రాజమండ్రి వేదికగా మిస్టర్ ఆంధ్రా పోటీలు
విశాఖ,పెన్ పవర్ ఈ నెల 28 న రాజమండ్రిలో మిస్టర్ ఆంధ్రా క్లాసిక్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ - 2021 పోటీలు నవ్యాంధ్ర ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డూరి వీరభద్రరావు , ప్రధాన కార్యదర్శి టి.ఎస్. సాల్మన్ రాజు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోటీలలో రాష్ట్రంలో 12 జిల్లాల నుండి 9 గ్రూప్ లు గా మొత్తం 135 మంది బాడీ బిల్డర్లు పాల్గొనడం జరిగింది. అందులో ఒక్కొక్క గ్రూప్ లో ముగ్గురు చొప్పున మొత్తం 27 మంది కి వెయిటేజ్ ప్రకారం విజేతలు గా నిర్ణయించి వారి వారి స్థానాలను కేటాయించడం జరిగింది.
మరల వీరిలో ముగ్గురిని ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ , బెస్ట్ ప్రేజర్ , మరియు మోస్ట్ మస్క్యూలర్ మాన్ గా ఎంపిక చేసి విజేతలుగా ప్రకటించడం జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న బిల్డర్లకు స్టార్ జిమ్ ఆర్గనై జేషన్ వారు వసతి , భోజన సదుపాయాలను కల్పించారు. ఈ పోటీలకు ముక్య అతిధులుగా రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ తానేటి వనిత , రాజమండ్రి ఎం.పి. మార్గాని భరత్ రాం , స్థానిక వై.ఎస్.ఆర్.సి.పి. యువ నాయకులు జక్కంపూడి గణేష్ , మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ , మాజీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ బర్రె కొండ బాబు , మునిసిపల్ కౌన్సిలరు అంగడ సరళ దేవి లు హాజరైనారు. వీరి చేతుల మీదుగా గెలిచిన వారికి బహుమతి ప్రధానం చేశారు. గెలిచిన అభ్యర్థులకు విశాఖ జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రబిల్లి ప్రభాకర రావు , ప్రధాన కార్యదర్శి కె. సుబ్రమణ్యం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
గెలిచిన అభ్యర్థుల వివరాలు 9 గ్రూప్ ల నుండి.......
55 కె.జీ. లు. లోపల
1.సుశాంత్ మినియక. --విజయవాడ - మొదటి స్థానం
2.ఎం.వంశీ నాయుడు – విశాఖ - రెండవ స్థానం
3.ఎస్.సౌమ్య రాజన్. - నెల్లూరు. - మూడవ స్థానం
60 కె.జీ. లు. లోపల
1.ఎం.నూకరాజు. - విశాఖ. - మొదటి స్థానం
2. పి.ప్రసాద్. - విశాఖ. - రెండవ స్థానం
3.డి.వంశీ కృష్ణ. – విజయవాడ - మూడవ స్థానం
65 కె.జీ. లు లోపల
1.జి.గణేష్. - తూ. గో. జిల్లా - మొదటి స్థానం
2.కె.తిరుమల రెడ్డి. - కృష్ణ జిల్లా. - రెండవ స్థానం
3.వై.బాబీ. - తూ. గో.జిల్లా.- మూడవ స్థానం
70 కె.జీ. లు. లోపల
1.ఎస్.నాగేంద్ర. - ప.గో. జిల్లా - మొదటి స్థానం
2.జి.భాస్కర్ రావు- ప.గో.జిల్లా- రెండవ స్థానం
3.జె.కిరణ్ కుమార్ - విశాఖ. - ముడవ స్థానం
75 కె.జీ. లు లోపల
1.కె.వంశీ. - తూ. గో.జిల్లా- మొదటి స్థానం
2.వి.శ్రీరామ్. - ప.గో. జిల్లా. - రెండవ స్థానం
3.ఎ. నరేంద్ర. - విశాఖ. - మూడవ స్థానం
80 కె.జీ. లు. లోపల
1.ఎస్.కె.యూసుఫ్- గుంటూరు- మొదటి స్థానం
2.జి.శ్రీకాంత్. - శ్రీకాకుళం - రెండవ స్థానం
3.జె.ఉమామహేశ్వరావు- శ్రీకాకుళం- మూడవ స్థానం
85 కె.జీ. లు లోపల
1.బి.సూర్య. - విశాఖ - మొదటి స్థానం
2.కె.రామకృష్ణ. - విశాఖ - రెండవ స్థానం
3.ఎం.వెంటేశ్వర్లు. - తూ. గో. జిల్లా- మూడవ స్థానం
90 కె.జీ.లు లోపల
1.ఎం.వెంకటేష్. - విశాఖ - మొదటి స్థానం
2.పి.బాబు ప్రకాష్- శ్రీకాకుళం- రెండవ స్థానం
3.ఎ. డి.వి.ప్రసాద్ విశాఖ. - మూడవ స్థానం
90 కె.జి.లు పైన
1.ఎం.శివ అప్పలరాజు- విశాఖ. - మొదటి స్థానం
2.ఎస్.కె.మునవల్లి. - విశాఖ. - రెండవ స్థానం
3.ఐ. హరీష్. - తూ. గో.జిల్లా- మూడవ స్థానం
ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ :-
ఎస్. నాగేంద్ర....తూర్పు గోదావరి జిల్లా...
బెస్ట్ ప్రేజర్ : -
ఎస్.కె.యూసుఫ్............గుంటూరు
మోస్ట్ మస్క్యూలర్ మాన్
జి.గణేష్........తూర్పు గోదావరి జిల్లా....