Followers

Showing posts with label EDUCATION. Show all posts
Showing posts with label EDUCATION. Show all posts

పేద విద్యార్ధులకోసం ఉన్నత ప్రమాణాలతో ఓ స్కూలు ను త్వరలోనే ప్రారంభిస్తాను

 పేద విద్యార్ధులకోసం ఉన్నత ప్రమాణాలతో ఓ స్కూలు ను త్వరలోనే ప్రారంభిస్తాను

రాజమహేంద్రవరం, పెన్ పవర్

నిరుపేద విద్యార్థిని విద్యార్థుల కోసం  త్వరలోనే తానొక   ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఓస్కూలు ను ఫ్రీప్రైమరీ నుంచి ఏడవ తరగతి వరకూ ప్రారంభించబోతున్నట్టు రాజమండ్రి నగర వైస్సార్ సిపీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ తెలిపారు.కోరుకొండ సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం లాంటి విద్యాసంస్థలలో  ప్రవేశాలకు అర్హతలు సాధించేలా విద్యార్ధులను తీర్చిదిద్దాలనే సంకల్పం తో స్కూలు ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్టు ఆయన చెప్పారు.శనివారం ఉదయం ఏ.కే.సీ.కాలేజీ పరిసరప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఏ.కే.సీ.కాలేజీ అనుకుని కొత్తగా వేసిన డబల్ రోడ్డుకు చేర్చివున్న మునిసిపల్ పార్కులో ఉదయాన్నే అనేక మంది మోర్నింగ్ వాకింగ్ చేస్తున్నారు. 

ఆ పార్కును డాక్టర్ ఆకుల సందర్శించారు. అయితే పార్కులో వాకింగ్ ట్రాక్ పాడై,  పార్కు అంతా అపరిశుభ్రంగా ,పాడైపోయి వుండటాన్ని పరిశీలించారు. స్థానికులు, అక్కడ వాకింగ్ చేస్తున్నప్రజలు పార్కును అభివృద్ది చేయాలని , అపరిశుభ్రతను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన  మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల తమ సొంత ఖర్చుతో పార్కును ముందుగా శుభ్రం చేయిస్తానని వాకర్స్ కు హామీ ఇచ్చారు.  విశాలమైన స్థలంలో చెట్లనీడలో వున్న ఈ పార్కును చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు, పిల్లలకు  ఆహ్లాదకరమైన పార్కుగా, వాకర్స్ కు  ఉపయోగపడేలా  అభివృద్ది చేస్తామని ఆయన చెప్పారు.  ఈ సందర్భంగా పార్కు వద్దకు వచ్చిన నందీశ్వరీ అనే వాలంటీర్ తాను  ఈ వార్డు వాలంటరీనని చెప్పి డాక్టర్ ఆకులను పరిచయం చేసుకున్నారు. 

ఏం చదువు కొన్నావని ఆమె ను డాక్టర్ ఆకుల అడిగారు.  ఆని అడిగినారు.. పిజీ యం ఎస్పి చేశానని, డిగ్రీ లో గోల్డ్ మెడలిస్ట్ సాధించానని నందీశ్వరి చెప్పారు. తాను తన  తల్లి కలిసి వుంటున్నామని కుటుంబ వివరాలు చెప్పిన నందీశ్వరిని ఆమె ఆర్థికపరిస్థితులు గురించి తెలుసుకున్నారు.వెంటనే డాక్టర్ ఆకుల సత్యనారాయణ  వాలంటీర్ నందీశ్వరి ఇంటికి వెళ్లి వారి అమ్మగారిని పలకరించారు. అప్పులు వల్ల తమ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా వుందని నందీశ్వరి తల్లి చెప్పడంతో.. డాక్టర్ ఆకుల స్పందించి వారికున్న రెండు  లక్ష రూపాయలు బయట అప్పులు,60 వేల  గోల్డ్ లోన్ తీర్చేందుకు తాను ఆర్ధికసాయం అందిస్తానని డాక్టర్ ఆకుల హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ నిరు పేద విద్యార్థిని విద్యార్థుల కోసం  త్వరలోనే తానొక   ఉన్నత ప్రమాణాలతో స్కూలు ను ఫ్రీప్రైమరీ నుంచి ఏడవ తరగతి వరకూ ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.


కోరుకొండ సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం ఇలాంటి స్కూల్స్ ప్రవేశాలకు  అర్హతలు సాధించేలా   విద్యార్ధులను తీర్చిదిద్దాలనే సంకల్పం వుందన్నారు. అలాగే పేద కుటుంబం లో అభ్యర్ధులు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్  ప్రిపేర్ కావడానికి ప్రైవేట్ గా కోచింగ్ తీసుకోవడానికి   ఆర్థిక పరిస్థితులు సహకరించక చదవలేకపోతున్నారని, అటువంటివారిని కూడా చదివించేలా ఓ కార్యక్రమం చేపడతామని డాక్టర్ ఆకుల ఈ సందర్భంగా అన్నారు. విద్యార్హతలకు అనుగుణంగా తాను స్థాపించబోయే విద్యాసంస్థలో్ వాలంటీర్ నందీశ్వరికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇస్తానని డాక్టర్ ఆకుల హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు  మాజీ కార్పొరేటర్ కంచుమర్తి చంటి తదితరులు పాల్గొన్నారు.  అనంతరం ఏ.కే.సీ.కాలేజ్ డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ కాలేజీ వద్ద కోవిడ్ తీవ్రత తరుణంలో పరీక్షలు నిర్వహణ గురించి ఆరా తీశారు. కాలేజీ సిబ్బందిని,కాలేజీ బయట వున్న విద్యార్ధులతో మాట్లాడి కరోనా వల్ల ఇబ్బందులు వస్తున్నాయని,భౌతిక దూరం పాటించాలని,మాస్క్ లు ధరించాలని,తగినజాగ్రత్తలు పాటించాలని  సూచించారు.

