Followers

Showing posts with label POLITICS. Show all posts
Showing posts with label POLITICS. Show all posts

చేతులెత్తి మొక్కుతున్న వార్డ్ ప్రజలు ఇంట్లోనే వుండండి

 చేతులెత్తి మొక్కుతున్న వార్డ్ ప్రజలు ఇంట్లోనే వుండండి

గాజువాక, పెన్ పవర్

చేతులెత్తి మొక్కుతున్నాను దయచేసి మీరు అంత ఇంట్లోనే వుండండి అని గాజువాక జనసేన మహిళ నాయకురాలు రెయ్యి రత్న కోరారు.ఉదయం లేస్తే ఏమి వినాల్సివస్తుందో అని ఏ ఆత్మీయులని .కోల్పోవాల్సివస్తుంది ఏమో అని బాధ దయచేసి ప్రస్తుతం బయట పరిస్థితి భిన్నంగా ఉన్నాయి డబ్బు పలుకుబడి ఏవి కూడా పనిచేసే పరిస్థితి లేదు కోవిడ్ బారిన పడి ఎవరిని కోల్పోవాల్సివస్తుందో అని మనసు కలిచి వేస్తుంది. దయచేసి స్వచ్చందంగా మీకు మీరుగా భౌతిక దూరం స్వీయ నియంత్రణ మస్కలు ధరించడం శానిటేషన్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు దయచేసి మీకు మీరుగా ఇంట్లో వుండండి అత్యావరమైతే తప్ప బయటకి రాకండి ప్రాణము కన్న విలువ అయినది ఏది లేదు అని తెలియజేసుకుంటున్నాను అని అన్నారు.


కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్

కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ 

మెంటాడ, పెన్ పవర్

మెంటాడ మండలం, చింతలవలస గ్రామపంచాయతీ సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ, వైద్య ఆరోగ్య సిబ్బంది,  గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి గురువారం కరోనా పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి పరిసరాల, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని,    ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరిస్తే మంచిదని వారు గ్రామస్తులకు సూచించారు. బహుదూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండాలని, అవసరమైతే మాస్కులు ధరించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


గన్నెలకోట సర్పంచ్ అనారోగ్యంతో మృతి

గన్నెలకోట సర్పంచ్ అనారోగ్యంతో మృతి

పెదబయలు  పెన్ పవర్

మండలంలోని, గన్నెలకోట పంచాయతీ సర్పంచ్ లకే దేవకుమారి(36)_అనారోగ్యంతో బుధవారం సాయంత్రం చామగడ్డ గ్రామంలో మృతి చెందారు. రెండు రోజులగాా ఆమె అనారోగ్యంతో బాధ పడుతూ ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేసారు. మృతురాలు దేవకుమారి గిన్నెెల కోోట సర్పంచ్ గా రెండు దఫాలు ఏక గ్రీవంగా ఎన్నిక య్యారు. వైసిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె తన  భర్త చిన్నారావు తో కలిసి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ  పంచాయతీ ప్రజలకు  విశేష సేవలు  అందించారు. ఆమె  మాట అంటే పంచాయతి ప్రజలకు  శిలా సాసనం.




మంత్రిని భర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ నిరసన దీక్ష

 మంత్రిని భర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ  నిరసన దీక్ష

బీసీల ఓట్లతో గెలిచి బీసీలనే బర్తరఫ్ చేస్తారా?

ఈటెలను బర్తరఫ్ చేయడం బీసీలను దగా చేయడమే

 జాజుల లింగంగౌడ్

తార్నాక, పెన్ పవర్ 

పంచాయితీ, పార్లమెంటు, మున్సిపల్, అసెంబ్లీ అన్ని ఎన్నికల్లో బీసీల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా మంత్రి వర్గం నుండి బీసీలను బర్తరఫ్ చేసి అవమానిస్తున్నారని, ఈ వైఖరి మానుకోకపోతే టిఆర్ఎస్ పార్టీకి బీసీలు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. బీసీ బిడ్డ ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి భర్తరప్ చేయడాన్ని నిరసిస్తూ ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర శాతం లేనివాళ్లు, ఐదు శాతం లేని వాళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించవచ్చు, వందల ఎకరాలు అడ్డగోలుగా పొందవచ్చు,  ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా తరతరాలుగా పాలించవచ్చు గాని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లు మాత్రం ఆస్తులుండి పదవులు పొందితే, అవినీతిపరులుగా,  కబ్జాకోరులుగా ముద్ర వేస్తుండడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.  బీసీ ఎస్సీ ఎస్టీలు అవినీతి పరులైతే మీరు సుద్దపూసలా అంటూ ప్రశ్నించారూ.ఈరోజు అధికారం ఉందని బీసీ మంత్రి అయిన ఈటల రాజేందర్ ను, గతంలో దళిత వర్గానికి చెందిన రాజయ్యను కేసీఆర్ ప్రభుత్వం మెడలు పట్టి బహుజనుల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా క్యాబినెట్ నుండి గెంటివేశారని, ఇది వ్యక్తులను అవమానించడం కాదని ఇది యావత్ 90 శాతం ఉన్న బడుగుల, బహుజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే అవుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి అగ్రకులాలకు చెందిన ఒక్క మంత్రిని, ఒక్క ప్రజాప్రతినిధిని భర్తరఫ్, సస్పెండ్ లు చేసే దమ్ము లేదని, కేవలం బడుగులను మాత్రమే బలి తీసుకుంటున్నార ని ఇందుకు ఈటల రాజేందర్, రాజయ్యలే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మాదేశి రాజేందర్,బండిగారి రాజు తదితరులు పాల్గొన్నారు

సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం

 సెక్రెటరీ రఫీ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం పోచవరం పంచాయతీ పరిధిలో జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల సన్నాహక కార్యక్రమాలలో భాగంగా సచివాలయ కార్యదర్శి ఎస్. ఎం.రఫీ వూల్లా ఆధ్వర్యంలో మే 1 నుండి 14 వరకు గ్రామంలో పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. దానితోపాటు కోవిడ్ 19 భద్రత, నివారణ అవగాహనా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోచవరం పంచాయతీ కార్యదర్శి రఫీ కోవిడ్ నియంత్రణ నిబంధనలు అన్ని విధాలుగా అమలు చేయడం జరుగుతుంది.

