Followers

 ముమ్మరంగా వరి నాట్లు


 ముమ్మరంగా వరి నాట్లు


 


ఏలేశ్వరం ,పెన్ పవర్ 


 

ఏలేశ్వరం మండల పరిధిలో లింగంపర్తి, భద్ర వరం, పేరవరం, తూర్పు లక్ష్మీపురం, ఏలేశ్వరం, జె అన్నవరం, మర్రి వీడు, పెద్దనాపల్లి తదితర గ్రామాల్లో వరినాట్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టులో 67 వేల ఎకరాలు, తిమ్మరాజు చెరువు ఆయకట్టు 950 ఎకరాల సేద్యపు భూమి ఉంది. సదర్ భూముల్లో సుమారు 80 శాతం వరి పొలాలను సాగు చేస్తారు. రుతుపవనాల కారణంగా ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్, తిమ్మరాజు చెరువులలో కావలసిన సాగు నీరు పుష్కలంగా ఉంది. దీంతో సేద్యానికి సమాయత్త మైన రైతాంగం వరి ఊడ్పులు  ముమ్మరంగా సాగుతున్నాయి.

కార్మికులకు ఆర్థిక సహాయమివ్వాలి




భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయమివ్వాలి


 


 


అనకాపల్లి,పెన్ పవర్ 


 

భవన నిర్మాణ కార్మికులు ఏడాది కాలంగా ఉపాధి కరువై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొన్ని కుటుంబాలు అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నారని శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలిపారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తరువాత ఇసుక పై నిషేధం విధించింది. దీంతో నాలుగు నెలలపాటు ఇసుక లేక పనులు లేకుండా పోయారని ఆ తర్వాత కొత్త ఇసుక విధానం అమల్లోకి రావడంతో కాస్తకూస్తో పనులు దొరికాయని కరోనా వైరస్ రావడంతో మార్చి నెల నుండి లాక్ డౌన్ ప్రకటించడంతో దాదాపు రెండు నెలల పాటు పనులు లేక ఇంటికే పరిమితం అయ్యారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉన్నదంటే కరోనా వైరస్ విజృంభించడం వల్ల ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు కంటోన్మెంట్ జోన్ లు అమల జరుగుతున్నందున కార్మికులకు పనులు దొరకడం లేదనారు. రాష్ట్రములో నిర్మాణ రంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు దాని అనుబంధ ఉన్నవారు కలిపి సుమారుగా 30 లక్షల మంది ఉన్నారని వీరందరికీ ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని ఇప్పటికీ వారికి సాయం అందలేదని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్  నుంచి ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున అందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించి చేతులు దులుపుకున్నరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి జమయ్యే సేస్ డబ్బులతో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది ప్రస్తుతం కార్మిక వెల్ఫేర్ బోర్డు దగ్గర వెయ్యి కోట్లు నిధి ఉందని దీని ద్వారా ఎంతమేరకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించలేదని తెలిపారు. ఈ ఆర్థిక సహాయం అందించడానికి రాష్ట్ర కార్మిక శాఖ తో సర్వే నిర్వహించి వివరాలు సేకరించి ఆర్థిక సహాయం అందిస్తానని ప్రభుత్వం ప్రకటించిన 

 నప్పటికీ కార్మికులకు నిరాశే మిగిలిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులకు సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


 

 




ఈ టి సి శిథిల గృహాల ఆదాయం రూ.1.16 లక్షలు


ఈ టి సి శిథిల గృహాల ఆదాయం రూ.1.16 లక్షలు


సామర్లకోట, పెన్ పవర్


 

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే ఇళ్ళ స్థలాల కోసం సిద్ధం చేసేందుకు గాను స్థానిక గృహకల్ప వద్ద శిథిలావస్థలో ఉన్న పంచాయితీ రాజ్ కు చెందిన శిథిలాలను కూల్చి వాటి మెటీరియల్ తీసుకుపోయేందుకు గాను నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా మునిసిపాలిటీకి రూ.1,16,000 ఆదాయం లభించింది.ఈ మేరకు సోమవారం స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో శిథిలా కట్టడాల తొలగింపునకు గాను వేలం పాటలను నిర్వహించారు. దానిలి పలువురు పాట దారులు పాల్గొనగా వారిలో కాకినాడ రూరల్ కరకుదురు గ్రామానికి చెందిన వి.శ్రీనివాసరావు అధిక పాటగా 1,16,000లకు పాడి కైవసం చేసుకున్నారు.ఈ మేరకు అతనికి పాటను ఖరారు చేస్తూ అధికారులు ఉత్తర్వులు అందించారు.కాగా ఈ స్థలం లో అందరికీ ఇల్లు పథకంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు సిద్ధం చేస్తున్నట్టు డిఇ సిహెచ్ రామారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ టి సి,మున్సిపల్ రెవిన్యూ అధికారులు పాల్గోన్నారు.

లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాలి


లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాలి



ఏలేశ్వరం,పెన్ పవర్ 


రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలను పునః సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు మేధావులు హితవు పలుకుతున్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండలాల వారిగా లాక్ డౌన్ విధించే అధికారం స్థానిక అధికారులకు ఇచ్చారు. ఈ మేరకు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక అధికారులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యావసరాలు, కూరగాయలు తదితర ప్రజా జీవనానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ఉదయం ఒక్కసారి గా ప్రజలు తమ వాహనాలను వేసుకుని మార్కెట్లకు , ఇతర అవసరాలకు రోడ్లపైకి రావాల్సిన అవసరం వస్తున్నది. దీంతో వ్యాపార సమూహాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడి సామాజిక దూరం పాటించే పరిస్థితు లకు భంగం కలుగుతుంది. గంటల తరబడి రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో కరోనా మహమ్మారి  విజృంభించే అవకాశాలను రెట్టింపు చేస్తున్నట్లు అవుతుంది. ఇకనైనా ప్రభుత్వ అధికారులు లాక్ డౌన్  నిబంధనలపై పునః సమీక్ష చేసి ఉదయం 10 గంటల నుంచి  సాయంకాలం 6:00 వరకు వ్యాపార సంస్థలు  నిర్వహించుకునే లా, ప్రజలు సామాజిక దూరం పాటించేలా వ్యాపార సంస్థల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేధావుల అభిప్రాయం.ఏలేశ్వరం మెయిన్ రోడ్ లో సోమవారం ఉదయం 10 గంటలకు ట్రాఫిక్ రద్దీ, షాపుల వద్ద నిరీక్షిస్తున్న జన సమూహాలు


పరిశుభ్రత వార్షికోత్సవం


పరిశుభ్రత వార్షికోత్సవం


 ఆత్రేయపురం,పెన్ పవర్


 


 ఆత్రేయపురం మండలం పేరవరం  లో  లో  లో పరిశుభ్రతా పక్షోత్సవాలలో భాగంగా సోమవారం పైలట్ పంచాయతీలైన పేరవరం,బొబ్బర్లంక గ్రామాలలో  ఎంపీడీఒ నాతి బుజ్జి ఆద్వర్యంలో పరిశుభ్రత కమిటీ సభ్యులు , టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు, సచివాలయ సిబ్బంది  గ్రామ వాలంటీర్లతో  కలిసి గ్రామ సందర్శ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఘన,ద్రవవ్యర్ధాల నిర్వహణ,-త్రాగునీటి సరఫరా, పైప్ లైన్ లీకేజ్ లు, వ్యక్తిగత మరుగుదొడ్లు మరియు కమ్యూనిటీ మరుగు దొడ్లు వాడకం, బహిరంగ మల విసర్జన లేకుండా అవగాహన కల్పించడం,  డ్రైన్లు శుభ్రం చేయడం- SWPC షెడ్ నిర్వహణ , 
 అంటువ్యాధులు ,ఇతర ఆరోగ్య సంబంధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి , పంచాయతీ సిబ్బందికి తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్ , కార్యదర్శులు శివరామకృష్ణ, హనుమ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీకాంత్, బొబ్బర్లంక మాజీ ఎంపీటీసి సల్లపూడి క్రీస్తమ్మ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు


మనం మన పరిశుభ్రత


మనం మన పరిశుభ్రత


 


పెద్దాపురం పెన్ పవర్


 

పరిశుభ్రత పక్షోత్సవములలో భాగముగా పెద్దాపురం మండలం గ్రామాల్లో  మనం-మన పరిశుభ్రత పైలట్ ప్రాజెక్టు కార్యక్రమమునకు ఎంపిక చేయబడిన చదలాడ మరియు ఉలిమేశ్వరం గ్రామపంచాయితీల యందు 3వ రోజు కార్యక్రమములో భాగముగా గ్రామపంచాయితీల యందు ఎంపిక చేయబడిన టాక్స్ ఫోర్సు టీముల ద్వారా  ట్రాన్సాక్ట్ వాక్ నిర్వహించుట జరిగింది.  కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు  మండల పరిషత్ అభివృద్ధి అధికారి, విస్తరణాధికారి(పం.రా & గ్రా.అ.) పెద్దాపురం, గ్రామస్దాయి కమీటి మెంబర్లు, ఏ ఈ -ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ -పి  హాజరయ్యారు. రేపటి నుంచి గ్రామాలలో ప్రతి రోజు 50 కుటుంబాలను సందర్శించి, పారిశుద్ధ్య నిర్వహణపై తగు అభిప్రాయాలు, సమస్యల పరిష్కారమునకు చర్యలు తీసుకొనుదురు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు

కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు







కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు


క్వారంటైన్ సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు


ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి


తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు డిమాండ్


 


పెద్దాపురం,పెన్ పవర్


 

పెద్దాపురం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు ( కోటి) పాత్రికేయులతో మాట్లాడుతూ. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రోగులకు తక్షణం మెరుగైన వైద్య సేవలు అందించడం తో పాటుగా వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని. నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూ ఆంటీ పట్టనట్టు వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని అందువల్లనే రోజుకు ఐదువేలనుండి ఎనిమిది వేల  పైచిలుకు కేసులు నమోదు అవుతున్నాయని  అలాగే పనులు లేక తీవ్రఇబ్బందులు పడుతున్న అన్ని రంగాల కార్మికులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కరోనా వైరస్ నియంత్రించడం లో రాష్ట్రం చాలా వెనక పడిందని. కరోనా వైరస్ సోకకుండా ప్రజలు  మాస్కులు తప్పనిసరి వాడాలని ఎవరి రక్షణార్థం వాళ్ళు తగు జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.  కరోనా క్వరంటైన్ సెంటర్ లో కనీస సౌకర్యాలు కూడా లేవని పది రోజులు ఉంచుకొని టెస్టులు చేయకుండానే బాధితుల్ని వెనక్కి పంపి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కరోనా కష్ట కాలంలో కూరగాయలు మరియు కిరాణా సరుకులు పంపిణీ చేసిన తెలుగు దేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందని ప్రతి కార్యకర్త కరోనా టైంలో సైనికుల్లా పని చేశారని ప్రజలకు అండగా నిలవడమే తేదేపా లక్ష్యమని ఆయన తెలిపారు.


