Followers

Showing posts with label POLITICS. Show all posts
Showing posts with label POLITICS. Show all posts

జగనన్న స్వచ్ఛ సంకల్ప అవగాహనా సదస్సు

జగనన్న స్వచ్ఛ సంకల్ప అవగాహనా సదస్సు

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయములో శనివారం జగనన్న స్వచ్ఛ సంకల్ప అవగాహనా సదస్సు  పంచాయతీ కార్యదర్శి వీరన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సులో కొవ్వూరు డిఎల్పీఓ మూర్తి, ఈఓ పిఆర్ అండ్ ఆర్డీ జి.ప్రసాద్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం

 కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం

 ఐరాల,  పెన్  పవర్

మేడే సందర్భంగా  మండల కేంద్రమైన ఐరాల లో ఈరోజు సిఐటియు జనరల్ సెక్రటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు,  భవన నిర్మాణ కార్మికులు,  సంఘమిత్ర రాలు,  ఆశాలు వర్కర్లు,   అంగన్వాడీ వర్కర్లు,  అన్ని కార్మిక సంఘాలనాయకులతో కలసి మేడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

నగర సహాయ కమిషనర్ గా మహేష్

నగర సహాయ కమిషనర్ గా మహేష్ 

చిత్తూరు,  పెన్ పవర్

 చిత్తూరు నగరపాలక సహాయ కమిషనర్ గా జి. మహేష్ ను నియమిస్తూ నగర కమిషనర్ పి.విశ్వనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. నగర సహాయ కమిషనర్ గా ఉన్న శ్రీలక్ష్మి మెడికల్ సెలవుపై వెళ్లారు. దీంతో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా నగరపాలక డీఈఈ గా విధులు నిర్వహిస్తున్న జి.మహేష్ కు నగర సహాయ కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కరప మండలంలో 87 శాతం పింఛన్ల పంపిణీ

 కరప మండలంలో 87 శాతం పింఛన్ల పంపిణీ

 పెన్ పవర్,కరప: 

మండల పరిధిలోని 23 గ్రామాల్లో 10,737 మందికి వివిధ రకాల పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా మొదటిరోజు శనివారం 9,437 మందికి (87.89 శాతం) పంపిణీ చేయడం జరిగిందని ఎంపీడీఓ కర్రె స్వప్న తెలిపారు. అన్నిరకాల పింఛన్లసొమ్ము రూ 2,52,41,500 లు లబ్దిదారులకు బట్వాడా చేయాల్సి ఉండగా రూ.2,19,25,750 లు ఇవ్వడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీలో ఉప్పలంక సచివాలయం 94.29 శాతం, పెనుగుదురు 93.42 శాతం, గొర్రిపూడి 92,67 శాతంతో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నాయన్నారు. కొంతమంది గ్రామంలో లేక, అనారోగ్య కారణాలు, ఇతరత్రా లబ్దిదారులు ఇంటివద్ద అందుబాటులో లేక, సిగ్నల్స్ లేకపోవడం వల్ల నూరుశాతం పంపిణీ జరగలేదని ఎంపీడీఓ తెలిపారు. ఈఓపీఆర్డీ సీహెచ్ బాలాజీవెంకటరమణ పింఛన్ల పంపిణీని పర్యవేక్షించారు. ఒకపక్క కరోనా సెకండ్ వేవ్, మరోపక్క వేసవి ఎండలు ఉదృతంగా ఉన్నా కూడా అధికారులు, గ్రామవలంటీర్లు లబ్దిదారులకు పింఛన్లు పంపిణీచేయడంపై లబ్దిదారులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. అనారోగ్య కారణాలతో కాకినాడ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చినకొత్తూరు గ్రామానికి చెందిన చింతా వీర్రాజుకు గ్రామవలంటీర్ ఎర్రంశెట్టి ఫణికేసరి ఆసుపత్రికెళ్లి ఫించనాసొమ్మును అందజేశారు. గతంలో పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయం వద్ద పడిగాపులు కాచేవారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఆసుపత్రికి వచ్చి పింఛన్ ఇచ్చారని లబ్దిదారుడు వీర్రాజు సంతోషం వ్యక్తంచేశాడు.

పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

 పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

పెన్ పవర్, రావులపాలెం

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే కరోన వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ సభ్యులు డిమాండ్ చేసారు. ఎస్ఎఫ్ఐ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కె.దుర్గాప్రసాద్, కేతా ప్రేమ్ కుమార్ ల ఆధ్వర్యంలో శనివారం శనివారం పరీక్షల రద్దు కోరుతూ రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసిల్దార్  యూసఫ్ జిలానికి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ   రాష్ట్రంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తుందని, ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు గతం కన్నా ఎక్కువ మంది వ్యాపిస్తుందన్నారు.

 రాష్ట్రంలో పదో తరగతి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారని, ఈ నిర్ణయం సరియైనది కాదని అన్నారు. ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసిందని, దాదాపు తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేసాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో పరీక్షలు జరుగుతాయో లేదో అనే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారని, రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉందని అన్నారు.  వీరికి గనక పరీక్షలు నిర్వహిస్తే కరోన వ్యాధి వారికి, వారి కుటుంబాలకు గ్రామాల్లో సైతం వ్యాపించే ప్రమాదం పొంచి ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పరిస్థితుల్లో పదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు వాయిదా వేయాలని  డిమాండ్ చేసారు.  అధికారులకు నాయకులకు కరోన వస్తే పక్క రాష్ట్రాలకు పరుగులు తీసి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో విద్యార్ధులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్షిజన్ లు లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని పరీక్షలు నిర్వహిస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కావున పరీక్షలు వాయిదా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్. సత్యనారాయణ, ఎస్. సందీప్ కుమార్, ప్రసన్న కుమార్, విశ్వతేజ, శ్రీనివాసు, విద్యార్ధులు పాల్గొన్నారు.

మంత్రి వనిత కు 2 వ విడత కోవిడ్ వ్యాక్సిన్

 మంత్రి వనిత కు  2 వ విడత కోవిడ్ వ్యాక్సిన్

తాడేపల్లిగూడెం, పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత శనివారం  తాడేపల్లిగూడెంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ లో భర్త డాక్టర్ తానేటి శ్రీనివాస్ తో 2 వ విడత కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. మంత్రి వనిత మాట్లాడుతూ కరోన సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ప్రతీ ఒక్కరు కరోన నియంత్రణ నిబంధనలు పాటిస్తూ, అవసరమైతే తప్ప మిగిలిన సమయాల్లో బయటకు రాకూడదని తెలిపారు. బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి, మనల్ని, మనకుటుంబాన్ని, మనసమాజాన్ని కరోన నుండి కాపాడుకోవాలని తెలియజేశారు.

అర్హులైన వారికి పింఛనులు మంజూరు

 అర్హులైన వారికి పింఛనులు మంజూరు

పెన్ పవర్, ఆలమూరు 

నూతనంగా మంజూరైన ఇరవై మంది లబ్ధిదారులకు పెన్షన్లు శనివారం గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనువాస్ అందజేశారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పించన్లు మంజూరు చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ సిపి ప్రభుత్వం పని చేస్తుందని సోంత ప్రయోజనాలు చూసుకోకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పేద,బడుగు బలహీన వర్గాల వారికి  మా వైఎస్సార్  పార్టీ  అండగా ఉంటుంది అని తెలియజేసారు అలాగే కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు  ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సత్యనారాయణ, వైసిపి సీనియర్ నాయకుడు అడబాల వీర్రాజు, తమ్మన గోపి,మాజీ సర్పంచ్ వీరవెంకట్రావు, సూరిబాబు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇంటి వద్దే కోవిడ్ టెస్టులు నిర్వహించాలి

