసర సరుకులకు ,అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం సడలించడంతో దేశవాసులకు ఉపసమనం కలిగింది. కర్తవ్యదీక్షను బూనిన పోలీసు సిబ్బంది 24 గంటలు కటుంబసభ్యులను సైతం వదలి విధులు నిర్వహిస్తూ, ప్రజలు యోగక్షేమాలకై చేస్తున్న కృషి అభినందనీయం. పెన్ పవర్ టీం, శివ సేన పార్టీ అధ్వర్యంలో మణికంఠ తన పుట్టిన రోజు శనివారం పోలీసు సేవలకు గాను తమ వంతు సహాకారంగా వాటర్ బాటిల్స్, బిస్కట్ పేకెట్లను అందజేశారు. యువత చేస్తున్న కార్యక్రమాలను పలువురు అభినందనలు తెలిపారు. 144 సెక్షన్ అమలు కారణంగా అనాధలుకు, పేదలకు


త్రాగు నీటి ఎద్దడి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోండి



 

రంపచోడవరం పెన్ పవర్:

 

గిరిజన ప్రాంతాలలో వేసవిలో త్రాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా వేసవి కార్యాచరణ ప్రణాళికలు సమర్ధవంతం పరిచి గిరిజనులకు పూర్తిగా దాహార్తిని తీర్చాలని ఐ టి డి ఎ పి.ఓ నిశాంత్ కుమార్ గ్రామీణ త్రాగునీటి సరఫరా ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఐటిడిఎ కార్యాలయం లో వేసవి కార్యాచరణ ప్రణాళికలు అమలు తీరును ఆయన ఆ శాఖ ఇంజనీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు మండలాలకు, పంచాయతీలకు విడుదల కాబడ్డాయని, మండలాలకు విడుదలైన నిధులతో ఆయా పరిధిలోని చేతి పంపులు రిపేర్లు, మెటీరియల్ కొనుగోలుకు మెకానిక్, మొబైల్ వాహనాల కొరకు ప్రతిపాదనలు సిద్ధంగా చేసి వెంటనే అనుమతులు పొంది ఆయా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. చేతి పంపులు ఫ్లసింగ్, వివిధ రకాలు స్కీములు నిర్వహణ, స్పేర్ పార్ట్స్ అవసరతలు గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కోరాలి అన్నారు. ఇరిగేషన్ శాఖ వారి ఆయకట్టు పరిధిలోని గ్రామాలలో మంచినీటి స్టోరేజ్ చెరువులను వేసవి కార్యచరణ అమలుకు ముందుగా నింపుకోవాలని ఆదేశించారు. ఆయా స్కీమింగ్ వర్కింగ్ కండిషన్లు విశ్లేషించి వాటికి రిపేర్లు అవసరతను గుర్తించి ప్రతిపాదనల ద్వారా వాటిని చేపట్టాలన్నారు. నీటి కొరత ఉన్న చోట్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనుల క్షేత్రాలలో వేసవి కార్యాచరణ ప్రణాళికలు పూర్తిస్థాయిలో కూలీలకు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాలకు విదేశాల నుంచి ఎవరైనా తిరిగి వచ్చిన ఎడల వారిని ముందుగానే గుర్తించి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయో లేదో వైద్యుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి వారిని క్వారం టైన్ కేంద్రాలలో 28 రోజులు పాటు వైద్యపరంగా పర్యవేక్షణ కొరకు ఉంచాలని ఆదేశించారు. ఏఎన్ఎం లు ఆశాలు వారి పరిధిలోని విదేశాల నుంచి వచ్చి క్వారం టైన్ ఉన్నవారిని రోజులో రెండు పర్యాయాలు వారి యోగక్షేమాలు గురించి ఆరా తీసి వైద్యులు ద్వారా తదాగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి 15 మంది వచ్చారన్నారు. చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా చర్యలు చేపట్టాలని ఎట్టిపరిస్థితులలోనూ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఎవరిని అనుమతించరాదని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో కూడా క్వారం టైన్ ఉన్నవారికి ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. హోమ్ క్వారం టైన్ ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్యవసర వస్తువులు కొనుగోలు కొరకు బయటకు రాకుండా గ్రామ వాలంటీర్లు ద్వారా నిర్దేశిత సామాజిక దూరాలు పాటిస్తూ సరఫరా చేయాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా ప్రస్తుత పరిస్థితులలో సామాజిక దూరం పాటించడమే శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ లు నాగ వెంకట పద్మనాభం, రవీంద్ర బాబు, ఇంజనీర్లు రాజు, హరి రామ కృష్ణ, ఏ డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి.వినోద్ కుమార్, మెడికల్ అధికారి జి రాజ్ కుమార్, ఎంపీడీవో లక్ష్మారెడ్డి, తాసిల్దార్ కే లక్ష్మి కళ్యాణి, డివిజినల్ చాయతీ అధికారి హరి, తదితరులు పాల్గొన్నారు.


