Followers

Showing posts with label EDUCATION. Show all posts
Showing posts with label EDUCATION. Show all posts

మోడల్ స్కూలు అడ్మిషన్ కు గడువు పొడిగింపు

 మోడల్ స్కూలు అడ్మిషన్ కు గడువు పొడిగింపు 

పెన్ పవర్,  మందమర్రి 

కాసిపేట:  కాసిపేట మండలంలోని తెలంగాణ మోడల్ స్కూలు నందు అడ్మిషన్ కొరకు దరఖాస్తు పొడిగింపు జరిగింది అని ప్రిన్సిపల్ అందే నాగమల్లయ్య తెలిపారు. ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఆరవ తరగతి ప్రవేశానికి అలాగే ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆన్ లైన్ ధ్వారా దరఖాస్తు చేసుకోవడానికి  ఈ నెల 8 వ తేదీ అని తెలిపారు. ఈ అవకాశాన్ని  విద్యార్థులు వినియోగించుకోగలరు అని, పరీక్ష ఫీజు ఓపెన్ కేటగిరీకి 150  రూ, ఎస్సీ ,ఎస్టీ ,బిసి విద్యార్థులకు 75 అని రూపాయలు ప్రిన్సిపల్ నాగమల్లయ్య తెలిపారు.

విద్యాలయాలు బలోపేతం చేయడంలో ఎనలేని కృషి

 విద్యాలయాలు  బలోపేతం చేయడంలో ఎనలేని కృషి...

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రంలో విద్యాలయాలు బలోపేతం చేయడంలో ఎనలేని కృషి చేశారని తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో యెల్లారెడ్డిపేటలో మే 1న విద్యావేత్త మంకురాజయ్యగారికి పూలమాల వేసి ప్రగాఢ సంతాపం తెలిపింది. రాజయ్య "మనబడి మనందరి బాధ్యత"కార్యక్రమం  మరియు ఆంగ్లవిద్య ప్రవేశపెట్టి  ప్రభుత్వ విద్యాలయాలు బలోపేతం తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు వాసర వేణి పరుశురాం తెలిపారు. విద్యాభివృద్ధికి చేయడంలో క్రృషిచేశారనీ జ్ఞాపకాలను  నెమరువేసుకున్నారు తెలంగాణ విరసం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం  జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్, ఎం.డి దస్తగీర్, రాములు,రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రయోగాత్మక విద్య ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందుతుంది

ప్రయోగాత్మక విద్య ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందుతుంది

ఏలేశ్వరం, పెన్ పవర్

 కళాశాలల్లో విద్యార్థులు ప్రయోగాత్మక  విద్య ద్వారానే విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందుతుందని ఏలేశ్వరం నగర్ పంచాయతీ చైర్ పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాల్లో భౌతిక శాస్త్ర ప్రయోగశాలను చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యాభ్యాసం సమయంలో  పుస్తకాల్లో చదివిన సిద్ధాంతాలను, అంశాలను ప్రయోగాత్మకంగా ప్రయోగ శాలలో పరిశీలించినపుడు విద్యార్థులకు శాస్త్రీయ విజ్ఞానం పట్ల సుస్పష్టమైన అవగాహన పెరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ వీర్రాజు  మాట్లాడుతూ సిబ్బంది సహకారంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ జిల్లాలో ఉత్తమ కళాశాలగా తీర్చి దిద్దుతానని, కళాశాలకు కాంపౌండ్ వాల్ మంజూరు చేయించాలని కోరారు.విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పబ్లిక్ పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ శిడగం త్రివేణి వెంకటేశ్వరరావు,కౌన్సిలర్ సుంకర హైమావతి, వైస్ ప్రిన్సిపాల్ ఎ. వెంకటరమణ, బి. రామకృష్ణ, కేశవరావు, జి. జానకిరామ్, డాక్టర్.వి.కనకరాజు తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫీజు వసూలుకు 5న వేలం పాట

ఫీజు వసూలుకు 5న వేలం పాట 

 చిత్తూరు, పెన్ పవర్

 చిత్తూరు  నగరపాలక సంస్థకు చెందిన కూరగాయల మార్కెట్, స్లాటర్ హౌస్(జంతు వధశాల), కాసు బ్రహ్మానంద రెడ్డి బస్టాండ్, చేపల చెరువులు సంబంధించి 2021- 22 వ సంవత్సరానికి గాను ఫీజు వసూలు చేసుకొనుటకు ఈ నెల 5వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ పి.విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు  వేలం పాట జరుగుతుందని తెలిపారు. నగరపాలక సంస్థకు చెందిన వివిధ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో ఖాళీగా ఉన్న షాపుల రుసుమును నిర్ణయించిన నెలసరి అద్దె పై వాపసు చేయని గుడ్విల్ పద్ధతి పైన ఈ నెల 5వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటకు సంబంధించిన పూర్తి వివరాలకు కార్యాలయ పని వేళల్లో రెవెన్యూ విభాగం నందు సంప్రదించవచ్చని తెలిపారు.

పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

 పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

పెన్ పవర్, రావులపాలెం

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే కరోన వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ సభ్యులు డిమాండ్ చేసారు. ఎస్ఎఫ్ఐ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కె.దుర్గాప్రసాద్, కేతా ప్రేమ్ కుమార్ ల ఆధ్వర్యంలో శనివారం శనివారం పరీక్షల రద్దు కోరుతూ రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసిల్దార్  యూసఫ్ జిలానికి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ   రాష్ట్రంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తుందని, ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు గతం కన్నా ఎక్కువ మంది వ్యాపిస్తుందన్నారు.

 రాష్ట్రంలో పదో తరగతి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారని, ఈ నిర్ణయం సరియైనది కాదని అన్నారు. ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసిందని, దాదాపు తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేసాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో పరీక్షలు జరుగుతాయో లేదో అనే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారని, రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉందని అన్నారు.  వీరికి గనక పరీక్షలు నిర్వహిస్తే కరోన వ్యాధి వారికి, వారి కుటుంబాలకు గ్రామాల్లో సైతం వ్యాపించే ప్రమాదం పొంచి ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పరిస్థితుల్లో పదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు వాయిదా వేయాలని  డిమాండ్ చేసారు.  అధికారులకు నాయకులకు కరోన వస్తే పక్క రాష్ట్రాలకు పరుగులు తీసి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో విద్యార్ధులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్షిజన్ లు లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని పరీక్షలు నిర్వహిస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కావున పరీక్షలు వాయిదా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్. సత్యనారాయణ, ఎస్. సందీప్ కుమార్, ప్రసన్న కుమార్, విశ్వతేజ, శ్రీనివాసు, విద్యార్ధులు పాల్గొన్నారు.

పరీక్షలు వాయిదా వేయండి...

 పరీక్షలు వాయిదా వేయండి... 


విజయనగరం, పెన్ పవర్

కోవిడ్ కారణంగా 30 మంది ఉండే కేబినెట్ మీటింగ్‌ నే వాయిదా వేసిన వారు 30 లక్షల మంది విద్యార్థులు జీవితాలకు రక్షణ ఎలా కల్పిస్తారు?

ఇంటి నుంచి సెక్ర‌టేరియ‌ట్‌కి అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌, ఆరోగ్య‌ర‌క్ష‌ణ ఏర్పాట్ల మ‌ధ్య వెళ్లి 30 మంది మంత్రుల‌తో దూరంగా ఉండి పాల్గొనే కేబినెట్ మీటింగ్ వ‌ల్లే క‌రోనా సోకుతుంద‌ని జగన్ భ‌య‌ప‌డి వాయిదా వేయించారని , అలాంటిది 15 ల‌క్ష‌ల మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ప‌రీక్ష‌ల నిర్వాహ‌కులు, ఇత‌ర‌త్రా అంతా క‌లిసి 50 ల‌క్ష‌ల‌మందికి పైగా ప‌రీక్ష‌ల కోసం రోజూ రోడ్ల‌మీద‌కు రావాల్సి వుంటుందని, వారికి క‌రోనా సోక‌దా అని మాజీ శాసనసభ్యులు డా.కొండపల్లి అప్పలనాయుడు గారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన పంతం నెగ్గించుకోవడానికి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులతో కలుపుకుని సుమారు 50 లక్షల మందికి పైగా కరోనా బారినపడే అవకాశం ఉందని, కాబట్టి పరీక్ష‌లు వాయిదా వేయాలని డిమాండ్ చేసారు. స్వల్పకాలిక లక్షణాలు ఉన్న విద్యార్థులను ఐసోలేషన్  లో పెట్టి పరీక్షలు రాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం అనాలోచిత చర్యగా కనిపిస్తుందని, వైరస్ సోకిన వారు ఐసోలేషన్ వరకు ఎలా వస్తారని,  వ్యాధి సోకిన వారిని ఇంకెవరైనా పరీక్ష కేంద్రానికి తీసుకుని రావాలని , వారు కూడా కరోనా భారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక కళ్ళముందే అయినవారిని పోగొట్టుకుంటున్నారని, సకాలంలో బెడ్లు దొరక్క రోడ్ల ప్రక్కన, ఆస్పత్రి ఆవరణలో ప్రాణాలు పోతున్న ఘటనలు చూస్తుంటే బాధాకరమని  అన్నారు.