 

 




 

 



 



 



కోవిడ్ వైద్య సేవలు మెరుగు





కోవిడ్ వైద్య సేవలు మెరుగు పర్చాలంటూ సి పి ఎం ధర్నా


 


సామర్లకోట, ,పెన్ పవర్


 


 

కరోన పాజిటివ్ కేసులు విపరీతంగా రాష్ట్రంలోను,జిల్లాలోనూ పెరిగిపోతున్నoదున పాజిటివ్ వచ్చిన ప్రజలకు,కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి అందించే సౌకర్యాలు మెరుగు పరచాలని సి పి ఎం పట్టణ కార్య దర్శి బలం శ్రీనివాసు డిమాండ్ చేశారు.ఈ అంశం పై సోమవారం గాంధీనగర్ సచివాలయం వద్ద సి పి ఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు లక్ష దాటి దేశంలోనే నాల్గవ స్థానంలో ఉన్నట్టు చెప్పారు.అలాగే తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రధమ స్థానంలో ఉందన్నారు. కరోనా కట్టడికి విధులు వైద్యులు,సిబ్బందికి సరిపడా సౌకర్యాలు కల్పించాలని,పాజిటివ్ తో చికిత్స పొందుతున్న ప్రజలకు మెరుగైన సదుపాయాలు నాణ్యమైన పోషకాహారం, వేడినిళ్లు, నిమ్మరసం వంటి సేవలను అందించాలి అన్నారు.కోవిడ్ విధుల్లో ఉన్న సిబ్బందికి 50 లక్షల బీమా సదుపాయాన్ని కొనసాగించాలి అన్నారు.అలాగే అన్ని ప్రాంతాల్లోనూ కేసులు అధికామవుతున్న నేపధ్యంలో ప్రతిరోజు కోవిడ్ పరీక్షలు చేపట్టాలన్నారు.చేపట్టిన పరీక్షలకు సంబంధించి రిపోర్టులను వెంటనే విడుదల చేసి ప్రజల్లో ఉన్న మానసిక వత్తిడిని పరిష్కరించాలి అన్నారు.అలాగే కరోనా వ్యాప్తికి కరణమవుతున్న మద్యం దుకాణాలను నిలిపి వేయాలన్నారు.ఏ సందర్భంగా సచివాలయ అధికారికి వినతి పత్రాన్ని వారు అందజేశారు.ఈ ధర్నాలో సి పి ఎం నాయకులు కోనా శివకుమార్, బలం సత్తిబాబు,బంటు రవేంద్ర,దొర రమణ,తదితరులు పాల్గొన్నారు.


 

 




కరోనా పట్లప్రజలు మరింతఅప్రమత్తం


కరోనా పట్లప్రజలు మరింతఅప్రమత్తంగా ఉండాలి


సొంత నిధులతో గ్రామ ప్రజలకు మాస్కులు శానిటైజర్లు. పి.పి.ఈ కిట్టు పంపిణీ


పంచాయతీ సెక్రటరీ పద్మరాజ


 


పెద్దాపురం,పెన్ పవర్


 

పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం గ్రామంలో కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని రానున్న రోజుల్లో కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలనీ మాస్క్ లేనిది బయట తిరిగి రాదని మీ రక్షణ కోసమే మేమందరం పనిచేస్తున్నామని కరోనా పట్ల ఎటువంటి అవసరం వచ్చినా వాలంటీర్స్ ని గాని పంచాయతీ గాని సంప్రదించాలని 

పంచాయతీ సెక్రటరీ జె.పద్మరాజు కోరారు  అలాగే నా వంతు కృషిగా గ్రామ ప్రజలకు మాస్కులు శానిటైజర్లు పి పి ఈ డ్రెస్లు పారిశుద్ధ్య కార్మికులకు షూలు అందించడం జరిగిందని.ఆయన తెలిపారు.నా ముఖ్య ఉద్దేశం కరోనా బారిన ఎవరు పడకుండా ఉండేందుకే ఇవన్నీ అందించడంజరిగిందని. గ్రామ రక్షణనే మా బాధ్యతగా పంచాయతీ ఎల్లవేళలా సేవలందించడానికి ముందుందని ఆయనతెలిపారు. *గ్రామస్తులుహర్షం*. కల్లు సారాయి నిర్మూలనరహితంగా. తీర్చిదిద్దేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఇటువంటి  సెక్రెటరీ  మా గ్రామానికిఉండడం గ్రామ ప్రజల అదృష్టంగా భావించాలని గ్రామ పెద్దలు గ్రామస్తులు తెలిపారు. అలాగే గ్రామ అభివృద్ధికి వాలంటీర్స్ వ్యవస్థ  కీలకంగా పని చేస్తుందని గ్రామస్తులు అభినందించారు, ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ ఎం.సుభాష్ వి.సాయికృష్ణ,ఎన్.స్వామి,యూ. వీరేంద్ర,దివాకర్,రవి, మణి, వీరకుమార్,పంచాయతీ గుమస్తా శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.

సంజీవని కోవిడ్ పరీక్షల రిపోర్టులు ఎక్కడా


సంజీవని కోవిడ్ పరీక్షల రిపోర్టులు ఎక్కడా


 


వారం రోజులు దాటినా విడుదల కాని రిపోర్టులు పరీక్షలు చేయించుకున్న వారిలో తీవ్ర ఆందోళన...


 


సామర్లకోట,,పెన్ పవర్


 

ఈ నెల  సామర్లకోట పట్టణంలో సంజీవిని సంచార వాహనం ద్వారా నిర్వహించిన కోవిడ్ పరీక్షల రిపోర్టు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి స్థానికంగానెలకొంది స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఈ నే 20 వ తేదీన మూడు వందలకు పైబడి ప్రైమరి ,సెకండరీ కంటాక్టులకు సంబంధించిన మూడు వందలకు పై బడి కోవిడ్ పరీక్షలను పూల్ పద్దతి లో నిర్వహించారు అలా రాత్రి సుమారు తొమ్మిది గంటల వరకు నిర్వహించి సేకరించిన సెంపిల్  కిట్టులను కాకినాడ తరలించారు. ఐతే దానికి ముందు కొద్దీ రోజుల పాటు పట్టణ పరిధిలో భారీగానే పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోవిడ్ లక్షణాలు ఉన్న వారు అనుమానం ఉన్నవారందరికి ఈ పరీక్షలు నిర్వహించిన వాటికి సంబంధించిన రిపోర్టులు ఇప్పటివరకు విడుదల కాకపోవడం ఆశ్చర్యనికి గురి చేస్తుంది.సంజీవి వాహనం ద్వారా చేపట్టిన పరీక్షలు ఏమయ్యాయో స్థానిక వైద్య అధికారులకు సహితం అర్థం కాకపోవడం మరింత ఆశ్చర్యనికి గురి చేస్తుంది.పరీక్షలు చేయించుకుని 8 రోజులు గడిచిన రిపోర్టులు రకవడంతో పరీక్షలు చేయించుకున్న ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమకు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అనే విషయం తెలియక అయోమయానికి గురవుతున్నామని దానితో తాము ఎక్కడికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఒక వేళ పరీక్షలు చేయించుకొన్నవారిలో ఉన్న వయస్కులకు పాజిటివ్ లక్షణాలు ఉంటే వారి పరిస్థితి ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాగా పరీక్షలు చేయించుకున్న వారిలో పలువురు పలు ప్రయివేటు పరిశ్రమలలో పని చేస్తున్నo దున పరీక్షల రిపోర్టులు వస్తే తప్ప తమను విదులులోకి తీసుకోమని యాజమాన్యం చెబుతున్నారు అని దానితో ఉపాధిని కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నాము అని పలువురు కార్మికులు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయం పై స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులను ప్రశ్నిస్తే ఆ రిపోర్టుల కోసమే తాము చూస్తున్నాము అని ఆలస్యానికి కారణం తమకు తెలియడం లేదు అంటున్నారు.దాని పై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా మల్లిక్ ను వివరణ కోరగా జిల్లా  వ్యాప్తంగా సుమారు 7 వేలకు పై బడి రిపోర్టులు పెండింగులో ఉన్నాయి అన్నారు.కాకినాడ లొ కోవిడ్ పరీక్షలు నిర్వహించే టెక్నీషియన్ ల కొరత ఉన్నందున ఉన్న ఒక్క టెక్నీషియన్ రాత్రి పగలు పనిచేస్తున్న తరగడం లేదు అన్నారు.అయితే స్థానికంగా ఉన్న వైద్య అధికారుల సూచనల ప్రకారం రెడ్ లేబుల్ అతికించిన సెంఫుల్స్ సంబంధించి రిపోర్టులు తొలుత నిర్వహించి వారికి రిపోర్టులను తక్షణం విడుదల చేస్తున్నట్టు చెప్పారు.నెగిటివ్ వచ్చిన రిపోర్టుల విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా రిపోర్టుల కోసం సమయం పాటించాలన్నారు.అన్ని రిపోర్టులు ప్రకటిస్తామని, ఉన్న పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి అని డి ఎం హెచ్ ఓ స్పష్టం చేశారు.ఏదేమైనా 20 వ తేదీనాటి రిపోర్టులు ఇప్పటి వరకు రాకపోవడం పట్ల ప్రజలు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అని చెప్పక తప్పడం లేదు.

సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారి







ప్రభుత్వ కార్యాలయాల వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారి.


 


గోకవరం పెన్ పవర్


 


 

మండల కేంద్రమైన గోకవరం లో రోజురోజుకు కరోనా వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందడంతో గోకవరం పంచాయతీ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం కోసం వ్యాధి సోకిన వ్యక్తులు ఇళ్ళ వద్ద మరియు ప్రజలు ఎక్కువగా సంచరించే గోకవరం లోని మండల రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, మండల ఉపాధిహామీ కేంద్రం, మరియు గోకవరం లోని అన్ని బ్యాంకుల వద్ద ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద, మరియు గ్రామం లోని ఆలయాలు, మసీదులు, చర్చిలో వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని పిచికారీ చేయడం జరిగింది అని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా గోకవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామములోని అన్ని విధులను పరిశుభ్ర పరచడంతో పాటు బ్లీచింగ్ కూడా జలటమం చేయడం జరిగిందన్నారు. ముఖ్యమైన ప్రదేశాల వద్ద సోడియం హైపోక్లోరైట్, కాల్షియం హైపోక్లోరైట్ ద్రవాన్ని పిచికారి చేయడం జరిగింది అన్నారు. గ్రామస్తులు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాస్కులు ధరించి మాత్రమే నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి బయటికి రావాలని అని తెలియజేశారు.


