Followers

Showing posts with label DEVOTIONAL. Show all posts
Showing posts with label DEVOTIONAL. Show all posts

ఉల్లాసభరితంగా శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి "వినోదోత్సవం"

 ఉల్లాసభరితంగా శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి "వినోదోత్సవం"

సింహాచలం, పెన్ పవర్

వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా చివరి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో వినోదోత్సవం నిర్వహించారు.కోవిడ్ నిబంధనల మేరకు పరిమిత భక్తులు,సిబ్బంది మధ్య సంప్రదాయబద్ధంగా  వినోదోత్సవం,ముత్యాల పల్లకి సేవ,ఉంగరపు సేవలు జరిపారు.కన్నుల విందుగా భక్తులు వీక్షించారు.మొత్తం ప్రక్రియ నాటకీయంగా నిర్వహించారు. 

 

నేపథ్యం: ఉంగరపు సేవకు ముందు రోజు స్వామివారు తిరువీధి ఉత్సవంలో ఉంగరం పోతుంది. ఉంగరం వెతికి తెచ్చి తన దగ్గరకు రావాలని స్వామివారిని అమ్మవారు కోరగా ఇవాళ ఉదయం సుప్రభాత సేవ అనంతరం ఏడు ముసుగులు వేసుకుని స్వామివారు గ్రామపర్యటనకు వెళ్లారు. ఆఖరి ముసుగులో చివరికి ఉగరం తన దగ్గరే ఉందని తెలుసుకుంటారు.స్వామివారి వస్త్రంలోనే ఉంగరం చిక్కుకుపోయి ఉంటుంది దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఉంగరం దొరికాక సంవాదం జరిగింది. తర్వాత బంతులాట ఇదంతా ముగిశాక స్వామివారు చివరికి అమ్మవారి దగ్గరకు వెళ్తారు ఉంగరాన్ని వెతకడంలో భాగంగా పలువురు భక్తులను కూడా చెక్ చేయడంతో తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు కార్యక్రమమంతా నాటకీయంగా సంప్రదాయబద్ధంగా జరిగింది.

కరోనా నియమాలతో హుండీ లెక్కింపు

కరోనా నియమాలతో  హుండీ లెక్కింపు

 కాణిపాకం, పెన్ పవర్

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక  స్వామి వారి దేవస్థానం నందు బుధవారం  కోవిడ్  నియమాలతో తక్కువ మంది తో హుండీ కౌంటింగ్ కార్యక్రం  నిర్వహించబడును.  కాణిపాకం ఆలయం  కార్యనిర్వహణాధికారి వెంకటేశు తెలియజేశారు.

భక్తి శ్రద్ధలతో గీతా యజ్ఞం...

 భక్తి శ్రద్ధలతో గీతా యజ్ఞం...

సంతబొమ్మాళి, పెన్ పవర్

 సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ చొక్కర వాని పేట గ్రామం లో  శ్రీ రాధా వేణుగోపాల స్వామి ఆలయం వద్ద గీతా యజ్ఞం కార్యక్రమాన్ని తేజా రావు, గణపతి, ఆధ్వర్యంలో మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భగవత్ గీత లోని 18అధ్యాయాలలో ఉన్న 701శ్లోకాలు  చదివి హోమం చేశారు.అలాగే చైత్ర మాసం చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా నౌపడ పంచాయతీ సీతానగరం గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో స్వామివారికి సహస్ర తులసి పూజలు,రామ పారాయణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు నాగేశ్వర శర్మ నిర్వహించారు.పెద్దమర్రిపాడు పాండురంగ విట్టల్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.సంతబొమ్మాళి నారా యణ క్షేత్రం లో విశేష పూజలు నిర్వహించారు.

