Followers

Showing posts with label ANDHRAPRADESH. Show all posts
Showing posts with label ANDHRAPRADESH. Show all posts

ఆలమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (సి హెచ్ సీ)లో సీఐడీ తనిఖీలు

 ఆలమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (సి హెచ్ సీ)లో సీఐడీ తనిఖీలు

పెన్ పవర్, ఆలమూరు

  కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరులో గల సామాజిక ఆరోగ్య కేంద్రం (సీ హెచ్ సీ)లో శనివారం సీఐడీ అధికారుల బృందం రికార్డులను తనిఖీలు నిర్వహించారు. 2015-18 సంవత్సరంలో బెంగళూరు కు చెందిన  ఇండియా టెలీమాటిక్  అండ్ బయో మెడికల్  సర్వీసెస్ (ప్రైవేట్) లిమిటెడ్ (టి బిఎస్)  ద్వారా  ప్రభుత్వ ఆస్పత్రులకు సమకూర్చిన వైద్య పరికరాల స్థితిగతులను పరిశీలించిన పిదప ఆస్పత్రిలో ఉన్న రికార్డులను  రాజమహేంద్రవరం రీజనల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సీబీఐ అధికారులు కె సూర్యనారాయణ, కె అనురాధ తనిఖీచేశారు. ఈ తనిఖీల్లో ఆలమూరు ప్రభుత్వ వైద్యాధికారి కన్యాకుమారి పూర్తి సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ తనిఖీల్లో భాగంగా పెద్దపల్లలో గల పిహెచ్సి సెంటర్లలో పరికరాలను కూడా తనిఖీలు చేయనున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు సీబీఐ బృందం తెలిపారు.

ఏడు శనివారాల వెంకన్న దర్శనానికి చిన్నారి మోకాళ్ళ ప్రదక్షణ

ఏడు శనివారాల వెంకన్న దర్శనానికి చిన్నారి మోకాళ్ళ ప్రదక్షణ

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 వాడపల్లి గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి అలివేలుమంగా పద్మావతి సమేతంగా స్వయంభూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు ఏడు శనివారాల వెంకన్న దర్శనం  పుణ్యఫలం అని భక్తుల నమ్మకం ఈ రోజు శనివారం పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఓ చిన్నారి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మోకాళ్ళ ప్రదక్షణ చేస్తూ ఆ ఆలయానికి వచ్చిన భక్తులు అందరకూ ఆశ్చర్యపరిచే విధంగా ఆ  చిన్నారి ఆ  వెంకటేశ్వరస్వామి మొక్కుబడి తీసుకున్నది.

పంటల బీమాకు అన్నదాతలందరూ బయోమెట్రిక్ను నమోదు చేసుకోవాలి

 పంటల బీమాకు అన్నదాతలందరూ బయోమెట్రిక్ను నమోదు చేసుకోవాలి

పెన్ పవర్, ఆలమూరు 

ఆలమూరు వ్యవసాయ సబ్ డివిజన్లోలోని ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం మండలాల్లో 2020వ సంవత్సరంలో ఖరీఫ్ పంటలకు సంబంధించి పంట భీమా కొరకు అన్నదాతలందరూ బయోమెట్రిక్ ను నమోదు చేయించాలని ఆలమూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ ఏడీఏ సీహెచ్ కెవి చౌదరి అన్నారు. ఆలమూరు మండలం జొన్నాడ రైతు భరోసా కేంద్రంలో (ఆర్బీకె) రైతుల నుండి బయోమెట్రిక్ నమోదు చేసుకుంటున్న విధానాన్ని తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఈ నెల 20వ తేదీ లోపుగా రైతుబరోసా కేంద్రాలలో బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటికే కొందరు రైతులు అందుబాటులో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్ద ఇప్పటికే 15707 మంది రైతులు బయోమెట్రిక్ వేయించుకోగా ఇంకా ఆలమూరులో 4600 మంది, మండపేటలో 7029 మంది, కపిలేశ్వరపురం మండలంలో 5268 మందిరైతులు తమ బయోమెట్రిక్కును  నమోదుచేయించుకోవాల్సి ఉందన్నారు. మరికొందరు రైతులు వేరే ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో గల అన్ని రైతు భరోసా కేంద్రాల్లో బయోమెట్రిక్ నమోదు చేసుకునే అవకాసం ఉందని  చౌదరి తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరు వినియోగించుకోవాలని ఏడిఏ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు వ్యవసాయశాఖ (ఏవో) అధికారిణి సోమిరెడ్డి లక్ష్మి లావణ్య, పలువురు వ్యవసాయశాఖ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై అవగాహన

 పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై అవగాహన

 పెన్ పవర్,కరప

 పాఠశాలల్లో పారిశుధ్యపనులు సక్రమంగా నిర్వహిస్తూ టాయిలెట్స్, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని ఎంఈఓ కె.బుల్లి కృష్ణవేణి అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శనివారం, ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు,ఆయాలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిరోజూ మూడు సార్లు టాయిలెట్లు శుభ్రం చేయించాలన్నారు.టాయిలెట్ వద్ద సానిటైజర్, సబ్బు అందుబాటులోఉంచాలన్నారు.  విద్యార్థులతో ఆయాలు మంచిగా ప్రవర్తించి, సత్సంబంధాలు ఏర్పచుకోవాలి. ప్రతిపాఠశాలకు ఆరురకాల రసాయనాలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. టాయిలెట్స్ నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు . ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు పారిశుధ్య పనులు నిర్వహణపై శ్రద్ధ పెట్టి,ఆయాలతో సక్రమంగా చేయించాలని ఎందుఓ కృష్ణవేణి సూచనలు చేశారు. ఆర్పీలు కె.భారతి, వీఆర్యప్రసాదరావు, టీవీ సాగర్, పీవీ రమణమూర్తిలు పారిశుధ్యపనులు నిర్వహణ గురించి వివరించి,ఆయాలకు, కమిటీసభ్యులకు, హెచ్ఎంలకు అవగాహన కల్పించారు.

వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణ వార్షికోత్సవం భక్తులు అనుమతి లేదు

వాడపల్లి వెంకటేశ్వర స్వామి  కల్యాణ వార్షికోత్సవం భక్తులు అనుమతి లేదు

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 వాడపల్లి గ్రామంలో వేచేసియున్న కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి  కల్యాణ వార్షికోత్సవనకు భక్తులకు అనుమతి లేదు. దేశంలో సెకండ్వే కరోనా  విజృంభించిన వేళ ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమ్ము  కూడదని ఉద్దేశంతో భక్తులకు అనుమతి రద్దు చేయడం జరిగినదని ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలియజేశారు. ఉన్నతాధికారులను స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ పెద్దలు ధర్మకర్త చైర్మన్ లతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాతే భక్తులు ఆరోగ్యం బాధ్యత దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక కల్యాణోత్సవాలకు భక్తులకు అనుమతించకూడదని నిర్ణయించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.

ప్రభుత్వ వైద్యశాల పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలి

 ప్రభుత్వ వైద్యశాల పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలి     

మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమావేశపు హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే  

పెన్ పవర్, కందుకూరు

ప్రభుత్వ వైద్యశాలలో శస్త్ర చికిత్సలు చేసి ప్రజలకు ప్రభుత్వ వైద్యశాల పట్ల నమ్మకం కలిగేలా చేయాలని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని కమ్యూనిటీ హాల్, కాంపౌండ్ వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 50 లక్షల రూపాయలతో, కమ్యూనిటీ హాల్,  కాంపౌండ్ వాల్ కు ఎప్పుదో నిధులు మంజూరైతే  గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు అయినప్పటికీ నిర్మించకుండా వదిలేశారని అన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక్క మాచవరం గ్రామానికి సంబంధించింది కాదని మండలం మొత్తానికి సంబంధించిన వైద్యశాల అని అన్నారు. ప్రభుత్వం నుంచి రాని మందులను  డాక్టర్ల సలహా మేరకు నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కోవిడ్ నిధుల నుంచి సుమారు లక్షా 20 వేల రూపాయలతో అందజేసినట్టు తెలిపారు. కందుకూరు ఏరియా వైద్యశాలకు అత్యాధునిక పరికరాలు సమకూర్చగా ఇటీవల శస్త్రచికిత్స సైతం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో ఆధునీకరించడం తో కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాల, ఉలవపాడు సి హెచ్ సి లకు రోగుల సంఖ్య పెరిగిందని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఆధునిక పరికరాల కోసం దాతలను బలవంతం లేకుండా వారి సహకారంతో ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించతామని తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్ కు ప్రభుత్వం భవన నిర్మాణం కోసం 80 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసిందని అన్నారు.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైద్య రంగం మీద ప్రత్యేక శ్రద్ధ ఉందని పీహెచ్సీలలో ఇద్దరు వైద్యాధికారులను నియమించారని అన్నారు. వైద్యశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి  రేషన్ ఏ విధంగా డోర్ డెలివరీ చేస్తున్నారో, వైద్యాన్ని కూడా అలాగే డోర్ డెలివరీ చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఏరియా వైద్యశాలకు 7.50 కోట్ల రూపాయలతో నూతన భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. దాతలు సమకూర్చిన స్టెయిన్లెస్ స్టీల్ బెడ్లు 30 సిద్ధంగా ఉన్నాయని అని దీనిలో కోవిడ్ నిధుల నుంచి 80 వేల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తన హాస్పిటల్ నుండి ఇరవై మూడు మంచాలు పంపించగా 17 మంచాలు సిద్ధం చేశామని తెలిపారు. మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వేణుగోపాల్ రెడ్డి  5 మంచాలు అందజేశారని తెలిపారు. ఈ పి హెచ్ సి గ్రామస్తుల సహకారం తో 7 లక్షల రూపాయలతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసి అప్పగించినట్లు తెలిపారు. కావున వైద్య సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం హెచ్ ఓ ప్రియంవద, డాక్టర్ స్వాతి, తహసీల్దార్ సీతారామయ్య, ఎస్సై కొత్తపల్లి అంకమ్మ, వేణుగోపాల్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హోరాహోరీగా వాలీబాల్ పోటీలు

 హోరాహోరీగా వాలీబాల్ పోటీలు 

చిత్తూర్, పెన్ పవర్

 స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా జరుగుతున్న వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ పోటీలకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ఆహ్వానిత జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో మొదటి మ్యాచ్ లయోలా కాలేజ్ చెన్నై బంగారుపాలెం స్పైకర్ మధ్య జరిగిన పోటీల్లో లయోలా కాలేజ్ చెన్నై గెలుపొందింది. మరో మ్యాచ్లో కోయంబత్తూర్ ఈ రోడ్డు మధ్య జరిగిన పోటీల్లో కోయంబత్తూర్ గెలుపొందింది. 

