కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కుల పంపిణీ..
పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట..
విపత్కరపరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదు..
రూ.2.36 కోట్ల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలోని 236 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.2,36,27,376 విలువైన కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను బుధవారం చింతల్ లోని కేఎంజి గార్డెన్స్ లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. పేదలను ఆర్థికంగా అన్ని విధాల ఆదుకోవాలనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ల వంటి ప్రతిష్ఠాత్మక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ అర్హులైన వారికి అందజేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలుకుల జగన్,మంత్రి సత్యనారాయణ, నిజాంపేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, వార్డు సభ్యులు సత్తి రెడ్డి, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment