Followers

Showing posts with label ANDHRAPRADESH. Show all posts
Showing posts with label ANDHRAPRADESH. Show all posts

పాఠశాలకు మెగాఫోన్ కొనుగోలుకు 3000 రూపాయలు బహుకరణ

 పాఠశాలకు మెగాఫోన్ కొనుగోలుకు 3000 రూపాయలు బహుకరణ

తాళ్లపూడి, పెన్ పవర్

సోమవారం  మానవత స్వచ్ఛంద సేవా సంస్థ , తాళ్లపూడి శాఖ ఆధ్వర్యంలో  మండలంలోని ప్రక్కిలంక స్పెషల్ ప్రాథమిక పాఠశాలకు మెగాఫోన్ కొనుగోలు నిమిత్తం రూ.3000 అందజేశారు. పాఠశాల అసెంబ్లీ, పేరెంట్స్ మీటింగ్ నిర్వహణ సౌకర్యార్థం,  ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు ఈ సహాయాన్ని అందజేసినట్టు సంస్థ అధ్యక్షులు బారనాల  శంకరరావు  తెలిపారు. ఈకార్యక్రమంలో  సెక్రటరీ జోడాల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు తుంపూడి నాగ భూషణ గుప్త, మాజీ అధ్యక్షులు అప్పన చంద్రధర గుప్త, గెడ్డం సాయిబాబా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.విజయబాబు, ఉపాధ్యాయులు కె.రాజారావు, పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ జి.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

కరోన నిబంధనలు అమలు చేస్తున్న యస్ఐ జి.సతీష్

 కరోన నిబంధనలు అమలు చేస్తున్న యస్ఐ జి.సతీష్

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి యస్ఐ జి.సతీష్ తాళ్లపూడి మండల పరిధిలోని గ్రామాల్లో కరోన సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోన నిబంధనలు సక్రమంగా అమలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా తాళ్లపూడి యువచైతన్య ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కొల్లి దుర్గారావు, యువశక్తి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కే. రజనీ కుమార్, ఇంకాకొంత ఆటో డ్రైవర్ లను  ఎస్ఐ జి.సతీష్ పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. వారితో కరోన జాగ్రత్తలు గురించి వివరించారు. మాస్క్ లేనిదే ఎవరిని ఆటో ఎక్కించుకోరాదని, మీరు కూడా మాస్కు ధరించాలని తెలిపారు. అలా చేయని యెడల కఠిన చర్యలు తీసుకుంటానని తెలియజేశారు.

మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరణ

 మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరణ

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో,ప్రగతి భారత్ పౌండేషన్ సహకారంతో ఈనెల 24,25 తేదిలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం  సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో కె.కె.రాజు ఆధ్వర్యంలో  జరిగినది.

ఈ సందర్భంగా కె కె.రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆశయాలకు అనుగుణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు విజయసాయి రెడ్డి మరియు ప్రగతి భారత్ పౌండేషన్ సహకారంతో ఈ నెల 24 25 తేదీలలో  విశాఖపట్నం లో మెగా జాబ్ మేళా నిర్వహించి సుమారు 4000 మంది యువతీ,యువకులకు ఉపాధి కల్పించబోతున్నామని ఆన్నారు.ఈ అవకాశాన్ని యువత  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో ఉత్తర నియోజకవర్గం పరిధిలోగల కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

గూడెం గిరిజన గ్రామంలో బోరు ఏర్పాటు

 గూడెం గిరిజన గ్రామంలో బోరు ఏర్పాటు

మెంటాడ, పెన్ పవర్: 

 మెంటాడ మండలం లోని, ఆగూరు పంచాయితీ, శివారు గూడెం గిరిజన గ్రామంలో కొత్తగా నిర్మించిన బోరు బావి ని ఆగూరు సర్పంచ్ ఆకుల శివ మొదట పూజా కార్యక్రమంలో నిర్వహించి అనంతరం ఆయన చేతుల మీదగా బోరు బావి ని ప్రారంభోత్సవం చేశారు. గూడెం గ్రామంలో గిరిజనులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సాలూరు ఎమ్మెల్యే వీడికి రాజన్నదొర దృష్టికి తీసుకువెళ్లగా ఆయన బోరు బావి మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. గూడెం గిరిజన గ్రామంలో ఎట్టకేలకు తాగునీరు సమస్య తీరిందని మహిళలు, పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాశల ప్రసాదరావు, ఆగూరు డీలర్ రెడ్డి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ విజేత పొల్లాచి ...

వాలీబాల్ విజేత పొల్లాచి ...