రాజారత్న బార్ పై సోదాలు



మండపేట, పెన్ పవర్ 



కరోనా వైరస్ కారణంగా మండపేట లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లను, మద్యం దుకాణాలను అధికారులు పూర్తిగా నిషేధించారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండపేట విచ్చేసి కూరగాయల మార్కెట్ తో పాటు పలు ప్రాంతాలు పర్యటన జరిపారు. మండపేట లో పరిస్థితిని తెలుసు కోడానికి ప్రజల స్పందన తదితర అంశాల పై మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశం మధ్యలో పట్టణంలో మద్యం అమ్మకాలు రహస్యంగా సాగుతున్నాయని బోస్ దృష్టికి తీసుకువచ్చారు.  బోస్ స్పందిస్తూ ఆ బార్ కి వెళ్లి  సోదాలు జరపమని ఆదేశించారు. దీంతో కమిషనర్ త్రిపర్ణ  రామ్ కుమార్ టీపీఎస్ కట్టా వీరబ్రహ్మం, శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఇతర సిబ్బందిని వెంట బెట్టుకుని రాజారత్న బార్ ను తనిఖీ చేశారు. బార్ తలుపులు మూసి వేయడంతో చుట్టూ ఉన్న గార్డెన్ , వంటశాల, లూజు న అమ్మే కౌంటర్ లను పరిశీలించారు. అక్కడ ఎటువంటి మద్యం బాటిల్స్ కనపడలేదు. ఈలోగా బార్ నిర్వాహకులు ఊలపల్లి ప్రసాద్, బొడ్డు రామకృష్ణలు బార్ వద్దకు వచ్చారు. వారిని కమిషనర్ రామ్ కుమార్ ప్రశ్నించారు. తాము అయితే  బార్ ని ఎట్టి పరిస్థితిలో తెరవ లేదని కమిషనర్ కు సమాధానం ఇచ్చారు. తెరవకుండా మద్యం క్వార్టర్ బాటిల్ ఎలా వచ్చింది అని కమిషనర్ అడగ్గా ఇది ఎవరో కావాలని చేసిన పని తప్పా తాము అయితే అమ్మలేదని చెప్పారు. మద్యం బాటిల్ ఇక్కడే కొన్నట్టు సమాచారం ఉందని  తాను దీనిపై నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టరుకు ఫైల్ అందజేస్తాను అని కమిషనర్  అక్కడి నుండి కార్యాలయానికి వచ్చేశారు.


లాక్ డౌన్ నిష్ప్రయోజనం అవుతుందా?







- మినహాయింపు సమయమే  కారణం 

- ప్రభుత్వం, అధికారులు ,పోలీసులు పక్కా పర్యవేక్షణ 

- సమస్యల్లా సామాన్య జనంలో లోపిస్తున్న అవగాహన 

 

 అనకాపల్లి, పెన్ పవర్ 

 

కరోనా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించేది. జాగ్రత్తగా లేకపోతే అందరి చావుకు కారకంగా నిలిచే అవకాశాలు లేకపోలేదంటూ  ప్రభుత్వం ఓవైపు మొత్తుకుంటూనే ఉంటుంది. ఇళ్లకే పరిమితమవండి అంటూ లాక్డౌన్ ను కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ వైపు పలుశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఎండనకా వాననక పనిచేస్తూనే ఉన్నారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణలో ఉంటూనే  ఉన్నారు. కానీ ఏమి లాభం. నిత్యావసర సరుకుల కోసం అంటూ ఇచ్చిన మినహాయింపు సమయం ప్రజల భద్రతకు, ప్రభుత్వ లక్ష్యానికి భంగం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

 

      నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం మినహాయింపు సమయాన్ని ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చారు. ఇస్తూనే సామాజిక దూరాన్ని కూడా  తప్పక పాటించాలని కూడా సూచనలు చేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సలహాలిస్తునెే ఉన్నారు. కానీ అది ఏ మేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో అన్నదే ఇక్కడ ప్రశ్న.  అవగాహన ఉన్నా కొందరు అవగాహన లేక మరికొందరు మార్కెట్లకు ఇబ్బడి ముబ్బడిగా వస్తూనే ఉన్నారు. ఎక్కడో చోట గుమి గుూడుతూనే  ఉన్నారు. దీంతో కరోనా వ్యాధి చైన్ కు   బ్రేక్ వేయాలనె లక్ష్యానికి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. 