ఇంటి వద్దే కోవిడ్ టెస్టులు నిర్వహించాలి

అరకు, పెన్ పవర్

18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి  తెలిసిందే.అయితే, వ్యాక్సిన్‌ తీసుకునేవారు తప్పనిసరిగా కొవిన్‌ వెబ్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందేనని ఉన్నతాధికారులు తెలిపడం జరిగింది.అయితే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ‘వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఒక్కసారిగా డిమాండ్‌ పెరుగుతున్న సందర్భంలో వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద జనాభా తాకిడి ఎక్కువవుతుందని  నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఆదివాసి గిరిజన మారుమూల గ్రామాల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా  ఉంటుందని వారికి ఫోను గాని సిగ్నల్ గాని అందుబాటులో ఉండదని 18 సంవత్సరాల వయసు దాటిన వారందరూ కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్యసేతు యాప్ ద్వారా నమోదు చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా అసౌకర్యంగా ఉంటుందని దీనికోసం బయటకు వెళ్ళినప్పుడు సామాన్యులు కూడా కోవిడ్ బారిన పడే అవకాశం ఉందని కావున విధంగా కాకుండా డైరెక్ట్ గా వారి గ్రామాలకు వెళ్లి వారి ఇళ్ల వద్దే అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని తక్షణమే వారికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇంటివద్దే ఇవ్వాలని ఏపీసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ మరియు అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు.‘కొవాగ్జిన్‌’ టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ.600లకు, ప్రైవేటు ఆస్పత్రులకు ఒక డోసు టీకా రూ.1200 ధరకు ఇస్తుందని. ఎగుమతి ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల (దాదాపు రూ.1100-1500) వరకూ ఉంటుందని. ఇలా ప్రభుత్వాలు కమర్షియల్ గా ప్రజల ప్రాణాలతో వ్యాపారాలు చేసుకోవడం మూర్ఖత్వమని ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో సామాన్య గిరిజన ఆదివాసీ ప్రజలు తమ సొంత డబ్బులు పెట్టి వ్యాక్సిన్ వేయించుకోలేరని దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఆ డబ్బులు భరించి సామాన్య ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని కోవిడ్ టెస్టులు వ్యాక్సిన్ ఉచిత పంపిణీ కై తక్షణమే ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి తగు కార్యాచరణతో చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రిజిస్ట్రేషన్‌ కోసం https://selfregistration.cowin.gov.in/ ప్రజలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కోవిడ్ టెస్టులు చేయించుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె కోరారు.


పరీక్షలు వాయిదా వేయండి...

 పరీక్షలు వాయిదా వేయండి... 


విజయనగరం, పెన్ పవర్

కోవిడ్ కారణంగా 30 మంది ఉండే కేబినెట్ మీటింగ్‌ నే వాయిదా వేసిన వారు 30 లక్షల మంది విద్యార్థులు జీవితాలకు రక్షణ ఎలా కల్పిస్తారు?

ఇంటి నుంచి సెక్ర‌టేరియ‌ట్‌కి అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌, ఆరోగ్య‌ర‌క్ష‌ణ ఏర్పాట్ల మ‌ధ్య వెళ్లి 30 మంది మంత్రుల‌తో దూరంగా ఉండి పాల్గొనే కేబినెట్ మీటింగ్ వ‌ల్లే క‌రోనా సోకుతుంద‌ని జగన్ భ‌య‌ప‌డి వాయిదా వేయించారని , అలాంటిది 15 ల‌క్ష‌ల మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ప‌రీక్ష‌ల నిర్వాహ‌కులు, ఇత‌ర‌త్రా అంతా క‌లిసి 50 ల‌క్ష‌ల‌మందికి పైగా ప‌రీక్ష‌ల కోసం రోజూ రోడ్ల‌మీద‌కు రావాల్సి వుంటుందని, వారికి క‌రోనా సోక‌దా అని మాజీ శాసనసభ్యులు డా.కొండపల్లి అప్పలనాయుడు గారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన పంతం నెగ్గించుకోవడానికి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులతో కలుపుకుని సుమారు 50 లక్షల మందికి పైగా కరోనా బారినపడే అవకాశం ఉందని, కాబట్టి పరీక్ష‌లు వాయిదా వేయాలని డిమాండ్ చేసారు. స్వల్పకాలిక లక్షణాలు ఉన్న విద్యార్థులను ఐసోలేషన్  లో పెట్టి పరీక్షలు రాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం అనాలోచిత చర్యగా కనిపిస్తుందని, వైరస్ సోకిన వారు ఐసోలేషన్ వరకు ఎలా వస్తారని,  వ్యాధి సోకిన వారిని ఇంకెవరైనా పరీక్ష కేంద్రానికి తీసుకుని రావాలని , వారు కూడా కరోనా భారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక కళ్ళముందే అయినవారిని పోగొట్టుకుంటున్నారని, సకాలంలో బెడ్లు దొరక్క రోడ్ల ప్రక్కన, ఆస్పత్రి ఆవరణలో ప్రాణాలు పోతున్న ఘటనలు చూస్తుంటే బాధాకరమని  అన్నారు.


ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు మాస్కులు

 ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు మాస్కులు  

  వి.ఆర్.పురం, పెన్ పవర్  

 వి.ఆర్.పురం మండలం వి ఆర్ పురం గ్రామం లో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ  విగ్రహాలకు వడ్డిగూడెం పంచాయతీ సంబంధించిన సెక్రెటరీ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహాలకు మాస్కులు  కట్టడం జరిగింది. ఈ సందర్భంగా వడ్డిగూడెం పంచాయతీ సంబంధించిన సెక్రటరీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ  మండలంలోని గ్రామాల ప్రజలు చాలామంది   మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. ఆ ప్రజలు విగ్రహాలను చూసి ఇకనైనా మాస్కులు దరి ఇస్తారని అతని అభిప్రాయం. కోవిడ్ విజృంభిస్తున్న  నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వారి వారి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. మనిషి మనిషికి దూరం పాటించాలి. డెటాల్ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పని ఉంటేనే ఇంటి నుండి బయటికి రావాలి. ఈ కార్యక్రమంలో వాలంటరీ వీర్ల శివ భేతి సాయి పంచాయతీ వాలంటరీ లు తదితరులు పాల్గొన్నారు.

కౌన్సిల్లో సమస్యలపై ఏకరువు...!

 కౌన్సిల్లో సమస్యలపై ఏకరువు...!

సామర్లకోట, పెన్ పవర్ 

సామర్లకోట మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన కౌన్సి లమ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉభా జాన మోజెస్ తో సహా ఆధికార పక్ష కౌన్సిలర్లు పలువురు వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఏకరువు పెట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సాధారణ సమావేశం సుమారు మూడు గంటల పాటు సదీర్ఘంగా సాగింది. మొత్తం జీరో అవర్‌గానే సమావేశం కొనసాగగా పట్టణంలోని సమస్యల పై సభ్యులు అధికారులను ప్రశ్నలతో నిలదీయగా కౌన్సిల్ హాలు హోరెత్తింది. సమావేశంలో తొలుత కౌన్సిలర్లు జీరో అవర్‌ను కోరగా చైర్ పర్శన్ దానికి అనుమతినిచ్చారన్నారు. దానితో వైస్ చైర్మన్ జాన మోజెస్ మాట్లాడుతూ పిఠాపురం రోడ్డులో ఏర్పాటు చేస్తున్న లే అవుట్ల యజమానులు ఇరిగేషన్ కు సంబందించిన కాలువలు మూసివేస్తూ లే అవుట్లు చేపడుతున్నట్టు చెబుతూ ఆ లే-అవుట్లకు అలాంటి అనుమతులున్నాయని అధికారులను ప్రశ్నించారు. దానికి కమీషనరు బీఆర్ ఎస్ శేషాద్రి వివరణిస్తూ లే-అవుట్లకు అనుమతులు గుడా ఆద్వర్యంలో జరుగుతున్నట్టు చెప్పారు. అంతా ఆన్ లైనులోనే జరుగుతున్నందున అది మన పరిదిలో లేనందున దాని పూర్తి వివరాలు తమ వద్ద లేవన్నారు. కాగా అయితే లే-అవుట్ల పైన వివరాలు సేకరించి పనులు నిలిపి వేయనున్నట్టు చెప్పారు. అయితే పట్టణంలో ఎన్ని ప్రభుత్వ స్థలాలున్నాయో వివరాలు తెలపాలని వైస్ చైర్మన్ కోరారు. దానికి డిఇ సిమెచ్ రామారావు వివరణిస్తూ వచ్చే సమావేశం నాటికి వివరాలు అందించనున్నట్టు చెప్పారు.  