ఏక కుండాత్మక హోమ పూర్ణా హుతి

 ఏక కుండాత్మక హోమ పూర్ణా హుతి


బెల్లంపల్లి,  పెన్ పవర్

 బెల్లంపల్లి పట్టణంలో గల శ్రీ కోదండరామాలయంలో శ్రీ రామ నవమి పురస్కరించుకుని జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా  ఏక కుండాత్మక సుదర్శన హోమం ఆఖరిరోజు పూర్ణాహుతి మరియు స్వామి వారికి చక్రతీర్ధ (చక్రస్నానం) శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కోవిడ్19 నిబంధనల ప్రకారం ఆలయ చైర్మన్ శ్రీ రేణికుంట్ల శ్రీనివాస్ ,ధర్మకర్తలు మరియు అర్చకులు పాల్గొన్నారు.

శ్రీ కరకచెట్టు పొలమాంబ అమ్మవారి పూజలో పాల్గొన్న మేయర్ దంపతులు

 శ్రీ కరకచెట్టు పొలమాంబ అమ్మవారి పూజలో పాల్గొన్న మేయర్ దంపతులు

విశాఖ తూర్పు, పెన్ పవర్

శ్రీ శ్రీ శ్రీ కరకచెట్టు పొలమాంబ ఆలయ వార్షిక మహోత్సవం సందర్భంగా మేయర్ గొలాగాని హరి వెంకట కుమారి, శ్రీనివాస్ దంపతులు అమ్మవారి పూజా లో పాల్గొన్నారు.అమ్మవారికి పసుపు,కుంకుమ, చీరను సమర్పించారు.అమ్మవారి పూజ అనంతరం ఆలయ అర్చకులు  తీర్ధ ప్రసాధములు సమర్పించారు. అనంతరం అమ్మవారి ప్రతిమను అందజేశారు. అమ్మవారు పూజ లో పాల్గొనడం సంతోషం కలిగిందని అన్నారు.

అందరూ మాస్కులు ధరిస్తూ బయటకి రావాలని,అలాగే సానిటైజర్ తప్పకుండా వాడాలని, అమ్మవారి కృప ప్రజలపై వుంటుందని,అమ్మవారి శక్తితో కరొనా ను త్వరలో తరిమివేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డ్ కార్పొరేటర్ మువ్వల.లక్ష్మి సురేష్,22వ వార్డ్ ఇంఛార్జి పీతల గోవింద్, పిల్లా.సత్యవతి (విశాఖ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్) పార్టీ శ్రేణులు పలికల.నీలరెడ్డీ, ఆలయ అర్చకులు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

మసీదుల అభివృద్ధికి వితరణ

 మసీదుల అభివృద్ధికి వితరణ 

పెన్ పవర్, కందుకూరు

పట్టణంలోని 14 మసీదుల అభివృద్ధికి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సి ఐ షేక్ ఖాజా మొహిద్దీన్ 5,116 రూపాయలు కమిటీ బాధ్యులు షేక్ మహబూబ్ బాషా కు  స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి కూడా ఉన్నారు.

వాడపల్లి వెంకన్న దర్శనానికి నిబంధనలు

 వాడపల్లి వెంకన్న దర్శనానికి నిబంధనలు

 పెన్ పవర్, ఆత్రేయపురం

 వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత స్వయంభూ స్వామి వారి యొక్క దర్శనార్థమై  కరోనా సెకండ్ వే  అతి తీవ్రంగా ఉండడం వల్ల ఆలయము దర్శనం కోసం వచ్చే భక్తులకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల ప్రకారం శనివారం మినహా మిగతా రోజులలో ఉదయం 8 గం నుండి 10 వరకు కేవలం దర్శనం కు మాత్రమే భక్తులకు అనుమతించబడుతుంది. .

అష్టోత్రం నిత్యకల్యాణం  కేశఖండన అన్నప్రసాదం తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ నిలిపివేయడం అయినదని ఆలయ ఈవో తెలియజేశారు శనివారం భక్తుల రద్దీ అదుపు చేయడం కష్టసాధ్యం అయినందువలన శనివారం దర్శనం పై నిర్ణయానికై  ఉన్నతాధికారుల నుండి ఆమోదం పొందవలసి ఉంటుందని తెలియజేశారు.