రూ10 లక్షలవిరాళం ప్రకటించిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్

 రూ10 లక్షలవిరాళం  ప్రకటించిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్ 
పెన్ పవర్, కందుకూరు

 కందుకూరు టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు నాక్ ఏ గ్రేడ్ సాధన కొరకు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు కాకినాడ కు చెందిన అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిట్ వారి  కరేడు కు దగ్గర అలగాయపాలెం వద్ద ఉన్న హ్యాచరి మేనేజంగ్ డైరక్టర్   కార్తూరి సత్యన్నారాయణ మూర్తి ఆదేశాల మేరకు సేల్స్ మేనేజర్ సురేంద్ర కుమార్, హ్యాచరి మేనేజర్ ఎ. నాగేశ్వరావు లు శాసన సభ్యులు మహీధర్ రెడ్డి సమక్షంలో పదిలక్షల రూపాయలు కళాశాల అభివృద్ధి కోసం విరాళం ప్రకటించారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు మహీధర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు, నాక్ ఎ గ్రేడ్ సాధించేందుకు  దాతల సహాయ సహకారం తో కళాశాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 

మన ప్రాంతం కానివారప్పటికి మన కళాశాల అభివృద్ధి కి,  పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకరిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేశారు.నాక్  సాధన సమితి సభ్యులు శీలం సుధీర్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకోని వారు, ఈ ప్రాంతం వారు కాని వారు స్పందిస్తున్న తీరు చాలా సంతోషమని, అదేవిధంగాఈ కళాశాలలో చదువుకున్న వారు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అయితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు.అనంతరం దాతల తరుపున వచ్చినవారికి శాసనసభ్యులు మహీధర్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం రవి కుమార్, నాక్ సాధన కమిటీ సభ్యులు శీలం సుధీర్, మంచిరాజు మురళి పాల్గొన్నారు.

ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి 

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

నిరంతరం ప్రభుత్వం అప్పగించిన ఎన్నికల విధులు, పరీక్షల విధులు, నాడు- నేడు విధులు,కరోనా విధులు మొదలైన ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఫోరమ్ ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఫోర్టో)  రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర ఛైర్మన్ కరణం హరికృష్ణ , సెక్రెటరీ జనరల్  సామల సింహాచలం ఒక ప్రకటన లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఇటీవల ఎన్నికల విధులు, పాఠశాల విధులకు హాజరై కరోనా మహమ్మారి కాటుకు బలి అయిన  టీచర్ల కుటుంబాలకు ఏభై లక్షలు సహాయం అందించి, కుటుంబ సభ్యులకు త్వరితగతిన కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అంతే కాకుండా కొన్ని వేల మంది టీచర్లు కరోనా వ్యాధి సోకి ఆసుపత్రుల పాలై ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక కోవిడ్ వైద్య సదుపాయాల కొరకు బెడ్స్ కేటాయించాలని, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫోర్టో రాష్ట్ర ముఖ్య సలహాదారు గాండ్లపర్తి శివానంద రెడ్డి, మీడియా కన్వీనర్ గరికపాటి సురేష్, మహిళా నేత డి. విజయ లక్ష్మి తదితరులు ఉన్నారు.

విద్యార్థులు కు కెరీర్ గైడెన్స్ పుస్తకాలు పంపిణీ

 విద్యార్థులు కు కెరీర్ గైడెన్స్ పుస్తకాలు పంపిణీ

పరవాడ, పెన్ పవర్

గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో 10 తరగతి  మరియు ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు ఎదుగుదలకు ఉపయోగపడే మార్గదర్శకాలను విద్యార్థుల భవిష్య  దిక్సూచి అనే పుస్తకం ను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు లుపిన్ హ్యూమన్ వెల్ఫేర్ & రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా పంపిణీ చేయడం జరిగింది.కోవిడ్  నియమ నిబంధనలను పాటిస్తూ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతీ విద్యార్థి కి వారియొక్క జీవిత లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కెరీర్ గైడెన్స్ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది అని లుపిన్ ఫౌండేషన్ ప్రతినిధి ఎస్. అర్జున  చెప్పారు.10 తరగతి మరియు ఆ పైన చదువుతున్న విద్యార్థులు కు విద్యావకాశాలు మరియు ఉద్యోగావకాశాల కోసం ఈ పుస్తకం ఒక మంచి దిక్సూచి లా ఉపయోగపడుతుందని  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జి. వెంకట రావు చెప్పారు.  ఈ కార్యక్రమాన్ని పరవాడ మండలం లో  గవర్నమెంట్ హై స్కూల్, తానాం, జెడ్ పి హై స్కూల్స్,లంకెల పాలెం,  లేమర్తి మరియు పరవాడ బాయ్స్ & గర్ల్స్ హై స్కూల్  లో 10 వ తరగతి చదువుతున్న  సుమారు  450 మంది  విద్యార్థుల కు కెరీర్ గైడెన్స్ పుస్తకాలు ను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో  తానాం హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ బి. చిట్టిబాబు మాట్లాడుతూ 10 వ తరగతి విద్యార్థుల కు కెరీర్ గైడెన్స్ చాలా అవసరం అని ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవడానికి ఈ విద్యార్థులు భవిష్య దిక్సూచి పుస్తకం చాలా ఉపయోగం అని అన్నారు.హై స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు లుపిన్ ఫౌండేషన్ వారి కృషి ని ప్రత్యేకంగా అభినందించారు.ట్రస్ట్ కార్యదర్శి ఎస్. అచ్చిబాబు మరియు హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆర్. నాగేశ్వరరావు, బి. సురేఖ, పి. కుమారి మరియు ఉపాధ్యాయ సిబ్బంది  పాల్గొన్నారు.

విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

 విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ 

పెన్ పవర్, కురుపాం

కురుపాం మండలం ఉదయపురం ప్రభుత్వ గిరిజనసంక్షేమ  ఆశ్రమ ఉన్నత పాఠశాల లో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పదవ తరగతి చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు కు మరియు నలుగురు టీచింగ్ సిబ్బందికి పాజిటివ్ గా గుర్తుచించారు..వీరిని హోమ్ ఐషాలేషన్ లో ఉంచి వైద్యం అందిస్తున్నారు..దీని తో విద్యార్థులు,తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు..

కోవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాజశేఖర్, నగర పాలిక కమిషనర్

  కోవిడ్ కేర్ సెంటర్ ను  పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాజశేఖర్,  నగర పాలిక కమిషనర్ 

చిత్తూరు,  పెన్ పవర్

కోవిడ్  కేర్ కేంద్రంలో అన్ని సౌకర్యాలతో పాటు వారికి మంచి ఆహారం, భోజన వసతిని కల్పించాలని జాయింట్ కలెక్టర్(ఆసరా), రాజశేఖర్ అన్నారు. చిత్తూరు నగర శివార్లలో ఆర్ వి ఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను ఆయన నగర పాలిక కమిషనర్ విశ్వనాథ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అందుతున్న ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకొన్నారు. 

ఎంతమంది బాధితులు ఉన్నారని అందులో ఎంతమందికి ఆక్సిజన్ ఇస్తున్నారని , ఎంతమంది సిబ్బంది వారికి వైద్యసేవలు అందిస్తున్నారని అడిగారు. అదేవిధంగా ట్రయజ్ కేంద్రం నుంచి పంపుతున్నారా లేదా నేరుగా కోవిడ్ కేంద్రానికి  వైద్యసహయం కోసం వస్తున్నారా అని సిబ్బందిని అడిగారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తో పాటు,నగర పాలక కమిషనర్ విశ్వనాథ, నోడల్ అధికారి రాజేంద్రప్రసాద్, డాక్టర్ శ్రీనివాసులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరిస్తూ ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించండి

  కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరిస్తూ  ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించండి 

చిత్తూరు,  పెన్ పవర్

 మే 5 నుండి 23 వరకు 133 పరీక్షా కేంద్రాల లో జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మీడియెట్ పరీక్షలకు నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు  జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండవ సంవత్సర మరియు వొకేషనల్ కోర్సు పరీక్షలకు హాజరు కానున్న 1,18,303 మంది విద్యార్థులు.కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరిస్తూ ఇంటర్ మీడియెట్ పరీక్షలను పకద్భందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి  ఎం.ఎస్. మురళి ఇంటర్ మీడియెట్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో సమావేశపు మందిరం లో మే 5 నుండి 23 వరకు ఉ. 9 గం.ల నుండి మ. 12 గం.ల వరకు జరిగే ఇంటర్ మీడియెట్ పరీక్షల నిర్వహణ పై పోలీసు, ఆర్టిసి, పోస్టల్ డిపార్ట్మెంట్, మెడికల్, విద్య, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండవ సంవత్సర మరియు వొకేషనల్ కోర్సు పరీక్షలకు 1,18,303 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందులో మొదటి సంవత్సరం 48,731 మంది విద్యార్థులు కాగా, రెండవ సంవత్సరం 69,572 మంది, 133 కేంద్రాలలో పరీక్షల నిర్వహణ జరగనున్నదని, ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ లో కేసులు విజృంబిస్తున్న తరుణంలో ఖచ్చితంగా కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి పరీక్షల నిర్వహణ జరగాలని సూచించారు. 

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్ మీడియెట్ అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఒక రూములో పరిమిత సంఖ్యలో పరీక్షల నిర్వహణ జరగాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించడంతో పాటు స్యానిటైజర్ ను అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలీసు శాఖ వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఇన్విజిలేటర్ల జాబితాను విద్యా శాఖ వారు పంపాలని, పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కొ అధికారులను, పరీక్షల నిర్వహణకు 5 ఫ్త్లెయింగ్ స్క్వాడ్ బృందాలని విద్యా శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులతో కలసి ఏర్పాటు చేయాలని, పరీక్షలు జరుగు రోజున పరీక్ష నిర్వహించే సమయంలో 144 సెక్షన్ అమలు, పరీక్షల కేంద్రాల సమీపంలో గల జిరాక్స్, కంప్యూటర్ సెంటర్లను మూసి వేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీటి వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు.  ఇంటర్ మీడియెట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని డిస్ట్రిక్ట్ ఎగ్జామిన్షన్ కమిటీ వి. శ్రీనివాసులు రెడ్డి డిఆర్ఓ కు వివరించారు. ఈ సమీక్షా సమావేశం లో డిఇసి మెంబర్లు డి. గోపాల్ రెడ్డి, మురళి కృష్ణ, హెచ్ పి సి మెంబర్ వై. వెంకట్ రెడ్డి, డిఎం ఆర్టిసి కిరణ్ కుమార్, ట్రాన్స్ కొ ఇ ఇ అన్వర్ బాబు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిన్నారులకు డ్రాయింగ్ బుక్స్ పంపిణీ

