ప్రజలు గుమిగూడకుండా ఎస్సై బుజ్జిబాబు పర్యవేక్షణ
రావులపాలెం, పెన్ పవర్
మండలంలోని గ్రామాల్లోని చౌక ధరల దుకాణాల్లో కారోనా నేపధ్యంలో ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఆదివారం నిత్యావసర సరుకులైన బియ్యం,కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. వినియోగదారులు వరుసక్రమంలో వెల్లి రేషన్ సరుకులు తీసుకున్నారు. గ్రామ సచివాలయాల సిబ్బంది, రేషన్ షాప్ డీలర్లు, వాలంటీర్లు అందరూ కలిసి పంపిణీ చేపట్టారు. ఏరియాల వారీగా గ్రామస్థాయి, మండలస్థాయి నాయకులు ఈ పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సరుకులను పంపిణీ చేశారు. మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పంపిణీపై వివరాలు సేకరిస్తూ సలహాలు సూచనలు చేశారు.ఎస్సై పి.బుజ్జి బాబు రేషన్ షాపుల వద్ద జరుగుతున్న పంపిణీ తీరు పరిశీలించారు. జనం గుముకూడకుండా మనిషికి మనిషికి మధ్య ఒకొక్క మీటర్ దూరం ఉండేలా మార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ నేపద్యంలో ఈపాస్ మిషన్ లో కార్డుదారులకు బదులుగా ఇంచార్జ్ లుగా నియమించిన గ్రామ సచివాలయ సిబ్బంది వేలిముద్రలు వేసి రేషన్ అందించారు. వినియోగదారులు కూడా లైన్లో నిలబడి రేషన్ అందుకున్నారు.
No comments:
Post a Comment