భక్తిశ్రద్ధలతో నూతన హనుమాన్ మందిర్ ప్రారంభం

 భక్తిశ్రద్ధలతో నూతన హనుమాన్ మందిర్ ప్రారంభం...

 నార్నూర్, పెన్ పవర్ 

గాదిగుడా మండలంలోని ఖండో రాంపూర్ గ్రామంలోని నూతనంగా నిర్మించిన హనుమాన్ మందిర్ జెండా కార్యక్రమాన్ని గ్రామ పటేల్  జంగు, సిత్రు, స్థానిక సర్పంచ్ ఆత్రం మహేశ్వరి వామన్ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నూతన హనుమాన్ మంత్రాన్ని ప్రారంభించారు. కోవిడ్19 నియమా నిబంధాలు భౌతిక దూరని పాటిస్తూ  హనుమాన్ జయంతి సందర్బంగా హనుమాన్ మందిర పూజలు చేసి 51జతల బట్టలను వస్త్రదానం చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ హెచ్ కే సిత్రు, మెస్రం దేవురావు, తొడసం పాండు, ఆత్రం నగోరావు, సిడం వామన్, ఆత్రం వామన్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్,పద్మజ దంపతులు

పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్,పద్మజ దంపతులు

విశాఖ తూర్పు, పెన్ పవర్

శ్రీ శ్రీ శ్రీ కరకచెట్టు పొలమాంబ ఆలయ వార్షిక మహోత్సవం సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్,పద్మజ దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అమ్మవారికి పసుపు,కుంకుమ,చీరను సమర్పించారు.అమ్మవారి పూజ అనంతరం ఆలయ అర్చకులు  తీర్ధ ప్రసాధములు స్వీకరించారు.

అనంతరం అమ్మవారి ప్రతిమ ను అందజేశారు.వంశీకృష్ణ మాట్లాడుతూ 14 గ్రామాలకు ఆరాధ్య దైవమైన అమ్మవారు పూజ లో పాల్గొనడం సంతోషం కలిగిందని అన్నారు.అమ్మవారి శక్తితో కరొనా ను త్వరలో తరిమివేస్తుందని అన్నారు. అంగరంగ వైభవంగా భారీ ఏర్పాట్లు కు కరొనా అడ్డంకిగా మారిందని,అందరూ ఆరోగ్యంతో అమ్మవారు దయతో వచ్చే సంవత్సరం ఘనంగా జరుపుకోవచ్చు అన్నారు.కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

నేడు కరప గ్రామదేవత ఉప్పాలమ్మ తీర్థం

 నేడు కరప గ్రామదేవత ఉప్పాలమ్మ తీర్థం

పెన్ పవర్, కరప

మండల కేంద్రమైన కరప గ్రామదేవత ఉప్పాలమ్మ తీర్థం మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు ఆలయకమీటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతియేట చైత్యమాసంలో పౌర్ణమిరోజున గ్రామదేవత తీర్థం జరుగుతుంది. గ్రామంలో 15 రోజులు ముందునుంచి అమ్మవారి ప్రతిరూపమైన గరగలను ఊరేగించి,ముందురోజు రాత్రి తెల్లవార్లు గరగ నృత్యాలు,గారడీ, డప్పువాయిద్యాలతో జాతర కార్యక్రమాన్నినిర్వహిస్తారు. కరప గ్రామదేవత ఉప్పలమ్మ తీర్థాన్ని గ్రామస్తులు ఇచ్చిన విరాళాలతో ఆలయ కమిటీ నిర్వహించడం పరిపాటి. గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల వారు వచ్చి ఉప్పాలమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని, ప్రసాదాలు స్వీకరిస్తారు.

