Followers

పరీక్షల విషయంలో ఎందుకీ మొండి వైఖరి

 పరీక్షల విషయంలో ఎందుకీ మొండి వైఖరి

పెన్ పవర్, రావులపాలెం

దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేనని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి వెంకట సత్యనారాయణరాజు(సతీష్ రాజు) అన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధి అవకాశాలు రావాలంటే సర్టిఫికెట్లలో మార్కులు అవసరం అని, వారు వెనకబడకూడదనే పరీక్షలు నిర్వహిస్తున్నామని జగన్ అంటున్నారని మరి గత ఏడాది  పరీక్షలు లేకుండా పాస్ చేసిన విద్యార్థులకు అన్యాయం జరిగినట్టేనా ఆ విద్యార్థులకు అన్యాయం చేసారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాదనే కరెక్ట్ అనుకుంటే గత ఏడాది విద్యార్థులు ఏం పాపం చేసారన్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పాజిటివ్ కేసులు సాధారణ స్థాయిలో ఉండగా ఆగస్టు నాటికి భారీగా పెరిగాయన్నారు. ఈ ఏడాదితో పోలిస్తే గత ఏడాదే పరీక్షలు పెట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నా కూడా పిల్లల భవిష్యత్తు కోసం పరీక్షలు రద్దు చేసారన్నారు. మరి ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే గత ఏడాది కన్నా రెండింతలు కేసులు అధికంగా నమోదవుతున్న పరిస్థితుల్లో పరీక్షలు ఎలా నిర్వహిస్తారో అర్థం కాని విషయమన్నారు. భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై  సిఎం జగన్ కి ఉన్న ముందు చూపు పరీక్షలు రద్దు చేసిన మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేదా అని ఎద్దేవా చేశారు. పరీక్షలు రద్దు చేయకపోయినా కనీసం వాయిదా వేయాలన్న ఆలోచన కూడా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇంత ఆందోళనకర పరిస్థితుల్లో మే నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చెప్పింది చేస్తే ప్రజల్లో చులకన అవుతామనో, తమ ప్రత్యేకత ఉండదనో రాజకీయంగా ఆలోచిస్తూ మొండిగా పరీక్షలు నిర్వహించి విద్యార్దుల జీవితాలతో చెలగాటం ఆడవద్డని హితవు పలికారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయడం గానీ, కరోనా ఉదృతి తగ్గే వరకూ వాయిదా వేయడం గానీ చేయాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...