ఈ పోటీలు తిలకించడానికి జిల్లాలో నలుమూలల నుంచి క్రీడా అభిమానులు విచ్చేశారు. ఈ పోటీలు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫ్లడ్లైట్ల వెలుతురులో సాగుతాయని నిర్వాహకులు  తెలిపారు. ఈ పోటీలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుమార్ రాజా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్ వాలీబాల్ ఆటగాడు తులసి రెడ్డి చిత్తూరు జిల్లా వాలీబాల్ కోచ్ సుదర్శన్ నాయుడు, మాజీ వాలీబాల్ క్రీడాకారులు కృష్ణమూర్తి మురారి, దిలీప్, వెంకటేష్, చందు, పెరుమాల్, తిరుమల్ రావు, మురుగేష్ తదితరులు పాల్గొన్నారు.

కేజే పురంలో 40 నకిలీ మద్యం బాటిళ్లు పట్టివేత

 కేజే పురంలో 40 నకిలీ మద్యం బాటిళ్లు పట్టివేత

పెన్ పవర్, విశాఖపట్నం

 ప్రజలకు అలుపెరగని సేవలందిస్తున్నరని వాలంటీర్ల  సేవలకు ప్రతిభా అవార్డులను ఇచ్చి  ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంటే  మరోపక్క  కొందరు వాలంటీర్లు అవినీతి అక్రమాలకు పాల్పడి కటకటాల పాలవుతున్నారు. ఇటీవల అక్కడ అక్కడ జరిగిన సంఘటనలు ఒక ఎత్తయితే  శనివారం మాడుగుల మండలం కస్పా జగన్నాధపురం లో 40 మద్యం బాటిళ్లు తో గ్రామ వాలంటీర్  అరెస్టు కావడం విశేషం. కస్పా జగన్నాధపురం గ్రామ వాలంటీర్ ఆడారి భాస్కరరావు ప్రభుత్వ వైన్ షాప్ సేల్స్ మేన్  ఎల్లపు నూక అప్పారావు లను 40 మద్యం బాటిళ్లుతో  మాడుగుల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పి రామారావు శనివారం అరెస్టు చేసి కోర్ట్ కి తరలించారు.  అలాగే  అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మూడు లీటర్ల నాటుసారా తో అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళితే: ప్రభుత్వ మద్యం షాపులో సేల్స్ మెన్ గా పని చేస్తూ ఉన్నా ఎల్లపు నూక అప్పారావు  గ్రామ వాలంటరీ ఆడారి భాస్కర రావులు  అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ  అక్రమ మద్యం అమ్మకాలు చేస్తూ డబ్బులు ఆర్జిస్తున్న ట్లు  సమాచారం. ఒడిస్సా ప్రాంతాలనుంచి చీఫ్ మద్యాన్ని తెచ్చి విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఇరువురు ఎడాపెడా డబ్బులు  సంపాదిస్తున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం షాపు లో అవినీతి జరుగుతున్న  ఎక్సైజ్ అధికారులు గానీ  వాలంటీర్ అవినీతికి  ఎంపీడీవో గాని చర్యలు తీసుకోవడం గమనార్హం. పలుచోట్ల గ్రామ వాలంటీర్ల  తీరుపై ఆరోపణలు వినిపిస్తున్న  అధికార పక్షం నేతలు సహకారంతో మగ్గి పోతున్నాయి. పరిషత్ ఎన్నికల్లో అక్కడ అక్కడ వాలంటీర్లు డబ్బులు  పంచిన సంఘటనలు లేకపోలేదు.

బి.జె.పి, ఎస్సీ మొర్చా నగర ఉపాధ్యక్షురాలు గా దశమంతుల సుశీల ,బోనెల సూర్యకళ

బి.జె.పి, ఎస్సీ మొర్చా నగర ఉపాధ్యక్షురాలు గా దశమంతుల సుశీల ,బోనెల సూర్యకళ

మహారాణి పేట, పెన్ పవర్
భారతీయ జనతా పార్టీ నగర ఎస్సీ మొర్చా కమిటీ లో ఎస్సీ మొర్చా నగర ఉపాధ్యక్షురాలు గా  దశమంతుల సుశీల ,బోనెల సూర్యకళ లను బి.జె.పి అధిష్టానం ఎంపికచేయటం జరిగింది. తమకు ఈ యొక్క బాధ్యతను సిఫార్సు చేసినటువంటి నగర అధ్యక్షులు మెడపాటి రవీంద్ర రెడ్డి కి, ఎం.యల్.సి, పి.వి.యన్. మాధవ్ కి,మరియు మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు కి, ఎస్సీ మొర్చా అధ్యక్షులు కోడూరు సంజీవరావు కి,బాధ్యతలు చేపట్టిన ఇరువురూ  ధన్యవాదాలు తెలియజేశారు. తమకు  ఇచ్చినటువంటి ఈ భాద్యతలకు న్యాయంచేకూరుస్తామని అలాగే పార్టీకి బలంచేకోరే విధంగా కృషి చేస్తామని నగర ఎస్సీ మొర్చా కమిటీ లో ఉపాధ్యక్షురాలు గా బాధ్యతలు చేపట్టిన దశమంతుల సుశీల ,బోనెల సూర్యకళ తెలియజేశారు.