 చిన్నారులకు డ్రాయింగ్ బుక్స్ పంపిణీ

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ర్యాలీ గ్రామంలో అనుస్  స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడపాటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని చిన్నారులకు వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని  వాటర్ బాటిల్స్ కరుణ మహమ్మారి సెకండ్ విజృంభన ఎక్కువగా ఉండటం కారణంగా ప్రభుత్వ పాఠశాలలు  మూత వేయడంతో చిన్నారులకు  సృజనాత్మక నైపుణ్యత పెంపొందించేందుకు డ్రాయింగ్ బుక్ క్రీయన్స్ స్టేషనరీలను   స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద అనుస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతా మోహిత్ అందజేశారు ఈ సందర్భంగా చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ  కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల  ప్రభుత్వ ఆదేశాల ప్రకారం  మీకు పాఠశాలలో సెలవు దినంగా ప్రకటించారు మీరు ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలని ఇందులో నుండి బయటికి రాకూడదని చెప్పడం జరిగినది. 

పీటిజి బాలికల గురుకుల పాఠశాలలో కరోనా పరీక్షలు

 పీటిజి బాలికల గురుకుల పాఠశాలలో కరోనా పరీక్షలు      

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

 గుమ్మలక్ష్మీపురం మండలం, భద్రగిరి ఏపీ గిరిజన గురుకుల బాలికల (పీటిజీ) పాఠశాలలో మంగళవారం కోవిడ్-19 పరీక్షలను నిర్వహించారు. ఈ మేరకు నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాఠశాలలో ఉన్న పదవ తరగతి విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పాఠశాలలో గతంలో ఏడో తరగతి విద్యార్థిని కి కోరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులందరికీ కరోనా పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సి. సత్యేoద్రుడు, పాఠశాల సిబ్బంది నీలకంటాపురం పీహెచ్సీ వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.                     

పదోతరగతి, ఇంటర్మీడియట్ పరిక్షలు రద్దుచేయాలి

 పదోతరగతి, ఇంటర్మీడియట్ పరిక్షలు రద్దుచేయాలి 

 

 పెన్ పవర్, కందుకూరు

 దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంబిస్తున్న వేళ విధ్యార్థిని , విధ్యార్థుల భవిష్యత్తును ధృష్టిలో పెట్టుకుని దేశంలోని కొన్ని రాష్ట్రాలు  పది , ఇంటర్ పరిక్షలు వాయిదా వేసి పిల్లలకు, ఉపాధ్యాయులకు వేసవి సెలవులు ప్రకటిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం విధ్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాటడం మంచిపద్దతి కాదని ప్రభుత్వం అవలంబిస్తున్న మొండివైఖరిపై తెలుగుదేశం పార్టీ యస్.సి సెల్ జిల్లా కార్యదర్శి గోచిపాతల. మోషే మండిపడ్డారు. పదోతరగతి , ఇంటర్మీడియట్ పరిక్షలు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో దాదాపు 80లక్షల మందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తే ఏమాత్రం పట్టించుకోకుండా విధ్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని  మోషే ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అధికమై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం చోధ్యం చూస్తున్నారని మోషే ఆవేదన వ్యక్తంచేశారు. విధ్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పదోతరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలని  మేధావులు , ప్రతిపక్షపార్టీలు , వామపక్షాలు , పిల్లల తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు , విధ్యార్థిసంఘాల నాయకులు ప్రభుత్వంపై వత్తిడి పెంచిన మొండిగా వ్యవహారిస్తున్నారని మోషే ఎద్దేవా చేశారు.

సెయింట్ సావియో పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.

 సెయింట్ సావియో పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.

ఆపత్కాల సాయం జాబితాలో పేరు చేర్చకుండా మోసం.

 టీచర్లు కాని వారిని జాబితాలో చేర్చారు.