బంగారుపాలెం, పెన్ పవర్

బంగారుపాలెం లో మూడు రోజులుగా జరుగుతున్న దక్షిణ రాష్ట్రాల వాలీబాల్ టోర్నమెంట్ లో పురుషుల విభాగంలో పొల్లాచి కి చెందిన శ్రీ సరస్వతి త్యాగరాజన్ కాలేజ్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా మహిళా విభాగంలో చెన్నైకి చెందిన ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ జట్టు విజేతలుగా నిలిచాయి మహిళా విభాగంలో మైసూర్ స్పోర్ట్స్ హాస్టల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలువగా ఈ రోడ్డు చెందిన పీ కే ఆర్ ఆర్ట్స్ కాలేజి జట్టు తృతీయ స్థానంలో నిలిచింది విజయం సాధించిన జట్లకు నగదు బహుమతి ట్రోఫీ లను జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు కుమార్ రాజా చేతులమీదుగా అందించారు ఆదివారం రాత్రి నిర్వహించిన ముగింపు సమావేశంలో పలువురు సీనియర్ వాలీబాల్ క్రీడాకారులను బంగారుపాలెం సర్పంచ్ కృష్ణమూర్తి ఉమాదేవి ఉప సర్పంచ్ కామరాజు ఎంపీటీసీ పద్మావతి ఆటగాళ్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు తులసి రెడ్డి కోశాధికారి మురారి జిల్లా వాలీబాల్ కోచ్ సుదర్శన్ నాయుడు. మాజీ వాలీబాల్ క్రీడాకారులు దిలీప్. పెరుమాల్. తిరుమల రావు, బాలాజీ, చందు, ప్రసాద్ నాయుడు, వెంకటేష్ ,పైనీ,  వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం తప్పదు

 కరోనా పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం తప్పదు

విజయనగరం, పెన్ పవర్

విజయనగరం జిల్లాలో ప్రస్తుతం 2వ దశ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం తప్పదని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఆదివారం నాడు హెచ్చరించారు. 1వ దశ కరోనా కంటే 2వ దశ కరోనా చాలా త్వరగా విస్తరిస్తున్నదన్నారు. కావున, ప్రతీ ఒక్కరూ కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో ఎటువంటి నిర్లక్ష్యం వద్దన్నారు. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా నోరు, ముక్కును కప్పుతూ మాస్క్ ధరించాలన్నారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించడంతోపాటు, అవసరం లేకుండా బయట తిరగవద్దన్నారు. తరుచూ చేతులను సానిటైజరు లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. కరోనా నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గోరు వెచ్చని నీటిని మాత్రమే త్రాగాలని, బెటాడిన్ లేదా ఉప్పు, పసుపు కలిపిన మిశ్రమాన్ని నీటితో పుక్కిళ్ళించడం చేయాలన్నారు. ప్రస్తుతం వైరస్ రూపాంతరం చెంది గాలి ద్వారా త్వరితగతిన వ్యాప్తి చెందుతుందని, దీనిని గుర్తించేలోగనే ప్రాణపాయ స్థితికి చేర్చేస్తుందన్నారు. కావున, ప్రజలంతా పోలీసుల కోసం కాకుండా మీ కోసం, మీ పై ఆధారపడే కుటుంబాల కోసం జాగ్రత్తలు పాటించాలన్నారు. వైరస్ ముక్కులోను, గొంతులోను ఉన్నపుడే అప్రమత్తమై, సకాలంలో చికిత్స పొందితే సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడవచ్చునన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలను అప్రమత్తం, అవగాహన కల్పించేందుకు పోలీసుశాఖకు సహకరించాలన్నారు. ప్రజలెక్కువగా గుమిగూడి ఉండే ప్రాంతాల్లో విందులు, వినోదాలు, విహార యాత్రలు, ప్రార్ధనా మందిరాలు, దేవాలయాలకు దూరంగా ఉండడం మంచిదన్నారు. ప్రతీ ఒక్కరూ స్వచ్చందంగా నియంత్రణ పాటించడం అందరికీ మంచిదని ప్రజలకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 45 సం.లు దాటిన ప్రతీ ఒక్కరూ వేక్సిన్ వేసుకోవాలని, వేక్సిన్ వేసుకోవడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతందని, తద్వారా కోవిడ్ 19 వైరస్ తో పోరాడేందుకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందన్నారు. కావున, వేక్సిన్ వేసుకొనేందుకు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా వేక్సిన్ వేయించుకొనేందుకు ప్రజలంతా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ కోరారు.జిల్లా ప్రజలకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రతీ రోజూ ప్రత్యేకంగా డ్రైవ్,  జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించి,  అవగాహన కార్యక్రమాలను, మాస్క్ ధరించని వారి నుండి జరిమానాలు విధించడం, స్వచ్చంద ప్రమాణాలను చేయిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు.