విమ్స్ ను కోవిడ్ సెంటర్ గా ప్రారంభించాలి

 విమ్స్ ను  కోవిడ్  సెంటర్ గా ప్రారంభించాలి 

మహారాణి పేట, పెన్ పవర్

కరోనా రెండవ దశ  విజృంభిస్తున్న  వేళ విశాఖ ప్రజలకు పూర్తిస్థాయిలో  వైద్య సదుపాయాలు కలిగిన  విమ్స్ ని కోవిడ్ సెంటర్ గా  వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని   రవి కుమార్ కోరారు.విశాఖలో రోజు రోజుకి కొవిడ్ సోకిన రోగులు సంఖ్య పెరుగుతున్నది అని కేజీహెచ్ లో  500 పడకలు నిండిపోయిన్నాయి అని విశాఖ చెస్ట్ ఆస్పత్రి లో పడకలన్నీ పూర్తిగా నిండి పోయాయి అని తెలియజేశారు.కార్పొరేట్ ఆస్పత్రులలో కోవిడ్ పేరుతోటి లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని ,ప్రభుత్వ యంత్రాంగం చోద్యము చూస్తున్నదని అన్నారు.కోవిడ్ ను  ప్రభుత్వము ఆరోగ్యశ్రీ లోకి చేర్చిన కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ల దందా మారలేదు అని ,ఈ విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందారని అన్నారు. ప్రధాని మోడీ చొరవతో 30 కోట్ల డోసులు కోవిడ్ వ్యాక్సిన్ ముడిసరుకు రెడీగా ఉందని అతి తొందరలో భారతావని అంతటా అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ వేస్తారని అన్నారు కొవిడ్  నియంత్రణకు  వ్యాక్సిన్తో పాటు,తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ,భౌతిక దూరం పాటించాలని ,చేతులను తరచుగా పరిశుభ్రంగా  చేసుకోవాలని కోరారు.విశాఖలోని అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు కలిగిన విమ్స్ ను పూర్తి స్థాయిలో అనగా డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ ,పారిశుద్ధ్య పని వారు,ఎమ్.ఎన్.ఓ, ఎఫ్.ఎన్.ఓ,యుద్ధ ప్రాతిపదిక మీద నియమించి వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.గత ఆరు నెలలుగా నెలసరి వేతనం  అందని వైద్యులకు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య పని వారు లకు వెంటనే వేతనములు చెల్లించాలని  కోరారు.వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రజలలో ఉన్న అపోహలు తొలగించడానికి ప్రచార సాధనములను ఉపయోగించుకోవాలని కోరారు.ఆంధ్రప్రదేశ్లో కొంతకాలంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడినది అని, విశాఖలో ఇప్పటి వరకు 4,30,931 మందికి వ్యాక్సిన్ వేయటం జరిగినది అని,అనతి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో పూర్తిస్థాయిలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు.అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి వ్యాక్సిన్ యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వము ఈ వ్యాక్సిన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేబట్టి ,ఆంధ్రప్రదేశ్ ను కరోనా రహిత  రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు.ఇజ్రాయిల్ దేశం లో మాదిరిగా భారతావనిలో కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి టీకా వేయించుకొని మన ఆరోగ్యంతో పాటు,ఇతరుల ఆరోగ్యం కూడా కాపాడాలని సూచించారు.కోవిడ్ కష్టకాలంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ప్రతి వారికి డబ్బు కోసము ఇబ్బంది పడకుండా భారత ప్రధాని నరేంద్రమోడీ కరోనాకవచ్ పేరుతో అతి తక్కువ ప్రీమియం తో  50 వేల నుంచి 5 లక్షల వరకు 105 రోజులు ,195 రోజులు,285 రోజుల కాల వ్యవధి గల పాలసీలు తీసుకోవాలని సూచించారు.40 సంవత్సరాల నుంచి 50సంవత్సరాల వరకు  రూపాయలు 3,50,000 కు ప్రీమియం ఖరీదు  461 రూపాయలు,50 నుంచి 60 సంవత్సరాల వరకు ప్రీమియం ఖరీదు   615  రూపాయలు ,అన్ని ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఈ పాలసీలు లభ్యం అవుతాయి .ప్రజలందరూ ముందు జాగ్రత్త కోసం, కరోనాకవచ్ పాలసీలు తీసుకోవాలని మరియు అశ్రద్ధ చేయవద్దని ప్రజలకు సూచించారు.

ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్లను చేర్చుకోవద్దు

ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్లను చేర్చుకోవద్దు

కందుకూరు లో ఏరియా వైద్యశాల ఒక్కటే కరోనా హాస్పిటల్     

ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం                పెన్ పవర్, కందుకూరు

 ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషంట్లను  కందుకూరు లో ఎవరో చేర్చుకోవద్దని కందుకూరు లో కేవలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలను మాత్రమే కరోనా హాస్పిటల్ గా గుర్తించామని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో ప్రియంవద అన్నారు. శనివారం  మండలంలోని మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసిన ప్రియంవద పెన్ పవర్ లో  వచ్చిన కథనంపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రియంవద మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఇచ్చి ఉన్నారని అన్నారు. జిల్లాలో ట్రీట్మెంట్ చేసే విషయంలో పేషెంట్ల వద్ద ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. కందుకూరులో ప్రభుత్వ ఏరియా వైద్యశాల తో పాటు కోటారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ ను త్వరలో కోవిడ్ హాస్పిటల్ గా తీసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. కరోనా ఉదృతంగా వస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని కోరారు. లాక్ డౌన్ లేని కారణంగా ప్రజలు ఇష్టారీతిన మాస్కులు ధరించకుండ భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో కోవిడ్ పేషెంట్లకు 800 బెడ్ లు ఉన్నాయని, 350 బెడ్లకు ఆక్సిజన్ ఐసియు సౌకర్యం ఉందని తెలిపారు. కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కోవిడ్ పేషెంట్లకు ఇరవై బెడ్లు ఉన్నట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అప్రమత్తంగా ఉంటూ అవసరమైతేనే బయటికి రావాలని కోరారు. నివారణ ఒక్కటే మార్గం అని స్వీయ నియంత్రణ  పాటించాలని ఆమె కోరారు. మండల టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్, తహసిల్దార్ సీతారామయ్య మాట్లాడుతూ పెన్ పవర్ లో కథనం చూశానని సోమవారం ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులతో  సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు.