 

 




కరోనా ను జయప్రదం సి డి ఆవిష్కరణ


కరోనా ను జయప్రదం సి డి ఆవిష్కరణ



ఆత్రేయపురం,పెన్ పవర్


ఆత్రేయపురం మండలం ర్యాలీ లో నిర్వహించిన ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక  మ్యాజిక్ ఫ్యామిలీ శ్యామ్ జాదూగర్ కరోనా పై రూపొందించిన కరోనా ను జయుద్దాం అనే వీడియో సిడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ జాదూగర్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న వేళ మనం కరోనా తో సహజీవనం చేయవలసి ఉన్నకారణంగా దీని బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరిలోనూ మనో బలం, శారీరక బలం, వినోద బలం లను ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఈ సీడీలో వివరించడం జరిగిందని వీటిని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసి ప్రజలలో అవగాహన పెంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు మోహిత్, అన్నపూర్ణ, రుషిత్ లు పాల్గొన్నారు.


డా. ఏ.పి.జె అబ్దుల్ కలం కు ఘన నివాళి


డా. ఏ.పి.జె అబ్దుల్ కలం కు ఘన నివాళి


ఆత్రేయపురం,పెన్ పవర్


 


ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అబ్దుల్ కలాం నివాళి కలలు కనండి_ వాటిని సాకారం చేసుకోండి అనే మాటను పది మందికి చెప్పడమే కాదు తాను కూడా ఆచరించి,  జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహనీయుడు.. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం అనీ, ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే ఉండాలన్న సందేశాన్ని చేతల్లో చూపిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తరం గొప్ప వ్యక్తి  మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం  అంటూ ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి  కొనియాడారు.  జూలై-27 సోమవారం డా.అబ్దుల్  కలాం వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో  అబ్దుల్ కలాం చిత్రపటానికి పులమాల వేసి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వరప్రసాద రావు, పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారిణి సుగుణ, కార్యదర్శి గంగూలీ, సమీర్ , ఏపీఎం సునీత తదితరులు పాల్గొన్నారు.


చేసిన వారిపై చర్య







దళిత యువకునికి శిరోముండనం చేసిన వారిపై చర్య తీసుకోండి


 


గోకవరం పెన్ పవర్


 

సీతానగరం పోలీసు స్టేషను లో దళిత యువకునికి శిరోమండం చేసి దాడి చేసి అవమానించిన సంఘటనను ఆంద్రప్రదేశ్ రైతు- కూలి సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి బి.రమేష్ తీవ్రంగా ఖండించారు.సోమవారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.దళిత,మైనారిటీ, వెనకబడిన వర్గాలపై దాడులను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విపలమవుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు మూల కారుకుడైనా ఇసుక మాఫియా స్ధానిక అధికార పార్టీ నేత కవల క్రిష్ణ మూర్తిని కేసు నుండి తప్పించే ప్రయత్నాలను ప్రజా ఉద్యమంతో ఎదుర్కొని కవల క్రిష్ణ మూర్తిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసేవరకు ప్రజా ఉద్యమం ఆగదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అలాగే చీరాలలో లాక్ డౌన్ పేరుతో దళిత యవకున్ని గాయపర్చి మృతికి కారణమైన స్ధానిక పోలీసు అధికారులపై హత్య కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి శిక్షించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు


 

 




 

 



 



 



రాజుపేటలో నూతన గ్రామ సచివాలయం


రాజుపేటలో నూతన గ్రామ సచివాలయం నిర్మాణం


 


వీ.ఆర్.పురం. పెన్ పవర్


 

వీ.ఆర్.పురం మండలం రాజుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం పనులను మండల వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ నాయకులు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్.సి.పి.మండల కన్వీనర్ గోపాల్  మాట్లాడుతూ గతప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పెరుగాచూపించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయింది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ముంపుతో సంబంధం లేకుండా ఇక్కడ నుండి నిర్వాసితులు వెళ్ళేఅంతవరకు వీరికి అన్ని సధుపాయలు కల్పించానే ఉదేశం మన నియోజకవర్గ ఎమ్.ఎల్.ఏ ధనలక్ష్మి డి.సి.సి.బీ చైర్మన్ అనంతబాబు ఇద్దరూ ముంపుమండలల్లో ఉన్న సమస్యలను మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఆయన స్పందించి వీ.ఆర్.పురం మండలం రాజుపేట కాలనిలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్ర ఆరోగ్యకేంద్రం అంచనా విలువ ఎనభై లక్షల రూపాయలతో మండల ప్రజల కొరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంపుమండలల్లో లక్షల కోట్ల రూపాయలతో సి.సి.రోడ్లు,డ్రైనేజీలు నాడు నేడు ద్వారా స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి.మండల యూత్ కన్వీనర్ చిక్కాల బాలు, రాష్ట్ర కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు, అరకు పార్లమెంట్ కార్యదర్శి బొడ్డు సత్యన్నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాచర్ల గంగులు, మామిడి రమణ,మాదిరెడ్డి సత్తిబాబు, ముత్యాల మురళి, కడుపు రమేష్, గణిత్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జైభీమ్ విద్యపౌన్ డేషన్ అవార్డు





జైభీమ్ విద్యపౌన్ డేషన్ అవార్డు


 


రాజమండ్రి రూరల్ , పెన్ పవర్


 


రాజవోలు గ్రామనికిచెందిన బూసి సువర్ణవేణి కరోనా లో చెసినటువంటి సేవలను జైభీమ్ విద్యపౌంన్ డేషన్ అవార్డు ను అందించినారు కరోనా సమయంలో ప్రజలకుచేసినటువంటి సేవ ఎంతో గొప్పది ప్రాణాలకు తేగించి చేయాడం అంటే మాటాలలో చెప్పలేనిది నాకు ఇ అవార్డు ఇచ్చిన జున్న రాజుగారికి నా ధన్యవాదములు తేలుపుతున్నాను అని సువర్ణ వేణి అన్నారు


 

 




రెండోసారి గింటి


రెండోసారి గింటి


తూర్పు గోదావరి,పెన్ పవర్ 


 

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ గ్రామం లో గ్రామ పంచాయతీ లో ట్యాంక్ వాచర్ గా పనిచేస్తున్న     టి రాజ్ అబ్బాయి గత 17 సంవత్సరముల నుండి పని చేస్తున్నాడు .రాజ్ అబ్బాయికి రావలసిన జీవితము గురించి సంబంధిత అధికారి అయిన పంచాయతీ కార్యదర్శి కలసి తనకు రావలసిన జీతం ఇవ్వడం లేదు అని ఎన్నోసార్లు అడుగగా ఆయన దాటిస్తూ ఉన్నారు. 22వ తారీఖున సచివాలయం సెక్రటరీ విజయ్ కుమార్ అడుగగా రేపు రండి సీనియర్ సెక్రటరీ రమేష్ గారు వస్తారు, ఆయనతో మీరు మాట్లాడుతారు గానీ అని అమ్మని చెప్పగా 23 వ తారీఖున  పంచాయతీ కి వెళ్లి చూడగా ఆయన ఈరోజు కూడా రమేష్  గారు రాలేదు , అక్కడ ఉన్నటువంటి  విజయ్ కుమార్ గారితో నేను  మాట్లాడుతుండగా మధ్యలో వాలంటరీగా పనిచేస్తున్న అయినటువంటి పేప కాయల గంగాధర్ అనే వ్యక్తి  మధ్య కలుగజేసుకుని నిన్ను ఉద్యోగంలోంచి ఎప్పుడో తీసేసాం  నీకు జీతాలు లేవు ఏమి లేవు నువ్వు వెళ్ళిపో అని అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషించి నా గుండెల పై చేయి వేసి  బయటకు నెట్టి వేగా నేను ఎలా బ్రతకాలి అని అడుగు తుండగా రెండోసారి గింటి వేసినారు .సార్ నేను  ఎలా బ్రతకాలి అని అడుగగా నువ్వు బ్రతికే బ్రతుకు లేకపోతే లేదు  కావాలంటే మా ఇంటి దగ్గర పురుగుల మందు ఉంది ఇస్తానురా అని రాజ్ అబ్బాయితో వాదించడం జరిగింది ఈ విషయమై ఎండిఓ గారిని కలిసి పిటిషన్  ఇవ్వడం జరిగింది .ఈ వాలంటరీ  పంచాయతీ ఆఫీసు దగ్గరకు వెళ్ళిన దళితులను చిన్నచూపు చూస్తూ అలాగే మహిళల పట్ల  అసభ్యకరంగా  ప్రవర్తిస్తూ తనకు తన దగ్గరకు ఆఫీస్ పనుల నిమిత్తం వచ్చిన  వాళ్లతో అసభ్యకరంగా మాట్లాడడం టువంటి పరిస్థితి .మేము కోరుకునేది ఒక్కటే ఇలాంటి  ఒక వాలంటరీ వలన మొత్తం వాలంటీర్ వ్యవస్థ  మరియు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా ఇలాంటి వాలంటరీ లు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని అలాగే వారిపై తగు చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులుజుట్టుక . నాగేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు .ఇటీవల కాలంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులను అరాచకా లు ఎన్నో జరుగుతున్నాయి. ఇటీవల సీతానగరం ఒక దళితుడిపై శిరోముండన మధురపూడి గ్రామంలో దళిత అయినటువంటి ఒక మైనర్ బాలికను అలాగే సుధాకర్ ఒక దళిత బాలుడు అయినటువంటి వానికి మాస్క్ లేని నెపంతో కుట్టి చంపిన ఎటువంటి పరిస్థితి ఈరోజు మా గోనేడ గ్రామంలో  దళితుడు అయినటువంటి వ్యక్తిపై దుర్భాష లతో మాట్లాడిన టువంటి  ఇలా అనేకమైన చోట్ల జరుగుచున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ మా దళితులపై ఎందుకుమీరు ఇంత వివక్షత చూపుతున్నారు మా దళితులందరూ కలిసి  వైయస్సార్ పార్టీ కి  ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే మీరు ఇచ్చే మీరిచ్చే గౌరవం దళితులకు ఇదేనా   వా పోతున్నాము. ఎప్పటికైనా  నాయకులు మాపై జరుగుతున్నటువంటి ఈ దాడులను రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా అడిగిన దాఖలాలు కనిపించకపోగా మమ్ములను నీచాతి నీచంగా చూస్తున్న పరిస్థితి . ఇలాంటి  పరిస్థితులు పునరావృతం అయితే మా దళితులంతా ఏకమై అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ  కార్యక్రమంలో ఆర్ పి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నూక పల్లి చంద్రశేఖర.్ అలాగే ఈ ఎన్ డి టి ఎస్ అధ్యక్షులు దిరిశాల పండు .చింతపల్లి చిట్టి బాబు . రాగం రాధాకృష్ణ .చినబాబు. ఏసుబాబు .గాలి శ్రీను. తదితరులు పాల్గొన్నారు.