చింతపల్లి ముత్యాలమ్మ జాతర రద్దు

 చింతపల్లి ముత్యాలమ్మ జాతర రద్దు

పెన్ పవన్ బ్యూరో -(విశాఖపట్నం)

 కరోనా  రెండవ దశ ఉధృతమవుతున్న కారణంగా మన్యం లోని చింతపల్లి లో  జరిగే ముత్యాలమ్మ జాతరను రద్దు చేస్తున్నట్లు  ఉత్సవ కమిటీ అధ్యక్షులు బాలయ్య బేతాళుడు ప్రకటించారు. మే నెల 8 నుంచి 11వ తేదీ వరకు ముత్యాలమ్మ జాతర అత్యంత వైభవంగా జరిపేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తండోప తండాలుగా తరలి వస్తారని ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడి సమస్యగా మారుతోందని వారు భావించారు. ఈనేపద్యంలో  కమిటీ సమావేశమై ప్రజారోగ్య దృశ్య జాతరలు నిర్వహించడం సరైనది కాదని  నాలుగు రోజులు నిర్వహించే జాతరను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి దృష్ట్యా ముత్యాలమ్మ జాతరను రద్దు చేయడం జరిగిందని స్థానికులు భక్తులు గమనించి సహకరించాలని కోరారు. మే 11వ తేదీన కరోనా నిబంధనలను పాటిస్తూ 100 మంది వరకు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తామని బాలయ్య బేతాళుడు తెలిపారు. భక్తులు గమనించి ఇల్ల కే పరిమితమై  ముత్యాలమ్మ పండగను జరుపుకోవాలని వారు పేర్కొన్నారు.

ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని సందర్శించిన ఖురాన్ .భగవద్గీత. బైబిల్ భోధకుడు

 ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని  సందర్శించిన  ఖురాన్ .భగవద్గీత.  బైబిల్ భోధకుడు

కృతజ్ఞతలు తెలిపిన స్థానిక ముస్లిం సోదరులు

 ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

 ఎల్లారెడ్డిపేట మండలాన్ని  శుక్రవారం  రాష్ట్ర ఖురాన్ భగవద్గీత బైబిల్ బోధకుడు అన్ని మతాలను గౌరవిస్తూ వారి వారి మతాల్లో చక్కని బోధన అందిస్తూ మన రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలబడ్డ  యునివెర్సల్ ఇస్లామిక్ రిచర్చ్ సెంటర్ జనరల్ సెక్రెటరీ  సిరాజుద్దీన్ సహాబ్ ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని సందర్శించారుఎల్లారెడ్డిపేట మండల కేంద్రాన్ని  సందర్శించడానికి  వచ్చిన  సందర్భంగా సిరాజుద్దీన్ సహాబ్ అన్నీ మతాల వారికి  రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలుపుతూ అల్లా భగవంతుడు అందర్నీ సుఖ సంతోషాల తో ఉంచాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మంచి సందేశాన్నీ  ఇచ్చారు. హిందు.ముస్లీం. క్రైస్తవవులు బాయి బాయి అని ఆయన అన్నారు. ఎల్లారెడ్డిపేట ను సందర్శించడానికి వచ్చిన  ఆయనకు  ఎల్లారెడ్డిపేట మండల ముస్లిం సోదరులు ఆయూభ్. గౌస్.లాల్ బాయ్. అలీమోద్దీన్. షాదుల్. అజ్జు. మజ్జు. అలీ తదితరులు స్వయంగా కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

10 సంవత్సరాలలో రంజాన్ ఉపవాసం చేపడుతున్న అశనఫారియా.

 10 సంవత్సరాలలో రంజాన్ ఉపవాసం చేపడుతున్న అశనఫారియా...

నార్నూర్, పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం లోని మన్కపూర్ గ్రామపంచాయతి రాజుల్ గూడా గ్రామంలో  ఆశనఫారియా అనే బాలిక (10) సవంత్సరాలలోనే నెలరోజులుగా ఎంతో నియమ నిష్టలతో ధరించే రంజాన్ ఉపవాసాలను చిన్న వయసు లో ఇలాంటి ఆలోచన రావడం అద్భుతం అంటూ గ్రామ పెద్దలు, సమాజ పెద్దలు, కుటుంబ సభ్యులకు అభినందనలు కృతజ్ఞతలు తెలిపరు.