వైద్య శాఖలో ఆక్రమ డిప్యుటేషన్ లు రద్దు చేయాలి

 వైద్య శాఖలో  ఆక్రమ డిప్యుటేషన్ లు రద్దు చేయాలి 

జిల్లా వైద్య అధికారులు నియంతృత్వ పోకడలు మానుకోవాలి    

విధానాలు మార్చుకోకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేస్తా    

కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి  
పెన్ పవర్, కందుకూరు

డిప్యూటీ డిఎం అండ్ హెచ్ వో పరిధిలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి ఇక్కడ వైద్య సిబ్బందిని ఒంగోలు కు బదిలీ చేయడం పై స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి శనివారం ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బందిని సంపూర్ణంగా మౌలిక వసతులను ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందేనన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా వస్తుందని ప్రభుత్వం  అధికారులను అప్రమత్తం చేస్తూ  కేంద్రమును ఒప్పించి వ్యాక్సిన్ ఆరు లక్షల డోసులను తెప్పించగా జిల్లాకు 25 వేల డోసులను సరఫరా చేశారని అన్నారు. ఇందులో ప్రకాశం జిల్లా దీనికి భిన్నంగా నడుస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కందుకూరు నియోజకవర్గంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ పరిధిలో ఉన్న సిబ్బందిని  అధికశాతం లో  ఒంగోలుకు డిప్యూటేషన్ గా విచ్చలవిడిగా ఎందుకు బదిలీ చేస్తున్నారు అని ఇక్కడ కొరత ఉన్నప్పటికీ మీకు ప్రజల ఆరోగ్యం ఎవరికీ పట్టదు అని నిలదీశారు. డిప్యుటేషన్ లకు కేరాఫ్ అడ్రస్ గా డి ఎం హెచ్ వో కార్యాలయం భారీ ఎత్తున డిప్యుటేషన్ లకు తెర తీశారని అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే పై స్థాయి కూడా తీసుకు వెళతానని అన్నారు. డిఎం హెచ్ఓ, కలెక్టర్ స్పందించకపోతే వారి కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తానని అన్నారు. జిల్లా కలెక్టర్ కనుసన్నల్లో డిఎం హెచ్ వో కార్యాలయం నడుస్తుందని కలెక్టర్  స్పందించక పోతే  కలెక్టర్ కార్యాలయం ముందు కూడా నిరసన తెలియజేస్తానని కరాఖండిగా చెప్పారు. ఎవరి ఇళ్లవద్ద వారికి ఉద్యోగాల కోసం డేప్యూటేషన్స్ ఇస్తున్నారని ఈ తాపత్రయం వెనక ఏముంది, ఈ తాపత్రయం వెనక లక్ష్మీదేవి కాలి గజ్జలు గల్లుమంటున్నాయని ప్రజలు మమ్మల్ని నేరుగా అడుగుతున్నారని అన్నారు. డిఎం హెచ్ ఓ, కలెక్టర్ కలుగజేసుకొని డిప్యూటేషన్ రద్దు చేయాలన్నారు. ఆశ వర్కర్ల కొరత ఉన్నప్పటికీ ఆశా వర్కర్లు రూరల్ నుంచి అర్బన్ కు ఎందుకు పంపిస్తున్నారని అర్బన్ లో వారికి ఇచ్చిన సంఖ్య కంటే అధికంగా ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారని నిలదీశారు. అధికారులు పొరపాటును సరిదిద్దుకోవాలని మంచి ఆశయంతో ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెడ్డపేరు తీసుకు రాకుండా అధికారులు చర్యలు తీసుకొని డిప్యూటేషన్ రద్దు చేయాలని మహీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

జనసేనాని కోలుకోవాలి దేవుడా..

 జనసేనాని కోలుకోవాలి దేవుడా..

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ఉమాసహిత కైలాసనాధ ఆలయంలోని శివునికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న తరుణంలో ఆయన కరోనాని జయించి పూర్తి ఆరోగ్యముతో ప్రజాసేవలో పాల్గొనాలని శివున్ని ప్రార్ధించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కడ్రక. మల్లేష్, కొనిస.రాజా,అధికారి.అనీల్,ధర్మ, విజయ్ పాల్గొన్నారు.

కాణిపాకం ఆలయంలో కరోనా కలకలం ఐదు మందికి పాజిటివ్ నిర్ధారణ

కాణిపాకం ఆలయంలో కరోనా కలకలం ఐదు మందికి పాజిటివ్ నిర్ధారణ 

చిత్తూరు, పెన్ పవర్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో పని చేసే ఐదు మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆలయ అధికారులు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా విలయ తాండవం చేస్తుంది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా కాణిపాకం ఆలయంలో పనిచేసే ఐదు మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆలయ సిబ్బంది భక్తులు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విఘ్న నాయకుడైన గణనాథుని దర్శనార్థం ప్రతిరోజు దేశ నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. రాష్ట్రంలో జిల్లాలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఆలయం వద్ద కరోనా నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆలయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో భక్తులు ఆలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో పనిచేసే అధికారులు సిబ్బంది, అర్చకులు, వేదపండితులకు గురువారం నుంచి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇతర అర్చకులకు ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా రిపోర్టులు వచ్చినట్లు తెలుస్తోంది. మరికొంతమంది సిబ్బందికి రిపోర్టులు రావాల్సి ఉంది పరీక్షలు చేయించుకున్న సిబ్బంది అర్చకులు, వేదపండితులు రిపోర్టులు వస్తే మరింత మందికి కరోనా పాజిటివ్ వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఉన్నతాధికారులు కరోనా నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితు లు నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో భక్తుల మధ్య దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టకపోవడం అధిక సంఖ్యలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతించడం వంటి ప్రజల వల్ల ఆలయంలో కరోనా వ్యాపించినట్లు తెలుస్తోంది. వ్యాపార ధోరణి లో ఆలయ ఆదాయమే పరమావధిగా పెట్టుకొని ఆలయ ఉన్నతాధికారులు కరోనా నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కాణిపాకంలో భారీగా వ్యాప్తి చెందుతున్నట్లు భక్తులు స్థానికులు ఆరోపిస్తున్నారు.