బాధితుడు జీవన్ కుమార్ ఆరోపణ

తొర్రూరు , పెన్ పవర్

కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల ను ఆదుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంకై జాబితా రూపకల్పనలో స్థానిక సెయింట్ సేవియో పాఠశాల తనకు మొండిచేయి చూపిందని సదరు పాఠశాల టీచర్ జీవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.సోమవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో తన ఆవేదనను మీడియాకు వెల్లిబుచ్చాడు.ఈ సందర్భంగా జీవన్ కుమార్ మాట్లాడుతూ... ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థలు మూతపడటంతో ప్రత్యామ్నాయ ఉపాధి కరువైన తనలాంటి టీచర్లను ఆదుకునేందుకు ప్రతి నెలా రూ.2 వేల ఆర్థిక సాయాన్ని అందించడంతో పాటు వారి కుటుంబాలకు ప్రతి నెలా 25 కిలోల సన్నబియ్యాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందుకు యూడైస్‌ నమోదును ప్రాతిపదిక తీసుకుందన్నారు.   కాగా తాను గత కొన్నేళ్లుగా పట్టణంలోని సెయింట్ సేవియో పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నానని తెలిపారు.  బోధనా అనుభవం, అన్ని రకాల విద్యార్హతలు కలిగిన తన పేరును సదరు పాఠశాల యూ డైస్ లో నమోదు చేయలేదన్నారు. పాఠశాల నుంచి ఎంపికైన 17 మంది ఉపాధ్యాయుల జాబితాలో ఉన్నత తరగతులకు బోధించే తన పేరు లేకపోవడం శోచనీయమన్నారు.అర్హత ఉన్న తనను కాదని,పాఠశాలకు సంబంధం లేని వ్యక్తులను,  ఉపాధ్యాయులు కాని వారిని ఆపత్కాల సాయం జాబితాలో చేర్చారన్నారు. పాఠశాల వ్యవహారంతో ఈ కరోనా విపత్కర వేళ రూ. 2 వేలు, 25 కిలోల బియ్యం పొందే అవకాశాన్ని కోల్పోయానన్నారు. విద్యా సంస్థలోని హాజరు పట్టికల్లోని ఉపాధ్యాయులు, సిబ్బంది పేర్లతో పాటు వారికి వేతనంగా చెల్లించిన అక్విడెన్స్‌ల నివేదిక సమర్పణ పూర్తిగా తప్పుల తడకగా సమర్పించారని,  తనకు అనుమానం ఉందన్నారు.విద్యాశాఖ అమలు చేస్తున్న యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యూకేషన్‌ (యూడైస్‌) లో  పాఠశాలలో ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల జాబితాను సెయింట్ సేవియో పాఠశాల సమగ్రంగా సమర్పించ లేదని, అర్హత లేనివారికి పేర్లను యూడైస్ లో నమోదు చేశారని, ఆరోపించారు. పాఠశాలల యాజమాన్యం కొద్దిమందినే ఉపాధ్యాయులుగా చూపడం సరికాదన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేయని వారే ఎక్కువ మంది విధుల్లో కొనసాగుతున్నారన్నారు. విపత్కర ఆర్థిక సాయం అందుతున్న పరిస్థితుల్లో ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు  హాజరుపట్టికల ఆధారంగా ఆర్థిక సాయం, రేషన్‌ బియ్యం అందుతాయని ఆశపడ్డారన్నారు. సెయింట్ సావియో పాఠశాల వ్యవహారంపై విచారణ జరిపి, సదరు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరారు. తొలి విడతలో నమోదైన వారికే..ఎంఈఓ గుగులోతు రాము మొదటి విడతలో ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ విధులు నిర్వర్తిస్తూ యూడైస్‌లో నమోదైన వారికి మాత్రమే ప్రతి నెలా రూ. 2 వేల ఆర్థిక సాయం వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఇప్పటికే సమగ్ర వివరాలు రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నివేదించాం. నిబంధనల ప్రకారం యూడైస్‌నే ప్రామాణికంగా తీసుకున్నాం.

ఇంటర్, పది పరీక్షల్లో ఆల్ పాస్ పై ముఖ్య మంత్రి మంచి నిర్ణయం తీసుకోవాలి

 ఇంటర్, పది పరీక్షల్లో ఆల్ పాస్ పై ముఖ్య మంత్రి  మంచి నిర్ణయం తీసుకోవాలి

విజయనగరం, పెన్ పవర్

  దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు,ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్న ఇంటర్ ,పదవతరగతి పరీక్షలు రద్దు చేయడం నూటికి నూరు శాతం శ్రేయస్కరమని విద్యార్థులు,ఉపాధ్యాయులు తమ ఫోరం ఎదుట కన్నీటి పర్యంతమవుతున్నారని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం(సీఆర్పీఎఫ్) జిల్లా కన్వీనర్  సత్తి అచ్చిరెడ్డి అన్నారు,ఫోరం ఆధ్వర్యలో సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పదో తరగతి విద్యార్థుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు,దీనిలో భాగంగా విజయనగరంలోని బాబామెట్ట బాలిక ఉన్నత పాఠశాలను అలాగే రింగు రోడ్డు ప్రాంతంలో ఉన్న మరికొన్ని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడారు,అధిక శాతం మంది విద్యార్థులు ఆల్ పాస్ విధానంలో ఉత్తీర్ణత కల్పించి తమ ఆరోగ్య జీవితాలకు పూర్తి భద్రత కల్పించేలా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున పూర్తి మద్దతును అందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్టు తెలిపారు.

