Followers

చిల్కానగర్ డివిజన్ లో రంజాన్ తోఫా పంపిణీ

 చిల్కానగర్ డివిజన్ లో రంజాన్ తోఫా పంపిణీ 

తార్నాక,  పెన్ పవర్ 

 చిల్కానగర్ డివిజన్ లో చిల్కానగర్ పెద్ద మసీదు (మజీద్ ఈ అక్స ) లో  రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రంజాన్ తోఫాలను చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో  250 రంజాన్ తోఫా లను ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా. కార్పొరేటర్ మాట్లాడుతూ  కష్టకాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయమని, ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఖచ్చితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశించడం నిజంగా కూడా అటువంటి గొప్ప సీఎం తెలంగాణ ప్రజలకు దొరకడం చాలా అదృష్టం అని అన్నారు. డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం సోదరులను అదేవిధంగా అన్ని వర్గాలను అక్కున చేర్చుకొని ఇట్లాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా  రంజాన్ పండుగను   దృష్టిలో పెట్టుకొని వారికి దుస్తులు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో  మస్జీద్ ఏ అక్సా అధ్యక్షులు ఎండీ యూసుఫ్, వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, జనరల్ సెక్రటరీ మహమ్మద్ హనీఫ్, జాయింట్ సెక్రటరీ నజీర్ అలీ ఖాన్, ట్రెజరర్ మహమ్మద్ గౌస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ రహీం, మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి, కొంపల్లి రాజ్ కుమార్, ఆబ్బు భాయ్, కుమార్,పరమేష్,పుష్ప రాజ్,బింగి శ్రీనివాస్, ముద్దం శ్రీనివాస్, మహమూద్, ఫారుక్,  సాయినాజ్ బేగం,సంతోష్ నాయక్,బాలు సుందర్, కుమార్, శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...