డుంబ్రిగుడ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి

 డుంబ్రిగుడ మండల జెడ్పీటీసీ అభ్యర్థి ఆకస్మిక మృతి 

అరకు, పెన్ పవర్

అరకు వేలి నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్.పి.టి.సి,అభ్యర్థి కొర్ర రుక్మిణి గుండెపోటు తో మంగళవారం అకస్మాత్తుగ మృతి చెందారు ఆమె భౌతిక కాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పాచిపెంట శాంతకుమారి సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పార్టీ నుండి వారికి ఎటువంటి సాయం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని తెలియజేశారు.అరకు వేలి మండలం ప్రెసిడెంట్ సోమెలి సన్యాసిరావు మండల నాయకుడు పాచిపెంట చిన్నస్వామి హుకుంపేట జెడ్పిటిసి అభ్యర్థి,గలుగు బోయిన కోటేశ్వరరావు, డుంబ్రిగుడ మండల కార్యదర్శి బిమరావు,కె హరిష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఆమెతో ఉన్నారు.

మంత్రి వనిత కు కృతజ్ఞతలు తెలిపిన వైసిపి పెద్దేవం

 మంత్రి వనిత కు కృతజ్ఞతలు తెలిపిన వైసిపి పెద్దేవం 

తాళ్లపూడి, పెన్ పవర్

వైయస్సార్సీపీ పెద్దేవం బూత్ కన్వీనర్ వేము రామారావు కరోనా తో బాధపడుతున్నప్పుడు విషయం తెలుసుకున్న  వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ   రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కు ఈ విషయం తెలియజేశారు. వెంటనే మంత్రి వనిత  స్పందించి రాజమండ్రి గవర్నమెంట్  హాస్పిటల్ లో బెడ్ ఇప్పించి సకాలంలో వైద్యం అందేలా  చూసారు. వేము రామారావు మాట్లాడుతూ మంత్రి వనిత ఆదేశాలమేరకు హాస్పిటల్ సూపరింటెండెంట్ తో అనుక్షణం ఫోన్ మాట్లాడుతూ, నాకు ఇంజెక్షన్లు కోర్స్ పూర్తి అయ్యేలాగా డాక్టర్ల తో మంత్రి వారి అడిషనల్ పియస్ మహాలక్ష్మి కుమార్   మాట్లాడారు. అలాగే మన ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోన పట్ల చేస్తున్న కృషి గవర్నమెంట్ హాస్పిటల్ లో చాలా బాగుంది అని అన్నారు. ఎవరు అపోహలు నమ్మవద్దు అని,హాస్పిటల్ లో ఇంజక్షన్ ల కొరత లేదు అని, అన్ని సదుపాయాలు చాలా బాగున్నాయి అని, అందుకు గాను నేను  సోమవారం నాడు కరోనా నుంచి కోలుకుని  ఇంటికి చేరుకున్నాను అని అన్నారు. నా వైద్యానికి సహాయం అందించిన  మంత్రి తానేటి వనిత కి, మంత్రి వారి అడిషనల్ పియస్ మహాలక్ష్మి కుమార్ కి,  వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి  తోట రామకృష్ణ కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని తెలియజేశారు. అలాగే గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,14 రోజులు నా దగ్గర కి రావద్దు అని, నా  ఆరోగ్యం బాగుంది అని తెలియచేశారు.

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ ని అరికట్టండి

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ ని అరికట్టండి

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం నగరంలో కోవిడ్ వ్యాధి అత్యవసర పరిస్థితిని ఆసరా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటున్నాయని సి.పి.ఎం జిల్లా కమిటీ విమర్శించింది. ఈ మేరకు సి.పి.ఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ ఒక ప్రకటన ద్వారా జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీని అరికట్టాలని కోరారు.ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా లక్షల్లో దండుకుంటున్నారని, పైగా రెమిడేసిఫర్ ఇంజెక్షన్ రోగులు తెచ్చుకోవాలని తమకు సంబంధం లేదని తిప్పడం ఆ తరువాత బ్లాక్ లో లక్షలు గుంజటం ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాపారంగా మారిందని మండిపడ్డారు.ప్రజలను ఆదుకోవాల్సిన ప్రైవేట్ వైద్యరంగం ఇలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి ని సొమ్ము చేసుకోవడం దుర్మార్గమని నగరంలో ఉన్న ప్రజా ప్రతినిధులు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు దీనిపై స్పందించాలని అరుణ్ కోరారు.అఖిల పక్ష పార్టీలు,సంస్థల సమావేశం జరిపి ఈ పరిస్థితి ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని కోరారు.

