కొవ్వూరు పట్టణ పోలీసులు కరోన నియంత్రణ చర్యలు
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న తరుణంలో కొవ్వూరులో ప్రజలందరూ సహకరించి రాత్రి పూట 7 గంటల తరువాత ఎవ్వరూ బయటకు రాకుండా ఉండాలని కొవ్వూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వి.వి.ఎస్.ఎన్ మూర్తి అన్నారు. కొవ్వూరు దొమ్మేరు, ఔరంగాబాద్, వాడపల్లి గ్రామాల్లో మూర్తి పర్యటించి రోడ్లు పై తిరుగుతున్న ప్రజలను ఇంటికి పంపే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ రాత్రి దొమ్మేరు గ్రామంలో భోజన హోటల్ యజమానులకు 8 గంటల వరకు హోటలు తెరచి ఉండవచ్చునని, ఎనిమిది గంటలు దాటిన తర్వాత హోటల్ మూసివేయాలని, ఈ సమయంలో భోజనం పార్సిల్ చేసి ఇవ్వవలెనని హోటల్ లో ఎవర్ని కూర్చుండ పెట్టరాదని తెలియజేసినట్లు తెలిపారు.
రాత్రి 7గంటల తరువాత రోడ్ల పైకి ఎవరు వచ్చినా ఉపేక్షించేది లేదని, కరోనా వైరస్ ను కట్టడి చేయడం లో ప్రజలందరూ స హకరించాలని, కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పిలుపు మేరకు కొవ్వూరు పట్టణంలో స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించడంతో పోలీసు వారు బుధవారం రాత్రి కొవ్వూరు పట్టణంలోని మెయిన్ రోడ్డు నందు ఏడు గంటలు దాటిన తర్వాత రోడ్ల పైకి వచ్చిన వారిని ఇళ్లకు పంపిస్తూ, తెరచి ఉన్న షాపులను మూసి వేయించారు. గ్రామాల ప్రజలు రాత్రి 7:00 గంటలు దాటిన తర్వాత రోడ్లపై తిరగరాదు అని, స్వచ్ఛందంగా షాపులను మూసివేయాలని, కరోనా వైరస్ వ్యాప్తి వృద్ధి చెందకుండా కట్టడి చేయడంలో ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా నిబంధనలను అతి క్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు పట్టణ ఎస్ఐలు వెంకటరమణ, కేశవ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొ న్నారు.
No comments:
Post a Comment