వాడపల్లి వెంకన్న కళ్యాణ మహోత్సవం లో రథోత్సవం

 వాడపల్లి వెంకన్న కళ్యాణ మహోత్సవం లో రథోత్సవం

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 వాడపల్లి గ్రామం లో శ్రీ వెంకన్న కళ్యాణ మహోత్సవంలో  1931 మార్చి 30న జరిగిన స్వామి వారి కళ్యాణ  రధ  మహోత్సవంలో  రథము పై భారత జాతీయ జెండా గాంధీజీ చిత్రపటం పెట్టడంతో  అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించిన బ్రిటిష్ వారితో ఏర్పడ్డ వివాదం నిర్దాక్షిణ్యంగా  బ్రిటిష్ వారు జరిపిన కాల్పుల కు అసువులు బాసిన యోధుల స్మారక స్తూపం  వద్ద ఈరోజు రథోత్సవం సందర్భంగా అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

హనుమాన్ మాలలతో యువత ఆధ్యాత్మికం వైపు..

 హనుమాన్ మాలలతో యువత ఆధ్యాత్మికం  వైపు...

బేలా,  పెన్ పవర్

 గ్రామ గ్రామాన గత నెల రోజుల నుంచి హనుమాన్ దీక్ష మాలలతో చిన్న పెద్ద తేడా లేకుండా ఆధ్యాత్మిక వైపు మండల యువకులు వెళ్తున్నారు. భక్తి భావం పెరిగి చెడు వ్యసనాలకు యువతులు దూరంగా ఉంటున్నారు. బేల మండలం తోపాటు ఏ కోరి, చెప్రాల, అవల్ పూర్,సిర్షన్న,మసాలా, మొహబాత్ పూర్,సాంగిడి గ్రామస్తులు హనుమాన్ దీక్ష చేపట్టి భక్తి మార్గంలో నడుపుతున్నారు.

రుక్మిణీ శ్రీకృష్ణుల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కె.కె.రాజు

రుక్మిణీ శ్రీకృష్ణుల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కె.కె.రాజు

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

25 వ వార్డు సీతమ్మ పేట గొల్లవీధిలో శ్రీ రాధా కృష్ణుల దేవాలయంలో రుక్మిణి శ్రీ కృష్ణుల కళ్యాణ మహోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుక్మిణి శ్రీ కృష్ణుని దర్శించుకుని  ప్రత్యేక పూజలు జరిపించి ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 25వార్డు కార్పొరేటర్ సారీ పిల్లి గోవింద్, సంపంగి శ్రీను, సురేష్, మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

తిరుమల ఆంజ‌నేయుని జ‌న్మ‌స్థానం అంజ‌నాద్రిగా ఆధారాల‌తో నిరూపించిన టిటిడి

 తిరుమల ఆంజ‌నేయుని జ‌న్మ‌స్థానం అంజ‌నాద్రిగా ఆధారాల‌తో నిరూపించిన టిటిడి

శ్రీ‌రాముని జ‌న్మ‌స్థానం అయోధ్య, హ‌నుమంతుడిది తిరుమ‌ల : త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్

భ‌గ‌వత్ సంక‌ల్పంతోనే రామ‌న‌వ‌మి నాడు హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం వెల్ల‌డి : టిటిడి ఈవో‌

