Followers

Showing posts with label DEVOTIONAL. Show all posts
Showing posts with label DEVOTIONAL. Show all posts

కరోన బారినుండి ప్రజలు బయటపడాలని ప్రార్థనలు

కరోన బారినుండి ప్రజలు బయటపడాలని ప్రార్థనలు

తాళ్లపూడి, పెన్ పవర్

పవిత్రమైన రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమం బుధవారం వేగేశ్వరపురం గ్రామంలో జరిగింది.  వేగేశ్వరపురం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ జిలాని  సచివాలయ సిబ్బంది సహాయంతో కోవిడ్ ఆంక్షల నియమావళి మరియు కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు పాటించి  గ్రామంలో ఉన్న 25 కుటుంబాల వారి ఇంటికి వెళ్లి ఇఫ్తార్ విందు అందజేయడం జరిగింది. వేగేశ్వరపురం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కోవిడ్ బారినుండి బయటపడాలని ప్రార్ధన చేశారు.


సింహాచల ఉద్యోగులకు వ్యాక్సినేషన్

 సింహాచల ఉద్యోగులకు వ్యాక్సినేషన్

విశాఖపట్నం సింహాచలం 


శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి సహా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్. ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి సలహామేరకు ఈ ఓ సూర్యకళ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని ఆదేశించారు. దీంతో తొలిరోజు 150 మందికి వ్యాక్సినేషన్ వేయించారు ఆలయ ఉద్యోగులందర్నీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు.

ఘనంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి14వ వార్షికోత్సవం

 ఘనంగా  శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి14వ వార్షికోత్సవం..

పెన్ పవర్, కాప్రా

కాప్రా డివిజన్ లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవం సందర్భంగా హోమము ధ్వజారోహణం నిర్వహించారు. అభిరాం శర్మ  రుత్వికులు. అర్చకులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఈ సంవత్సరం కోవిడ్  నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమం చేసామని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ కరోన మహమ్మారి దేశం నుండి తరిమి కొట్టే విధంగా అందరూ జాగ్రత్తలు పాటించాలని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దయా భక్తులపై ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో  రవి మూర్తి శర్మ ,కే కిరణ్ చార్యులు.పీ హరినాథ్ శర్మ , ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఎర్ర అశోక్ కుమార్ గౌడ్ చైర్మన్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి జె కృష్ణమాచార్యులు, ధర్మకర్త లు చిన్నమ్మ రాజు వెంకటరమణ, మండల , నవీన్ కుమార్ గౌడ్ శ్రీమతి  బచ్చు అరుణ జ్యోతి, కొప్పుల కుమార్ , గోగికర్ నవీన్ కుమార్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

నూతన రామాలయం లో విగ్రహ పునఃప్రతిష్ట చేసిన బీజేపి నేత కరణంరెడ్డి దంపతులు

 నూతన రామాలయం లో  విగ్రహ పునఃప్రతిష్ట చేసిన బీజేపి నేత కరణంరెడ్డి దంపతులు 

గాజువాక, పెన్ పవర్

గాజువాక పాత కర్నవానిపాలెం లో శ్రీ సీతారామాలయ సమేత శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కళ్యాణ సుబ్రమణ్యేశ్వర దేవాలయం విగ్రహ పుణః ప్రతిష్ట చివరి రోజు పూజలో బీజేపి గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి. నరసింగరావు జ్యోతి దంపతులు పాల్గొని పూర్ణాహుతి హోమం మరియు నూతన యంత్ర చక్రం పూజలు అనంతరం వేదపండితులు ఉదయ బాస్కర్ శర్మ,రవిరుమార్ శర్మ ఆద్వర్యంలో యంత్ర మూర్తి శిఖర నాగబంధ ధ్వజ స్థంబ నూతన విగ్రహ పునఃప్రతిష్ట నిరాడంబరముగా జరుగాయని తొలి పూజలో కే.ఎన్.ఆర్  జ్యోతి దంపతులు పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గొంతిన.దేముడు, కార్యదర్శి మడగల.కన్నయ్య,సంయుక్త కార్యదర్శి జనపరెడ్డి .మణి,దుర్గానగర్ శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల.అప్పలసూరి ,జనపరెడ్డి. సురేష్,సాలాపు.నూకరాజు,సాలాపు.గోవింద, కోశాదికారి కరణం.రామకృష్ణ,సిరసపల్లి ఈశ్వరరావు, గంతకోరు.నారాయణ, ఇందల.వెంకటేష్ , సుదమల్ల. కిరణ్,కరణం.ప్రసాద్,జనపరెడ్డి రామకృష్ణ , వరహాలరావు, గొంతిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ నిబంధనల నడుమ విగ్రహ ప్రతిష్ఠ