సిసిఎస్ డిఎస్పీ పాపారావు మృతి పోలీసుశాఖకు తీరని లోటు

 సిసిఎస్ డిఎస్పీ పాపారావు మృతి పోలీసుశాఖకు తీరని లోటు

విజయనగరం, పెన్ పవర్

విజయనగరం జిల్లా సిసిఎస్ డిఎస్పీగా పని చేస్తున్న జుత్తు పాపారావు మృతి పోలీసుశాఖకు తీరని లోటని పలువురు, పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. గత రెండు రోజులుగా కోవిడ్ తో విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికత్స పొందుతున్న పాపారావు ఆదివారం, తెల్లవారుజామున మృతి చెందారు. విధి నిర్వహణ పట్ల ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించడం, అప్పగించిన పనిని క్రమశిక్షణతో పూర్తి చేయడం ఆయన నైజం. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం శివరాంపురం గ్రామానికి చెందిన జుత్తు పాపారావు 1991లో పోలీసుశాఖలో సబ్ ఇన్స్ పెక్టరుగా చేరారు. 2008లో ఇన్స్ పెక్టరుగాను 2014లో డిఎస్పీగా ఉద్యోగోన్నతులు పొందారు. విశాఖపట్నం రూరల్, సిటీలో సబ్ ఇన్స్ పెక్టరుగాను,ఇన్స్ పెక్టరుగా పలు పోలీసు స్టేషన్లులో విధులు నిర్వహించారు. పద్మనాభం, అనంతగిరి, స్పెషల్ బ్రాంచ్, కోటవురకుల, పాయకరావు పేట, అరకు పోలీసు స్టేషన్లులోను విశాఖపట్నం సిటీ మహిళా పోలీసు స్టేషను ఎసిపిగాను, అనకాపల్లి డిఎస్పీగాను గతంలో పని చేసారు. 2019 ఫిబ్రవరి నుండి విజయనగరం జిల్లాలో సెంట్రల్ క్రైం స్టేషను డిఎస్పీగా పని చేసి పలు కీలకమైన కేసులను చేధించడంలో తన మార్కు పని తీరును కనబర్చారు. ఆయనకు భార్య సుమలత, ఇద్దరు కుమారులు కిరణ్, రవీంద్ర కలరు. కిరణ్ ఇంజనీరింగు పూర్తి చేసి సివిల్స్ ప్రిపేర్ అవుతుండగా, చిన్న కుమారుడు రవీంద్ర ఎంబిబిఎస్ పూర్తి చేసారు. డిఎస్పీ జుత్తు పాపారావు మృతికి విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు, విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, అదనపు ఎస్పీ (పరిపాలన) పి.సత్యన్నారాయణరావు, ఒఎడ్ ఎన్.సూర్యచంద్రరావు, ఎ బి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీ రావు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రస్తుతం, పాపారావు కుటుంబ సభ్యులైన భార్య, పిల్లలు కూడా కరోనా బారిన పడి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


దీక్షా శిభిరాన్ని సందర్శించిన ఢిల్లీ రైతు పోరాట నాయకులు

 దీక్షా శిభిరాన్ని సందర్శించిన ఢిల్లీ రైతు పోరాట నాయకులు

మహారాణి పేట, పెన్ పవర్

జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ పరిరక్షణ వేదిక నిరాహారదీక్ష శిభిరాన్ని ఢిల్లీ రైతుపోరాట నాయకులు రాకేష్ టీకాయత్, అశోక్ థావలే ఆదివారం సందర్శించారు. ఆదివారం ఆర్కేబీచ్ లో  భారీఎత్తున జరిగిన సభకు ముఖ్యవక్తలుగా ఆలిండియా  కిసాన్ మోర్చా ప్రధాన నాయకులలో ఒకరైన రాకేష్ టికాయత్, ఎఐకెఎన్ ఆలిండియా ప్రధాన కార్యదర్శి అశోక్ థావలె, ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తదితరులు విశాఖనగరానికి వచ్చారు. వీరు ఆదివారం ఉదయం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నడుస్తున్న దీక్షా శిభిరానికి పాల్గొని తమ మద్దతును తెలియజేసారు. ఈ సందర్భంగా రాకేష్ టీకాయత్ మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు తీవ్ర నష్టదాయకమైన నిర్ణయాలను చేస్తోందన్నారు. రైతులు ఢిల్లీలో నలుమూలల వ్యవసాయచట్టాలు రద్దుకోసం పోరాడుతుంటే యావత్తు భారతదేవ ప్రజలంతా మద్దతు తెలియజేస్తున్నా మోడీకి మాత్రం చలనం రావటం లేదన్నారు. 

మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్లకు కట్టబెట్టే చర్యలు చేపడుతుందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని విశాఖ కార్మికవర్గం, ప్రజలు పోరాడుతున్నారు. వీరికి మద్దతు తెలియజేయడం కోసమే వచ్చామన్నారు. కార్మికులు, కర్షకులు కలిసి పోరాడి మన హక్కులను సాధించుకుందామన్నారు. ఆదివారం దీక్షల్లో ఆర్టిస్ ఎస్ డబ్యుఎఫ్ నాయకులు, కార్యకర్తలు, ఎఐటియుసి శ్రామికమహిళా కార్యకర్తలు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్ బ్యుఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలు ఉంటే రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కార్యదర్శి ఎం.సిహెచ్ అప్పుడు, రాజేంద్రప్రసాద్,సీతాలక్ష్మి,పరమేశ్వరరావు, ప్రసాద్, రాజు,ఎ.ఎస్.రావు,యు.కె.రావు,కె.వి.పి.రావు, ఎఐటియుసి శ్రామిక మహిళా విభాగం కన్వీనర్, కోకన్వీనర్లు పి.శ్యామలదేవి. ఎస్.తులసీలత,రమ, వేదిక చైర్మెన్ ఎం.జగ్గునాయుడు,వైస్ చైర్మెన్ పడాలరమణ తదితరులు పాల్గొన్నారు.

రామనాదరెడ్డికి సిపిఐ ఆధ్వర్యంలో ఘన నివాళి

 రామనాదరెడ్డికి సిపిఐ ఆధ్వర్యంలో ఘన నివాళి

 చిత్తూరు, పెన్ పవర్

కామ్రేడ్ రామనాధ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన చిత్తూరు సిపిఐ నాయకులు. రామనాధ రెడ్డిగారికి  ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ మొదటితరం నాయకులలో రామనాధ రెడ్డి ఒకరు అన్నారు విద్యార్దుల ఉద్యమంలో  ప్రవేశించిన రామనాదరెడ్డి కార్యకర్తగా ఉంటూ,విద్యార్ది నాయకులు క్రిష్ణ రెడ్డి , గంధమనేని శివయ్యలతో పరిచయం కావడం క్రమంగా కమ్యూనిష్టు ఉద్యమంలో పనిచేశేవారు . 25 సం:రాలు సర్పంచ్ గా ఉంటూ ఆదర్శవంతంగా సేవ చేసిన ఆదర్శమూర్తి రామనాధ రెడ్డి అని కొనియాడారు. కమ్యూనిష్ట్ ఉద్యమం పై  అంకితబావం తో  పని చేశారు.కోవిడ్ వలన మరణించిన రామనాదరెడ్డి  ఆవేదనతో వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారికుటుంబ సబ్యులకు సానుబూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు కె.మణి, ఏ.సత్యమూర్తి, దాసరి చంద్ర,  గిడ్డు బాయ్, కె.గంగాధర్ గణపతి, పి.గజేంద్ర బాబు, పి.రఘు,కె.రమాదేవి, కె. విజయ గౌరి, బి.కుమారి, వి.కోమల, మోదీన్, తిరువెంగడం, చాను భాషా, కరీం తదితరులు పాల్గొన్నారు.

తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయము

 తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయము

 చిత్తూరు, పెన్ పవర్

తన గాడ్ ఫాధర్ పెద్దిరెడ్డి గారితో పాటు పార్టీ హై కమాండ్ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయమని శ్రీ బుల్లెట్ సురేష్  అన్నారు. అదేవిధంగా కార్పొరేటర్లు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. 42 వ డివిజన్ లో వైసిపి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏపీ మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుల్లెట్ సురేష్  ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా ఆయనను కార్పొరేటర్ శశి కుమార్ ఘనంగా ఆహ్వానించారు. బజారు వీధి, జండామాను వీధి లలో ర్యాలీ నిర్వహించి అనంతరం రేణుకమ్మన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ ప్రజలు పలుచోట్ల ఆయనకు మంగళహారతులు , గజమాలలతో స్వాగతం పలికారు. అనంతరం వన్నియర్ బ్లాక్ లో వైసిపి కార్యాలయాన్ని శ్రీ బుల్లెట్ సురేష్  చేతుల మీదుగా ప్రారంభించారు. 42 వ డివిజన్ సచివాలయంలో కేక్ కట్ చేసి కార్యలయ సిబ్బందికి పంచిపెట్టారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శశికుమార్ మాట్లాడుతూ అత్యంత చిన్న వయస్సులో తనకు పార్టీ బీఫాం ఇప్పించడమే కాకుండా డివిజన్ లోని పెద్దలతో మాట్లాడి నన్ను ఏకగ్రీవంగా గెలిపించిన బిసిల ఆరాధ్య దైవం శ్రీ బుల్లెట్ సురేష్ గారికి జన్మ జన్మలా ఋణపడి ఉంటానని , అదే విధంగా అర్దరాత్రైనా సహాయం అని అడిగిన తన డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నవీన్ కుమార్, సహదేవన్ , శ్రీకాంత్, గడ్డం రమణ , దొడ్డిపల్లి సునీతా శివకుమార్, లక్ష్మణన్, ఇందు, ఏకాంబరం , గణేష్ మేస్త్రి స్దానిక నాయకులు పిచ్చాండి, మురుగా మేస్త్రి, శివకుమార్, ఆరుముగం మరియు బుల్లెట్ యూత్ సభ్యులు మురళి , ముత్తు, మగి, సూర్య తదితరులు పాల్గొన్నారు.

