Followers

పేరు ఇక్కడ..చదువు అక్కడ

 పేరు ఇక్కడ..చదువు అక్కడ

ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరి విద్యార్థినుల అడ్మిషన్లు
కార్పొరేట్ పాఠశాలలో చదువులు
ఐ.టీ.డీ.ఏ పీఓ దృష్టిలో సమస్య
తక్షణమే విచారణకు ఆదేశం
సమగ్ర విచారణ జరుపుతున్న గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ రాములమ్మ
గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

ఇంట్లో పిల్లలు మారం చేస్తే తల్లితండ్రులు బుద్ధులు చెప్పాలి. ఆ తల్లి తండ్రుల మాట కూడా పిల్లలు వినకపోతే ప్రత్యామ్నాయం ఉపాధ్యాయులు మాత్రమే. కానీ ఈ సంఘటనలో ఆ పిల్లల తల్లితండ్రులు సాక్షాత్తు వారి ఉపాధ్యాయులే అవ్వడం కొసమెరుపు. ఆ పిల్లల విద్యా భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఐఐఐటి సీట్లు కోసం స్వార్ధపూరితంగా వ్యవహరించి ఉపాధ్యాయుల మీద ఉన్న అపార నమ్మకాన్ని వొమ్ము చేసుకున్నారు ఆ ఉపాధ్యాయులు. విద్యార్థులు ఇంట్లో తల్లితండ్రులతో కంటే  పాఠశాలలో ఉపాధ్యాయులతోనే ఎక్కువసేపు గడుపుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. విద్యార్థులందరిని ఒకే విధంగా సొంత బిడ్డలుగా చూసుకునే బాధ్యత  ఉపాధ్యాయులమీద ఉంటుంది. ఆ బాధ్యతతో ఉన్నత విద్యను విద్యార్థులకు అందించడంలో పోటీ పడుతున్న ఉపాద్యాయులు ఎందరో ఉన్నారు. కానీ  గుమ్మలక్ష్మీపురం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో జరిగిన ఘటన దానికి భిన్నంగా ఉంది. 

విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల పిల్లలకు మాత్రమే ఉన్నతంగా చూడాలని అనుకున్నారేమో కానీ బిడ్డిక.భావన, నిమ్మల.సౌజన్య అనే విద్యార్థినిలను బిడ్డిక.చిన్నారావు, నిమ్మల.త్రినాథరావు అనే ఉపాధ్యాయులు వారి పిల్లల పేర్లను  10వ తరగతికి గాను అధికారికంగా గుమ్మలక్ష్మీపురం ప్రాధమిక ఉన్నత  ప్రభుత్వ పాఠశాలలో  నమోదు చేయించి పార్వతీపురం లోని ఒక కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. వారి పిల్లలు పాఠశాలకు హాజరు కాకపోయినా హాజరు పట్టిలో మాత్రం హాజరవుతున్నట్లు చూపిస్తు రోజు పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థులుకంటే అత్యధిక మార్కులు వేసి ప్రభుత్వ త్రిబుల్ ఐటీ సీట్లకు గేలం వేసిన వైనం మండలంలో చోటుచేసుకుంది.అదే తరగతిలో చదువుతున్న తోటి విద్యార్థులకు అడిగితే వారిద్దరూ విద్యార్థినిలు ఎవరో కూడా తెలియదని చెప్తున్నారు. మరి ఇన్నాళ్లు హాజరు పట్టిలో హాజరు ఎలా వేసారో, పరీక్ష మార్కుల పట్టిలో మార్కులను ఎలా వేసారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం ఐ.టీ.డీ.ఏ ప్రాజెక్ట్ అధికారికి ఎవరో ఫిర్యాదు చేయడంతో తక్షణమే స్పందించిన పీ.ఓ గుమ్మలక్ష్మీపురం తహశీల్దారు రాములమ్మకి విచారణ జరపమని ఆదేశించారు. పీ.ఓ ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరిపిన తహసీల్దారు రాములమ్మ  పీ.ఓ కు సంబంధిత పత్రాలను జతపరచి రిపోర్టును అందచేసినట్లు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థుల తల్లితండ్రులు ఉపాధ్యాయుల చర్యలపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...