Followers

విద్యార్థులకు చదరంగం క్రీడ పై అభిరుచి కలిగేలా చూడాలి

 విద్యార్థులకు చదరంగం క్రీడ పై అభిరుచి కలిగేలా చూడాలి


మందమర్రి,  పెన్ పవర్

కరోనా నేపథ్యంలో మైదానంలో ఆడే ఆటల కన్నా ఇంట్లో ఉండి ఆడుకొన్ని, మేధస్సును పెంపొందించే చదరంగం క్రీడ పై పిల్లలకు అభిరుచి కలిగేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సిరాజ్ ఉర్ రెహమాన్ పేర్కొన్నారు. శనివారం మందమర్రి ప్రెస్ క్లబ్ లో, మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా చదరంగం ఆటకు మంచి గుర్తింపు ఉందని, చెస్ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చునని ఆయన తెలిపారు. చెస్ క్రీడకు రాష్ట్రప్రభుత్వం ఎంతో గుర్తింపు ఇస్తుందని క్రీడాకారులకు సరైన శిక్షణ, వసతులు కల్పించడంతోపాటు క్రీడల్లో రాణించిన వారికి ఉపాధి అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. కారోనా నేపథ్యంలో ఇంటిల్లపాదీ సురక్షితంగా ఇంట్లో కూర్చొని చదరంగం ఆడవచ్చునని, విద్యార్థులకు చదరంగం ఆట పై మక్కువ కలిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. చెస్ క్రీడాకారులకు మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు ఈగ కనకయ్య, మండల మాజీ ఉపాధ్యక్షులు వజీర్ సుల్తాన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ రాజారెడ్డి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కరస్పాండెంట్ దామెరా సిద్దయ్య, అసోసియేషన్ జిల్లా కోశాధికారి ఈ సమ్మిరెడ్డి, స్థానిక టిఆర్ఎస్ నాయకులు జే రవీందర్, బట్టు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...