భక్తి శ్రద్ధలతో గీతా యజ్ఞం...
సంతబొమ్మాళి, పెన్ పవర్
సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ చొక్కర వాని పేట గ్రామం లో శ్రీ రాధా వేణుగోపాల స్వామి ఆలయం వద్ద గీతా యజ్ఞం కార్యక్రమాన్ని తేజా రావు, గణపతి, ఆధ్వర్యంలో మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భగవత్ గీత లోని 18అధ్యాయాలలో ఉన్న 701శ్లోకాలు చదివి హోమం చేశారు.అలాగే చైత్ర మాసం చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా నౌపడ పంచాయతీ సీతానగరం గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో స్వామివారికి సహస్ర తులసి పూజలు,రామ పారాయణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు నాగేశ్వర శర్మ నిర్వహించారు.పెద్దమర్రిపాడు పాండురంగ విట్టల్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.సంతబొమ్మాళి నారా యణ క్షేత్రం లో విశేష పూజలు నిర్వహించారు.
No comments:
Post a Comment