పాయల గేయాన్ని తెలుగు పాఠ్య పుస్తకం మొదటి పాఠంగా ప్రచురణ

  పాయల గేయాన్ని తెలుగు పాఠ్య పుస్తకం మొదటి పాఠంగా ప్రచురణ

మెంటాడ, పెన్ పవర్ 

విజయనగరం జిల్లా, సాలూరు నియోజకవర్గం, మెంటాడ మండలం, మెంటాడ  గ్రామానికి చెందిన పాయల సత్యనారాయణ రాసిన వాన అనే గేయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా తయారు చేయించి ముద్రించిన రెండవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం మొదటి పాఠంగా ముద్రించారు. పాయల నారాయణ హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పటికీ,  ఆయనకు తెలుగు అంటే ఎంతో ఇష్టం. ఆయన తెలుగులో అనేక గేయాలు రాశారు. వీటిలో చాలా వరకు ముద్రించారు.  పాయల సత్యనారాయణ మెంటాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ఇదే పాఠశాలలో పదవీ విరమణ పొందారు. పాయల సత్యనారాయణ రాసిన బాల రసాల కు 2004వ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అవార్డ్ వచ్చింది. 

ఈయన బాలసాహిత్యంలో గేయాలు రాయడంలో దిట్ట. ఆయనకు చైతన్య భారతి సంస్థ బాల భాను అనే బిరుదుతో సత్కరించింది. సద్గురు శతకం, ఆట పాట, చిట్టి పాప చెప్పుకో చెప్పుకో కవి పేరు చిట్టి పాప, బాల రసాల, మరో పిలుపు, వెన్నెల బుజ్జాయిలు మొదలైన పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం చిగురాకుల అనే పుస్తకాన్ని అతని కుమారుడు మురళీకృష్ణ ముద్రించే పనిలో ఉన్నారు. ఆ పుస్తకంలోని గేయాన్నే ఇప్పుడు పాఠ్య పుస్తకంలో ప్రచురించారు.  పాయల సత్యనారాయణ రాసిన రెండో తరగతిలో తెలుగు పాఠ్య పుస్తకంలో మొదటి పాఠం లో ముద్రించిన వాన గేయం.

నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ

నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ

లక్షెట్టిపెట్, పెన్ పవర్

హైదరాబాద్ కి  చెందిన మలాకీ బూల్య వారి ఆర్థిక సహాయంతో పట్టణంలో న్యూ లైఫ్ ప్రేయర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా  సైకిళ్లను శుక్రవారం బొడ్డు రవిజోషాప్ అందజేశారు. ఈ సందర్భంగా న్యూ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు రవిజోషప్ మాట్లాడుతూ విద్యార్థులు చదువు కోసం కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే చదువుకోవడం చూసి చలించి పోయిన ఈ సంస్థ వారు వీరికి ఎలాగైనా సాయం చేయాలని  ఆర్థిక ఇబ్బందులను గమనించి ఉచితంగా సైకిళ్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బైరం లింగన్న రాపల్లి కమలాకర్ ఫోటో స్టూడియో అధ్యక్షుడు గంధం సత్యనారాయణ ఆర్ఎంపీ వైద్యుడు సంతపురి రాజు, తగరపు సత్తయ్య ప్రభుదాస్ చరణ్ సుస్మిత మేరీ పుష్ప తదితరులు పాల్గొన్నారు.

టిఆర్ఆర్ కళాశాల అభివృద్ధికి వితరణ

 టిఆర్ఆర్ కళాశాల అభివృద్ధికి వితరణ

పెన్ పవర్, కందుకూరు 

పట్టణంలోని టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మౌలిక వసతుల అభివృద్ధికి 1980- 83 పూర్వ విద్యార్థి గట్టమనేని వెంకటేశ్వర్లు కుమారుడు రాజేష్ ద్వారా 5 వేల రూపాయలు సాధన సమితి సభ్యులు మంచి రాజు మురళీమోహన్ కు  శుక్రవారం అందజేశారు. వెంకటేశ్వర్లు కు సాధన సమితి తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టమనేని హరిబాబు కూడా ఉన్నారు.

విద్యార్థులకు, తల్లిదండ్రులకు కరోనా రాదని గ్యారంటీ ఇవ్వగలుగుతారా?

 విద్యార్థులకు, తల్లిదండ్రులకు కరోనా రాదని గ్యారంటీ ఇవ్వగలుగుతారా?