కోవిడ్ నిబంధనల నడుమ విగ్రహ ప్రతిష్ఠ

గుమ్మలక్ష్మీపురం,  పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట రామాలయం ఆలయ ప్రాంగణంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కోవిడ్ నిబంధనల నడుమ జరిగింది. గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన  విశ్రాంత ఉపాధ్యాయుడు మద్ది. ఢిల్లీశ్వరరావు,కుసుమా దంపతులు సుమారు లక్షా తొంభై వేల రూపాయలు సొంత నిధులను వెచ్చించి ప్రతిష్ట కార్యక్రమాన్ని శాస్ర్తోత్తమంగా నిర్వహించారు  ఈ కార్యక్రమంతో పాటుగా కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

మూర్రాట తో అమ్మవారికి పూజలు

 మూర్రాట తో అమ్మవారికి పూజలు

శ్రీకాకుళం, పెన్ పవర్

 స్థానిక పెదరెల్లి వీధి  శబరి యువ జనసేవ సంఘం యువకులు ఆదివారం  కరోనా వైరస్ మహమ్మారి  నుండి జిల్లాని  రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలని మహిళలతో కలిసి అమ్మవార్లకు మూర్రాట లతో పాదయాత్ర నిర్వహించారు. శ్రీ విజయదుర్గా అమ్మవారి కి మూర్రాటతో అమ్మవారికి చల్లదనం చేశారు. అక్కడి నుండి  ముత్యాలమ్మ, నూకాలమ్మ, మరిడమ్మా లకు మూర్రాటలతో  చల్లదనం చేసారు. ఈ సందర్బంగా జిల్లా నాల్గవ తరగతి అధ్యక్షులు అరుగుల తారకేశ్వరరావు మాట్లాడుతూ  దేశాన్ని  కరోనా మహమ్మారి కమ్మేస్తోందని, ఈ విపత్తు నుండి కాపడాలని  నగరం లొ ఉన్న  అమ్మవార్లకు మూర్రటలు సమర్పిచడం జరిగిందన్నారు. ప్రజలందరూ  భయానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని  ఈ వైరస్ ను  ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.  విధిగా మాస్క్, శానిటైజర్ ని వాడాలని, భౌతిక దూరం పాటించాల అన్నారు. ప్రభుత్వం వారి సూచనలను తప్పని సరిగా పాటించాలని కోరారు.


