Followers

సున్నా వడ్డీ పధకం క్రింద రూ.36.35 కోట్లు జమ

  సున్నా వడ్డీ పధకం  క్రింద  రూ.36.35 కోట్లు జమ 

మహిళా సంఘాల ఖాతాల్లోనికి బదిలీ చేసిన ముఖ్యమంత్రి 
ఆర్ధిక సహాయంతోనే నిజమైన మహిళా సాధికారత
విజయనగరం, పెన్ పవర్

స్వయం  సహాయక సంఘాల మహిళలకు  సున్నా వడ్డీ పధకం క్రింద  జిల్లాలో 50 వేల 631 స్వయం సహాయ సంఘాల లో నున్న  సభ్యుల ఖాతాలలోనికి రూ. 36.35 కోట్ల రూపాయలను జమ చేసారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి  క్యాంపు కార్యాలయం నుంచి  శుక్రవారం   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని అన్ని స్వయం సహాయక సంఘాలు 1920-21 ఆర్ధిక సంవత్సరం లో తీసుకున్న రుణం నుండి గరిష్టంగా  3 లక్షల వరకు ఉన్న ఋణం పై ఈ సున్నా వడ్డీ చెల్లించడం జరుగుతోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్, పార్లమెంట్ సభ్యులు  బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు డా. సురేష్ బాబు,  శాసన సభ్యులు బద్దుకొండ అప్పల నాయుడు హాజరైనారు.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా లోని లబ్దిదారులకు ఎం.పి చేతుల మీదుగా చెక్కును అందజేశారు. 

అనంతరం ఎం.పి  మీడియా తో  మాట్లాడుతూ  మహిళలు ఆర్ధికంగా బలోపేతం కావడానికి  ప్రభుత్వం నవరత్నాల పేరుతో   అనేక పధకాలను అమలు చేస్తోందని తెలిపారు.  మహిళా సాధికారత కు పెద్ద పీట వేస్తూ , అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా  అమ్మ వడి, ఆసరా, చేయూత, చేదోడు వంటి పధకాలతో మహిళల ఖతాల్లోనే  నగదు ను జమ చేయడం జరుగుతోందన్నారు. మేనిఫెస్టో లో చెప్పిన విధంగా  క్యాలెండరు ను రూపొందించి  అనుకున్న సమయానికే అన్ని పధకాలు అందేలా చేయడం  ప్రభుత్వపు చిత్త  శుద్ధికి నిదర్శనమని అన్నారు. జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ  నవరత్నాలతో ప్రతి కుటుంభం లోని మహిళలకు కనీసం  ఏదో ఒక విధమైన  లబ్ది చేకూరుతోందని, ఇది మహిళా  సాధికారతకు తోడ్పాటును అందిస్తోందని అన్నారు.  కుటుంభం లోని మహిళల ద్వారా ఆర్ధిక కలాపాలు జరిగితే ఆ కుటుంభం  అభివృద్ధి చెందుతుందని అన్నారు.  ప్రభుత్వం అందిస్తున్న అనేక పధకాలను అంది పుచ్చుకొని నిర్భయంగా  మహిళలు నేడు వ్యాపార వేత్తలుగా ఎదగడం శుభ  పరిణామం అన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో   డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్  డైరెక్టర్ సుబ్బా రావు, ఎ.పి.డి లు, మెప్మా అధికారులు  మహిళా సంఘాల ప్రతినిధులు  పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...