గొప్పవ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు





గొప్పవ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు


 


.పిట్టా నాగమణి 


 


అన్నవరం , పెన్ పవర్ ప్రతినిధి


 

దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తులల్లో అబ్దుల్ కలాం ఒకరు అని ఐ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ పిట్టా నాగమణి అన్నారు ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన ఆత్యున్నత పదవిలోనూ నిరాడంబర జీవితాన్ని గడిపారు.11 వ రాష్ట్రపతి అయిన డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం పూర్తి పేరు డాక్టర్ ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. అక్టోబర్ 15,1931 న ఒక పేద ముస్లిం కుటుంబంలో  జన్మించారు.పేదవారు కావడంతో చిన్నప్పుడే చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించారు.కలాం శాఖాహరి,మద్యపాన వ్యతిరేకి,బ్రహ్మచారి,వ్యక్తిగత క్రమశిక్షణలకు ఎంతో ప్రాధాన్యతనిఇచ్చేవారు.1954 లో తమ తిరుచిరాపల్లిలో జోసెఫ్స్ కళాశాలలో భౌతికశాస్త్ర పట్టాను అందుకున్నారు.1955 లో మద్రాసులో ఏరోనా టిక్స్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. స్వయం కృషితో తరువాతి కాలంలో ఆత్యున్నత శిఖరాలు అధిరోహించారు1960 లో ఇంజనీరింగ్ డిగ్రీ పొందాక రక్షణ సంస్థ డి ఆర్ డి ఒ లో శాస్త్రవేత్తగా చేరారు.భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ తయారుచేయడం ద్వారా తన వృత్తికి శ్రీకారం చుట్టారు. ఇలా దేశనికీ ఉపయోగ పడే ఎన్నో సంస్థలలో పనిచేసారు జుాలై 18, 2002 న బ్రహ్మాండమైన అధిక్యతతో 90 శాతంపైగా ఒట్లతో11వ భారత రాష్ట్రపతిగా విజయకేతనం ఎగురవేశారు.భారత మాతముద్దుబిడ్డ, మహనీయుడు అబ్దుల్ కలాం తన 84 వ ఏట జూలై  27 ,2015 న షిల్లాంగ్ లో విద్యార్దుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయి ఆస్తమించడం ఒ విషాదం. హఠాన్మరణానికి గురయ్యారు.భారతీయుల గుండెల్లో ఆయన మిసైల్ తారే ఆయన తీపి గుర్తులను సేవలు మారువ్వలేనివని పిట్టా నాగమణి అన్నారు.


 

 




రెండవరోజున బంద్


రెండవరోజున బంద్ విజయవంతం


- కరోనా కారణంగా ముంపు మండలాల్లో ఐదు రోజులు బంద్


 


వి.ఆర్.పురం. పెన్ పవర్ 


 

తూర్పుగోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం ముంపు మండలాల్లో 26.07.2020 తారీకు నుండి ఈ నెల 30.07.2020 వరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు చింతూరు ఐ.టి.డి.ఏ. పి.ఓ. ఆకుల వెంకటరమణ ఆదేశాల మేరకు లాక్ డౌన్ అమల్లో భాగంగా వి.ఆర్.పురం మండలంలో లాక్ డౌన్ ఆంక్షలు పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు కూరగాయలు కిరాణా షాప్ లకు మాత్రమే అనుమతిచ్చారు. మెడికల్ షాప్ కు 24 గంటలు అనుమతి ఉన్నది మిగిలిన ఏ షాప్ లకు కూడా అనుమతి లేదని వి.ఆర్.పురం మండలం తహసీల్దార్ ఎన్. శ్రీధర్ ఆంక్షలు విధించారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యం గా కనిపిస్తున్నాయి. అవసరమైతే తప్ప రోడ్ మీదకి మండల ప్రజలు రావొద్దని పోలీసువారు సూచించారు. ఈ నెల 30 వరకు కఠిన ఆంక్షలు ఉంటాయని ఆయన తెలిపారు.

వినయ విధేయ పవన్







వినయ.. విధేయ.. పవన్


అందరి మన్ననలు అందుకుంటున్న హెల్త్ అసిస్టెంట్


 కరోనా విపత్కరి పరిస్థితిలో ప్రజలకు అండగా సేవలు


 పేదలకు తన వంతు ఆర్ధిక సహాయం


        


గోకవరం ,పెన్ పవర్ 


 

వినయంగా ఉండటం.. విధేయత చూపించటం అతనికున్న మంచి లక్షణం.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆపన్నులకు ఆర్ధిక సహాయం చేయటం భగవంతుడు ఇచ్చిన వరం.. వ్యాధులతో బాధపడుతున్న వారికి వెంటనే వైద్య సేవలు అందించటం, తక్షణం మెరుగైన చికిత్స కల్పించటం వృత్తి రీత్యా ఆయన అలవర్చుకున్న నైజం.. కరోనా సమయంలో అందరికి సలహాలు, సూచనలు ఇస్తూ, తమ పరంగా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఇతనిని మండల ప్రజలు, నాయకులు అధికారులు ముక్తకంఠంతో అభినందిస్తున్నారు.ఇతని సేవలు గుర్తించి అందరూ వినయ విధేయ పవన్ అని పిలుస్తున్నారు..గోకవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో హెల్త్ అసిస్టెంట్ గా పని చేస్తున్న పవన్ మంచి మనసున్న ఉద్యోగి గా పేరు తెచ్చుకున్నాడు. కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న నేపధ్యంలో ప్రజలకు సూచనలు సలహాలు ఇవ్వటం జరుగుతుంది. ఎవరికైనా కరోనా సోకితే భయపడాల్సిన పని లేదని, చికిత్స తీసుకుంటే సరిపోతుందని ఇళ్లకు వెళ్లి వారికి ధైర్యం చెపుతున్నాడు. కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళ విషయంలో వివక్షత ఎవరు చూపకూడదని,   14 రోజుల్లో తిరిగి మాములుగా తిరుగుతారని, ఎవరు బయపడాల్సిన అవసరం లేదని వివరించటం చేస్తున్నారు. తమ పీహెచ్ సి వైద్యులు, సిబ్బందితో కలిసి కరోనా విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన సదస్సులు నిర్వహించటం జరిగింది. వివిధ కారణాల తో ఎవరైనా మరణిస్తే వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో పవన్ ముందుంటాడు. రోజుకి లెక్కకు మించి ఫోన్లు వస్తున్న విసుక్కోకుండా అందరికి సలహాలు, సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధమైన సేవలతో పాటు తనకు వచ్చే జీతంలో కొంత పేదలకు సహాయం చేసే దయగుణం ఉన్న వ్యక్తి పవన్.. పేదలకు పళ్ళు, కూరగాయలు పంపిణీ చేయటం తో పాటు కొంతమంది కి ఆర్ధిక సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం గోకవరం మండలం లో కరోనా విలయతాండవం చేస్తుంది. చాలా మంది అధికారులకు, రాజకీయ నాయకులకు కరోనా సోకటం జరిగింది. ఇప్పటికి కేసులు పెరుగుతూనే ఉన్నాయి..వీరందరికి అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాడు. గోకవరం ప్రభుత్వ హాస్పిటల్ పేరు చెపితే మొదటగా వినిపించే పేరు పవన్. ఎందుకంటే అందరిలో ఒక్కడిగా కలిసిపోయాడు. ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ఇటువంటి వైద్య సిబ్బందిని ఉన్నత స్థాయి అధికారులు గుర్తించి అభినందించాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి వేరే కారణాలతో చనిపోతే పవన్ ఇచ్చిన సూచనలు, సలహాలు వల్ల అందరికి మంచి జరిగింది. కుటుంబ సభ్యులు నేరుగా ధన్యవాదాలు చెప్పారు. అందుకే ప్రజలంతా ఇతనిని వినయ విధేయ పవన్ అని పిలుస్తున్నారు..


 

 




బ్యాంకుల పని వేళలు మార్పు


 










బ్యాంకుల పని వేళలు మార్పు


 


అనకాపల్లి , పెన్ పవర్


 

కరోనా కేసులు రోజు రోజుకి కి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బ్యాంకుల పని వేళలు మార్చినట్లు ఆంధ్ర బ్యాంక్ అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ డిప్యూటీ జోనల్ సెక్రటరీ కాండ్రేగుల హరికృష్ణ తెలిపారు. టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పనిచేస్తాయన్నారు. ఆగస్టు 31 వరకు ఇవే సమయాల్లో బ్యాంకులు పనిచేస్తాయని ఖాతాదారులు గమనించాలని కోరారు. 


 

 







 



 



 



స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంచొద్దు










స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంచొద్దు


 


అనకాపల్లి , పెన్ పవర్


 
 

 ప్రభుత్వం స్థిరాస్తుల  మార్కెట్ విలువలు పెంచే  నిర్ణయం  ప్రస్తుత పరిస్థితి లో సరికాదని  బి ఎస్ పి  అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ సూదికొండ మాణిక్యాల రావు కోరారు.  అసలే కరోనా ఆందోళన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్లు చాలా మందకొడిగా సాగుతున్నవి రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదించినదనారు. ఇటువంటి పరిస్థితిలో మార్కెట్ విలువలు పెంచడం వలన రిజిస్ట్రేషన్లు మరింత తక్కువ జరుగుతాయని అంతే కాదు  మార్కెట్ విలువలు పెరుగుదలను ద్రుష్టి లో ఉంచుకోని క్రయ విక్రయ దారులు రిజిస్ట్రేషన్ లు చేయించుకునేటందుకు ఎక్కువ సంఖ్యలో రిజిస్టర్ కార్యాలయములకు రావడం జరుగుతుందన దాని వలన కరోనా వ్యాధి ప్రమాదం మరింత పెరిగే ప్రమాదం ఉందనారు.  మరియు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు తో ఉన్న ప్రజలు  ముఖ్యంగా క్రయ విక్రయ దారులు మీద భారం పెరిగే విధంగా ఉన్న మార్కెట్ విలువలు పెంపు నిర్ణయం మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.


