రైతుబజార్లలో కోవిడ్ నిబంధనలు
విజయనగరం, పెన్ పవర్
రోజురోజుకూ పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని, కరోనా నియంత్రాణా చర్యల్లో భాగంగా రైతు బజార్లలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ ఆదేశాలను జారీ చేశారు. తప్పనిసరిగా మాస్కును ధరించిన వారిని మాత్రమే రైతుబజార్లలోకి అనుమతించాలని స్పష్టం చేశారు. రైతు బజార్ ప్రవేశ ద్వారాలవద్ద ధర్మల్ స్కానర్‌లను ఏర్పాటు చేయించారు. శారీరక ఉష్ణోగ్రతలను తనిఖీ చేసిన తరువాత మాత్రమే, రైతు బజార్లోకి ప్రవేశానికి అనుమతించనున్నారు.
అదేవిధంగా కొనుగోలుదారులు భౌతిక దూరాన్ని పాటించేవిధంగా చర్యలు తీసుకున్నారు. రైతుబజార్లలో చేతులు సబ్బుతొ కడుగుకొనేందుకు తగిన ఏర్పాట్లను చేసి, శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచారు. వినియోగదారుల సంక్షేమం కోసం త్వరలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నట్లు జెసి వెళ్లడించారు. అదేవిధంగా పలుచోట్ల తాత్కాలికంగా రైతుబజార్ ఎక్స్‌టెన్షన్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు, రైతులు తప్పనిసరిగా నిబంధనలను పాటిస్తూ, కోవిడ్ నియంత్రణలో తమవంతు సహకారాన్ని అందించాలని జెసి కిశోర్ కోరారు.
No comments:
Post a Comment