Followers

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్

 క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్

మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు


లక్షెట్టిపెట్, పెన్ పవర్

క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు.పట్టణంలో ప్రభుత్వ కళశాల మైదానంలో నిర్వహించిన కొక్కిరాల రఘుపతి రావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమనికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గత పది రోజులుగా అట్టహాసంగా సాగిన క్రికెట్ పోటీల్లో తుది పోరు లక్షెట్టిపెట్ మున్సిపాలిటీ 14వ వార్డ్ 5వ వార్డు టీమ్ ల మధ్య జరగగా 14వ వార్డు టీం విజేతగా నిలిచింది 14వ వార్డు విజేత జట్టుకు రూ,75 వేలు రన్నర్ గా నిలిచిన 5వ వార్డు టీంకి నలబై వేలు సెమీఫైనల్ వరకు ప్రతిభతో ఆడిన జట్టుకు ఇరవై వేల రూపాయలను మాజీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అందజేశారు.ఈ సందర్భంగా ప్రేంసాగర్ రావు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యపరంగా క్రీడలు ఆడటం వలన ఉల్లాసం ఉత్సాహం మెరుగుపడుతుందని భవిష్యత్తులో యువత ముందడుగు వేయాలి కోరారు. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి కి యువకులు క్రీడలు అడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ముత్తె సత్తయ్య,ఎంపీపీ అన్నం మంగ కౌన్సిలర్లు చెల్లా నాగభూషణం, చింతల సువర్ణ అశోక్,రందేని వెంకటేష్, అరిఫ్,కాంగ్రెస్ నాయకులు నవాబ్, అయిల్లా విజయ్,పెండం శ్రీలత, ముజ్జు,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...