Followers

కరోనా పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం తప్పదు

 కరోనా పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం తప్పదు

విజయనగరం, పెన్ పవర్

విజయనగరం జిల్లాలో ప్రస్తుతం 2వ దశ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం తప్పదని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఆదివారం నాడు హెచ్చరించారు. 1వ దశ కరోనా కంటే 2వ దశ కరోనా చాలా త్వరగా విస్తరిస్తున్నదన్నారు. కావున, ప్రతీ ఒక్కరూ కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో ఎటువంటి నిర్లక్ష్యం వద్దన్నారు. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా నోరు, ముక్కును కప్పుతూ మాస్క్ ధరించాలన్నారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించడంతోపాటు, అవసరం లేకుండా బయట తిరగవద్దన్నారు. తరుచూ చేతులను సానిటైజరు లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. కరోనా నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గోరు వెచ్చని నీటిని మాత్రమే త్రాగాలని, బెటాడిన్ లేదా ఉప్పు, పసుపు కలిపిన మిశ్రమాన్ని నీటితో పుక్కిళ్ళించడం చేయాలన్నారు. ప్రస్తుతం వైరస్ రూపాంతరం చెంది గాలి ద్వారా త్వరితగతిన వ్యాప్తి చెందుతుందని, దీనిని గుర్తించేలోగనే ప్రాణపాయ స్థితికి చేర్చేస్తుందన్నారు. కావున, ప్రజలంతా పోలీసుల కోసం కాకుండా మీ కోసం, మీ పై ఆధారపడే కుటుంబాల కోసం జాగ్రత్తలు పాటించాలన్నారు. వైరస్ ముక్కులోను, గొంతులోను ఉన్నపుడే అప్రమత్తమై, సకాలంలో చికిత్స పొందితే సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడవచ్చునన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలను అప్రమత్తం, అవగాహన కల్పించేందుకు పోలీసుశాఖకు సహకరించాలన్నారు. ప్రజలెక్కువగా గుమిగూడి ఉండే ప్రాంతాల్లో విందులు, వినోదాలు, విహార యాత్రలు, ప్రార్ధనా మందిరాలు, దేవాలయాలకు దూరంగా ఉండడం మంచిదన్నారు. ప్రతీ ఒక్కరూ స్వచ్చందంగా నియంత్రణ పాటించడం అందరికీ మంచిదని ప్రజలకు జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 45 సం.లు దాటిన ప్రతీ ఒక్కరూ వేక్సిన్ వేసుకోవాలని, వేక్సిన్ వేసుకోవడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతందని, తద్వారా కోవిడ్ 19 వైరస్ తో పోరాడేందుకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందన్నారు. కావున, వేక్సిన్ వేసుకొనేందుకు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా వేక్సిన్ వేయించుకొనేందుకు ప్రజలంతా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ కోరారు.జిల్లా ప్రజలకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రతీ రోజూ ప్రత్యేకంగా డ్రైవ్,  జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించి,  అవగాహన కార్యక్రమాలను, మాస్క్ ధరించని వారి నుండి జరిమానాలు విధించడం, స్వచ్చంద ప్రమాణాలను చేయిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...