పుణ్య స్నానానికని గోదావరి దిగిన వ్యక్తి మృతి

 పుణ్య స్నానానికని గోదావరి దిగిన వ్యక్తి మృతి

 సీతానగరం, పెన్ పవర్ 

రామచంద్రపురం రావిచెట్టు రేవు వద్ద స్నానానికి దిగిన యనమండ్ర.భీమశంకర్ వయసు 45 సంవత్సరాలు అను వ్యక్తి ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో స్థానికులు రక్షణ చర్యలు చేపట్టారు. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని సీతానగరం ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా వైద్య సేవలు పొందుతూనే మరణించినట్లుగా స్థానిక ఎస్సై వై.సుధాకర్ తెలియజేశారు. సౌమ్యుడిగా జీవించిన వ్యక్తికి ఇటువంటి ప్రమాదం జరగడంతో కుటుంబీకులు,గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడికి ఇద్దరు మగపిల్లలు ఉన్నట్లుగా స్థానికులు తెలియజేస్తున్నారు. ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. విఆర్వో పుల్లారావు పంచనామా జరిపిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


భక్తులు తమ యొక్క మ్రొక్కుబడులు, కానుకలు తీర్చడానికి ఆన్లైన్

 భక్తులు తమ యొక్క మ్రొక్కుబడులు, కానుకలు  తీర్చడానికి ఆన్లైన్

చిత్తూర్, పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఎపిటిఎస్ వారిచే  దేవాదాయ ధర్మాదాయ శాఖ యందు అమలవుతున్న టిఎమ్ఎస్ అప్లికేషన్ ద్వారా భక్తులు తమ యెక్క మ్రొక్కుబడులు ,కానుకలు  ఆన్లైన్ ద్వారా సమర్పించేందుకు వీలుగా టిఎమ్ఎస్ అప్లికేషన్ నందు  చేయడమైనది. కనుక శ్రీ స్వామి వారికి  సమర్పించవలసిన కానుకలను మ్రొక్కుబడులు ఆన్లైన్  ఈ-హుండీ ద్వారా విరాళాలు ఇవ్వదలిచిన భక్తులు ఎండోమెంట్  వెబ్సైట్ tms.ap.gov.in ను సందర్శించి...ఈ క్రింద తెలిపిన విధముగా విరాళాలు చెల్లించవచ్చు.

1 : ఈ హుండీ చెల్లింపునకు దేవదాయ  శాఖ వెబ్సైట్ tms.ap.gov.in ను సందర్శించండి. 

 2 : మొదట సారి చెల్లింపునకు ఆన్లైన్ సర్విస్ ను ఎంపిక చేసుకున్న తరువాత  మెయిల్ ద్వారా గాని సెల్ నెంబర్  ద్వారా గాని మీ పేరు తో కూడిన వివరాలతో  యూసర్ రిజిస్టరేషన్ చేసుకోవలెను,ఈ  రిజిస్టరేషన్ ద్వారా తదుపరి చెల్లింపులు అన్నీ చేయవచ్చు. అప్పటికే యూసర్ రిజిస్టరేషన్ అయిన యెడల, యూసర్ యెక్క పేరు  పాస్వర్డ్  తో లాగిన్ కావలెను.

3 :   స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం , కాణిపాకం పేరును ఎంపిక చేసుకొని తదుపరి ఈ–హుండీ చెల్లింపు వివరములను పొందుపరచవలెను.

4 :   స్క్రీన్ పై కనపడునటు వంటి క్యూ ఆర్ కోడ్ ని వ్యాలెట్ ద్వారా అనగా గూగుల్ పే, ఫోన్ పే లేదా పేటీఎం మొదలైన వాటితో స్కాన్ చేయవలయును.

5:  క్యూ ఆర్ కోడ్ స్కాన్ అయిన పిదప మీరు చెల్లించిన చెల్లింపు దృవీకరణ తెలియచేయబడుతుంది. 