 

      ప్రభుత్వం పరంగా మార్కెట్ ను వికేంద్రీకరణ చేశారు. సామాజిక దూరానికి తగ్గట్లు చర్యలు కూడా తీసుకున్నారు. కానీ ప్రజల నుంచి వచ్చే స్పందన అంతంతగానెే ఉండటంతో  చిత్తశుద్ధితో లాక్డౌన్ లో పాటించేవారు కూడా  పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా అధికారుల పరంగా ఎంత చేస్తున్న ఈ మినహాయింపు సమయంతో ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. గుమిగూడే జనంతో  ఏ సమస్య వచ్చినా అక్కడి నుంచి మరొకరికి మరొకరి నుంచి ఇంకొకరికి తాకే అవకాశాలు లేకపోలేదు.  పైగా మినహాయింపు సమయాన్ని ఆసరాగా చేసుకుని ఊరికినే బయటికి వచ్చే వారే అధికంగా ఉంటున్నారనది క్షేత్ర స్థాయి మాట. రోజు మార్కెట్కి వచ్చేవారు ఉండనే ఉన్నారు. దీంతో అసలు లక్ష్యం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే వారు లేకపోలేదు. చాలా చోట్ల మార్కెట్ వికేంద్రీకరణ జరగడంతో మినహాయింపు సమయాన్ని తగ్గిస్తే బావుండు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. అలాగే  గ్రామాల నుంచి మార్కెట్కు రాకుండా వారివారి గ్రామాల్లోనే నిత్యావసర సరుకులు అందుబాటులొో ఉండేలా చర్యలు తీసుకుంటే ప్రభుత్వ లక్ష్యం త్వరగా నెరవేరే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. 






 

 

 


పోలీస్ ది గ్రేట్ 






పోలీస్ ది గ్రేట్ 
 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

పోలీస్ ది గ్రేట్ .  ప్రజలకు రక్షణ కల్పించే కల్పించడంలో వారు వ్యవహరించే తీరే వేరు. ఇప్పుడు కరోనా వ్యాధి నుంచి ప్రజలను గట్టెక్కించడంలో వాళ్లు రోడ్లపై చేస్తున్న విధులు విలువైనవిగా చెప్పొచ్చు.   ఆపత్కాలంలో వారు చేస్తున్న కృషి అభినందనీయం. పోలీస్ దిగ్రేట్ అంటూ పలువురు  పేర్కొంటున్నారు. పోలీసులను రక్షక భటులని ఎందుకంటారో ఇప్పుడు క్షేత్రస్థాయిలో తెలిసొస్తుందనెేది జనం మాట.   ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి  ప్రజలను రక్షించడంలో  కీలక పాత్ర పోషిస్తున్నారు. 

జనం రోగం బారిన పడకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా రోడ్లపై రక్షణ వలయంగా నిలుస్తున్నారు అంటే అతిశయోక్తి లేదు. 

కరోనా వ్యాధి నేపథ్యంలో కుటుంబం మొత్తం కలిసి ఉండేందుకే సంకోచించాల్సిన పరిస్థితి.  ఆ వ్యాధి తీవ్రతెే అలాంటిది. అందుకే దాని బారిన పడకుండా జాగ్రత్త వహించాల్సిందేనని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. దీని కోసం ఎవరూ రోడ్లపైకి రాకుండా ఇంటిలోనే ఉండాలని లాక్ డౌన్  పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చెప్పినా వినేవారు అరుదుగానే  ఉంటారన్నది తెలిసిందే. దీంతో ప్రజలను రక్షించాలనె ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తుంది పోలీసులే. రోడ్లపై ఎండనకా వాననకా సేవలు అందించే పోలీసులు  నిస్పక్షపాతంగానే నిర్వహిస్తారు. ఈ క్రమంలో అదుపు తప్పెవారిని నియంత్రించడం లొో కఠినంగా కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి. కరోనా వ్యాధి ప్రభావం తెలిసి కొందరు తెలియక మరికొందరు ఏదో  నెపంతో రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తూనే  ఉన్నారు.  దీంతో అటువంటి వారిని నిలువరించడంతో పాటు ప్రజలను కంటికి రెప్పలా కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారంటే అతిశయోక్తి లేదు.  పోలీసులకి కుటుంబాలు ఉన్నా  ప్రజా ధర్మమే ముఖ్యం అన్న వైఖరి తో ముందుకెళతారు.  వృత్తి ధర్మంలో భాగంగా  విధి నిర్వహణలో ఇబ్బందులున్నా వెరవకుండా  ఉత్సాహంగా పని చేస్తుంటారు. ప్రజలకు రక్షణ కల్పించే రక్షక భటులుగా పేరున్న పోలీసులు ఇప్పుడు కరోనా మహమ్మారి నేపథ్యంలో వారు ప్రజలను బయటికి రాకుండా కాపాడుతున్న  చర్యలు గొప్పవిగా అభివర్ణిస్తున్న వారు అధికమే. నిజంగా పోలీసులు ది గ్రేట్ అంటూ పలువురు పేర్కొంటున్నారు అంటే అతిశయోక్తి కాదు.


 

 



 




 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...