చందనోత్సవానికి సన్నద్ధత

చందనోత్సవానికి సన్నద్ధత 

సింహాచలం, పెన్ పవర్

             కోవిడ్ -19 దృశ్యా ముందు జాగ్రత్తల్లో భాగంగా ఆదివారం (02-05-21) నుంచి సింహాచలం ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం 2:30 గంటల వరకే దర్శనాలు  కల్పించాలని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవో ఎం.వీ సూర్యకళ ,  ఇతర అధికారులు నిర్ణయించారు.  ఉదయం 6:30  గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే భక్తులను ఆలయంలోపలికి అనుమతిస్తారు. అయితే స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ యథాతథంగా రాత్రి 9:00 గంటలకు అంటే పవళింపు సేవ వరకు జరుగుతాయి. వాటిలో ఎలాంటి మార్పు ఉండబోదు.  మొత్తం 22 మంది ఆలయ అర్చకుల్లో 14 మంది అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారు. కరోనా పాజిటివ్  కాకపోయినా ఏమాత్రం ఒంట్లో బాగలేకపోయినా, లక్షణాలు కనిపించినా ఆలయ ఈవో సూర్యకళ గారి ఆదేశాల మేరకు సెలవు ఇవ్వడం జరిగింది. వారందరికీ టెస్టులు చేశారు - ఫలితాలు రావాల్సి ఉంది.  అర్చకులతోపాటు ఆలయ ఉద్యోగులందర్నీ  రాబోయే చందనాత్సవానికి సన్నద్ధం చేయాలంటే ఈ కరోనా కష్టకాలంలో కొంత విశ్రాంతి అవసరమని భావించడమైనది. అందుకే భక్తులకు దర్శనాలను మధ్యాహ్నం 2:30 గంటల వరకే పరిమితం చేయడమైనది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారని గమనించగలరు. భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారిని ఉదయంపూట దర్శించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.


చిల్కానగర్ డివిజన్ లో రంజాన్ తోఫా పంపిణీ

 చిల్కానగర్ డివిజన్ లో రంజాన్ తోఫా పంపిణీ 

తార్నాక,  పెన్ పవర్ 

 చిల్కానగర్ డివిజన్ లో చిల్కానగర్ పెద్ద మసీదు (మజీద్ ఈ అక్స ) లో  రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రంజాన్ తోఫాలను చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో  250 రంజాన్ తోఫా లను ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా. కార్పొరేటర్ మాట్లాడుతూ  కష్టకాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయమని, ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఖచ్చితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశించడం నిజంగా కూడా అటువంటి గొప్ప సీఎం తెలంగాణ ప్రజలకు దొరకడం చాలా అదృష్టం అని అన్నారు. డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం సోదరులను అదేవిధంగా అన్ని వర్గాలను అక్కున చేర్చుకొని ఇట్లాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా  రంజాన్ పండుగను   దృష్టిలో పెట్టుకొని వారికి దుస్తులు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో  మస్జీద్ ఏ అక్సా అధ్యక్షులు ఎండీ యూసుఫ్, వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, జనరల్ సెక్రటరీ మహమ్మద్ హనీఫ్, జాయింట్ సెక్రటరీ నజీర్ అలీ ఖాన్, ట్రెజరర్ మహమ్మద్ గౌస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ రహీం, మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి, కొంపల్లి రాజ్ కుమార్, ఆబ్బు భాయ్, కుమార్,పరమేష్,పుష్ప రాజ్,బింగి శ్రీనివాస్, ముద్దం శ్రీనివాస్, మహమూద్, ఫారుక్,  సాయినాజ్ బేగం,సంతోష్ నాయక్,బాలు సుందర్, కుమార్, శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.

సింహాచల కొండపై అన్ని సేవలూ ఒకే చోట ఈ.ఓ, సూర్యకళ

 సింహాచల కొండపై అన్ని సేవలూ ఒకే చోట ఈ.ఓ, సూర్యకళ

సింహాచలం, పెన్ పవర్

సింహాచలం దేవస్థానం ఈ.ఓ గా బాధ్యతలు చేపట్టాక సంస్కరణలు, అవసరమైన మార్పులకు ఎంవీ.సూర్యకళ శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా భక్తులకు సేవలను అందించే విషయంలో ఆమె ఏమాత్రం రాజీ పడటం లేదు. ఇందులో భాగంగానే కంప్లైంట్ సెల్ ఏర్పాటుచేశారు.భక్తులకు ఏమాత్రంఅసౌకర్యంకలిగినా దేవస్థానం భూముల విషయంలో ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చంటూ రెండు ఫోన్ నంబర్లు (0891-2764949, 9398523937),కంప్లైంట్లు స్వీకరణ బాధ్యత సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఇవ్వడం జరిగింది. కొండపై టికెట్లు ఇచ్చే చోటు ఒక దగ్గర, విరాళాలు స్వీకరించే ప్రాంతం మరోదగ్గర, ప్రొటోకాల్ -కొండపై రూంలు బుకింగ్ కౌంటర్ ఇంకో చోట ఉండటంతో భక్తులు, దాతలు గందరగోళానికి గురయ్యేవారు.