 6:  ప్రింట్ ద్వారా  స్క్రీన్ పై కనపరిచిన రసీదును నిక్షిప్తం చేసుకోవచ్చు. స్వయంగా కాణిపాకం కు రాలేని భక్తులు ఈ సువర్ణావకాశం ను సద్వినియోగం చేసుకుని శ్రీ స్వామి వారి కృపకు కటాక్షం పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేష్ మనవి చేశారు.

వెలుగు ఏపీఎం నాగభూషణం రామ్మూర్తి మృతి

 వెలుగు ఏపీఎం నాగభూషణం రామ్మూర్తి మృతి

మెంటాడ, పెన్ పవర్

 మెంటాడ మండలం వెలుగు ఏపీఎం గా విధులు నిర్వహిస్తున్న నాగభూషణరావు కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆయన విధులు నిర్వహించారు. అనంతరం ఆయనకు అనారోగ్యం బాగోలేదని విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారము తుది శ్వాస విడిచారు. నాగభూషణరావు మృతి చెందిన సంఘటన తెలుసుకున్న మెంటాడ మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగభూషణరావు ప్రభుత్వము మహిళా సంఘాలకు అందజేసిన ప్రతి పథకాన్ని పటిష్టంగా అమలు చేసిన వ్యక్తిగా మండలంలో ఆయనకు  మంచి గుర్తింపు ఉంది. మహిళా సంఘాలు సమస్యలను  ఆయన ఎంతో ఓపికతో పరిష్కరించే వారిని మహిళా సంఘాలు తన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయన మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వైయస్సార్ ఆసరా, చేయూత, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, శ్రీనిధి రుణాలు అందించేందుకు ఆయన చేసిన కృషి చేశారని మహిళా సంఘాలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మండల ప్రత్యేక అధికారి రమణమూర్తి, ఎంపీడీవో భానుమూర్తి, పంచాయతీ అధికారి వాణిశ్రీ, వ్యవసాయ శాఖ ఏవో మల్లికార్జున రావు, తాసిల్దార్ దూస రవి, సీసీలు, వెలుగు సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నాగభూషణరావు భార్య కూడా ప్రస్తుతము చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి “టెలి స్పందన

 కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి “టెలి స్పందన"

విజయనగరం, పెన్ పవర్

విజయనగరం జిల్లాలో ప్రస్తుతం 2వ దశ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదుల స్వీకరించేందుకు నిర్వహిస్తున్న "స్పందన” కార్యక్రమాన్ని రద్దు చేస్తూ, “టెలి స్పందన” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఏప్రిల్ 17, శనివారం నాడు తెలిపారు. కరోనా రోజు,రోజుకు తీవ్ర రూపం దాల్చి కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా నలు మూలల నుండి వచ్చే ఫిర్యాదుదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసామన్నారు. కానీ, ప్రజలెవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని తమ ఫిర్యాదులను సోమవారం నాడు ఉదయం 10-30గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు 08922-276163 కు ఫోను చేసి, తమ ఫిర్యాదు అంశాలను జిల్లా ఎస్పీకు తెలుపుకోవచ్చునన్నారు. ఫిర్యాదుల వివరాలను నమోదు చేసుకొని, సంబంధిత పోలీసు అధికారులకు నివేదించి, సమస్య పరిష్కారానికి చొరవ చూపనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. కావున, ప్రజలెవ్వరూ సోమవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంకు రానవసరం లేదని, ఫిర్యాదు చేయాల్సిన వివరాలను 08922-276163కు ఫోను చేసి తెలిపాల్సిందిగా జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.

ఘనంగా దవులూరి జన్మదిన వేడుకలు..

 ఘనంగా దవులూరి జన్మదిన వేడుకలు..

సామర్లకోట, పెన్ పవర్ 

పెద్దాపురం నియోజక వర్గ వైఎస్సార్ సిపి ఇంచార్జి దవులూరి దొరబాబు జన్మదిన వేడుకలు సామర్లకోట పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్ హాలులో పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్మిక నాయకులు దవులూరి సుబ్బారావు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను, కేకు కటింగు కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే స్థానిక స్టేషన్ సెంటర్లో దవులూరి జన్మదిన వేడుకల్లో బాగంగా పట్టణ వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఫంక్షన్ హాలులో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి, వైస్ చైర్మన్ ఊభా జాన్ మోజెస్, పట్టణ పరిదిలోని వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, సెక్రటరీలు, పార్టీ కౌన్సిలర్లు పాల్గొని ఇంచార్జి దొరబాబుకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్టేషన్ సెంటర్లో 2వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా ఆ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మద్దాల శ్రీను, మేకా శ్రీనివాసరావు, శెట్టిబత్తుల దుర్గ తదితరులు పాల్గొన్నారు.