 

 




 




 



 



 



 లాల్  సలామ్


 లాల్  సలామ్

 నేటి నుంచే మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు
మన్యాన్ని జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు

చింతపల్లి, పెన్ పవర్




జజ్జనకరి జనారే డప్పుల దరువులు... ఉత్తేజపరిచే ఎర్రదండు విప్లవ గీతాలు...  తుపాకీ నీడన అమర వీరులకు అర్పించే జోహార్లు... చైతన్యం నింపే ప్రసంగాలు... ఇవీ ఎరుపెక్కిన మన్యంలో వారం రోజులపాటు మావోయిస్టులు నిర్వహించే వారోత్సవాల విషయాలు...
ప్రతీ ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీలో పని చేసి అసువులు బాసిన వారి పేరుతో నాటి సి పి ఐ (ఎంఎల్) నేటి మావోయిజం, నక్సల్బరీ పితామహుడు         చారు మజుందార్ మృతి చెందిన తేదీని స్మరిస్తూ వారోత్సవాలు నిర్వహిస్తారు. నక్సల్బరీ చావలేదు... దానికి చావు లేదంటూ నాటి నక్సల్స్ నుంచి నేడు పేరు మార్చుకున్న మావోయిస్టుల వరకు అదే నినాదంతో పోరాటాలు చేస్తూ వస్తున్నారు. పోలీస్ వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ స్థూపాలు నిర్మించి ఎర్ర జెండాల రెపరెపల మధ్య 1972 జూలై 28 నుంచి నేటి వరకు ఆ వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహిస్తూ వస్తున్నారు. మావోయిజానికి చావు లేదనే నినాదాన్ని పాటిస్తూ ఈ సమయంలోనే కొత్తవారిని దళంలో చేర్చుకొని శిక్షణ ఇస్తారు. ఈ సమయంలోనే యాక్షన్ టీంలు రంగ ప్రవేశం చేస్తాయి. పోలీసులను పక్కదోవ పట్టించి మరీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారు.గాలింపు చర్యలు జరుగుతున్న ప్రాంతాల్లోనే మృతిచెందిన మావోయిస్టులకు స్థూపాలు (తాత్కాలికంగా) నిర్మిస్తారు. మారుమూల గ్రామాల్లో యువతను చైతన్య పరచి సమావేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. వారోత్సవాలు మరింత ఉత్సాహంగా సాగడానికి కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఏవోబీ లోని దళ సభ్యులు కూడా పాల్గొంటారు.ఈ దఫా ఏవోబీ, విశాఖ ఏజెన్సీలోని వారోత్సవాలకు కేంద్ర కమిటీ మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ రామకృష్ణ( ఆర్ కె), ఏవోబీ కార్యదర్శి చలపతి, అరుణ, ఉదయ్, జగన్ వంటి నాయకులు హాజరై ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 22 న, జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్ కె తప్పించుకోగా చలపతి, అరుణ గాయపడినట్లు తెలిసింది. వారు విడిచి వెళ్ళిన రైఫైల్,కిట్ బ్యాగులు పోలీసులు గుర్తించి, స్వాధీనపరుచుకున్నారు.25న, జరిగిన ఎదురు కాల్పుల్లో ముఖ్య మావోయిస్టు నాయకులు తప్పించుకోగా ఒక మావోయిస్టు మృతి చెందాడు.మావోయిస్టులు జరిపే ఈ వారోత్సవాల వలన వారం రోజుల పాటు గిరిజన ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.ఏజెన్సీ ప్రాంతంలోని పలువురు రాజకీయ నాయకులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు.లాల్ సలాం అంటూ సిపిఐ మావోయిస్టు జరిపే కార్యక్రమాలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ వారం, పది రోజుల పాటు భయానక వాతావరణంలో గడపవలసిందేనని ఏజెన్సీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 

 

విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం



విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం.


 


       


విశాఖపట్నం,పెన్ పవర్


 

విశాఖ నగరం లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో సోమవారంమధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది.విమానాశ్రయం సమీపంలోని షీలనగర్ సిఎస్ఎస్కంటైనర్ యార్డులో మంటలు ఎగిసిపడడంతోస్థానికులు అధికారులకు సమాచారం తెలియజేశారు.హానికర రసాయనం అల్యూమినియం ఫ్లోరిడే క్యాచ్లుద్వారా వ్యాపిస్తున్న ఎగిసిపడుతున్న మంటలనుఅగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అదుపు చేశారు. ఈ ప్రమాదం లో నాలుగు కంటైనర్ లు కాలిపోయాయి.రసాయన ‌అగ్నిప్రమాదంపై నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్జి పాలిమర్స్ సాయినర్  ఎట్రొడ్రగ్స్ ఇప్పుడు అల్యూమినా అంగ్ని ప్రమాదాలు ప్రజలను ఆందోళన కు గురిచేస్తుంది.

కరోనా పరీక్ష కేంద్రాలు


ఏజెన్సీ 11 మండలాల్లో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 


 


సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నయ్య పడాల్.


 


 చింతపల్లి , పెన్ పవర్


 

విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులలో కరోనా వైరస్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. సోమవారం వామపక్ష రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు సీపీఐ, సిపిఎం నాయకులతో చింతపల్లి గ్రామ సచవాలయం ఎదురుగా ప్లే కార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయలేకపోవడంతో గత్యంతరం లేని ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం (లాక్ డౌన్) పాటించవలసిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేయడం ఎంతవరకు సమంజసమని ఆయన మండిపడ్డారు. ఐసోలేషన్ కేంద్రాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వెంటనే ఫలితాలు వెల్లడించాలన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు,పట్టణాల్లో మునిసిపాలిటీ, పారిశుద్ధ్య కార్మికులకు పీ పీ కిట్లు, శానిటైజర్ లు రక్షణతో కూడిన భద్రత పరికరాలు ప్రభుత్వాలు వెంటనే అందించాలన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు ఆహారంతో పాటు నిత్యావసర సరుకులు, కుటుంబానికి నెలకు రూ. 7,500 లు, 6 నెలల పాటు అందించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల  నాయకులు ఎస్ కె రహీమాన్, (బుజ్జి ) మాజీ వైస్ సర్పంచ్ గింజారి రమణ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్, మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

దళ సభ్యుల ప్రాణాలు బలి





అభివృద్ధి నిరోధకులు మావోయిస్టు లు


 


అగ్ర నాయకుల ప్రాణాలకు దళ సభ్యుల ప్రాణాలు బలి


 


ఏ ఎస్ పి  విద్యాసాగర్  నాయుడు


 


చింతపల్లి, పెన్ పవర్


 

జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నవరం పోలీస్ పరిధి       ఏ ఓ బి లోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించగా  తారసపడిన మావోయిస్టులు ముందుగా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఒక మావోయిస్టు  మృతిచెందాడని  చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఏ ఎస్ పి విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ కోరుకొండ,పెదబయలు దళ సభ్యులు,మిలీషియా సభ్యులతో మావోయిస్టు అగ్ర నేతలు  ఏవోబీ లోని దిగజనబ అటవీ ప్రాంతంలోని పెద్ద వాగు వద్ద సమావేశం అవుతున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఒడిస్సా ప్రత్యేక పోలీస్, జిల్లా ప్రత్యేక పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ప్రారంభించారన్నారు.  దిగజనబ ప్రాంతంలో కుంబింగ్ నిర్వహిస్తున్న  పోలీసులపై మావోయిస్టులు  కాల్పులు ప్రారంభించారన్నారు.ఆత్మ రక్షణార్థం పోలీసులు నిర్వహించిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా కొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారన్నారు.చీకటి పడడంతో 26 ఉదయం మృతదేహం లభ్యమయ్యిందన్నారు. మృతిచెందిన మావోయిస్టు జి.మాడుగుల మండలం, వాకపల్లి గ్రామానికి చెందిన పాంగి దయ అలియాస్ పేతురు గా గుర్తించామన్నారు. ఐదేళ్ల నుంచి దళంలో తిరుగుతున్నాడన్నారు. మృతిచెందిన మావోయిస్టు సోదరుడు(అన్న) కూడా గతంలో రామ్ గూడ లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడన్నారు. మరి వారి కుటుంబ సభ్యులకు దిక్కెవరని ఆయన ప్రశ్నించారు. పోలీసులకు మావోయిస్టులకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఎప్పుడూ అమాయకులైన దళ సభ్యులే మృతి చెందుతున్నారన్నారు. అగ్ర నేతలు అమాయకులైన వీరిని అడ్డం పెట్టుకుని,వారి ప్రాణాలు కాపాడుకుంటూ తప్పించుకుంటున్నారన్నారు. మావోయిస్టులు వారోత్సవాల పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటూ, గిరిజన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.గిరిజనులకు రహదారులు, పాఠశాలలు,సెల్ టవర్లు, భవనాలు అడ్డుకుంటూ అభివృద్ధికి అవరోధకులుగా మిగిలారన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిరంతరం కూంబింగ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు. మావోయిస్టులు, మిలీషియా సభ్యులు హింసను విడనాడి, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవమని ఆయన హితవు పలికారు. అటువంటి వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు వచ్చేలా పోలీసు శాఖ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.


 

 




 మూడువేల లీటర్ల సారా


 మూడువేల లీటర్ల సారా పులుపు ద్వంసం


  పాయకరావుపేట,పెన్ పవర్ 


 

 మండల గోపాలపట్నం శివారు కొండల్లో సారా తయారు కేంద్రాలపై పోలీసులు దాడి చేసి తయారి సామాగ్రిని ద్వంసంచేసారు.సారా దాడులపై ఎసై .విభీషణరావు తెలిపిన వివరాల ప్రకారం నక్కపల్లి మండలం గునిపూడి,స్తానిక మండల గోపాలపట్నంను ఆనుకోనివున్న సరిహద్దు కొండ ప్రాంతంలో సారా తయారి కేంద్రాలను గుర్తించినట్లు గ్రామ వాలంటరిలు,గ్రామ మహిళా పోలీసు ఇచ్చిన సమాచారం మేరకు స్టేషన్ సిబ్బందితో దాడులు నిర్వహించాము.కార్బైల్లో నిల్వవుంచిన  మూడువేల లీటర్ల సారా పులుపును తయారీకి ఉపయోగించే సామగ్రి,అమ్మోనియా,నల్లబెల్లంను ద్వంసం చేసామని తెలిపారు.అదేవిదంగా ప్రతీ పౌరుడు బాద్యతతో మండలంలో అక్రమంగా జరిగే సారా తయారికేంద్ర ప్రదేశాలను గుర్తించి సమాచారం అందిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో గోపాలపట్నం గ్రామ వాలంటరీలు,గ్రామ మహిళా పోలీసు,సిబ్బంది పాల్గొన్నారు. 

 

 

హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ


కరోనా పై పరవాడ జనసైనికుల పోరాటం.
స్వయంగా వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ.