ఇప్పుడు దానికి చెక్ పెడుతూ...  విరాళాలు, టికెట్ల కౌంటర్లను పి.ఆర్.ఓ, ఆఫీసులో పెట్టడం జరిగింది. దీంతో భక్తులు ఎలాంటి సేవలు కావాలన్నా... గాలిగోపురం ఎదురుగా ఉండే పీఆర్వో ఆఫీసులో పొందవచ్చు. కొండ కింద టికెట్ తీసుకోనివారు నేరుగా ఇక్కడే  వచ్చి ఆ సేవలను పొందవచ్చు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆపీసును తీర్చి దిద్దడం జరిగింది. అంతేకాదు కోవిడ్ నిబంధనల దృశ్యా  స్వామివారి దర్శనం దగ్గర క్యూలైన్లు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శనాలకోసం మూడు ప్రత్యేక ర్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవడం సులభమవుతోంది. ఈ సౌకర్యాలను శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి భక్తులు ఉపయోగించుకోవచ్చు.

కోనసీమ తిరుపతి ఆలయంలో కరోనా కలవరం

కోనసీమ తిరుపతి ఆలయంలో కరోనా కలవరం

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 వాడపల్లి కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత ఇక్కడ కొలువై ఉన్నారు  నిత్యం భక్తులతో రద్దీగా ఉండే వాడపల్లి దైవ క్షేత్రం కరోనా మహమ్మారి సెకండ్ వే  విజృంభన కారణంగా ఆలయ దర్శనాలు భక్తులకు కుదించారు  అయినా ఆలయ అర్చకులలో  ఒకరు కు కరోనా పాజిటివ్ రావడంతో మిగతా మిగిలిన అర్చకులను హోమ్  ఐ సొల్యూషన్ ఉండవలసిందిగా కోరారు అందువలన వాడపల్లి వెంకన్న దర్శనానికి 1.05.2021 నుండి8.05.2021 వరకు ఆలయ దర్శనానికి భక్తులను అనుమతించబోమని   ఆలయ ఈవో చెప్పడం జరిగినది.

కరోనా వైరస్ ను అంతమొందించడానికి బాట గంగమ్మకు పూజలు

కరోనా వైరస్ ను అంతమొందించడానికి  బాట గంగమ్మకు పూజలు 

మొరంపల్లి, పెన్ పవర్

ప్రపంచ దేశాలను  గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను అంతమొందించడానికి బాట  గంగమ్మ తల్లికి పూజలు  నిర్వహించారు .  వివరాలు లోకి వెళితే  ఐరాల మండలం, మొరంపల్లి  గ్రామంలో  వెలిసిన బాట గంగమ్మ తల్లికి గ్రామ ప్రజలు  అంబిలి తో   అమ్మవారికి అభిషేకము, పూజలు,  పొంగళ్ళు పెట్టి ఈ కరోనా వైరస్ ను నాశనం చేసి, కరోనా బారిన పడిన ప్రజలను  రక్షించాలని, ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని మొరంపల్లి గ్రామపంచాయతీ  మహిళలు పెద్ద ఎత్తున బాట గంగమ్మకు పూజా కార్యక్రమం నిర్వహించారు.  ఈ పూజ  కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు,  యువకులు  కరోనా నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.

శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

 శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

మెంటాడ, పెన్ పవర్ 

 మెంటాడ మండలం లోని, చింతలవలస గ్రామంలో నిర్మించిన శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో మెంటాడ మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డి సన్యాసినాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ  సాయి బాబా కు ప్రత్యేక వస్త్రాలను అందజేశారు. కరోనా నుంచి మండల ప్రజలను ఆశీర్వదించాలని ఆయన ఈ పూజను నిర్వహించారు. సాయిబాబా ఆశీస్సులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఈ పూజలను నిర్వహించారు.

