Followers

కుల వివాదంలో డిప్యూటీ సిఎం శ్రీవాణి...

కుల వివాదంలో డిప్యూటీ సిఎం శ్రీవాణి...
తాజా కోర్టు నోటీసుతో కలకలం 
2014 నుంచే వెంటాడుతున్న వివాదం
న్యాయస్దానంలో మంత్రిపై 3 కేసులు దాఖలు
న్యాయం జరిగేవరకు పోరాటంచేస్తా: మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్‌

విజయనగరం బ్యూరో, పెన్‌పవర్‌: 
డిప్యూటీ సిఎం శ్రీవాణిని కులవివాదం వెంటాడుతోంది. 2014నుంచి ఆమె ఎస్టీ కాదంటూ కేసులు  నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా హైకోర్టు నోటీసులు  జారీచేయడంతో జిల్లాలో  మరోసారి కుల వివాదం చర్చకు వచ్చింది. ఆమెతోపాటు గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఎన్నికల కార్యదర్శిలకు నోటీసులు జారీ అయ్యాయి.దీంతో జిల్లాలో ఇప్పటికే పులువురు నాయకులు ఎస్టీ లు  కాదంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో డిప్యూటీ సిఎంపై కూడా అదే రకంగా తీర్పు వస్తుందని  గిరిజన సంఘాల  నాయకులు  ధీమా  వ్యక్తంచేస్తున్నారు. 2014 ఎన్నికల  సమయంలో ఎస్టీ కాదంటూ టిడిపి న్యాయస్దానాన్ని ఆశ్రయించింది. ఎలాంటి ఇబ్బందులు  లేకుండా 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పదవీ కాలాన్ని పూర్తిచేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తిరిగి కుధృవీకరణపై మాజీ ఎమ్మెల్యే, ఆదివాసీ గిరిజన హక్కుల  సాధన సంఘం నాయకులు  నిమ్మక జయరాజ్‌ అభ్యంతరాన్ని వ్యక్తంచేస్తూ ఫిర్యాదు చేశారు.అయితే ఎన్నికల  అధికారులు అప్పట్లో తన వాదనను పట్టించుకోకపోవడంతో న్యాయస్దానాన్ని అశ్రయించారు. దీంతో పాటు మరో రెండు కేసులు  కూడా ఆమె ఎస్టీ కాదంటూ న్యాయస్దానంలో దాఖలు  అయ్యినట్లు  సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా కోట సీతారాంపురంలో ఆమె సోదరి పాముల  రామతులసి ఎస్టీ కాదంటూ ఐటిడిఎ పివో విచారణ చేసి తేల్చారని దీంతో శ్రీవాణి ఎలా ఎస్టీ అవుతారని అంతా ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం లో ఒక   గ్రామం నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు వలస వెళ్ళారని అయితే ఎస్టీగా తహసీల్దారు ధృవీకరణ ఇవ్వడంతో వివాదం కొనసాగుతోంది. దీనిపై జిల్లా డిఎల్‌ఎస్‌ కమిటీలో సైతం అధికారులు,  ప్రజాప్రతినిధులకే వత్తాసు పలికేవారని ఎవరైనా అధికారి వ్యతిరేకిస్తే బదిలీలు  చేసేవారని నిమ్మక జయరాజ్‌ ఆరోపించారు. ఇక్కడ న్యాయం జరగనందునే న్యాయస్దానాన్ని ఆశ్రయించామని నేను దాఖలు  చేసిన కేసు కూడా విచారణకు సిద్దంగా  ఉందని అసలైన గిరిజనుల కు అన్యాయం చేస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. జిల్లాలో అధికారులు సైతం ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహారిస్తున్నారని లేదంటే బదిలీపై వెళ్ళిపోతున్నారని ఏదేమైనా న్యాయస్దానం గిరిజనులకు న్యాయం చేస్తున్నాయని హర్షం వ్యక్తంచేశారు. అయితే విచారణ 23కు వాయిదా పడడంతో   ఏం జరుగుతుందోనన్న  ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జిల్లాలో పలువురు నాయకులు ఎస్టీ కాదంటూ న్యాయస్దానాలు  తీర్పు చెప్పడంతో డిప్యూటీ సిఎం భవితవ్యం ఎలా ఉంటుందోనన్న సర్వత్రా చర్చసాగుతోంది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...