అద్దె పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం

 అద్దె పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం

మెంటాడ, పెన్ పవర్

మెంటాడ మండలం లోని 30 గ్రామ పంచాయతీలు ఉండగా, ఈ ఏడాది చింతాడ వలస గ్రామం నూతన పంచాయతీగా ఏర్పాటయింది. సొంత పంచాయతీ భవనం లేకపోవడంతో వై ఎస్ ఆర్ సి పి సీనియర్ నాయకులు, సర్పంచ్ ప్రతినిధి గేదెల సతీష్ గ్రామంలో ఒక ఇంటిని అధిక తీసుకొని పంచాయితీ కార్యాలయంగా ఏర్పాటు చేశారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి వారి పనులు చేయడానికి గ్రామ పంచాయతీ కార్యాలయం లేకపోవడంతో తాత్కాలికంగా అద్దె భవనం ప్రారంభోత్సవం చేసినట్లు ఆయన తెలిపారు. ఇకమీదట గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి వచ్చి  సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు ద్వారా తన సమస్యలను చెప్పుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలి

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలి 

శ్రీకాకుళం, పెన్ పవర్

 కరోనా సెకండ్ వేవ్ కు జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారని ఐజేయూ జాతీయ కార్యవర్గం ప్రత్యేక ఆహ్వానితులు నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు.మంగళ వారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో,ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ ,పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు తాజాగా ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేశారు.ఒడిశా ప్రభుత్వం తొలి వేవ్ లోనే మరణించిన జర్నలిస్టు కుటుంబానికి 2.50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని,రెండో వేవ్ మృతులకు రూ.10 లక్షలు ప్రకటించిందని తెలిపారు.తొలి వేవ్ లోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఉప ముఖ్య మంత్రులకు ,మంత్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడం విచారకరమన్నారు.తమ జాతీయ నాయకులు శ్రీనివాసరెడ్డి,దేవులపల్లి అమర్ స్వయంగా ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డితో మాటాడిన తరువాత ,చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చినా,అది ఇంతవరకు అమలు కాలేదని ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు.హెల్తు కార్డులు కూడా ,నూతన ప్రభుత్వం ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు.రెండో వేవ్ లో జర్నలిస్టుల మరణాల సంఖ్య ఎక్కువగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకూ ఆరుగురు  రెండో వేవ్ కు బలయినట్టు ధర్మారావు తెలిపారు.సోమవారం జరిగిన ,రాష్ట్ర యూనియన్ కార్యవర్గ సమావేశం ( జూమ్ ) ఇంతవరకూ చనిపోయిన వారి వివరాలతో ,రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇటీవల ఒకే రోజు ,ఇద్దరు ' సాక్షి ' కరోనాకు బలైన తరువాత ,రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులకు ప్రత్యేక బెడ్లను కేటాయిస్తూ,జిల్లాలకు సమాచార శాఖ అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్టు తెలిపారు.

శ్రీకాకుళం ' జెమ్స్ ' లో 15 బెడ్స్ 

శ్రీకాకుళం జిల్లా జర్నలిస్టుల కోసం జెమ్స్ లో 15 బెడ్స్ ను కేటాయిస్తూ కలెక్టరు నివాస్ ఆదేశాలు జారీ చేశారని ధర్మారావు వెల్లడించారు.కరోనా బాధితులైన జర్నలిస్టులు డీపీఆర్వో రమేష్ ను సంప్రదించాలని సూచించారు.ఈ సందర్భంగా కలెక్టరు నివాస్ కు ధర్మారావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ ను కోవిడ్ సెంటర్ గా వినియోగించండి. గత మూడేళ్ల నుంచి మూతపడిన గరిమెళ్ల ప్రెస్ క్లబ్ ను కోవిడ్ సెంటర్ గా వినియోగించుకునే విషయం ,కలెక్టరు పరిశీలించాలని ధర్మారావు కోరారు.విలువైన భవనాన్ని మూసేసి,టిడిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని,కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించడం మరింత అన్యామన్నారు.కరోనా బారినపడిన జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ను కోవిడ్ కేంద్రంగా మార్చాలని కోరారు.ఈ ప్రతిపాదన శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావుకు కూడా తెలిపామన్నారు.

ప్రజలంతా సిరక్షితంగా ఉండండి...

ప్రజలంతా సిరక్షితంగా ఉండండి...

 

అనకాపల్లి, పెన్ పవర్

కరోనా  రెండవ దశ ప్రభావం ప్రమాదకరంగా ఉన్నందున ప్రజలంతా భయపడకుండా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు సురక్షితంగా ఉండాలి అని  విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర పిలుపునిచ్చారు.ఉదయం లేస్తే ఏం వినాల్సి వస్తుందో ఏ ఆత్మీయుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుందో అనే బాధ,ఆవేదనలతో ప్రజలు,నాయకులు,ప్రతి వక్కరు ఆందోళన చెందున్నారు అని ఆయన అన్నారు.కరోనా ముందు డబ్బు ,పలుకుబడి ఏవి కూడా పని చేసే పరిస్థితి లేదు అని కోవిడ్ బారినపడి ఎవరిని కోల్పోవాల్సి వస్తుందోనని మనసు కలిచివేస్తోంది అని ఆవేదనతో ఆయన అన్నారు.దయచేసి ప్రతి వక్కరు స్వచ్ఛందంగా స్వీయ లాక్ డవున్ విధించుకొని మీ ఇళ్లల్లో కొంతకాలం వుండక పోతే ఈ కరోనా ప్రభలడాన్ని అరికట్టలేము అని ప్రజలను కోరారు.అత్యవసరం వస్తేనే రోడ్డు మీదకు రావాలి అని అదికూడా కరోనా నుండి రక్షణ కొరకు మీకు మీరుగా భౌతిక దూరం పాటిస్తూ,ప్రత్యేక రక్షణ కొరకు రెండు మాస్కు లు ధరించి,ఎక్కువగా  శానిటేషన్ చేసుకోనుచు పని చూసుకొని ఇంటికి త్వరగా సురక్షితంగా చేరుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని సురేంద్ర తెలియజేసారు. దయచేసి మీకు  మీరు  గా ఇంటిలో ఉండండి మీ ప్రాణాలే కాకుండా ఇంటిలో వారిని మీ ఇంటి చుట్టు ప్రక్కల వారిని కూడా రక్షించండి అని ఆయన కోరారు.ప్రతి వక్కరు గుర్తువుంచుకోవల్సిన  విషం ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు ఈ ప్రపంచంలో మీ అందరిని చేతులెత్తి ప్రార్ధిస్తున్న ఇంటిలో ఉండండి సురక్షితంగా ఉండండి అని చేతులు జోడించి అందరిని ప్రార్ధించారు.

