నిరుపయోగంగా మారిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు
మండలం లోని గత టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు నేటి పాలకులు, అధికారులు పట్టించు కోకపోవడంతో వీటి కోసం వెచ్చించిన నిధులు నిరుపయోగంగా మారాయని మండల ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెంటాడ మండలం లోని 30 గ్రామ పంచాయతీలు చెత్తకు సంపద కేంద్రాలు నిర్మాణాలు చేపట్టారు. గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్త లను వేరు వేరు చేసి వ్యవసాయ ఎరువులు గా తయారు చేసి రైతులకు విక్రయించడానికి చెత్త కు సంపద కేంద్రాలను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది. గ్రామాల్లో ఉన్న చెత్తను తరలించడం కోసం వాహనాలను కూడా అప్పట్లో కొనుగోలు చేశారు. ప్రస్తుతము చెత్త కు సంపద కేంద్రాలు, కొనుగోలు చేసిన వాహనాలు ప్రస్తుతం మూలకు చేరాయి.
కొత్తగా వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటిని పక్కనపెట్టి తాజాగా వాటి స్థానములో గ్రామాల్లో ఉన్న చెత్తను చెత్తను తరలించడానికి రిక్షా లను ఏర్పాటు చేసి చెత్తాచెదారాన్ని చెత్త కు సంపద కేంద్రాలకు తరలించకుండా గ్రామాల్లో ఉన్న బహిరంగ ప్రదేశాల్లోనూ, గ్రామాలకు ఇరువైపుల ఉన్న రహదారులు ఇరువైపులా చెత్తాచెదారాన్ని వేయడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మండల ప్రజలు అత్యధికముగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతము చెత్తాచెదారాన్ని సేకరిస్తున్న కార్మికులకు గత కొన్ని నెలలుగా ఎటువంటి గౌరవ వేతనం ఇవ్వకపోవడం తో వారు సేకరిస్తున్న తడి, పొడి చెత్త లను బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లకు ఇరువైపులా వేస్తున్నారని మండల ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న చెత్తకు సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకువచ్చి ఎరువులు తయారు చేసే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమే కార్మికులు మాట్లాడుతూ క్రమం తప్పకుండా చెత్తాచెదారాన్ని సేకరిస్తున్నామని గత కొన్ని నెలలుగా ఎటువంటి గౌరవ వేతనం చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment