Followers

Showing posts with label ANDHRAPRADESH. Show all posts
Showing posts with label ANDHRAPRADESH. Show all posts

మే 15 తర్వాత మొదటి డోస్ టీకా

 మే 15 తర్వాత మొదటి డోస్ టీకా 

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శృతి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మే 15  తేదీ వరకు మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి డోసు టీకా వేసుకున్న వారు చాలామంది ఉన్నారని వారికి  మే 15వ తేదీ లోపు రెండో డోసు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతము మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.  కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రెండవ డోసు పూర్తి చేసిన తరువాత మే15 తరువాత మరల మొదటి డోసు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడతామని ఆమె తెలిపారు.ఈవిషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రస్తుతము మొదటి డోసు టీకా  వేసుకున్న వారిని గుర్తిస్తున్నాం అని అన్నారు. వారికి పూర్తి కాగానే మొదటి డోసు టీకా మళ్లీ వేస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ వి పద్మలత, సూపర్వైజర్  వెంకటాద్రి, హెల్త్ అసిస్టెంట్ రవి, ఏఎన్ఎంలు జయశీల, లతా, పార్వతి, ఆశా కార్యకర్తలు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

విక్టోరియా హాస్పిటల్ నందు బిజెపి ఓబీసీ మోర్చా సహాయ కార్యక్రమాలు

 విక్టోరియా హాస్పిటల్ నందు బిజెపి ఓబీసీ మోర్చా

 సహాయ కార్యక్రమాలు

మహారాణి పేట, పెన్ పవర్

బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్ర.వెంకట శ్రీమన్నారాయణ పిలుపు మేరకు మరియు భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి సూచన మేరకు శుక్రవారం విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు వాటర్ బాటిల్స మరియు  క్రీమ్ బన్,పండ్లు 300 మందికి పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కంటిబుక్త శ్రీనివాస్ రావు రాష్ట్ర కోశాధికారి మరియు బిజెపి ఓబిసి విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు, జె.శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి ఈ ముగ్గురి ఆర్థిక సాయం తో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎడ్ల రమణ రాజు జిల్లా కార్యదర్శి,చిత్రాడ రామకృష్ణ ప్రధాన కార్యదర్శి జిల్లా, ఓ.బి.సి కమిటీ, బీసీ నాయకులు మరియు మున్నా  36 వ వార్డు అధ్యక్షులు,సౌత్ కోఆర్డినేటర్ కొప్పుల రామ్ కుమార్ బిజెపి ఓబీసీ పార్లమెంట్ కమిటీ నాయకులు  పాల్గొన్నారు.

ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని తక్షణమే ప్రకటించాలి.పాచిపెంట శాంతకుమారి

 ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని తక్షణమే ప్రకటించాలి.పాచిపెంట శాంతకుమారి 

   

అరకు, పెన్ పవర్               

ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి కరోనా బారినపడిన ప్రతి ఒక్కరిప్రాణాన్ని కాపాడాలని ఏపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ అరకు పార్లమెంట్ నియోజకవర్గం డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు.ఈరోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 97 వ వర్ధంతి సందర్భంగా కరోనా కారణంగా బయటకు రాకుండా తమ ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించి ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి యుద్దప్రాతిపదికన అన్ని ప్రైవేట్ హాస్పటల్స్ ను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని కరోనా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు,మందులు మరియు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందించే విధంగా  చర్యలు చేపట్టాలని అధికార పార్టీ నాయకులే కరోనాతో  చనిపోయిన  శవాల దహన సంస్కారాలకు కూడా ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైందని చర్చించుకోవడం వారి వైఫల్యాలకు నిదర్శనమని ప్రైవేట్ హాస్పటల్స్ లో కరోనా వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రభుత్వ హాస్పటల్స్ లో ఆక్సిజన్ తో కూడిన బెడ్లు దొరకక నిరుపేదలు చనిపోతున్నారని ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన కరోనా రోగుల వైద్యంపై దృష్ఠి సారించి వైద్యం అందేవిధంగా కృషిచేయాలని 104 నెంబర్ కు ఫోన్ చేసిన మూడుగంటలలో కరోనా రోగికి బెడ్ అందించాలని స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి మాటలను కూడా లెక్కచేయకుండా మూడు రోజులకు కూడా బెడ్ అందించలేకపోతున్నారని,ప్రైవేట్ హాస్పటల్స్ లో అత్యధిక ఫీజుల వసూళ్ళను అధికారులు తనిఖీలు చేపట్టి నియంత్రించాలని, కరోనా రోగితో పాటుగా సహాయకులకు కూడా హాస్పటల్స్ లో భోజన సదుపాయం కల్పించాలని లేని పక్షంలో కరోనా రోగులకు సహాయకులుగా ఉండే వారంతా వివిధ హోటల్స్ కు రావడం వలన కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని కరోనా నివారణ వ్యాక్సిన్లను వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్ళి ఇవ్వాలని కరోనా రోజు రోజుకీ విజృంభిస్తున్న క్రమంలో అందరూ వ్యాక్సిన్ల కోసం ఒకచోట గుమిగూడటం వలన కూడా కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతమవుతుందని అన్ని కోవిడ్ హాస్పటల్స్ కు సరిపడా ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందేవిధంగా చర్యలు చేపట్టాలని వ్యాక్సిన్లు,ఇంజెక్షన్ల కొరత లేకుండా చూడాలని చనిపోయిన కరోనా బాధిత కుటుంబానికి రెండు లక్షల నష్టపరిహారాన్ని అందించి దహన సంస్కారాలు ఉచితంగా జరిపేవిధంగా చర్యలు చేపట్టాలని కోవిడ్ వారియర్ గా సేవలందిస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్య, పారిశుద్ధ్య మీడియా, పోలీస్, సిబ్బందిలో కోవిడ్ బాధితులకు ఉచిత వైద్యం, మరణించిన వారి కుటుంబానికి 5లక్షల ప్రమాద భీమాను అందించే విధంగా కృషిచేయాలని పాచిపెంట శాంతకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మేయర్ కు వినతి పత్రం సమర్పించిన విశాఖ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్

 మేయర్ కు వినతి పత్రం సమర్పించిన విశాఖ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్

మహారాణి పేట, పెన్ పవర్

గ్రేటర్ విశాఖపట్నం మహానగర కార్పొరేషన్ కి మేయర్ గా ఎన్నికైన సందర్భంగా ముందుగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న సచివాలయం సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, హెల్త్ వర్కర్లు, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ లు సిబ్బంది సి.ఎం జగన్ మోహన్ రెడ్డి  ఆశయ సాధన కోసం ఈ కరోనా సమయంలో ఎవరికి వాళ్ళు వారి శక్తి కొలది,అహర్నిశలు ప్రజా సంక్షేమము కోసం విధులు నిర్వహిస్తున్నారు.ఈ సమయంలో కరోనా నుండి రక్షణకు సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ కు సేఫ్టీ కిట్స్ అవసరం ఎంతైనా వుంది కనుక తమ పై దయవుంచి ఉద్యోగులు, కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కు మాస్క్ లు,గౌజులు,శానిటైజర్ లు, అందజేయవలసిందిగా కోరుతూ బుధవారం వినతి పత్రాన్ని సమర్పించారు విశాఖపట్నం సచివాలయం ఎంప్లాయిస్ ఫెడరేషన్. ఈ సందర్భంగా మేయర్ , కమిషనర్ తో మాట్లాడి  అందరికి వీలైనంత తొందరగా హెల్త్ కిట్లు అందించటం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ జిల్లా  ప్రెసిడెంట్ గణేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పి.వి.కిరణ్ కుమార్,జిల్లా కో ఆర్డినేటర్ ఈ.పవన్ కుమార్,షాహిద్, వెంకట్,అశోక్  వాలంటీర్ లు  నవీన్,కుశవంత్  తదితరులు పాల్గొన్నారు.

నిరసన వ్యక్తం చేసిన బి.జె.పి, ఓ.బి.సి, మోర్చా

 నిరసన వ్యక్తం చేసిన బి.జె.పి, ఓ.బి.సి, మోర్చా


                                                                   మహారాణి పేట ,పెన్ పవర్


పశ్చిమ బెంగాల్ లో తృనమూలు కాంగ్రెస్ బీజేపీ పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ ల పైన జరుపుతున్న దాడులు, మహిళలపైన చేస్తున్న  అరాచకాలను ప్రజాస్వామ్య వాదులు ముక్త కంఠంతో ఖండించాలని, ఇదే విధంగా మేము కూడా దాడులకు తెగబడితే మమతా బెనర్జీ పార్టీ ఈ రోజు విజయం సాధించి ఉండేదా అని బీజేపీ జాతీయ అధ్యక్షులు ఏ.పి.నడ్డా అన్నారు. ఈ అరాచకాలను ప్రజాస్వామ్య వాదులంతా వ్యతిరేకించాలని, దీనిలో భాగంగా బీజేపీ కార్యకర్తలంతా తమ ఇండ్లలోనే కోవిడ్ కారణంగా ఈ రోజు ఉదయం 11గంటల నుండి 12 గంటల వరకు నిరసన కార్యక్రమం చేయాలనీ జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు, రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మమతా బెనర్జీ ఇది వరకు కమ్యూనిస్ట్ పార్టీ లను భయ, భ్రాంతులకు గురి చేసి నిర్ములించారని, బీజేపీ ని కూడా అదేవిదంగా చేద్దామనుకోవడం అవివేకం అని అన్నారు. బీజేపీ కార్యకర్తలు దేశభక్తి తో కూడిన త్యాగమయులని ఎట్టి పరిస్థితులు లోను తృణముల్ ఆటలు సాగవని అన్నారు. ఇటువంటి దురాగతాలను ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. దేశావ్యాప్తంగా ఈ రోజు ఉదయం 11 గంటలనుండి 12 గంటలవరకు ఈ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదములు, అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తమ ఇంటి వద్దనే ఓబీసీ మోర్చా పార్లమెంట్ అధ్యక్షులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఆయన మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్ లో బిజెపి కార్యకర్తలకు బిజెపి నాయకులకు కేంద్ర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలి అని కోరుతూ  తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు నాయకులు చేసిన దుశ్చర్యలను బిజెపి ఓబీసీ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి ఓబీసీ  రాష్ట్ర కోశాధికారి శ్రీకంఠ భక్త శ్రీనివాస్ రావు, బిజెపి ఓబిసి సెక్రెటరీస్ ఎడ్ల రమణ రాజు,  ఎల్లాజీ యాదవ్, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్లు బేసి బిజెపి విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు  పల్లి శ్రీనివాసులు నాయుడు అన్నారు

సర్పంచులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

 సర్పంచులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

మెంటాడ, పెన్ పవర్,

 మెంటాడ మండలం లోని మీసాల పేట, కుంతిని వలస గ్రామంలో సర్పంచులు మహంతి రామునాయుడు, పెద్ది రెడ్ల రమేష్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారము పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సీసీ కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి గ్రామాలను శుభ్రం చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా రెండవ దశలో ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతము చిన్న చిన్న వర్షాలు కురవడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని తెలిపారు.

పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మిత్రబృందం

పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మిత్రబృందం

పెన్ పవర్,  శ్రీకాకుళం

మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ వైసీపీ  విద్యార్థి యువజన విభాగం నాయకులు మెంటాడ స్వరూప్ జన్మదినం సందర్భంగా పలు  సేవా కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం స్థానిక ఆదిత్యనగర్ కాలనీలో స్వరూప్ మిత్రమండలి ఆధ్వర్యం లో ఇంటింటికీ కూరగాయలు నిత్యావసరాలు అంద చేశారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు లక్ష్మణ అప్పు యాదవ్, అశోక్, సోను,శ్రీను,తదితరులు ఉన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల జీతాల బాకాయిలు వెంటనే చెల్లించాలి

పారిశుద్ధ్య  కార్మికుల జీతాల బాకాయిలు వెంటనే చెల్లించాలి

పరవాడ, పెన్ పవర్

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బకాయి పడ్డ 13 నెలలు జీతాలు చెల్లించాలని మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మండలంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గత సవచ్చరం కరోనా మొదలు అయిన దగ్గరనుండి గ్రామాల్లో కరోనా నివారణ కోసం అహర్నిశలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాల కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు,వాటర్ పంప్ ఆపరేటర్లకు,ఎలక్ట్రికల్ వర్కర్స్ లకు ప్లంబర్ లకు మండలంలోని గ్రామపంచాయతీ లలో వారికి 13 నెలలుగా జీతాలు ఇవ్వకుండా బకాయి ఉంటే వారు ఎలా బతకాలని ఆవేదనతో ప్రశ్నించారు.కరోనా మొదలు దగ్గరనుంచి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి అని అలాంటి పరిసితుల్లో వారికి జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా బ్రతుకుతారు అని ప్రశ్నించారు.అంతే కాకుండా వారికి రక్షణ కొరకు మాస్కులు, శానిటైజర్,బూట్లు, యూనిఫార్మ్,సబ్బులు లాంటి వేవి ఇవ్వడం లేదని గనిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు.కరోనాతో  మరణించిన వారి  ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు అక్కడ శుభ్రత పని చేస్తున్న సమయంలో వారికి మాస్క్ లు లేకపోతే ఏ రకంగా పనులు నిర్వహించగలరు అని ప్రశ్నించారు.వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని పిఎఫ్, ఈ ఎస్ ఐ, ఐడి కార్డులు భద్రతా పరికరాలు పంచాయతీల్లో కార్మికులకు ఇవ్వాలని అని గనిశెట్టి డిమాండ్ చేశారు.అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఈవో.ఆర్ .డి పద్మ గారికి ఇవ్వడమైనది ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు డి.విశాఖ,ఆర్.విజయ,పి. పారుపల్లి,ఎస్.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కరోనా బాధితులకు పింఛన్ పంపిణీ...

 కరోనా బాధితులకు పింఛన్ పంపిణీ...

మహారాణి పేట, పెన్ పవర్

జీవీఎంసీ 4వ  జోన్ పరిధి,33 వార్డ్ ,30 వార్డ్ ల లో  గౌరి స్ట్రీట్,అల్లిపురం సచివాలయం  పరిధిలో కరోనా పాజిటివ్  పెన్షనర్ కు వాలంటీర్ చిల్లా చైతన్య ,వార్డ్  సెక్రటరీ లు, పి.వి.కిరణ్ కుమార్, జి. శ్యామల రావు, జాన్ బాబు వృద్ధాప్య పెన్షన్ ను, హోమ్ ఐసొలేషన్ కిట్ లను  అందచేశారు. ఎల్ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సచువాలయా వ్యవస్థ ద్వారా అనేక పథకాలు ప్రజలకు అందుబాటులో వచ్చాయన్నారు.

కరోన విషయంలో ప్రజలు మెలకువగా ఉండి నిత్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. అలానే నేడు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మా క్లస్టర్ లో కోవిడ్ బాధితులకు పంపిణీ చేయడం ఓ రకంగా రిస్క్ అయినప్పటికీ మా బాధ్యత మాకు ముఖ్యం అనిపించింది ఆ విధంగా లబ్దిదారులకు పంపిణీ చేసాము అని వివరించారు హోమ్ ఐసొలేషన్  కిట్ లు  అందచేసిన వారిలో  ఏ.ఎన్.ఎం లు  త్రివేణి,అరుణ, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ  అమృత దీప్తి ,వాలంటీర్  భాగ్య లక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

కొవ్వూరు పట్టణ పోలీసులు కరోన నియంత్రణ చర్యలు

 కొవ్వూరు పట్టణ పోలీసులు కరోన నియంత్రణ చర్యలు

కొవ్వూరు, పెన్ పవర్

కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న తరుణంలో కొవ్వూరులో ప్రజలందరూ సహకరించి రాత్రి పూట 7 గంటల తరువాత ఎవ్వరూ బయటకు రాకుండా ఉండాలని కొవ్వూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వి.వి.ఎస్.ఎన్ మూర్తి అన్నారు. కొవ్వూరు  దొమ్మేరు, ఔరంగాబాద్, వాడపల్లి గ్రామాల్లో మూర్తి పర్యటించి రోడ్లు పై తిరుగుతున్న ప్రజలను ఇంటికి పంపే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ రాత్రి దొమ్మేరు గ్రామంలో భోజన హోటల్ యజమానులకు 8 గంటల వరకు హోటలు తెరచి ఉండవచ్చునని, ఎనిమిది గంటలు దాటిన తర్వాత హోటల్ మూసివేయాలని, ఈ సమయంలో భోజనం పార్సిల్ చేసి ఇవ్వవలెనని హోటల్ లో ఎవర్ని కూర్చుండ పెట్టరాదని తెలియజేసినట్లు  తెలిపారు.

రాత్రి 7గంటల తరువాత రోడ్ల పైకి ఎవరు వచ్చినా ఉపేక్షించేది లేదని, కరోనా వైరస్ ను కట్టడి చేయడం లో ప్రజలందరూ స హకరించాలని,  కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పిలుపు మేరకు కొవ్వూరు పట్టణంలో స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించడంతో పోలీసు వారు బుధవారం రాత్రి కొవ్వూరు పట్టణంలోని మెయిన్ రోడ్డు నందు ఏడు గంటలు దాటిన తర్వాత రోడ్ల పైకి వచ్చిన వారిని ఇళ్లకు పంపిస్తూ, తెరచి ఉన్న షాపులను మూసి వేయించారు.   గ్రామాల ప్రజలు రాత్రి 7:00 గంటలు దాటిన తర్వాత రోడ్లపై తిరగరాదు అని, స్వచ్ఛందంగా షాపులను మూసివేయాలని, కరోనా వైరస్ వ్యాప్తి వృద్ధి చెందకుండా కట్టడి చేయడంలో ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా నిబంధనలను అతి క్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు పట్టణ ఎస్ఐలు వెంకటరమణ, కేశవ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొ న్నారు.

భక్తి శ్రద్ధలతో గీతా యజ్ఞం...

 భక్తి శ్రద్ధలతో గీతా యజ్ఞం...

