Followers

మంత్రిని భర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ నిరసన దీక్ష

 మంత్రిని భర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ  నిరసన దీక్ష

బీసీల ఓట్లతో గెలిచి బీసీలనే బర్తరఫ్ చేస్తారా?

ఈటెలను బర్తరఫ్ చేయడం బీసీలను దగా చేయడమే

 జాజుల లింగంగౌడ్

తార్నాక, పెన్ పవర్ 

పంచాయితీ, పార్లమెంటు, మున్సిపల్, అసెంబ్లీ అన్ని ఎన్నికల్లో బీసీల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా మంత్రి వర్గం నుండి బీసీలను బర్తరఫ్ చేసి అవమానిస్తున్నారని, ఈ వైఖరి మానుకోకపోతే టిఆర్ఎస్ పార్టీకి బీసీలు శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. బీసీ బిడ్డ ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి భర్తరప్ చేయడాన్ని నిరసిస్తూ ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర శాతం లేనివాళ్లు, ఐదు శాతం లేని వాళ్ళు అక్రమంగా ఆస్తులు సంపాదించవచ్చు, వందల ఎకరాలు అడ్డగోలుగా పొందవచ్చు,  ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా తరతరాలుగా పాలించవచ్చు గాని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లు మాత్రం ఆస్తులుండి పదవులు పొందితే, అవినీతిపరులుగా,  కబ్జాకోరులుగా ముద్ర వేస్తుండడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.  బీసీ ఎస్సీ ఎస్టీలు అవినీతి పరులైతే మీరు సుద్దపూసలా అంటూ ప్రశ్నించారూ.ఈరోజు అధికారం ఉందని బీసీ మంత్రి అయిన ఈటల రాజేందర్ ను, గతంలో దళిత వర్గానికి చెందిన రాజయ్యను కేసీఆర్ ప్రభుత్వం మెడలు పట్టి బహుజనుల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా క్యాబినెట్ నుండి గెంటివేశారని, ఇది వ్యక్తులను అవమానించడం కాదని ఇది యావత్ 90 శాతం ఉన్న బడుగుల, బహుజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమే అవుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి అగ్రకులాలకు చెందిన ఒక్క మంత్రిని, ఒక్క ప్రజాప్రతినిధిని భర్తరఫ్, సస్పెండ్ లు చేసే దమ్ము లేదని, కేవలం బడుగులను మాత్రమే బలి తీసుకుంటున్నార ని ఇందుకు ఈటల రాజేందర్, రాజయ్యలే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మాదేశి రాజేందర్,బండిగారి రాజు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...