తిరుమల, పెన్ పవర్

 శ్రీ ఆంజనేయ స్వామివారి జన్మస్థలం అంజనాద్రి అని పౌరాణిక‌, వాఙ్మ‌య‌, శాస‌న‌, భౌగోళిక ప్రమాణాల‌తో టిటిడి నిరూపించింది. ఈ మేర‌కు పండితుల క‌మిటీ త‌యారు చేసిన నివేదిక‌ను శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం తిరుమ‌ల ‌లోని నాద ‌నీరాజ‌నం వేదిక‌పై ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గౌ. శ్రీ భ‌న్వారిలాల్ పురోహిత్‌ మాట్లాడుతూ శ్రీ‌రాముని జ‌న్మ‌స్థానం అయోధ్య అని, ఇక‌పై రామ ‌భ‌క్తుడైన హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం తిరుమ‌ల అన్నారు. టిటిడి ఈ విష‌యాన్ని శాస్త్రబ‌ద్ధంగా నిరూపించింద‌న్నారు. తాను హ‌నుమంతుడి భ‌క్తుడిన‌ని, ఈ విష‌యం త‌న‌కెంతో సంతోషాన్ని క‌లిగించింద‌ని చెప్పారు. హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌లాన్ని నిర్ధారించేందుకు పండితుల క‌మిటీ లోతుగా ప‌రిశీలించింద‌న్నారు. లోతుగా ప‌రిశీలించి ఆధారాలు సేక‌రించ‌డం ఎంత క‌ష్ట‌మో త‌మిళ‌నాడులోని 20 విశ్వ‌విద్యాల‌యాల ఛాన్స‌ల‌ర్‌గా త‌న‌కు బాగా తెలుసన్నారు. నాలుగు నెల‌ల‌పాటు అవిశ్రాంతంగా శ్ర‌మించిన పండితుల క‌మిటీని ఈ సంద‌ర్భంగా గౌ. గ‌వ‌ర్న‌ర్ అభినందించారు. భ‌గ‌వత్ సంక‌ల్పంతోనే రామ‌న‌వ‌మి నాడు హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం వెల్ల‌డి : టిటిడి ఈవో‌ టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి  మాట్లాడుతూ భ‌గ‌వత్ సంక‌ల్పంతోనే రామ‌న‌వ‌మి నాడు హ‌నుమంతుని జ‌న్మ‌స్థానాన్ని తిరుమ‌ల‌గా నిరూపించామ‌ని తెలిపారు. పండితులతో కూడిన క‌మిటీ పౌరాణిక‌, వాఙ్మ‌య‌, శాస‌న‌, భౌగోళిక ఆధారాల‌ను సేక‌రించి నిర్ధారించింద‌ని వెల్ల‌డించారు. ఆధారాల‌తో కూడిన నివేదిక‌ను ఈ రోజు మీడియాకు విడుద‌ల చేశామ‌ని, టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామ‌ని వివ‌రించారు. త్వ‌ర‌లో పుస్త‌క రూపంలోకి తీసుకొస్తామ‌ని తెలిపారు. క‌ర్ణాట‌క‌లోని హంపి క్షేత్రాన్ని హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌లంగా చెబుతున్నార‌ని, దీన్ని కూడా శాస్త్రీయంగా ప‌రిశీలించామ‌ని, అక్క‌డ కిష్కింద అనే రాజ్యం ఉండొచ్చ‌ని, హ‌నుమంతుడు అంజ‌నాద్రి నుంచి అక్క‌డికి వెళ్లి సుగ్రీవునికి స‌హాయం చేసిన‌ట్టు భావించ‌వ‌చ్చ‌ని తెలియ‌జేశారు. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో హ‌నుమంతుడు జ‌న్మించిన‌ట్టుగా ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేద‌ని చెప్పారు. ప్ర‌స్తుత నివేదిక‌పై టిటిడి బోర్డులో చ‌ర్చిస్తామ‌ని, ఆ త‌రువాత రాష్ట్ర ప్ర‌భుత్వంతో, దేవాదాయ శాఖ అధికారుల‌తో చ‌ర్చించి హ‌నుమంతుడు జ‌న్మించిన స్థానంలో ఆల‌యం నిర్మించి అభివృద్ధి చేస్తామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా క‌మిటీ స‌భ్యులైన‌ ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌శ‌ర్మ‌, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దా శివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త శ్రీ రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ మాజీ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ విజ‌య్‌కుమార్‌, క‌న్వీన‌ర్ మ‌రియు టిటిడి ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మను ఈవో అభినందించారు. 