సంతబొమ్మాళి, పెన్ పవర్

 సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ చొక్కర వాని పేట గ్రామం లో  శ్రీ రాధా వేణుగోపాల స్వామి ఆలయం వద్ద గీతా యజ్ఞం కార్యక్రమాన్ని తేజా రావు, గణపతి, ఆధ్వర్యంలో మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భగవత్ గీత లోని 18అధ్యాయాలలో ఉన్న 701శ్లోకాలు  చదివి హోమం చేశారు.అలాగే చైత్ర మాసం చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా నౌపడ పంచాయతీ సీతానగరం గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో స్వామివారికి సహస్ర తులసి పూజలు,రామ పారాయణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు నాగేశ్వర శర్మ నిర్వహించారు.పెద్దమర్రిపాడు పాండురంగ విట్టల్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.సంతబొమ్మాళి నారా యణ క్షేత్రం లో విశేష పూజలు నిర్వహించారు.

27వ రోజు రిలే నిరాహారదీక్ష...

 27వ రోజు రిలే నిరాహారదీక్ష...

విశాఖపట్నం, పెన్ పవర్

దేశ సంపదను అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ పోరాడుతామని మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ అన్నారు.స్టీల్ ప్లాంట్,ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఈరోజు జరిగిన నిరాహారదీక్ష లో కంచరపాలెం జోన్ సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ప్రజల కష్టార్జితం నుండి నిర్మించిన సంపదను అంబానీ, అదానీ లకు అమ్మేయడం దేశద్రోహం అని అన్నారు. ఈకార్యక్రమంలో కంచరపాలెం సిఐటియు నాయకులు ఒ.అప్పారావు, ఎన్ సింహాచలం, ఎస్.రాంగోపాల్, డి.ప్రకాష్,ఎస్ శ్రవణ్, రామారావు,ఎమ్.కోటి, కాసులమ్మ,డి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

రైతుబ‌జార్ల‌లో కోవిడ్ నిబంధ‌న‌లు

 రైతుబ‌జార్ల‌లో కోవిడ్ నిబంధ‌న‌లు

విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్

 రోజురోజుకూ పెరుగుతున్న కేసుల‌ను దృష్టిలో పెట్టుకొని, క‌రోనా నియంత్రాణా చ‌ర్య‌ల్లో భాగంగా రైతు బ‌జార్ల‌లో కోవిడ్ నిబంధ‌న‌లను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ ఆదేశాల‌ను జారీ చేశారు. త‌ప్ప‌నిస‌రిగా మాస్కును ధ‌రించిన వారిని మాత్ర‌మే రైతుబ‌జార్ల‌లోకి అనుమ‌తించాల‌ని స్ప‌ష్టం చేశారు. రైతు బ‌జార్  ప్ర‌వేశ ద్వారాల‌వ‌ద్ద ధ‌ర్మ‌ల్ స్కాన‌ర్‌ల‌ను ఏర్పాటు చేయించారు. శారీర‌క ఉష్ణోగ్ర‌త‌ల‌ను త‌నిఖీ చేసిన త‌రువాత మాత్ర‌మే, రైతు బ‌జార్లోకి ప్ర‌వేశానికి అనుమ‌తించ‌నున్నారు.

 అదేవిధంగా కొనుగోలుదారులు భౌతిక దూరాన్ని పాటించేవిధంగా చ‌ర్య‌లు తీసుకున్నారు. రైతుబ‌జార్లలో చేతులు స‌బ్బుతొ కడుగుకొనేందుకు త‌గిన ఏర్పాట్ల‌ను చేసి, శానిటైజ‌ర్ల‌ను కూడా అందుబాటులో ఉంచారు. వినియోగ‌దారుల సంక్షేమం కోసం త్వ‌ర‌లో మొబైల్ రైతు బ‌జార్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు జెసి వెళ్ల‌డించారు. అదేవిధంగా ప‌లుచోట్ల తాత్కాలికంగా రైతుబ‌జార్ ఎక్స్‌టెన్ష‌న్ కౌంట‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. వినియోగ‌దారులు, రైతులు త‌ప్ప‌నిస‌రిగా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ, కోవిడ్ నియంత్ర‌ణ‌లో త‌మ‌వంతు స‌హ‌కారాన్ని అందించాల‌ని జెసి కిశోర్ కోరారు.