           


 పరవాడ, పెన్ పవర్



పరవాడ : కరోనా పై పోరాటానికి  పరవాడ జనసైనికులు నడుం బిగించారు. స్వయంగా జనసైనికులు భుజాలకు హైపో క్లోరైడ్ ద్రావణ డబ్బాలను తగిలించుకొని గ్రామ పురవీధుల్లో ఆదివారం ఉదయం పిచికారి చేసి గ్రామస్తులు చేత శభాష్ అనిపించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ మాత్రం భయపడకుండా గ్రామ పురవీధుల్లో క్రిమిసంహారక మందును స్వయంగా స్ప్రే చేయడంపై పలువురు జనసైనికుల పై ప్రశంసల  కురిపిస్తున్నారు. పరవాడ గ్రామంలో జనసైనికులు శెట్టి బలిజ, రజక వీధి, సిరిపురపు వారి వీధి, చుక్క వారి వీధి, శివాలయం రోడ్డు చేలల్లో ఇళ్లలు, ముస్లిం వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ పిచికారి చేసారు. ఈ కార్యక్రమంలో చుక్కా నాగు, కరెడ్ల అభిరామ్, వడిసెల రాము సన్నాఫ్ బంగారు బాబు, మెకానిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

ఫార్మా నిర్వాసిత గ్రామాల్ని తరలించండి


ఫార్మా నిర్వాసిత గ్రామాల్ని తరలించండి


 పెందుర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బొద్ధపు వెంకటరమణ


         


   పరవాడ పెన్ పవర్


 

పరవాడ:జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ(రామ్ కీ ఫార్మాసిటీ) లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్న కారణంగా ప్రజలు బయ బ్రాoతులతో జీవిస్తున్నారు అని అందుకు ఫార్మాసిటీ చుట్టు ప్రక్కల గ్రామాలను తరలించండి లేదా వారికి హాని కలగ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని పెందుర్తి బీజేపీ కన్వీనర్ బొద్ధపు వెంకట రమణ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కి స్పoదన కార్యక్రమంలో ఎమ్యెల్సి మాధవ్ కి వినతిపత్రం అందజేశారు.అనంతరం వేoకటరమణ మాట్లాడుతూ ఫార్మాసిటీ దగ్గరలో అనేక గ్రామాలు ఉన్నాయి అని ఫార్మా పొల్యూషన్ వలన ఈ గ్రామాల్లోని ప్రజలు అనేక రుగ్మతలకు లోనవుతున్నారు అని అన్నారు.గుండె,ఊపిరితిత్తుల వ్యాధులు,కిడ్నీ సమస్యల తో భాధపడటమే కాకుండా కొందరు మృతి చెంది కూడా ఉన్నారు అని తెలిపారు.ఇప్పటికే విశాఖ జిల్లా పలు ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్,ఎన్టీపీసీ,ఫార్మాసిటీ,బ్రాన్డిక్స్,లాంటి కంపెనీల కాలుష్యం వలన ఆ చుట్టుప్రక్కల నివసిస్తున్న అనేక మంది మహిళలు,చంటి పిల్లలు అవస్థలు పడుతున్నారు అని అన్నారు.ఇదే కాకుండా అనేక రకాలు అయిన ఫార్మా విష రసాయనాలు,వ్యర్ధాలు సముద్రంలోకి వదిలివేయడం వలన సముద్రం లోని మత్యు సంపద పూర్తిగా నాశనం అయి మాత్యుకారుల మనుగడకే ప్రమాద ఏర్పడింది అని అన్నారు.ఇటు ఫార్మా,ఎన్టీపీసీ లాంటి వాటి వాయు కాలుష్యం వలన ఈ ప్రాతంలో వర్ష ప్రభావం తగ్గిపోవడం వలన ఈ ప్రాంతాల్లో వ్యవసాయమే జీవన ఆధారంగా బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలు వ్యవసాయం లేక రోడ్డున పడ్డారు అని అన్నారు.ఈ ప్రస్థితుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించ లేదు అని తమరు అయినా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి తో మాట్లాడి ఈ చుట్టు ప్రక్కల గ్రామాల్లోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి అని కలెక్టర్ వినయ్ చంద్ ని కోరుతూ వినతిపత్రం ఇచ్చాము అని వెంకటరమణ తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా సీ ఆర్పీ ఎప్ ఆవిర్బావ దినోత్సవం





ఘనంగా సీ ఆర్పీ ఎప్ ఆవిర్బావ దినోత్సవం.

     

విశాఖపట్నం, పెన్ పవర్

 

 

విశాఖలో  సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది.మదురవడా సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయంలో అధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు.సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తూ అత్యు న్నత స్థాయిలో సీఆర్పీఎఫ్ పాలమిలాటరీ ఫోర్స్ తరహాలో సేవలను అందిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ సీఆర్పీఎఫ్ .. విపత్కర పరిస్థితుల్లో, రక్షణ పరంగా అండగా నిలుస్తూ భద్రతను కల్పిస్తుంది.82వ ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన అధికారులకు సీఆర్పీఎఫ్ అధికారులు ఘన నివాళి అర్పించారు.

 

 




జిల్లాలో బ్యాంకులు1గంట వరకే




జిల్లాలో బ్యాంకులు1గంట వరకే పనిచేస్తాయ్..
     


జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్
   


  విశాఖపట్నం, పెన్ పవర్


 

జిల్లాలోని బ్యాంకులు  మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పనిచేస్తాయని  జిల్లా కలెక్టర్  వి వినయ్ చంద్  అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఉదృతం అవుతున్న సందర్భంగా బ్యాంకు ల  పని వేళలను తగ్గించడం జరిగిందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేస్తా అన్నారు.  పైలట్ ప్రభుత్వ రంగ బ్యాంకులు  పని వేళలు మార్పు చేయాలని బ్యాంక్ యూనియన్ లో కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.  మంగళ వారం నుంచి  బ్యాంకుల పనివేళలో మారుతున్నాయని తెలిపారు. కోవిడ్ 19 నిబంధనలు తప్పక పాటించాలని బ్యాంకర్లను కోరడం జరిగిందన్నారు. బ్యాంకుల పనివేళల్లో తగ్గించడం వల్ల ఖాతాదారుల  రద్దీ తగ్గుతుందని  వినయ్ చంద్ తెలిపారు.

 

 




మావోయిస్టులు మృతి



ఏవోబీలో పోలీసులు మావోల మధ్య ఎదురుకాల్పులు.
మావోయిస్టులు మృతి. మృతుడు జి.మాడుగుల వాసి.
మల్కన్ గిరి జిల్లా గుజ్జేడు  అటవీ ప్రాంతంలో కాల్పులు.

            


విశాఖపట్నం, పెన్ పవర్



  ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో  పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి చేరుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎదురు కాల్పులు జరిగిన సంఘటనలో  మావోలు  విడిచిన 3 కిట్ బ్యాగులు 303 రైఫిల్  మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 28నించి ఆగస్టు3 వరకు  అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయి. మావోల ప్లీనరీ చెదించడానికి విశాఖ గ్రేహౌండ్స్ ఒడిశా ఎస్ వో జి  బలగాలు శనివారం సాయంత్రం  మల్కనగిరి జిల్లా గుజ్జేరు  అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా  మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులు తలెత్తాయి. మావోయిస్టులు పోలీసు బలగాల మధ్య భీకర  తుపాకీల పోరు జరిగింది. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. రాత్రి కావడంతో మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టు జి. మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన దయాగా  పోలీసులు గుర్తించారు. 2016 లో జరిగిన రామ్ గూడా ఎన్కౌంటర్లో మృతి చెందిన పాంగి దోసో సోదరుడు దయా. అక్క మృతిచెందడంతో మావోయిస్టుల్లో చేరాడు. ఈ పది రోజుల్లో  ఏవోబీ పరిధిలో నాలుగు  దఫాలు ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈస్ట్ డివిజన్  కార్యదర్శి అరుణ చల పతి  అగ్రనేత ఆర్ కె తప్పించుకున్న విషయం తెలిసిందే. రెండు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి  చెందారు. పోలీసులు మావోయిస్టు వ్యూహ ప్రతి వ్యూహాలతో  ఎదురు కాల్పులకు తెగబడుతున్నారు.


 

విస్తృతంగా టెస్ట్ లు







కరోనా నివారణకు విస్తృతంగా టెస్ట్ లు నిర్వహించాలి


సీపీఎం మండల కన్వీనర్ పి.మాణిక్యం


         


  పరవాడ ,పెన్ పవర్


 

పరవాడ:మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి వలన ప్రజలు భయ బ్రాoతులు చెందుతున్నారు అని కరోనా ని నివారించేందుకు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విస్తృతంగా టెస్ట్ లు నిర్వహించాలి అని మండల సిపిఎం కన్వీనర్ పి.మాణిక్యం తహశీల్దార్ గంగాధర్ కి వినతిపత్రం అందించారు.అనంతరం మాణిక్యం మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా లో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని తగిన్నన్ని కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రపంచంలో కరోనా కేసుల లెక్కల్లో భారత దేశం 2వ స్థానానికి రావడం భారత దేశంలో ఆంద్రప్రదేశ్ 4 వ స్థానంలోకి రావడం ఎంతో ఆందోళన కలిగిస్తోంది అని ఆవిడ అన్నారు.దేశంలో ఈ విధంగా కరోనా కేసులు పెరగటం ప్రభుత్వాల వైఫల్యాలను సూచిస్తోంది అని అన్నారు.కేరళ తరహాలో కరోనా నివారణకు నిధులు కేటాయించి ప్రజలు రోడ్లపైకి రాకుండా వారి ఇళ్లకే నిత్యావసరాలు సరఫరా చేయాలని సూచించారు.కరోనా నివారణకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి కావలిసిన మాస్కలు, పి.పి కిట్లు లాంటి వి నిరంతరాయంగా సరఫరా చేయాలి అని.కరోనా నివారణకు పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులకు 50 లక్షల వ్యక్తిగత భీమా కల్పించాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకుడు ఏ.రామస్వామి,సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ,సిపిఎం పి.చిన్నా పాల్గొన్నారు.


 

 




 

 



 



 



ఫ్లైఓవర్  పై వాహనాలు రాకపోకలు






 నేటి నుంచి ఎయిర్ పోర్ట్ విశాఖ సిటీల మధ్య 


ఫ్లైఓవర్  పై వాహనాలు రాకపోకలు


మంత్రి బొత్స



     


విశాఖపట్నం, పెన్ పవర్



ఎయిర్ పోర్ట్ విశాఖ సిటీ మధ్య  ఫ్లై ఓవర్ పై  మంగళ వారం నుంచి  వాహనాల రాకపోకలకు అనుమతి  ఇచ్చామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం  ఆయనతోపాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్   విశాఖ ఎంపీ సత్యనారాయణలు  ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. నిర్మాణం దాదాపు పూర్తి కావడంతో అధికారులకు తగిన సూచనలు చేశారు. విశాఖ సిటీ నుంచి  ఎయిర్  పోర్టుకు వెళ్లే మార్గంమధ్యలో ఫ్లైఓవర్ పైనుంచి వాహనాలు నడుపు కోవచ్చని ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు  ఆదేశించారు. మర్రిపాలం నుంచి గోపాలపట్నం మధ్యలో ఫ్లైఓవర్ ను  ఆగస్టు 15 నా ప్రారంభిస్తామన్నారు. పనులు కొద్దిగా మిగిలి ఉండడంతో వాటిని పూర్తి చేసి  ఆరోజున దానాలు రాకపోకలు అనుమతిస్తున్నారు. ఎంతో కాలంగా విశాఖ వాసులను వెంటాడుతున్న ట్రాఫిక్ జామ్ సమస్య నేటితో తీరిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  నగరంలో అతిపెద్ద ట్రాఫిక్ సమస్య  ఎన్ఏడి కొత్త రోడ్ వద్దనే అని  అది నేటితో తీరిపోతుందని  బొత్స సత్యనారాయణ తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరం  అయినా చోట్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి లను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. మంత్రులతోపాటు అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.




