Followers

దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలి

 దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలి 

ఓయూలో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం ప్రారంభించాలి

ఏ ఐ ఎస్ ఫ్  డిమాండ్ 

తార్నాక,  పెన్ పవర్

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ గా ఇవ్వాలని ఏ ఐ ఎస్ ఫ్ జాతీయ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యం లో  ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఐ ఎస్ ఫ్ కౌన్సిల్ ఆర్ట్స్ కళాశాల ముందు ఆందోళన నిర్వహించింది దేశంలోని ప్రజలందరికీ ఫ్రీ గా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన *రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ ఆర్. ఎన్ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షు లు పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ  ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వంకి డిమాండ్ చేశారు.  గతంలో  దేశంలో సంభవించిన అనేక వ్యాధులకు ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్,టీకాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. మోడీకి దేశ ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు. ప్రజలందరికీ ఫ్రీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేదాకా పోరాడుతామని ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఐ ఎస్ ఫ్ కార్యదర్శి క్రాంతి రాజ్ మాట్లాడుతూ ఓయూ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు కరోనా మహమ్మారి కి బలి కావడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ల,ఉద్యోగుల ఆరోగ్యం పరిరక్షణకు యూనివర్సిటీ అధికారులు  ఓయూ లోనే కరోనా వ్యాక్సిన్ పంపిణి సెంటర్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఓయూ హెల్త్ సెంటర్ నీ మౌలిక సదుపాయాలు కల్పించి కరోనా ఐసొలేషన్   కేంద్రంగా  మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లో ఏ ఐ ఎస్ ఫ్ ఓయూ నేతలు రహమాన్, రాజు, పవన్, లింగస్వమి, నిఖిల్, అన్వర్, హరీష్, చిన్న, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...