అనుష్ స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో పేదలకు చాపలు పంపిణీ

 అనుష్  స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో పేదలకు చాపలు  పంపిణీ

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 ర్యాలీ స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆత్రేయపురం మండలం జడ్పిటిసి పోటీలో నిలబడిన అభ్యర్థి బోనం   సాయి బాబా పుట్టిన రోజు సందర్భంగా అనుష్  స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు చాపలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొడమంచిలి లక్ష్మి ఉప సర్పంచ్ బోనం రత్నకుమారి వార్డు సభ్యులు గోగుల నాగేశ్వరరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మద్దూరు బాబి రాలి విద్యా కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

 కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

చిత్తూర్, పెన్ పవర్

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకత్వంలో జిల్లా డి సి హెచ్ ఎస్ అధికారి గారికి  వినతి పత్రం. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ శానిటేషన్ సెక్యూరిటీ ల్యాబ్ టెక్నీషియన్ వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న వైద్యుల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం  చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో ఉండు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సేవల సమన్వయ అధికారి గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏ.పీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి. మహేంద్ర ,ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు లు మాట్లాడుతూ  జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని, పి.ఎఫ్, ఇఎస్ఐ, అమలుచేయాలని పిఎఫ్  స్లిప్ ప్రతి కార్మికునికి ఇవ్వాలని, ఈఎస్ఐ కార్డు అందించాలని, కోవిడ్ వార్డులో పనిచేసి నిలిచిపోయిన సిబ్బందికి జీతాలు చెల్లించాలని, కోవిడ్ వార్డులో పనిచేస్తున్న సిబ్బందికి పి. పి. కీట్లు శానిటేషన్, మాస్కులు, బ్లౌజులు సరఫరా చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 549 కారం జిల్లా వ్యాప్తంగా  జీతాలు చెల్లించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,  కోవిడ్ లో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని, ప్రతి నెల జీతం సక్రమంగా మంజూరు చేయాలని, జిల్లా వ్యాప్తంగా  ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తేడా లేకుండా జీతాలు చెల్లించాలని, పని భారం ఎక్కువ ఉన్నందువలన అదనపు సిబ్బందిని నియమించాలని, తదితర సమస్యల పైన అధికారులు చర్యలు తీసుకొని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసిన వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ముని వేలు, కిషోర్, జయచంద్ర ,దాసరిచంద్ర ,శంకర్, మునిరత్నం, మణికంఠ ,దామోదర్ రెడ్డి,  ఏఐటీయూసీ నగర అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు నాయుడు, సత్యమూర్తి, గంగాధర గణపతి, రమాదేవి,రఘు,గిడ్డుబాయ్ తదితరులు పాల్గొన్నారు.

నిరుపయోగంగా మారిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు.

నిరుపయోగంగా మారిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు

 మెంటాడ , పెన్  పవర్

 మండలం లోని గత టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు నేటి పాలకులు, అధికారులు పట్టించు కోకపోవడంతో వీటి కోసం వెచ్చించిన నిధులు నిరుపయోగంగా మారాయని మండల ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెంటాడ మండలం లోని 30 గ్రామ పంచాయతీలు చెత్తకు సంపద కేంద్రాలు నిర్మాణాలు చేపట్టారు. గ్రామాల్లో సేకరించిన  తడి, పొడి చెత్త లను వేరు వేరు చేసి వ్యవసాయ ఎరువులు గా తయారు చేసి రైతులకు విక్రయించడానికి చెత్త కు సంపద కేంద్రాలను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది. గ్రామాల్లో ఉన్న చెత్తను తరలించడం కోసం వాహనాలను కూడా అప్పట్లో కొనుగోలు చేశారు. ప్రస్తుతము చెత్త కు సంపద కేంద్రాలు, కొనుగోలు చేసిన వాహనాలు ప్రస్తుతం మూలకు చేరాయి. 

కొత్తగా వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటిని పక్కనపెట్టి తాజాగా వాటి స్థానములో గ్రామాల్లో ఉన్న చెత్తను చెత్తను తరలించడానికి రిక్షా లను ఏర్పాటు చేసి చెత్తాచెదారాన్ని చెత్త కు సంపద కేంద్రాలకు తరలించకుండా గ్రామాల్లో ఉన్న బహిరంగ ప్రదేశాల్లోనూ, గ్రామాలకు ఇరువైపుల ఉన్న రహదారులు ఇరువైపులా చెత్తాచెదారాన్ని వేయడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మండల ప్రజలు అత్యధికముగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతము చెత్తాచెదారాన్ని సేకరిస్తున్న కార్మికులకు గత కొన్ని నెలలుగా ఎటువంటి గౌరవ వేతనం ఇవ్వకపోవడం తో వారు సేకరిస్తున్న తడి, పొడి చెత్త లను బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లకు ఇరువైపులా వేస్తున్నారని మండల ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న చెత్తకు సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకువచ్చి ఎరువులు తయారు చేసే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమే కార్మికులు మాట్లాడుతూ క్రమం తప్పకుండా చెత్తాచెదారాన్ని సేకరిస్తున్నామని గత కొన్ని నెలలుగా ఎటువంటి గౌరవ వేతనం చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అరకు లోయలో నేటి నుండి స్వచ్ఛంద లాక్ డౌన్