కాగా సమావేశంలో కౌన్సిలరు నేతల హరిడబాబు మాట్లాడుతూ పట్టా ఇళ్ళకు పన్నులు విధించమని ప్రజలు కోరుతున్నా మున్సిపల్ అదికారులు పన్నులు వేయడం లేదని, దానికి ప్లాన్ అప్రోవల్ కావాలని అడుగుతున్నారని పట్టా గృహాలకు, హౌసింగు పధకంలో నిర్మించుకున్న గృహాలకు ప్లాన్ అప్రోవల్ ఎలా ఉంటాయని ఆయన అధికారులను ప్రశ్నించారు. దానిపై కమీషనరు మాట్లాడుతూ ప్కగా ఇళ్ళకు సంబందించి డాక్యుమెంట్లు ఉంటేనే పన్నులు విధిస్తామన్నారు. కాగా మున్సిపాలిటీలో ఏఏ విభాగాల్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారో వివరాలు తెలపాలని వైస్ చైర్మన్ మోజెస్ కోరారు. దానికి కమీషనరు సిబ్బంది వివరాలను సమావేశంలో తెలిపారు. అలాగే కౌన్సిలరు పితాని కృష్ణ మాట్లాడుతూ వర్షం వస్తే తమ వార్డు మొత్తం మునిగిపోతున్నందున డ్రెయిన్ల ఆధునీకరణ, వంతెన నిర్మాణ పనులను చేపట్టాలని డిమాండ్ చేసారు. దానికి డిఇ రామారావు వివరణిస్తూ 14వ ఆర్థిక నిదులు విడుదల అయ్యాయని త్వరలోనే నూతన డ్రైన్ల నిర్మాణం, వంతెన నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కాగా సమావేశంలోని జీరో ఆవర్ లో కౌన్సిలర్లు యార్లగడ్డ జగదీష్, పాగా సురేష్, చల్లపల్లి శ్రీను, పాగా సురేష్, పాలిక కుసుమచంటిబాబు, పెండ్యాల వెంకటలక్ష్మి, చిట్టిమాని రాఘవ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ వారి వార్డులో ఉన్న సమస్యల పరిష్కారంపై అదికారులకు విన్నవించి వాటిని పరిష్కరించాలని కోరారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగిన సమావేశం అనంతరం అజెండా అంశాలపై చర్చ ప్రారంభం కాగా వాటిలో 13 అంశాలను సభ్యులు ఆమోదించగా వారపు సంత రోడ్డు మార్గంలో ఆశీల వసూళ్ళ అంశాన్ని సమావేశం వాయిదా వేసింది. ఈ సమావేశంలో ఇంకా మున్సిపల్ ఎఇ రాజశేఖర్, శానిటరీ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్, అన్ని శాఖల అధికారులు, అందరు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

ఉచితంగా 20 టన్నుల బ్లీచింగ్ పంపిణీ

ఉచితంగా 20 టన్నుల బ్లీచింగ్ పంపిణీ     

పెన్ పవర్, కందుకూరు

 కందుకూరు నియోజకవర్గంలో కరోనా రెండో దశలో విజృంభిస్తున్న తరుణంలో కందుకూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు, మున్సిపాలిటీకి బ్లీచింగ్, సున్నం పంపిణీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్  రెడ్డి పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ సాటి మనుషులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకారం అందించే భావన తపన, ప్రతి ఒక్క మనిషి లో ఉండాలి అని అన్నారు. కందుకూరు పట్టణం లో 14వ వార్డు కు చెందిన మాధవ పేదవాడు అయినప్పటికీ మంచి మనసుతో, సేవా దృక్పథంతో 50 వేల రూపాయలతో 21 టన్నుల సున్నాన్ని కందుకూరు మున్సిపాలిటీ అందజేశారు. ఈ సందర్భంగా మాధవ కి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం  మండలాల వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థుల అందరూ కలిసి 20 టన్నుల బ్లీచింగ్ ను అందజేశారని అన్నారు. ఇప్పటికే 20 టన్నుల బ్లీచింగ్ ను,  సున్నాన్ని ఉచితంగా అందజేశామని అన్నారు. ఇక నుంచి వచ్చే బ్లీచింగ్ పంచాయితీలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అని అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు  3500 జతల గ్లౌజులు, 150 లీటర్ల శానిటైజర్ ను, ఐదువేల మాస్కులను ప్రభుత్వం ఇచ్చేవి కాకుండా అదనంగా  అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్నీ ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు మాస్కులు, మెడికల్ కిట్లు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఆఫీస్ కి వచ్చి ఉన్నాయని వాటిని రేపు అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు  అందజేస్తామని అన్నారు.