పెన్ పవర్ , రావులపాలెం

కరోనా సెకెండ్ వేవ్ ఉదృతి దృష్ట్యా చాలా రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసినప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం యధావిధిగా జరుపుతామని మొండి వైఖరి ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విద్యార్థులకు, తల్లిదండ్రులకు కరోనా రాదని గ్యారంటీ ఇవ్వగలుగుతారా అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు సత్యానందరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన రావులపాలెంలో మాట్లాడుతూ జగన్ రెడ్డి మొండి వైఖరితో విద్యార్థుల చదువులు, పరీక్షల సంగతి దేవుడెరుగు అసలు వారి జీవితాలే పరీక్షలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నా పరీక్షలు నిర్వహిస్తానని తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లులా తప్పుడు విధానాలతో విద్యార్థుల భవిష్యత్తును సిఎం జగన్ అంధకారంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్  చాలా ఉధృతంగా ఉన్న కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు కానీ, వాయిదా కానీ వేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం  పెడచెవిన పెడుతోందని అన్నారు. దాదాపు 15 లక్షల మంది పదోతరగతి, ఇంటర్  విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే ఆయా కుటుంబ సభ్యులను కూడా కలిపితే 75 లక్షల మందిపై కరోనా ప్రభావం చూపే అవకాశం ఉందని, వారితో పాటు  మరో 30 వేల మంది ఉపాధ్యాయులు ఉంటే, వారిలో కుటుంబానికి 5గురు చొప్పున లక్షా 50 వేల మంది ఉంటారని,  డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు మరో 3.50 లక్షల మంది ఉంటారని మొత్తంగా ఈ పరీక్షల నిర్వహణ వల్ల దాదాపు 80 లక్షల మంది కరోనాకు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. గత రెండు రోజుల్లో 29 మంది కరోనాతో మరణించారని, ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారని రాష్ట్రంలో నేడు నెలకొని ఉన్న పరిస్థితికి ఇదే నిదర్శనం అన్నారు. దేశంలోని తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారని  మధ్యప్రదేశ్, బీహార్, ఒడిస్సా , ఉత్తరప్రదేశ్, చత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేశారని ఆయన గుర్తు చేశారు. సాక్షాత్తు కేంద్రమే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ పరీక్షలు కూడా రద్దు చేసిందని, జేఈఈ, నీట్ వంటి ఇతర పోటీ పరీక్షలు కూడా వాయిదా వేశారని స్పష్టం చేశారు. రాజమండ్రిలోని ఒక కళాశాలలో 150 మంది విద్యార్థులకు ఒకేసారి కరోనా వచ్చిందని, విజయవాడలో ఓ మున్సిపల్ పాఠశాల ప్రిన్సిపాల్ కు కరోనా వచ్చిందని, అక్కడ 128 విద్యార్థులు ఉండడంతో ఆయా తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. హాస్టళ్ల లోనూ కరోనా విస్తరిస్తోందని వాటిని కూడా మూసివేయాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ విషయంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉందని, ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు పది, ఇంటర్ పరీక్షలు కనీసం వాయిదా వేయాలని, అవసరమైతే పరీక్షలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కరోనా సెకెండ్ వేవ్ ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా జగన్ ప్రభుత్వం స్పందించి విద్యార్థులు, తల్లిదండ్రుల కోరిక మేరకు పది, ఇంటర్ పరీక్షలు కనీసం వాయిదా వేయాలని, అవసరమైతే పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అనంతకుమారి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులకు కరోనా రాదని జగన్ రెడ్డి గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఎందుకు పరీక్షలను రద్దు చేయడం లేదని ప్రశ్నించారు.