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో సుబ్రపరచడమైనది

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిసర  ప్రాంతాల్లో  శుబ్రపరచడమైనది

చిత్తూరు, పెన్ పవర్

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోమన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు వేల సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా బారిన పడకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయంలో క్యూ లైన్ నందు, సుభద మండపం అన్వేటి మండపం మరియు ఆలయ పరిసరాలు ప్రాంతాల్లో  హైపోక్లోరైడ్ ద్రావణం తో  శుబ్రపరచడమైనది. ఆలయంలో,  వివిధ విభాగాల్లో పని చేయు సిబ్బందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణకు కార్యనిర్వాహణాధికారి వెంకటేశు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

అనుమతి లేని లే అవుట్లు, నోటీసులు జారీ..

 అనుమతి లేని లే అవుట్లు, నోటీసులు జారీ..

 సంతబొమ్మాళి, పెన్ పవర్

మండలంలో నౌపడ పంచాయతీ పరిధిలోగల పంటపొలాలను కొందరు లేఅవుట్లుగా మార్చేస్తున్న నేపధ్యంలో పంచాయతీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేఅవుట్లకు సంబంధించిన వివరాలను సర్పంచ్ పిలక బృందాదేవి ప్రతినిధి  రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించి, ఆయా లేఅవుట్లలో పంచాయితీ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించినవారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పంచాయతీల పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ లు నిర్వహించకూడదని పేర్కొన్నారు. ఇప్పటికే ఏవైనా విక్రయాలు నిర్వహించినట్లయితే వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు చేపట్టాలని, ఈ విషయాన్ని గతంలో కూడా ఆయా లేఅవుట్ యజమానులకు నోటీసు ద్వారా తెలిపామని పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసరావు తెలిపారు. అక్రమ లే అవుట్ లో వేసిన ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి  గృహనిర్మాణం చేసినట్లయిన పంచాయతీ పరిధిలోని తీసుకోదని ఈ విషయాన్ని వినియోగదారులు కూడా తేల్చుకుని తెలుసుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో క్రయ విక్రయాలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో నౌపాడ పంచాయతీల పరిధిలో తురక వీధిలో సర్వే నెంబర్ 419/6, లో 2 ఎకరాల 50 సెంట్లు బి ఎమ్ ఆర్ వెంచర్ , 49/5లో 1 ఎకరా49 సెంట్ లో టెక్కలి వీధి వద్ద అమర్ సింగ్ వెంచర్,415/2 సర్వేనెంబర్ లో 82 సెంట్ లో వైయస్సార్ కాలనీ పక్కన బెలుసంటి నాగేశ్వరావ్ వెంచర్, 419/1లో 54 సెంటు లో మర్రి శ్రీను వెంచర్, 427/1ఇ,2ఏ,2సీ,2ఈ, లో 1 ఎకరా 8 సెంట్లు ల్లో, కొండపల్లి డెప్పి వద్ద   సునీల్ అండ్ రాజేష్ వెంచర్, కూర్మ నాథ పురం వద్ద సర్వే నంబర్523,208,494/1లో1 ఎకరా 11 సెంట్లు లో డబ్బీరు కూర్మారావు అండ్ బ్రదర్స్ వెంచర్, నౌపడ మూడు రోడ్ల జంక్షన్ వద్ద సర్వే నెంబర్358/2లో1 ఎకరా20 సెంట్లు లో చింతాడ జీవన్ వెంచర్, నౌపడ మూడు రోడ్ల జంక్షన్ వద్ద సర్వే నెంబరు358/2లో1 ఎకరా 95 సెంట్లు లో వారణాసి గోవిందరాజులు వెంచర్లు పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అనధికార వెంచర్లు వేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేయాలంటే ముందుగా పంచాయతీ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే  ఇటువంటి వాటిని గుర్తించిన ప్రభుత్వం లేఅవుట్లు లేకుండా ఎటువంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ సంబంధిత అధికారులు ఆదేశాల జారీ చేసింది. దీంతో అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చెక్ పెట్టినట్లయింది. అంతేకాకుండా ఈ విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎవరికైనా అనుమతులు కావాల్సి ఉంటే పంచాయతీ, టౌన్ ప్లానింగ్ కార్యాలయాలకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని పంచాయతీ సెక్రటరీ తెలిపారు. జిల్లా ఎస్ఎఆర్, అర్బన్ డెవలాప్మెంట్ కార్యాలయం ద్వారా ఆదేశాలు జారీ అయినట్లు తెలిపారు.