 కరోనా వచ్చిన పేషెంట్లు ఎవరు దయచేసి బయటకు రావద్దుని ప్రభుత్వ డాక్టర్లు  ఇచ్చిన సూచనలు సలహాల మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ ప్రభుత్వం వారిచ్చిన మందులు వాడుకుంటూ ఉండాలని అలా కాకుండా వారు బయటకు వచ్చి వారి ద్వారా జబ్బును మరింత మందికి వ్యాప్తి చేసి సమాజానికి నష్టపరిచే కార్యక్రమం చేయవద్దని వారిని కోరారు. కందుకూరు పట్టణం లో సుమారు 14 మంది, పల్లెటూర్లలో పదిమంది వరకు  మరణించారని, ఎటువంటి అవసరం లేకుండా పల్లెటూర్ల నుంచి కందుకూరు కి రావద్దని అన్నారు. పల్లెటూర్లో కూడా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా ని దరిచేరకుండా చూసుకోవాలి అని అన్నారు.ఇప్పటికే జరగాల్సిన నష్టం 30శాతం జరిగిపోయిందని ఇప్పటినుంచైనా 15 రోజుల వరకూ జాగ్రత్తగా ఉంటే కొంతవరకు కరోనా ని కట్టడి చేయవచ్చు అని అన్నారు. ఒంగోలు రిమ్స్ హాస్పటల్లో సామర్థ్యాన్ని రెట్టింపు చేసినా, అంబులెన్స్లోవేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లో అయితే ఎంత డబ్బులు ఇచ్చినా బెడ్ దొరకట్లేదు అని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఇది గమనించి అనవసరంగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ కరోనా ను కట్టడి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, కందుకూరు, వలేటివారిపాలెం, లింగాసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు మండలాల ఎంపిడివో లు విజయ శేఖర్, రఫీక్ అహ్మద్, మాలకొండయ్య,. వెంకటేశ్వర్లు, రవి కుమార్ తదిరులు పాల్గొన్నారు.

రెండు కోటాల ఉచిత బియ్యం పంపిణీ

రెండు కోటాల ఉచిత బియ్యం పంపిణీ

తవణంపల్లి, పెన్ పవర్

తవణంపల్లె  మండల   కేంద్రం తాసిల్దార్ కార్యాలయం నందు వీఆర్వోలు సమావేశం జరిగింది ఈ సందర్భంగా శుక్రవారం తాసిల్దార్ హనుమంతు మాట్లాడుతూ నేడు 2 కోటాలు 10 కేజీలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని చక్కెర కందిపప్పు కు ఖరీదు చెల్లించాలని తెలియజేశారు వీఆర్వో లు దగ్గరుండి ఉదయం 6 గంటలకు డీలర్ల వద్ద నుండి బియ్యం ట్రక్కుల ద్వారా ఇంటింటికి బియ్యం పంపిణీ చేయాలని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ పద్ధతులు పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వెంకటరమణ . విఆర్వో లు పాల్గొన్నారు.

రాష్ట్రంలో మళ్ళీ ఉచిత బియ్యంతో పేద ప్రజలకు సీఎం అభయం

 రాష్ట్రంలో మళ్ళీ ఉచిత బియ్యంతో పేద ప్రజలకు సీఎం  అభయం 

గుడివాడ, పెన్ పవర్

రాష్ట్రంలో మళ్ళీ ఉచిత బియ్యంతో పేదప్రజలకు సీఎం జగన్మోహనరెడ్డి అభయమిచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. బియ్యం కార్డులున్న కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి 10 కిలోల చొప్పున సార్టెక్స్ స్వర్ణ రకం మధ్యస్థ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మే, జూన్ నెలల్లో ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసి పేదల ఆకలి తీర్చేందుకు దాదాపు రూ. 800 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్ల బియ్యం కార్డులు ఉన్నాయన్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 88 లక్షల బియ్యం కార్డులను మాత్రమే గుర్తించిందన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం 5 కేజీల బియ్యాన్ని మాత్రమే ఇస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించని మరో 59 లక్షల బియ్యం కార్డుల కుటుంబాలకు కూడా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోలకు అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తం 10 కిలోల బియ్యాన్ని కార్డుదారుల్లో ఒక్కో సభ్యుడికి ఉచితంగా అందించనున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది మార్చి 29 వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ఆంక్షలను విధించాయన్నారు. ఈ ఆంక్షల కారణంగా పేదలు ఉపాధికి దూరమయ్యారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి ఉచిత నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గత ఏడాది మార్చి నుండి నవంబర్ నెల వరకు 16 విడతలుగా పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, ఈ పరిస్థితుల్లో కూడా బియ్యం కార్డుదారులను ఆదుకునేందుకు సీఎం జగన్మోహనరెడ్డి రెండు నెలల పాటు బియ్యం కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పేదలకు ఉపాధి తగ్గుతోందని, మరికొందరు పని ఉన్నా బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. పేదలను మరింతగా ఆదుకునేందుకు సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. వచ్చే మే, జూన్ నెలల్లో జరిగే ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బియ్యం కార్డుదారులందరూ వినియోగించుకోవాలని మంత్రి కొడాలి నాని సూచించారు.

