ముమ్మరంగా వరి నాట్లు
ఏలేశ్వరం ,పెన్ పవర్
ఏలేశ్వరం మండల పరిధిలో లింగంపర్తి, భద్ర వరం, పేరవరం, తూర్పు లక్ష్మీపురం, ఏలేశ్వరం, జె అన్నవరం, మర్రి వీడు, పెద్దనాపల్లి తదితర గ్రామాల్లో వరినాట్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టులో 67 వేల ఎకరాలు, తిమ్మరాజు చెరువు ఆయకట్టు 950 ఎకరాల సేద్యపు భూమి ఉంది. సదర్ భూముల్లో సుమారు 80 శాతం వరి పొలాలను సాగు చేస్తారు. రుతుపవనాల కారణంగా ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్, తిమ్మరాజు చెరువులలో కావలసిన సాగు నీరు పుష్కలంగా ఉంది. దీంతో సేద్యానికి సమాయత్త మైన రైతాంగం వరి ఊడ్పులు ముమ్మరంగా సాగుతున్నాయి.
No comments:
Post a Comment