పిల్లల ఆరోగ్యం దృష్ట్యా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

 పిల్లల ఆరోగ్యం దృష్ట్యా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి

విజయనగరం,  పెన్ పవర్

 కోవిడ్‌-19 వైర‌స్‌ ఫస్ట్ వేవ్ కంటే, సెకండ్‌వేవ్‌ బాధితుల్లో చిన్నారులు, విద్యార్థులు ఎక్కువ‌గా ఉండ‌టం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని  బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంద‌ని, కాబట్టి టెన్త్‌, ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు, ఇంట‌ర్ సెకండియ‌ర్ వాయిదా వేయాలని మాజీ శాససభ్యులు డా. కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. మన రాష్ట్రంలో 24 శాతం పాజిటివిటీ రేట్ ఉండటం తీవ్ర‌త‌కు అద్దం పడుతోంద‌న్నారు. గ‌తేడాది ప్ర‌పంచ‌వ్యాప్తంగా పిల్ల‌ల‌కు కోవిడ్ వైర‌స్ వ్యాప్తి 11 శాతం అని, ఈ ఏడాది 20 నుంచి 40 శాతం వ్యాప్తి చెందింద‌ని ప్ర‌ముఖ చిన్న‌పిల్ల‌ల వైద్యులు డాక్ట‌ర్ సంజీవ్ బ‌గాయ్ చెప్ప‌డం ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా వుంద‌ని తేలుతోంద‌న్నారు. మ‌న రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ కలిపి 15 లక్షల మంది పిల్లలు పరీక్షలు రాయాల్సి వుంద‌ని, వీరి కుటుంబాలతో 75 ల‌క్ష‌ల మంది, 30 వేల మంది ఉపాధ్యాయులు, వారి కుటుంబాలతో క‌లిసి 50 వేల మంది, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌నిచేసే ఇత‌ర సిబ్బంది  3.5 ల‌క్ష‌ల మంది క‌లిపి దాదాపు కోటి మంది క‌రోనా బారిన‌ ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ 50 మంది ఉపాధ్యాయులు చ‌నిపోయారని పేర్కొన్నారు. ఈ క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో  ల‌క్ష‌ల మంది ప్రాణాలు ప‌ణంగా పెట్టి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డాన్ని అన్నివ‌ర్గాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయ‌న్నారు. సచివాలయంలో అనేక మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డార‌ని, అలాంటిది వేల పరీక్షా కేంద్రాల్లో జాగ్ర‌త్త‌లు ఎలా తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు. విద్యార్థుల‌కు, వారి త‌ల్లిదండ్రుల‌కు కరోనా రాదని ముఖ్యమంత్రి గ్యారెంటీ ఇవ్వగలగుతారా? అని  ప్ర‌శ్నించారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించి విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌టం ముఖ్య‌మంత్రికి త‌గ‌ద‌ని సూచించారు. విద్యార్థుల భ‌ద్ర‌త‌ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని సీబిఎస్ఈ, ఐఎస్ సీఈ  ర‌ద్దు చేసిన కేంద్రం  ఉద్యోగ భ‌ర్తీ, ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింద‌ని, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, పంజాబ్‌, హ‌ర్యానా, జ‌మ్మూ అండ్ కాశ్మీర్‌, త‌మిళ‌నాడు, ఉత్త‌రాఖండ్‌, ఢిల్లీ రాష్ట్రాలు బోర్డు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశాయ‌న్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, రాజ‌స్తాన్‌, ఒడిశా, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ బోర్డులు టెన్త్ ప‌రీక్ష‌లు వాయిదా వేసుకున్నాయ‌న్నారు. అన్ని రాష్ట్రాలూ ఇంట‌ర్ సెకండియ‌ర ప‌రీక్ష‌ల్ని వాయిదా వేసుకున్నాయ‌ని, ఏపీ మాత్ర‌మే ఎందుకు ఇంత మొండిగా వ్య‌వ‌హ‌రిస్తుందో ఎవ్వ‌రికీ అర్థంకాలేద‌న్నారు. నిన్న తల్లిదండ్రుల  అభిప్రాయాల‌ను తెలియ‌జేసేందుకు నారా లోకేష్ గారు ప్ర‌క‌టించిన వాట్స‌ప్ నెంబ‌ర్‌కి  9444190000కి  సీబిఈes2021  మెసేజ్‌లు ల‌క్ష‌ల్లో చేరాయి. ప్ర‌క‌టించిన నిమిషాల్లోనే విద్యార్థులు 1.17 ల‌క్ష‌ల సందేశాలు వ‌చ్చాయి. ఒకేసారిగా ల‌క్ష‌ల మంది విద్యార్థులు వారి త‌ల్లిదండ్రులు వాట్స‌ప్ నెంబ‌ర్‌కి మెసేజ్‌లు చేయ‌డంతో సెక‌నుకు 10 మంది సందేశాలందుకునే స‌ర్వ‌ర్ మొరాయించింది. వెంట‌నే టెక్నీషియ‌న్స్ స్పందించి అద‌న‌పు ఏర్పాట్లు చేయాల్సి వ‌చ్చిందని అన్నారు. పరీక్షలు రద్దు చేయాలని నారా లోకేష్ గారితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు, తల్లిదండ్రులు ఉద్యమం చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయటానికి ధూళిపాళ్ల నరేంద్ర గారిని అరెస్ట్ చేశారని, 70ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న కుటంబం, 45 ఏళ్లుగా సంగం డైరీని అత్యధిక లాభాలతో నడుపుతూ రైతులకు బోనస్సులు ఇస్తున్నారన్నారు. ఆముల్ లాంటి గుజరాతి సంస్థకు పాలు దోచివ్వలని జగన్ రెడ్డి చూస్తున్నారని, దాన్ని అడ్డుకొని రైతుల మద్దతుతో నరేంద్ర గారు  నిలబడటాన్ని చూసి తట్టుకోలేక ఈ అరెస్టులని అన్నారు.


పి. సి. సి /పి. వి. సి సర్టిఫికెట్లు ఇక నుండి ఆన్ లైన్ లో పొందవచ్చు.

 పి. సి. సి /పి. వి. సి సర్టిఫికెట్లు ఇక నుండి ఆన్ లైన్ లో పొందవచ్చు. 

మంచిర్యాల, పెన్ పవర్

ప్రజలు లేదా సంస్థలు పి సి సి (పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ), పి వి సి (పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్) గురించి ఇకనుండి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి, పోలీస్ స్టేషన్లకు, లేదా మీ సేవకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్ లో అప్లై చేయడం కోసం కొత్తగా తెలంగాణ స్టేట్ పోలీస్ అధికారిక వెబ్  సైట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన i-verify  అనే  సేవలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారు ప్రారంభించారని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ గారు పత్రికా ప్రకటనలో తెలిపారు.  రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వివిధ సంస్థలలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం పొందడానికి లేదా విదేశాలకు వెళ్లడానికి లేదా విదేశాలలో ఉద్యోగాలు పొంది ఆయా సంస్థల లో చేరడానికి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్/ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ లు ఆయా సంస్థలు అడుగుతుంటారు. ఈ సర్టిఫికెట్లను   పొందడానికి ఇంతకుముందు వరకు జిల్లా పోలీస్ కార్యాలయాలకు రావాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ప్రారంభించిన ఈ సేవల ద్వారా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అవసరమైన ఏ వ్యక్తి అయినా తెలంగాణ స్టేట్ పోలీస్ అధికారిక వెబ్సైట్ pvc.tspolice.gov.in ఓపెన్ చేసి అందులో యూజర్ గైడ్ ఓపెన్ చేసి చదువుకొని ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో నే నేరుగా ఆన్లైన్ ద్వారా చాలాన్ పేమెంట్ చేసే వెసలుబాటు కల్పించబడింది. అప్లికేషన్  సంబంధిత కమిషనరేట్ యూనిట్కు వెళ్తుంది వారు వెరిఫై చేసిన తర్వాత మీరు కోరిన విధంగా స్పీడ్ పోస్ట్ లేదా, నేరుగా మీకు అప్పగించబడిన అప్లైచేసిన తర్వాత తమ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ సేవలను అవసరమైన అందరు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామగుండం కమిషనర్ వి.సత్యనారాయణ   ఐపీఎస్ తెలిపారు.

ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలి

 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలి 

 తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్


 
తార్నాక,  పెన్ పవర్

ప్రైవేట్ టీచర్స్ కి ఏవిధంగానైతే నెలకి రెండు వేల రూపాయలు 25 కిలోల బియ్యం ఇస్తున్నారు.  అదేవిధంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చేసినటువంటి లెక్చరర్స్ కి కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్టా శేఖర్ కోరారు. డిగ్రీ కాలేజ్ సెమిస్టర్ సిస్టం వచ్చిన తర్వాత ప్రైవేటు యాజమాన్యాలు చాలా దోపిడికి గురి చేస్తున్నాయి ఒక నెలలో సిలబస్ మొత్తం చెప్పించుకుని పంపిస్తున్నారు అవసరమైతే ఇంకా 10 రోజులలోనే  సిలబస్ కంప్లీట్ చేయమని చెబుతున్నారని, దీని వలన మేనేజ్మెంట్ లకు లాభం చేకూరుతుంది కానీ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు  ఇచ్చిన విధంగా ప్రవేట్ లెక్చరర్స్ కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని  దీనిపైన అధికారులు ఆలోచించి ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే జీతభత్యాలను చూసి, ప్రభుత్వం ఆదుకోవాలని  డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ లెక్చరర్స్ కోరారు.

పాఠశాల ఉపాధ్యాయులను పక్కనపెట్టి బంధువులను ఎంపిక చేసిన ఆర్యభట్ట హైస్కూల్ కరస్పాండెంట్

 పాఠశాల ఉపాధ్యాయులను పక్కనపెట్టి బంధువులను  ఎంపిక చేసిన ఆర్యభట్ట హైస్కూల్ కరస్పాండెంట్

తొర్రూరు, పెన్ పవర్

మహబూబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్యభట్ట హైస్కూల్ లో 11 ఏళ్ళుగా ఉపాధ్యాయులుగా పని చేస్తున్న తమ పేర్లు తొలగించి, పాఠశాల కరస్పాండెంట్ నెలకుర్తి మధుకర్ రెడ్డి ఆయన బంధువుల పేర్లను ఆపత్కాల సమయం పథకంలో చేర్చి తమకు అన్యాయం చేశాడని, అబ్బోజు సదావేణు, మమునురి విజయ్ కుమార్, బైరు శ్రీనులు ఆరోపించారు. గురువారం డీఈఓ, కలెక్టర్ కార్యాలయంలో ఆర్యభట్ట నిర్వాహకులపై పిర్యాదు చేసిన అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ...కరోనా విజృంభిస్తున్న వేళ పాఠశాలలు మూసేయడం వల్ల ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అపత్కల సాయంగా 2000 రూపాయలు, 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలని, నిర్ణయించిందని అన్నారు. 2009 సంవత్సరం నుంచి ఆర్యభట్ట హై స్కూల్ లో అంకితభావంతో పని చేసిన తమ పేర్లు పక్కనబెట్టి, ఉపాధ్యాయ శిక్షణ పొందని, యాజమాన్యం బంధువులు అయినా మిరియాల కరుణాకర్ రెడ్డి, ఎస్. మధుసూదన్ రెడ్డి ల పేర్లు పథకానికి ఎంపిక చేశారని, ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంను, అధికారులను మోసం చేసి అర్హులైన తమకు అన్యాయం చేశారని, అన్నారు. దీంతో తనకు మరణమే శరణ్యం  అవుతుందని, ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, తమకు న్యాయం చేయాలని కోరారు.

వరదయ్యపాలెం జడ్పీహెచ్ స్కూల్ లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రారంభం

వరదయ్యపాలెం జడ్పీహెచ్ స్కూల్ లో అటల్  టింకరింగ్ ల్యాబ్ ప్రారంభం      

 వరదయ్య పాలెం, పెన్ పవర్ 

 ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచాలని యోచనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటుచేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ని స్థానిక వరదయ్యపాలెం ఎస్సై పురుషోత్తం రెడ్డి,అబ్దుల్ మునాఫ్    ఎస్ బి ఐ మేనేజర్, తంగవేలు ఎస్బిహెచ్ మేనేజర్ల చేతుల మీదగా ప్రారంభించారు.ఈసందర్భంగా ఎస్ఐ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థుల మేధాశక్తి పెంపొందించేందుకు మరియు వారిలో సృజనాత్మకత వెలికితీసేందుకు ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని తెలిపారు.

20 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ  నిధులతో ఈ ల్యాబ్ ని ప్రారంభించామని ప్రస్తుతం 10 లక్షల రూపాయలతో పరికరాలను ఏర్పాటు చేశామని అలాగే ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్  కింద రెండు లక్షల రూపాయలు అందుతాయని అటల్ ఇంచార్జ్ కందేరి మేఘనాధ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిణి సరస్వతి, ప్రధానోపాధ్యాయులు  మోహన్ బాబు, పేరెంట్స్ కమిటీ ఛైర్పర్సన్   శారద.  , కమిటీ మెంబెర్లు ప్రభావతి , దాత ఇనుప రాజేంద్ర, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు  రామకృష్ణారెడ్డి , ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

ఈ చదువులతో విద్యాభివృద్ధి జరిగేనా....

 ఈ చదువులతో విద్యాభివృద్ధి జరిగేనా.... 

కరోనా దెబ్బకు కష్టంగా మారిన విద్య..

ఏజెన్సీ లో దిక్కు తోచని స్థితిలో  విద్యార్థులు.

పుస్తకాలనే తల దిండుగా మార్చుకున్న విద్యార్థి.

