Followers

కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి “టెలి స్పందన

 కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి “టెలి స్పందన"

విజయనగరం, పెన్ పవర్

విజయనగరం జిల్లాలో ప్రస్తుతం 2వ దశ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదుల స్వీకరించేందుకు నిర్వహిస్తున్న "స్పందన” కార్యక్రమాన్ని రద్దు చేస్తూ, “టెలి స్పందన” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఏప్రిల్ 17, శనివారం నాడు తెలిపారు. కరోనా రోజు,రోజుకు తీవ్ర రూపం దాల్చి కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా నలు మూలల నుండి వచ్చే ఫిర్యాదుదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసామన్నారు. కానీ, ప్రజలెవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని తమ ఫిర్యాదులను సోమవారం నాడు ఉదయం 10-30గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు 08922-276163 కు ఫోను చేసి, తమ ఫిర్యాదు అంశాలను జిల్లా ఎస్పీకు తెలుపుకోవచ్చునన్నారు. ఫిర్యాదుల వివరాలను నమోదు చేసుకొని, సంబంధిత పోలీసు అధికారులకు నివేదించి, సమస్య పరిష్కారానికి చొరవ చూపనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. కావున, ప్రజలెవ్వరూ సోమవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంకు రానవసరం లేదని, ఫిర్యాదు చేయాల్సిన వివరాలను 08922-276163కు ఫోను చేసి తెలిపాల్సిందిగా జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...