ఉత్తమ వాలంటీర్లకు కోవిడ్ నిబంధనలతో సేవా పురస్కారాలు

ఉత్తమ వాలంటీర్లకు కోవిడ్ నిబంధనలతో సేవా పురస్కారాలు

పెన్ పవర్, ఆలమూరు

ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారదులైన వాలంటీర్ వ్యవస్థకు అరుదైన గౌరవం దక్కిందని ఆలమూరు ఎంపీడీవో జేఏ ఝాన్సీ అన్నారు. ప్రజా క్షేత్రంలో  సంక్షేమాలఉత్తమ సేవలు అందించిన వాలంటీర్ లకు ప్రభుత్వం సేవ పురస్కారాలు అందజేసి వారి సేవలను గుర్తించడంతో కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో విశేష ప్రజా సేవలు అందించిన వాలంటీరులకు సేవావజ్ర, సేవసరత్నాలతో పాటు నజరానా ప్రకటించి మరింత సేవ చేయడం కోసం ప్రోత్సాహకాలను అందించేందుకు ఈ నెల 19వ తేదీ సోమవారం ఆలమూరు మండలం పధ్ధెనిమిది గ్రామాలకు సంబంధించి రావులపాలెంలో గల సీఆర్సీలో ఎనిమిది (3+5) మంది వాలంటీర్లకు కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి గారి చేతుల మీదుగా సేవా పురస్కారాలు అందించనునారని ఎంపీడీవో తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ ప్రదానోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించాలని అనుకున్నా ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్  మానవాళిపై భయంకరంగా విజృంభిస్తున్న తరుణంలో 18 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ముఖ్య నాయకులు మాత్రమే హాజరు కావాలని ఆమె తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకొని జాగ్రతగా ఉండండి

 కరోనా సెకండ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకొని జాగ్రతగా ఉండండి

రాజమహేంద్రవరం,పెన్ పవర్

రాజమహేంద్రవరం స్థానిక  స్వచ్ఛంద సేవా సంస్థలు కోవిడ్ సమస్యలను ఎదుర్కొనేందుకు అభిప్రాయ సేకరణ మరియు సమీక్ష కార్యక్రమాన్ని  హోటల్ శ్రీ కన్య లో స్వర్ణాంధ్ర సేవా సమితి వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం కరోనా లో రాజమండ్రి ప్రజలకు సేవలందించిన సేవా సంస్థలు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో హాజరై  వారి వారి అభిప్రాయాలు మరియు రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధంగా తమ తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారూ అని వారి అభిప్రాయం వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సేవాసంస్థ తోపాటు చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ రాజమండ్రి పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్ రాజమండ్రి,  హెల్పింగ్ హాండ్స్ రాజమండ్రి, జైన్ సేవా సమితి, మనం చారిటబుల్ ట్రస్ట్ కడియం, ముస్లింస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి, వికాస్ సేవాసమితి రాజమండ్రి వివిధ సేవా సంస్థలతో పాటు, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న పలువురు  న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ అభిప్రాయాలు మరియు వారి సేవలను  ఏవిధంగా కొనసాగించగలరు వాటిపై వారి సూచనలు ఇవ్వడం జరిగింది.

నిస్వార్థ సేవలందిస్తున్న వాలంటీర్లకు వందనం...

 నిస్వార్థ సేవలందిస్తున్న వాలంటీర్లకు వందనం...


రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు...
వాలంటీర్ల అందరికీ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను   
 

నర్సీపట్నం, పెన్ పవర్

వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రానికి దేశంలోనే మంచి గుర్తింపు వచ్చిందని నిస్వార్థ సేవలను అందిస్తున్న వాలంటీర్లు అందరికీ తన ప్రత్యేక అభినందనలు అనీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.శనివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ ,మాకవరపాలెం మండలాలకు చెందిన గ్రామ /వార్డు వాలంటీర్ లకు ఉగాది విశిష్ట పురస్కారాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా  గుర్తింపు వచ్చిందని ,అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు చేరే విధంగా వాలంటీర్లు నిస్వార్థంగా సేవలను అందిస్తున్నారన్నారు. వీరు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్రప్రభుత్వం  "సేవా వజ్ర," "సేవా రత్న","సేవా మిత్ర " పురస్కారాలను, నగదు, అవార్డుల బహుమతుల ను అంద చేయడం జరుగుతుందన్నారు.గ్రామ స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సమస్యలను గుర్తించి పై అధికారులకు తెలియజేయడం,అదేవిధంగా పింఛన్లను ఒకటో తేదీ తెల్లవారే లోపల అందజేస్తున్న ఘనత వీరిదే నన్నారు. లాక్ డౌన్  సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక 4 సార్లు ప్రజా సాధికార సర్వే చేశారని కొనియాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయడానికి వారధి లా పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవలసి ఉందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు.

       

జిల్లా కలెక్టర్  వి వినయ్ చంద్   మాట్లాడుతూ కీలక అంశం వాలంటీర్లు వ్యవస్థ అని రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యత చేపట్టిన వెంటనే తీసుకున్న విప్లవాత్మక  నిర్ణయం సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ అని అన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా అందించేందుకు వాలంటీర్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.వాలంటీర్లు అవినీతికి తావు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా సేవలను అందిస్తున్నారు అనీ, మునిసిపాలిటీలలో మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా వారి ఇంటి వద్దకే పధకాలను అందిస్తున్న ఘనత వాలంటీర్లదే అన్నారు. 2020 లాక్ డౌన్ సమయం లో ఇంటింటికి ఫీవర్ సర్వే ,నాలుగు సార్లు సర్వే చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించడం ద్వారా కోవిడ్ నియంత్రణకు చాలా కృషి చేశారన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నదని  గతవారం ఒకేరోజు 55 వేల మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని, ఎవరూ ఎటువంటి అపోహలకు ,అనుమానాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించు కొనే విధంగా  అవగాహన కల్పించాలన్నారు. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఇదే స్థాయిలో అవగాహన చేసుకొని  అమలు చేయడానికి కీలక పాత్ర వహించాలన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బిశెట్టి సత్యవతి మాట్లాడుతూ జగనన్న మానస పుత్రిక  వాలంటీర్, సచివాలయ వ్యవస్థ అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా నవరత్నాలను ప్రవేశపెట్టిన ఘనత మన ప్రభుత్వానిదే అన్నారు. వాలంటీర్ల అందరికీ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ప్రతి ఒక్కరూ  కోవిడ్ నిబంధనలను  పాటిస్తూ మరింత ఉత్సాహంతో సేవ చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ 100% మంది సేవలను అందిస్తున్నారని, ఈ రెండు సంవత్సరాలలో వారు సిస్టమ్ ద్వారా  చేసిన పనులను గుర్తించి  అవార్డులను అందించడం జరిగిందన్నారు. ఈ అవార్డును గౌరవమైన సేవ గా తీసుకోవాలన్నారు.సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అక్టోబర్ 2, 2019 సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాలను ,సేవలను ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో స్థాపించడం జరిగిందన్నారు.రెండు సంవత్సరాలుగా గ్రామ వాలంటీర్లు అనేక సేవలను అందిస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పై విస్తృత ప్రచారం అవగాహన కల్పించడం, ప్రతి నెల ఒకటవ తేదీన సామాజిక పింఛన్లను పంపిణీ చేయడం, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పథకాలను అందే విధంగా చూస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విస్తృత సేవలను అందించారన్నారు.