4 నెల‌ల పాటు విస్తృతంగా ప‌రిశోధ‌న : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి  పండితుల క‌మిటీ 4 నెల‌ల పాటు విస్తృతంగా ప‌రిశోధించి బ‌ల‌మైన ఆధారాలు సేక‌రించింద‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారిని అంత‌మొందించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ ఏడాది క్రితం యోగ‌వాశిష్టం, సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభించామ‌ని చెప్పారు. సుంద‌ర‌కాండ పారాయ‌ణం జ‌రుగుతుండ‌గానే హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం తిరుమ‌ల‌గా ఆధారాల‌తో స‌హా నిరూప‌ణ కావ‌డం భ‌గ‌వంతుని కృప అన్నారు. పురాణ‌, వాఙ్మ‌య, శాస‌న‌, భౌగోళిక ఆధారాల మేర‌కే నిర్ధార‌ణ : ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ తిరుప‌తిలోని జాతీయ సంస్కృత విశ్వ‌ విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ మాట్లాడుతూ శ్రీ మద్రామాయణం లోని సుందరకాండలో, అనేక పురాణాల్లో, వేంకటాచలమాహాత్మ్యంలో, ఎన్నో కావ్యాల్లో  హనుమంతుని జన్మవృత్తాంతం చాలా చక్కగా వర్ణించ బ‌డింద‌న్నారు. సుందరకాండ లో తన జన్మవృత్తాంతాన్ని హనుమంతుడే స్వయంగా సీతాదేవికి తెలిపార‌ని చెప్పారు. అంజ‌నాదేవికి వాయుదేవుని వలన తాను జన్మించినట్లు హనుమంతుడు తెలిపార‌న్నారు. మతంగ మహర్షి చెప్పినవిధంగా అంజనాదేవి వేంకటాచలానికి విచ్చేయడం, అక్కడ తపస్సు చేసుకోవడం, ఆంజనేయస్వామికి జన్మనివ్వడం, తదనుగుణంగా ఆ కొండకు 'అంజనాద్రి' అని పేరు రావడం, బాలాంజనేయస్వామి సూర్యదేవుని పట్టుకోవడానికి వేంకటాద్రి నుండి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో భాగంగా తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మరల చూడడం, వానరవీరులు వైకుంఠ గుహలో ప్రవేశించడం - ఇలా అనేక విషయాలు వేంకటాచల మాహాత్మ్యం వల్ల తెలుస్తున్నాయ‌న్నారు. వాఙ్మ‌య, శాస‌న ఆధారాల ప్ర‌కారం వాల్మీకి రామాయ‌ణానికి త‌మిళ అనువాద‌మైన కంబ రామాయ‌ణం, శ్రీ వేదాంతదేశికులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు త‌మ ర‌చ‌న‌ల్లో వేంక‌టాద్రిగా అంజ‌నాద్రిగా అభివ‌ర్ణించార‌ని చెప్పారు. స్టాటన్ అనే అధికారి క్రీ.శ. 1800 సంవత్సరంలో తిరుమల గుడి గురించిన విషయాలను సంకలనం చేసి సవాల్-ఏ-జవాబ్ అనే పుస్తకాన్ని రాశార‌ని,  ఆ పుస్తకంలో అంజనాద్రి అని పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టిన చోటు కావడం వల్ల అంజనాద్రి అన్నార‌ని రాసిన‌ట్టు తెలిపారు. వేంకటాచల మాహాత్మ్యం అనే గ్రంథం ప్రమాణమే అని చెప్పటానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో దొరుకుతున్నాయ‌ని, మొదటి శాసనం 1491 జూన్ 27వ తేదీకి చెందినదని, రెండవ శాసనం 1545 మార్చ్ 6వ తేదీకి చెందినది చెప్పారు. అలాగే శ్రీరంగంలో ఉన్న ఒక శిలాశాసనం దీన్ని తెలియ‌జేస్తోంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ ‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.


కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

 కన్నుల పండువగా సీతారాముల కల్యాణం


నెల్లికుదురు, పెన్ పవర్

శ్రీరామనవమిని పురస్కరించుకుని మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని శ్రీ రామగిరి,చిన్న నాగారంగ్రామాలతో పాటు వివిధ గ్రామాలలో సీతారాముల కళ్యాణం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య బుధవారం జరుపుకున్నారు. భద్రాద్రిలో సీతకు రాములవారు అభిజిత్ లగ్న ముహూర్తమున తాళి కట్టగానే సంబంధిత గ్రామాలలో సీతారాముల కల్యాణం జరిపించారు. శ్రీ రామగిరి లో శ్రీ వివేకానంద సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలోకృష్ణరాయ కళావేదికలో  నిర్వహించిన శ్రీ రామ కళ్యాణం లో ఆ గ్రామ సర్పంచ్ డొనికెన జ్యోతి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ ఆదూరి సుభాషిణి,సాంస్కృతిక సమితి కార్యదర్శి ప్రజా వైద్యులు జాతీయ కళాకారులు ఆదూరి  కళాధర్ రాజు,చిన్న నాగారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన కళ్యాణ వేడుకలో సర్పంచ్ గాయపు జయపాల్ రెడ్డి, అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణదాత బొంపల్లి సోమేశ్వరరావు మాతృమూర్తి నరసమ్మ వార్డు సభ్యులు టైరు శ్రీనివాస్ గౌడ్ ప్రముఖ రామ భక్తులు బైరు యాదగిరి గౌడ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధికార ప్రతినిధి పంజాల  వాసుదేవ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ మహిళా భక్తులు కొయ్యడ శోభాయా కాంతం గౌడ్ రమప్రసాద్ గౌడ్, బైరు ఝాన్సీ అశోక్ గౌడ్, ఉడుత మంజుల సంతోష్ యాదవ్, పెద్ద గోని రామ తార వెంకన్న గౌడ్, చిర్ర బోయిన ఐలమ్మ మల్లయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.కాగా కళ్యాణ వేడుకలు కోవిడ్-19నిబంధనలు పాటిస్తూ జరిపారు.

సీతారాముల కళ్యాణం వైభోగం

 సీతారాముల కళ్యాణం వైభోగం

నిబంధనలు పాటిస్తూ మండపంలో కళ్యాణ వేడుకలు

మల్కాజిగిరి , పెన్ పవర్ 

మల్కాజిగిరి  ఈస్ట్ అనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ ఆభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగాయి, స్వామి వారి కళ్యాణంలో స్థానిక కార్పొరేటర్ వై. ప్రమ్ కుమార్ పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మండపంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, బౌతిక దూరం పటించి సీతారముల కాళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె విజయ కుమారి ముత్యం రెడ్డి మాధవి శ్రీశైలం సుబ్బారావు పద్మజ బాలకిషన్  సంపత్ రావు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

108 సార్లు శ్రీరామ జప మంత్రం

 108 సార్లు శ్రీరామ జప మంత్రం

పెన్ పవర్, కాప్రా

కుషాయిగూడ భజరంగ్ దళ్, శ్రీ రామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీ రాముల వారి శోభాయాత్ర కుషాయిగూడ శ్రీ శివంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమవుతుంది. దేశంలో కరోనా మహమ్మారి వేగంగా పెరుగుతున్న    నేపథ్యంలో, ప్రభుత్వ ఆదేశాల అనుసారం  ఈ సంవత్సరం కోవిడ్ నియమాలు పాటిస్తూ నిరాడంబరంగా కుషాయిగూడ శివాంజనేయ దేవస్థానంలో శ్రీ రాములవారి ఉత్సవ విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  బజరంగ్దళ్ కార్యకర్తలు 108 పర్యాయాలు శ్రీరామ జయ రామ జయజయ రామ మంత్రాన్ని జపించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ మాట్లాడుతూ  శ్రీ రాములవారి కృప మనందరిపై ఉంటుందని  కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని  ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి దూరాన్ని పాటించాలి .  ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన కోవిడ్ నియమాలను విధిగా పాటించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ అను శక్తి జిల్లా అధ్యక్షుడు సుమంత్ ముప్ప, బజరంగ్దళ్ కార్యకర్తలు సాకేత్ గౌడ్, పవన్ కుమార్, శ్రీకాంత్, సురేష్, నవీన్, పరశురామ్, శేఖర్, మధు, భాస్కర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...