పెన్ పవర్, పెద్ద గూడూరు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి  వైరస్  రోజురోజుకూ విశృంకలంగా  పెరిగిపోతున్న కారణంగా  ఈ మహమ్మారి వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది.ఇందులో భాగంగానే  రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు అన్నీ మూసివేసి ఆన్లైన్ పేరిట కొన్ని తరగతులవారికి పాఠాలు చెప్పుతుండగా ప్రాథమిక తరగతులవారిని మాత్రం పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు.    సరిగ్గా పరీక్షలకు ముందు విద్యాసంస్థలు మూసివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు..ఇదే దిశగా మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో కరోనా సెకండా వేవ్ వ్యాపిస్తున్న క్రమంలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో మండల కేంద్రంలో కాలు బయట పెట్టని పరిస్థితి ఏర్పడింది. అయితే స్కూల్లు మూసివేయటంతో ఓ విద్యార్ధి (అడ్డగట్ల మాని కశిక్)  ఏం చేయాలో తెలియాక పుస్తకాలు నెత్తికింద పెట్టుకోని చదవసాగాడు.

యోగి వేమన యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది సమస్యలు పై చర్చలు విఫలం సమ్మె కొనసాగింపు

యోగి వేమన యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది సమస్యలు పై చర్చలు విఫలం సమ్మె కొనసాగింపు

కడప, పెన్ పవర్

యోగి వేమన యూనివర్సిటీ హాస్టల్  సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని యోగి వేమన యూనివర్సిటీ హాస్టల్ అండ్ స్టాప్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి అనుబంధం)ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న కార్మికులతో రిజిస్ట్రార్ జరిపిన చర్చలు విఫలం  కావడంతో గురువారం కూడ కొనసాగిస్తున్నట్లుగా ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి,యోగి వేమన యూనివర్సిటీ హాస్టల్ స్టాప్& వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షలు ఎల్. నాగసుబ్బారెడ్డి,డిప్యూటి జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా లు తెలిపారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలులో అమలు చేస్తున్నటువంటి వాటిని యోగి వేమన యూనివర్సిటీలో ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చిన అధికారులు ముందస్తుగా చర్చలు జరగకపోవడం, స్పందించకపోవడం మూలంగానే ఆందోళన చేయాల్సిన పరిస్థితి దీనికి అధికారులే బాధ్యత వహించాలన్నారు.  24 గంటల డ్యూటీ చేసే పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేస్తున్నప్పుడు మరి హాస్టల్ సిబ్బందికి ఎందుకు అమలు పరచలేదో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు వేతనాలు రూపంలో తీసుకుంటూ కిందిస్థాయి హాస్టల్ సిబ్బందిని సమస్యలు పట్టించుకోకపోవడం వారి అహంభావానికి నిదర్శనమన్నారు.  విద్యార్థులతో హాస్టల్ ఫీజులు  బలవంతంగా కాసిన్ డిపాజిట్ క్రింద డబ్బులు తీసుకొన్న యూనివర్సిటీ అధికారులు హాస్టల్ సిబ్బంది చేస్తున్నటువంటి ఆందోళనతో అధికారులు బెంబేలెత్తి విద్యార్థులను కరోన బూచి చూపించి సెలవులు ప్రకటించడం సమంజసం కాదన్నారు. వేతనాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని, వై వి యు లో కూడా చెల్లించాలని కోరడం, ఫుడ్ బేసిక్ మరియు డైలీ వేజెస్ వారికి ధరల సూచీ ప్రకారం వేతనాలు పెంచాలని, చనిపోయిన కార్మికుల కుటుంబంలో వారి వారసులకు అదే స్థానంలో ఉద్యోగం అవకాశం కల్పించాలని కోరడం ఏ విదంగా చట్టవిరుద్ధమో తేల్చాలన్నారు.  10 సంవత్సరాల పైబడి పని చేయుచున్న వారందరికీ టైం స్కేల్ వేతనాలు వివిధ యూనివర్సిటీలో వర్తింపు చేసినట్లుగా యోగి వేమన యూనివర్సిటీలో కూడా ఎందుకు ఇవ్వకూడదన్నారు. సామాజిక భద్రత చట్టాల్లో బాగంగా రిస్క్ అలవెన్సులు,ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ఈఎస్ఐ, ఈపిఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.  కుక్కు ,స్టీవార్డ్ , స్టోర్ కీపర్ సర్వర్ గా పనిచేయు వారికి క్యాంపస్ లో ఏవిధంగా గ్రేడింగ్ ఇచ్చారో అదే విధంగా డ్రైవర్, ప్లంబర్,ఎలక్ట్రిషన్ మొదలగు వారికి గ్రేడింగ్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామసుబ్బయ్య ,గంగాధర్ కోశాధికారి రాజేశ్వరి, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కుతుబుద్దీన్ ,వెంకటరమణ, సహాయ కార్యదర్శులు చలపతి, నాగసుబ్బారెడ్డి, లక్ష్మీదేవి,రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యకోసం ఎక్కవ నిధులు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రమే...

 విద్యకోసం ఎక్కవ నిధులు ఖర్చు చేస్తున్న  ముఖ్యమంత్రి జగన్ మాత్రమే...