ఈ మావోయిస్టుల ఆచూకీ మీకు తెలుసా..

 ఈ మావోయిస్టుల  ఆచూకీ మీకు తెలుసా..

పెన్ పవర్, విశాఖపట్నం

 ఈ మావోయిస్టుల ఆచూకీ మీకు తెలుసా అంటూ  ఏజెన్సీలో పోస్టర్లు వెలిశాయి. 25 మంది మావోయిస్టులు పేర్లతో సహా ముద్రించిన వాల్ పోస్టర్లు కొయ్యూరు మండలం తదితర ప్రాంతాల్లో అతికించారు. వాల్ పోస్టర్ పైన ఈ క్రింద తెలుపబడిన వ్యక్తులు మావోయిస్టు పార్టీలో చేరి  సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని మా సమాచారం అంటూ తెలుపుతూ దిగువన వరసకు ఐదు మంది ఫోటోలు చొప్పున ఐదు లైన్లలో ముద్రించి వారి వివరాలు కూడా ప్రచురించారు.వీరి సమాచారం తెలిసినవారు జిల్లా పోలీస్ సూపరిండెంట్ మరియు అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ లకు సమాచారం అందించాలని తెలిపారు సమాచారం అందించిన వారి పేర్లు గుప్తంగా ఉంచి వారికి తగిన పారితోషికం అందజేస్తామని  పోస్టర్ లో ముద్రించారు. ఈ పోస్టర్ పోలీసు శాఖ విడుదల చేసినట్లు స్పష్టమవుతుంది. మావోయిస్టులు ఇటీవల రిక్రూట్మెంట్ చేపట్టినట్లు సమాచారం. పలువురు గిరిజన యువత దళంలో చేరి  విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు మాచారం.  నల్లబెల్లి కి చెందిన  వంతల సంగీత(21) రెండేళ్ల క్రితం తప్పిపోయిందని ఫిర్యాదులు అందిన పట్టుకి ప్రస్తుతం మావోయిస్టు దళ సభ్యురాలిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆ గ్రామంలో దండోరా కూడా వేయించిన విషయం తెలిసిందే. మావోయిస్టుల ఆకర్షితులవుతున్న గిరిజన యువత ను  దారి మళ్ళించాలని పోలీసులు పలు సేవా కార్యక్రమాలు అందజేస్తున్నారు. యువత మావోయిస్టులకు ఆకర్షితులు   అవ్వదని పోలీసులు హితవు పలుకుతున్నారు.

నాడు నేడు బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలి...

 నాడు నేడు బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలి...

సామర్లకోటు, పెన్ పవర్

మండల పరిదిలో జరుగుతున్న అన్ని పాఠశాలలకు సంబందించి పూర్తయిన నాడు-నేడు పనుల బిల్లులను వెంటనే ఆన్లైన్ అప్ లోడ్ కార్యక్రమాన్ని చేపట్టాలని మండల  విద్యాశాఖాధికారి సలాది సుధాకర్ ఆదేశించారు. స్థానిక  ఎమ్మార్సీ భవనంలో శనివారం మండల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా పాఠశాలల్లో నాడు నేడు పనులు పూర్తయినా బిల్లులు  యాప్ లో అప్ లోడ్ చేసే విషయంలో జాప్యం చేస్తున్నారన్నారు. దానితో ఆయా పాఠశాలల్లో సయితం పనులు పూర్తికానట్టు ప్రభుత్వానికి నివేదికలు వెళుతున్నట్టు చెప్పారు. దాని దృష్ట్యా హెచ్లు వెంటనే బిల్లులు అప్ లోడ్ చేయాలన్నారు. కొన్ని పాఠశాలల్లో హెచ్ఎంలు బదిలీ అయిన కారణంగా అక్కడ బిల్లుల పెండింగు ఉందన్నారు. దానికి గానూ చార్జి అప్పగించని హెచ్ఎంలపై చర్యలు తీసుకోనున్నట్టు ఎంఈవో హెచ్చరించారు. ఈ సందర్భంగా నాడు-నేడు పనుల ప్రగతిపై పాఠశాలల వారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి హెచ్ంలకు పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో ఇంకా మండల విద్యాశాఖ ఇంజనీరింగు ఆహిరి లక్ష్మణరావు పాల్గొని మాట్లాడగా మండల పరిధిలోని అందరు హెచ్ఎంలు, సీఆర్పీలు, ఎమ్మార్సీ సిబ్బంది  పాల్గొన్నారు.