ఏజెన్సీలో 15 లోగా ఉచిత బియ్యం పంపిణీ చేయాలి

 ఏజెన్సీలో 15 లోగా ఉచిత బియ్యం పంపిణీ చేయాలి

పెన్ పవర్, విశాఖపట్నం

  విశాఖ ఏజెన్సీలో ఈనెల 15లోగా ఉచిత బియ్యం పంపిణీ పూర్తిచేయాలని పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారిణి  లక్ష్మీ శివ జ్యోతి అన్నారు. సోమవారం పాడేరు ఆర్డిఓ కార్యాలయం నుంచి  పాడేరు జి.మాడుగుల  పెదబయలు   ముంచంగిపుట్టు  హుకుంపేట  డుంబ్రిగూడ  అనంతగిరి  అరకు  జీకే వీధి  చింతపల్లి మండలాల తహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  రెండవ విడత కరోనా మహమ్మారి ఉధృతమవుతున్న దృశ్య ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేపట్టిందన్నారు. గిరిజనులకు 15వ తేదీలోగా ఉచిత బియ్యం అందించాలని కోరారు. క్షేత్ర స్థాయిలో కి బియ్యం వాహనాలు వెళ్లి గ్రామాల్లో గిరిజనులకు ఉచిత బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ లో ఎటువంటి అవకతవకలు జరిగిన  సహించేది లేదని ఆమె హెచ్చరించారు.  ఆయా మండలాల తహసీల్దార్లు  శివారు గ్రామాలకు సైతం ఉచిత బియ్యం అందాలని దీనికోసం  తహసీల్దార్లు తగిన చర్యలు తీసుకోవాలని  ఆర్ డి ఓ లక్ష్మీ శివ జ్యోతి కోరారు.

సబ్బం హరి మృతికి సంతాపాన్ని ప్రకటించిన గవర్నర్ బండారు

 సబ్బం హరి మృతికి సంతాపాన్ని ప్రకటించిన  గవర్నర్ బండారు 

విశాఖపట్నం, పెన్ పవర్

అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించారనే వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. సబ్బం హరి మరణం చాలా బాధాకరం అని, విశాఖపట్నం అభివృద్ధికి అతను ఎంతగానో కృషి సల్పారని, నాకు సబ్బం హరి అత్యంత ఆత్మీయ పరిచయస్తులని అన్నారు. నేను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పలు సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కరింపచేసేవారని, రాజకీయ పరిజ్ఞానం మెండుగా గల సబ్బం హరి అనేక విషయాలను లోతుగా అధ్యయనం చేసేవారని గుర్తుచేసుకున్నారు.అలాంటి వ్యక్తి ప్రస్తుతం మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని, ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ దివంగత సబ్బం హరి  ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

బి.జె.పి యువమోర్చా ఆధ్వర్యంలో ఆహారం వితరణ

 బి.జె.పి యువమోర్చా  ఆధ్వర్యంలో  ఆహారం వితరణ

రాజమహేంద్రవరం, పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఈ కరోనా విపత్కర సమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ మరియు బి.జె.వై.యం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ పార్టీ శ్రేణులకు,యువతకు సూచనలు అందించారు.బిజెవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందికొండ రమేష్ మాట్లాడుతూ ఈరోజు నుండి వారం రోజుల పాటు రోగుల సహాయకులకు ప్రతీ రోజు 200మందికి ఉదయం అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.అదేవిధంగా బిజెవైయం జిల్లా అధ్యక్షులు కందుకూరి మనోజ్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ సెంటర్లు పరిశీలన జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కండవల్లి సాయి,డి. సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సువ్వాడ మరణం తీరని లోటు