విశాఖ తూర్పు, పెన్ పవర్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు తెలిపారు. గురువారం విశాఖ నగర వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యా దీవెన పధకం ద్వారా రాష్ట్రంలోని లోని 28,135 మంది కొప్పుల వెలమ విద్యార్ధులకు,రూ.19.77 కోట్లు విడుదల చేశారని తెలిపారు.ఇప్పటివరకు  అన్నివర్గాలకు సమన్యాయం చేస్తూ విద్యకోసం ఎక్కవ నిధులు ఖర్చు చేస్తున్న  ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్నారు.56 బి.సీ కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వెనుకబడిన వర్గాలకు గుర్తింపు తెచ్చిన ఘనత జగన్న దేనన్నారు.రాష్ట్రంలోని అన్ని బి సీ కులాల వారు ముఖ్యమంత్రిని దేముడిలో కొలుస్తున్నాయన్నారు. వెలమ విద్యార్థులకు ప్రాధాన్యం ఇచ్చి చదువు కు ప్రోత్సహిస్తున్నసీఎం జగన్ కు వెలమలందరి తరపునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశం లో జి.వి.ఎం.సి ఉప ఫ్లోర్ లీడర్ ఆళ్ళ శంకర్ రావు,జి.వి.ఎం.సి, విప్ నరసింహ పాత్రుడు, ఉత్తరాంధ్ర వెలమ సంఘం కన్వీనర్ మెరపల సత్యనారాయణ  పాల్గొన్నారు.

ఆర్యభట్ట పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలి.

 ఆర్యభట్ట పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలి.

టీడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు మట్టూరి నాగేశ్వరరావు..

తొర్రూరు, పెన్ పవర్

నిబంధనలు ఉల్లంఘించి, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన ఆర్యభట్ట హైస్కూల్ ప్రభుత్వ గుర్తింపు రద్దు చేయాలని, టీడబ్ల్యూజేఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మట్టూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రములోని స్థానిక ఎల్ వై అర్ గార్డెన్ లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి, విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, కలెక్టర్ కు సమాచారం ఇచ్చి, న్యూస్ కవరేజ్ వెళ్లినందుకు సూర్య విలేకరి సిరికొండ విక్రమ్ కుమార్ ను వ్యక్తిగతంగా దూషించి, పాత లారీతో గుద్దించి చంపుతానని, ఆర్యభట్ట హైస్కూల్ కరస్పాండెంట్ నెలకుర్తి మధూకర్ రెడ్డి ఫోన్లో బెదిరించడం దారుణమని అన్నారు. దీనిపై పోలీసు అధికారులు త్వరితగతిన  మధూకర్ రెడ్డి పై కేసు నమోదు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.వర్కింగ్ జర్నలిస్టులపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. జర్నలిస్టులకు ఆపదొస్తే ఎల్లవేళలా అండగా ఉంటామని, తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో జర్నలిస్టులు చంద శ్రీనివాస్, సిరికొండ విక్రమ్ కుమార్, బందు శ్రీధర్, కొమ్మనబోయిన యాకయ్య యాదవ్, దొంగరి శ్రీనివాస్, ఇమ్మడి రాంబాబు, పస్తం సాంబ తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్ధిక భరోసా జగనన్న విద్యా దీవెన

 పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్ధిక భరోసా జగనన్న విద్యా దీవెన

పెన్ పవర్, రావులపాలెం

ఆర్ధిక సమస్యల కారణంగా ఏ పేద విద్యార్థి ఉన్నత చదువుకు దూరం కాకూడదని ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన పధకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నారని శాసనసభ్యులు చిర్ల అన్నారు. రావులపాలెంలోని శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన మొదటి విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన పథకాన్ని మన ప్రభుత్వం 4 విడతలుగా అందిస్తుందని, విద్యార్థుల పూర్తి ఫీజు వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ పధకం మొదటి విడతలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో 6166 మంది విద్యార్థులకు 3 కోట్ల 92 లక్షల 73 వేల 7 వందల 37 రూపాయలు వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని విద్యార్థులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.గత ప్రభుత్వం 1880 కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజు రేయింబర్స్మెంట్ బకాయిలు పెడితే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని తీర్చి, విద్యార్థులకు విద్యా దీవెన పధకం సక్రమంగా అందేలా చూస్తుందని తెలియచేసారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన పధకం మొదటివిడతలో భాగంగా సుమారు 10 లక్షల 88 వేల మంది విద్యార్థులకు 671.45 కోట్ల రూపాయలు అందిస్తుంది అని విద్యార్థుల ఉన్నత చదువుకు చేయూత ఇవ్వడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియచేసారు.

ఇంటర్మీడియట్ కళాశాల భవనానికి భూమిపూజ

 ఇంటర్మీడియట్ కళాశాల భవనానికి భూమిపూజ  

ఎటపాక, పెన్ పవర్

 మండల పరిధిలోని నెల్లిపాక గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం  ఇంటర్మీడియట్ కళాశాల మంజూరు చేయగా కళాశాలకు ఎటువంటి భువన వసతులు లేక విద్యార్థులు  ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల భవనాల్లో తరగతులు నిర్వహించారు నెల్లిపాక ప్రభుత్వ కళాశాలకు భవనం లేదని గ్రహించిన నెల్లిపాక గ్రామస్తుడైన  ముప్పాళ్ల శ్రీధర్  తన సొంత ఖర్చుతో కళాశాల భవనాన్ని నిర్మిస్తామని ఒప్పుకున్నారు ఇచ్చిన మాటను తూచా తప్పక పాటించే వ్యక్తి  పది లక్షల రూపాయల ఖర్చుతో కళాశాల నిర్మాణానికి  సోమవారం భూమిపూజ నిర్వహించారు ఈ భూమి పూజ నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎటపాక మండల డిప్యూటీ తహశీల్దార్  సుబ్బారావు  ఎంపీడీఓ విఠల్ పాల్  కళాశాల  అధ్యాపక బృందం  రాజకీయ నాయకులు  గ్రామస్తులు పాల్గొన్నారు.