జుత్తాడ బాధిత కుటుంబాలకు 12లక్షల చెక్కును అందజేసిన విజయసాయి రెడ్డి

జుత్తాడ బాధిత కుటుంబాలకు 12లక్షల చెక్కును అందజేసిన విజయసాయి రెడ్డి

విశాఖ తూర్పు, పెన్ పవర్

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం,వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వైకాపా జాతీయ కార్యదర్శి,వైకాపా రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అన్నారు. పెందుర్తి మండలం జుత్తాడ హత్యాకాండలో బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరుపున  మృతులు ఒక్కొక్కరికి 2 లక్షలు చొప్పున మొత్తం 12 లక్షల చెక్కును శివజీపాలెం లోని బాధిత కుటుంబ సభ్యుల నివాసంలో  శుక్రవారం ఉదయం అందజేశారు.

 అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఏ1( అప్పలరాజు)ని ఇప్పటికీ పోలీస్ కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. ఏ2 (బత్తిన శ్రీను) హోమ్ గార్డును విధులు నుండి తొలగించి విచారణ  చేపడుతున్నట్లు తెలిపారు. ఏ3, ఏ4 లను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.బాధిత కుటుంబాలకు త్వరిత గతిన న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో నగర మేయర్ గోలగాని వెంకట హరి కుమారి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, నగర వైకాపా పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మేయర్ ను కలిసిన బెహరా

 మేయర్ ను కలిసిన బెహరా

మహారాణి పేట, పెన్ పవర్

మేయర్ ను కలిసిన బెహరా గోపాలపట్నం ప్రజా మాట   విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారిని ఆమె కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు జీవీఎంసీ కోఆప్షన్ మెంబెర్ బెహరా భాస్కరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రోజురోజుకు విజృంభణ కారణంగా వ్యాక్సిన్ పెంచాలని 91మరియు 92 వార్డులలో జరిగే అభివృద్ధి నిధులు పెంచాలని ముఖ్యంగా 91వ వార్డు పరిధి గోపాలపట్నం స్మశానం పనులు వేగవంతం చేయాలని అలాగే వ్యాక్సిన్ డోసులు పెంచి ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కంపర.సత్తిబాబు, వైయస్సార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

79 వ వార్డులో శానిటేషన్

 79 వ వార్డులో శానిటేషన్

గాజువాక, పెన్ పవర్

79 వ వార్డు పరిధి  లంకెలపాలెం లో కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ గ్రామ, వీధుల్లో శానిటేషన్ చేయించారు. కోవిడ్ బాధితులకు  తగు జాగ్రత్తలు సూచించారు. త్వరలో శానిటేషన్ యంత్రము వార్డునకు వస్తుందని వార్డు మొత్తం శానిటేషన్  చేయిస్తానని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లంకెలపాలెం సచివాలయ శానిటేషన్  సెక్రెటరీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