సువ్వాడ మరణం తీరని లోటు


మెంటాడ, పెన్ పవర్ 

సాలూరు మండలం వైసీపీ కన్వీనర్ దువ్వాడ రమణ అకాల మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి, ఆయన కుటుంబ సభ్యులకు తీరనిలోటని సాలూరు ఎమ్మెల్యే పీడి క రాజన్న దొర అన్నారు.  చివరి చూపులు చూడలేకపోయానని ఎమ్మెల్యే రాజన్నదొర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో    సహనం, ఓపిక,సత్త సహకారం అనే నాలుగు నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు సువ్వాడ.రమణ  అని రాజన్నదొర కొనియాడారు.  2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సాలూరు మండలంలోని సువ్వాడ. రమణ నాయకత్వంలో వైస్సార్సీపీ బ్రహ్మాండమైన మెజారిటీ రావడానికి రమణ  కృషి చేశారని రాజన్న దొర గుర్తు చేసుకున్నారు.  పెద్ద వయస్సు అయినందున,వేసవికాలం అయినందున గడపగడపకు కార్యక్రమం, పాదయాత్ర కార్యక్రమంనకు రావొద్దున్నా ఎమ్మెల్యే రాజన్నదొర గారి కంటే ముందే ఉండేవారు. 2018 సంవత్సరం జనవరి నెలలో ఎమ్మెల్యే గారు కొఠియా నడిచి రావద్దు అని చెప్పినా ఎమ్మెల్యే రాజన్నదొర గారితో,మాజీ జడ్పీటిసి రెడ్డి.పద్మావతి గారితో మరియు ఇతర వైసీపీ నాయకులతో పోటీగా ఏజెన్సీ ప్రాంతంలో నడిచారు. బహుశా సాలూరు మండలంలోని ఎమ్మెల్యే రాజన్నదొర గారి వెంట లేకుండా ఎమ్మెల్యే గారి ఏ కార్యక్రమమైనా సరే అది రాజకీయమైన,వివాహామైన, చావైన,పండగైనా,పలకరింపైనా సరే నాకు తెలిసి వెళ్లలేదేమో. సాలూరు మండలంలోని మామిడిపల్లిలో చివరగా ఎమ్మెల్యే రాజన్నదొర గారు ప్రచారం చేసిన ఎంపీటీసీ ఎన్నిక కూడా సువ్వాడ.రమణ గారిదే.  నునిత్యం ఎమ్మెల్యే రాజన్నదొర గారి వెంట ఉండి ఇప్పుడు రాజన్నదొర గారికి,ఆయన కుటుంబానికి, వైస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు కనిపించకుండా, అగుపించకుండా హఠాత్తుగా మాయమై అందనంత దూరానికి వెళ్లిపోయారని, సువ్వాడ రమణ గారిని చివరి సారిగా చూసే అవకాశం కూడా కలుగలేదు అని ఈ బాధను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని సువ్వాడ.రమణ గారి జ్ఞాపకాలు,సేవలు స్మరిస్తూ ఆయన నాయకత్వం,అంకిత భావం ఎల్లవేళలా మాతో ఉంటాయని ఆయన స్పూర్తితో నేను,మా నాయకులు మరియు కార్యకర్తలు ముందుకు నడుస్తాం అని  ఎమ్మెల్యే రాజన్నదొరగారు  దిగ్బ్ర్హాంతి వ్యక్తం చేశారు.                                                                                                            

ఇప్పటికి అయిన మంచి నిర్ణయం తీసుకున్నారు

 ఇప్పటికి అయిన మంచి నిర్ణయం తీసుకున్నారు

పెన్ పవర్, శ్రీకాకుళం

 ప్రశాంత్ కిషోర్  మీరు వ్యూహకర్తగా రాజకీయాల్లో, రాజకీయ పార్టీలకు ఇచ్చే సలహాలు సూచనలు సందర్భంలో మీరు చాలా తెలివైనవారుగా మాకు కనబడుతూ వుంటారు.  అటువంటి సందర్భంలో మీరు ఈరోజు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు . నాకు చాలా సంతోషంగా ఉంది ఇకనుంచి నేను వ్యూహకర్తగా పని చేయను అన్నటువంటిది, చాలా మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నాను.  రాజకీయాలు అనేవి ఒక లక్ష్యంతో పని చేసినటువంటిది ఆ లక్ష్యం కోసం నిస్వార్ధంగా ముందుకు పోవాల్సిన విధానం,  అటువంటి సందర్భంలో ప్రజలను మీ ఆలోచనల మేరకు వాళ్లను మభ్యపెట్టి రిజల్ట్ ను తారుమారు చేయవలసినటువంటి శక్తి వంతమైన పని చేస్తున్నా అనే విధానంలో మీరు ముందుకు వెళ్లటం నేను చూశాను అని మాజీ  మంత్రివర్యులు గుండ అప్పల సూర్యనారాయణ గారు తెలియజేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా నేను ముందుగా పసిగట్టి ప్రశాంత్ కిషోర్ గారు ఈ విధంగా పనిచేయటం ప్రజాస్వామ్య సిద్ధాంతానికి సరైనది కాదు అన్నట్టువంటిదే నా భావన అని చెప్పి కచ్చితంగా చెప్పినటువంటి అనేక స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే ప్రతి మేధావి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయాలి, అదేవిధంగా సమాజం ముందుకు పోవటం కోసమే, తాను నచ్చిన సిద్ధాంతాలకు బలపరిచిన లీడర్ షిప్  కోసమే ఒక లక్ష్యం కోసం పని చేయాలి అంతే తప్ప  ప్రజలను మభ్యపెట్టి  వ్యక్తుల్ని కల్పించటం కోసమని చెప్పి మన ఆలోచన మేరకు గెలిపించటనికి తగిన చర్యలు తీసుకోవటం అనేది మాత్రం రాజకీయ సిద్ధాంతం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.


మోడీ విధానాలు ఇప్పటికైనా మానుకోవాలి...సిఐటియు

మోడీ విధానాలు ఇప్పటికైనా మానుకోవాలి  సిఐటియు 

       

మహారాణి పేట, పెన్ పవర్

బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామనుకున్న నరేంద్ర మోడీకి ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, బిజెపి ఓట్లు తగ్గడానికి కారణం వినాశకరమైన విధానాలే కారణమని సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ కే ఎస్ వి కుమార్ తెలిపారు. ఈ విధానాలు నిలుపుదల చేయకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 32వ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్ష ను ఆయన ప్రారంభించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోవిడ్ రోగులకు ఆక్సిజన్ను అందించడం, అలాగే ప్రభుత్వ హాస్పిటల్ లో బెడ్స్ కొరతగా ఉండటంతో 1000 బెడ్స్ తయారుచేసి పంపిణీ చేసిందని పేర్కొన్నారు.  స్టీల్ ప్లాంట్ ప్రభుత్వరంగ సంస్థలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచాయని ఎంతోమందికి అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయని అన్నారు. ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ని అమ్ముతామంటే విశాఖ ప్రజలు చూస్తూ ఊరుకోరని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. తక్షణమే ఈ విధానాలు మానుకొని ప్రజల ఆరోగ్యం, ఉపాధిని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు వి.కృష్ణారావు,నాయకులు అనపర్తి అప్పారావు,కె.కుమారి, ఎం.చంటి, శ్రీనివాస రాజు, పి.దేముడు, యన్.అది తదితరులు పాల్గొన్నారు.