 



 



 



గుట్టు రట్టు


సృష్టి ఆసుపత్రి కేంద్రంగా వెలుగుచూసిన పసిపిల విక్రయ రాకెట్
గుట్టు రట్టు చేసిన నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా.
ఆస్పత్రి ఎం డి తో  ఎనిమిది  మంది అరెస్ట్.
  పిల్లల సేకరణలో ఆశా కార్యకర్తల  పాత్ర కీలకం.

     


విశాఖపట్నం ,పెన్ పవర్



విశాఖ నగరంలో  సృష్టి ఆస్పత్రి కేంద్రంగా జరుగుతున్న పసిపిల్లల విక్రయ రాకెట్‌ను  పోలీసులు  ఎట్టకేలకు చేధించారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా ఆదివారం విలేకరుల సమావేశంలో సృష్టి హాస్పత్రి లో పసిపిల్లల  అమ్మకాల గుట్టు రట్టు చేశారు.  ప్రధాన ముద్దాయిగా సృష్టి ఆస్పత్రి ఎండి పచ్చిపాల నమ్రత ఇద్దరు ఆశా వర్కర్ లు (ఏ 2ఏ 3) కోడి వెంకటలక్ష్మి బొట్టు అన్నపూర్ణ ఏ4గా ఏజెంట్ ఆర్ డి రామకృష్ణ ఏ 5  డాక్టర్ తిరుమల ఏ6 లోపింటి చం గూగుల్ద్రమోహన్ ఏ7ఏ 8  లుగా పిల్లాడ్ని కొనుగోలు చేసిన పశ్చిమ బెంగాల్ కి చెందిన ఇద్దరు వ్యక్తులను  అరెస్టు చేశామని సి పి ఆర్కె మీనా వివరించారు.వైల్డ్ లైవ్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర పోలీస్ కమిషనర్   చాకచక్యంగా వ్యవహరించి పసిపిల్లల విక్రయ రాకెట్ను చేధించారు. వివరాల్లోకి వెళితే  మాడుగుల మండల కేంద్రం కనికర మాత కాలనీకి చెందిన ఒక వీడో  అవాంఛిత గర్భం ధరించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఆశ కార్యకర్త బొట్ట అన్నపూర్ణ  చీడికాడ మండలం అర్జునగిరి  ఆశ కార్యకర్త కోడి వెంకటలక్ష్మికి  తెలిపింది. గర్భవతిని ఏజెంట్  రామకృష్ణ ద్వారా సృష్టి ఆస్పత్రి  తీసుకువెళ్లారు. ఉచితంగా డెలివరీ చేయడం బిడ్డకు కొంత డబ్బు ఇస్తామని చెప్పడంతో ఆమె అంగీకరించింది. వైద్యుల సూచన మేరకు  గర్భిణీ ని ఆశా  వెంకటలక్ష్మి డెలివరీ వరకు తన వద్ద ఉంచుకొని సాకంది.సుందరమ్మకు  మగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్ కు చెందిన వారికి  అమ్మేసారు. అంగన్వాడీ  కేంద్రానికి వెళ్లిన సుందరము కార్యకర్త ఆరా తీసింది. ఈ విషయం ఉన్నత అధికారులకు తెలియజేయడంతో డొంక కదిలింది.చైల్డ్ లైవ్  సంస్థ పోలీసులకు తెలియజేయడంతో విచారణ మొదలైంది. విశాఖ జిల్లా పరిషత్ పరిధిలో యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి  ఎండి పచ్చిపాల నమ్రత విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఒడిశా ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తు అక్కడి ఆశా వర్కర్ లను ఆకర్షిస్తుంటారు.ఆ ప్రాంతాల్లో  పేద గర్భిణీలు అవాంఛిత  గర్భిణీలు  టార్గెట్ చేస్తున్నారు.  ఆ శాల ఆధ్వర్యంలో  వారికి డబ్బు ఎర చూపుతున్నారు. ఆశాలు దళారీల ఒత్తిడితో పసిపిల్లల సేకరణ పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.


ఘన స్వాగతం పలికిన సిబ్బంది





అనారోగ్యం నుండి కోలుకుని విధులకు హాజరవుతున్న


ఎస్సై శ్రీనివాసరావు కి ఘన స్వాగతం పలికిన సిబ్బంది గ్రామస్థులు


     


   మునగపాక పెన్ పవర్


 

మునగపాక:కరోనా వైరస్ వ్యాప్తి నివరణా చర్యల్లో భాగంగా ప్రజలను కరోనా నుండి కాపాడటానికి అహర్నిశలు పగలు ఆనక,రాత్రి అనక విధినిర్వహణలు నిర్వహిస్తూ కుటుంబానికి సైతం దూరంగా ఉన్న మునగపాక ఎస్సై డి.శ్రీనివాసరావు అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం బారినపడి కోలుకుని తిరిగి విధినిర్వహణలకు హాజరు అవుతున్న ఎస్సై డి.శ్రీనివాసరావు కు స్టేషన్ స్టాఫ్ మరియు గ్రామస్థులు పూల మాలవేసి ఘన స్వాగతం పలికారు.


 

 




రు"3.26లక్షల ఆర్థిక సహాయం







ఉద్దేశ్ వైద్యానికి భరణికం హెల్పింగ్ హాండ్స్ బృందం అందించిన ఆర్ధిక సహాయం 


రు"3.26లక్షల ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేత.


         


 పరవాడ పెన్ పవర్


 

పరవాడ :  తమ ఊరికి చెందిన బాలుడు లుకేమియా బ్లడ్ క్యాన్సర్ తో ప్రాణాలతో పోరాడుతున్నాడని తెలుసుకున్న భరణికం హెల్పింగ్ హాండ్స్ బృంద సభ్యులు చలించిపోయారు. తమ కళ్ళముందే ఆడుతూపాడుతూ తిరుగుతూ చలాకీగా కనిపించే ఉద్దేశ్ కి ఎంత కష్టం వచ్చింది అని వాపోయారు. ఇంత చిన్న వయసులోనే లుకేమియా తో తమిళనాడు సి.ఎం.సి. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడని తెలుసుకొని  కన్నీటిపర్యంతమయ్యారు. బాలుడి వైద్యానికి భారీగా ఖర్చు అవుతుందని, ఆ ఖర్చును బాలుడు తల్లిదండ్రులు భరించలేరని తెలుసుకున్న భరినికం హెల్పింగ్ హాండ్స్ బృందం సభ్యులు, గ్రామస్థులతో కలిసి  చేయి చేయి కలిపారు. దీనికి వైసీపీ మండల యూత్ అధ్యక్షులు పెదశెట్టి శేఖర్ ఆధ్వర్యంలో నడుంబిగించారు. బాలుడు వైద్యానికి అవసరమైన నిధులను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారి ప్రయత్నాలకు గ్రామస్తులు పూర్తిగా సహకరించడంతో రు"మూడు లక్షల ఇరవై ఆరు వేలు రూపాయలు సమకూరాయి. ఈ నగదును సోమవారం ఉదయం బాలుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ ఊరు కి చెందిన నాలుగేళ్ల బాలుడికి కష్టం వస్తే గ్రామస్తులు స్పందించిన తీరు చూసి చుట్టు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బాలుడు త్వరగా కోలుకొని చిరునవ్వుతో తమ గ్రామానికి తిరిగి రావాలని గ్రామస్తులు యువత ఆకాంక్ష వ్యక్తం చేశారు. తమ కుమారుడు వైద్యం కోసం ఇంతగా సహాయం చేస్తున్న భరణికం హెల్పింగ్ హాండ్స్ బృంద సభ్యులకు, గ్రామస్తులకు ఎంతగానో రుణపడి ఉంటామని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని బాలుడు తల్లితండ్రులు జర్నలిస్టు బొండా నాని దంపతులు  కన్నీటి పర్యంతంతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ బొండా తాతారావు, గ్రామ పెద్దలు గణేష్ రాజు, సూర్యనారాయణ మాస్టర్, పిల్లి అప్పారావు, భరణికం హెల్పింగ్ హాండ్స్ సభ్యులు రవికుమార్,భరత్ కుమార్ ,రమేష్ కుమార్,మహేష్ కుమార్,జయప్రకాష్,నాయుడు,శరణ్య,పూజ, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.


 

 




 



 



 



ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు లో ఎదురుకాల్పులు



ంధ్రా ఒడిస్సా సరిహద్దు లో ఎదురుకాల్పులు

మావోయిస్టు మృతి

చింతపల్లి , పెన్ పవర్

ఆంధ్రా ఒడిస్సా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీసు బలగాలకు, మావోయిస్టులకు శనివారం సాయంత్రం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఒడిస్సా రాష్ట్రం, మల్కన్ గిరి జిల్లా, చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధి, విశాఖ జిల్లా, జి.మాడుగుల మండలం,గజ్జెడు అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల సంఘటనలో జి.మాడుగుల మండలం, వాకపల్లి గ్రామానికి చెందిన పాంగి పేతురు అలియాస్ దయ (23) మృతిచెందాడు. ఈ ఎదురుకాల్పుల సంఘటనలో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్ కె), ఉదయ్, అరుణ, జగన్ లు తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన మావోయిస్టు పేతురు అలియాస్ దయ  రామ్ గూడ లో పోలీసులకు మావోయిస్టులకు 2016 లో జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలో మృతి చెందిన మావోయిస్టు దొసో తమ్ముడు ఈ దయ. అన్న చనిపోవడంతో తమ్ముడు ఉద్యమంలో చేరాడు. సంఘటనా స్థలంలో పోలీసులు 303 తుపాకీ, 3 కిట్ బ్యాగులు,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు మృతదేహాన్ని బలపం, కోరుకొండ అటవీ ప్రాంతం మీదుగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తప్పించుకున్న మావోయిస్టు నేతల కోసం పోలీసులు  మన్యాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో ఏ ఓ బి లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


 

                                                                                             

ఏవోబీ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు


ఏవోబీ సరిహద్దుల్లో  ఎదురుకాల్పులు 



కాల్పల ఘటనలో మావోయిస్టు మృతి


 


సీలేరు, పెన్ పవర్


మృతిచెందిన మావోయిస్టు పాంగి దయగా గుర్తింపు   జి.మాడుగుల మండలం వాకపల్లికి చెందిన పాంగి దయ గత ఆరేళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న పాంగి దయ శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఎదురుకాల్పులు సుమారు 4 గంటలపాటు కొనసాగిన ఎదురుకాల్పులు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు గుజ్జేడు ప్రాంతంలో ఘటన మావోయిస్టు అగ్రనేతలు ఉండడంతో హోరాహోరీగా కాల్పులు ఘటనాస్థలంలో మందుపాతరలు నిర్వీర్యం చేసిన పోలీసులు 303 తుపాకి, పిస్తోల్‌, 3 కిట్ బ్యాగ్‌లు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు.