64వ వార్డులో పలు సమస్యలను పరిష్కరించిన దల్లి

 64వ వార్డులో పలు సమస్యలను పరిష్కరించిన దల్లి 

గాజువాక, పెన్ పవర్

విశాఖపట్నం జిల్లా, గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు, మత్స్యకార గ్రామం గంగవరం నుండి పెద్ద గంట్యాడ రోడ్డు మార్గం చుట్టుపక్కల కంచి తప్పులు ఎక్కువగా పెరిగిపోయి రోడ్డుమీదికి వచ్చేయడం వల్ల నిత్యం ప్రమాదాలు జరిగి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 64 వ వార్డు కార్పొరేటర్  దల్లి గోవిందరాజు  గ్రామ ప్రజలు కలిసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరగా జీ.వీ.ఎం.సీ అధికారులతో మాట్లాడి జె.సి.బిని రప్పించి కంచె తుప్పలు తీయించి రహదారి శుభ్రం చేయడం జరిగింది. ఏ సమస్య అయినా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణ పరిష్కారం చేయడంలో ముందున్న  దల్లి గోవిందరాజు  జనసేన నాయకులను ప్రజలు అభినందిస్తున్నారు.

మద్యం దుకాణాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి

 మద్యం దుకాణాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి

మహారాణి పేట, పెన్ పవర్

ప్రజల ప్రాణాల మీద దృష్టిపెట్టాలని,పథకాలమీదకాదని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వానికి హితవుచెప్పారు.శుక్రవారం మీడియాతో అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా పథకాలపేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా ధాటికి అనేకమంది విగతజీవులుగా మారుతున్నా తగిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారన్నారు.ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, మందులు లేక,ఆక్సిజన్ కొరతతో అనేకమంది ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు.మద్యం దుకాణాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయని.కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదని విమర్శించారు.వాక్సిన్ సెంటర్ల వద్ద కూడా సరైన ఏర్పాటు చెయ్యకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లుతెరిచి ప్రజా సమస్యలపై స్పందించాలని కోరారు.పధకాల కంటే ముందు ప్రజల ప్రాణాలు నిలబెట్టేలా వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని సంకు డిమాండ్ చేసారు.

శ్రీ శ్రీ స్పూర్తి తో ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుంటాం....

 శ్రీ శ్రీ స్పూర్తి తో ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుంటాం....

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై జి.వి.ఎమ్.సి వద్ద గత 29 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్ష శిబిరం వద్ద మహాకవి శ్రీశ్రీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముక్యవక్త గా పాల్గొన్న సాహితీస్రవంతి  అధ్యక్షులు ఎన్.రమణాచలం మాట్లాడుతూ శ్రీ శ్రీ ఒక ప్రజా కవి అని, ఆయన మొత్తం ప్రపంచం పీడించే వర్గం పీడింపబడే వర్గం అనే రెండు వర్గాలుగా ఉంది అని అందులో ప్రపంచాన్ని నడిపించేది, సంపద సృష్టికి కారణమయ్యేది పీడింపబడే వర్గమెనని ఆ వర్గం యొక్క అభ్యున్నతి తన లక్ష్యం అని తన కవితల ద్వారా ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఒక కవిగానే కాకుండా ఇక ఎమ్మెల్సీగా కూడా చట్టసభల్లో కార్మిక వర్గం యొక్క వాణిని వినిపించారని తెలియజేశారు. శ్రీశ్రీ లాంటి గొప్ప వ్యక్తి మన విశాఖపట్నంలో జన్మించడం ఎంతో గర్వించదగ్గ విషయమని, ఆయన స్ఫూర్తితోనే ఈ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ 29 వ రోజు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజానాట్యమడలి ప్రధాన కార్యదర్శి గుర్రం రమణగారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులు కాకపోయినా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఈ రోజు దీక్ష శిబిరంలో నిరాహార దీక్షకు కూర్చున్న క్యాబ్ డ్రైవర్లకు అభినందనలు తెలియజేశారు.  సి.ఐ.టి. యు,నగర అధ్యక్షులు ఆర్.కె.ఏస్.వి.కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడం కోసం పోరాటమే శ్రీశ్రీ సరైన నివాళ్ళు విశాఖపట్నం ఉండే అన్ని యూనియన్లు పోరాటంలో భాగస్వాములు అవుతున్నందుకు మన పోరాటం విజయం సాధించే వరకు కొనసాగుతుంది లేదనుకుంటే మెడి గద్ది దింపెవరకు కొనసాగుతుందిఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు,నగర కార్యదర్శి బి.జగన్, ప్రజానాట్య మండలి చంటి,కుమారి క్యాబ్ యూనియన్ నాయకులు శ్రీరాములు,లక్ష్మీ నారాయణ, శీనువాస్‌, అప్పలరాజు,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...