ఆంక్షలు కఠినం ... అవసరమైతే లోకల్ లాక్ డౌన్

 ఆంక్షలు కఠినం ... అవసరమైతే లోకల్ లాక్ డౌన్

కోవిడ్ నియంత్రణలో రాజీపడేది లేదు
జిల్లా కలెక్టర్ కు డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ఆదేశాలు

శ్రీకాకుళం, పెన్ పవర్

కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నందున ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని, జిల్లాలో అవసరమైన చోట్ల లోకల్ లాక్ డౌన్ విధించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను ఆదేశించారు. ఆయన సోమవారం ఉదయం కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసుల పరిస్థితిపై సమీక్షించారు. ఈ వారంలో ప్రతిరోజూ రెండు వేలకు మించి పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఎంతో ఆందోళన కలిగిస్తున్న విషయమని అన్నారు. ఇంకా కోవిడ్ పరీక్షల సంఖ్యను బాగా పెంచాలని సూచించారు. కోవిడ్ రోగులకు సత్వర వైద్యాన్ని అందించే విషయంలో ఎంతమాత్రం అలక్ష్యం పనికిరాదని, ప్రతి పాజిటివ్ కేసుకీ వెంటనే తగిన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. ఫోన్ చేసిన మూడు గంటల్లో కోవిడ్ రోగికి పడక ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్నారు. 

 ఐదువేల పడకలు సిద్దం చేయాలి : 

జిల్లాలో కనీసం ఐదు వేల పడకలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని మంత్రి  పేర్కొన్నారు. హెూమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని,  అందరికీ కిట్స్ అందాలని సూచించారు. ఏ.ఎన్.ఎం ఇళ్లను సందర్శించడం లేదనే ఆరోపణలు రాకూడదని, వాటిని సరిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఆక్సిజన్, రేమిడిసివర్ ఇంజెక్షన్ సరఫరాలో ఇబ్బందులు ఉండకూడదన్నారు. ప్రతి పడకపై ఉన్న బాధితులకు మంచి మెరుగైన వైద్య సేవలు అందాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ బాధితులకు మందులు, ఆహారం సకాలంలో అందాలని,  వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలపై ఉన్న క్రిటికల్ కేసుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటి సంఖ్య తక్కువగా ఉన్నందున వాటిని పెంచే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.

 ఆహారం, శానిటేషన్ పై ఫిర్యాదులు ఉండరాదు : 

104 కాల్ సెంటర్ అత్యంత కీలకమైన వ్యవస్థగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. సాధ్యమైనంత మేర ఏ వ్యక్తి మరణించకుండా శాయశక్తుల కృషి చేయాలని ఆయన తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది మానవతాధృక్పధంతో సేవలను అందించి బాధితుల కుటుంబాల్లో ఆనందం నింపుతున్నారని అభినందించారు. కోవిడ్ వైద్యం కోసం వచ్చే వారికి తక్షణం పడకలు అందాలని ఆ మేరకు ఏర్పాట్లు ఉండాలని అన్నారు. ఆక్సీజన్ వినియోగించడంలో వృధా ఉండరాదని సూచించారు. ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పనిచేయాలని ఆదేశించారు. కొవిడ్ సెంటర్లలో ఆహారం, శానిటేషన్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని చోట్ల సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే మాట వినిపించుకూడదని ఫిర్యాదులు వస్తే వాటిపై దృష్టి పెట్టాలని చెప్పారు. 

ఆక్సిజన్ పడకల కొరత లేదు  కలెక్టర్ నివాస్ :

 దీనిపై జిల్లా కలెక్టర్ కె నివాస్ స్పందిస్తూ రెండవ విడత కరోనా వ్యాప్తి సందర్భంగా జిల్లాలో వైద్య సదుపాయాలను బాగా మెరుగుపరచడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లో అదనంగా మరిన్ని పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం 17 వందలు ఉన్నాయని అందులో దాదాపు 13 వందల బెడ్లలో కోవిడ్ బాధితులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్ బెడ్లు అన్నిటినీ కోవిడ్ కోసం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాజాం, పాలకొండ, ఇచ్చాపురం, మందన వంటి ప్రాంతాల్లో సైతం ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్ నివాస్ తెలిపారు. జెమ్స్ లో ఆక్సిజన్ పడకలు పెంచుతున్నామని, రిమ్స్ లో అదనంగా వంద పడకలను రెండు రోజుల్లో ఏర్పాటు చేశామని వివరించారు. రాజాం ఏరియా ఆస్పత్రి, జిఎంఆర్ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రులుగా మార్చామని, పాలకొండ ఆసుపత్రిని కూడా మార్చుతున్నామని ఆయన చెప్పారు. జిల్లాలో కోవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులోనూ మంచి వైద్య సదుపాయాలు అందిస్తున్నామని, హెూమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి కూడా వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు చెప్పారు. కంటైన్మెంట్ ఆపరేషన్లను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వివరించారు.  పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు 24 గంటల్లో ఫలితాలను తెలియజేస్తున్నామని చెప్పారు. జిల్లాలో రోజుకు 48 వేల లీటర్ల ఆక్సిజన్ అవసరమని, ప్రస్తుతానికి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదని ఆక్సిజన్ సరఫరా పెంచుటకు విశాఖపట్నం జిల్లా యంత్రాంగంతో సైతం సంప్రదింపులు జరిపామని కలెక్టర్ తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రేమిడీస్వీర్ ఇంజక్షన్ అవసరం మేరకు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు కలెక్టర్ నివాస్ వివరించారు.


పరిశ్రమలు ఆపి ఆక్సిజన్ కొరత తీర్చే దమ్ము లేదా !