 అరకు లోయలో నేటి నుండి స్వచ్ఛంద లాక్ డౌన్

పెన్ పవర్,  విశాఖపట్నం

కరోనా కేసులు తీవ్రం అవుతున్నందున   మంగళవారం నుంచి పర్యాటక కేంద్రమైన అరకులోయలో 'ఆఫ్ డే' స్వచ్ఛంద లాక్డౌన్ కు తెర తీశారు.ప్రజారోగ్యం దృష్ట్యా సానిక వర్తక, వ్యాపార,పౌర సంక్షేమ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అరకులోయ  గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివారం రాత్రి  పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అత్యవసర సమావేశం నిర్వహించి వర్తక సంఘం ప్రతినిధులు, పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు  వ్యాపారులు అందరూ కలిసి స్వచ్ఛంద లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక కేంద్రమైన అరకులోయను కరోనా నుంచి కాపాడాలని, ఆరోగ్యకరమైన అరకు లోయగా మార్చ డానికి  తమ వంతు కృషి చేయడంలో భాగంగా స్వచ్ఛంద  లాక్ డౌన్ అవసరమని వర్తక సంఘం ప్రతినిధులు, పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు, గిరిజన, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు  20 నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత పాటించాలన్న సంకల్పంతో గత ఏడాది కూడా పౌర సంక్షేమ సంఘం, వర్తక సంఘం ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 2020  జూన్ నెలనుంచి జూలై నెల వరకు  ఆప్ డే స్వచ్ఛంద లాక్ డౌన్ ను సుదీర్ఘ కాలం పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కొంతమంది యువకులు,  సంఘ పెద్దలు ఒక టీం గా ఏర్పడి ప్రతి దుకాణాల్లో, హోటల్స్ లో భౌతిక దూరం పాటించాలని, మాస్కులు విధిగా వాడాలని,శానిటైజర్లు వినియోగించాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారం తీసుకోవాలని  నోమాస్క్ నోఎంట్రీ నినాదంతో యండపల్లివలస, అరకులోయ, సుంకరమెట్ట ప్రాంతం వరకు అవగాహన కల్పించడం తో తగ్గుముఖం పట్టింది.మళ్లీ ఈ ఏడాది 2021 మార్చి నుంచి  'సెకండ్ వే' కరోనా వ్యాధి  మళ్లీ విజృంభిస్తుండడంతో  గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా స్వచ్ఛంద లాక్ డౌన్ నిర్వహించాలని సంకల్పించి వర్తక, వ్యాపార, పౌర సంక్షేమ సంఘం  స్వచ్ఛంద లాక్ డౌన్ కు  అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ప్రతి వ్యాపార, వర్తకులు కట్టుబడి ఉంటామని వ్యాపారంలో కొంత నష్ట పోయిన మన ప్రాణాలు కాపాడుకుంటూ, ఇతరుల ప్రాణాలు కూడా కాపాడడం ప్రతి ఒక్కరికి సామాజిక భాద్యత అని సంకల్పం చి, గతంలో మాదిరిగానే భౌతిక దూరం, మాస్కుల వాడకం, శానిటైజర్లు వినియోగం వంటివాటిపై సంపూర్ణ అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ స్వచ్ఛంద లాక్ డౌన్ మంగళవారం  నుంచి అమల్లోకి వస్తుంది. కరోనా తగ్గుముఖం పట్టె వరకు అన్ని షాపులు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపార లావాదేవీలు కొనసాగించి అనంతరం దుకాణాలు పూర్తిగా మూసి వేయాలని తీర్మానం చేశారు. అలాగే హోటల్స్ మధ్యాహ్నం భోజనం సమయం వరకు యధావిధిగా నిర్వహించి, సాయంత్రం, రాత్రి సమయాల్లో పార్సెల్ సర్వీస్ ఇవ్వాలని నిర్ణయించారు. మాస్కులు దరించి సరుకులు క్రయ విక్రయాలు జరుపుకోవాలని, మాస్కులు దరించకుండా ఎవరొచ్చినా భౌతిక దూరం పాటించక పోయినా సరుకులు  ఎవరూ ఇవ్వవద్దని సంఘం తీర్మానం చేసింది. బేకరీ, స్వీట్ షాపులు సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే వ్యాపారం చేసుకుని అనంతరం మూసి వేయాలని వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాపుగంటి క్రిష్ణారావు, ముఖి పెద్ద సాంబయ్య, పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ డి. గోవర్ధన్ స్పష్టం చేశారు. స్వచ్ఛంద లాక్ డౌన్ విషయాన్ని  అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణకు, పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్  పెట్టెలి దాసు బాబుకు, అరకు లోయ సిఐ, ఎస్ఐ, తాసిల్దార్ కు తెలిపారు.