ఔట్సోర్సింగ్ వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి

ఔట్సోర్సింగ్ వైద్య  ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి

 చిత్తూరు,  పెన్ పవర్

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వైద్య  ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు  నిరసన ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వివిధ కేటగిరిలో పనిచేస్తున్న వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టాలని  రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏ పీ మెడికల్   కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్  ఎంప్లాయిస్ యూనియన్  నాయకులు సి కె జయచంద్ర , దాసరి చంద్ర,  శంకర్,  రాజారాం నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా  ఏఐటీయూసీ, ఏ పీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు, ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ  ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, టెక్నీషియన్స్, వివిధ కేటగిరి లో పనిచేస్తున్న వైద్య ఉద్యోగులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోవిడ్  లో పని చేస్తున్నటువంటి సిబ్బందికి ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని ఈఎస్ఐ పి ఎఫ్ అమలు చేయాలని కనీస వేతనం అమలు చేయాలని తదితర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఏప్రిల్ 22 వ తారీఖున డి సి హెచ్ ఎస్ చిత్తూరు కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఏఐటీయూసీ నగర అధ్యక్షులు పి ఎస్ నాగరాజు నాయుడు, కార్యదర్శి సత్యమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్, గణపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమాదేవి, రఘు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు జయ చంద్ర, దాసరి చంద్ర, శంకర్ మునిరత్నం, రాజారామ్, విక్టోరియా మోహన, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలకు మెగాఫోన్ కొనుగోలుకు 3000 రూపాయలు బహుకరణ

 పాఠశాలకు మెగాఫోన్ కొనుగోలుకు 3000 రూపాయలు బహుకరణ

తాళ్లపూడి, పెన్ పవర్

సోమవారం  మానవత స్వచ్ఛంద సేవా సంస్థ , తాళ్లపూడి శాఖ ఆధ్వర్యంలో  మండలంలోని ప్రక్కిలంక స్పెషల్ ప్రాథమిక పాఠశాలకు మెగాఫోన్ కొనుగోలు నిమిత్తం రూ.3000 అందజేశారు. పాఠశాల అసెంబ్లీ, పేరెంట్స్ మీటింగ్ నిర్వహణ సౌకర్యార్థం,  ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు ఈ సహాయాన్ని అందజేసినట్టు సంస్థ అధ్యక్షులు బారనాల  శంకరరావు  తెలిపారు. ఈకార్యక్రమంలో  సెక్రటరీ జోడాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు తుంపూడి నాగ భూషణ గుప్త, మాజీ అధ్యక్షులు అప్పన చంద్రధర గుప్త, గెడ్డం సాయిబాబా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.విజయబాబు, ఉపాధ్యాయులు కె.రాజారావు, పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ జి.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరణ

 మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరణ

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో,ప్రగతి భారత్ పౌండేషన్ సహకారంతో ఈనెల 24,25 తేదిలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం  సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో కె.కె.రాజు ఆధ్వర్యంలో  జరిగినది.

ఈ సందర్భంగా కె కె.రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆశయాలకు అనుగుణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు విజయసాయి రెడ్డి మరియు ప్రగతి భారత్ పౌండేషన్ సహకారంతో ఈ నెల 24 25 తేదీలలో  విశాఖపట్నం లో మెగా జాబ్ మేళా నిర్వహించి సుమారు 4000 మంది యువతీ,యువకులకు ఉపాధి కల్పించబోతున్నామని ఆన్నారు.ఈ అవకాశాన్ని యువత  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో ఉత్తర నియోజకవర్గం పరిధిలోగల కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

టిఆర్ఆర్ డిగ్రీ కోర్సుల నిర్వహణకు మౌలికవసతుల తనిఖీ

 టిఆర్ఆర్ డిగ్రీ కోర్సుల నిర్వహణకు  మౌలికవసతుల తనిఖీ

పెన్ పవర్, కందుకూరు

స్థానిక టీ.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ, పీ.జీ. కళాశాలలో వివిధ డిగ్రీ కోర్సుల నిర్వహణకై  అవసరమయ్యే మౌలిక వసతులు  నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా తనిఖీ నిర్వహించడానికి నాగార్జున యూనివర్సిటీ ఆచార్యులు అశోక్ కుమార్, జగదీశ్ నాయక్ శనివారం  కళాశాలను సందర్శించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. తనిఖీలో భాగంగా ల్యాండ్ రికార్డులు, కళాశాల భవన నిర్మాణ ప్లానును, వివిధ విభాగాలను, సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబులను, జే కే సీ, ఇంగ్లీష్ లాంగ్వేజీ ల్యాబు, వర్చ్యువల్, డిజిటల్ తరగతి గదులను, బాలుర, బాలికల టాయిలెట్స్, మంచి నీటి సదుపాయాలను,  క్రీడా మైదాన సదుపాయాలు, 400 మీ. రన్నింగ్ ట్రాక్ ను, జిమ్ ను, బొటానికల్ గార్డెన్ ను, ఇటీవలే నిర్మించుకున్న అజోలా పాండ్ ను, వెర్మి కంపోస్టు యూనిట్ ను, హైడ్రోపోనిక్ యూనిట్లను పరిశీలించారని తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలికి తమ రిపోర్టును సమర్పిస్తారు అని తెలిపారు. తద్వారా కళాశాలలోని డిగ్రీ కోర్సుల  అఫిలియేషన్ ను యూనివర్సిటీ నుండి పొందవచ్చునని అన్నారు. వివిధ డిపార్ట్మెంట్ ఇన్- ఛార్జ్ లు, అధ్యాపకులు, ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...