 పరిశ్రమలు ఆపి ఆక్సిజన్ కొరత తీర్చే దమ్ము లేదా !

కరోనా వ్యాప్తికి ప్రధాని, కేంద్ర ఎన్నికల సంఘం భాద్యత వహించాలి
కోవిడ్ భాదితులకు ధైర్యం కల్పించటంలోను, అండగా నిలవటంలోను నేతలు గైరుహాజరు

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరంలో గల  పేపర్ మిల్స్, హార్లిక్స్ ఫ్యాక్టరీల ఆక్సిజన్ కరోనా భాదితులకు సరఫరా చేయాలి. నగదు రహిత కోవిడ్ వైద్య సేవలకు ప్రభుత్వం తక్షణ ఆదేశాలు జారి చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.  కరోనా మొదటి సారి వచ్చి నప్పుడు ఎదురైన అనుభవాలను గమనించి కూడా మోది సర్కార్ భద్రతా చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, రెండో దఫా అది కూడా మే నెలలో కరోనా వైరస్ ప్రమాదం ముంచుకొస్తుంది అని నిఘా వర్గాలు కచ్చితమైన అంచనాలతో కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం  తెలిపినా ప్రజలకు  ఆరోగ్య భద్రత కల్పించటంలో  మోది సర్కార్  నిర్లక్ష్యం వహించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు .  ఇంత ప్రమాదకర స్థాయిలో కోవిడ్ వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యతారాహిత్యంగా దేశ వ్యాప్తంగా ఎన్నికలు, ఉప ఎన్నికలు నిర్వహించి కరోనా మరణాలకు కారకులుగా నిలిచారని,రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి నిబంధనలు విశ్మరించి భౌతికదూరం పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ జరిపించారని, పోలింగ్ బూత్ లలో కనీసం శానిటేజర్స్, మాస్క్ లు కూడా సరఫరా చేయలేదని, మద్యం ఏరులై పారిందని, కరోనా జాగ్రత్తలు మత్తు బాబులు గాలికి ఒదిలి ఓటు వినియోగించుకున్నారని, కనీసం బ్రీత్ ఎనలైజర్స్ ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రాగణానికి భద్రత కల్పించలేకపోయారని ఆయన తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు. మరో సారి కోవిడ్ వైరస్ ప్రమాదం ముంచుకొస్తుందని భారత నిఘా వర్గాలు హెచ్చిరికలు చేసినప్పటికి మోది సర్కార్ నిర్లక్ష్యంగా లక్షల మంది హాజరయ్యే కుంభమేళాకు, సినిమాలకు,సినిమా హాల్స్ కు, మాల్స్, పబ్ లకు, బార్ లకు, విద్యా సంస్థలకు, మార్కెట్టు లకు, ఇతర బజార్లకు, అధికార పక్ష రాజకీయ సభలు, సమావేశాలకు కనీస నిబంధనలు కూడా పాటించని విధంగా అనుమతులు జారీచేయటం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు.  కరోనా భాదితులను అడ్డగోలుగా కొన్ని కార్పొరేట్, ప్రయివేట్ ఆసుపత్రులు ఆర్దికంగా దోచుకుంటున్నా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తుందని,ఆక్సిజన్ సరఫరా చేయటం లో ఘోరంగా ప్రభుత్వ యంత్రాంగం  వైఫల్యం చెందుతుందని , కరోనా బాధితులకు సరఫరా చేసే వ్యేక్సింన్లు దళారుల చేతుల్లోకి ఎలా వెళుతున్నాయనే అంశం పై ప్రభుత్వ యంత్రాంగం సమాధానం చెప్పాలని, కొన్ని కొన్ని మందులు షాపుల్లో దొరక్కుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నా సంబంధిత శాఖలు గుడ్డి వాని పాత్ర పోషిస్తు అక్రమాలను ప్రోత్సహిస్తున్నాయని  ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆక్సిజన్ కొరత నివారించటానికి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వున్న పరిశ్రమలను తాత్కాలికంగా  నిలిపివేసి  ఆ పరిశ్రమల నుండి ఆక్సిజన్ సరఫరా జరిపించే చర్యలు ఎందుకు చేపట్టలేక పోతున్నారని, ఆక్సిజన్ లేక వేల మంది చనిపోతున్నా ప్రభుత్వాలు పరిశ్రమల యాజమాన్యం తో ఆక్సిజన్ సరఫరా ఎందుకు జరిపించలేక పోతున్నారని, సామాన్య ప్రజల ప్రాణాల కన్నా కార్పొరేట్, ప్రయివేట్ సంస్థలకు మేలు చేయటమే మోది సర్కార్ ప్రధాన లక్ష్యంగా కనబడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేసారు. ప్రస్తుత కరోనా కష్ట కాలములో ఓట్లు వేయించుకున్న నేతలు అజ్ఞాతంలో వుంటు కరోనా భాదితుల దోపిడిని ప్రశ్నించడం లేదని, మొక్కుబడిగా ప్రకటనలుకు పరిమితం అయ్యి దొడ్డి దారిన అక్రమ వసూళ్లు లో వాటాలు తీసుకుంటున్నారని, కరోనా బాధితులకు అధికారిక సేవలు అందించటంలో గోదాముల్లో  దాంకుంటున్నారని,  ఈ కష్ట కాలంలో కరోనా భాదితులకు అండగా నిలవకుండా భాదితులను దోచుకుంటున్నారని,  అనాదిగా ఓటర్లు ఒక రకమైన కుత్రిమ బలహీనతలుకు బానిసలుగా మారి ఈ తరహా నేతలకు జె జె లు కొట్టడం మనుకోలేక పోతున్నారని ఆయన ఆందోళన చెందారు. కార్పొరేట్, ప్రయివేట్ ఆసుపత్రుల్లో  ఆరోగ్య శ్రీ కార్డులపై జరిగే వైద్య సేవల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని,నగదు రూపంలో లక్షలు చెల్లించటానికి సిద్దపడే కొరోనా బాధితులను మాత్రమే ఆసుపత్రిలో జాయిన్ చేసుకుంటున్నారని, ఆరోగ్య శ్రీ పై తూ తూ మంత్రం గా కరోనా వైద్యం చేస్తు పంపించేస్తున్నారని, కరోనా  పేరుతొ వైద్య సేవలు చేస్తున్నట్టు రికార్డుల్లో పేర్కొని ప్రభుత్వం నుండి పెద్ద  మొత్తంలో నిధులు దోచుకుంటున్నారని, కరోనా పేరుతొ మరణించిన ఘటనలపై విచారణ కు ఆదేశిస్తే అనేక నిజాలు బహిర్గతం అయితాయని ఆయన తెలిపారు. ఏపిలో గల స్థానిక పరిశ్రమల నుండి ఆక్సిజన్ సరఫరా ను కరోనా భాదితులకు మాత్రమే వినియోగించు విధంగా తక్షణమే ప్రభుత్వ ఆదేశాలు జారి చేయాలని, ఇదే విధంగా భారత్ లో గల పరిశ్రమల నుండి ఆక్సిజన్ సరఫరా కరోనా భాదితులకు మాత్రమే సరఫరా జరిగే విధంగా అత్యవసర ఆదేశాలు విడుదల చేయాలని తూ గో జిల్లాలో గల పరిశ్రమల నుండి తక్షణమే మొత్తం ఆక్సిజన్ కరోనా భాదితులకు సరఫరా జరిగే విధంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని, రాజమండ్రి లో గల అతిపెద్ద పరిశ్రమలైన పేపర్ మిల్స్, హార్లిక్స్ ఫ్యాక్టరి ఇతర పరిశ్రమ ల నుండి ఆక్సిజన్ సరఫరా జరిగే విధంగా తక్షణ  ఏర్పాట్లు చేయాలని, ఇప్పుడైనా నేతలు దాగుడు మూతలు ఆపి కరోనా వైరస్ భాదితులకు రక్షణగా నిలవాలని, నగదు రహిత వైద్య సేవలు అమలు జరిపే చర్యలకు తగు ఆదేశాలు జారి చేయాలని  ఆయన కోరారు.  భారతదేశం లో కరోనా వైరస్ బారిన పడి మరణించిన ప్రతి మరణం కు ప్రధాని మోది, కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వుందని, మోది కి ప్రజల ప్రాణాల కన్నా కార్పొరేట్, ప్రయివేట్ సంస్థల పైనే మక్కువ అని, కరోనా ముసుగులో ప్రజల నుండి దోచుకున్న సొమ్మునే కార్పొరేట్ ప్రయివేట్ దిగ్గజాలు మోదీ ఎన్నికలకు పెట్టుబడి దారులుగా నిలుస్తారని , ప్రతి మారణానికి  మోది సర్కార్ సమాధానం చెప్పాలని, కేంద్ర ఎన్నికల సంఘం పై భారత అత్యున్నత న్యాయస్థానం విచారణ కు ఆదేశించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేసారు.  సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ డివిఆర్ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ లంక దుర్గాప్రసాద్, దోషినిషాంత్, పి ప్రసాద్, వల్లి శ్రీనివాసరావు, వల్లి వెంకటేష్, ఖండవల్లి భాస్కర్, తమ్మన సతీష్, బర్ల సతీష్, తదితరులు పాల్గొనియున్నారు.