వాడపల్లి వెంకన్న ఆలయంలో అష్టోత్తర పూజలు

 వాడపల్లి వెంకన్న ఆలయంలో అష్టోత్తర పూజలు

పెన్ పవర్, ఆత్రేయపురం 

 వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి సమేతంగా స్వయంభూ సోమవారం పురస్కరించుకుని భక్తులు ఆలయానికి కరోనా నిబంధనలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి ఆలయం మండపంలో ఏర్పాటు చేసిన  అష్టోత్తర పూజ లో భక్తులు పాల్గొనడం జరిగింది ఆలయ ఈవో  ఆలయాన్ని ఎప్పటికప్పుడు సిబ్బందితో శానిటైజర్ చేయించడం జరుగుతుంది  ఈరోజు వచ్చిన ఆలయ ఆదాయ వివరములు ప్రత్యేక దర్శనం కు 5,700/- అన్నప్రసాదం  ఆదాయం 29,324/- సేవా ఆదాయం 71,720/- లడ్డు ఆదాయం16875/- ఇతర విరాళాలు2,624/- మొత్తం 1,26,243/- రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.

సత్యనారాయణ సేవలు మాస్టర్ సేవలు చిరస్మరణీయం

సత్యనారాయణ సేవలు మాస్టర్ సేవలు చిరస్మరణీయం








మెంటాడ , పెన్ పవర్ 

 జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మండల సత్యనారాయణ మాస్టర్ చేసిన సేవలు చిరస్మరణీయ మని పలువురు వక్తలు కొనియాడారు. సోమవారము మెంటాడ గ్రామంలో సత్యనారాయణ మాస్టర్ సంతాప సభ ను జన విజ్ఞాన వేదిక, గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు, యువత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు గండ్రేటి లక్ష్మణ్ రావు,జన విజ్ఞాన వేదిక సలహాదారు గండ్రేటి అప్పలనాయుడు మాట్లాడుతూ దివంగత మండల సత్యనారాయణ మాస్టారు ఒకపక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, మరోపక్క జనవిజ్ఞాన వేదిక ద్వారా మూఢనమ్మకాలు వట్టి  బూటకమని ఆయన సైన్స్ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం కోసం తీవ్రంగా కృషి చేశారని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన మద్యపాన నిషేధం, ప్లాస్టిక్ కవర్లు నిషేధంపై విస్తృతంగా ప్రసారం చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా భౌతికంగా దూరమైనా ఆయన చేసిన సేవలు బ్రతికే ఉన్నాయనీ, ఆయన ఆశయాలను కొనసాగించదానికి జన విజ్ఞాన వేదిక, మెంటాడ గ్రామస్తులు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

 పాడేరు, పెన్ పవర్

ఆదివాసీ బాలిక శ్రీవల్లిని దారుణంగా కొట్టి చంపిన కోళ్ల ఫారం యజమాని చిట్టి మోజు కమలాకర్ పై హత్య మరియు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఉరి తీయాలని సిపిఐ పాడేరు మండల కార్యదర్శి కూడ రాధాకృష్ణ   ఆదివాసి జెెెెఏసి లీగల్ అడ్వైజర్ తమర్బ ప్రసాద్ నాయుడు, డిమాండ్ చేశారు. వారుు మాట్లాడుతూ పాడేరు మండలం లగిసిపల్లి పంచాయతీ, పార్వతి పురం గ్రామంలో కోళ్ల ఫారం  యజమాని  ఆదివాసి యే తరుడైైన చిట్టి వేూజు కమలా కర్ కోళ్ల  పారం లో  పొట్ట కూటి కోసం పని చేసుకుంటున్నా  హుకుంపేట మండలం, తడిగిరి గ్రామం  నివాసి అయిన గోల్లూరి రాంబాబు,  భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని, శ్రీవల్లి ని  చిట్టి మోజు కమలాకర్ తన ఇంటి వద్దకు తీసుకువెళ్లి, పసిపాప  నీ చూడకుండా అత్యంత కిరాతకంగా, కొట్టి చంపి శవాాన్ని  ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ నుంచి పరారై పోలీస్ స్టేషన్ కి  వెళ్లి లొంగి పోయిన   చిట్టి మోజు కమలాకర్  అనే మానవ మృగానికి   ఉరిశిక్ష వేయాలని  , గోల్లూరి రాంబాబు కుటుంబానికి, నష్టపరిహారం చెల్లించాలని, సిపిఐ పార్టీ పాడేరు మండల కార్యదర్శి కూడా రాధాకృష్ణ, ఆదివాసి జేఏసి లీగల్ అడ్వైజర్ తమర్బ ప్రసాద్ నాయుడు ఒక ప్రకటనలో డిమాండ్ చేసినారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...