కోవిడ్ కష్టకాలంలో ధైర్యంగా విధులను నిర్వహించి విశేష కృషి చేసి ప్రజారోగ్యం కాపాడారన్నారు.నర్సీపట్నం నియోజకవర్గం, మునిసిపాలిటీ కలిపి మొత్తం 1483 మంది వాలంటీర్లు ఉన్నారని వీరిలో 1165 మంది సేవా మిత్ర, 25 మంది సేవా రత్న, ,5 మంది సేవా వజ్ర అవార్డులకు అర్హులు అయ్యారని తెలిపారు పురస్కారాలు అందుకున్న వాలంటీర్లదరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. వాలంటీర్లకు వందనం విశిష్ట పురస్కారాలు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ఇంటి గడప వద్దకే అందిస్తున్న వాలంటీర్ల పనితీరు ఆధారంగా అవార్డు ఇస్తున్నారనీ, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ కు శ్రీకారం చుట్టారన్నారు. నవశకం సర్వే చేసి అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకంగా రేషన్ డోర్ డెలివరీ ,పింఛన్లు ,రేషన్ కార్డులు,కోవిడ్ సర్వే చేసి ప్రజలను  కను పాపలు గా కాపాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని అవార్డులు ,విశిష్ట పురస్కారాలను అందిస్తున్నారన్నారు.ఇటీవల కాలంలో వాలంటీర్ల పై దౌర్జన్యం జరుగుతున్నాయని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, మంత్రి కి, పోలీసు అధికారులకు శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు. అనంతరం వాలంటీర్లకు విశిష్ట పురస్కారాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు, ఏ ఎస్ పి తూహిన్ సిన్హా ,జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జునసాగర్,మున్సిపల్ చైర్ పర్సన్ గుడిబండ ఆదిలక్ష్మి,వార్డ్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర అధికారులు  హాజరయ్యారు.

పాడేరు పోలీసులకు చిక్కిన 25 పల్సర్ బైకులు

 పాడేరు పోలీసులకు చిక్కిన 25 పల్సర్ బైకులు

  ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

పెన్ పవర్,  విశాఖపట్నం

 జిల్లాలో పల్సర్ బైక్ లను దొంగిలిస్తున్న దొంగలను పాడేరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి  25 పల్సర్ బైకులు స్వాధీనం చేసుకుని దొంగలను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పాడేరు  డి.ఎస్.పి రాజ్ కమల్ అందించిన వివరాల మేరకు  శుక్రవారం పాడేరు ఎస్ఐ శ్రీనివాస రావు  చింతలవీధి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా  పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు. వారిని విచారించగా పల్సర్ బైక్ ల చోరీ వ్యవహారం వెలుగు చూసింది. చింతపల్లి మండలం పెద గొంది గ్రామంలో దాచి ఉంచిన 25 పల్సర్ బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో విశాఖ జిల్లాకు చెందిన 22 పల్సర్ బైకులు తూర్పుగోదావరి కి చెందిన 3 పల్సర్ బైకులు ఉన్నాయి.  విశాఖ పాడేరు పెదబయలు చింతపల్లి రోలుగుంట కసింకోట గోలుగొండ  కోటవురట్ల కు చెందిన బైకులు తూర్పుగోదావరి తుని రాజమండ్రి కోటనందూరు కి చెందిన బైకులు  దొంగిలించ  పడ్డాయి. 

చింతపల్లి కి చెందిన బొమ్మిడి సురేష్ రాజుబాబులు జిల్లాలో  వీలైన చోట్ల పల్సర్ బైక్ లను  మారు తాళాలతో  దొంగిలించి పెద గొంది గ్రామంలో రహస్యంగా దాచి ఉంచి వీలైన సమయం లో ఒడిశాకు  తరలించి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఒడిశాలో పల్సర్ బైకు లకు మంచి గిరాకీ ఉండడంతో సురేష్ రాజుబాబులు పొలం పల్సర్ బైక్ లో చోరీకి మాత్రమే పాల్పడుతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలన్నీ ఒకే కంపెనీకి చెందిన పల్సర్ బైకులు కావడం విశేషం. ఈ కేసును   చేదించిన  పాడేరు  సర్కిల్ ఇన్స్పెక్టర్  పైడం నాయుడు ఎస్ఐ  శ్రీనివాసరావు  సిబ్బంది అప్పలరాజు తదితరులను డి ఎస్ పి  రాజ్ కమల్ అభినందించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...