శ్రీరామ పాధక్షేత్ర గుట్ట పై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

 శ్రీరామ పాధక్షేత్ర గుట్ట పై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

12 కోట్లతో ఆలయ నిర్మాణానికి సన్నాహలు..

ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అంకుటిత దీక్ష

7వ, వారాల పాటు స్వామి వారికి తలనీలాలు సమర్పణ

శ్రీ వేంకటేశ్వర నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటు

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్


రామగుండం, పెన్ పవర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం వేళ రామగుండం నియోజవర్గంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని శ్రీరామ పాదక్షేత్రమైన రాముని గుండాల కొండ పై స్వయంబుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంకల్పించారు. సిఎం కేసీఆర్ జన్మదిన సంకల్పం ఫలించేలా అభినవ తిరుమల మాదిరిగా ఆలయ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అకుంటిత దీక్ష చేపట్టారు. ఆలయ నిర్మాణ సంకల్పానికి మరింత బలం చేకురాలని ఎమ్మెల్యే తలనీలాలు స్వామి వారికి సమర్పించారు. మరో ఏడు వారాల పాటు తమ తలనీలాలు స్వామి వారికి సమర్పించేందుకు ఎమ్మెల్యే సంకల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో 12 కోట్ల వ్యయంతో శ్రీ పాదక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నాహలు మొదలు పెట్టారు. శనివారం శ్రీ పాదక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి తమ తలనీలాలను ఎమ్మెల్యే సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పాదక్షేతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంతో ఈ ప్రాంతం వైభవంగా అభివృద్ది చెందుతుందన్నారు. ఆలయ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారికి 7వారాలు తమ తలనీలాలు సమర్పించ నున్నానని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం శ్రీ వేంకటేశ్వర ఆలయ ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆలయ నిర్మాణంతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రామగుండం నియోజవర్గంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిలేలా స్వామి వారు దివించాలని వేడుకున్నారు. 85 లక్షలతో కొండ పై రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని ఆలయ నిర్మాణానికి స్వామివారి భక్తులు, ప్రజలు భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి ఆముల నారాయణ, నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు ఎన్.వి.రమణరెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు బద్రి రాజన్న, ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...