వెలవెలబోతున్న వెంకన్న ఆలయం

 వెలవెలబోతున్న వెంకన్న ఆలయం

 పెన్ పవర్, ఆత్రేయపురం

 వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు నిత్యం భక్తులతో కళ కళ లాడే ఆలయం కరోనా  మహమ్మారి వల్ల వెల వెల బోతుంది దేశంలో కరోనా మహమ్మారి అతి భయంకరంగా సెకండ్ వే  మొదలైనది ఈ సెకండ్ వే లో ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వలన నిత్యం భక్తులతో ఉండే ఆలయాలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆలయానికి వచ్చే భక్తులకు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకుదైవాన్నిదర్శించుకునే  సమయాన్ని కుదించారు ఇలా చేయడం వలన భక్తుల రద్దీ తగ్గి కొంత వరకు కరోనాకు అడ్డుకట్ట వేయవచ్చని ఆలయ ఈవో తెలియజేశారు.

శ్రీ అంకమ్మ తల్లి, బాబా స్తూపానికి వితరణ

శ్రీ అంకమ్మ తల్లి, బాబా స్తూపానికి వితరణ        

పెన్ పవర్, కందుకూరు

పట్టణంలోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి మచిలీపట్నం వద్ద గల గూడూరులో 108 అడుగుల బాబా స్థూపానికి ఏపీఎస్ఆర్టీసీ  డి ఎం శ్రీమన్నారాయణ స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సమక్షంలో వెంకట రెడ్డికి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ అంకమ్మ తల్లి దేవాలయం అభివృద్ధికి 5116 రూపాయలు, బాబా స్తూపానికి 5116 రూపాయలు అందజేసిన శ్రీమన్నారాయణ కు వారి కుటుంబ సభ్యులకు అంకమ్మ తల్లి, బాబా కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. మచిలీపట్నం వద్ద  గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న 108 అడుగుల బాబా స్థూపానికి రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ఆధ్యాత్మిక కేంద్రంగా  మారబోతున్నదని, దాతల సహకారం మరువలేనిదని దాతలు అందరికీ బాబా ఆశీస్సులు ఆశీస్సులు తప్పక ఉంటాయని మహీధర్ రెడ్డి కోరారు.

భక్తిశ్రద్ధలతో గుంటి గంగమ్మ అమ్మవారి తిరునాళ్లు

 భక్తిశ్రద్ధలతో గుంటి గంగమ్మ అమ్మవారి తిరునాళ్లు.


పెన్ పవర్, తాళ్ళూరు

తాళ్లూరు మండలం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుంటి గంగా భవానీ  అమ్మవారి 96 వార్షికోత్సవం తిరునాళ్లు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూనే అమ్మవారి ని దర్శించుకుని పూజలు చేశారు.బుధవారం తెల్లవారుజామున  ఆలయ పూజారులు అమ్మవారికి అభిషేకం మహానైవేద్యం నివేదన చేశారు.గంగమ్మ అమ్మవారికి భక్తులు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం బహుళ విధియ నాడు అత్యంత వైభవంగా తిరునాళ్లు నిర్వహిస్తారు.రెండు సంవత్సరాలు నుంచి కరోనా నేపథ్యంలో విద్యుత్ ప్రభలు,సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుకు అధికారులు అనుమతించలేదు.

కరోనా మహమ్మారి తగ్గాలని హోమం

 కరోనా మహమ్మారి తగ్గాలని హోమం

మహారాణి పేట, పెన్ పవర్

కరోనా మహమ్మారి విజృంభించుచున్న నేపధ్యంలో ప్రజలు వ్యాధి వలన అధిక సంఖ్యలో మరణించుచున్న కారణంగా మహమ్మారి వైరస్ అంతరించి మన గ్రామ, జిల్లా,రాష్ట్ర,దేశప్రజలు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అఖిల భారత మానవహక్కుల పరిరక్షణ సమితి గౌరవ చైర్మన్  ఆదేశాలు మేరకు దేవాలయములో హోమం జరిపించిన ఏ.ఐ.హెచ్.ఆర్.పి.సి.ఏస్ సిటీ ప్రెసిడెంట్ కె.గణపతి. తదనంతరం గణపతి మాట్లాడుతూ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సానిటైజేర్ వాడాలని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.