  అనంతరం ఫోరం జిల్లా  కన్వీనర్ సత్తి అచ్చిరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో కోవిడ్ వైరస్ వ్యాప్తి 11 శాతం పాజిటివ్ గా నమోదైందని అన్నారు,అదే వ్యాధి ఈ ఏడాది 20 శాతం నుండి 40 శాతం వరకు పిల్లల్లో వ్యాప్తి చెందిందని డబ్ల్యు.హెచ్.ఒ.అంచనాలు, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు గణాంకాలతో చెబుతున్నారని గుర్తు చేశారు,ఈ పరిస్థితుల్లో గనుక పరీక్షలు నిర్వహిస్తే చాలా మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు అధిక శాతం కోవిడ్ వ్యాధి వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు వీటన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి,విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ల దృష్టికి సత్వరమే తీసుకు వెళుతున్నామని అన్నారు,పిల్లల పక్షపాతియైన ముఖ్యమంత్రి,విద్యా శాఖ మంత్రులు విద్యార్థులందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువరిస్తారన్న ఆశాభావంతో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం  కార్యదర్శి చంద్రిక, గౌరి శంకర్, స్వామి,వేణు తదితరులు పాల్గొన్నారు.

పేరు ఇక్కడ..చదువు అక్కడ

 పేరు ఇక్కడ..చదువు అక్కడ

ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరి విద్యార్థినుల అడ్మిషన్లు
కార్పొరేట్ పాఠశాలలో చదువులు
ఐ.టీ.డీ.ఏ పీఓ దృష్టిలో సమస్య
తక్షణమే విచారణకు ఆదేశం
సమగ్ర విచారణ జరుపుతున్న గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ రాములమ్మ
గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

ఇంట్లో పిల్లలు మారం చేస్తే తల్లితండ్రులు బుద్ధులు చెప్పాలి. ఆ తల్లి తండ్రుల మాట కూడా పిల్లలు వినకపోతే ప్రత్యామ్నాయం ఉపాధ్యాయులు మాత్రమే. కానీ ఈ సంఘటనలో ఆ పిల్లల తల్లితండ్రులు సాక్షాత్తు వారి ఉపాధ్యాయులే అవ్వడం కొసమెరుపు. ఆ పిల్లల విద్యా భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఐఐఐటి సీట్లు కోసం స్వార్ధపూరితంగా వ్యవహరించి ఉపాధ్యాయుల మీద ఉన్న అపార నమ్మకాన్ని వొమ్ము చేసుకున్నారు ఆ ఉపాధ్యాయులు. విద్యార్థులు ఇంట్లో తల్లితండ్రులతో కంటే  పాఠశాలలో ఉపాధ్యాయులతోనే ఎక్కువసేపు గడుపుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. విద్యార్థులందరిని ఒకే విధంగా సొంత బిడ్డలుగా చూసుకునే బాధ్యత  ఉపాధ్యాయులమీద ఉంటుంది. ఆ బాధ్యతతో ఉన్నత విద్యను విద్యార్థులకు అందించడంలో పోటీ పడుతున్న ఉపాద్యాయులు ఎందరో ఉన్నారు. కానీ  గుమ్మలక్ష్మీపురం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో జరిగిన ఘటన దానికి భిన్నంగా ఉంది. 

విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల పిల్లలకు మాత్రమే ఉన్నతంగా చూడాలని అనుకున్నారేమో కానీ బిడ్డిక.భావన, నిమ్మల.సౌజన్య అనే విద్యార్థినిలను బిడ్డిక.చిన్నారావు, నిమ్మల.త్రినాథరావు అనే ఉపాధ్యాయులు వారి పిల్లల పేర్లను  10వ తరగతికి గాను అధికారికంగా గుమ్మలక్ష్మీపురం ప్రాధమిక ఉన్నత  ప్రభుత్వ పాఠశాలలో  నమోదు చేయించి పార్వతీపురం లోని ఒక కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. వారి పిల్లలు పాఠశాలకు హాజరు కాకపోయినా హాజరు పట్టిలో మాత్రం హాజరవుతున్నట్లు చూపిస్తు రోజు పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థులుకంటే అత్యధిక మార్కులు వేసి ప్రభుత్వ త్రిబుల్ ఐటీ సీట్లకు గేలం వేసిన వైనం మండలంలో చోటుచేసుకుంది.అదే తరగతిలో చదువుతున్న తోటి విద్యార్థులకు అడిగితే వారిద్దరూ విద్యార్థినిలు ఎవరో కూడా తెలియదని చెప్తున్నారు. మరి ఇన్నాళ్లు హాజరు పట్టిలో హాజరు ఎలా వేసారో, పరీక్ష మార్కుల పట్టిలో మార్కులను ఎలా వేసారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఐ.టీ.డీ.ఏ ప్రాజెక్ట్ అధికారికి ఎవరో ఫిర్యాదు చేయడంతో తక్షణమే స్పందించిన పీ.ఓ గుమ్మలక్ష్మీపురం తహశీల్దారు రాములమ్మకి విచారణ జరపమని ఆదేశించారు. పీ.ఓ ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరిపిన తహసీల్దారు రాములమ్మ  పీ.ఓ కు సంబంధిత పత్రాలను జతపరచి రిపోర్టును అందచేసినట్లు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థుల తల్లితండ్రులు ఉపాధ్యాయుల చర్యలపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాగోలపల్లిలో బియ్యం, గుడ్లు, చక్కీల పంపిణీ

