Followers

ముస్లిం సోదరులకు రంజాన్ కానుక..శిరీష రెడ్డి

 ముస్లిం సోదరులకు రంజాన్ కానుక..శిరీష రెడ్డి 


పెన్ పవర్,  కాప్రా

ఎ.ఎస్.రావు నగర్ డివిజన్ లోని మహమ్మదీయ మసీదులో రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ తోఫా లను డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శిరీష మాట్లాడుతూ కరోన వైరస్ రెండవ దశ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటిస్తూ స్వీయనియంత్రణ స్వీయ పరిశుభ్రత పాటించాలని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కోవిడ్  నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని  కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, నాను లలిత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...