కోదండ రామ స్వామి ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్

 కోదండ రామ స్వామి ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ 

చిత్తూరు,  పెన్ పవర్

 చిత్తూరు పట్టణ రామాలయం వీధి లోని శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయం లో బుధవారం మధ్యాహ్నం కల్యాణోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కోదండరామ స్వామి ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కు అర్చక స్వాములు మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన జిల్లా కలెక్టర్ కు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను సమర్పించారు. దేవస్థానం ఈఓ సుమన ప్రియ, ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

కాణిపాకం హుండీ ఆదాయం 30 రోజులకు 79,01,689/- రూపాయలు ఆదాయం

 కాణిపాకం హుండీ ఆదాయం 30 రోజులకు 79,01,689/-  రూపాయలు ఆదాయం

కాణిపాకం,  పెన్ పవర్

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక/స్వామి వారి దేవస్థానం వారు ఈరోజు  28-04-2021 వ తేదీ  బుధవారం  శ్రీ స్వామి వారి హుండీ  లెక్కింపు ద్వారా 30 రోజులకు  -79,01,689/- రూపాయలు  భక్తుల నుంచి వివిధ కానుగుల ద్వారా  లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి  వెంకటేశు  తెలియజేశారు. ఈ  హుండీ ఆదాయం లో

బంగారం-85.గ్రాములు.

వెండి- 900. గ్రాములు.

విదేశీ కరెన్సీ

యు ఎస్ ఏ- 381.డాలర్స్.

ఆస్ట్రేలియా - 20. డాలర్స్

యూరో - 110.యూరోస్.

ఇంగ్లాండ్ - 5. పౌన్స్ 

యూఏఈ- 10..దిర్హామ్స్ 

ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో శ్రీ ఏ.వెంకటేశు తెలిపారు. 

ఈ హుండీ లెక్కింపు లో  పాల్గొన్నవారు, చిత్తూరు జిల్లా దేవాదాయశాఖ  అసిస్టెంట్ కమిషనర్- ఏకాంబరం, కాణిపాకం దేవస్థానం  అసిస్టెంట్ కమిషనర్ - కస్తూరి, ఏఈఓలు చిట్టెమ్మ, విద్యాసాగర్ రెడ్డి, చంద్రశేఖర్, సుధారాణి, సి ఎఫ్ ఓ-బి,యన్ నాగేశ్వరరావు,  పర్యవేక్షకులు - ప్రసాద్, శ్రీధర్ బాబు, కోదండపాణి, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మసీదుల అభివృద్ధికి వితరణ

మసీదుల అభివృద్ధికి వితరణ 

పెన్ పవర్, కందుకూరు

పట్టణంలోని 14 మసీదుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు విశ్రాంత ఎస్టిఓ షేక్ షరీఫ్ బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమిటీ బాధ్యులు షేక్ మహబూబ్ బాషా కు 5,116 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా  మహబూబ్ బాషా మాట్లాడుతూ దాతలు మసీదుల అభివృద్ధి కి విరాళాలు అందజేసి అల్లా కృపకు పాత్రులు కాగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.

ప్రతి శనివారం మూసివేస్తున్న వాడపల్లి వెంకన్న ఆలయ తలుపులు

 ప్రతి శనివారం మూసివేస్తున్న వాడపల్లి వెంకన్న ఆలయ తలుపులు 

 పెన్ పవర్, ఆత్రేయపురం

  వాడపల్లి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత ఇక్కడ కొలువై ఉన్నారు వీరిని దర్శించుకోవడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వాడపల్లి వెంకన్న దర్శనానికి ప్రతి శనివారం వేలాది లో భక్తులు తరలి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది కరో నా మహమ్మారి సెకండ్ వే తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల  ఆలయానికి వచ్చే భక్తులకు  ఎటువంటి ఇబ్బంది కలగకుండా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి శనివారం గుడి పూర్తిగా మూసి వేయడం అయినదని ఆలయ ఈవో చెప్పడం జరిగినది.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...