రాగోలపల్లిలో బియ్యం, గుడ్లు, చక్కీల పంపిణీ

తాళ్లపూడి, పెన్ పవర్

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఈనెల 20వ తేదీ నాటికి పాఠశాలల్లో మిగిలియున్న బియ్యం, గుడ్లు, చిక్కీలను 1 నుండి 9 తరగతుల విద్యార్థులకు సమానంగా పంపిణీ చేయాలని డైరెక్టర్ ఎండిఎం అండ్ స్కూలు శానిటేషన్, ఆంధ్రప్రదేశ్  వారు శుక్రవారం ఇచ్చిన ఆదేశాల మేరకు రాగోలపల్లి ప్రాథమిక పాఠశాలలో  శనివారం బియ్యం, గుడ్లు, చిక్కీలను విద్యార్థులకు పంపిణీ చేశారు. కరోనా ఉధృతి రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం కార్మికులు, ఆయా సాయంతో ఇంటి వద్దకే తీసుకెళ్ళి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు దున్నా దుర్గారావు విద్యార్థులకు, తల్లిదండ్రులకు సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. అర్హత ఉన్న అందరూ టీకా వేయించుకోవాలన్నారు. సెలవులు కొనసాగినంత కాలం ఇంటి వద్ద విద్యార్థులు ఏమేమి చదవాలో, ఎలా చదవాలో వివరించారు. ప్రభుత్వ సరఫరా మేరకు డ్రై రేషన్ పంపిణీ ఇంటివద్దకే సరఫరా చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహోపాధ్యాయులు ఈతకోట సత్యనారాయణ, మధ్యాహ్న భోజనం కార్మికురాలు నీరుకొండ వరలక్ష్మి ఉన్నారు.

పరీక్షల విషయంలో ఎందుకీ మొండి వైఖరి

 పరీక్షల విషయంలో ఎందుకీ మొండి వైఖరి

పెన్ పవర్, రావులపాలెం

దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేనని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి వెంకట సత్యనారాయణరాజు(సతీష్ రాజు) అన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధి అవకాశాలు రావాలంటే సర్టిఫికెట్లలో మార్కులు అవసరం అని, వారు వెనకబడకూడదనే పరీక్షలు నిర్వహిస్తున్నామని జగన్ అంటున్నారని మరి గత ఏడాది  పరీక్షలు లేకుండా పాస్ చేసిన విద్యార్థులకు అన్యాయం జరిగినట్టేనా ఆ విద్యార్థులకు అన్యాయం చేసారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాదనే కరెక్ట్ అనుకుంటే గత ఏడాది విద్యార్థులు ఏం పాపం చేసారన్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పాజిటివ్ కేసులు సాధారణ స్థాయిలో ఉండగా ఆగస్టు నాటికి భారీగా పెరిగాయన్నారు. ఈ ఏడాదితో పోలిస్తే గత ఏడాదే పరీక్షలు పెట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నా కూడా పిల్లల భవిష్యత్తు కోసం పరీక్షలు రద్దు చేసారన్నారు. మరి ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే గత ఏడాది కన్నా రెండింతలు కేసులు అధికంగా నమోదవుతున్న పరిస్థితుల్లో పరీక్షలు ఎలా నిర్వహిస్తారో అర్థం కాని విషయమన్నారు. భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై  సిఎం జగన్ కి ఉన్న ముందు చూపు పరీక్షలు రద్దు చేసిన మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేదా అని ఎద్దేవా చేశారు. పరీక్షలు రద్దు చేయకపోయినా కనీసం వాయిదా వేయాలన్న ఆలోచన కూడా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇంత ఆందోళనకర పరిస్థితుల్లో మే నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చెప్పింది చేస్తే ప్రజల్లో చులకన అవుతామనో, తమ ప్రత్యేకత ఉండదనో రాజకీయంగా ఆలోచిస్తూ మొండిగా పరీక్షలు నిర్వహించి విద్యార్దుల జీవితాలతో చెలగాటం ఆడవద్డని హితవు పలికారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయడం గానీ, కరోనా ఉదృతి తగ్గే వరకూ వాయిదా వేయడం గానీ చేయాలని కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...