కరోనా కట్టడిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది

కరోనా కట్టడిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది


సామర్లకోట, పెన్ పవర్


కరోనా ఉధృతి దేశంలో చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లోను,రాష్ట్రంలో చూస్తే తూర్పుగోదావరి జిల్లాలోను అధికమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దీనిని కట్టడి చేసే విషయంలో ఎంతో నిర్లక్ష్యన్ని కనపరుస్తుంది అని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి తదితరులు అన్నారు.స్థానిక తెదేపా కార్యలయంలో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ తీరును విమర్శించారు. వారు మాట్లాడుతూ పాజిటివ్ కేసులో  ఎంతో ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న పరీక్షలు చేయించుకునే వారికి సరిపడా కిట్లు అందించకుండా,ప్రజలకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టకుండా,కారంటెయిన్లో ఉన్న రోగులకు పోషకాహారం,మందులు పూర్తిస్థాయిలో అందించకుండా చాలా తేలికగా తీసుకుంటుంది అన్నారు.ఒక ప్రక్క ప్రాణనష్టం విపరీతమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.క్వారంటైన్ లో ఉన్న రోగులకోసం రోజుకు 5 వందలు ప్రభుత్వం కేటాయించిన వారికి సరైన మెనును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలి పెడుతున్నట్టు స్వయంగా ఆ రోగులు ఫోన్ లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.బ్రాందీ షాపులను తెరచి కరోనా ఉధృతి కి ప్రభుత్వం కారణమైంది అన్నారు.షాపులు వద్ద భౌతిక దూరం పాటించకుండా ఉండటం తో కేసులు పెరిగిపోతున్నాయి అన్నారు.తక్షణం వ్యాధి ఉధృతి తాగేంతవరకు బ్రాందీ షాపులను మూసివేసి పరీక్ష కిట్టులు తగినన్ని అందించడంతో పాటు క్వారంన్ టైన్ రోగులు తగిన సదుపాయాలను కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఇంకా పార్టీ కార్యదర్శి బడుగు శ్రీకాంత్,నాయకులు అందుగుల జార్జి చక్రవర్తి, కంటే జగదీష్, వాసు తదితరులు పాల్గొన్నారు.


శిరోముండన కేసులో దోషులను వెంటనే అరెస్టు చెయ్యాలి

శిరోముండన కేసులో దోషులను వెంటనే అరెస్టు చెయ్యాలి


సామర్లకోట ,పెన్ పవర్


సీతానగరంలో దళితునిపై జరిగిన శిరోముండనం కేసులో దోషులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పట్టణ తెదేపా దళిత నాయకులు మాజీ కౌన్సీలర్ అందుగుల జార్జి చక్రవర్తి డిమాండ్ చేశారు.తెదేపా కార్యలయం లో  ఆయన మాట్లాడుతూ ఎస్సి,ఎస్టీల పట్ల వైఎస్సార్ ప్రభుత్వం ఎంతో చులకన భావంతో ఉందన్నారు.వైసిపి నాయకులు ఏమి చెబితే వాటిని పోలీసులు చేస్తున్నారు అన్నారు.దానికి నిదర్శనమే ఈ శిరోముండన ఘటనగా ఆయన విమర్శించారు. బాధ్యత గల ఉన్న ఎస్ఐ ,ఒక కానిస్టేబులు కలసి ఇంతటి దారుణానికి పాల్పడటం వెనక ఆ గ్రామానికి చెందిన వైసిపి నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వెంటనే వారిని పురిగొల్పిన వైసిపి నాయకులును అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును నమోదు చేయాలన్నారు.అలాగే సామర్లకోట పట్టణంలో ఒకే గృహంలో కరోనాతో తల్లి,కుమారులు మృతిచెందగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో గాని, ఆ ప్రాంతంలో తక్షణ భద్రతా చర్యలు చేపట్టే విషయంలో గాని అధికారులు ఎంతో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్టు ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని లేదంటే వైసిపి ప్రభుత్వానికి చివరి రోజులు వచ్చినట్టుగా తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా  చక్రవర్తి వెంట తెదేపా నాయకులు అడబాల కుమారస్వామి,బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్, వాసు పాల్గొన్నారు.


మెంటాడ లో కరోనా టెన్షన్


మెంటాడ లో కరోనా టెన్షన్


 


 


 మెంటాడ, పెన్ పవర్


 

మండల కేంద్రం లోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం కరోనా పరీక్షలు నిర్వహించారు. గత రెండు రోజుల క్రితం మెంటాడ ఏవో మల్లికార్జున రావు కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారు లో టెన్షన్ మొదలైంది. దీనితో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఎంపీడీవో,  వెలుగు,  తాసిల్దార్ కార్యాలయాల్లో విధులు 30 మందికి  నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందులో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ,  రెవెన్యూ,  వెలుగు,  ఉపాధి,  గృహ నిర్మాణ శాఖ,  గ్రామ వాలంటీర్లకు,  సచివాలయాల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.  జిల్లా కలెక్టర్,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్పందించి పరీక్షలు నిర్వహించాలని అధికారులు కోరుతున్నారు.

ప్రెస్ క్లబ్ సహకారంతో జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ





ప్రెస్ క్లబ్ సహకారంతో జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ


         


 పరవాడ పెన్ పవర్


 

పరవాడ; కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీయూడబ్ల్యూజే పరవాడ ప్రెస్ క్లబ్ కు చెందిన జర్నలిస్టులకు స్థానిక యూనియన్ సహకారంతో శుక్రవారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 10 కిలోల నాణ్యమైన బియ్యం, కిలో బెల్లం, కిలో గోధుమరవ్వ, కిలో గోధుమపిండి, కిలో ఇడ్లీ రవ్వ, కిలో ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్, అరకిలో మినప్పప్పు, అర కిలో పెసరపప్పు, రెండు మైసూర్ శాండల్ సబ్బులు చొప్పున ప్రెస్ క్లబ్  గౌరవా ఆధ్యక్షులు  పయిల సన్యాసిరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ కమిటీ సభ్యులు రవి అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల వారికి కృతజ్ఞతలు తెలిపారు.


 

 




భాజపా ఆధ్వర్యంలో వైద్యులకు పిపిఈ కిట్లు










భాజపా ఆధ్వర్యంలో వైద్యులకు పిపిఈ కిట్లు


 


అనకాపల్లి , పెన్ పవర్


 

 భారతీయ జనతాపార్టీ  ఆధ్వర్యంలో వైద్యులకు పీపీఈ కిట్లు శుక్రవారం అందజేశారు. జిల్లా అధ్యక్షులుు డాక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో నాయకులు వైద్యులుకు అందజేశారు. ఎన్టీఆర్  ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ కి ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా కట్టడి  విషయంలో రోగులకు వైద్యం అందించడం లో వైద్యుల త్యాగం మరువలేనిదన్నారు. వైరస్ ప్రబలే అవకాశంం లేకుండా పి పి ఈ కిట్లు   లేక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. దీంతో పార్టీ ఆదేశాల మేరకు తాము వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణగా వీటిని అందజేశామన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు , మాజీ ఎంపిటిసి చదరం నాగేశ్వరరావు , దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు కొండబాబు మాస్టారు,  అనకాపల్లి టౌన్ ప్రధాన కార్యదర్శి కర్రి రామకృష్ణ  , అనకాపల్లి మండల  అధ్యక్షులు  కసిరెడ్డి  శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

 

 




 




 

 



 



 



లాక్ డౌన్ ప్రకటిస్తే బాగుంటుంది





లాక్ డౌన్ ప్రకటిస్తే బాగుంటుంది   కోప్పల రామ్ కుమార్


 


పూర్ణ మార్కెట్, పెన్ పవర్


 

 

కరోనా విలయతాండవం  రోజు రోజుకీ విజరంభిస్తున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్  ప్రకటించే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని దక్షిణ నియోజక వర్గం బి.జె.పి.  కన్వీనర్ కొప్పల రామ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవుతుండడం వలన లాక్ డౌన్ ప్రకటిస్తే కేసులను కొంత  వరకు కంట్రోల్ చేయవచ్చన్నారు. దక్షిణ నియోజకవర్గంలో  గల పూర్ణా మార్కెట్లోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఊదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కలాపాలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం ద్రుష్టిలో పెట్టుకొని రాష్ట్ర  ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలియజేశారు.


 

 




వారోత్సవాలు కొనసాగింపా వాయిదా


మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొనసాగింపా వాయిదా


 


చింతపల్లి  ,పెన్ పవర్


 

ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు అటవీ ప్రాంతంలో  సిపిఐ మావోయిస్టు అమరవీరుల సంస్సరణవారోత్సవాలు విజయవంతం  చేసుకోవడానికి మవోయిస్థులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నెల 28 నుంచి వచ్చే నెల3 వరకు మావోయిస్టులు నిర్వహించే సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసులు  ఏ ఓ బి లో కుంబింగ్ ముమ్మరం చేరారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల19,  22న, మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి.ఈ ఎదురు కాల్పుల్లోమావోయిస్టు అగ్రనేతలకు తీవ్ర గాయాలయినట్లు పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకోవాలా? లేక వాయిదా వేసుకోవాలా? అనే దానిపై మావోయిస్టులలో సందిక్తత నెలకొన్నంటుంది. అయితే ప్రతీ ఏడాది ఏవోబి అటవీ  ప్రాంతంలో ఉన్న అమరవీరుల సంస్కరణ స్థూపాలను సుందరంగా తీర్చిదిద్ది విప్లవ గేయాలతో, గ్రామ సభలు నిర్వహిస్తూ వారోత్సవాలు ఘనంగా జరుపుకునే వారు. వారోత్సవాలు మరో పది రోజులు వుందనగా గతంలో నిర్మించిన స్థూపాలకు రంగులు వేసేవారు.కానీ మరో 4 రోజులలో మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం కానున్నప్పటికి  ఎప్పుడో నిర్మించిన స్థూపాలకు నేటికీ రంగులు వేయలేక పోయారు.పోలీస్ నిర్బంధం,గాలింపు చర్యలు విస్తృతంగా వుండడం వలన మావోయిస్టు కార్యకలాపాలు సాగడం లేదు. గత కొన్నేళ్లుగా వారోత్సవాలు అడ్డుకొవడానికి పోలీస్  బలగాలు ఏవో బి అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతునే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఏవోబీ అటవీ ప్రాంతంతో పాటు ఏజెన్సీ గ్రామాలలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, స్తూపాలకు రంగులు వేసేందుకు అవకాశం లేకుండా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతూ,వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు మాత్రం ఏదో ఒక ప్రాంతంలో సంస్మరణ సభ నిర్వహించే తీరుతారని ప్రచారం జరుగుతోంది. ఏ ఓ బి,విశాఖ ఏజెన్సీ అంతటా పోలీసు యంత్రాంగం  ముందుగానే అప్రమత్తమై మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. ఇరు వర్గాల చర్యలతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని మన్య వాసులు భీతిల్లుతున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...