ఉత్పత్తి సంఘాలతో రైతుల ఆర్ధికాభివృద్ధి

 ఉత్పత్తి సంఘాలతో రైతుల ఆర్ధికాభివృద్ధి

తాళ్ళూరు, పెన్ పవర్

తాళ్లూరు మండలం దళారీల భారి నుంచి రైతులకు విముక్తి కలిగించడంతోపాటు వారి ఆదాయా న్ని పెంచేందుకు రైతు ఉత్పత్తి సంఘాలు దోహదపడతాయని మండల వ్యవసాయ శాఖ అధికారి బి ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయ మందిరంలో రైతు సంఘాల సంస్థాగత నిర్మాణం పై వ్యవసాయ, వెలుగు అధికారులు రైతులకు  శిక్షణ  కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ రైతు ఉత్పత్తి సంఘాల వలన  రైతులకు ఎన్నో ఉపయోగలు ఉన్నాయి అన్నారు.  సంఘాల ద్వారా పంట ఉత్పత్తి, విక్రయాలు మరింత పెరుగుతాయి తద్వారా రైతులకు మేలు జరుగుతుంది అన్నారు. అనంతరం ఉత్పత్తి సంఘాల ఏర్పాటు పై బుక్ లెట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ సిబ్బంది నాగరాజు,రాజ సుందరి, వెంకట్రావు, సుధీర్, వెలుగు ఏపీయం వెంకట్రావు, సీసీ చంద్ర,పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

టిఆర్ఆర్ డిగ్రీ కోర్సుల నిర్వహణకు మౌలికవసతుల తనిఖీ

 టిఆర్ఆర్ డిగ్రీ కోర్సుల నిర్వహణకు  మౌలికవసతుల తనిఖీ

పెన్ పవర్, కందుకూరు

స్థానిక టీ.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ, పీ.జీ. కళాశాలలో వివిధ డిగ్రీ కోర్సుల నిర్వహణకై  అవసరమయ్యే మౌలిక వసతులు  నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా తనిఖీ నిర్వహించడానికి నాగార్జున యూనివర్సిటీ ఆచార్యులు అశోక్ కుమార్, జగదీశ్ నాయక్ శనివారం  కళాశాలను సందర్శించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. తనిఖీలో భాగంగా ల్యాండ్ రికార్డులు, కళాశాల భవన నిర్మాణ ప్లానును, వివిధ విభాగాలను, సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబులను, జే కే సీ, ఇంగ్లీష్ లాంగ్వేజీ ల్యాబు, వర్చ్యువల్, డిజిటల్ తరగతి గదులను, బాలుర, బాలికల టాయిలెట్స్, మంచి నీటి సదుపాయాలను,  క్రీడా మైదాన సదుపాయాలు, 400 మీ. రన్నింగ్ ట్రాక్ ను, జిమ్ ను, బొటానికల్ గార్డెన్ ను, ఇటీవలే నిర్మించుకున్న అజోలా పాండ్ ను, వెర్మి కంపోస్టు యూనిట్ ను, హైడ్రోపోనిక్ యూనిట్లను పరిశీలించారని తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలికి తమ రిపోర్టును సమర్పిస్తారు అని తెలిపారు. తద్వారా కళాశాలలోని డిగ్రీ కోర్సుల  అఫిలియేషన్ ను యూనివర్సిటీ నుండి పొందవచ్చునని అన్నారు. వివిధ డిపార్ట్మెంట్ ఇన్- ఛార్జ్ లు, అధ్యాపకులు, ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ వైద్య సేవలపై ఆర్డీవో చిన్నికృష్ణ పరిశీలన..

 కోవిడ్ వైద్య సేవలపై ఆర్డీవో చిన్నికృష్ణ పరిశీలన....

సామర్లకోట, పెన్ పవర్ 

సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలోని బైపాస్ రోడ్డులో ఉన్న హోప్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో కరానా రోగులకు అందించే  వైద్య సేవలపై శనివారం కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా, ఇప్పటికే ఆసుపత్రిలో కోవిడ్ వైద్య సేవలను అందిస్తూ వస్తుండగా వాటి ప్రగతిపై ఆయన వైద్యుల వద్ద ఆరా తీసారు. అలాగే ప్రస్తుతం ఆసుపత్రిలో రోగులకోసం కేటాయించిన బెడ్లు, వెంటిలేర్లు పరిశీలించారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అవసరమైతే మరింత మంది ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు మరిన్ని బెడ్ లను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా ఆర్థవో ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. ఇంకా పలు వైద్య సేవలపై ఆయన ఆసుపత్రి సిబ్బంది నుంచి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో చిన్నికృష్ణ వెంట స్థానిక తహశీల్దారు వి జితేంద్ర, ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...